తెరపైకి ‘హమ్‌ అదానీ కె హై’.. మళ్లీ జేపీసీ డిమాండ్‌ | Gautam Adani Charged With Bribery Scheme, Congress Party Reacts On This And Comes With This Demand | Sakshi
Sakshi News home page

తెరపైకి ‘హమ్‌ అదానీ కె హై’.. మళ్లీ జేపీసీ డిమాండ్‌

Published Thu, Nov 21 2024 10:25 AM | Last Updated on Thu, Nov 21 2024 11:07 AM

Gautam Adani charged with bribery scheme Congress Comes With This Demand

ఢిల్లీ: అదానీ గ్రూప్‌ సంస్థ గౌతమ్‌ అదానీపై అమెరికాలో కేసు నమోదు కావడంపై కాంగ్రెస్‌ పార్టీ స్పందించింది. ఆయన వ్యవహారాలపై దర్యాప్తునకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను మరోసారి తెరపైకి తీసుకొచ్చింది.

లంచం, మోసం చేశారనే అభియోగాలపై అదానీతో పాటు మరో ఏడుగురిపై కేసులు నమోదు చేసినట్లు న్యూయార్క్‌ ఫెడరల్‌ ప్రాసిక్యూటర్లు వెల్లడించడం తెలిసిందే. ఈ ఆరోపణలతో స్టాక్‌మార్కెట్‌ సైతం కుదేలైంది. మరోపక్క.. రాజకీయంగానూ ఈ వ్యవహారం దుమారం రేపుతోంది.

‘మోదాని’  స్కామ్స్‌పై జేపీసీ ఏర్పాటు చేయాలని 2023 జనవరి నుంచి డిమాండ్‌ చేస్తున్నాం. అయితే.. ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీపై అమెరికాలో కేసు నమోదైన నేపథ్యంలో సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌కు బలం చేకూరుతోంది అని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జైరాం రమేష్‌ ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. అలాగే.. 

 

 ‘హమ్‌ అదానీ కె హై’ సిరీస్‌లో ఇప్పటివరకు వందలాది ప్రశ్నలు సంధించామని, మోదీ, అదానీ బంధంపై వేసిన ప్రశ్నలకు ఇంతవరకు సమాధానం రాలేదని జైరాం రమేష్‌ విమర్శ గుప్పించారు.

గతంలో.. అదానీ సంస్థ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని, ఖాతాల్లో మోసాలు చేస్తోందంటూ అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధనా సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ ఇచ్చిన నివేదిక మార్కెట్‌ వర్గాల్లో తీవ్ర దుమారానికి దారితీసింది. ఈ ఆరోపణలను అదానీ గ్రూప్‌ తీవ్రంగా ఖండించింది. అయినప్పటికీ ఈ మొత్తం వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ లేదంటే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్‌ సహా ప్రతిపక్షాలు ఆ సమయంలో పార్లమెంట్‌ సమావేశాల్లోనూ డిమాండ్‌ చేశాయి.

అదానీపై తాజా అభియోగాలివే..
ఇదిలా ఉంటే.. అదానీ, దాని అనుబంధ సంస్థలు 20 ఏళ్లలో 2 బిలియన్ డాలర్ల లాభం పొందగల సౌరశక్తి సరఫరా ఒప్పందాలను పొందేందుకు భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్‌ డాలర్లు లంచాలు చెల్లించినట్లు ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్నారు. ఆపై.. అమెరికా, అంతర్జాతీయ మదుపర్లకు తప్పుడు సమాచారం తెలియజేసి నిధులు సమీకరించేందుకు కంపెనీ ప్రయత్నించినట్లు వాళ్లు పేర్కొన్నారు.  అలాగే..

తద్వారా.. అదానీ గ్రీన్ ఎనర్జీలో అక్రమ మార్గాల ద్వారా.. ఆ కంపెనీ రుణ దాతలు, పెట్టుబడిదారుల నుంచి 3 బిలియన్‌ డాలర్లకు పైగా రుణాలు, బాండ్లను సేకరించిందని ఆరోపించారు.  న్యూయార్క్‌ ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు. దీంతో గౌతమ్‌ అదానీ, ఆయన బంధువు సాగర్‌ అదానీ సహా మరో ఏడుగురిపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇదే సమయంలో సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌(SEC) మరో సివిల్‌ కేసు నమోదు చేసింది. యూఎస్‌ సెక్యూరిటీ చట్టాలను ఉల్లంఘించి అదానీ గ్రీన్‌ ఎనర్జీ అమెరికా ఇన్వెస్టర్ల నుంచి 175 మిలియన్‌ డాలర్లకు పైగా సమీకరించిందని అందులో ఆరోపించింది. దీనిపై దర్యాప్తు జరిపి జరిమానాతో పాటు కంపెనీపై ఆంక్షలు విధించాలని రెగ్యులేటర్‌ కోరింది. ఈ వార్తలపై అదానీ గ్రూప్‌ స్పందించాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement