గ్రానైట్‌ మాఫియా గుప్పిట్లో గుట్టలు! | Dunes Handed In Granite Mafia In Velgaturu | Sakshi
Sakshi News home page

గ్రానైట్‌ మాఫియా గుప్పిట్లో గుట్టలు!

Published Mon, Jun 18 2018 12:36 PM | Last Updated on Mon, Sep 17 2018 5:10 PM

Dunes  Handed In Granite Mafia In Velgaturu - Sakshi

ధ్వంసమైన గుట్ట 

సాక్షి, వెల్గటూరు(ధర్మపురి) :  పశుపక్షాదుల కిలకిల రావాలతో దశాబ్దం క్రితం వరకు వెల్గటూరు పరిసరాలు సుందరంగా కళకళలాడే గుట్టలు విచ్చలవిడిగా వెలసిన క్వారీలు, క్రషర్ల మూలంగా ప్రస్తుతం ధ్వంసం అవుతున్నాయి. ఎక్కడ చూసినా దుమ్ము ధూళితో శ్మశాన వాతావరణాన్ని తలపిస్తోంది. పర్యావరణ పరిరక్షించే గుట్టలు గ్రానైట్‌ మాఫియా గుప్పిట్లోకి వెళ్లాయి. అధికారుల అండదండలతో కరిగిపోతున్నాయి. గుట్టల విధ్వంసంతో వన్యప్రాణులు ఆవాసం కోల్పోయి జనారణ్యంలోకి వస్తున్నాయి. పశువులకు మేత కరువై రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఏర్పాడుతున్నా యి. సాగుభూములు బీళ్లుగా మారుతున్నాయి.  


పది గ్రామాల్లో తగ్గిన పశుసంపద 

వెల్గటూర్‌ మండల పరిధిలో ఏర్పాటయిన క్వారీ లు క్రషర్‌ల వల్ల వెల్గటూరు, కుమ్మరిపల్లి, జగదేవుపేట, కొండాపూర్, అంబారిపేట, శాఖాపూర్, కప్పారావుపేట, రాజక్కపల్లి, కిషన్‌రావుపేట, సంకెనపెల్లి గ్రామాల్లో పాడిపశువుల సంఖ్య పూర్తిగా తగ్గిపోతోంది. పశువుల మేతకు ఉపయోగపడే గుట్టలన్ని స్టోన్‌క్వారీలుగా మారాయి. దీం తో పచ్చదనాన్ని కోల్పోయినాయి. బాంబుల మో తకు చిన్న జీవరాశి కూడా కనిపించకుండా పోయి ంది. పర్యావరణ పరిరక్షణ çఅనేది మచ్చుకైనా లేకుండా పోతోంది. ఫలితంగా పెద్దవాగు చుక్క నీరు లేకుండా ఎండిపోయింది. పాడి పశువులకు మేత కరువై రైతులు చేసేదేమి లేక కబేలాకు తెగనమ్ముతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కొన్నాళ్లకు పాడి పశువులను జూలో చూడాల్సి వస్తుందేమోనని మేధావులు అభిప్రాయపడుతున్నారు. 


బసంత్‌నగర్‌ టు వెల్గటూరు
గ్రానైట్‌ మాఫియా బసంత్‌నగర్‌ నుంచి వెల్గటూరుకు చేరుకుంది. ఒకప్పుడు స్టోన్‌ క్వారీలకు క్రషర్లకు బసంత్‌నగర్‌ బోడగుట్టలు నిలయంగా ఉండేవి. పదేళ్లుగా ఆ స్థానాన్ని వెల్గటూరు ఆక్రమించుకుంది. అక్కడి అధికారులు ప్రజాప్రతినిధుల ఒత్తిడి మూలంగా గ్రానైట్‌ వ్యాపారులంతా ఇక్కడికి చేరుకున్నారు. వీరికి తోడుగా బడా రాజకీయ నాయకులు సైతం క్వారీలను తీసుకుని అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటూ పర్యావరణానికి గొడ్డలిపెట్టుగా మారారు.


వంద హెక్టార్లలో గుట్టలు హాంఫట్‌
రెవెన్యూ, పోలీసు, మైనింగ్‌ అధికారుల నిర్లక్ష్య ధో ర ణి వల్ల వందల హెక్టార్లలో వెలసిన గుట్టలు.. గ్రానైట్‌ మాఫియా చేతుల్లో పడి కరిగి పోతున్నా యి. వ్యవహారమంతా అక్రమంగా నడుస్తున్నా అ డిగేవారే లేరు. మైనింగ్‌ పొల్యూషన్‌ అధికారులు ఇటువైపు రానే రారు. వచ్చిన మామూళ్లు తీసుకు ని చడీచప్పుడు కాకుండా వెళ్లిపోతారనే ఆరోపణలున్నాయి. 
సామాన్యప్రజలను ఎవ్వరూ పట్టించుకోరూ.. మండల పరిధిలోని చుట్టూ పది గ్రామాల విస్తీర్ణంలో క్వారీలు క్రషర్లు వెలిశాయి. ఇవన్నీ వ్యవసాయ ఆధారిత గ్రామాలు. రైతులు, రైతు కూలీలు వ్యవసాయంపైనే ఆధారపడి బతుకు సాగిస్తారు. అలాంటి జీవితాల్లో గ్రానైట్‌ వ్యాపారులు గుట్టల ను ఆక్రమించారు. బాంబుల శబ్దం, దుమ్ము కాలుష్యం వల్ల ఆరోగ్యం, పంట పొలాలు నష్ట పోతాన్నామని రెవెన్యూ, మైనింగ్‌ అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పెద్దమొత్తంలో గ్రానైట్‌ దందా సాగుతున్నా గ్రామాలకు రూపాయికూడా ఆదాయం లేదని.. అలాంటప్పుడు మేము ఎందుకు ఇబ్బంది పడాలని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి పర్యావరణానికి గొడ్డలిపెట్టులా మారినా గ్రానైట్‌ దందాకు చెక్‌ పెట్టాలని బాధిత ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే గుట్టలను గ్రానైట్‌ పేరుతో లీజుకు ఇవ్వకుండా కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

పశు సంపదకు నిలయం
మా గ్రామం కుమ్మరిపల్లి పశుసంపదకు నిలయంగా ఉండేది. అలాంటిది గుట్టలన్నీ బడాబాబులు, అధికా రుల చలవతో గ్రానైట్‌ వ్యా పారులు వశం చేసుకున్నా రు. నానాటికి పశువుల సంఖ్య తగ్గుతోంది. దై వంగా భావించే ఆవు గ్రామంలో కనుమరుగవ డం దురదృష్టకరం.      – సాగర్, కుమ్మరిపల్లి 

పాడిరైతులను ఆదుకోవాలి 
నాది యాదవ కులం. మా కు బాగా తెలిసిన పని గొ ర్రెలు, మేకలను కాసుకుం టూ బతకటం. ఇప్పుడు గు ట్టలపై క్వారీలు వెలిశా యి. మేకలను, గొర్రెలను మేపుకుందామంటే జాగలేకుండా పోయింది. ఉన్న జీవరాసులన్నింటినీ అమ్ముకుని కూలీకి పోతున్నాం.     – మాచర్ల రాజేందర్, కిషన్‌రావుపేట
గ్రానైట్‌ క్వారీలను మూసేయాలి
గ్రానైట్‌ క్వారీలు క్రషర్‌ల వల్ల మాకు ఎలాంటి ఉపయోగం లేదు. రెండు దశాబ్దాలుగా ఇక్కడ గ్రానైట్‌ వ్యాపారం సాగుతోంది. దీ ంతో పర్యావరణం దె బ్బతినటంతో పాటు ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీలో జమ కాలేదు. విలువైన ఖనిజ సంపదను అక్రమార్కులు కొల్లగొట్టేసున్నా మైనింగ్‌ అధికారులు పట్టించు కోవడం లే దు. నిబంధలనకు విరుద్ధంగా  అక్రమంగా న డుస్తున్న వాటిని అధికారులు తక్షణమే మూసి వేయాలి.   
   – పత్తిపాక వెంకటేశ్, వెల్గటూరు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement