ded colleges
-
ప్రైవేటు డీఎడ్ కాలేజీల దందా.. క్లాసులు లేకున్నా పాస్
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయులను తయారు చేసేందుకు ఉద్దేశించిన డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఈడీ) పరిస్థితి దారుణంగా తయారైంది. నాణ్యత ప్రమాణాలు పూర్తిగా అడుగంటాయి. ప్రభుత్వ కాలేజీల్లో బోధకుల్లేరు. ప్రైవేటు కాలేజీలు అసలు తెరుచుకునే పరిస్థితే కన్పించడం లేదు. క్లాసులకు హాజరవ్వకపోయినా ఫర్వాలేదు.. పరీక్షలు రాస్తే చాలు పాస్ గ్యారెంటీ అంటూ ప్రైవేటు డైట్ కాలేజీలు కొత్త భాష్యం చెబుతున్నాయి. ఇదేదో బాగుందని విద్యార్థులు దానికే సిద్ధమవుతున్నారు. ఉన్నతాధికారులు ఈ పరిస్థితిని నియంత్రించడం లేదనే విమర్శలొస్తున్నాయి. ఫలితంగా డీఈడీ పూర్తి చేసినా... అభ్యర్థులు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో కనీసం సగం మంది కూడా అర్హత సాధించలేకపోతున్నారు. పడిపోతున్న డీఎడ్ ఉపాధ్యాయ వృత్తిపై ఆసక్తి ఉన్న వారు ఇంటర్ తర్వాత డీఈడీ, డిగ్రీ తర్వాత బీఈడీలో చేరుతారు. డీఈడీలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్ఈడీ), డిప్లొమా ఇన్ ప్రీసూ్కల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) విభాగాలుంటాయి. ఇందులో ఉత్తీర్ణులైన వారు ప్రాథమిక పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ)లుగా పనిచేసే అవకాశం ఉంటుంది. అయితే, కీలకమైన డీఎడ్ స్థాయిలోనే బ్రేకులు పడుతున్నాయని నిపుణులు అంటున్నారు. 86 మందికి కేవలం 21 మందే ఉన్నారు రాష్ట్రవ్యాప్తంగా 10 డీఎడ్ కాలేజీలుంటే, 286 మంది బోధకులు ఉండాలి. కానీ మన రాష్ట్రంలో ఉన్న బోధకుల సంఖ్య కేవలం 21 మాత్రమే. 265 ఖాళీలున్నా, వాటిని భర్తీ చేయడం లేదు. రిటైర్ అయిన ప్రభుత్వ ప్రిన్సిపాల్స్‌ను మాత్రమే తీసుకోమని ప్రభుత్వం చెబుతోంది. కానీ వాళ్ళు ఎక్కడా లభించడం లేదని అధికారులు అంటున్నారు. డీఎడ్‌లో కీలకమైన బోధన విధానం, విద్యార్థుల సైకాలజీ, పాలనాపరమైన ప్రక్రియలు, మాతృభాషలో బోధించే తీరు, విలువలు, కళలు, కంప్యూటర్, ఫిజికల్ ఎడ్యుకేషన్‌పై బోధన కాలేజీల్లో ఏమాత్రం జరగడం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. క్లాసులు లేకున్నా... రాష్ట్రంలో 2015లో 212 డైట్ కాలేజీలుంటే... ఇప్పుడివి 59కి పడిపోయాయి. ఇందులో ప్రభుత్వ కాలేజీలు పది. 6,888 సీట్ల నుంచి 4600 సీట్లకు తగ్గిపోయాయి. ప్రభుత్వ కాలేజీల్లో టీచర్ల కొరత ఉంటే, ప్రైవేటు కాలేజీల్లో ఫ్యాకల్టీ నియామకమే జరగడం లేదని తెలుస్తోంది. రికార్డుల్లో అధ్యాపకులు ఉన్నట్టు చూపిస్తున్నా, క్షేత్రస్థాయిలో వాళ్ళు కని్పంచడం లేదనే ఆరోపణలున్నాయి. ఏటా ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీఎంబర్స్ రూ.12,500 కూడా సకాలంలో రావడం లేదని కాలేజీలు అంటున్నాయి. విద్యార్థులు కాలేజీకి రాకున్నా రూ. 25 వేలు ఇస్తే పరీక్షలకు హాజరవ్వొచ్చని, సరి్టఫికెట్ పొందొచ్చని యాజమాన్యాలు చెబుతున్నా యి. మంచి టీచర్లు ఎలా వస్తారు : శ్రీరాం ముండయ్య (ప్రభుత్వ డైట్ కాలేజీ లెక్చరర్, కరీంనగర్) డీఎడ్ కాలేజీల్లో అధ్యాపకుల కొరత కారణంగా ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చే వారికి సరైన ప్రమాణాలు లేకపోతే మంచి విద్య అందించడం సాధ్యం కాదు. -
మరణశయ్యపై ఉన్నా.. మొర ఆలకించండి
సాక్షి, అమరావతి: డీఈడీ కాలేజీల్లో ప్రవేశాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడం లేదంటూ యాజమాన్యాలు దాఖలు చేసిన అప్పీళ్లపై తదుపరి విచారణను హైకోర్టు అక్టోబర్ 16వ తేదీకి వాయిదా వేసింది. కాలేజీల తరఫు న్యాయవాదులు గడువు కోరడంతో విచారణను వాయిదా వేస్తూ న్యాయమూర్తులు జస్టిస్ రాకేష్‌కుమార్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులిచ్చింది. ఈ సందర్భంగా ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కరోనాతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి చేతికి సెలైన్, ఆక్సీమీటర్ తదితరాలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలో పాల్గొనడంతో అంతా షాక్‌కు గురయ్యారు. ► కరోనాతో మరణశయ్యపై ఉన్నానని, బహుశా ఈ కేసే తాను వాదనలు వినిపించే చివరి కేసు కావచ్చని, తన మొర ఆలకించాలంటూ ధర్మాసనాన్ని సుధాకర్‌రెడ్డి అభ్యర్థించారు. మీ ధర్మాసనం ముందే తాను వాదనలు వినిపించాలనుకుంటున్నానని, బహుశా తనకు మరోసారి అలాంటి అవకాశం వస్తుందో రాదో తెలియదన్నారు. అందువల్ల తన పట్ల దయ చూపాలని వేడుకున్నారు. ► పొన్నవోలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కరోనా తగ్గుముఖంపడుతోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కరోనా నుంచి కోలుకుంటారని, ఆయన తిరిగి తమ ముందు వాదనలు వినిపిస్తారని ధైర్యం చెప్పింది. పొన్నవోలు ధర్మాసనానికి కృతజ్ఞతలు తెలియచేస్తూ అది నిజం కావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. -
భవితతో చెలగాటం.. ‘డీఈడీ’ బాగోతం
గత ప్రభుత్వం విద్యను అక్రమాల పుట్టగా మార్చేసింది. ఉపాధ్యాయ నియామకాల డీఎస్సీనే కాదు, ఉపాధ్యాయ విద్య (డీఈడీ)ని సైతం గందరగోళం చేసింది. ఉపాధ్యాయ నియామకాల డీఎస్సీని వివాదాలమయం చేసింది. ఈ క్రమంలోనే ఉపాధ్యాయ విద్యను కూడా వ్యాపారమయం చేసింది. జిల్లాలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈడీ) కళాశాలలు డీసెట్–2018 మార్గదర్శకాలకు సంబంధం లేకుండానే ప్రవేశాలు కల్పించి ఇప్పుడు ఏకంగా 1800 మంది విద్యార్థుల భవితవ్యాన్ని ఆందోళనలోకి నెట్టారు. మొత్తం మీద ఈ సెప్టెంబర్ 28 నుంచి డీఈడీ అభ్యర్థులకు నిర్వహించనున్న పరీక్షలకు అవకాశం లేకుండా చేశారు. సాక్షి, ఒంగోలు మెట్రో: ఉపాధ్యాయ నియామకాలు డీఎస్సీ ద్వారా జరుగుతుండటంతో డీఈడీ కోర్సుకు డిమాండ్ పెరిగింది. దీంతో రాష్ట్రంలో ఏ జిల్లాలో లేనివిధంగా ప్రకాశంలో 139 ప్రవేటు డైట్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. వీటిల్లో కొన్ని