హోరాహోరీగా డీఎడ్ కళాశాలల క్రీడా పోటీలు
హోరాహోరీగా డీఎడ్ కళాశాలల క్రీడా పోటీలు
Published Thu, Jan 5 2017 10:40 PM | Last Updated on Tue, Sep 5 2017 12:30 AM
– కబడ్డీ, టెన్నికాయిట్ టైటిల్స్ సాధించిన డైట్ కళాశాల
కర్నూలు (టౌన్): జిల్లా స్థాయి డీఎడ్ కళాశాలల క్రీడా పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో రెండోరోజు గురువారం కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, బాల్ బ్యాడ్మింటన్, టెన్నికాయిట్ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. డైట్ కళాశాల ప్రిన్సిపాల్ వై. రాఘవరెడ్డి క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారుల మధ్య స్నేహసంబంధాలు బలపడతాయని చెప్పారు. క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని చెప్పారు. ప్రతి క్రీడాకారుడు ఆటలో క్రీడా సూ్ఫర్తి ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు శ్రీనాథ్, నిర్వాహక కార్యదర్శి లక్ష్మీనరసయ్య, పీఈటీలు కిశోర్, శేషిరెడ్డి, కృష్ణ, ఎస్‌ఎండీ బాషా, శారద తదితరులు పాల్గొన్నారు.
ఫైనల్‌లో విజేత జట్లు
బాల్‌బ్యాడ్మింటన్ ఫైనల్‌మ్యాచ్‌లో ఠాగూర్ డైట్ కళాశాల (కోడుమూరు) సాయి సిద్ధార్థ డీఎడ్ కళాశాల (డోన్)పై, మహిళల టెన్నికాయిట్‌లో ప్రభుత్వ డైట్ కళాశాల (కర్నూలు), కేవీ సుబ్బారెడ్డి బీఎడ్ కళాశాలపై విజయం సాధించాయి. మహిళల కబడ్డీ తుదిపోరులో ప్రభుత్వ డైట్ కళాశాల (కర్నూలు),జీఎం డీఎడ్ కళాశాల (నంద్యాల)పై 19–10 పాయింట్ల తేడాతో, మహిళల ఖోఖో సాయిశ్రీ డీఎడ్ కళాశాల జట్టు (డోన్) నాగ సత్యనారాయణ డీఎడ్ కళాశాల (నందికొట్కూరు)పై 8–0 పాయింట్ల తేడాతో, బాలుర ఖోఖో విభాగంలో సాయిశ్రీ డీఎడ్ కళాశాల (డోన్), ఠాగూర్ డీఎడ్ కళాశాల (డోన్)పై 5–4 గోల్స్ తేడాతో గెలుపొందాయి. వాలీబాల్ పురుషుల విభాగంలో కేవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ డైట్ కళాశాల జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి.
Advertisement
Advertisement