Danda
-
అయ్యగారు పార్టీ ఇస్తున్నారు. 5 కిలోల చికెన్ కొట్టి ఇవ్వు.!
దొండపర్తి(విశాఖ దక్షిణ): అయ్యగారు పార్టీ ఇస్తున్నారు. 5 కిలోల చికెన్ కొట్టి ఇవ్వు.! ఓయ్.. ఇన్స్పెక్టర్ గారి ఇంట్లో ఫంక్షన్.. నువ్వు బియ్యం బస్తాలు ఇవ్వాలి.! ఇదిగో.. మా సార్ కోసం మసాలా ఐటెమ్స్ కట్టేసి బ్యాగ్‌లో పెట్టు.! ఇదీ నగర శివారు ప్రాంతమైన పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇన్స్పెక్టర్, పోలీస్ కానిస్టేబుళ్ల దందా.. సీఐ పార్టీ ఇస్తున్నారని చెప్పి.. ఆ స్టేషన్ పరిధిలోని చికెన్ షాపుల నుంచి కిరాణా షాపుల వరకు ప్రతి ఒక్కరినీ దోచుకుతింటున్నారు ఖాకీలు. కొంత మంది కానిస్టేబుళ్లు ఉదయం నుంచే బ్యాగులు పట్టుకుని షాపుల మీద పడ్డారు. చికెన్ షాపుల వద్దకు వెళ్లి సీఐ ఇంట్లో ఫంక్షన్ ఉందని ఒకరు.. సీఐ పార్టీ ఇస్తున్నారని మరొకరు చెప్పి 2 కిలోల నుంచి 5 కిలోల వరకు డబ్బులు ఇవ్వకుండా పట్టుకుపోయారు. రోజు వారి వ్యాపారంపై జీవనం సాగించే ఇటువంటి చిన్న వ్యాపారుల నుంచి కిలోలకు కిలోలు చికెన్ కొట్టేయడంతో వారు బయటకు చెప్పుకోలేక మదనపడుతున్నారు. అలాగే రిటైల్ దుకాణాలకు వెళ్లి రైస్ బ్యాగులు, ఇతర వంట, మసాల సామాన్లు సైతం కట్టించుకుని డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోయారు. ప్రతిసారీ అదే తంతు ఈ స్టేషన్ సిబ్బంది వ్యవహారం పట్ల స్థానిక వ్యాపారులు విసుగెత్తిపోతున్నారు. ఖాకీ డ్రెస్ ఉందన్న కారణంతో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సీఐ పేరు చెప్పి సాగిస్తున్న ఈ దందా నిజంగా ఇన్స్పెక్టర్ కోసమా? లేదా కానిస్టేబుళ్ల నిర్వాకమా? అన్నది తేలాల్సి ఉంది. ఉన్నతాధికారుల పేర్లు చెప్పి మార్కెట్ దందా చేయడంలో ఈ స్టేషన్ పరిధిలో సిబ్బంది సిద్ధహస్తులుగా పేరుపొందారు. చిరు వ్యాపారులు, దుకాణదారుల నుంచి ఉచితంగా సామాన్లు పట్టుకుపోతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వీరి వ్యవహారంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలనుకున్నా.. ఆ తర్వాత మిగిలిన వారు తమపై కక్ష కట్టి ఇబ్బందులకు గురి చేస్తారన్న భయంతో వ్యాపారులు బహిరంగంగా చెప్పలేకపోతున్నారు. సీఐ వ్యవహార శైలి అంతే.. ఈ స్టేషన్ సీఐ వ్యవహారం ఎప్పుడూ వివాదాస్పదంగానే ఉంటోంది. విందులు, వినోదాలపై అమితాసక్తి ఉన్న ఈ అధికారి పనిచేసిన చోటల్లా ఏదో వివాదంలో చిక్కుకుంటూ వస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో ఉన్నతాధికారుల నుంచి మందలింపులతో పాటు ఓ మహిళ వివాదం విషయంలో సస్పెన్షన్‌కు సైతం గురయ్యాడు. అయినప్పటికీ అతని వ్యవహార శైలిలో ఎటువంటి మార్పు రాలేదని సహచర సిబ్బందే చెబుతుండడం గమనార్హం. ఓ అతిథి గృహంలో పార్టీ కోసమే కానిస్టేబుళ్లు మార్కెట్లో దందాకు దిగారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నిజంగా సీఐయే కానిస్టేబుళ్లకు చెప్పి పంపించాడా? లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఉన్నతాధికారులు ఇటువంటి సిబ్బందిపై దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని చిరువ్యాపారులు కోరుతున్నారు. -
ప్రైవేటు డీఎడ్ కాలేజీల దందా.. క్లాసులు లేకున్నా పాస్
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయులను తయారు చేసేందుకు ఉద్దేశించిన డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఈడీ) పరిస్థితి దారుణంగా తయారైంది. నాణ్యత ప్రమాణాలు పూర్తిగా అడుగంటాయి. ప్రభుత్వ కాలేజీల్లో బోధకుల్లేరు. ప్రైవేటు కాలేజీలు అసలు తెరుచుకునే పరిస్థితే కన్పించడం లేదు. క్లాసులకు హాజరవ్వకపోయినా ఫర్వాలేదు.. పరీక్షలు రాస్తే చాలు పాస్ గ్యారెంటీ అంటూ ప్రైవేటు డైట్ కాలేజీలు కొత్త భాష్యం చెబుతున్నాయి. ఇదేదో బాగుందని విద్యార్థులు దానికే సిద్ధమవుతున్నారు. ఉన్నతాధికారులు ఈ పరిస్థితిని నియంత్రించడం లేదనే విమర్శలొస్తున్నాయి. ఫలితంగా డీఈడీ పూర్తి చేసినా... అభ్యర్థులు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో కనీసం సగం మంది కూడా అర్హత సాధించలేకపోతున్నారు. పడిపోతున్న డీఎడ్ ఉపాధ్యాయ వృత్తిపై ఆసక్తి ఉన్న వారు ఇంటర్ తర్వాత డీఈడీ, డిగ్రీ తర్వాత బీఈడీలో చేరుతారు. డీఈడీలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్ఈడీ), డిప్లొమా ఇన్ ప్రీసూ్కల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) విభాగాలుంటాయి. ఇందులో ఉత్తీర్ణులైన వారు ప్రాథమిక పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ)లుగా పనిచేసే అవకాశం ఉంటుంది. అయితే, కీలకమైన డీఎడ్ స్థాయిలోనే బ్రేకులు పడుతున్నాయని నిపుణులు అంటున్నారు. 86 మందికి కేవలం 21 మందే ఉన్నారు రాష్ట్రవ్యాప్తంగా 10 డీఎడ్ కాలేజీలుంటే, 286 మంది బోధకులు ఉండాలి. కానీ మన రాష్ట్రంలో ఉన్న బోధకుల సంఖ్య కేవలం 21 మాత్రమే. 265 ఖాళీలున్నా, వాటిని భర్తీ చేయడం లేదు. రిటైర్ అయిన ప్రభుత్వ ప్రిన్సిపాల్స్‌ను మాత్రమే తీసుకోమని ప్రభుత్వం చెబుతోంది. కానీ వాళ్ళు ఎక్కడా లభించడం లేదని అధికారులు అంటున్నారు. డీఎడ్‌లో కీలకమైన బోధన విధానం, విద్యార్థుల సైకాలజీ, పాలనాపరమైన ప్రక్రియలు, మాతృభాషలో బోధించే తీరు, విలువలు, కళలు, కంప్యూటర్, ఫిజికల్ ఎడ్యుకేషన్‌పై బోధన కాలేజీల్లో ఏమాత్రం జరగడం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. క్లాసులు లేకున్నా... రాష్ట్రంలో 2015లో 212 డైట్ కాలేజీలుంటే... ఇప్పుడివి 59కి పడిపోయాయి. ఇందులో ప్రభుత్వ కాలేజీలు పది. 6,888 సీట్ల నుంచి 4600 సీట్లకు తగ్గిపోయాయి. ప్రభుత్వ కాలేజీల్లో టీచర్ల కొరత ఉంటే, ప్రైవేటు కాలేజీల్లో ఫ్యాకల్టీ నియామకమే జరగడం లేదని తెలుస్తోంది. రికార్డుల్లో అధ్యాపకులు ఉన్నట్టు చూపిస్తున్నా, క్షేత్రస్థాయిలో వాళ్ళు కని్పంచడం లేదనే ఆరోపణలున్నాయి. ఏటా ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీఎంబర్స్ రూ.12,500 కూడా సకాలంలో రావడం లేదని కాలేజీలు అంటున్నాయి. విద్యార్థులు కాలేజీకి రాకున్నా రూ. 25 వేలు ఇస్తే పరీక్షలకు హాజరవ్వొచ్చని, సరి్టఫికెట్ పొందొచ్చని యాజమాన్యాలు చెబుతున్నా యి. మంచి టీచర్లు ఎలా వస్తారు : శ్రీరాం ముండయ్య (ప్రభుత్వ డైట్ కాలేజీ లెక్చరర్, కరీంనగర్) డీఎడ్ కాలేజీల్లో అధ్యాపకుల కొరత కారణంగా ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చే వారికి సరైన ప్రమాణాలు లేకపోతే మంచి విద్య అందించడం సాధ్యం కాదు. -
నిర్మల్ జిల్లాలో కడుపు కోతల దందా..
-
హైదరాబాద్‌లో ట్రాన్స్లేటర్ల పేరుతో నయా దంద
-
టీడీపీ ప్రభుత్వంలో కమీషన్ల దందా
-
గ్రానైట్ మాఫియా గుప్పిట్లో గుట్టలు!