కాలేజీల యాజమాన్యాలు లిక్కర్ కాంట్రాక్టర్లు కావటం గమనార్హం. డీఈడీ రెండేళ్ల టీచర్ ట్రెయినింగ్ కోర్సులో చేరాలంటే ముందుగా డీసెట్ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించాలి. ఈ ఉత్తీర్ణత ద్వారా డీఈడీ కాలేజీలో ప్రవేశం కల్పిస్తారు. కానీ, గత ప్రభుత్వం డీసెట్ రాయకుండానే ప్రవేశాలు కల్పించుకోవచ్చనే అడ్డగోలు అనుమతులు ఇచ్చింది. దీంతో జిల్లాలోని పలు కాలేజీల యాజమాన్యాలు డీసెట్ రాయకుండానే డీఈడీ ప్రవేశాలను వ్యాపారమయం చేసేశాయి. ఒక్కో సీటుకు 50 వేల నుంచి లక్ష వరకూ వసూలు చేస్తూ సీట్లను విక్రయించారు. ఇలా డీసెట్ నిబంధనలు తుంగలో తొక్కి ప్రవేశాలు కల్పించిన విషయాన్ని గుర్తించిన విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు జిల్లాలోని డైట్ కళాశాలల అక్రమ ప్రవేశాల మీద నివేదిక ఇవ్వాల్సిందిగా డైట్ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావును ఆదేశించారు. డీసెట్‌తో పని లేకుండానే సీట్ల భర్తీ.. జిల్లాలో మొత్తం 140 ప్రవేటు డీఈడీ కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో మైనంపాడు డైట్ కళాశాల ఒక్కటే ప్రభుత్వ కళాశాల. మిగిలిన 139 కళాశాలలు ప్రవేటువే కాగా, ఉపాధ్యాయ విద్య పెద్ద ఎత్తున బిజినెస్‌గా మార్చటంలో జిల్లాలోని పలు యాజమాన్యాలు కాకలు తీరాయి. 2015లో విడుదల చేసిన జీవో నంబర్ 30 ప్రకారం డీసెట్ పరీక్ష ద్వారానే ఆయా కళాశాలల్లో ప్రవేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. డీసెట్ కన్వీనర్ కోటా ద్వారా 80 శాతం 20 శాతం మేనేజ్మెంట్ కోటా ద్వారా సీట్లు భర్తీ చేయాల్సి ఉంటుంది. కానీ, డీసెట్‌తో సంబంధం లేకుండానే ఏకంగా అన్ని సీట్లూ మేనేజ్మెంట్ కోటాలో భర్తీ చేసుకుని సొమ్ము చేసుకోవటం, ఆనక విద్యార్థులతో కేసులు వేయించి అనుమతులు తెచ్చుకోవటం పరిపాటిగా మారిపోయింది. ఈ విధంగా 2017 విద్యా సంవత్సరంలో జరిగింది కనుక 2018 విద్యా సంవత్సరంలతో కూడా డీసెట్ అర్హత లేకుండానే యాజమాన్యాలు ఇదేవిధంగా ప్రవేశాలు కల్పించారు. ఇలా ఒంగోలు, దర్శి, గిద్దలూరు, మార్కాపురం ప్రాంతాల్లోని డీఈడీ కాలేజీల్లో 200 మంది చొప్పున విద్యార్థులు ఉన్నారు. మిగిలిన కళాశాలల్లో 50 మంది వరకు ఉన్నారు. ఇలా అన్ని కాలేజీల నుంచి డీసెట్‌తో సంబంధం లేకుండా మొత్తం 1800 మంది వరకు విద్యార్థులు డీసెట్‌తో సంబంధం లేకుండా ప్రవేశాలు కల్పించారు. వీరి ద్వారా యాజమాన్యాలు కోర్టులో కేసు వేయించాయి. దీంతో విద్యాశాఖ స్పందించి విచారణకు ఆదేశించింది. వారంలోపు నివేదిక పంపిస్తాం.. నిబంధనలు పాటించకుండా ప్రవేశాలు కల్పించిన కాలేజీల వివరాలు సేకరిస్తున్నాం. ఏయే కాలేజీల్లో ఎన్నెన్ని సీట్లు భర్తీ చేశారో తెలుసుకుని సంపూర్ణ నివేదికను పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు అందజేస్తాం. – వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్, మైనంపాడు డైట్ కళాశాల -
డీఎడ్ కోర్సుకు కొత్తరూపు..!
సాక్షి, బద్వేలు : ఒకప్పుడు డిప్లొమో ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్) అంటే యమాక్రేజ్. ఉపాధ్యాయ పోస్టుల విడుదల ఏటా భర్తీ చేయడం.. ఇంటర్, డీఎడ్ పూర్తి చేసి ఇరవై ఏళ్ల లోపే ఉద్యోగం డీఎడ్తోనే సాధ్యం. దీంతో ఇంటర్ పూర్తయిన విద్యార్థులు చాలామంది డీఎడ్ ప్రవేశ పరీక్ష రాయడం, కోర్సులో చేరడం జోరుగా ఉండేది. గత కొన్నేళ్లుగా డీఎడ్‌కు డిమాండ్ తగ్గింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం డీఎడ్ కోర్సుపై దృష్టి సారించింది. ఈ కళాశాలల్లో జరిగే అవినీతి, అక్రమాలు చెక్ పెట్టేందుకు పలు రకాల చర్యలు చేపడుతోంది. ప్రయివేట్ డీఎడ్ కళాశాలలు అన్నింటిలో బయోమెట్రిక్ విధానం అమలుకు సన్నాహాలు చేస్తోంది. డీఎడ్ కళాశాలల్లో అర్హత కలిగిన ఫ్యాకల్టీలు, కనీస సదుపాయాలు కల్పన లేక పోవడంతో విద్యలో చేరే వారి సంఖ్య ఏటేటా తగ్గుతోంది. గత ప్రభుత్వం కళాశాల ఏర్పాటుకు అనుమతులు కూడా ఇష్టారాజ్యంగా ఇచ్చింది. దీనికి తోడు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఈ విద్యకు ఆదరణ తగ్గి డీఎడ్ కోర్సులో చేరేవారి సంఖ్య తగ్గుముఖం పట్టింది. సీట్లు భర్తీ కాకపోవడంతో కొన్ని కళాశాలల యాజమాన్యాలు అర్హత లేకున్నా సర్టిఫికెట్ ఉన్నవారిని అధ్యాపకులుగా నియమించుకుని తక్కువ వేతనాలతో బోధన చేయిస్తున్నారు. ఇక మూడొంతుల సీట్లు ఖాళీగా ఉన్నవారు తరగతులు నిర్వహణ పట్ల పూర్తిగా అలసత్వం వహిస్తున్నారు. ఫలితంగా ఉపాధ్యాయ విద్య బోధనలో నాణ్యత, నైపుణ్య ప్రమాణాలు దెబ్బ తింటున్నాయి. అయితే డీఎడ్ కోర్సుకు ఇతర రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉండటంతో ఇతర రాష్ట్రాలకు చెందిన వారితో కొంతమేర సీట్లు భర్తీ చేస్తున్నాయి. కేవలం పరీక్షలకు మాత్రమే హాజరయ్యేలా ఒప్పందం చేసుకుని భారీగా పీజులు వసూలు చేస్తున్నాయి. విద్యకు ప్రాధాన్యత ఇస్తున్న కొత్త ప్రభుత్వం డీఎడ్ కళాశాలల్లో అక్రమాలకు చెక్ పెట్టాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది ఇకపై తప్పనిసరిగా కళాశాలకు హాజరుకావాల్సిందే. బయోమెట్రిక్ వేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో రాయచోటిలో ప్రభుత్వ డైట్ కళాశాలతో పాటు 90కి పైగా కళాశాలలు ఉన్నాయి. వీటిలో దాదాపు పదివేల మంది విద్యార్థులు ప్రవేశాలు పొందవచ్చు. కానీ గతేడాది 2వేల మంది విద్యార్థులు మాత్రమే డీఎడ్ కోర్సులో చేరారు. అధిక శాతం కళాశాలల్లో 50 సీట్లకుగాను 20 సీట్ల లోపు మాత్రమే భర్తీ అయ్యాయంటే విద్యార్థుల ఆసక్తి కనిపిస్తోంది. సగటున ఒక్కో కళాశాలలో 20 వరకు సీట్లు భర్తీ అయ్యాయంటే డీఎడ్ కళాశాల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అక్రమాలకు అడ్డుకట్ట.. డీఎడ్ కళాశాలల్లో అక్రమ అడ్మిషన్లకు అడ్డు లేకుండా పోయింది. డీఎడ్ ప్రవేశాలకు జరిగే కౌన్సిలింగ్లో కన్వీనరు కోటాలో సీట్లు భర్తీ కాకపోయినా మేనేజ్మెంట్ కోటా మాత్రం భర్తీ అవుతున్నాయి. మేనేజ్మెంట్ కోటాలో చేరే వారిలో అధికశాతం డీఎడ్ ప్రవేశపరీక్ష రాయనివారే ఉంటున్నారు. కొన్ని కళాశాలల యాజమాన్యాలు ఇతర రాష్ట్రాలకు చెందిన వారి నుంచి వసూలు చేసిన ఫీజులో కొంత మొత్తాన్ని ప్రభుత్వ పెద్దలకు ముట్టజెప్పి పరీక్షల ముందు వరకు సీట్లు భర్తీ చేసుకునేందుకు అనుమతులు పొందుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఉపాధ్యాయ కోర్సు నాణ్యతా ప్రమాణాలు దెబ్బ తింటున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇక సెమిస్టర్ విధానంలో పరీక్షలు... అక్రమాలను అడ్డుకుని ప్రతి ఒక్కరితో పరీక్షలు రాయించేందుకు ఈ విద్యా సంవత్సరం నుంచి సెమెస్టర్ విధానాన్ని అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్సీఈఆర్టీ (రాష్ట్ర విద్య పరిశోధన సంస్థ) నిబంధనల మేరకు ఈ ఏడాది నుంచే డీఎడ్‌లో సెమెస్టర్ విధానాన్ని అమలు చేసేందుకు నిర్ణయించుకుంది. ఇటీవల విజయవాడలో ప్రభుత్వ డైట్ కళాశాలల ప్రిన్సిపాల్లతో సమీక్ష నిర్వహించి పలు అంశాలపై చర్చించి వారి అభిప్రాయాలను సైతం సేకరించింది. తదుపరి ప్రయివేట్ కళాశాల యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేసి ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. 2019–20 విద్యా సంవత్సరం నుంచి డీఎడ్‌లో సెమిస్టర్ విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వ పరీక్షల నియంత్రణ మండలికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని స్పష్టం చేసింది. సెమిస్టర్ విధానంలో జరగనున్న థియరీ, ప్రాక్టికల్స్ నిర్వహణకు ఎన్సీఈఆర్టీ సిలబస్‌ను నిర్ణయించనుంది. ఉత్తమ నిర్ణయం.. పరీక్ష విధానంలో మార్పులు తీసుకువస్తే విద్యార్థుల్లో ఒత్తిడి ఉండదు. దీంతో పాటు రికార్డులు, రిజిస్ట్రర్లు కూడా సక్రమంగా చేస్తారు. గుణాత్మక విలువలు పెరుగుతాయి. పాఠశాలలో బోధనలో నాణ్యత కూడా పెరిగే అవకాశముంటుంది. డిగ్రీ కళాశాలల్లో కూడా సెమిస్టర్ విధానం ఇప్పటికే అమలు చేశారు. కొన్ని కారణాలతో రెండేళ్ల డీఎడ్ కోర్సు పూర్తి చేసే సరికి మూడేళ్లు పడుతోంది. సెమిస్టర్ విధానం అమలైతే కచ్చితంగా రెండేళ్లలో కోర్సు పూర్తి అవుతుంది. తదుపరి కోర్సు చేసేందుకు వారికి అవకాశం కూడా ఉంటుంది. – చంద్రయ్య, ప్రిన్సిపాల్, డైట్ కళాశాల, రాయచోటి నాణ్యత పెరుగుతుంది.. సెమిస్టర్ విధానంలో విద్యలో నాణ్యత పెరుగుతుంది. తద్వారా తదుపరి వారు ఉపాధ్యాయులైన తరువాత ఉత్తమ పద్ధతుల్లో బోధించగలరు. ప్రభుత్వం నాణ్యత పెరిగే విధంగా, అక్రమాలకు చెక్ పెట్టే చర్యలు చేపట్టడం మంచి విషయం. డీఎడ్ కళాశాలలు నాణ్యంగా ఉన్నప్పుడే పాఠశాలలు నాణ్యంగా ఉంటాయి. – కత్తి నరసింహారెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అక్రమాలకు అడ్డు వేయాల్సిందే.. డీఎడ్ కళాశాలల్లో జరిగే అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిందే. చాలా కళాశాలల్లో విద్యార్థులు సరిగా హాజరు కాకున్నా ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బయోమెట్రిక్ హాజరు అమలైతే వీటికి అడ్డుకట్ట పడుతుంది. – మనోహార్‌రెడ్డి, ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి -
హోరాహోరీగా డీఎడ్ కళాశాలల క్రీడా పోటీలు
– కబడ్డీ, టెన్నికాయిట్ టైటిల్స్ సాధించిన డైట్ కళాశాల కర్నూలు (టౌన్): జిల్లా స్థాయి డీఎడ్ కళాశాలల క్రీడా పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో రెండోరోజు గురువారం కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, బాల్ బ్యాడ్మింటన్, టెన్నికాయిట్ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. డైట్ కళాశాల ప్రిన్సిపాల్ వై. రాఘవరెడ్డి క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారుల మధ్య స్నేహసంబంధాలు బలపడతాయని చెప్పారు. క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని చెప్పారు. ప్రతి క్రీడాకారుడు ఆటలో క్రీడా సూ్ఫర్తి ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు శ్రీనాథ్, నిర్వాహక కార్యదర్శి లక్ష్మీనరసయ్య, పీఈటీలు కిశోర్, శేషిరెడ్డి, కృష్ణ, ఎస్ఎండీ బాషా, శారద తదితరులు పాల్గొన్నారు. ఫైనల్లో విజేత జట్లు బాల్‌బ్యాడ్మింటన్ ఫైనల్మ్యాచ్లో ఠాగూర్ డైట్ కళాశాల (కోడుమూరు) సాయి సిద్ధార్థ డీఎడ్ కళాశాల (డోన్)పై, మహిళల టెన్నికాయిట్‌లో ప్రభుత్వ డైట్ కళాశాల (కర్నూలు), కేవీ సుబ్బారెడ్డి బీఎడ్ కళాశాలపై విజయం సాధించాయి. మహిళల కబడ్డీ తుదిపోరులో ప్రభుత్వ డైట్ కళాశాల (కర్నూలు),జీఎం డీఎడ్ కళాశాల (నంద్యాల)పై 19–10 పాయింట్ల తేడాతో, మహిళల ఖోఖో సాయిశ్రీ డీఎడ్ కళాశాల జట్టు (డోన్) నాగ సత్యనారాయణ డీఎడ్ కళాశాల (నందికొట్కూరు)పై 8–0 పాయింట్ల తేడాతో, బాలుర ఖోఖో విభాగంలో సాయిశ్రీ డీఎడ్ కళాశాల (డోన్), ఠాగూర్ డీఎడ్ కళాశాల (డోన్)పై 5–4 గోల్స్ తేడాతో గెలుపొందాయి. వాలీబాల్ పురుషుల విభాగంలో కేవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ డైట్ కళాశాల జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. -
డైట్‌సెట్ ఎప్పుడు?
రెండు నెలలుగా ఫైలును పెండింగ్‌లో పెట్టిన సర్కారు సాక్షి, హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్(డీఎడ్) కోర్సుల్లో 2015-16 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు చేపట్టేందుకు నిర్వహించే డైట్‌సెట్ నోటిఫికేషన్ ఇంతవరకు జారీ కాలేదు. రాష్ట్రంలోని 258 ప్రైవేటు డీఎడ్ కాలేజీలు, 10 ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ(డైట్) సంస్థల్లో ప్రవేశాల కోసం లక్షన్నర మంది విద్యార్థులు నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఇందుకోసం విద్యా శాఖ పంపించిన ఫైలును ప్రభుత్వం పక్కనపెట్టింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో డీఎడ్ ప్రవేశాల కోసం తెలంగాణ డైట్‌సెట్-2015 నిర్వహణకు అనుమతించాలని, డైట్‌సెట్ కన్వీనర్ నియామకానికి ఆమోదం తెలియజేయాలని విద్యా శాఖ నుంచి రెండు నెలల కిందటే సర్కారుకు ఫైలు అందినా.. ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఈసారి డైట్‌సెట్‌ను నిర్వహిస్తారా.. లేదా అన్న అనుమానాలు విద్యార్థుల్లో నెలకొన్నాయి. అంతేకాదు ఈ ఏడాది ప్రవేశాలే చేపట్టకుండా జీరో ఇయర్‌గా కొనసాగించాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్లు విద్యార్థి సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో డైట్‌సెట్ నిర్వహణపై ఏదో ఒకటి త్వరగా తేల్చాలని విద్యార్థులు కోరుతున్నారు. డైట్‌సెట్ కోసం ఎదురుచూస్తూ మరే కోర్సుల్లో చేరక.. విద్యా సంవత్సరాన్ని నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఉపాధ్యాయ విద్యపై నిఘా
నాణ్యత మెరుగుకు ప్రాథమిక విద్యా శాఖ చర్యలు డీఎడ్ కాలేజీల్లో వెబ్ ఆధారిత పర్యవేక్షణ, తనిఖీలు నిబంధనలు పాటించని కాలేజీలపై చర్యలు ‘సాక్షి’తో ఆ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం సాక్షి, హైదరాబాద్: విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించాల్సిన ఉపాధ్యాయుల్లో నాణ్యత తగ్గుతోంది. తూతూ మంత్రం చదువులతో టీచర్ పట్టాతో స్కూళ్లలోకి అడుగుపెడుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంలో పడేస్తున్నారు! ఉపాధ్యాయ శిక్షణా కళాశాలల్లో నాణ్యత లోపించ డం, నిబంధనలు పాటించకపోవడాన్ని ప్రాథమిక విద్యాశాఖ గుర్తించింది. ముఖ్యంగా డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్) ప్రైవేటు కాలేజీల్లో తరగతులు జరక్కపోయినా ఉపాధ్యాయ శిక్షణ కోర్సు పూర్తి చేస్తున్నారు. ప్రాక్టికల్ తరగతులు నిర్వహించకపోయినా బాగా బోధిస్తారంటూ కాలేజీలు సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నాయి. దీంతో ముందు ఇక్కడి నుంచి సంస్కరించడం ప్రారంభించాలని ప్రాథమిక విద్యాశాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో డీఎడ్ ప్రైవేటు కాలేజీల్లో పక్కా బోధన అందించేందుకు ప్రత్యేక నిఘావంటి పకడ్బందీ చర్యలకు సిద్ధమైంది. అందులో భాగంగా వెబ్ ఆధారిత పర్యవేక్షణ చేపట్టనున్నామని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య ‘సాక్షి’తో చెప్పారు. అలాగే, జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్‌గా రెవెన్యూ, విద్యాశాఖ అధికారులతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించనున్నామని తెలిపారు. రాష్ట్రంలో ప్రైవేటు డీఎడ్ కాలేజీలు ఇప్పటికే 600 వరకు ఉన్నందున కొత్త కాలేజీలకు అనుమతి ఇవ్వొద్దని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలికి (ఎన్సీటీఈ) రాశామని చెప్పారు. డీఎడ్ కాలేజీల్లో పర్యవేక్షణ ఇలా.. ప్రత్యేక వెబ్సైట్లో విద్యార్థులు, అధ్యాపకుల ఫొటోలతో వివరాలు రోజువారీ హాజరు వివరాలను ప్రతినెలా ఆ సైట్లో అప్లోడ్ చేయాలి. పాఠ్యాంశాల వివరాలను కూడా పొందుపరచాలి. అధిక ఫీజులు డిమాండ్ చేస్తే విద్యార్థులు ఫిర్యాదు చేయవచ్చు. జిల్లా కలెక్టర్, విద్యా శాఖ అధికారులు వీటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటారు. కలెక్టర్ చైర్మన్‌గా ఉండే కమిటీలు ప్రతి నెలా కాలేజీలను తనిఖీలు చేస్తాయి. సంబంధిత కాలేజీ అనుబంధ స్కూళ్లలో ప్రాక్టికల్స్ జరిగాయా? లేదా? పరిశీలిస్తాయి. టీచర్ల హాజరు, పాఠ్యాంశాల బోధనపై రాష్ట్ర స్థాయి అధికారులకు నివేదికలిస్తాయి. ఈ చర్యల ద్వారా పాఠశాల విద్య నాణ్యత మెరుగుపడుతుందని ఆశిస్తున్నట్లు పూనం మాలకొండయ్య తెలిపారు. ఏప్రిల్‌లోనే ‘టెన్త్’ పాఠ్యపుస్తకాల పంపిణీ పదో తరగతి విద్యార్థులకు పాఠశాలలు ముగిసేలోపే పాఠ్యపుస్తకాలు అందనున్నాయి. ఇప్పటికే ఉచిత పాఠ్యపుస్తకాల ముద్రణ ప్రారంభమైందని, పాఠశాలలకు చివరి పని దినమైన ఏప్రిల్ 23కే పదో తరగతికి వెళ్లే 12 లక్షల మంది విద్యార్థులకు కొత్త పుస్తకాలు అందిస్తామని పూనం మాలకొండయ్య చెప్పారు. సెలవుల్లో ముందుగానే చదువుకునే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టామన్నారు. ఇతర తరగతులకు చెందిన 64 లక్షల మందికి జూన్ 12న స్కూళ్లు తెరిచే రోజున ఉచిత పుస్తకాలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. -
డీఈడీ కిలాడీ కాలేజీలు!
మౌలిక సదుపాయాల్లేవు.. బోధన సిబ్బంది లేరు స్కూళ్లు, కాలేజీల్లోనే కోర్సు నిర్వహణ అదే సిబ్బందితో డీఈడీ విద్యా బోధన నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలు ఫీజు రీయింబర్స్మెంట్ రాదంటూ వసూళ్లు సాక్షి, హైదరాబాద్: టీచర్ పోస్టులపై ఆశతో డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్(డీఎడ్)లో చేరుతున్న వారిని ప్రైవేట్ కాలేజీలు నిలువు దోపిడీ చేస్తున్నాయి! యాజమాన్య కోటా సీటును లక్షన్నర వరకు అమ్ముకుంటున్న యాజమాన్యాలు కాలేజీల నిర్వహణలోనూ అడ్డదారులు తొక్కుతున్నాయి. మౌలిక సదుపాయాలు, సిబ్బంది లేకుండానే కాలేజీలను నిర్వహిస్తున్నాయి. సిబ్బంది ఉండరు.. విద్యార్థులు రారు! రాష్ట్రంలోని 50 శాతం డీఎడ్ కాలేజీల్లో ల్యాబ్ సదుపాయాలు లేవు. పక్కా భవనాలు లేవు. రేకుల షెడ్లు, స్కూళ్లు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్, బీఎడ్ కాలేజీల్లోని రెండు గదుల్లో రెండేళ్ల డీఎడ్ కోర్సును