గత రెండు సార్వత్రి ఎన్నికల్లో 280 ఫ్లస్ సీట్లతో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోగలిగే స్థాయి నుంచి.. 2024 ఎన్నికల్లో 240 సీట్లకు పడిపోయి మిత్రపక్షాల మీద ఆధారపడే స్థాయికి చేరుకుంది బీజేపీ. అయితే కింగ్‌మేకర్లుగా తమ తమ రాష్ట్రాలకు కావాల్సింది సాధించుకోవడంలో ఇటు ఏపీ సీఎం చంద్రబాబు, అటు బీహార్ సీఎం నితీశ్‌కుమార్‌లు విఫలమవుతున్నారే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో..
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సచిన్ పైలట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, నితీశ్ కుమార్‌లు ఎన్డీయే కూటమికి ఎప్పుడు హ్యాండిస్తారో ఎవరూ ఊహించలేరని వ్యాఖ్యానించారు. సోమవారం ఇందిరాగాంధీ పంచాయితీ రాజ్‌భవన్‌లో లోక్‌స్వరాజ్ మంచ్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..
‘‘400 సీట్లు సాధిస్తామని ఒకప్పుడు ప్రగల్భాలు పలికిన వారు ఇప్పుడు 240 సీట్లకే పరిమితమయ్యారు(పరోక్షంగా మోదీని ఉద్దేశిస్తూ..). చంద్రబాబు ఎప్పుడు మనసు మార్చుకుంటారో తెలియదు. నితీశ్ కుమార్ ఎప్పుడు తన మద్దతు వెనక్కి తీసుకుంటారో తెలియదు. ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతమని భావించకూడదు..
.. సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మంచీచెడులు ఉంటాయి. కీర్తి అనేది తాత్కాలికం. అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజల పక్షాన నిలిచిన వారే, ప్రజల హృదయాలలో స్థానం సంపాదించుకుని శాశ్వతంగా గుర్తుండిపోతారు అని అన్నారాయన. అలాగే ఇండియా కూటమి మధ్య బీటల అంశంపై ప్రస్తావిస్తూ.. లోక్‌సభ ఎన్నికలు ఇంకా నాలుగేళ్ల దూరంలో ఉన్నాయని, ఈలోపు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటి పైకి వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్టీయే కూటమిలో బీజేపీ(240) తర్వాత టీడీపీ 16 స్థానాలు, జనతాదళ్ (యూ) 12, అతిపెద్ద పార్టీలుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment