Sachin Pilot
-
‘చంద్రబాబు ఎప్పుడు చెయ్యిస్తారో చెప్పలేం’
గత రెండు సార్వత్రి ఎన్నికల్లో 280 ఫ్లస్ సీట్లతో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోగలిగే స్థాయి నుంచి.. 2024 ఎన్నికల్లో 240 సీట్లకు పడిపోయి మిత్రపక్షాల మీద ఆధారపడే స్థాయికి చేరుకుంది బీజేపీ. అయితే కింగ్మేకర్లుగా తమ తమ రాష్ట్రాలకు కావాల్సింది సాధించుకోవడంలో ఇటు ఏపీ సీఎం చంద్రబాబు, అటు బీహార్ సీఎం నితీశ్‌కుమార్‌లు విఫలమవుతున్నారే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో.. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సచిన్ పైలట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, నితీశ్ కుమార్‌లు ఎన్డీయే కూటమికి ఎప్పుడు హ్యాండిస్తారో ఎవరూ ఊహించలేరని వ్యాఖ్యానించారు. సోమవారం ఇందిరాగాంధీ పంచాయితీ రాజ్‌భవన్‌లో లోక్స్వరాజ్ మంచ్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..‘‘400 సీట్లు సాధిస్తామని ఒకప్పుడు ప్రగల్భాలు పలికిన వారు ఇప్పుడు 240 సీట్లకే పరిమితమయ్యారు(పరోక్షంగా మోదీని ఉద్దేశిస్తూ..). చంద్రబాబు ఎప్పుడు మనసు మార్చుకుంటారో తెలియదు. నితీశ్ కుమార్ ఎప్పుడు తన మద్దతు వెనక్కి తీసుకుంటారో తెలియదు. ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతమని భావించకూడదు.. .. సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మంచీచెడులు ఉంటాయి. కీర్తి అనేది తాత్కాలికం. అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజల పక్షాన నిలిచిన వారే, ప్రజల హృదయాలలో స్థానం సంపాదించుకుని శాశ్వతంగా గుర్తుండిపోతారు అని అన్నారాయన. అలాగే ఇండియా కూటమి మధ్య బీటల అంశంపై ప్రస్తావిస్తూ.. లోక్‌సభ ఎన్నికలు ఇంకా నాలుగేళ్ల దూరంలో ఉన్నాయని, ఈలోపు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటి పైకి వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్టీయే కూటమిలో బీజేపీ(240) తర్వాత టీడీపీ 16 స్థానాలు, జనతాదళ్ (యూ) 12, అతిపెద్ద పార్టీలుగా ఉన్నాయి. -
Lok sabha elections 2024: ‘రాజ’సం ఎవరిదో...!
రాజస్థాన్‌లో రాజకీయ పోరు దశాబ్దాలుగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యే కొనసాగుతోంది. రాష్ట్రంలో అధికారమూ ఈ రెండు పార్టీల మధ్యే మారుతూ వస్తోంది. కమలనాథులు హిందుత్వ, ఆర్థికాభివృద్ధిపైనే ఫోకస్ చేస్తుండగా సంక్షేమ హామీలు, మోదీ ప్రభుత్వంపై వ్యతిరేకతను కాంగ్రెస్ నమ్ముకుంటోంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో కాంగ్రెస్ నుంచి అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీ రెట్టింపు ఉత్సాహంతో లోక్‌సభ బరిలోకి దిగుతోంది. గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి కూడా రాష్ట్రంలో క్లీన్‌స్వీప్ చేసి హ్యాట్రిక్ కొట్టాలని పట్టుదలగా ఉంది. ఎంపీ ఎన్నికల్లో పుంజుకుని ఎలాగైనా సత్తా చాటే ప్రయత్నాల్లో కాంగ్రెస్ తలమునకలుగా ఉంది... పటిష్టమైన సంస్థాగత నిర్మాణం, హిందుత్వ సిద్ధాంత దన్నుతో రాజస్థాన్ బీజేపీ బలమైన పునాదులు వేసుకుంది. తొలుత భైరాన్‌సింగ్ షెకావత్, అనంతరం వసుంధరా రాజె సింధియా వంటివారి నాయకత్వమూ పారీ్టకి కలిసొచి్చంది. పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి బాగా పట్టుంది. కాంగ్రెస్ కూడా రాష్ట్రంలో బలమైన శక్తిగా కొనసాగుతోంది. అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్ వంటి నాయకుల సారథ్యానికి తోడు గ్రామీణ ఓటర్ల మద్దతు పారీ్టకి పుష్కలంగా ఉంది. ఈ ఎడారి రాష్ట్రంలో 25 లోక్‌సభ సీట్లున్నాయి. 4 ఎస్సీలకు, 3 ఎస్టీలకు కేటాయించారు. బీజేపీకి బేనీవాల్ బెంగ! 2014 లోక్‌సభ ఎన్ని కల్లో మొత్తం 25 సీట్లనూ ఎగరేసుకుపోయిన బీజేపీ 2019లో సైతం క్లీన్‌స్వీప్ చేసింది. 24 సీట్లను బీజేపీ, మిగతా ఒక్క స్థానాన్ని ఎన్డీఏ మిత్రపక్షం రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ (ఆర్ఎల్పీ) గెలుచుకున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీజేపీ చతికిలపడింది. గత డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను మట్టికరిపించి తిరిగి అధికారాన్ని దక్కించుకుంది. అదే ఊపులో లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా మూడోసారి క్లీన్‌స్వీప్ చేయాలని తహతహలాడుతోంది. అందుకు తగ్గట్టే ప్రచారాన్ని మోదీ పీక్స్‌కు తీసుకెళ్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సభలతో హోరెత్తిస్తున్నారు. కాంగ్రెస్ అంటేనే వారసత్వ రాజకీయాలు, అవినీతికి పెట్టింది పేరంటూ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అయోధ్య రామమందిర నిర్మాణం బీజేపీకి ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. మోదీ ఫ్యాక్టర్, అభివృద్ధి నినాదాలనూ ప్రజల్లోకి తీసుకెళ్తోంది. అయితే గత ఎన్నికల్లో మిత్రపక్షంగా ఉన్న హనుమాన్ బేనీవాల్ సారథ్యంలోని ఆర్ఎల్పీ ఈసారి కాంగ్రెస్‌తో జతకట్టడం కమలం పార్టీకి కాస్త ప్రతికూలాంశమే. జాట్ నేత అయిన బేనీవాల్‌కు ఉన్న ఆదరణ షెకావతీ, మార్వార్ ప్రాంతాల్లో బీజేపీ అవకాశాలను ప్రభావితం చేయవచ్చంటున్నారు. పార్టీ తరఫున కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్ (జోధ్‌పూర్), అర్జున్ రామ్ మేఘ్వాల్ (బికనేర్), లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా (కోట) వంటి హేమాహేమీలు పోటీ చేస్తున్నారు. నలుగురు సిట్టింగులకు బీజేపీ మొండిచేయి చూపడంతో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. దీనికి తోడు కాంగ్రెస్ నుంచి జంప్ చేసిన ఇద్దరు నేతలకు తొలి జాబితాలోనే చోటు దక్కింది. వీరిలో బలమైన గిరిజన నేతగా పేరున్న మహేంద్రజీత్‌సింగ్ మాలవీయ ఉన్నారు. పారాలింపిక్స్‌లో పసిడి సాధించిన పద్మభూషణ్ అవార్డు గ్రహీత దేవేంద్ర ఝజారియాకు బీజేపీ అనూహ్యంగా చురు టికెటిచ్చింది. వసుంధరా రాజె కుమారుడు దుష్యంత్ సింగ్ ఝలావర్–బరన్ నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌లో అదే వర్గ పోరు ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్‌కు సార్వత్రిక సమరంలో నెగ్గుకురావడం సవాలే. మాజీ సీఎం అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్ మధ్య వర్గ పోరు మళ్లీ రాజుకుంటుండటం తలనొప్పిగా మారుతోంది. ఎన్నికల్లో గహ్లోత్ ఓటమి నేపథ్యంలో రాష్ట్ర పారీ్టపై పూర్తిగా పట్టు బిగించే వ్యూహాల్లో పైలట్ వర్గం ఉంది. జాలోర్ నుంచి గహ్లోత్ కుమారుడు వైభవ్ బరిలో ఉన్నారు. మ్యానిఫెస్టోలో ప్రకటించిన ఆరు న్యాయాలు, 25 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది. కుల గణన, రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) చట్టబద్ధత హామీల ద్వారా పేదలు, మధ్య తరగతి వర్గాలు, కారి్మకులు, రైతుల పక్షాన పోరాటం చేస్తున్నామని రాహుల్ చెబుతున్నారు. ఆర్ఎల్పీ ఈసారి ఇండియా కూటమిలోకి రావడం కాంగ్రెస్‌కు ఊరటనిచ్చే అంశం. జాట్లలో బాగా ఆదరణ ఉన్న బెనీవాల్ ప్రభావం షెకావతీ, మార్వార్ ప్రాంతాల్లో... ముఖ్యంగా నాగౌర్, సికర్, ఛురు, జుంఝును వంటి లోక్‌సభ స్థానాల్లో కలిసొస్తుందని పార్టీ ఆశలు పెట్టుకుంది. కుల సమీకరణాలు కీలకం రాజస్థాన్ రాజకీయాల్లో కులాలది కీలక పాత్ర. ప్రధానంగా జాట్లు, రాజ్‌పుత్‌లు, మీనాలు, గుజ్జర్లు అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపుతున్నారు. 10% జనాభా ఉన్న జాట్ వర్గానికి మార్వార్, షెకావతీ ప్రాంతాల్లో గట్టి పట్టుంది. రాష్ట్ర జనాభాలో రాజ్‌పుత్‌ల వాటా 6–8%. రాజ కుటుంబీకులైన వసుంధరా రాజె, భైరాన్ సింగ్ షెకావత్ సీఎం పదవి చేపట్టినవారే. జాట్లు అప్పుడప్పుడూ ఊగిసలాడినా రాజ్‌పుత్‌ల మద్దతు కమలనాథులకు దండిగా ఉంటుందని గత ఎన్నికలు రుజువు చేస్తున్నాయి. 5 శాతమున్న గుజ్జర్లు గతంలో కాంగ్రెస్‌కు మద్దతిచ్చారు. వారిప్పుడు బీజేపీ వైపు మళ్లవచ్చంటున్నారు. రాష్ట్రంలో బ్రాహ్మణ సామాజికవర్గం 8% దాకా ఉంది. అగ్రవర్ణ పార్టీగా పేరొందిన బీజీపీ అనూహ్యంగా బ్రాహ్మణుడైన భజన్‌లాల్ శర్మను సీఎం చేసింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సీపీ జోషిదీ ఇదే సామాజికవర్గం. ఇక ఎస్టీ సామాజిక వర్గమైన మీనాలు జనాభాలో 5% ఉన్నారు. వీరికి తూర్పు రాజస్థాన్‌లో పట్టుంది. 18% ఉన్న ఎస్టీ సామాజిక వర్గంలోని ఉప కులాలు పరిస్థితులను బట్టి ఇరు పారీ్టలకూ మద్దతిస్తున్నారు. కాంగ్రెస్ కుల గణన హామీ ప్రభావం చూపవచ్చంటున్నారు. సర్వేలు ఏమంటున్నాయి... ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హిందీ బెల్ట్‌లో కీలకమైన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో ఘన విజయం సాధించడం ఆ పార్టీలో ఫుల్ జోష్ తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ క్వీన్‌స్వీప్ చేస్తుందని, కాంగ్రెస్‌కు వైట్‌వాష్ తప్పదని తాజా సర్వేలు చెబుతున్నాయి. రాజస్థాన్‌లో 25 సీట్లనూ తన ఖాతాలో వేసుకోవడం ద్వారా బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందనేది మెజారిటీ ఒపీనియన్ పోల్స్ అభిప్రాయం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పైలట్‌కు ‘ఛత్తీస్’ బాధ్యతలు
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ రాజస్తాన్ మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్‌కు పారీ్టలో కీలక పదవి అప్పగించింది. ఛత్తీస్‌గఢ్ ఇన్చార్జ్ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. సోనియా గాం«దీ, రాహుల్ గాంధీ సభ్యులుగా, మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో సీడబ్ల్యూసీ భేటీ జరిగిన రెండు రోజులకే ఇలా పలువురు ప్రధాన కార్యదర్శలు, ఇన్‌చార్జ్‌ల బాధ్యతలను మార్చడం గమనార్హం. ఢిల్లీ, హరియాణా ఇన్చార్జ్ బాధ్యతలను దీపక్ బబారియాకు అప్పగించారు. కూమారి సెల్జాను ఉత్తరాఖండ్ ఇన్చార్జ్ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. మాణిక్కం ఠాగూర్‌ను అండమాన్ అండ్ నికోబార్ వ్యవహారాల ఇంఛార్జ్‌గా నియమించారు. జార్ఖండ్ ప్రధాన కార్యదర్శి జీఏ మిర్‌కు పశ్చిమబెంగాల్ బాధ్యతలూ అప్పగించారు. జితేంద్ర సింగ్‌కు మధ్యప్రదేశ్ బాధ్యతలు కట్టబెట్టారు. మహారాష్ట్ర ఇన్చార్జ్గా రమేశ్ చెన్నితల, బిహార్ ఇన్చార్జ్గా మోహన్ ప్రకాశ్ నియమితులయ్యారు. మేఘాలయ, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్‌లకు ఇన్చార్జ్గా చెల్లకుమార్ ఎంపికయ్యారు. అజయ్ కుమార్‌కు తమిళనాడు, పుదుచ్చేరి అదనపు బాధ్యతలు ఇచ్చారు. జమ్మూకశ్మీర్ ఇన్చార్జ్గా భరత్సిన్హ్ సోలంకీ, హిమాచల్, చండీగఢ్ ఇన్చార్జ్గా రాజీవ్ శుక్లా, రాజస్తాన్ ఇన్చార్జ్గా సుఖ్జీందర్ సింగ్ రణ్‌ధావా, పంజాబ్ ఇన్చార్జ్గా దేవేందర్ యాదవ్, గోవా, డామన్, డయ్యూ, దాద్రానగర్, హవేలా ఇన్చార్జ్గా మాణిక్‌రావు థాకరేను నియమించారు. త్రిపుర, సిక్కిం, మణిపూర్, నాగాలాండ్‌లకు గిరీశ్ చోదంకర్ను ఇన్చార్జ్గా నియమించారు. తెలంగాణ ఇంఛార్జ్‌గా దీపా దాస్‌మున్షీ, ఏపీకి మాణిక్కం ఠాగూర్‌ను నియమించారు. ప్రియాంక చేజారిన యూపీ ఉత్తర్‌ప్రదేశ్ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాం«దీని తప్పించడం గమనార్హం. ప్రియాంక గాం«దీకి ప్రధాన కార్యదర్శి పదవి ఉన్నాసరే ఆమెకు ఎలాంటి పోర్ట్‌ఫోలియో కేటాయించలేదు. అవినాశ్ పాండేకు ఉత్తరప్రదేశ్ బాధ్యతలను కట్టబెట్టారు. అజయ్ మాకెన్ పార్టీ కోశాధికారిగా ఉంటారు. -
సచిన్ పైలట్‌పై గెహ్లాట్ ‘స్పై’..? బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
జైపూర్: ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత రాజస్థాన్ కేర్‌టేకర్ సీఎం అశోక్ గెహ్లాట్‌ను ఒక్కొక్కటిగా వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఓ వైపు కర్ణిసేన చీఫ్ సుఖ్‌దేవ్ హత్య కేసులో గెహ్లాట్‌పై బీజేపీ ఆరోపణలు చేస్తోంది.మరోవైపు గెహ్లాట్ దగ్గర ఐదేళ్లు ఓఎస్డీగా పనిచేసిన శర్మ కొత్త బాంబు పేల్చాడు. రాజస్థాన్ ప్రభుత్వం 2020లో సంక్షోభంలో పడినప్పుడు రాష్ట్రంలో మరో సీనియర్ నేత సచిన్‌పైలట్ ఫోన్ ట్యాప్ చేయడంతో పాటు ఆయన కదలికలపై గెహ్లాట్ నిఘా ఉంచారని చెప్పారు. తాజాగా ఓఎస్డీ శర్మ చేసిన ఈ ఆరోపణలపై బీజేపీ విచారణకు డిమాండ్ చేస్తోంది. ఇదే విషయమై ప్రస్తుతం రాజస్థాన్ సీఎం రేసులో ఉన్న దియాకుమారి స్పందించారు. ‘సచిన్ పైలట్‌పై నిఘా పెట్టడం, ఆయన ఫోన్ ట్యాప్ చేయడం వంటి ఆరోపణలు చాలా తీవ్రమైనవి.స్వయంగా సీఎం ఓఎస్డీ చెప్పాడంటే ఇందులో ఎంతో కొంత నిజం ఉంటుంది. ఇలా గూఢచర్యం చేయడం చట్ట విరుద్ధం’ అని దియాకుమారి వ్యాఖ్యానించారు. దియాకుమారి ఆరోపణలపై ఓఎస్డీ శర్మ స్పందించారు. సాధారణంగా రాజకీయ సంక్షోభాలు ఏర్పడినపుడు అందుకు కారణమైన వారిని ఫాలో చేస్తాం. వారు ఎవరెవరితో ఫోన్లు మాట్లాడుతున్నారో తెలుసుకుంటాం. సంక్షోభాన్ని నివారించేందుకు ఇలాంటివి సహజమే’అని శర్మ వ్యాఖ్యానించారు. ఇదీచదవండి..బీజేపీ సీఎంలు ఎవరో..? -
Rajasthan Election Result 2023: గహ్లోత్ మేజిక్కు తెర!
రాజస్తాన్‌లో ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఈసారి ‘మేజిక్’ చేయలేకపోయారు. మెజీíÙయన్ల కుటుంబం నుంచి వచి్చన ఆయన, ఈసారి కాంగ్రెస్‌ను మళ్లీ గెలిపించేందుకు శాయశక్తులా ప్రయతి్నంచారు. ఆ క్రమంలో సంక్షేమ, ప్రజాకర్షక పథకాలతో సహా అందుబాటులో ఉన్న ట్రిక్కులన్నీ ప్రయోగించినా లాభం లేకపోయింది. అధికార పార్టీని ప్రజ లు ఇంటికి సాగనంపే 30 ఏళ్ల ఆనవాయితీ అప్రతిహతంగా కొనసాగింది. దాంతో కాంగ్రెస్ పరా జయం చవిచూసింది. ‘‘సీఎం పదవిని వదిలేయా లని నాకు కొన్నిసార్లు అనిపిస్తుంటుంది. కానీ సీఎం పదవే నన్ను వదలడం లేదు’’ అని పదేపదే గొప్ప గా చెప్పుకున్న 72 ఏళ్ల గహ్లోత్ చివరికి ఓటమిని అంగీకరించి ఆ పదవిని వీడాల్సి వచ్చింది. ఏ పథకమూ ఆదుకోలేదు... గతేడాది కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలు గహ్లోత్ రాజకీయ జీవితానికి పెద్ద అగి్నపరీక్షగా మారాయి. సీఎంగిరీని విడిచి పార్టీ అధ్యక్ష పదవిని స్వీకరించాలన్న అధిష్టానం ఆదేశాలను ధిక్కరించడం ద్వారా పెను సాహసమే చేశారాయన. ఆ క్రమంలో సోనియా, రాహుల్‌గాంధీ ఆగ్రహానికి గురైనా వెనకాడలేదు. చివరికి అధిష్టానమే వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి కలి్పంచారు. ఈ దృష్ట్యా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఎలాగైనా గెలిపించకపోతే తన రాజకీయ జీవితమే ప్రమాదంలో పడుతుందని గ్రహించి దూకుడు ప్రదర్శించారు. అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్నీ వాడుకున్నారు. ఎన్నికలకు ఏడాది ముందునుంచే పుంఖానుపుంఖాలుగా పలు సంక్షేమ, ప్రజాకర్షక పథకాలకు తెర తీశారు. పేదలకు కారుచౌకగా వంట గ్యాస్ మొదలుకుని ప్రజలకు రూ.25 లక్షల ఆరోగ్య బీమా దాకా ఆయన ప్రవేశపెట్టిన పథకాలన్నింటికీ మంచి పేరే వచి్చంది. ఏం చేసినా చివరికి ప్రజల మనసును మార్చలేక, అధికార పార్టీని ఓడించే ‘ఆనవాయితీ’ని తప్పించలేక చతికిలపడ్డారు. దెబ్బ తీసిన విభేదాలు...? యువ నేత సచిన్ పైలట్‌తో విభేదాలు కూడా రాజస్థాన్‌లో కాంగ్రెస్ అవకాశాలను దెబ్బ తీశాయనే చెప్పాలి. ముఖ్యంగా 30కి పైగా అసెంబ్లీ స్థానాల్లో నిర్ణాయక శక్తిగా ఉన్న గుజ్జర్లు తమ వర్గానికి చెందిన పైలట్‌కు కాంగ్రెస్‌లో అన్యాయం జరుగుతోందన్న భావనకు వచ్చారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా కూడా పార్టీని దెబ్బ తీసిన అంశాల్లో ఒకటని పరిశీలకులు చెబుతున్నారు. ఎన్నికల వేళ గహ్లోత్‌కు పైలట్ నిజానికి పెద్దగా సహాయ నిరాకరణ చేయలేదు. పైపెచ్చు స్నేహ హస్తమే సాచారు. కానీ గహ్లోత్ మాత్రం తానేంటో అధిష్టానానికి నిరూపించుకోవాలన్న ప్రయత్నంలో పైలట్‌కు ప్రాధాన్యం దక్కకుండా చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించి కాంగ్రెస్‌ను విజయతీరాలకు చేర్చిన పైలట్‌ను అలా పక్కన పెట్టడం కూడా పార్టీకి చేటు చేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మార్పు కోసమే ప్రజలు ఓటేయబోతున్నారు: సచిన్ పైలట్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందిపరిచ్చిన గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేస్తామని రాజస్థాన్ ఎమ్మెల్యే, ఏఐసీసీ జాతీయ నాయకులు సచిన్ పైలట్ తెలిపారు. తెలంగాణ యువత కాంగ్రెస్‌కు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పారదర్శక పాలన అందిస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు ప్రజల్లో మంచి స్పందన ఉందని.. రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంకా గాంధీల పర్యటనలకు మంచి స్పందన వస్తుందని సచిన్ పైలట్ తెలిపారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఆకాంక్షలు నెరవేరలేదని, నిరుద్యోగం పెరిగి పోతుందని విమర్శించారు. ప్రజలు ప్రభుత్వ మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. భారత్ జోడోయాత్ర ద్వారా తెలంగాణలో రాహుల్ గాంధీ 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. ‘చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లతోపాటు పాటు తెలంగాణలోను కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. 30వ తేదీ జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేయాలి. కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. బీఆరెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. వారికి క్రెడిబిలిటి లేదు. ఉద్యోగాలు ఇవ్వలేదు.. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. కర్ణాటక విజయం తరువాత జరుగుతున్న తెలంగాణ ఎన్నికల్లో కూడా అలాంటి ఫలితమే వస్తుంది. ఓట్ ఫర్ చేంజ్.. మార్పు కోసమే ప్రజలు ఓటేయబోతున్నారు. రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బహుమతిగా ఇవ్వండి. రాజస్థాన్‌లో 5 సంవత్సరాలకోసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయం ఉంది. సంప్రదాయాన్ని బ్రేక్ చేసి అక్కడ మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. కేంద్ర ప్రభుత్వం రాజస్థాన్‌కు ఎలాంటి సహకారం ఇవ్వలేదు. ప్రజలు అర్ధం చేసుకున్నారు. ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటేశారు. సీఎం అభ్యర్థి అనేది కాంగ్రెస్‌లో ఉండదు. అధిష్టానం సీఎంను సెలెక్ట్ చేస్తుంది.’ అని పైలట్ తెలిపారు -
మరోసారి గెలుపు మాదే: సచిన్ పైలెట్
జైపూర్: రాజస్థాన్‌లో గెలుపుపై కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలెట్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు తమకు మరోసారి అవకాశం ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వాలను మార్చే ధోరణికి ప్రజలు స్వస్తి పలకాలని చూస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం సాధిస్తామని చెప్పారు. అభివృద్ధికి కట్టుబడి ఉండే వారికే ప్రజలు ఓటు వేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. #WATCH | Congress leader Sachin Pilot after casting his vote in Jaipur says, "I hope people will use their right to vote today. I hope the public will make the right decision by looking at our vision for the state for the next 5 years. I think Congress will form the government… pic.twitter.com/c4rxZS50ex — ANI (@ANI) November 25, 2023 రాజస్థాన్ కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలెట్ ఓటు హక్కుని వినియోగించుకునే ముందు బాలాజీ దేవాలయంలో పూజలు నిర్వహించారు. రానున్న ఐదేళ్లకు రాష్ట్ర భవిష్యత్ కోసం ప్రజలు సరైన తీర్పును ఇస్తారని భావిస్తున్నట్లు పైలెట్ చెప్పారు. కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. #WATCH | Rajasthan elections | Jaipur: Congress leader Sachin Pilot offered prayer at Balaji temple before casting his vote. pic.twitter.com/14hpsrYaHV — ANI (@ANI) November 25, 2023 రాజస్తాన్ శాసనసభ ఎన్నికలకు నేడు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల దాకా పోలింగ్ జరుగనుంది. 200 నియోజకవర్గాలకు గాను 199 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లు చేశారు. శ్రీగంగానగర్ జిల్లాలోని కరణ్‌పూర్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే గురీత్‌సింగ్ కూనార్ మరణించడంతో ఇక్కడ పోలింగ్‌ను వాయిదా వేశారు. రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి 1,862 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇదీ చదవండి: 'చైనా కొత్త వైరస్‌తో జాగ్రత్త' -
ప్రధాని మోదీకి సచిన్ పైలట్ కౌంటర్, ట్రెండ్ రివర్స్!
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పర్వం కీలక దశకు చేరుకుంది. గురువారం సాయంత్రం 6 గంటలతో ప్రచార పర్వానికి తెర పడింది. 200 నియోజకవర్గాలకు పోలింగ్ నవంబర్ 25న జరగనుంది. డిసెంబరు 3న ఫలితాల ప్రకటనతో అధికార పీఠం ఎవరికి దక్కనుందనే దానిపై క్లారిటీవస్తుంది. గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాజస్థాన్ కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గట్టి కౌంటర్ఇచ్చారు. కాంగ్రెస్‌లో పైలట్‌కు గౌరవం లేదంటూ ప్రధానిచేసిన వ్యాఖ్యల్ని ఆయన తోసిపుచ్చారు. ముందు తన పార్టీని సంగతి చూసుకోవాలంటూ మోదీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తనకు పార్టీలో వివిధ హోదాల్లో గౌరవం లభించిందనీ, పీసీసీ చీఫ్, ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి ప్రతి పదవులను గుర్తు చేశారు. అలాగే తన భవిష్యత్తు, శ్రేయస్సును అంతా కాంగ్రెస్ పార్టీనే చూసుకుంటుందన్నారు. ఇందిరా గాంధీ ప్రేరణతోనే తన తండ్రి కాంగ్రెస్‌లో చేరారనీ, ఆయనకు పార్టీ సముచిత స్థానం లభించిందని తెలిపారు. కాంగ్రెస్‌తో చాలా సంతోషంగా ఉన్నామన్నారు. ట్రెండ్ రివర్స్ మరోవైపు ప్రజలు ట్రెండ్ మార్చాలని కోరుకుంటున్నారు...మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వాన్నే గెలిపిస్తారు. బీజేపీ 10 సంవత్సరాలుగా దేశాన్ని పాలిస్తోంది. తమ కార్యకర్తలు కూడా ఈసారి మరింత ఉత్సాహంగా ఉన్నారు. పార్టీ సిద్ధాంతం, మేనిఫెస్టో ఆధారంగా మెజారిటీ సాధిస్తామని సచిన్ పైలట్ ధీమా వ్యక్తం చేశారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం రాజస్థాన్‌లో పలు ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగించారు. నిజాలు మాట్లాడినందుకు గాంధీ కుటుంబాన్ని ప్రశ్నించి నందుకు దివంగత రాజేష్ పైలట్‌ను శిక్షించారు ఇపుడు ఆయన కుమారుడిని కూడా శిక్షిస్తోందని ప్రధాని మోదీ విమర్శించారు. పార్టీ ప్రయోజనాల నిమిత్తం కుటుంబ పాలనను వ్యతిరేంచినందుకు ఆయన కుమారుడు సచిన్ పైలట్ ఇప్పటికీ మూల్యం చెల్లించుకుంటున్నారన్నారు. రాజస్థాన్‌లో సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఎప్పటికీ ఏర్పాటు రాదు అని మోదీ వ్యాఖ్యానించారు. -
రాజస్థాన్ ఎన్నికలు: కీలక నియోజకవర్గాలు, ఆసక్తికర విషయాలు
Rajasthan Assembly polls 2023: పశ్చిమ రాష్ట్రం రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్ 25న 200 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. డిసెంబరు 3న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈక్రమంలో ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం గురువారం సాయంత్రంతో ముగియనుంది. ఇక్కడ అటు బీజేపీగానీ, ఇటు కాంగ్రెస్ గానీ వరుసగా అధికారాన్ని దక్కించు కోలేదు. పైగా ఒకదాని తరువాత ఒకటి ఆల్టర్ నేటివ్‌గా గద్దెనెక్కుతున్నాయి. ప్రతీ ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రభుత్వం మారుతుంది. అందుకే ఈ సారి రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటు వేస్తారని బీజేపీ ధీమాగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు కాకుండా, ఈసారి బీజేపీకి రాజస్థాన్ ప్రజలు పట్టం కడతారని సర్వేల అంచనా. అధికార వ్యతిరేకత కూడా బీజేపీకి కలిసి వచ్చే అంశమని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం ఈసారి ట్రెండ్ రివర్స్ అవుతుందనీ, విజయం తమదే ననే ధీమాను వ్యక్తం చేస్తోంది. అసలు ఇక్కడ కీలక నియోజకవర్గాలు,విశేషాలు ఒకసారి చూద్దాం. సర్దార్‌పురా: ఇది 1998 నుండి కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ 1998 నుండి ఈ సీటును గెలుచుకున్నారు. నాలుగోసారి సీఎం రేసులో ఉన్న ఈ సీనియర్ కాంగ్రెస్ నేత 2018 ఎన్నికల్లో 63శాతం ఓట్లతో బీజేపీకి చెందిన శంభు సింగ్‌ను ఓడించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సర్దార్‌పురా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెహ్లాట్ నామినేషన్ దాఖలు చేశారు. టోంక్: టోంక్ స్థానం నుంచి అద్భుత విజయం సాధించిన కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ బీజేపీ అభ్యర్థి అజిత్ సింగ్ మెహతాపై పోటీ చేయనున్నారు. టోంక్ నియోజకవర్గంలో గుజ్జర్ జనాభాతో పాటు మీనాలు,ముస్లింలు కూడా ఉన్నారు. 2018 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పైలట్ 54,179 ఓట్ల తేడాతో బీజేపీకి చెందిన యూనుస్ ఖాన్‌పై విజయం సాధించారు. ఝల్రాపటాన్: రాజస్థాన్‌లోని బీజేపీ కంచుకోటలో మాజీ సీఎం వసుంధర రాజే 2003 నుంచి ఇక్కడ నుంచి గెలుస్తూ వస్తున్నారు. 2018లో కాంగ్రెస్ మాన్వేంద్ర సింగ్‌ను ఓడించారు. ఉదయ్‌పూర్: ఇక్కడ కూడా బీజేపీకి కూడా గట్టి పట్టుంది. 2003 నుంచి బీజపీ ఉదయపూర్‌లో తన సత్తాను చాటుతోంది. ఇక్కడ తారాచంద్ జైన్ బీజేపీ బరిలోకి దించింది అయితే ఉదయపూర్ మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పరాస్ సింఘ్వి దీన్ని వ్యతిరేకించారు. పార్టీ పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరించారు. కాగా కాంగ్రెస్ గౌరవ్ వల్లభ్‌ను రంగంలోకి దించింది. నాథ్‌ద్వారా: ఇక్కడి నుంచి మహారాణా ప్రతాప్ సింగ్ వారసుడు విశ్వరాజ్ సింగ్ మేవార్ను బీజేపీ పోటీకి దింపింది. రాజస్థాన్ అసెంబ్లీ ప్రస్తుత స్పీకర్, కాంగ్రెస్ కురువృద్ధుడు సీపీ జోషిపై మేవార్ పోటీ చేయనున్నారు. 2018లో జోషి 16,940 సీట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి మహేశ్ ప్రతాప్ సింగ్‌పై విజయం సాధించారు. ఝుంజును: ఈ నియోజకవర్గంలో చిరకాల ప్రత్యర్థులు కాంగ్రెస్ నుంచి బ్రిజేంద్ర ఓలా, బీజేపీ నుంచి నిషిత్ కుమార్ పోటీ పడుతున్నారు. ఓలా జుంజును (2008, 2013 , 2018లో) నుంచి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. జోత్వారా: ఒలింపియన్‌గా మారిన రాజకీయ నాయకుడు రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్‌ను తిరిగి కైవసం చేసుకునేందుకు బీజేపీ రంగంలోకి దిగింది. 2018లో ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి లాల్‌చంద్ కటారియా రాథోడ్‌పై విజయం సాధించారు. చురు: ఇది బీజేపీకి మరో కంచుకోట. రాజస్థాన్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు రాజేంద్ర రాథోడ్ ఆరు వేర్వేరు సందర్భాలలో గెలుపొందారు. అయితే 2008 ఎన్నికల్లో తారానగర్ నుండి కాంగ్రెస్‌కు చెందిన మక్బూల్ మండెలియా బీజేపీ అభ్యర్థి హర్లాల్ సహారన్ను ఓడించారు. స్కాంలు, లీక్‌లు, మహిళల భద్రత అధికార వ్యతిరేకత, పేపర్ లీక్ స్కామ్‌లు. పేపర్ లీకేజీల కారణంగా 2019, 2022 మధ్య రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (RPSC) నిర్వహించిన ఎనిమిది పరీక్షలు రద్దయ్యాయి.ప్రభుత్వ రిక్రూట్మెంట్ పరీక్ష పేపర్ లీక్‌లకు పాల్పడిన వారికి శిక్షను 10 ఏళ్ల జైలు శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చే బిల్లును రాజస్థాన్ అసెంబ్లీ ఈ ఏడాది జూలైలో ఆమోదించింది. రాష్ట్రంలో మహిళల భద్రత మరో సమస్య. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు మహిళల గౌరవ పోరాటమని కేంద్ర కేబినెట్ మంత్రి స్మృతి ఇరానీ పేర్కొనడం గమనార్హం. ఓటర్లు రాజస్థాన్‌లో సాధారణ ఓటర్లు 5,25,38,655 మంది ఉండగా, సర్వీస్ ఓటర్లు 1,41,890 మంది ఉన్నారు. ఓటర్ల జాబితా ప్రకారం మొత్తం ఓటర్ల సంఖ్య 5,26,80,545. భారత ఎన్నికల సంఘం ప్రకారం, 2023 జనవరి అక్టోబర్ మధ్య 18 సంవత్సరాలు నిండిన యువ ఓటర్ల సంఖ్య మొత్తం 22,04,514. 11,78,285 మంది ఓటర్లు సీనియర్ సిటిజన్లు (80+) కాగా, రాజస్థాన్‌లో 606 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. రాబోయే రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల 2023 కోసం రాష్ట్రంలో 51,756 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. -
రాజస్థాన్ ఎన్నికలు: కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ కీలక వ్యాఖ్యలు
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, సీనియర్ నేత మాజీ డిప్యూటీ స్పీకర్ సచిన్ పైలట్ మధ్య నెలకొన్న టెన్షన్ నేపథ్యంలో పైలట్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్‌లో గత 30 ఏళ్లుగా ఎన్నికల్లో వరుసగా ఎందుకు గెలవ లేకపోతున్నామో కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పైలట్ మాట్లాడుతూ రాజస్థాన్‌లో 30 ఏళ్లుగా వరుసగా ఎన్నికల్లో గెలుపొందలేదు. దీనికి కారణం ఏంటి అనే దానిపై ఆత్మపరిశీలన చేసుకోవాలి. అయితే ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ దీన్ని బ్రేక్ చేస్తుందని పేర్కొనడం గమనార్హం. రాజస్థాన్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుపై ఆయన ధీమా వ్యక్తం చేశారు. సామాజిక సంక్షేమం , పెట్టుబడులు, సంపద సృష్టిపై దృష్టిపెట్టాం. అసమాతనలు లేని రాజస్థాన్ కావాలి. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు. అలాగే బీజేపీ "డబుల్ ఇంజిన్" ప్రభుత్వంపై కూడా మండిపడ్డారు. రాష్ట్ర అగ్ర నాయకత్వం మధ్య విభేదాలపై స్పందిస్తూ తాము సమిష్టిగా ఎన్నికల్లో పోరాడతామని, ఇక పదవులు ఎంపిక హైకమాండ్ చూసుకుంటుందని వ్యాఖ్యానించారు. అలాగే పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సలహా మేరకు తాను ‘క్షమించండి, మరచిపోయి ముందుకు సాగండి’ ఈ మంత్రాన్ని అనుసరిస్తున్నట్లు పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పైలట్ తెలిపారు. అశోక్ గెహ్లాట్‌ని ఉద్దేశించి గతంలో చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ గతంలో తానేం మాట్లాడినా దానికి బాధ్యత వహిస్తాననీ, రాజకీయ చర్చల్లో గౌరవాన్ని కాపాడుకోవాలని పేర్కొన్నారు. కాగా గత కొన్ని ఎన్నికల్లో రాజస్థాన్ అధికార పీఠం బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మధ్య హోరీ హోరీ పోరు ఉంటుంది. ఒకసారి బీజేపీ పైచేయి సాధిస్తే, తదుపరి ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకుంటోంది. ఇపుడు రాజకీయ విశ్లేషకులు ఈ లెక్కల్ని నిశితంగా గమనిస్తున్నారు. రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల 25న పోలింగ్ జరగనుండగా డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు, అధికారం చేపట్టిన పార్టీలు 1993 - బీజీపీ 1998 - కాంగ్రెస్ 2003 - బీజేపీ 2008 - కాంగ్రెస్ 2013 - బీజేపీ 2018 - కాంగ్రెస్ -
Rajasthan Elections 2023: స్టయిల్ మారింది!
మూడేళ్ల నాటి విఫల తిరుగుబాటు. సీఎం కుర్చీలో ఉన్న ప్రత్యర్థి నుంచి చీటికీ మాటికీ సూటిపోటి మాటలు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించినా ఈసారి మాత్రం ప్రచారంతో సహా ఎందులోనూ పెద్దగా ప్రాధాన్యం దక్కని వైనం. అన్నింటినీ ఓపికగా సహిస్తూ సాగుతున్నారు రాజస్తాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్. అసమ్మతి నేతగా ముద్ర తప్ప తిరుగుబాటుతో సాధించిందేమీ లేకపోవడంతో ఈ యువ నేత తెలివిగా రూటు మార్చారు. అసమ్మతి రాగాలకు, సొంత ప్రభుత్వంపై విమర్శలకు ఫుల్స్టాప్ పెట్టారు. అవకాశం చిక్కినప్పుడల్లా అధిష్టానానికి విధేయతను చాటుకుంటూ వస్తున్నారు. విధేయత, వెయిటింగ్ గేమ్ అంతిమంగా తనను అందలమెక్కిస్తాయని ఆశిస్తున్నారు... రాజస్తాన్‌లో 2018 అసెంబ్లీ ఎన్నికల వేళ పీసీసీ చీఫ్‌గా పార్టీ బరువు బాధ్యతలన్నింటినీ తన భుజాలపై మోశారు పైలట్. అన్నీ తానై వ్యవహరించి పార్టీని విజయ తీరాలకు చేర్చారు. ఆయనే సీఎం అని అంతా భావించారు. కానీ అధిష్టానం మాత్రం అనూహ్యంగా సీనియర్ అశోక్ గహ్లోత్‌కే పట్టం కట్టింది. కొంతకాలం తర్వాత చాన్సిస్తామన్న అధిష్టానం మాట తప్పడంతో పైలట్ ఆగ్రహించి 21 మంది ఎమ్మెల్యేలతో పైలట్ తిరుగుబాటుకు దిగడం, అగ్ర నేత రాహుల్‌గాంధీ జోక్యంతో వెనక్కు తగ్గడం చకచకా జరిగిపోయాయి. డిప్యూటీ సీఎంగిరీ, పీసీసీ చీఫ్ పదవి రెండూ ఊడటం మినహా ఆయన సాధించిందంటూ ఏమీ లేకపోయింది. అయినా వెనక్కు తగ్గలేదాయన. గహ్లోత్ ప్రభుత్వంపై బాహాటంగానే విమర్శలు ఎక్కుపెట్టడం, ధిక్కార స్వరం విని్పంచడం వంటివి చేస్తూనే వచ్చారు. ఈ ఏడాది మొదట్లో ఏకంగా సొంత ప్రభుత్వ పనితీరునే విమర్శిస్తూ ధర్నాకు దిగడమే గాక పాదయాత్ర తలపెట్టి సంచలనం సృష్టించారు. తీరు మారింది... కానీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పైలట్ తీరే పూర్తిగా మారిపోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే సహనమూర్తిగా మారారు. ప్రచారంలో తనకు ముఖ్య బాధ్యతలేవీ అప్పగించకపోయినా పెద్దగా పట్టించుకోలేదు. పైగా గహ్లోత్ సర్కారుపై బీజేపీ విమర్శలను పైలట్ దీటుగా తిప్పికొడుతూ కాంగ్రెస్ నేతలనే ఆశ్చర్యపరుస్తున్నారు! అంతేగాక ఇటీవల గహ్లోత్ కుమారుడికి ఈడీ సమన్లను, పీసీసీ చీఫ్ గోవింద్‌సింగ్ నివాసంపై ఈడీ దాడులను కూడా పైలట్ తీవ్రంగా ఖండించారు. గహ్లోత్‌పై విమర్శలు, ఆరోపణలకు పూర్తిగా ఫుల్స్టాపే పెట్టడమే గాక ఆయనతో కలిసి పని చేసేందుకు సిద్ధమని సంకేతాలిచ్చారు. వాటిని గహ్లోత్ పట్టించుకోకపోయినా, చాన్స్ దొరికినప్పుడల్లా తనకు చురకలు వేస్తున్నా, పార్టీ పట్ల తన చిత్తశుద్ధిని పదేపదే ప్రశి్నస్తున్నా వ్యూహాత్మక మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. ఎన్నికల ప్రచారమంతా గహ్లోత్ వన్ మ్యాన్ షోగానే సాగుతున్నా ఇదేమని ప్రశ్నించడం లేదు. పార్టీ గెలిస్తే సీఎం పదవి డిమాండ్ చేస్తారా అని ప్రశ్నించినా అది అధిష్టానం తీసుకోవాల్సిన నిర్ణయమని ఆచితూచి బదులిస్తున్నారు. అదే సమయంలో, వ్యక్తిగత ప్రతిష్ట కోసం సీఎం కావాలన్న దుగ్ధ తనకు లేదంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తున్నారు. తద్వారా ఇటు గహ్లోత్‌కు, అటు అధిష్టానానికి ఇవ్వాల్సిన సంకేతాలు స్పష్టంగానే ఇస్తున్నారన్నది పరిశీలకుల అభిప్రాయం. ఫలిస్తున్న వ్యూహం! పైలట్ విధేయత వ్యూహం బాగానే ఫలిస్తోందంటున్నారు. గాంధీ త్రయం సోనియా, రాహుల్, ప్రియాంక కొద్ది రోజులుగా ఆయన అభిప్రాయానికి బాగా విలువ ఇస్తున్నారని పీసీసీ వర్గాలు కూడా అంగీకరిస్తున్నాయి. పైలట్ విధేయత, గహ్లోత్ గతేడాది చూపిన అవిధేయత రెండింటినీ అధిష్టానం బేరీజు వేసుకుంటోందని కూడా ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. సీఎంగిరీ వదులుకోవాల్సి వస్తుందనే కారణంతో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయాలన్న సోనియా ఆదేశాలను గహ్లోత్ బేఖాతరు చేయడం తెలిసిందే. ఆయన కోసం మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గత సెపె్టంబర్లో ఏకంగా తిరుగుబాటుకు సిద్ధపడటం అధిష్టానానికి తలవంపులుగా మారింది. ఈ నేపథ్యంలో ఐదేళ్లకోసారి అధికార పార్టీని మార్చేసే రాజస్థాన్‌లో ఈసారి కాంగ్రెస్ ఓడితే రాష్ట్ర పార్టీ పైలట్ చేతుల్లోకి రావచ్చు. నెగ్గితే మాత్రం సీఎం పీఠం కోసం గహ్లోత్, పైలట్ మధ్య పెనుగులాట తప్పకపోవచ్చు. అప్పుడు అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరం! – సాక్షి, నేషనల్ డెస్క్ -
Rajasthan Elections 2023: ఐదేళ్లుగా పరస్పరం రనౌట్‌కు కుట్రలు
జైపూర్: దేశమంతటా ఎక్కడ చూసినా క్రికెట్ ప్రపంచకప్ ముచ్చట్లే. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్తాన్‌లో కాంగ్రెస్ పార్టీ తీరును క్రికెట్ టీమ్‌తో పోల్చారు. రాజస్తాన్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఒకరినొకరు రనౌట్ చేసుకొనేందుకు గత ఐదేళ్లుగా కుట్రలు పన్నుతున్నారని చెప్పారు. తద్వారా ఆ పారీ్టలో నేతల మధ్య రగులుతున్న అంతర్గత విభేదాలను, సీఎం అశోక్ గహ్లోత్, సీనియర్ నాయకుడు సచిన్ పైలట్ మధ్య ఆధిపత్య పోరును ప్రస్తావించారు. వారు పరుగులు చేయడానికి బదులు, సొంత టీమ్‌లోని ప్రత్యర్థులను పడగొట్టాలని చూశారని చెప్పారు. వారి టీమ్ సరిగ్గా లేనప్పుడు ఇక ప్రజల కోసం ఏం చేస్తారని ప్రశ్నించారు. ఆదివారం రాజస్తాన్‌లోని చురు జిల్లాలోని ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని మండిపడ్డారు. అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలు అనే సంప్రదాయాన్ని కాంగ్రెస్ అభివృద్ధి చేసిందని, దాని వల్ల దేశం భారీగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తీరు వల్ల దేశంలో యువతకు ఎదిగే అవకాశాలు రాలేదని చెప్పారు. పేపర్ లీక్ మాఫియాపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తాం.. రాజస్తాన్‌లో బీజేపీకి అధికారం అప్పగిస్తే అవినీతిపరుల భరతం పడతామని, వేగవంతమైన అభివృద్ధికి శ్రీకారం చుడతామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌కు ఎంత దూరంగా ఉంటే రాజస్తాన్‌కు అంత మేలు జరుగుతుందని, భవిష్యత్తుకు భరోసా లభిస్తుందని ప్రజలకు సూచించారు. వెలుతురికి, చీకటికి మధ్య ఉన్న సంబంధం లాంటిదే మంచికి, కాంగ్రెస్‌కు మధ్య కూడా ఉందని అన్నారు. రాష్ట్రంలో జల జీవన్ మిషన్‌లో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ప్రజలకు తాగునీరు సరఫరా చేయడానికి ఉద్దేశించిన పథకంలోనూ నిధులు కొల్లగొట్టారని దుయ్యబట్టారు. కాంగ్రెస్, అభివృద్ధి అనేవి పరస్పరం శత్రువులని, ఆ శత్రుత్వం ఎప్పటికీ కొనసాగుతుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పేపర్ లీక్ మాఫియా యువత భవిష్యత్తును లక్షలాది రూపాయలకు అమ్మేసిందని ధ్వజమెత్తారు. ఎరువుల కుంభకోణంతో రైతులను విచ్చలవిడిగా లూటీ చేసిందని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే పేపర్ లీక్ మాఫియాపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. అక్రమార్కులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, కఠినంగా శిక్షిస్తామని తేలి్చచెప్పారు. 2047 నాటికి ‘అభివృద్ధి చెందిన భారత్’ రాజస్తాన్‌లో కాంగ్రెస్ పాలనలో ధరలు భారీగా పెరిగిపోయానని మోదీ గుర్తుచేశారు. హరియాణా, గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.13 అధికంగా ఉందన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే ధరలను సమీక్షిస్తామని, ప్రజలకు ఊరట కలి్పస్తామని వెల్లడించారు. కొన్నేళ్లలో అన్ని రంగాల్లోనూ భారత్ అద్భుతాలు చేసిందన్నారు. ఎటు చూసినా నూతనోత్సాహం, ఆత్మవిశ్వాసం కనిపిస్తున్నాయని, 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. -
'ఐక్యమయ్యాం.. విజయం సాధిస్తాం: రాహుల్ గాంధీ
జైపూర్: రాజస్థాన్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో జైపూర్‌లో ప్రచారానికి కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీని సీఎం అశోక్ గహ్లోత్, సచిన్ పైలెట్ సంయుక్తంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారిని చూసిన రాహుల్.. చిరునవ్వులు కురిపించారు. మనం ఏకమయ్యాం.. రాష్ట్రంలో విజయం సాధిస్తాం అని అన్నారు. రాజస్థాన్‌లో సీనియర్ నాయకులు అశోక్ గహ్లోత్, సచిన్ పైలెట్‌కు మధ్య కొద్ది రోజులుగా విబేధాలు నడుస్తున్నాయి. గత ప్రభుత్వం ఏర్పాటులో తన వర్గీయులకు అన్యాయం జరుగుతుందని సచిన్ పైలెట్ ఆరోపించారు. 2020లో దాదాపు 18 మంది ఎమ్మెల్యేలతో సచిన్ పైలెట్.. సీఎం అశోక్ గహ్లోత్‌పై తిరుగుబాటు యత్నం చేశారు. ఆ తర్వాత ఆయన తన ఉపముఖ్యమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుని పదవులను కోల్పోయారు. పార్టీ కేంద్ర అధిష్ఠానం కల్పించుకుని అప్పటికి సద్దుమణిగేలా చేసింది. అప్పటి నుంచి ఇద్దరు నేతల మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. రాజస్థాన్‌లో నవంబర్ 25న పోలింగ్ జరగనుంది. ఇప్పటికి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయాన్ని తిరగరాస్తామని ధీమాతో ఉంది. అటు.. ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఈసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తోంది. ఇదీ చదవండి: రాజకీయ విబేధాల నడుమ దీపావళి వేడుకల్లో అజిత్ పవార్, సుప్రీయా సూలే -
పైలట్‌తో కుస్తీకి బై బై..కలిసి గెలుస్తున్నాం: అశోక్ గెహ్లాట్
జైపూర్ : ఆ ఇద్దరు కాంగ్రెస్ అగ్రనేతలు మొన్నటిదాకా ఒకరిపై ఒకరు విమర్శల దాడి చేసుకున్నారు. ఎవరికి వారే అన్నట్టు గ్రూపు రాజకీయాలు నడిపారు. ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఎన్నికలు రాగానే పార్టీ కోసం ఒక్కటయ్యారు. తమ మధ్య ఏమీ లేదని,పార్టీ గెలుపే తమ ఉమ్మడి లక్ష్యమని చెబుతున్నారు.ఇద్దరు నేతల్లో ఒకరు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కాగా, మరొకరు ఆ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్. తామిద్దరం ఒక్కటే అన్న సంకేతాలను ఇటు పార్టీ క్యాడర్‌కు,అటు ప్రజల్లోకి బలంగా పంపేందుకు బుధవారం ఉదయం రాజస్థాన్ సీఎం అశోక్‌గెహ్లాట్ ఎక్స్(ట్విటర్)లో ఒక ఫొటో షేర్ చేశారు. ఈ ఫొటోకు టు గెదర్ విన్నింగ్ అగెయిన్(కలిసి గెలుస్తున్నాం) అనే క్యాప్షన్‌ను జోడించారు. ఈ ఫొటోలో సచిన్ పైలట్, పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో కలిసి అశోక్ గెహ్లాట్ చర్చిస్తున్నారు. అటు సచిన్ పైలట్ కూడా తాజాగా మీడియాతో మాట్లాడుతూ తనకు గెహ్లాట్‌కు మధ్య ఎలాంటి వివాదాలు లేవని రాజకీయ నాయకులుగా తాము హుందాగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. గతంలో పైలట్, గెహ్లాట్‌పై చేసిన విమర్శలను గుర్తు చేయగా ‘నేనలాంటి వ్యాఖ్యలేవీ చేయలేదు..ఎవరన్నారో వారే బాధ్యత వహిస్తారు’ అని తోసిపుచ్చారు. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా రాజస్థాన్‌లో ఈ నెల23న పోలింగ్ జరగనుంది. एक साथ जीत रहे हैं फिर से#कांग्रेस_फिर_से pic.twitter.com/saWIdZ0SGl — Ashok Gehlot (@ashokgehlot51) November 15, 2023 ఇదీ చదవండి..ఒక్కసారి డిసైడ్ అయితే.. తగ్గేదేలే! రైతు బిడ్డ ఘనత -
సీఎం రేసుపై సచిన్ పైలెట్ కీలక వ్యాఖ్యలు
జైపూర్: రాజస్థాన్‌లో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో సీఎం రేసుపై సీనియర్ నాయకుడు సచిన్ పైలెట్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం పీఠంపై ఎవరు కూర్చోవాలనేది ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు, పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని తెలిపారు. క్షమించు.. మర్చిపో.. సాగిపో అనే విధానాన్నే కాంగ్రెస్ పెద్దలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తనకు సూచించారని పేర్కొన్నారు. భవిష్యత్పైనే దృష్టి సారించానని సచిన్ పైలెట్ చెప్పారు. రాజస్థాన్ ఐదేళ్ల రోడ్‌మ్యాప్‌పైనే ప్రస్తుతం పనిచేస్తున్నానని పేర్కొన్నారు. ఐక్యంగా కాంగ్రెస్ పార్టీకి విజయం తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఐక్యమత్యంగా పోరాడుతున్నారని చెప్పారు. ఏ విషయాన్నైనా నాయకులందరం కూర్చోని తేల్చుకుంటామని అన్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండేదని తెలిపిన పైలెట్.. ఈ ఐదేళ్లపాటు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని ప్రజలు రుచి చూశారని చెప్పారు. రాజస్థాన్ చరిత్రలో ఈసారి ఎన్నికలు చరిత్రాత్మకంగా నిలుస్తాయని అన్నారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాజస్థాన్ రాజకీయ చరిత్రలో నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్ ఎదురులేని పార్టీగా కొనసాగింది. 1990లో మొదటిసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి ఒకసారి కాంగ్రెస్ వస్తే మరోసారి బీజేపీ అధికారంలోకి వచ్చే సాంప్రదాయం కొనసాగుతోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు గడ్డుకాలమే నడుస్తున్నా.. మరి ఈసారి ప్రజలు ఏం తీర్పు ఇవ్వనున్నారో వేచి చూడాల్సి ఉంది. కాంగ్రెస్‌లో సీఎం పదవిపై సీనియర్ నాయకుడు అశోక్ గహ్లోత్, సచిన్ పైలెట్ వర్గాల మధ్య పోటీ నడుస్తోంది. గత ఎన్నికల్లో విజయం సాధించిన నాటి నుంచి పైలెట్, గహ్లోత్ వర్గాల మధ్య నిరంతరం నువ్వా-నేనా అన్నట్లు పోటీ నెలకొంది. కానీ పార్టీ కేంద్ర అధిష్ఠానం ఎప్పటికప్పుడు కల్పించుకుని వివాదాన్ని సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. గహ్లోత్‌కు పీఠాన్ని అప్పగించేలా సచిన్ పైలెట్‌ను ఒప్పించారు. అయితే.. ఈసారి సీఎం పదవి దక్కించుకోవాలని సచిన్ పైలెట్ వర్గం ఆశిస్తోంది. ఇదీ చదవండి: ఇంకా ఎంత దిగజారుతారు..? నితీష్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఫైర్ -
సీఎం పదవిపై అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు
జైపూర్: వచ్చే నెలలో(నవంబర్) జరగబోయే అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు దేశంలో రాజకీయ వేడిని పెంచాయి. ప్రధాన పార్టీలన్నీ, అభ్యర్థుల ఎంపిక, ప్రచారాల్లో మునిగిపోయాయి. మిజోరాం, తెలంగాణలో ప్రాంతీయ పార్టీల ప్రభావం ఎక్కువ ఉన్నప్పటికీ.. మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ద్విముఖ పోరు నెలకొని ఉంది. ఈ మూడింటిలో రెండు రాష్ట్రాల్లోనూ( చత్తీస్‌గఢ్, రాజస్థాన్) కాంగ్రెస్ అధికారంలో ఉంది. 200 స్థానాలున్న రాజస్థాన్ అసెంబ్లీకి నవంబర్ 25న ఒకే విడుతలో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తాజాగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తన ప్రధాన ప్రత్యర్థి, కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్‌ని పరోక్షంగా టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. దేవుడి దయతో తనను నాలుగోసారి ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నట్లు ఒక మహిళా తనతో చెప్పారని అన్నారు. తాను ఈ సీఎం పదవిని వదిలిపెట్టాలని అనుకుంటున్నాప్పటికీ.. అది అతన్ని విడిచెపెట్టడం లేదని ఆమెతో చెప్పినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా తనని విడిచిపెట్టదు కూడా అని చెప్పారు. తనలో ఏదో ఉందని, అందుకే పార్టీ హైకమాండ్ తనను రాష్ట్రానికి నాయకత్వం వహించడానికి మూడుసార్లు ఎంపిక చేసిందని అన్నారు. అయితే..హైకమాండ్ తీసుకునే ఏ నిర్ణయమైనా అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని ఆయన అన్నారు. సోనియా గాంధీ జాతీయ అధ్యక్షురాలు అయ్యాక ఆమె తీసుకున్న తొలి నిర్ణయం తనను సీఎం చేయడమేనని చెప్పారు. అదే విధంగా కాంగ్రెస్ తన అభ్యర్థుల జాబితాను విడుదల చేయడంలో ఎందుకు జాప్యం చేసిందన్న ప్రశ్నకు గెహ్లాట్ స్పందిస్తూ.. ప్రతిపక్ష బీజేపీ మాత్రమే ఆ విషయంపై చింతిస్తోందని కౌంటర్ వేశారు. తాము పోట్లాడటం లేదని బీజేపీ ఆందోళన చెందుతోందని చురకలంటించారు. అందరి అభిప్రాయాలను పరిశీలించి, నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. తాను సచిన్ పైలట్ మద్దతుదారులతో కూడా మాట్లాడుతున్నానని, వారికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటున్నానన్నారు. నిర్ణయాలు సజావుగా జరుగుతున్నాయని, అందుకే బీజేపీకి టెన్షన్ మొదలైందన్నారు. చదవండి: కర్ణాటక గాయం బీజేపీకి గుర్తుందా? ఒకవేళ మంచి ప్రత్యామ్నాయాలు దొరికితే.. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అభ్యర్థుల్ని మారుస్తుందని గెహ్లాట్ స్పష్టం చేశారు. తమ పార్టీలో ఎలాంటి చీలికలు లేవని, తాను క్షమించు, మరచిపో మంత్రాన్ని అనుసరిస్తున్నానని చెప్పారు. ఇంతకుముందు రాజస్థాన్‌లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందని పైలట్ చెప్పడంతో.. అతని క్యాంప్‌లోని సభ్యులకూ టికెట్లు లభిస్తాయన్న వార్తలు వస్తున్నాయి. కాగా గతంలో.. గెహ్లాట్, ఆయన మాజీ డిప్యూటీ పైలట్ నేతృత్వంలోని క్యాంపుల మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. 2020లో గెహ్లాట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పైలట్ తన క్యాంప్‌తో కలిసి తిరుగుబాటు చేసినప్పుడు.. కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా కుప్పకూలిపోయే పరిస్థితి వచ్చింది. అయితే కాంగ్రెస్ హైకమాండ్ రాజస్థాన్ ప్రభుత్వాన్ని కూలడం నుంచి కాపాడింది. అందుకే.. అవకాశం దొరికినప్పుడల్లా పైలట్‌పై అశోక్ గెహ్లాట్ విరుచుకుపడుతుంటారు. ఇప్పుడు మరోసారి అతనిపై మండిపడుతూ విమర్శలు గుప్పించారు. మరోవైపు కాంగ్రెస్ రాజస్థాన్ మినహా నాలుగు రాష్ట్రాలకు కనీసం తమ తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఒక్కరాజస్థాన్ను మాత్రం హోల్డ్‌లో పెట్టింది. అధికార పార్టీ కాంగ్రెస్ తన అభ్యర్థుల జాబితాను విడుదల చేయకపోవడం పెద్ద విషయమనే చెప్పాలి. సీఎం అశోక్ గహ్లోత్, రెబల్ ఎమ్మెల్యే సచిన్ పైలట్ మధ్య ఉన్న ఘర్షణ కారణంగా అభ్యర్థుల జాబితాను బహిర్గతం చేయడంలో జాప్యం జరుగుతోందని భావిస్తున్నారు. -
అభ్యర్థుల ఖరారుపై చర్చ.. సచిన్ పైలెట్‌కు అందని ఆహ్వానం
జైపూర్: రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుంటున్నట్లు కనిపిస్తోంది. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి సీనియర్ నాయకుడు సచిన్ పైలెట్‌ను ఆహ్వానించలేదు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల పేర్లను ఖరారు చేయడంపై చర్చ జరగనుంది. ఈ సమావేశానికి ఖర్గే, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సుఖ్జీందర్ రాంధావా, రాజస్థాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ గోవింద్ దోతస్రా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, పార్టీ రాజస్థాన్ స్క్రీనింగ్ కమిటీ చీఫ్ గౌరవ్ గొగోయ్ తదితరులను ఆహ్వానించారు. సచిన్ పైలెట్, రాజస్థాన్ స్పీకర్ సీపీ జోషిల పేర్లు ఇందులో లేవు. बचत, राहत, बढ़त, हिफ़ाज़त और उत्थान, कांग्रेस के सुशासन से ऐसे बदला राजस्थान ! भरोसा है हमें कि जनता फ़िर से देगी आशीर्वाद। आज राजस्थान के परिप्रेक्ष्य में केंद्रीय चुनाव समिति की महत्वपूर्ण बैठक हुई। pic.twitter.com/ygR5auUdUf — Mallikarjun Kharge (@kharge) October 18, 2023 రాజస్థాన్‌లో మరోసారి అధికారంలోకి వస్తామని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే విశ్వాసం వ్యక్తం చేశారు. పొదుపు, ఉపషమణం, వృద్ధి, రక్షణలతో కాంగ్రెస్ గుడ్ గవర్నెన్స్ రాజస్థాన్‌లో సమూల మార్పులు తీసుకువచ్చిందని అన్నారు. ప్రజలు మరోసారి దీవిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు ముఖ్యమైన సమావేశం ఉందని ట్విట్టర్(ఎక్స్) వేదికగా ట్వీట్ చేశారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) అక్టోబర్ 13 ఢిల్లీలో ఇప్పటికే సమావేశమైన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: నోరు నొక్కేందుకే ఈ కుట్ర: భయపడుతూ కూచుంటే ఎలా? -
మొత్తానికి ఆయన చెప్పినట్టే జరిగిందిగా.. కపిల్ సిబాల్
జైపూర్: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో బీజేపీ ఎంపీ రమేష్ బిధూరీ.. బీఎస్పీ ఎంపీ డానిష్ అలీని లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన చేసిన మతపరమైన వ్యాఖ్యలను స్వయంగా బీజేపీ నేతలే ఖండించగా పార్టీ అధిష్టానం మాత్రం ఆయనకు జైపూర్‌లోని టోంక్ జిల్లా ఎన్నికల ప్రచార నిర్వహణ బాధ్యతలను అప్పగించింది. దీనిపై మరోసారి డానిష్ అలీ స్పందిస్తూ ఇది ఆయన చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలకు దక్కిన బహుమతి అయి ఉంటుందని అన్నారు. ప్రమోషన్.. పార్లమెంట్లో రమేష్ బిధురీ చేసిన వ్యాఖ్యలకు ఆయనపై సీరియస్ యాక్షన్ తీసుకుంటుందన్న అధిష్టానం ఆయనకు టోంక్ జిల్లా ఎన్నికల నిర్వహణ బాధ్యతలను అప్పగించి అందరినీ ఆశ్చర్యపరిచింది. గుర్జార్ సామాజిక వర్గానికి చెందిన ఆయన టోంక్ జిల్లాలోని నాలుగు స్థానాల్లో పార్టీ ప్రచార బాధ్యతలను నిర్వహించనున్నారు. ఈ నాలుగు స్థానాల్లో ఒక చోట ఆ రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ పోటీ చేయనుండటంతో ఇక్కడ పోటీ ఎలా ఉండబోతోందోనన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇప్పటికే బాధ్యతలు స్వీకరించిన రమేష్ బిధూరీ బుధవారం ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సీపీ జోషి నేతృత్వంలో జరిగిన సమావేశంలో కూడా పాల్గొన్నారు. राजस्थान प्रदेश भाजपा कार्यालय जयपुर में ज़िला टोंक की समन्वय बैठक में प्रदेश अध्यक्ष श्री @cpjoshiBJP जी द्वारा संगठनात्मक कार्यों व चुनाव की तैयारियों के साथ सेवा सप्ताह के कार्यक्रमों सहित आगामी कार्यकर्ताओं के प्रवास योजनाओं की जानकारी लेते हुए। pic.twitter.com/wK63ctXR6X — Ramesh Bidhuri (@rameshbidhuri) September 27, 2023 అక్కడ ఆయనైతేనే కరెక్టని.. సమావేశాలు ముగిశాక డానిష్ అలీ మాట్లాడుతూ ఈ ప్రత్యేక సమావేశాల్లో ఎంపీలను మతపరంగా దూషించడానికే నిర్వహించారని బీజేపీ పార్టీ ఆయన చేసిన వ్యాఖ్యలకు శిక్షిస్తుందో లేక ప్రమోషన్ ఇస్తుందో చూద్దామని ఆరోజే వ్యాఖ్యానించారు. ఇక ఇప్పుడు ఆయన చెప్పిందే నిజం కావడంతో రాజ్యసభ ఎంపీ కపిల్ సిబాల్ తీవ్రస్థాయిలో స్పందించారు. కపిల్ సిబాల్ మాట్లాడుతూ.. బీజేపీ ఎప్పుడూ విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేసేవారికి రివార్డులు ఇస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే రమేష్ బిధూరిని టోంక్ జిల్లా ఇంఛార్జిగా నియమించిందన్నారు. ఆ జిల్లాలో 30 శాతం ముస్లింలే ఉన్నారు కాబట్టే రమేష్ బిధూరీకి ఆ బాధ్యతలు అప్పగించిందన్నారు. నేనేమీ అనలేదు.. అంతకుముందు డానిష్ అలీ ప్రధాని కులాన్ని దూషించిన కారణంగానే రమేష్ బిధూరీ అలా మాట్లాడాల్సి వచ్చిందంటూ బీజేపీ నేతలు విమర్శించగా అందులో డానిష్ అలీ ఎక్కడా ప్రధాని కుల ప్రస్తావన చేయలేదని.. ప్రజాస్వామ్య దేవాలయంలోకి ఒక తీవ్రవాదిని ఎలా అనుమతించారని మాత్రం ప్రశ్నించిన సంభాషణలు మాత్రమే ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. Despite the abuses and extreme provocation, I didn’t utter a single word that could harm the sanctity of the temple of democracy. Even I didn’t repeat what Mr @rameshbidhuri said about me and my community. Inspite of it @BJP4India is trying it’s best to create a false narrative. pic.twitter.com/yApQ6w1vJR — Kunwar Danish Ali (@KDanishAli) September 26, 2023 ఇది కూడా చదవండి: ‘అందుకే బాబుకు కోర్టులు బెయిల్ ఇవ్వడం లేదు’ -
సచిన్ పైలెట్‌పై బీజేపీ ఆరోపణలు.. మద్దతు నిలిచిన గహ్లోత్..
జైపూర్: రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్, ఉపముఖ్యమంత్రి సచిన్ పైలెట్ మధ్య పార్టీలో అంతర్గతంగా విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. సీఎం కుర్చీ నాదంటే.. నాదంటూ పోట్లాడుకున్నా.. ఇంటి గొడవ గడప దాటేవరకేనని రుజువు చేశారు. సచిన్ పైలెట్ కుటుంబంపై బీజేపీ తీవ్ర ఆరోపణలు చేయగా.. పైలెట్‌కు మద్దతుగా సీఎం గహ్లోత్ నిలిచారు. సచిన్ పైలెట్ తండ్రి సొంత ప్రజలపైనే బాంబులు వేశారని బీజేపీ నేత అమిత్ మాలవ్య ఆరోపించారు. సచిన్ పైలట్ తండ్రి రాజేష్ పైలట్, సురేష్ కల్మాడీలపై ట్విట్టర్ వేదికగా సంచలన ఆరోపణలు చేశారు. ఏయిర్ ఫోర్స్‌లో పనిచేసే క్రమంలో వారిద్దరూ కలిసి 1966, మార్చి 5న మిజోరాం ఐజ్వాల్‌లో బాంబు దాడి జరిపారని అన్నారు. ప్రతిఫలంగా వారికి ఇందిరా గాంధీ మంత్రి పదవులు ఇచ్చారని ఆరోపణలు చేశారు. దీనిపై పైలెట్ కూడా బీజేపీపై మండిపడ్డారు. తప్పుడు సమాచారం ఇవ్వొద్దని దుయ్యబట్టారు. ఈ పరిణామాల అనంతరం సచిన్ పైలెట్‌కు మద్దతుగా నిలిచారు సీఎం గహ్లోత్. భారత వైమానిక దళానికి సేవలు చేసినవారిపై బీజేపీ ఆరోపణలు చేస్తోందని అన్నారు. ఇది ఏయిర్ ఫోర్స్ సేవలను అవమానించడమేనని చెప్పారు. కాంగ్రెస్ నాయకుడు రాజేష్ పైలెట్ ధైర్యవంతుడైన పైలెట్ అని అన్నారు. దేశం మొత్తం ఖండించాల్సిన అంశమని చెప్పారు. कांग्रेस नेता श्री राजेश पायलट भारतीय वायुसेना के वीर पायलट थे। उनका अपमान करके भाजपा भारतीय वायुसेना के बलिदान का अपमान कर रही है। इसकी पूरे देश को निंदा करनी चाहिए। — Ashok Gehlot (@ashokgehlot51) August 16, 2023 రాజస్థాన్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు ఐక్యమత్యాన్ని తాజా ఘటన సూచిస్తోంది. పార్టీలో అంతర్గతంగా గొడవలు ఉన్న ఇతర పార్టీలు విమర్శలు చేస్తే ఐక్యంగా పోరాడుతున్నారు. ఇదీ చదవండి: బాంబులు వేసింది భారత్-పాక్ యుద్ధంలో.. బీజేపీ నేతకు సచిన్ పైలట్ చురకలు -
వాస్తవం తెలుసుకోండి.. బీజేపీ తప్పుడు ప్రచారంపై సచిన్ పైలట్ ఫైర్
జైపూర్: బీజేపీ నేత అమిత్ మాలవ్య ట్విట్టర్లో సచిన్ పైలట్ తండ్రి రాజేష్ పైలట్, సురేష్ కల్మాడీలపై సంచలన ఆరోపణలు చేశారు. వారిద్దరూ కలిసి 1966, మార్చి 5న మిజోరాం ఐజ్వాల్‌లో బాంబు దాడి జరిపారని అన్నారు. అందుకు సచిన్ పైలట్ స్పందిస్తూ మా నాన్న బాంబులు వేసిన మాట వాస్తవమే కానీ మీరు చెప్పిన డేట్లు, సమాచారం తప్పని ట్విట్టర్ వేదికగా స్పందించారు. బీజేపీ ఐటీ విభాగాధిపతి అమిత్ మాలవ్య ట్వట్టర్లో రాస్తూ.. "1966, మార్చిలో రాజేష్ పైలట్, సురేష్ కల్మాడీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్లేన్‌లో మిజోరాం రాజధాని ఐజ్వాల్‌పై బాంబుల వర్షం కురిపించారు. తదనంతర కాలంలో వారిద్దరికీ కాంగ్రెస్ ప్రభుత్వం టికెట్లు ఇచ్చి మంత్రులుగా కూడా చేర్చుకుంది. ఈశాన్య రాష్ట్రాల్లోని సొంత ప్రజలపై దాడులు చేసినందుకు కానుకగా ఇందిరా గాంధీ వారికి ఆ పదవులు ఇచ్చారని స్పష్టంగా తెలుస్తోంది" అని రాశారు. అమిత్ మాలవ్య చేసిన వ్యాఖ్యలకు సచిన్ పైలట్ బదులిస్తూ.. "మీ దగ్గర తప్పుడు తేదీలు.. తప్పుడు సమాచారముంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా మా నాన్న బాంబులు వేసిన మాట వాస్తవమే కానీ అది తూర్పు పాకిస్తాన్ పైన అదికూడా 1971లో జరిగిన భారత్-పాకిస్తాన్ యుద్ధం సందర్భంగా జరిగింది. మీరు చెప్పినట్టు 1966, మార్చి 5న మిజోరంపై కాదు. ఎందుకంటే ఆయన 1966, అక్టోబరు 29న విధుల్లో చేరారు. జై హింద్.. అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు." అని రాసి కింద తన తండ్రి రాజేష్ పైలట్ జాయినింగ్ డేటు ఉన్న సర్టిఫికేటును జతపరిచారు. .@amitmalviya - You have the wrong dates, wrong facts… Yes, as an Indian Air Force pilot, my late father did drop bombs. But that was on erstwhile East Pakistan during the 1971 Indo-Pak war and not as you claim, on Mizoram on the 5th of March 1966. He was commissioned into the… https://t.co/JfexDbczfk pic.twitter.com/Lpe1GL1NLB — Sachin Pilot (@SachinPilot) August 15, 2023 ఇది కూడా చదవండి: Nuh Violence : హర్యానా అల్లర్లలో బజరంగ్దళ్ కార్యకర్త అరెస్టు -
ఎన్నికల్లో కలసికట్టుగా పోరాటం : సచిన్ పైలెట్
న్యూఢిల్లీ: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్, అసంతృప్త నేత సచిన్ పైలెట్ మధ్య విభేదాలు రూపుమాప డానికి అధిష్టానం చేసిన ప్రయత్నాలు ఫలించినట్టే కనిపిస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయానికి కలసికట్టుగా పోరాటం చేస్తామని సచిన్ పైలెట్ చెప్పారు. రాజస్థాన్‌లో ఎన్నికల సన్నద్ధతపై గురువారం న్యూఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాహుల్‌గాంధీ, ఖర్గే, సచిన్ పైలెట్ ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. కాలికి ఫ్రాక్చర్ కావడంతో సీఎం అశోక్ గెహ్లోత్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశానికి హాజరయ్యారు. -
ప్రజా విశ్వాసమే నా ఆస్తి
దౌసా: ప్రజలకు న్యాయం చేకూర్చాలన్నదే తన ధ్యేయమని, అందుకోసం పోరాటం కొనసాగిస్తానని రాజస్తాన్ కాంగ్రెస్ అసంతృప్త నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ వెల్లడించారు. తన డిమాండ్లపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. ప్రజా విశ్వాసమే తన ఆస్తి అని తేల్చిచెప్పారు. వసుంధర రాజే నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న అవినీతిపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని సచిన్ పైలట్ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై అశోక్ గహ్లోత్ ప్రభుత్వం స్పందించడం లేదని ఆయన మండిపడుతున్నారు. ఈ రోజు కాకపోయినా రేపైనా న్యాయం జరిగి తీరుతుందని సచిన్ పైలట్ అన్నారు. పరీక్షల నిర్వహణలో విఫలమైన రాజస్తాన్ పబ్లిక్ సర్వీసు కమిషన్‌ను పునర్వ్యస్థీకరించాలని కోరారు. పేపర్ లీకుల వల్ల నష్టపోయిన అభ్యర్థులకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. దౌసా పట్టణంలోని గుర్జర్ హాస్టల్లో తన తండ్రి, కేంద్ర మాజీ మంత్రి రాజేశ్ పైలట్ విగ్రహాన్ని సచిన్ పైలట్ ఆదివారం ఆవిష్కరించారు. -
కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై.. సచిన్ పైలట్ కొత్త పార్టీ?
న్యూఢిల్లీ: గత కొంతకాలంగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ మధ్య విభేదాలు కొనసాగుతున్న నేపధ్యంలో వారి మధ్య చర్చలు నిర్వహించి సమన్వయము కుదిర్చే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ పెద్దలు. అయినా కూడా సమస్య పరిష్కారం కాని కారణంగా సచిన్ పైలట్ వేరుకుంపటి పెట్టనున్నారని ఈ మేరకు తన తండ్రి రాజేష్ పైలట్ వర్ధంతి రోజున కొత్త పార్టీ పెట్టనున్నట్లు జోరుగా ప్రచారం సాగింది. దీంతో కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ కె.సి.వేణుగోపాల్ స్వయంగా రంగంలోకి దిగి సచిన్ పైలట్ కొత్త పార్టీ పుకార్లను కొట్టి పారేశారు. అవన్నీ సత్యదూరమైన ప్రచారాలని తేల్చి చెప్పారు. కలిసే ఉన్నాం.. కలిసే పోటీ చేస్తాం.. త్వరలో రాజస్థాన్ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో సచిన్ పైలట్ కొత్త పార్టీ పెడుతున్నారనే వార్త జోరుగా ప్రచారంలో ఉండి. కానీ ఆ వార్తల్లో వాస్తవం లేదని, వాటిని నమ్మవద్దని అన్నారు కాంగ్రెస్ నేత కె.సి.వేణుగోపాల్. ఢిల్లీలో నిర్వహించిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. " నేను ఈ పుకార్లను నమ్మడం లేదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ ఇద్దరితో జరిపిన చర్చల్లో మనం కలిసే పోటీ చేద్దామన్న ప్రతిపాదనకు వారిద్దరూ సానుకూలంగా స్పందించారు. నాకు తెలిసి సచిన్ కొత్త పార్టీ అనేది పూర్తిగా అవాస్తవం. మా పార్టీ ఐక్యంగానే ఉంది మేము వచ్చే ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తామని కరాఖండిగా తేల్చిచెప్పారు. సచిన్ అసంతృప్తి.. రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లపాటు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహించిన సచిన్ పైలట్ గత ప్రభుత్వం చేసిన అవినీతిపై విచారణ విషయంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అవినీతి అంశాలతో పాటు పేపర్ లీకేజీ, రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పునర్వ్యవస్థీకరణ అంశాలపై తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన వాదన గట్టిగానే వినిపిస్తున్నారు. ఈ అంశాలనే అదనుగా చేసుకుని కాంగ్రెస్ అధిష్టానం నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయని సచిన్ కొత్త పార్టీ పెట్టబోతున్నారని వదంతులు పుట్టుకొచ్చాయంటున్నారు కాంగ్రెస్ నాయకులు. ఇది కూడా చదవండి: మొదట భారత దేశం పరువు తీసింది ఆయనే.. -
గెహ్లాట్, పైలట్ మధ్య రాజీ కుదిరినట్టేనా..!
-
చేతులు కలిపారా ?
కర్ణాటక ఫార్ములాను రాజస్తాన్‌లో కూడా కాంగ్రెస్ హైకమాండ్ ప్రయోగించింది. ఉప్పు నిప్పుగా ఉన్న ఇద్దరు కీలక నేతలు అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్‌ను ఒక్కటి చేసింది. రాహుల్ గాంధీతో జరిగిన భేటీలో ఇరువురు నేతలు కలిసి పనిచేయడానికి ఒప్పించింది. మరి గెహ్లాట్, పైలెట్ చేతులు కలిపినట్టేనా ? ఎన్నికల్లో కలసికట్టుగా పని చేస్తారా ? ఆచరణలో ఇది ఎంతవరకు సాధ్యమనే ప్రశ్నలైతే వినిపిస్తున్నాయి. కర్ణాటకలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ల మధ్య విభేదాలను పరిష్కరించి ఎన్నికల్లో విజయ ఢంకా మోగించిన కాంగ్రెస్ పార్టీ అదే ఫార్ములాను రాజస్తాన్‌లోనూ ప్రయోగించింది. రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్ల మధ్య రాజీ కుదర్చడానికి స్వయంగా రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో గెహ్లాట్, పైలెట్లు రాహుల్‌తో చర్చించాక ఇరువురు నేతలు కలిపి పని చేస్తారని కాంగ్రెస్ హైకమాండ్ చేసిన ప్రకటనపై రాష్ట్ర నేతల్లో విశ్వాసం కలగడం లేదు. ఎందుకంటే బీజేపీ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ కోసం సచిన్ పైలెట్ రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టిన గడువు బుధవారంతో ముగుస్తుంది. ఈ లోగా అధ్యక్షుడు ఖర్గే లేదంటే సీఎం నుంచి ఏదో ఒక ప్రకటన రాకపోతే సచిన్ పైలెట్ వ్యూహం ఎలా మార్చుకుంటారోనన్న ప్రశ్నలైతే వినిపిస్తున్నాయి. రాహుల్‌తో భేటీలో ఈ సమస్యలకైతే సామరస్యపూర్వక పరిష్కారం లభించలేదు. ఖర్గే వ్యూహం ఏంటి? ఈ ఏడాది నవంబర్లోనే ఎన్నికలు ఉండడంతో ఇరువురు నేతల మధ్య పూర్తి స్థాయి అవగాహన కుదర్చడానికి సమయం అంతగా లేదు. చాలా తక్కువ సమయంలో ఇద్దరికీ సంతృప్తికరమైన చర్యలు ఎలా చేపడతారన్నది మరో పెద్ద సవాల్‌గా ఉంది. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వ ప్రతిష్ట గత కొన్ని నెలలుగా మసకబారుతోంది. ఈ విషయంలో సీఎంకు అధ్యక్షుడు ఖర్గే ఘాటైన హెచ్చరికలు పంపినట్టు సమాచారం. కర్ణాటక తరహా ఫలితాలు రావాలంటే జూలై నాటికే 60% అభ్యర్థుల్ని ప్రకటించాలని అధ్యక్షుడు ఖర్గే గట్టిగా కసరత్తు చేస్తున్నారు. అది జరగాలంటే పైలెట్‌కు పీసీసీ అధ్యక్ష పదవి లేదంటే ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సి ఉంటుంది. పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చి పైలెట్ అనుచరులకే అధికంగా సీట్లు ఇస్తే అధికార వ్యతిరేకత నుంచి కూడా బయటపడవచ్చునని ఖర్గే భావిస్తున్నారు. దీనిపై ఖర్గే, హైకమాండ్ ఒక మాట మీదకొస్తే పైలెట్‌ను పీసీసీ చీఫ్‌గా అంగీకరించడమో లేదంటే తానే సీఎం పదవికి రాజీనామా చేయడమో గెçహ్లాట్కు అనివార్యంగా మారుతుంది. ఈ నేపథ్యంలో మంగళవారం గెహ్లాట్ తన అనుచరులతో మాట్లాడుతూ అందరూ సహనంగా ఉండాలని పిలుపునిచ్చారు. పైలెట్‌కు పార్టీలో ఏ పదవి ఇవ్వాలో హైకమాండ్ నిర్ణయిస్తుందన్నారు. తనకు పదవి ముఖ్యం కాదని, ఎన్నికల్లో గెలుపు కోసం హైకమాండ్ ఏం చెబితే అదే చేస్తానని వ్యాఖ్యానించడం కొసమెరుపు మొత్తమ్మీద సచిన్ పైలెట్ తండ్రి, దివంగత రాజేశ్ పైలెట్ వర్ధంతి జూన్ 11 లోపు పైలెట్‌కు పార్టీలో కీలక పదవి ఇచ్చే అవకాశాలైతే అధికంగా కనిపిస్తున్నాయి. చిక్కుముళ్లు ఎలా విప్పుతారో..! అశోక్, పైలెట్ మధ్య విడదీయలేని చిక్కుముళ్లు ఎన్నో ఉన్నాయి. వసుంధరా రాజె ప్రభుత్వ హయాంలో అవినీతిపై విచారణ జరపాలని పైలెట్ డిమాండ్ చేస్తున్నప్పటికీ సీఎం గెహ్లాట్‌పై ఆయన వ్యక్తిగతంగా దూషణలకు దిగడంతో గెహ్లాట్ దీనిపై రాజీకి వచ్చే అవకాశాలు లేవని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో సంస్థాగతంగా పలు మార్పులు చేపట్టాలని అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భావించారు. కానీ పైలెట్‌ను విశ్వాసంలోకి తీసుకోకుండా ఇవి చెయ్యడం అంత సులభం కాదు. సోమవారం ఖర్గే నివాసంలో జరిగిన సమావేశంలో కూడా ఇరువురు నాయకుల మధ్య ఉన్న కీలక సమస్యలకు పరిష్కారం దొరకలేదు. రాహుల్, ఖర్గేలు తొలుత గెహ్లాట్‌తో చర్చించారు. అనంతరం సచిన్ పైలెట్‌తో చర్చలు జరిపారు. గంటల కొద్దీ సమావేశం జరిగినప్పటికీ గెహ్లాట్, పైలెట్ కలిసికట్టుగా పని చేస్తామని బహిరంగంగా చెప్పకపోవడం గమనార్హం. డిమాండ్లపై పట్టు వీడని పైలెట్ సచిన్ పైలెట్ గత కొద్ది నెలలుగా చేస్తున్న డిమాండ్లపై వెనక్కి తగ్గే అవకాశాలు లేవు. వసుంధరా రాజె ప్రభుత్వ అవినీతిపై విచారణ, రాజస్తాన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (ఆర్పీఎస్సి) తిరిగి ఏర్పాటు చేసి కొత్త నియామకాలు చేపట్టడం పేపర్ల లీకేజీ వల్ల పరీక్షలు రద్దు ప్రభావం పడిన విద్యార్థులకు నష్టపరిహారం చెల్లించడమనే మూడు డిమాండ్లపై సచిన్ పట్టు వీడడం లేదు. రాహుల్‌తో సమావేశానంతరం అశోక్ గెహ్లాట్ పార్టీ హైకమాండ్ కీలకమని, పార్టీ పెద్దలు ఎవరికి ఏ పదవి ఇస్తారో ముందుగానే స్పష్టమైన హామీలు ఇవ్వరంటూ చేసిన వ్యాఖ్యలు కూడా భవిష్యత్‌లో జరిగే సమావేశాల్లో ప్రతిబంధకంగా మారే అవకాశాలున్నాయి. - సాక్షి నేషనల్ డెస్క్ -
రాజస్థాన్ ముసలం: కాంగ్రెస్ హైకమాండ్ కీలక ప్రకటన
ఢిల్లీ: రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య సయోధ్య కుదర్చడంలో కాంగ్రెస్ అధిష్టానం సక్సెస్ అయినట్లు కనిపిస్తోంది. ఈ మేరకు సోమవారం సాయంత్రం జరిగిన నాలుగు గంటల సమావేశం తర్వాత కీలక ప్రకటన చేసింది. ‘‘ఇక మీద నుంచి ఇద్దరూ కలిసికట్టుగా పని చేస్తార’’ని పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ మీడియా ముందు ప్రకటించారు. ‘‘ఇద్దరు నేతలూ ఏకగ్రీవంగా పని చేసేందుకు అంగీకరించారు. అలాగే కీలక నిర్ణయాన్ని హైకమాండ్‌కు వదిలేశారు’’ అని ప్రకటించారు కేసీ వేణుగోపాల్. అయితే.. జరిగిన చర్చల పూర్తి సారాంశం ఏమిటి? ఇద్దరి మధ్య కుదిరిన సయోధ్య ఒప్పందం.. లేదంటే బాధ్యతల అప్పగింత ఏంటన్నదాని గురించి మాత్రం ఆయన ఎలాంటి ప్రకటన చేయలేదు. అశోక్ గెహ్లాట్-సచిన్ పైలట్ల నడుమ వైరం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో.. తాజాగా సొంత ప్రభుత్వంపైనే పైలట్ నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ ఏడాదిలోనే రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అదే సమయంలో ఈ ఇద్దరి మధ్య ‘డెడ్‌లైన్’ల శపథాలతో మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటోంది. పరిస్థితి చేజారకూడదనే ఉద్దేశంతో.. ఇద్దరినీ హస్తినకు పిలిపించుకున్న అధిష్టానం సోమవారంనాడు సమాలోచనలు జరిపింది. ఈ సందర్భంగా.. కర్ణాటక రిఫరెన్స్ ప్రస్తావన తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. కలిసి కట్టుగా పోరాడితేనే ఫలితం దక్కుతుందనే విషయాన్ని ప్రధానంగా హైలెట్ చేసినట్లు సమాచారం. సమావేశంలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ సైతం పాల్గొన్నారు. ఇదీ చదవండి: కేంద్రం విషయంలో.. ఆప్‌కు షాక్ ఇవ్వనున్న కాంగ్రెస్ -
సీఎం గెహ్లాట్‌ను టెన్షన్ పెడుతున్న పైలట్ డెడెలైన్.. ఖర్గే ప్లాన్ ఏంటి?
ఢిల్లీ: ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో త్వరలో జరగబోయే ఎన్నికలపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి సారించింది. కాగా, రాజస్థాన్ రాజకీయాలపై కాంగ్రెస్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. రాజస్థాన్‌లో మరోసారి అధికారంలోకి రావాలంటే సీఎం అశోక్ గెహ్లాట్, పార్టీ సీనియర్ నేత సచిన్ పైలట్ మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే.. అశోక్ గెహ్లాట్ , సచిన్ పైలట్‌తో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమావేశం కానున్నారు. ఢిల్లీలో నేడు ఇరువురు నేతలతో ఖర్గే వేర్వేరుగా భేటీ కానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. వీరిద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు, వారిమధ్య ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా ఈ సమావేశం జరుగునున్నట్లు తెలుస్తున్నది. గత బీజేపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి 15 రోజుల్లో విచారణ జరిపించాలని ఈ నెలాఖరు వరకు ప్రభుత్వానికి సచిన్ గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఖర్గే రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. రాజస్థాన్‌లో బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో చోటుచేసుకున్న అవినీతి, ప్రభుత్వ రిక్రూట్మెంట్ పరీక్షల పేపర్ల లీకేజీ తదితర అంశాలపై విచారణ చేపట్టాలని సచిన్ పైలట్ డిమాండ్ చేశారు. ‘అవినీతికి వ్యతిరేకంగా తాను, సీఎం గెహ్లాట్ పోరాడాం. కానీ ఇప్పుడు ఆయన ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. బీజేపీ నాయకురాలు, మాజీ సీఎం వసుంధరా రాజే హయాంలో జరిగిన అవినీతిపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేపట్టాలి. ప్రస్తుతం ఉన్న రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను రద్దు చేసి కొత్త కమిషన్‌ను ఏర్పాటు చేయాలి. పేపర్ లీకేజీ కారణంగా నష్టపోయిన వారికి పరిహారం చెల్లించాలి. 15 రోజుల్లోగా గెహ్లాట్ సర్కారు ఈ డిమాండ్లపై స్పందించాలి. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ఉద్ధృతం చేస్తా’ అని పైలట్ హెచ్చరించారు. ఆ గడువు మరో రెండు రోజుల్లో ముగియనుంది. మరోవైపు.. అశోక్ గెహ్లాట్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ఆయన జన సంఘర్షణ్ పేరుతో అజ్మీర్ నుంచి జైపూర్ వరకు ఐదు రోజుల పాదయాత్ర నిర్వహించారు. గెహ్లాట్ ప్రభుత్వం కనుక విచారణ చేపట్టని పక్షంలో తాను చేపట్టబోయే ఆందోళన మూలంగా తలెత్తే ఎలాంటి పరిణామాలకు భయపడబోనని, చివరి శ్వాస వరకు ప్రజల కోసమే పోరాడుతానని సచిన్ పైలట్ తెగేసి చెప్పారు. అంతటితో ఆగకుండా సీఎం గెహ్లాట్ కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని కాకుండా వసుంధరా రాజేను తన నాయకురాలిగా భావిస్తున్నాడంటూ పైలట్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇది కూడా చదవండి: అమిత్ షా ఎంట్రీ.. ఇక మణిపూర్‌లో ఏం జరగనుంది? -
అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్ వర్గీయుల మధ్య ఘర్షణ..వీడియో వైరల్..