నెట్టుకొస్తున్నాయి. మెరుగైన విద్యా బోధన, నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలిచ్చాయి. కొన్ని కాలేజీల్లోనైతే అసలు బోధనా సిబ్బందే కనిపించడం లేదని.. మరికొన్ని కాలేజీల్లోనైతే విద్యార్థులు కూడా లేరని విద్యాశాఖ తనిఖీల్లోనే వెల్లడైంది. డీఎడ్ కాలేజీల అక్రమాలపై విద్యాశాఖకు ఫిర్యాదులు వెల్లువలా వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 650 వరకున్న ప్రైవేటు డీఎడ్ కాలేజీల్లో దాదాపు 100కు పైగా కాలేజీలపై ఫిర్యాదులు అందాయి. అక్రమ మార్గంలో నిర్వహిస్తున్న కాలేజీలు దాదాపు 250కి పైగా ఉన్నట్లు విద్యాశాఖ ఉన్నతాధికారులు అంచనా వేశారు. కన్వీనర్ కోటాలో సీటు వచ్చినా.. కన్వీనర్ కోటాలో డీఎడ్ సీటు వచ్చినా విద్యార్థులను చేర్చుకునేందుకు యాజమాన్యాలు డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. చిత్తూరు, ప్రకాశం, కర్నూలు, నల్లగొండ జిల్లాల్లోని కొన్ని కాలేజీల యాజమాన్యాలు ఒరిజినల్ సర్టిఫికెట్లు లేవని, ఫీజు రీయింబర్స్మెంట్ రాదంటూ విద్యార్థులను బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. మరికొన్ని కాలేజీలైతే మీరు రావాల్సిన పని లేదని హాజరు మినహాయింపు ఇతర ఖర్చుల పేరుతో ఒక్కో విద్యార్థి నుంచి కనీసం రూ. 10 వేలు వసూలు చేసినట్లు సమాచారం. ముడుపుల మాయ! ఓ కాలేజీకి రెన్యువల్ అవకాశం ఇవ్వాలంటే రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి(ఎస్సీఈఆర్టీ) నేతృత్వంలో ఆర్జేడీ, డీఈఓ, డైట్ ప్రిన్సిపాల్ నేతృత్వంలో తనిఖీలు జరపాలి. కానీ వాస్తవాలను పట్టించుకోకుండా సర్టిఫై చేస్తున్నట్లు విమర్శలున్నాయి. ఏటా తనిఖీల తతంగంలో భారీ మొత్తంలో ముడుపులు ముడుతున్నట్లు ఆరోపణలున్నాయి. కాలేజీల అక్రమాలకు మరికొన్ని ఉదాహరణలు.. గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఒకే క్యాంపస్‌లో ఏడు కాలేజీలున్నాయి. అన్నింటికీ ఒకటే అడ్రస్. బీఎడ్, బీఫార్మసీ, ఎం.ఫార్మసీ, ఫార్మా-డీ, డీఎంఎల్టీ, ఐటీఐతోపాటు డీఎడ్‌ను నిర్వహిస్తున్నారు. ప్రకాశం, చిత్తూరు, కర్నూలు జిల్లాలోనూ ఇదే పరిస్థితి. కొన్నిచోట్ల స్కూళ్లలో, మరికొన్ని చోట్ల కాలేజీల్లో, ఇంకొన్ని చోట్ల ఇంజనీరింగ్ కళాశాలల్లో డీఎడ్ కాలేజీలు ఉన్నాయి. ఆ క్యాంపస్‌లోని అన్ని కాలేజీలకు సిబ్బంది అంతా ఒకరే. కాలేజీలకు అనుమతులు, రెన్యువల్స్ దరఖాస్తు చేసుకున్నపుడు సిబ్బంది పేర్లు కాగితాలపై చూపిస్తున్నారు. తనిఖీలు చేస్తే సిబ్బంది ఒకరిద్దరే ఉంటున్నారు. నిబంధనల ప్రకారం ప్రిన్సిపాల్‌తో కలిపి 8 మంది బోధనా సిబ్బంది ఉండాలి. సొంత వెబ్సైట్ ఉండాలి. కళాశాల భవనం, సిబ్బంది, విద్యార్థుల వివరాలను చూపాలి. 70 శాతం కాలేజీలకు వెబ్‌సైటే లేదు. కొన్ని కాలేజీలు స్థలాలు, భవనాలకు సంబంధించి ఫోర్జరీ డాక్యుమెంట్లు అందజేసిన ట్లు సమాచారం. కొన్ని చోట్ల కాలేజీలే లేవు. వాటిని ఎక్కడ నిర్వహిస్తున్నారో అంతుబట్టదు. స్కూళ్లు, కాలేజీల్లో నిర్వహిస్తున్న డీఎడ్ కోర్సుకు ఆయా కాలేజీల్లోని సిబ్బందినే బోధకులుగా చూపుతున్నారు.