సాక్షి, వెల్గటూరు(ధర్మపురి) : పశుపక్షాదుల కిలకిల రావాలతో దశాబ్దం క్రితం వరకు వెల్గటూరు పరిసరాలు సుందరంగా కళకళలాడే గుట్టలు విచ్చలవిడిగా వెలసిన క్వారీలు, క్రషర్ల మూలంగా ప్రస్తుతం ధ్వంసం అవుతున్నాయి. ఎక్కడ చూసినా దుమ్ము ధూళితో శ్మశాన వాతావరణాన్ని తలపిస్తోంది. పర్యావరణ పరిరక్షించే గుట్టలు గ్రానైట్ మాఫియా గుప్పిట్లోకి వెళ్లాయి. అధికారుల అండదండలతో కరిగిపోతున్నాయి. గుట్టల విధ్వంసంతో వన్యప్రాణులు ఆవాసం కోల్పోయి జనారణ్యంలోకి వస్తున్నాయి. పశువులకు మేత కరువై రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఏర్పాడుతున్నా యి. సాగుభూములు బీళ్లుగా మారుతున్నాయి. పది గ్రామాల్లో తగ్గిన పశుసంపద వెల్గటూర్ మండల పరిధిలో ఏర్పాటయిన క్వారీ లు క్రషర్ల వల్ల వెల్గటూరు, కుమ్మరిపల్లి, జగదేవుపేట, కొండాపూర్, అంబారిపేట, శాఖాపూర్, కప్పారావుపేట, రాజక్కపల్లి, కిషన్రావుపేట, సంకెనపెల్లి గ్రామాల్లో పాడిపశువుల సంఖ్య పూర్తిగా తగ్గిపోతోంది. పశువుల మేతకు ఉపయోగపడే గుట్టలన్ని స్టోన్క్వారీలుగా మారాయి. దీం తో పచ్చదనాన్ని కోల్పోయినాయి. బాంబుల మో తకు చిన్న జీవరాశి కూడా కనిపించకుండా పోయి ంది. పర్యావరణ పరిరక్షణ çఅనేది మచ్చుకైనా లేకుండా పోతోంది. ఫలితంగా పెద్దవాగు చుక్క నీరు లేకుండా ఎండిపోయింది. పాడి పశువులకు మేత కరువై రైతులు చేసేదేమి లేక కబేలాకు తెగనమ్ముతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కొన్నాళ్లకు పాడి పశువులను జూలో చూడాల్సి వస్తుందేమోనని మేధావులు అభిప్రాయపడుతున్నారు. బసంత్‌నగర్ టు వెల్గటూరు గ్రానైట్ మాఫియా బసంత్‌నగర్ నుంచి వెల్గటూరుకు చేరుకుంది. ఒకప్పుడు స్టోన్ క్వారీలకు క్రషర్లకు బసంత్‌నగర్ బోడగుట్టలు నిలయంగా ఉండేవి. పదేళ్లుగా ఆ స్థానాన్ని వెల్గటూరు ఆక్రమించుకుంది. అక్కడి అధికారులు ప్రజాప్రతినిధుల ఒత్తిడి మూలంగా గ్రానైట్ వ్యాపారులంతా ఇక్కడికి చేరుకున్నారు. వీరికి తోడుగా బడా రాజకీయ నాయకులు సైతం క్వారీలను తీసుకుని అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటూ పర్యావరణానికి గొడ్డలిపెట్టుగా మారారు. వంద హెక్టార్లలో గుట్టలు హాంఫట్ రెవెన్యూ, పోలీసు, మైనింగ్ అధికారుల నిర్లక్ష్య ధో ర ణి వల్ల వందల హెక్టార్లలో వెలసిన గుట్టలు.. గ్రానైట్ మాఫియా చేతుల్లో పడి కరిగి పోతున్నా యి. వ్యవహారమంతా అక్రమంగా నడుస్తున్నా అ డిగేవారే లేరు. మైనింగ్ పొల్యూషన్ అధికారులు ఇటువైపు రానే రారు. వచ్చిన మామూళ్లు తీసుకు ని చడీచప్పుడు కాకుండా వెళ్లిపోతారనే ఆరోపణలున్నాయి. సామాన్యప్రజలను ఎవ్వరూ పట్టించుకోరూ.. మండల పరిధిలోని చుట్టూ పది గ్రామాల విస్తీర్ణంలో క్వారీలు క్రషర్లు వెలిశాయి. ఇవన్నీ వ్యవసాయ ఆధారిత గ్రామాలు. రైతులు, రైతు కూలీలు వ్యవసాయంపైనే ఆధారపడి బతుకు సాగిస్తారు. అలాంటి జీవితాల్లో గ్రానైట్ వ్యాపారులు గుట్టల ను ఆక్రమించారు. బాంబుల శబ్దం, దుమ్ము కాలుష్యం వల్ల ఆరోగ్యం, పంట పొలాలు నష్ట పోతాన్నామని రెవెన్యూ, మైనింగ్ అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పెద్దమొత్తంలో గ్రానైట్ దందా సాగుతున్నా గ్రామాలకు రూపాయికూడా ఆదాయం లేదని.. అలాంటప్పుడు మేము ఎందుకు ఇబ్బంది పడాలని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి పర్యావరణానికి గొడ్డలిపెట్టులా మారినా గ్రానైట్ దందాకు చెక్ పెట్టాలని బాధిత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే గుట్టలను గ్రానైట్ పేరుతో లీజుకు ఇవ్వకుండా కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. పశు సంపదకు నిలయం మా గ్రామం కుమ్మరిపల్లి పశుసంపదకు నిలయంగా ఉండేది. అలాంటిది గుట్టలన్నీ బడాబాబులు, అధికా రుల చలవతో గ్రానైట్ వ్యా పారులు వశం చేసుకున్నా రు. నానాటికి పశువుల సంఖ్య తగ్గుతోంది. దై వంగా భావించే ఆవు గ్రామంలో కనుమరుగవ డం దురదృష్టకరం. – సాగర్, కుమ్మరిపల్లి పాడిరైతులను ఆదుకోవాలి నాది యాదవ కులం. మా కు బాగా తెలిసిన పని గొ ర్రెలు, మేకలను కాసుకుం టూ బతకటం. ఇప్పుడు గు ట్టలపై క్వారీలు వెలిశా యి. మేకలను, గొర్రెలను మేపుకుందామంటే జాగలేకుండా పోయింది. ఉన్న జీవరాసులన్నింటినీ అమ్ముకుని కూలీకి పోతున్నాం. – మాచర్ల రాజేందర్, కిషన్రావుపేట గ్రానైట్ క్వారీలను మూసేయాలి గ్రానైట్ క్వారీలు క్రషర్ల వల్ల మాకు ఎలాంటి ఉపయోగం లేదు. రెండు దశాబ్దాలుగా ఇక్కడ గ్రానైట్ వ్యాపారం సాగుతోంది. దీ ంతో పర్యావరణం దె బ్బతినటంతో పాటు ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీలో జమ కాలేదు. విలువైన ఖనిజ సంపదను అక్రమార్కులు కొల్లగొట్టేసున్నా మైనింగ్ అధికారులు పట్టించు కోవడం లే దు. నిబంధలనకు విరుద్ధంగా అక్రమంగా న డుస్తున్న వాటిని అధికారులు తక్షణమే మూసి వేయాలి. – పత్తిపాక వెంకటేశ్, వెల్గటూరు -
భద్రాచలం ఆసుపత్రిలో ‘అంబులెన్స్’ దందా
భద్రాచలం: భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకుల దందా రోజు రోజుకూ పెరుగుతోంది. మృతదేహం తరలింపు పేరుతో ఆసుపత్రి ప్రాంగణంలోని మార్చురీ వద్ద డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.టేకులపల్లికి చెందిన జ్యోతి, ఈ నెల 6న ఆత్మహత్యకు యత్నించింది. భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో శనివారం సాయంత్రం మృతిచెందింది. పోస్ట్‌మార్టం అనంతరం ఆదివారం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు బంధువులు సిద్దమయ్యారు. ఆసుపత్రిలో అంబులెన్స్ అందుబాటులో లేదు. ఆసుపత్రి బయట ఉన్న ఓ అంబులెన్స్ నిర్వాహకులు లోపలికి వచ్చారు. తమది కూడా ఆసుపత్రికి సంబంధించినదేనని, ఐదువేల రూపాయలు ఇస్తే మృతదేహాన్ని తరలిస్తామని చెప్పారు. ఆసుపత్రికి చెందిన అంబులెన్స్ అయినట్టయితే డబ్బులు ఎందుకు అడుగుతారని మృతురాలి కుటుంబీకులకు అనుమానం వచ్చింది. వచ్చిన వారిని ఇదే విషయం అడిగి నిలదీశారు. ఈ విషయం తెలుసుకున్న సీపీఐ నాయకులు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కోటిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో, ఆ ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకులు పరారయ్యారు. ఆస్పత్రి అధికారు లే వేరే అంబులెన్స్‌ను ఏర్పాటు చేసి మృతదేహాన్ని టేకులపల్లి తరలించారు. భద్రాచలం ఏరియా ఆసుపత్రి ముందున్న ప్రైవేటు అంబులెన్స్ నిర్వాహకులు తరచూ ఇలాగే రోగులను మోసగిస్తున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి. భద్రాచలం పట్టణంలోని బస్టాండ్ ఎదురుగాగల ఓ ఆసుపత్రితో కమీషన్ ఒప్పందాలు చేసుకుని, ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా ఉచితంగానే సేవలు అందుతాయని రోగులను మభ్యపెట్టి అక్కడికి తరలిస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. వీటిపై ఆస్పత్రి అధికారులు దృష్టి సారించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. -
ఒక్కో ప్రొఫెసర్ ఒక్కో వసూల్ రాజా !
సాక్షి, గుంటూరు: గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో చదివిన ఎంతో మంది విద్యార్థులు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో రాణిస్తున్నారు. కానీ.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు గత వైభవ చరిత్రను మసకబారుస్తున్నాయి. పూర్వ విద్యార్థులు జీజీహెచ్ మిలీనియం బ్లాక్ నిర్మాణానికి రూ.కోట్లు ఇస్తున్నామని గొప్పగా చెప్పుకుంటుంటే, అధ్యాపకులు మాత్రం వైద్య విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ కళాశాల పరువును బజారుకీడుస్తున్నారు. పరీక్షల పేరు చెప్పి వసూలు కళాశాలలో శనివారం నుంచి ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. పర్యవేక్షించేందుకు (ఎక్స్టర్నల్) ఇతర రాష్ట్రాల నుంచి ప్రొఫెసర్లు వచ్చారు. వీరికి ప్రభుత్వం టీఏ, డీఏలు ఇస్తుంది. అయితే, ప్రభుత్వ వైద్య కళాశాలలోని నాలుగు వైద్య విభాగాలకు చెందిన ప్రొఫెసర్లు ఇన్విజిలేటర్లకు రూమ్‌లు, భోజన వసతులు కల్పించేందుకు అంటూ వైద్య విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎంబీబీఎస్ విద్యార్థుల నుంచి రూ.20వేలు, హౌస్సర్జన్ల నుంచి రూ.15 వేలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రాక్టికల్స్‌లో ఎన్ని మార్కులు వేయాలనేది ప్రొఫెసర్ల నిర్ణయంపై ఆధారపడి ఉండటంతో విద్యార్థులు భయపడి నగదు ఇస్తున్నట్లు తెలిసింది. అవసరాన్ని బట్టి రూ.50 వేలు కూడా డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. హాజరు శాతం పెంచాలన్నా నగదు అడుగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నిరుపేద వైద్య విద్యార్థులను కూడా వదలకుండా వైద్యాధికారులు వసూళ్లకు పా ల్పడుతున్నారు. నిరుపేదలనే కనికరం లేకుండా.. ఆరోగ్యశ్రీ ఆపరేషన్ల ద్వారా పలువురికి వచ్చే పారితోషికాలను సైతం ప్రొఫెసర్లు బినామీ అకౌంట్లలోకి మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుత పరీక్ష విధానంలో మార్పులు తెస్తామని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ అనేకసార్టు వైద్య కళాశాలకు వచ్చిన సమయంలో వెల్లడించారు. అయితే.. ప్రకటనలు తప్ప ఆచరణలో మాత్రం చూపలేదు. విచారణ జరుపుతాం.. కళాశాలలో డబ్బులు వసూలు చేస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. ఇన్విజిలేటర్లకు ప్రభుత్వం టీఏ, డీఏలు ఇస్తుంది. అందుకోసం ఎవరూ ఖర్చు పెట్టనవసరం లేదు. విచారణ జరిపి వసూళ్లకు పాల్పడినట్లు తేలితే చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ సుబ్బారావు, ప్రిన్సిపల్, ప్రభుత్వ వైద్య కళాశాల -
దందా చేస్తాడా?
‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని ప్యాన్ ఇండియా స్టార్ అయ్యారు ప్రభాస్. ఈ యంగ్ రెబల్ స్టార్‌తో సినిమా చేయాలని ప్రతి దర్శకుడు, తన కాల్షీట్లు పొందాలని ప్రతి నిర్మాత ఉత్సాహం చూపిస్తున్నారు. కానీ, ప్రభాస్ మాత్రం కొత్త సినిమాల ఎంపిక విషయంలో ఆచి తూచి అడుగులేస్తున్నారు. ‘బాహుబలి’ సినిమా చేస్తున్నప్పుడు ఒప్పుకున్న రెండు సినిమాలు తప్పితే వేరే ఏ సినిమానూ సైన్ చేయలేదు ప్రభాస్. ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న హై బడ్జెట్ యాక్షన్ మూవీ ‘సాహో’ సినిమాతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఆ తర్వాత ‘జిల్’ సినిమా దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఈ రెండు సినిమాలను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ–ప్రమోద్‌లు నిర్మించనున్నారు. ఈ రెండు చిత్రాల తర్వాత సొంత బేనర్ గోపీకృష్ణ మూవీస్‌పై ప్రభాస్ హీరోగా స్వీయదర్శకత్వంలో కృష్ణంరాజు ఓ సినిమా తెరకెక్కిస్తారని టాక్. ఆ వార్తలకు తగ్గట్టుగానే ఫిల్మ్ చాంబర్లో గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ ‘దందా’ అనే టైటిల్‌ను రిజిస్టర్ చేసింది. ఇదివరకు గోపీకృష్ణ మూవీస్ నిర్మించిన ‘బిల్లా’లో కృష్ణంరాజుతో కలిసి నటించారు ప్రభాస్. ఇప్పుడు కూడా ప్రభాస్ తన పెదనాన్నతో కలిసి నటిస్తారా? లేదా కృష్ణంరాజు డైరెక్షన్ మాత్రమే చేస్తారా? అనేది చూడాలి. -
గుంటూరులో కల్తీ కారం దందా గుట్టురట్టు
-
RBI వద్ద పిల్లలతో పాత నోట్ల మార్పిడి దందా
-
నకిలీ దందా
ఉట్నూర్ : నకిలీ అటవీ హక్కు పత్రాల తయూరీ దందా బయటపడింది. ఉట్నూర్ కేంద్రంగా సాగుతున్న ఈ వ్యవహారం ఆదిలాబాద్ జిల్లాలో కలకలం రేపింది. నిర్మల్ జిల్లా కేంద్రంలో సోమవారం పోలీసులు నకిలీ పత్రాల తయూరీ ముఠాను అరెస్టు చేయడంతో గుట్టు రట్టయింది. గిరిజనుల అమాయత్వాన్ని ఆసరాగా చేసుకుని కొన్నేళ్లుగా ఈ దందా సాగుతున్నట్లు తెలుస్తోంది. గిరిజనులు సాగు చేసుకుంటున్న అటవీ భూములకు ప్రభుత్వం 2006 నుంచి అటవీ హక్కు పత్రాలు జారీ చేస్తోంది. ఐటీడీఏ ఏకార్యాలయం నుంచి నేరుగా రైతుల పేర్లు ముద్రితం కాని అటవీ హక్కు పత్రాలు బయటకు వెళ్లడం అనుమానాలకు తావిస్తోం ది. ఐటీడీఏలోని సంబంధిత విభాగం అధికారుల పాత్ర ఉందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఉన్నతాధికారులుపూర్తి స్థాయిలో విచారణ నిర్వహిస్తే ఇప్పటివరకు ఎన్ని నకిలీ అటవీ హక్కు పత్రాలు బయటకు వచ్చాయో తేలుతుంది. ఉట్నూర్ కేంద్రంగా.. కొన్నేళ్లుగా ఉట్నూర్ కేంద్రంగా సాగుతున్న నకిలీ అటవీ హక్కు పత్రాల దందాను నిర్మల్ జిల్లా పోలీసులు ఛేధించారు. అటవీ హక్కు చట్టం అమలుతో ఐటీడీఏ అప్పట్లో గిరిజనులు సాగు చేసుకుంటున్న భూముల సర్వేకు నియమించిన సర్వేయర్లలో ఒకరైన రాథోడ్ శ్రీనివాస్ ఈ నకిలీ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్లు తేలింది. శ్రీనివాస్ ఒరిజినల్ అటవీ హక్కు పత్రాలను ఐటీడీఏ కార్యాలయం నుంచి బయటకు తెచ్చి వాటిలో కంప్యూటర్ ఆపరేటర్ సాజిత్ సహాయంతో హక్కు పత్రాలు కావాల్సిన వారి పేర్లపై సృష్టించేవాడని గుర్తించారు. రాథోడ్ విలాస్ అనే వ్యక్తి అప్పటి అధికారులు డీఎఫ్‌వో వినోద్‌కుమార్, పీవో ముత్యాలరాజు, కలెక్టర్ అహ్మద్ నదీం, అహ్మద్బాబుల సంతకాలు ఫోర్జరీ చేసినట్లు తేల్చారు. రబ్బర్‌స్టాంప్‌లను గంగాధర్ అనే వ్యక్తి తయూరు చేసి ఇవ్వగా.. లౌడ్యా శ్రీనివాస్ అటవీ హక్కు పత్రాలు కావాల్సిన వారికి మధ్యవర్తిగా వ్యవహరించేవాడని పోలీసులు పేర్కొన్నారు. నకిలీ అటవీ హక్కు పత్రాలకు ఎకరాలను బట్టి రూ.15 వేల నుంచి రూ.30 వేలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 36,713 వ్యక్తిగత హక్కు పత్రాలు జారీ 2006 అటవీ హక్కుల చట్టం అమలుతో 56,358 మంది 2,25,569.82 అటవీ భూములకు వ్యక్తిగతంగా అటవీ హక్కు పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు 37,372 మందిని అర్హులుగా గుర్తించారు. జూలై నెలాఖరు వరకు 36,713 మందికి 1,35,997.85 అటవీ భూములకు హక్కు పత్రాలు జారీ చేశారు. ఇంకా 515 మందికి 1399.21 ఎకరాలకు అటవీ హక్కు పత్రాలు అందించాల్సి ఉందని అధికారులు తేల్చారు. నకిలీ వ్యవహారం బయటపడడంతో జిల్లా వ్యాప్తంగా ఎన్ని నకిలీ అటవీ హక్కు పత్రాలు ఉన్నాయో అధికారులు గుర్తించాల్సి ఉంది. ఉట్నూర్ కేంద్రంగా తయూరైన పత్రాలు ఎక్కువగా ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ, ఉట్నూర్, నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్, మామడ మండలాల్లో ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అధికారుల పాత్రపై అనుమానాలు నకిలీ దందా గుట్టు రట్టు కావడంతో ఐటీడీఏని అటవీ హక్కుల విభాగంలో విధులు నిర్వర్తించే అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారి సహకారం లేకుండా ఒరిజినల్ పత్రాలు ఎలా బయటకు వెళ్తాయనేది మిస్టరీగా మారింది. ఆర్ఓఎఫ్ఆర్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న అధికారుల తీరుపై పూర్తి స్థాయిలో విచారణ చేపడితే అవినీతి బాగోతం బయటపడుతుందని గిరిజన నాయకులు అంటున్నారు. నకిలీ వ్యవహారం కారణంగా అర్హులైన రైతులకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. నేరడిగొండ, ఉట్నూర్, మామడ, ఖానాపూర్ మండలాల్లో ఎక్కువగా నకిలీ పత్రాలు జారీ అయినట్లు గుర్తించడంతో ఆయూ మండలాల్లోని గిరిజనులకు జారీ అరుున హక్కుపత్రాలపై విచారణ నిర్వహిస్తారా లేక ఇప్పటివరకు ఐటీడీఏ ద్వారా జారీ అయిన అటవీ హక్కు పత్రాలన్నింటిపైనా విచారణ చేపడుతారా అనేది వేచి చూడాల్సిందే. నకిలీ దందా వెలుగు చూసిన మండలాల్లో అధికారులు అర్హులకు జారీ చేసిన పత్రాల వివరాలు కింది విధంగా ఉన్నాయి. అధికారులు జారీ చేసిన పత్రాలు.. మండలం హక్కుపత్రాలు పొందిన వారు విస్తీర్ణం(ఎకరాల్లో) ఖానాపూర్ 1960 20,070.49 ఉట్నూర్ 2218 14,352.37 నేరడిగొండ 2497 23,289.90 మామడ 803 5860.95 -
యథేచ్ఛగా "నల్ల" దందా
మానుకోట చుట్టూ నల్లబెల్లం విక్రయాలు శివారు ప్రాంతాల్లో వ్యాపారుల అడ్డా మొబైల్ ఫోన్ల ద్వారా సమాచారం రెండు గంటల్లో వ్యవహారం పూర్తి అర్ధరాత్రి దందాకు అడ్డుకట్ట ఏదీ ? సాక్షి, హన్మకొండ : గుట్టు చప్పుడు కాకుండా గుడుంబా మత్తులో తండాలు తూగుతున్నాయి. పోలీసు, ఎక్సైజ్ అధికారుల దాడులకు చిక్కకుండా బెల్లం మాఫియా కొత్త పద్ధతిలో పనులు చక్కబెట్టుకుంటోంది. గతంలో మహబూబాబాద్ కేంద్రంగా ఉన్న తమ అడ్డాలను మార్చి చుట్టుపక్కలకు విస్తరించారు. మొబైల్ ఫోన్లను విరివిగా ఉపయోగిస్తూ గుడుంబా తయారీదారులకు నల్లబెల్లాన్ని యథేచ్ఛగా సరఫరా చేస్తున్నారు. కొత్త పంథాలో.. బెల్లం అక్రమ రవాణాలో ఆరితేరిన వ్యక్తులు కొత్త పంథాలో గుడుంబా తయారీదారులకు చేరవేస్తున్నారు. రెండేళ్ల క్రితం వరకు మహబూబాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో గుడుంబా విచ్చలవిడిగా తయారయ్యేది. మహబూబాబాద్ మార్కెట్లో బెల్లం విరివిగా లభ్యమయ్యేది. పొరుగు రాష్ట్రాలు, ఇతర ప్రాంతాల నుంచి లారీల్లో వచ్చే బెల్లం లోడును మహబూబాబాద్ పట్టణంలో నిల్వ చేసేవారు. తాజాగా జరుగుతున్న దాడులతో మహబూబాబాద్‌లో బెల్లం అమ్మకాలు తగ్గిపోయి చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించాయి. మహబూబాబాద్ కేంద్రంగా భారీ ఎత్తున బెల్లం నిల్వ చేయడాన్ని తగ్గించిన వ్యాపారులు.. శివారు ప్రాంతాల్లో తాత్కాలిక అడ్డాలను ఏర్పాటు చేసుకుని పనులు చక్కబెడుతున్నారు. ఫోన్లలో సమాచారం.. అక్రమంగా బెల్లం సరఫరా చేసే వ్యక్తులు మొబైల్ ఫోన్ల ద్వారా గుడుంబా తయారీదారులతో నిత్యం టచ్‌లో ఉంటున్నారు. ఎవరెవరికి ఎంత బెల్లం కావాలో ఆర్డర్ తీసుకుని లారీలలో బెల్లం లోడు వచ్చే రోజు, సమయం గురించి గుడుంబా తయారీదారులకు చేరవేస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా పైన ఉల్లిగడ్డ బస్తాలు, అడుగున నల్లబెల్లం పెడుతున్నారు. ఇలా పకడ్బందీ వ్యూహంతో వచ్చే బెల్లం లోడు లారీలను అర్ధరాత్రి , తెల్లవారుజామున మహబూబాబాద్ పట్టణానికి ఐదు నుంచి పది కిలోమీటర్ల దూరంలో గల నిర్మానుష్య ప్రాంతంలో నిలిపి ఉంచుతారు. ముందస్తు సమాచారం ప్రకారం అక్కడికి చేరుకున్న టాటామ్యాజిక్, ఆటోలు, ద్విచక్ర వాహనాలపై బెల్లాన్ని గుడుంబా బట్టీలకు తరలిస్తున్నారు. రెండు గంటల వ్యవధిలోనే ఈ మొత్తం తతంగాన్ని పూర్తి చేస్తున్నారు. క్వింటా రూ .8000.. ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు, చిత్తూరు నుంచి బెల్లం మహబూబాబాద్‌కు సరఫరా అవుతోంది. అక్కడ బహిరంగ మార్కెట్లో క్వింటా ధర మూడు వేల రూపాయలుగా ఉంది. అదే బెల్లాన్ని ఇక్కడికి తీసుకొచ్చి క్వింటా రూ. 8000కు అమ్ముతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒక్క క్వింటాపై దాదాపు మూడు రెట్ల లాభాలు ఉండటంతో ఈ వ్యవహారంలో పాలుపంచుకునే వారి సంఖ్య పెరిగిపోతుంది. దీంతో అక్రమ పద్ధతిలో బెల్లం అమ్మకాలు పుంజుకుంటున్నాయి. ఇటీవల అర్ధరాత్రి వేళ నల్లబెల్లం సరఫరా చేసేందుకు వెళ్లిన ఓ యువకుడు పోలీసుల భయంతో చీకట్లో పరిగెత్తి వ్యవసాయ బావిలో పడిపోయి చనిపోయిన సంఘటన బెల్లం మాఫియా ఆగడాలకు ఉదాహరణగా నిలుస్తోంది. ఎక్సైజ్, పోలీసు అధికారులు బెల్లం మాఫియాలో ఉన్న ప్రధాన సూత్రదారులను చూసీ చూడనట్లుగా వదిలేస్తున్నాని, సా«ధారణ వ్యాపారులు, ఆటోడ్రైవర్లపై ఎక్కువ నిర్భంధం అమలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
నయీమ్ పేర ఎమ్మెల్యే దందా!
-
నయీమ్ పేర ఎమ్మెల్యే దందా!
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్‌ను అడ్డం పెట్టుకుని దందాలు నడిపిన వారి పేర్లు ఒక్కొక్కటే బయటికొస్తున్నాయి. ముఖ్యంగా నల్లగొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఒకరు నయీమ్ పేరు చెప్పి తమను బెదిరించినట్లు పలువురు బాధితులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆ ఎమ్మెల్యే తెరవెనుకే కథంతా నడిపారని సమాచారం. నయీమ్ ప్రధాన అనుచరునిగా పోలీసులు భావిస్తున్న శేషన్న, నయీమ్ బంధువు ఖలీమ్లను అడ్డంపెట్టుకుని ఆయన ఈ వ్యవహారాలన్నీ నడిపినట్లు చెబుతున్నారు. పైగా తన నియోజకవర్గంలోనే గాక నల్లగొండ చుట్టుపక్కల భూ లావాదేవీల్లోనూ వేలు పెట్టినట్టు ఫిర్యాదులున్నాయి. నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత శేషన్న, ఖలీమ్ అజ్ఞాతంలో ఉండిపోయారు. వీరిని పట్టుకునేందుకు సిట్ వేట కొనసాగిస్తోంది. వీరిలో ఏ ఒక్కరు పోలీసులకు చిక్కినా సదరు ఎమ్మెల్యే బండారం బయటపడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయనపై నేరుగా సీఎంకే ఫిర్యాదులందాయని, నిజానిజాలను విచారించి తనకు నివేదిక అందివ్వాల్సిందిగా సిట్ అధికారులను ఆదేశించారని సమాచారం. ఈ మేరకు ఇప్పటికే విచారణ ప్రారంభించిందని, దీనిపై క్షేత్రస్థాయి విచారణ జరపాల్సిందిగా నల్లగొండ ఎస్పీకి సూచించిందని చెబుతున్నారు. దాంతో ఎస్పీ ఆదేశాల మేరకు సంస్థాన్ నారాయణపురం ఎస్సై విచారణ కోసం రంగంలోకి దిగారని చెబుతున్నారు. ఆరోపణలివీ... విశ్వసనీయ సమాచారం మేరకు... నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలో గ్రామ కంఠం భూములను (వీటినిక్కడ కందకాల భూములని కూడా అంటారు) ఆ ఎమ్మెల్యే మనుషులు ఆక్రమించారని కొందరు బాధితులు సిట్‌కు ఫిర్యాదు చేశారు. ఖలీమ్ ఇప్పటికే ఒక మహిళ పేర ఆ భూమిని రిజిస్టర్ చేయిం చాడు. చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం పరిసరాల్లోనూ ముంబైకి ఓ వ్యక్తి తాలూకు భూమికి అడ్వాన్సు చెల్లించి సొంతం చేసుకున్నారని, తర్వాత మిగతా మొత్తం అడిగితే నయీమ్ పేరు చెప్పి శేషన్న, ఖలీమ్ బెదిరించారని అంటున్నారు. చౌటుప్పల్, తంగడపల్లి, తాళ్లసింగా రం, లింగోజిగూడెం, పంతంగి తదితర గ్రామాల పరిధిలో ‘గోల్డెన్ ఫారెస్ట్’ అనే సంస్థకు సుమారు 1,300 ఎకరాల దాకా ఉంది. వీటిలో రియల్ ఎస్టేట్ వెంచర్లూ ఉన్నాయి. వీటిలోని వివాదాస్పద భూముల్లో ఈ గ్యాంగ్ తలదూర్చి సుమారు రూ.50 లక్షల దాకా బలవంతంగా వసూలు చేసినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత అతని బాధితులు వందలాదిగా బయటికొస్తుండటం, దాదాపు అన్ని పార్టీల నేతలకూ గ్యాంగ్‌స్టర్‌తో సంబంధాలున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం ఈ కేసును సీరియస్‌గా తీసుకుంటోంది. నిక్కచ్చిగా వ్యవహరించాలని సిట్ అధికారులకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. -
పర్రభూములకు ఎర
తమ్ముళ్ల ‘భూ’బాగోతం అక్రమార్కుల కొమ్ము కాస్తున్న ముఖ్యనేతలు 12 ఎకరాల ట్రయల్ రన్ సక్సెస్ మిగిలిన 100 ఎకరాల భూమిపై ఇద్దరు నేతల కన్ను అవకతవకలకు సహకరించిన వెబ్‌ల్యాండ్ ఆర్డీఓ దర్యాప్తుతో బయటపడినా పైరవీలు పెద్ద చేపను పట్టుకోవాలంటే చిన్న చేపకు గాలం వెయ్యాలి. అదే సూత్రం భూముల హస్తగతానికి ఎంచక్కా వాడుకుంటున్నారు కాకినాడకు చెందిన ఇద్దరు టీడీపీ నేతలు. పదో, పాతిక ఎకరాలు కాదు ఏకంగా వంద ఎకరాలపై వీరి కన్ను పడింది. ఆ భూమిని ఆక్రమించి అధికారులు ముందు భంగపడేకన్నా అందులో ఉండే లొసుగులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని అనుకున్నారు. ఆ ప్రాంతానికి చెందిన కొంతమందితో ముందస్తుగా ఆక్రమించజేసి ... పూర్వార్జితం పత్రాలు చూపించి రిజస్ట్రేషన్ సిబ్బందిని మభ్యపెట్టి ఆ తంతు ముగింపజేశారు. వెబ్‌ల్యాండ్ లొసుగులు ఆధారంగా అవినీతి ముసుగేసేశారు. ఇక అదే దారిలో మిగిలిన 100 ఎకరాలను బినామీల పేరుతో రిజస్ట్రేషన్లు చేయించాలని అనుకున్నారు. ఇంతలో తొలి గాలంపై ఫిర్యాదులు వెళ్లడంతో కాకినాడ ఆర్డీఓ దర్యాప్తు చేయడం, ఆక్రమణ, రిజస్ట్రేషన్లు అక్రమమైనవేనని నిర్ధారించడంతో సక్రమంగా మార్చే పనిలో ఈ నేతలు పడ్డారు. అంతా సర్దుబాటయ్యాక వంద ఎకరాలకు బాటలేసుకోడానికి పైరవీలు ప్రారంభించారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ : తెలుగు తమ్ముళ్లు సముద్ర తీరాన్నే మింగేస్తున్న వ్యవహారం బయటపడటంతో మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్రమ రిజిస్ట్రేషన్‌తో అందినంతా దోచేసిన రిజిస్ట్రేషన్ శాఖాధికారులను కొమ్ము కాసేందుకు టీడీపీ నేతలు తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అధికారం అండ చూసుకుని భూములనే కాదు చివరకు సముద్ర తీరాన్ని కబ్జా చేయడమే కాకుండా ఏకంగా రిజిస్ట్రేషన్లు కూడా చేయించేసుకున్నారు. వివరాల్లోకి వేళ్తే... కాకినాడకు కూతవేటు దూరంలో కరప మండల పరిధిలో ఉప్పలంక సముద్ర పర్ర భూములు తాత, ముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తిగా చూపించి ముమ్మిడివరం నియోజకవర్గానికి చెందిన తెలుగు తమ్ముళ్లు రిజిస్ట్రేషన్లు చేయించేసుకున్న వైనం ఇటీవల బయటపడింది. ఉప్పలంకలో ఉన్న 120 ఎకరాల పర్రభూముల్లో 12 ఎకరాలు రిజిస్ట్రేషన్ అనేది ముందస్తు ట్రైల్ రన్‌గా కనిపిస్తోంది. ఈ రిజిస్ట్రేషన్ విజయవంతంగా పూర్తవడంతో రెండో విడతలో అధికార పార్టీకి చెందిన కాకినాడ సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో ఉన్న ఇద్దరు ప్రజాప్రతినిధిలు మిగతా 108 ఎకరాలు కాజేయడానికి పావులు కదుపుతున్నారు. బయటపడిందిలా... కరప మండలం గురజనాపల్లిలో సుమారు 120 ఎకరాలు ఉంది. దీనిపై టీడీపీ నేతల కన్నుపడింది. అందులో 12.50 ఎకరాల భూమిని కొంతమందితో ఆక్రమింపజేశారు. చట్టంలో లొసుగుల ఆధారంగా పూర్వార్జితంగా చూపి, దొడ్డిదారిలో రిజిస్ట్రేషన్ చేయింపజేశారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో కాకినాడ ఆర్డీఓ అంబేడ్కర్ ఇటీవల విచారణ చేపట్టారు. అవి అక్రమ రిజిస్ట్రేషన్లుగా ప్రాథమికంగా తేల్చారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్‌కు ఇచ్చే నివేదిక ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసిన తాళ్లరేవు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు, ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకునే వీలుండడంతో కాకినాడ సిటీ, కాకినాడ రూరల్ నియోజకవర్గాలకు చెందిన ఇద్దరు టీడీపీ నేతలు ఉన్నత స్థాయిలో ప్రయత్నాలకు తెరదీశారని తెలియవచ్చింది. ఇందులో వారి స్వా ర్థం లేకపోలేదు. తొలి విడతగా 12 ఎకరాలు రిజిస్ట్రేషన్ విజయవంతంగా జరిగిపోవడంతో మిగిలిన భూమిని ఆ ఇద్దరు ప్రజాప్రతినిధులు బినామీ పేర్లతో సొంతం చేసుకోవాలని ఎత్తుగడ వేశారు. తొలుత జరిగిన తంతులో ఏ ఇబ్బందీ తలెత్తకపోతే మిగిలిన భూమి స్వాహా చేయడానికి భారీ కసరత్తు జరుగుతోంది. తొలిగాలం ఇలా... ఈ మొత్తం వ్యవహారానికి కాట్రేనికోన మం డలం పల్లం గ్రామం కేంద్రంగా మారింది. ఈ గ్రామంలోని కొంతమందిని తొలి గాలంగా వాడుకున్నారు. గురజనాపల్లి సర్వేనంబరు 106/1ఎలో పూరా 65.02 సెంట్లభూమిలో పల్లం గ్రామానికి చెందిని మల్లాడి పెదస్వామి(లేటు) కుమారుడు మల్లాడి సత్యం, మల్లాడి కాసులయ్య, మల్లాడి కాసురాజు, మల్లాడి సత్యం కుమార్తె బలుసుతిప్ప గ్రామానికి చెంది న పినపోతు ధనకుమారిలు పారీఖతు ్త(విడిపోయినట్టు) దస్తావేజు రాసుకున్నారు. వీరిలో ఒకరికి 10.50 ఎకరాలు (50,820 చదరపు గజా లు) మిగిలిన నలుగురికిS 0.50 సెంట్లు లేదా 2,420 చదరపు గజాలుగా రాసుకున్నారు. చదరపు గజానికి రూ.1,500లు విలువకట్టి దానిప్రకారం ఎవరి వాటాకు ఎంతో పేర్కొంటూ మొత్తం విలువ రూ.9,07,50,000లుగా చూపించి స్టాంపు డ్యూటీ రూ.1,45,200లు, రిజిస్ట్రేషన్ ఫీజు రూ.1000లు, యూజర్ ఛార్జి రూ.1000లు...మొత్తంగా రూ.1,47,200లకు తాళ్లరేవు ఎస్బీఐలో చలానాతీసి మరీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీనిపై స్థానికులు కరప తహశీల్దార్, కాకినాడ కలెక్టరేట్లో ఫిర్యాదుచేసిన నేపథ్యంలో ఈ విషయం బయటకు వచ్చింది. వెబ్ ల్యాండ్ లొసుగుతో అవినీతి ముసుగు... భూమి కొనుగోలుచేసినా, పూర్వార్జితం ఆస్తిని పంచుకున్నా, దానం చేసినా ఆ భూమికి పాత దస్తావేజులు, పాస్ పుస్తకాలు, 1బీ అడంగళ్ వివరాలు చూపించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిష్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసే భూమి వివరాలను వెబ్‌ల్యాండ్‌లో తనిఖీచేసి, అన్ని ఆధారాలు సరిచూసుకుని రిజిస్ట్రేషన్ చేస్తారు. అయితే ఇందులో ఉన్న అనేక మతలబులు ఆధారంగా వీరు ఆ భూములను రిజిస్టర్ చేయించుకున్నారు. మొదటి మతలబు వెబ్లాండ్. రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ చంద్రబాబు సర్కార్ ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న వెబ్లాండ్ విధానం. వెబ్లాండ్లో ఈ 12 ఎకరాలు మెరకచేసిన ఇళ్ల స్థలాలుగా కనిపిస్తోంది. ప్రభుత్వ భూమి అయితే ఈ సర్వేనంబర్ బ్లాక్ అయి ఉంటుంది. అలా లేదు కాబట్టే రిజిస్ట్రేషన్ చేశామని తాళ్లరేవు రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు తమ తప్పు లేదన్నట్టు చెప్పుకొస్తున్నారు. సహజంగా గ్రామకంఠం, వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకుంటేlదస్తావేజులు, పాస్‌పుస్తకాలు అవసరం లేకుండానే రిజిస్ట్రేషన్ చేసే వెసలుబాటుంది. వ్యవసాయ భూమిని ఎకరాల్లో చూపిస్తే అందుకు డాక్యుమెంట్లు ఇవ్వాలి. అదే చదరపు గజాలలో చూపించి పంచుకున్నా, అమ్ముకున్నా లింక్ డాక్యుమెంట్లు, పాత దస్తావేజులు అవసరం లేకుండానే రిజిస్ట్రేషన్ జరిగిపోతుంది. ఈ భూమి ఎలా సంక్రమించిందంటూ రిజిస్ట్రార్ అడిగినా పూర్వార్జితం, పాత దస్తావేజులు లేవని చెప్పి రిజిస్ట్రేషన్ చేయించేసుకునే వెసలుబాటు ఉంది. వీటన్నింటినీ చూసుకోవాల్సిన బాధ్యత రిజిస్ట్రార్లపె ఉంటుంది. కానీ ఇవేమీ చూడకుండానే అధికారపార్టీ పెద్దలు వెనుక ఉన్నారనే ఏకైక కారణంతో అడ్డగోలుగా రిజిస్ట్రేషన్లు చేసేశారు. అంతా సక్రమమేనండీ... ఉప్పలంకలోని ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నవారికి ఎలా రిజిస్ట్రేషన్ చేశారని తాళ్లరేవు సబ్‌రిజిస్ట్రార్ పీఎస్ఆర్ మూర్తిని వివరణకోరగా నిబంధనలకనుగుణంగానే చేశామన్నారు. ప్రభుత్వ స్ధలమైతే వెబ్‌ల్యాండ్‌లో బ్లాక్‌గా చూపిస్తుందన్నారు. అలాకాకుండా ఇళ్ల స్ధలాలుగా ఉండటంతో నిబంధనలకు లోబడే రిజిస్ట్రేషన్ చేశామన్నారు. -
భువనగిరిలో నయీం బెదిరింపుల దందా
-
జోరుగా నకిలీ పాసు పుస్తకాల దందా!
కొడకండ్ల : అమాయక రైతులే ఆసరాగా కొంతమంది దళారులు నకిలీ పట్టాదారు పాసు పుస్తకాల తయారీ దందాను కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. రెవెన్యూ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసినా పనులు కాక విసిగిపోయిన అన్నదాతలే లక్ష్యంగా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఆయా గ్రామాల్లోని కొంతమంది దళారులుగా అవతారమెత్తి నకిలీ పాసు పుస్తకాల సృష్టికర్తల కోసం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో రైతు నుంచి ఎకరానికి రూ.5వేల నుంచి రూ.7వేల చొప్పున వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. డబ్బు చేతికి అందగానే పదిహేను రోజుల వ్యవధిలో పని పూర్తి చేస్తామంటూ నమ్మబలుకుతున్నట్లు పేర్కొంటున్నారు. పాసు పుస్తకాల తయారీ ప్రక్రియ తర్వాత కంప్యూటర్ పహాణీల్లో నమోదు కోసం రెవెన్యూ యంత్రాంగంలోని పలువురు సిబ్బందిని మచ్చిక చేసుకొని ఉండొచ్చని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొడకండ్ల మండల కేంద్రం శివారులోని ఓ గిరిజన తండా కేంద్రంగా కొంతమంది ఈ నకిలీ పాసు పుస్తకాల తయారీని కొనసాగిస్తున్నట్లు భావిస్తున్నారు. ఈ ముఠాకు పోచంపల్లి, గంట్లకుంట, రామవరం తదితర గ్రామాల్లో కొంతమంది మధ్యవర్తులు ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. -
లోకల్ రు‘బాబు’!
మన్యంలో అడ్డగోలుగా ఖనిజ తవ్వకాలు బెదిరించి.. కేసుల పెట్టి.. మైనింగ్ ప్రాంతాల స్వాధీనం తరలిపోతున్న కోట్ల విలువైన ఖనిజం ఏమాట కామాటే చెప్పుకోవాలి.. ఆ బాబు చిన్నా చితకా ఆదాయాలకు ఏమాత్రం కక్కుర్తి పడడు. పంచాయితీలు చేయడం.. బలవంతపు వసూళ్లు.. ఆయనకేమాత్రం సరిపడవు. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్నది ఆయన నైజం..అందుకే ఏకంగా వందల కోట్ల విలువైన ఖనిజ సంపదపై వాలిపోయాడు.. వాటిని కొల్లగొట్టే పనిలో పడ్డాడు.. అతి స్వల్ప వ్యవధిలోనే సుమారు రూ.20 కోట్ల విలువైన ఖనిజాన్ని చక్కబెట్టేశాడు..అధికారం అండ చూసుకొని.. అసలు లీజుదారులను బెదిరించి.. కేసుల్లో ఇరికించి భయపెట్టాడు..తానొక్కడు తప్ప.. ఇతరులెవరూ ఆ ఖనిజ నిక్షేపాల జోలికి రాకుండా చూసుకున్నాడు.. సాక్షాత్తు జిల్లా కలెక్టర్ ఆదేశాలనూ యథేచ్ఛగా ధిక్కరించాడు.. నిక్షేపంగా ఖనిజాన్ని కొల్లగొడుతూ కోట్లకు కోట్లు కూడబెడుతున్నాడు..మన్యంలో గిరిజనులు తప్ప ఇతరులెవరూ మైనింగ్ చేయరాదన్న నిబంధనలున్నా.. ఇతగాడి విశంఖల తవ్వకాలను అడ్డుకునేందుకు అధికారులెవరూ ముందుకు రావడంలేదు. అసలు తమకేం సంబంధం లేదన్నట్లే.. కళ్లు మూసుకుని కూర్చున్నారు. ఇంత దర్జాగా ఖనిజ దోపిడీకి పాల్పడతున్న ఈ బాబుగారి లీలలు చూసి.. ఆయన్ను ఏ చంద్రబాబో.. లోకేష్బాబో అనుకునేరు..! ఆయన ఫక్తు లోకల్ బాబు.. అదేదో సినిమాలో ‘చంటిగాడు.. లోకల్’.. అన్నట్లుగానే ఈ లోకల్ బాబు నర్సీపట్నం నియోజకవర్గంలోని నాతవరం మండలంలో సాగిస్తున్న దోపిడీ దందాను ఈ వారం విశాఖ తీరంలో చూపిస్తాం.. రండి. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: మన్యంలో బాకై ్సట్ తరువాత అత్యంత విలువైన ఖనిజం లేటరైట్. నాతవరం మండలం సరుగుడు పంచాయతీ పరిధిలోని సుందరకోట, అసనగిరి, బమిడికలొద్ది గ్రామాల్లోని వేలాది హెక్టార్లలో ఈ ఖనిజ నిక్షేపాలు అపారంగా ఉన్నాయి. ఈ నిక్షేపాలను వెలికితీసే హక్కు గిరిజనులకే ఉంది. ఆ మేరకు 2009 జూలైలో లేటరైట్ మైనింగ్ చేసేందుకు సింగం భవానీ, జర్తా లక్ష్మణ రావు అనే గిరిజనులు ప్రభుత్వం నుంచి అనుమతులు పొందారు. అసనగిరిలో 5 హెక్టార్లు, సుందరకోట ప్రాంతంలో 35.5 హెక్టార్లలో తవ్వకాలకు భవానీకి.. బమిడికలొద్ది ప్రాంతంలో 110 హెక్టార్లలో తవ్వకాలకు లక్ష్మణ రావుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ఐదు హెక్టార్లు, అంతకుమించిన విస్తీర్ణంలో తవ్వకాలు జరపడానికి పర్యావరణ అనుమతులు తప్పనిసరి. కానీ ఆ అనుమతులు రాకపోవడంతో వారిద్దరూ తవ్వకాలు చేపట్టలేదు. ఒత్తిళ్లు.. కేసులు.. రెండేళ్ల కిందట టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ మారింది. ప్రజాప్రతినిధి కుమారుడైన లోకల్ బాబు కన్ను లేటరైట్ గనులపై పడింది. ముందుగా అధికారబలాన్ని ప్రయోగించి సింగం భవానీ పేరిట ఉన్న ఐదు హెక్టార్లను తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ ఎంపీ కుమారుడితో కలిసి గత ఏడాది సెప్టెంబరులో భారీ యంత్రాలతో తవ్వకాలు మొదలెట్టారు. ఈ 11 నెలల కాలంలోనే రూ.20 కోట్లు విలువైన ఖనిజాన్ని తరలించి సొమ్ము చేసుకున్నారని అంచనా. కేవలం ఐదు హెక్టార్లలో చేపట్టిన తవ్వకాలకే ఇంత ఆదాయం వస్తుంటే 110 హెక్టార్లలో తవ్వకాలు చేస్తే ఇంకెంత వస్తుందోనని లెక్కలు వేసుకున్నారు. అంతే.. బమిడికలొద్ది ప్రాంతంలోని 110 హెక్టార్ల బినామీ లీజుదారుడైన లవకుమార్ రెడ్డిపై లోకల్ బాబు ఒత్తిడి చేశారు. 80 శాతం వాటా ఇస్తే తవ్వకాలకు అనుమతులు ఇప్పిస్తానని బేరం పెట్టారు. దానికి లవకుమార్‌రెడ్డి నిరాకరించడంతో వేధింపులకు దిగారు. ఆ మైనింగ్ అనుమతులు రద్దు చేయాలని గ్రామ సర్పంచ్ సాగిన లక్ష్మణ మూర్తిపై ఒత్తిడి చేశారు. అయితే దానికి సర్పంచ్ కూడా అంగీకరించలేదు. కక్ష గట్టిన సదరు బాబు సర్పంచ్ లక్ష్మణ మూర్తి, బినామీ లీజుదారుడు లవకుమార్రెడ్డిలపై కేసులు పెట్టించారు. పంచాయతీ నిధుల వినియోగంలో అవకతవకలు జరిగాయంటూ సర్పంచ్ చెక్‌పవర్ రద్దు చేయించారు. మరో వైపు అసలు లీజుదారుడైన జర్తా లక్ష్మణ రావునూ వదల్లేదు. అతనికి ఇచ్చిన మైనింగ్ అనుమతులను రద్దు చేయాలంటూ సదరు బాబు తన తండ్రి అయిన టీడీపీ ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే ఆయన పంచాయతీరాజ్‌శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శికి వివరాలు నివేదించారు. దీంతో పంచాయతీరాజ్ కమిషనర్ అసలు ఆ ప్రాంతంలో ఎక్కడా లేటరైట్ తవ్వకాలు చేపట్టకూడదంటూ ఆదేశాలిచ్చారు. ఆ మేరకు అప్పటి జిల్లా కలెక్టర్ యువరాజ్ సరుగుడు ప్రాంతంలో ఎక్కడా మైనింగ్ జరగకుండా చూడాలని తొమ్మిది శాఖల అధికారులకు ఆదేశాలు ఇస్తూ జీవో జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ సదరు ప్రజాప్రతినిధి కుమారుడు సింగం భవానీ పేరున ఉన్న ఐదు హెక్టార్లలో మాత్రం అడ్డూ అదుపూ లేకుండా తవ్వకాలు జరిపేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నట్లు తెలిసినప్పటికీ అధికారులు ఇప్పటివరకు అడ్డుకునే యత్నం కూడా చేయలేదు. కనీసం ఆవైపు కన్నెత్తి చూసే సాహసం కూడా చేయలేదు. ఇక అడ్డగోలు తవ్వకాలతో కోట్ల ఆదాయం రుచిమరిగిన ఆ బాబు ఇటీవల 8 మంది గిరిజనుల పేరుతో మైనింగ్ లీజ్‌కు దరఖాస్తు చేయించారు. ఆయన ఒత్తిడితో ఇక్కడి మైనింగ్ అధికారులు కొత్తవాటి అనుమతికి ప్రతిపాదనలు తయారు చేసి పంపించారు. ఈ ప్రశ్నలకు సమాధానమేదీ? నిబంధనల మేరకు గిరిజనులు చేయాల్సిన మైనింగ్‌ను ఓ పచ్చనేత కుమారుడు దగ్గరుండి చేయిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నట్టు.. అసలు ఆ ప్రాంతంలో మైనింగ్ నిషేధిస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేస్తే.. వాటిని బేఖాతరు చేస్తూ తవ్వకాలకు పాల్పడుతుంటే అధికారులు ఎందుకు నోరు మెదపడం లేదు. మైనింగ్‌కు అర్హులైన గిరిజనులు అనుమతులు తెచ్చుకుంటే వేధింపులకు గురి చేసి తవ్వకాలకు చెక్‌పెట్టిన అధికారులు సదరు బాబు తవ్వకాలను ఎందుకు అడ్డుకోవడం లేదు. కొత్తగా కొలువుదీరిన అధికారులైనా పనితీరులో ప్రావీణ్యం చూపి సదరు బాబు తవ్వకాలకు, అక్రమాలకు చెక్ పెట్టగలరా... ఏమో చూద్దాం.. -
వైజాగ్‌లో సన్నాఫ్ సత్యమూర్తి భూ దందాలు...
ఇదిగో సెటిల్మెంట్ల బండారం విశాఖపట్నం: పెందుర్తి నియోజకవర్గంలో రెండేళ్లుగా విచిత్రమైన పాలన నడుస్తోంది. అక్కడ టీడీపీ కీలక నేత కుమారుడు చెప్పిందే వేదం. ఏ పని జరగాలన్నా సదరు పుత్రరత్నం గారి అనుమతి, అనుగ్రహం తప్పనిసరి. అధికారికంగా ఎటువంటి హోదా లేనప్పటికీ ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలోనూ వేదిక మీద అతనికి సీటు వేయాల్సిందే. లేదంటే అధికారులు బదలీ అయిపోతారు. అందుకే.. ఎందుకొచ్చిన గొడవని గౌరవ ప్రజాప్రతినిధుల సరసన అతన్ని కూర్చోబెట్టి మరీ ప్రభుత్వ కార్యక్రమాలు నడిపిస్తున్నారు. ఇటీవల జరిగిన నవనిర్మాణ దీక్ష ప్రారంభోత్సవాన్ని సైతం పుత్రరత్నంతోనే కానిచ్చేశారు. గ్రామాలు, కాలనీల్లో పర్యటించినప్పుడు జోనల్ కమిషనర్, మండల రెవెన్యూ, మండల పరిషత్ స్థాయి అధికారులు ప్రొటోకాల్‌ను ఉల్లంఘించి అతని వెంట నడుస్తున్నారు. అధికారం తమదే కావడంతో ప్రతి పనిలోనూ కాసుల వేట సాగిస్తున్న సదరు పుత్రరత్నం ఈ రెండేళ్లలో దాదాపు రూ. 80 కోట్లకు పడగలెత్తారని చెబుతున్నారు. పెందుర్తిలో సదరు టీడీపీ ప్రజాప్రతినిధి కుమారుడు వెలగబెట్టిన పంచాయితీలు, పాల్పడ్డ వసూళ్ల చిట్టాలో మచ్చుకు కొన్ని... ♦ గుర్రమ్మపాలెంలో ఏపీఐఐసీ స్వాధీనం చేసుకున్న సుమారు 110 ఎకరాల భూములకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించింది. ఎకరాకు రూ.23 లక్షలు చొప్పున రైతులకు అందించింది. ఇందులో సన్నాఫ్ టీడీపీ నేత దందా నడిచింది. రెవెన్యూ అధికారుల సహకారంతో సుమారు 20 ఎకరాల్లో బినామీలను సృష్టించి ఆ భూములకు సంబంధించిన నష్టపరిహారాన్ని నొక్కేశాడు. అక్కడితో సరిపెట్టుకోకుండా.. ఇదే భూముల్లో నష్టపరిహారం పొందిన అర్హులైన రైతుల నుంచి ఎకరాకు రూ.లక్ష వంతున వసూలు చేశాడు. మొత్తంగా ఈ వ్యవహారంలో రూ.5 కోట్లకుపైనే చక్కబెట్టాడు. ♦ ఇటీవల పెద్ద ఎత్తున దుమారం రేపిన పెందుర్తి మండలం లక్ష్మీపురం భూ వివాదంలోనూ సదరు టీడీపీ నేత కొడుకుదే కీలక పాత్ర. అసలు వారసులు, నకిలీల మధ్య తగవు పెట్టింది అస్మదీయులైతే.. ఈ వివాదాన్ని సెటిల్మెంట్ చేస్తానంటూ ఈయనగారు రూ. పది కోట్లు డిమాండ్ చేశారట. దీనికి అసలు వారసులు ససేమిరా అనడంతోనే కేసులతో వేధిస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. ♦ హిందుజా పవర్‌ప్లాంట్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఒక్కో నిరుద్యోగి నుంచి కనీసం రూ.3 లక్షలు వసూలు చేశాడు. ఇప్పటివరకు ఈ వ్యవహారంలో సుమారు వందమంది నుంచి రూ.3 కోట్లు వరకు కొల్లగొట్టాడు. ♦వేపగుంట, పెందుర్తి బీఆర్టీఎస్ రహదారిలో భవనాలు కోల్పోయిన వారికి టీడీఆర్ రూపంలో నష్టపరిహారం చెల్లించారు. ఇందులో దాదాపు 300 టీడీఆర్‌లు ఇప్పించినందుకు సన్నాఫ్ టీడీపీ నేత రూ.5 కోట్లు కొట్టేశారు. ♦ ఆర్ఈసీఎస్లో ఉద్యోగాల పేరిట రూ.3 కోట్లు వసూల్ చేశారు. తీరా.. వ్యవహారం కోర్టుకు వెళ్లడంతో ఉద్యోగాలూ రాలేదు.. ఈయన తీసుకున్న డబ్బులూ వెనక్కి రాలేదు. ♦ నియోజకవర్గంలో ఏ అపార్ట్మెంట్ నిర్మాణం తలపెట్టినా ఈయనకు గుడ్‌విల్ అందాల్సిందే. లేదంటే అనుమతులు ఆగిపోతాయి. అధికారులు కొర్రీలు వేస్తారు. అందుకే.. అక్కడ ఏ నిర్మాణం చేపట్టినా ఈయన గారి వాటా ముందుగా సమర్పించేస్తారు. అలా.. ఇప్పటివరకు రూ.ఆరేడు కోట్ల మేర ఈయన ఖాతాలో చేరిపోరాయట. పెందుర్తి, పరవాడ, సబ్బవరం రెవెన్యూ విభాగాల్లోని అక్రమార్కులు ఈయనకు వంతపాడుతూ.. వాటాలు ఇస్తుంటారు. అవసరమైతే రెవెన్యూ రికార్డులు కూడా మార్చేస్తూ స్వామిభక్తి ప్రదర్శిస్తుంటారు. అందుకే కొంతమంది రెవెన్యూ అధికారులకు ఏళ్లు దాటినా బదలీల ఊసే ఉండదు. ఇక అధికారం ఎవరి వైపు ఉంటే వారి అడుగులకు మడుగులొత్తే ఖాకీలు సహజంగానే ఇతనికి దాసోహమైపోయారు. ఇలా అడ్డు అదుపు లేకుండా సాగిపోతున్న పచ్చ పుత్రుని ఆగడాలకు పరకాష్ట ఏమిటంటే... అసాంఘిక కార్యకలాపాలకు తన గెస్ట్‌హౌస్‌ను వేదిక చేయడం. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల నిర్వహణ పేరిట సుజాతనగర్లో ఇటీవల ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకున్నారు. అయితే ఆ ఫ్లాట్ పార్టీ కార్యక్రమాల కంటే విలాస ‘పార్టీ’లకే వేదికగా మారిందని టీడీపీ శ్రేణులే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నాయి. -
జాతర ముసుగులో జబర్దస్త్ వసూళ్లు..?
చందాల కోసం అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు బెంబేలెత్తుతున్న కుప్పం వ్యాపారులు, వైద్యులు తిరుపతి : అమ్మవారి జాతర పేరిట విరాళాల దందా మొదలైంది. జాతర నిర్వహణకు భారీగా చందాలివ్వాలంటూ పలువురు టీడీపీ నేతలు ఒత్తిళ్లు తెస్తున్నారు. చందాలు ఇచ్చేందుకు నిరాకరించే వారిని పరోక్షంగా బెదిరిస్తున్నారు. దీంతో సామాన్య ప్రజలతో పాటు వ్యాపారులు, పేరున్న వైద్యులు బెంబేలెత్తి పోతున్నారు. సీఎం చంద్రబాబునాయుడు ప్రాతినిథ్యం వహిస్తోన్న కుప్పం పట్టణంలో ఈ పరిస్థితి నెలకొంది. కుప్పంలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతరను ఏటా భక్తులు సంప్రదాయ బద్దంగా జరుపుతుంటారు. ఈ సారి కూడా ఈ నెల 24, 25 తేదీల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల నిర్వహణకు ఆలయ కమిటీతో పాటు ప్రత్యేకంగా సబ్ కమిటీలు, ఉత్సవ కమిటీలు కూడా ఏర్పడ్డాయి. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి లక్షల్లో భక్తులు హాజరయ్యే వీలున్నందున భారీ ఎత్తున జాతర జరపాలని పెద్దలు నిర్ణయించారు. ప్రధానంగా ఉత్సవాల నిర్వహణ బాధ్యతల్లో ఉన్న కొందరు టీడీపీ నేతలు ఇందుకోసం చందాలు వసూళ్లు చేస్తున్నారు. సాధారణంగా అమ్మవారిపై భక్తి భావం ఉన్న వారంతా ఏటా తమకు తోచినంత విరాళాలను జాతర టకోసం ఇస్తుంటారు. అయితే ఈ ఏడాది మాత్రం చందాల దందా కనిపిస్తోందని సమాచారం. వేలు...లక్షల కోసం ఒత్తిళ్లు... ఉత్సవాలకు విరాళాలివ్వడం భక్తుల మనోభీష్టానికి సంబంధించిన అంశం. తమకున్న ఆర్థిక స్తోమతను బట్టి భక్తులు, వ్యాపారులు చందాలిస్తుంటారు. అయితే జాతర ముసుగులో బలవంతపు వసూళ్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. గంగమ్మ దేవస్థానం ఉన్న నేతాజీ రోడ్డులో వ్యాపారాలు నిర్వహించే షాపుల యజమానులందరూ రూ.5 నుంచి రూ.25 వేల వరకూ చందాగా ఇవ్వాలని నిర్ణయించినట్లు కొందరు పెద్దలు నిర్ణయించినట్లు తెల్సింది. ఉత్సావాల నిర్వహణ కోసం ఓ క్వారీ యజమానిని రూ.5 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. పట్టణంలో పేరున్న వైద్యులు కూడా లక్షల్లో చందాలివ్వాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిన్నచిన్న వ్యాపారులు సైతం పెద్ద మొత్తంలో చందాలు ఇవ్వాలంటూ ఒత్తిళ్లు తేవడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఒత్తిళ్లు, వసూళ్లు సమంజసం కాదని భావించిన పలువురు పట్టణ పెద్దలు, ప్రజాసంఘ నాయకులు ఈ నెల 20 లోగా టీడీపీ జిల్లాస్థాయి నేతలను కలిసి పరిస్థితిని వివరించేందుకు సమాయత్తమవుతున్నారని తెల్సింది. -
ప్రతి సేవకూ ఓ రేటు
కడియం : తాను చేయాల్సిన పనులకు సైతం ఓ రేటు పెట్టి వసూలు చేస్తున్నాడో పంచాయతీ డివిజన్‌స్థాయి అధికారి. తాను విధులు నిర్వహించేదే డబ్బుకోసమన్న రీతిలో వ్యవహరిస్తున్న ఆయన తీరుకు రాజమహేంద్రవరం డివిజన్లో పలువురు పంచాయతీ సిబ్బంది బెంబేలెత్తిపోతున్నారు. ఆయన నుంచి ఫోనొస్తే సిబ్బంది జేబులు తడుముకోవాల్సి వస్తోంది. ఉదయం టిఫిన్ మొదలుకుని సాయంత్రం డిన్నర్ వరకు పంచాయతీల్లోనే కానిచ్చేస్తున్న ఆ అధికారి గురించి ఆ శాఖలోనే పలువురు చెప్పుకుంటున్నారు. ఈయన వచ్చిన ఆర్నెల్లలో పరిశీలించిన పంచాయతీల్లో ఏవైనా అవకతవకలు గుర్తించారా? అంటే ఏమీ లేదు. ఆర్థిక సంఘం నిధులను నిర్దేశించిన నిబంధనల మేరకే ఖర్చు చేయాలని, కానీ పలు పంచాయతీల్లో విద్యుత్ పరికరాల కొనుగోళ్లకు వీటిని వినియోగించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆ అధికారి పరిశీలనలో ఇటువంటి అంశాలేవీ బయటపడకపోవడంతో ఆయన ‘పరిశీలన’ వెనకున్న పరమార్ధం అర్ధం చేసుకోవచ్చు. అధికారి దందాలో మచ్చుకు కొన్ని.. రాజమహేంద్రవరంలో తాను అద్దెకుంటున్న ఇంటికి ఏసీ ఏర్పాటు చేయాలని ఆలమూరు మండలంలోని పంచాయతీలను ఆయన ఆదేశించారు. దాంతో పంచాయతీకి రూ. 2వేలు చొప్పున వసూలు చేసి రూ. 30వేలను సిబ్బంది ఆయనకు ముట్టచెప్పారు. సాధారణంగా చిన్న పంచాయతీలను డివిజన్ స్థాయి అధికారులు పరిశీలించడం అరుదు. కానీ రికార్డుల తనిఖీల పేరుతో ఈయన వచ్చి చిన్నా పెద్దా తేడా లేకుండా పంచాయతీకి రూ. 10వేలు చొప్పున వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన రావడమంటూ జరిగే అసలు తాంబూలానికి ముందే రూ. 2వేలు డీజిల్ ఖర్చులు వసూలు చేస్తారట. ఆయనకు నచ్చితే విలువైన వీధిదీపాలను తీసుకుపోతారట. కడియం మండలంలోని ఒక మేజర్ పంచాయతీ నుంచి ఖరీదైన ఎల్ఈడీ లైటు, నియోన్లైట్తో సహా దాదాపు రూ. పదివేల విలువైన వస్తువులను ఆ ఆఫీసరు వారి కారులోకి, అక్కడి నుంచి ఇంటికి తరలించారట. ఇంటినుంచి బయలుదేరిన ఆయన టిఫిన్ ఒక పంచాయతీలోను, మధ్యాహ్న భోజనం మరోచోట, సాయంత్రం స్నాక్స్ ఇంకోచోట చేసే విధంగా పకడ్బందీ ప్లాన్‌తో ఉంటారని తెలుస్తోంది. ఆయన సాయంత్రం టీతోపాటు స్నాక్స్‌లో తప్పని సరిగా వేడివేడి బజ్జీలు ఉండాల్సిందేనట. లేకపోతే అడిగి మరీ తెప్పించుకుంటారని సిబ్బంది చెప్పుకుంటున్నారు. కొబ్బరి మొక్కలంటే ఆయనకు మహాప్రీతి. కడియం మండలంలో నర్సరీలను చూసేందుకొచ్చిన ఆయన ఎంపిక చేసిన రకం కొబ్బరి మొక్కలను పంపించేసరికి ఇక్కడి క్షేత్రస్థాయి సిబ్బందికి తలప్రాణం తోకకొస్తోందట. జిల్లాస్థాయి ఇన్చార్జి అయిపోదామని ప్రయత్నించిన ఆయనకు ఆ యోగం త్రుటిలో తప్పిపోయిందని సిబ్బంది చెబుతున్నారు. ఒకవేళ అయ్యుంటే తమ పరిస్థితి ఇంకెలా ఉండేదోనని అనుకుంటున్నారు. -
బోర్ల పేరిట ఘరానా మోసం
* కరీంనగర్, వరంగల్, మెదక్ జిల్లాల్లో దందా * ముఠాలో నలుగురి అరెస్టు, ఐదుగురు పరారీ హుస్నాబాద్ రూరల్: రూ.33 వేలు చెల్లిస్తే బోరువేసి మోటారు ఉచితంగా ఇస్తామని నమ్మబలికిన ఓ ముఠా మూడు జిల్లాల్లో 250 మంది రైతుల వద్ద సుమారు రూ.75 లక్షలు దండుకుంది. చివరికి బోర్లు వేయకుండా తప్పించుకొని తిరుగుతున్న ముఠా సభ్యుల్లో కొందరిని కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వివరాలను హుస్నాబాద్ సీఐ దాసరి భూమయ్య శనివారం విలేకరులకు వివరించారు. కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్బాపూర్‌కు చెందిన అంబాల ప్రసాద్ ఆధ్వర్యంలో 9 మంది ముఠాగా ఏర్పడ్డారు. లైవ్ మినిస్టీయల్ జీవజలం స్కీమ్ పేరిట రైతులు రూ. 33 వేలు చెల్లిస్తే బోరు వేసి, మోటారు ఉచితంగా ఇస్తామంటూ ప్రచారం చేశారు. మెదక్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో కలిసి సుమారు 250 మంది రైతుల వద్ద రూ.75 లక్షలు మేర దండుకున్నారు. కొంతమంది రైతులకు బోర్లు వేసి అదనంగా రూ.3 వేలు వసూలు చేశారు. హుస్నాబాద్ మండలం గాంధీనగర్‌కు చెందిన మిట్టపెల్లి సంపత్, బోర్వెల్ ఏజెంట్ యూదగిరితోపాటు మిరుదొడ్డి మండలం అల్వాల్‌కు చెందిన 30 మంది రైతులు వీరిపై హుస్నాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు చిగురుమామిడి మండలం నవాబుపేటకు చెందిన బోయిని కుమార్ అలియాస్ ప్రసన్నకుమార్, హుస్నాబాద్‌కు చెందిన చిలుముల మాలాకి, జేరిపోతుల భరత్ అలియాస్ లడ్డు, హుస్నాబాద్ మండలం జనగామకు చెందిన కత్తుల మురళి అలియాస్ మోజెస్లను అదుపులోకి తీసుకున్నారు. ముఠాలోని ముఖ్యుడు అంబాల ప్రసాద్‌తోపాటు చిగురుమామిడి మండలం కొండాపూర్‌కు చెందిన శనిగరం శ్రీనివాస్, వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రానికి చెందిన కొలిమేర బాబు, హన్మకొండకు చెందిన తిరుపతి, సిరిసిల్లకు చెందిన ముక్కెర ప్రభాకర్ పరారీలో ఉన్నారని తెలిపారు.కాగా, లైవ్ మినిస్టీయల్ జీవజలం సంస్థకు చెందిన పాస్టర్లని చెబితే నమ్మానని రూ.2 కమీషన్‌కు బోర్వెల్ యంత్రాన్ని కిరాయికి తెచ్చి 101 బోర్లు వేశానని యాదగిరి చెప్పారు. -
గుట్టుగా గుట్కా దందా!
♦ సిద్దిపేటలో మాఫియా ఇక్కడి నుంచే ఇతర ప్రాంతాలకు సరఫరా ♦ సిద్దిపేట నుంచే ఇతర ప్రాంతాలకు సరుకు సరఫరా ♦ ఇటీవల చిన్నకోడూరు పోలీసులకు చిక్కిన లక్షల విలువైన ప్యాకెట్లు సిద్దిపేట.. గుట్కా మాఫియాకు కేంద్రమవుతోంది. మహారాష్ర్ట నుంచి సరుకు తీసుకొస్తున్న వ్యాపారులు ఇక్కడి నుంచే దందా చేస్తున్నారు. పోలీసుల నిఘా కొరవడటంతో అక్రమ వ్యాపారం రూ.లక్షల్లో జరుగుతోంది. ఇటీవల చిన్నకోడూరు పోలీసులకు సుమారు రూ.10 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు పట్టుపడ్డాయంటే ఇక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. -సిద్దిపేట సిద్దిపేట: సిద్దిపేట కేంద్రంగా గుట్కా మాఫీయా గుట్టుగా సాగిపోతోంది. పోలీసుల తనిఖీలు అంతంతమాత్రంగా ఉండటంతో అక్రమ వ్యాపారం లక్షల్లో జరుగుతోంది. ఇటీవల చిన్నకోడూరు పోలీసులకు సుమారు రూ.10 లక్షల విలువైన గుట్కాప్యాకెట్లు పట్టుపడ్డాయంటే పట్టణంలో ఈ దందా ఏ మేర జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలోనే సిద్దిపేట పెద్ద వ్యాపార కేంద్రం కావడంతో ఇక్కడికి పట్టణంతో పాటు పరిసర మండలాలు, వరంగల్ పరిధిలోని చేర్యాల, బచ్చన్నపేట, కరీంగనర్ జిల్లా సిరిసిల్ల, ఇల్లంతకుంట, బెజ్జెంకి, ముస్తాబాద్ తదితర ప్రాంతాల నుంచి నిత్యం వ్యాపారులు ఇక్కడికి వస్తుంటారు. పాన్‌షాప్ సామగ్రి, జర్దా, పాన్‌మసాలాలు, సిగరెట్లు విక్రయించే హోల్‌సేల్ దుకాణాలు కూడా ఇక్కడ ఎక్కువగానే ఉన్నాయి. సంబంధిత వ్యాపారులు మహరాష్ట్ర నుంచి గుట్కా ప్యాకెట్లు కొనుగోలు చేసి ఇక్కడ నుంచే ఇతర ప్రాంతాలకు అమ్మకాలు జరుపుతున్నారు. ఈక్రమంలో గుట్కాలపై నిషేధం ఉండటంతో అధిక రేట్లకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా అక్రమంగా తరలిస్తున్న కొందరు ఇటీవల చిన్నకోడూరు పోలీసులకు పట్టుపడ్డారు. యథేచ్ఛగా అమ్మకాలు ఇతర జిల్లాలకు పెద్ద ఎత్తున గుట్కా ప్యాకెట్లు తరలించడమే కాకుండా వ్యాపారులు స్థానిక దుకాణాల్లో వీటిని విక్రయిస్తున్నారు. నిషేధాన్ని ఆసరా చేసుకుని రెండితలు ధరలు చేసి అమ్ముతున్నారు. అధికారుల నిఘా లేకపోవడం వీరికి బాగా కలిసి వచ్చిన అంశం. ఈ విషయమై వన్‌టౌన్ సీఐ సురేందర్‌రెడ్డిని సంప్రదించగా.. తనిఖీలు ముమ్మరం చేస్తున్నామన్నారు. అక్రమంగా గుట్కా వ్యాపారం చేసేవారిపై కఠిన చర ్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
విజయ డెయిరీలో గ‘లీజు’ దందా!
సాక్షి, హైదరాబాద్: విజయ డెయిరీని వీధిలో నిలబెట్టేశారు. సంస్థను అడ్డుపెట్టుకొని ఎవరికివారు అందినకాడికి దోచుకుంటున్నారు. ఉన్నతాధికారులు కూడా అక్రమార్కులతో కుమ్మక్కై చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. రైతులకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకం సొమ్ము పక్కదారి పట్టిన వైనం బయటపడి వారం గడవకముందే... విజయ డెయిరీలో మరో అక్రమం బయటపడింది. రాష్ట్రంలోని విజయ డెయిరీ పార్లర్లలో ఎక్కువ భాగం ఒకే వ్యక్తికి కట్టబెట్టడం విమర్శలకు తావిస్తోంది. కొందరు అధికారులు అతనికే టెండర్లు దక్కేలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా డెయిరీ పార్లర్ల దుకాణాలకు టెండర్లు దాఖలుకాగా.. ఆ వ్యక్తికే వచ్చేలా ఏర్పాట్లు జరిగాయని ప్రచారం జరుగుతోంది. సబ్‌లీజులతో.. లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో పాల ఉత్పత్తులను రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. రైల్వే స్టేషన్లలోని దుకాణాల్లో కొన్నింటిని తక్కువ లీజు ధరకే పాలు, పాల పదార్థాల విక్రయాల కోసం కేటాయించారు. ఈ మేరకు రాష్ట్రంలోని ఏడు రైల్వే స్టేషన్లలో విజయ డెయిరీకి తక్కువ లీజుతో దుకాణాలు దక్కాయి. వీటితోపాటు రాష్ట్రంలోని పలు నగరాలు, పట్టణాల్లో విజయ డెయిరీ పార్లర్లను టెండర్ల ద్వారా వ్యాపారులకు కేటాయిస్తున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 విజయ డెయిరీ పార్లర్లు వెలిశాయి. అయితే మొత్తం డెయిరీ పార్లర్లలో దాదాపు 90 శాతం ఐదారేళ్లుగా ఒకే వ్యక్తి చేతుల్లో ఉన్నాయి. కొన్ని నేరుగా, మరికొన్ని బినామీ పేరు మీద తీసుకొని వాటిని సబ్ లీజులకు ఇచ్చి నడిపిస్తున్నాడు. దీనిపై విమర్శలు రావడంతో చిన్నాచితక పార్లర్లను పక్కనపెట్టి ప్రస్తుతం 20 పెద్ద దుకాణాలను తన చేతుల్లో ఉంచుకున్నాడు. రైల్వే స్టేషన్లలోని ఏడు దుకాణాలూ అతని చేతుల్లోనే ఉన్నాయి. దోపిడీ ఇలా.. సదరు వ్యక్తి డెయిరీ పార్లర్ల దుకాణాలను సబ్ లీజుకు ఇచ్చి లక్షలకు లక్షలు వసూలు చేసుకుంటున్నాడు. ఉదాహరణకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఒకటో నంబర్ ఫ్లాట్‌ఫాం వద్ద ఉన్న పార్లర్‌కు రైల్వే శాఖ నిర్ణయించిన నెల వారీ అద్దె రూ. 22,500. కానీ సదరు వ్యక్తి సబ్ లీజుదారు నుంచి నెలకు రూ. 3.30 లక్షలు వసూలు చేస్తున్నారని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డికి అందిన ఫిర్యాదులో తేలింది. అంటే రోజుకు రూ. 11 వేలు వసూలు చేస్తున్నారు. ఫ్లాట్‌ఫాం నంబర్ 10లో ఉన్న పార్లర్‌కు రైల్వే శాఖ నిర్ణయించిన నెలవారీ అద్దె రూ. 18,500 కాగా.. రూ. 1.35 లక్షలు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఇక వరంగల్ రైల్వేస్టేషన్‌లోని పార్లర్‌కు రైల్వే శాఖ అద్దె నెలకు రూ. 7,600 కాగా.. సబ్‌లీజుదారుల నుంచి రూ. 34,980, నాంపల్లి రైల్వేస్టేషన్‌లోని పార్లర్ అద్దె నెలకు రూ. 8,500 కాగా.. రూ. 75 వేలు వసూలు చేస్తున్నాడు. ఇలా సబ్‌లీజుల ద్వారా రూ. కోట్లు కాజేస్తున్నాడు. ఇక పార్లర్ల ద్వారా వచ్చే ఆదాయం సరేసరి. అయితే లీజు సొమ్ములో కొంత భాగం విజయ డెయిరీకి ఇవ్వాలన్న నిబంధనను కూడా తుంగలో తొక్కారు. అధికారులు కూడా అతనికి మినహాయింపు ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ అక్రమాలతో విజయ డెయిరీ రూ. 4 కోట్ల వరకు కోల్పోయినట్లు అంచనా. టెండర్ల నిలిపివేత ఈ వ్యవహారంపై ఫిర్యాదులు అందడంతో రైల్వేస్టేషన్లలోని డెయిరీ పార్లర్లకు దాఖలైన టెండర్లను మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తాత్కాలికంగా నిలిపేశారు. దీనిపై సమగ్రమైన నివేదిక ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. వాటిని ప్రభుత్వమే నిర్వహిస్తుందని స్పష్టం చేసినట్లు సమాచారం. ఇటీవల పశు సంవర్థక శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న సురేష్ చందా, ఎండీగా బాధ్యతలు తీసుకున్న నిర్మల విచారణ చేస్తున్నట్లు తెలిసింది.