జైపూర్: రాజస్థాన్‌లో కాంగ్రెస్‌లో సీఎం అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్ మధ్య చాలాకాలంగా వర్గపోరు నడుసున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడిది పతాక స్థాయికి చేరింది. ఇరు నేతల మద్ధతురాలు బాహాబాహీకి దిగారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దుల వర్షం కురిపించుకున్నారు. అజ్మేర్లో డీసీసీ నిర్వహించిన సమావేశం ఇందుకు వేదికైంది. కాంగ్రెస్ బేరర్లు, కార్యకర్తల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకునేందుకు ఏఐసీసీ కార్యదర్శి, రాజస్థాన్ కో-ఇంఛార్జ్ అమృత ధావన్ గురువారం అజ్మేర్ వెళ్లారు. అయితే ఈ సమావేశానికి వచ్చిన అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్ మద్దతుదారుల మధ్య సీట్ల అరేంజ్మెంట్ విషయంలో గొడవ జరిగింది. ఇరువర్గాల మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. అజ్మేర్లో సచిన్ పైలట్ మద్దతుదారులు ఎక్కువ ఉండటంతో వారంతా తమ నేతకు అనుకూలంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఇరువర్గాలను శాంతింప చేసేందుకు జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం అమృత ధావన్.. కాంగ్రెస్ ఆఫీస్ బేరర్లు, కార్యకర్తల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుని వెళ్లిపోయారు. కాగా.. అశోక్ గహ్లోత్ ప్రభుత్వంపై సొంత పార్టీ నేత అయిన సచిన్ పైలట్ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ హయాంలో జరిగిన అవినీతిపై ఆయన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, మాజీ సీఎం వసుందర రాజేతో ఒప్పందాలు కుదుర్చుకున్నారని పైలట్ ఆరోపిస్తున్నారు. ఈ విషయంపైనే ఐదురోజుల పాదయాత్ర కూడా చేసి నిరసన వ్యక్తం చేశారు. చదవండి: ముళ్ల కిరీటం కర్ణాటక ముఖ్యమంత్రి పీఠం.. ఐదేళ్లూ కొనసాగడం కత్తిమీద సామే -
Rajasthan Political Crisis: సంక్షోభం నుంచి సంక్షోభానికి!
రాజకీయాల్లో సంక్షోభాలు సహజమే కానీ, నిరంతరం సంక్షోభం నుంచి సంక్షోభానికి ప్రయాణించడం కష్టమే. జాతీయ వేదికపై మోదీ ఆవిర్భావం, బీజేపీ దూకుడు ఆరంభమైనప్పటి నుంచి వరుస ఎదురుదెబ్బలతో ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అలానే ఉంది. కర్ణాటకలో శనివారం దక్కిన ఘన విజయాన్ని ఆస్వాదించక ముందే అక్కడ సీఎం సీటుకై ప్రత్యర్థుల పోటీ మూడు రోజులుగా సాగుతూ పార్టీకి తలనొప్పిగా తయారైంది. మరోపక్క కన్నడనాట పోలింగ్‌కు సరిగ్గా ముందురోజు రాజస్థాన్‌లో సొంత ప్రభుత్వంపైనే మళ్ళీ ధ్వజమెత్తి, పాత కుంపటి కొత్తగా రాజేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ వ్యవహారంతో అధిష్ఠానానికి తలబొప్పి కడుతోంది. మరో ఆరేడు నెలల్లో అసెంబ్లీకి ఎన్నికలున్న వేళ రాజస్థాన్‌లో పొంచివున్న అంతర్గత తిరుగుబాటుతో పార్టీ సతమతమవుతోంది. అజ్మీర్ నుంచి జైపూర్ దాకా 5 రోజులు 125 కిలోమీటర్ల ‘జన్ సంఘర్ష్ పాద యాత్ర’ చేసిన సచిన్, సోమవారం ముగింపు ర్యాలీలో అశోక్ గెహ్లోత్ సారథ్యంలోని సొంత పార్టీ సర్కారుకే ఇచ్చిన అల్టిమేటమ్ అలాంటిది మరి. మరో 15 రోజుల్లో, మే నెలాఖరుకల్లా తన డిమాండ్లను నెరవేర్చకపోతే, రాష్ట్రవ్యాప్త ఆందోళనకు దిగుతానన్న సచిన్ గర్జన ఆందోళన రేపుతోంది. తాజా హెచ్చరికతో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్‌కూ, ఆయన జూనియర్ సహచరుడు సచిన్ పైలట్‌కూ మధ్య కొన్నేళ్ళుగా సాగుతున్న పోరాటం కీలక దశకు చేరుకున్నట్టు కనిపిస్తోంది. సచిన్ డిమాండ్లు మూడు: ‘అవినీతిమయ’ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను రద్దు చేసి, నిపుణులతో పునర్వ్యవస్థీకరించాలి. పేపర్ లీకులతో ఉద్యోగ భర్తీ పరీక్షలు రద్దు చేసినందున యువతరానికి తగిన పరిహారం చెల్లించాలి. 2013 నుంచి 2018 వరకు పాలన సాగించిన మునుపటి వసుంధరా రాజె సర్కార్ అవినీతిపై నిష్పాక్షిక విచారణకు ఆదేశించాలి. నిజానికి, అధిష్ఠానం హెచ్చరించి ఏప్రిల్ 10న జైపూర్‌లో ఒక రోజు నిరసన నిరాహార దీక్ష, ఇప్పుడీ యాత్ర చేసి, తాజాగా డిమాండ్లు నెరవేరకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళన తప్పదంటూ సచిన్ పూర్తిస్థాయి ధిక్కార స్వరంలోకి దిగిపోవడం గమనార్హం. తాను చేస్తున్న ఈ పోరాటం పార్టీ మీద, వ్యక్తుల మీద కాదు... అవినీతిపైన, యువతరం కోసమని ఈ యువ నేత పైకి చెబుతున్నారు. కానీ, ఆయన గురిపెట్టింది తనను సీఎం కానివ్వకుండా చేసిన అశోక్ గెహ్లోత్‌ను అనీ, అసలు లక్ష్యం సీఎం పీఠమనీ బహిరంగ రహస్యం. అశోక్‌కి చెప్పులో రాయి చెవిలో జోరీగలా తయారైన సచిన్‌ను అంత తొందరగా పక్కన పెట్టడం పార్టికి కష్టమే. ఎందుకంటే, ఆయన కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో గణనీయంగా ఉన్న గుజ్జర్ల వర్గానికిచెందిన నేత. పైగా యువతరంలో పాపులర్. పైగా, వయసు మీరిన అశోక్ పార్టీకి గతమైతే, 45 ఏళ్ల యువ సచిన్ పార్టీకి అవసరమైన భవిష్యత్తు. సచిన్ పార్టీని వీడినా, సొంత కుంపటి పెట్టుకున్నా కాంగ్రెస్‌కు పెద్ద దెబ్బే. గడచిన 2018 ఎన్నికల్లో పీసీసీ రథసారథిగా రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడానికి తీవ్రంగా శ్రమించిన చరిత్ర సచిన్‌ది. అప్పుడే సీఎంను చేస్తామని సచిన్‌కు మాటిచ్చి, అశోక్‌తో రాజీ ఫార్ములాలో డిప్యూటీ సీఎంగా సరిపుచ్చి, అనివార్యతలు ఏమైనా గడువు తీరినా సీఎంను మార్చక ఏమార్చడం అధిష్ఠానం స్వయంకృతాపరాధం. అందుకే, సచిన్ పదే పదే లక్ష్మణరేఖ దాటుతున్నా ఉపేక్షించక తప్పని పరిస్థితి. మూడేళ్ళ క్రితం 2020లోనే సచిన్ తిరుగుబాటు చేశారు. అప్పుడే అశోక్, సచిన్‌ల మధ్య విభేదాలు సర్కార్‌ను సంక్షోభంలోకి నెట్టాయి. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఎప్పటికప్పుడు సర్దుబాట్లు, బుజ్జగింపులతో ఉద్రిక్తతలు తగ్గించే ప్రయత్నం అధిష్ఠానం చేస్తున్నా అవేవీ ఆచరణలో ఫలించడం లేదన్నది తాజా పరిణామాల తాత్పర్యం. అశోక్ తప్పులూ అనేకం. రాజస్థాన్‌ను వదిలి, పార్టీ జాతీయ అధ్యక్ష పీఠం తీసుకొమ్మని అధిష్ఠానం కోరినా, మనస్కరించని ఆయన గత సెప్టెంబర్‌లో తన ఎమ్మెల్యేలతో నడిపిన నాటకం తెలిసిందే. అధిష్ఠానం అభీష్టాన్ని సైతం తెలివిగా పక్కకు తప్పించి అశోక్ సీఎంగానే కొనసాగడం, దూతగా వెళ్ళిన ఖర్గే విఫలమై చివరకు అనూహ్యంగా పార్టీ అధ్యక్షుడు కావడం, సీఎం సీటుపై సచిన్ ఆశలు మళ్ళీ నీరుగారడం ఒకప్పటి బలసంపన్న కాంగ్రెస్‌లోనైతే కలలో కూడా ఊహించలేం. అశోక్‌కు వసుంధరా రాజెతో అవగాహన, ఆత్మీయత ఉన్నాయనేది సచిన్ ఆరోపణ. అప్పట్లో అశోక్ వర్గ ఎమ్మెల్యేల పైన, ఇప్పుడు సచిన్ పైన చర్యలు తప్పవని పార్టీ నాయకత్వం బీరాలు పలికినా, చెబుతున్న ‘పెద్ద శస్త్రచికిత్స’ మాటలకే పరిమితమైంది. కాంగ్రెస్ అనివార్యత అర్థం చేసుకోదగినదే. ఎన్నికలకు అశోక్ సారథ్యాన్ని సహించే పరిస్థితిలో సచిన్ లేరు. అలాగని ఎన్నికలకు ముందు 2021 సెప్టెంబర్‌లో పంజాబ్‌లో సీఎంను మార్చి, చేజేతులా ఓటమి తెచ్చుకున్న హస్తం పార్టీకి మరో దుస్సాహసం చేసే ధైర్యం లేదు. ఇక, అశోక్ సారథ్యంలోనే రాజస్థాన్‌లో పార్టీ మళ్ళీ గెలిచినా, మరో అయిదున్నరేళ్ళు నిరీక్షించే ఓపిక ఇప్పటికే ఒకసారి మోసపోయాననుకుంటున్న సచిన్‌కు లేదు. రాజకీయ ధురంధరుడైన అశోక్ సంక్షేమం, సామాజిక న్యాయమే మంత్రాలుగా పేదల ప్రభుత్వ మనే పేరుకై పరిశ్రమిస్తున్నారు. ఇదే తననూ, తమ పార్టీనీ ఎన్నికల్లో గట్టెక్కిస్తుందని బలంగా నమ్ము తున్నారు. ఆ మాటేమో కానీ, అంతర్గత పోరుతో పార్టీ పలచనైపోతోంది. అశోక్ వివేకాన్ని ప్రద ర్శిస్తూ సచిన్‌ను కలుపుకొనిపోవడం, పిన్న వయస్కుడైన సచిన్ సహనంతో నిరీక్షించడం, అధిష్ఠానం తన పెద్దరికాన్నీ, నాయకత్వాన్నీ చూపడం అత్యవసరం. పార్టీ పెద్దలు తక్షణమే పరిస్థితిని చక్కదిద్దక పోతే కష్టం. జాప్యమయ్యేకొద్దీ బీజేపీకి కలిసొస్తుంది. పిట్ట పోరు, పిట్ట పోరు పిల్లి తీరుస్తుంది. -
గహ్లోత్‌కు సచిన్ పైలట్ అల్టిమేటం
జైపూర్: రాజస్తాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ దూకుడు పెంచారు. గత బీజేపీ ప్రభుత్వ హయాంలో అవినీతిపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలన్న తన డిమాండ్‌ను ఈ నెలాఖరులోగా నెరవేర్చకుంటే ఆందోళనను తీవ్రతరం చేస్తామంటూ సొంత పార్టీకే చెందిన సీఎం అశోక్ గహ్లోత్‌కు అల్టిమేటం జారీ చేశారు. ఈ డిమాండ్ సాధనలో భాగంగా ఆయన చేపట్టిన ఐదు రోజుల పాదయాత్ర సోమవారంతో ముగిసింది. ఈ సందర్భంగా తన మద్దతు దారులైన 15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో జైపూర్‌లో భారీ ర్యాలీ చేపట్టారు. రాజస్తాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఆర్పీఎస్సీ)ని రద్దు చేసి, పునర్వ్యవస్థీకరించాలని, పేపర్ లీక్‌తో పరీక్షలను రద్దు వల్ల నష్టపోయిన వారికి పరిహారం చెల్లించాలన్న రెండు కొత్త డిమాండ్లను వినిపించారు. నెలాఖరులోగా చర్యలు తీసుకోకుంటే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. -
Rajasthan Congress Crisis: ఓవర్ టు రాజస్తాన్
ఎస్.రాజమహేంద్రారెడ్డి: మల్లికార్జున ఖర్గే ఇంట గెలిచారు. ఇక రచ్చ గెలవడానికి సన్నద్ధమవుతున్నారు. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ బాస్‌గా 80 ఏళ్ల వయసులో నియమితుడైనప్పుడు, పార్టీని గాడిలో పెట్టడం ఖర్గేకు తలకు మించి భారమే అవుతుందని విశ్లేషకులు అంచనా వేశారు. దశాబ్ద కాలంగా వరుస పరాజయాలతో, పరాభవాలతో నానాటికీ తీసికట్టుగా తయారవుతున్న కాంగ్రెస్‌కు యువరక్తం ఎక్కిస్తే ఆ జోష్ వేరేగా ఉండేదని కూడా వ్యాఖ్యానించారు. గాంధీల (సోనియా, రాహుల్)కే చేతకానిది ఈయన వల్ల అవుతుందా అంటూ పెదవి విరిచిన వాళ్లూ ఉన్నారు. శనివారం ఖర్గే సొంత రాష్ట్రం కర్ణాటక అసెంబ్లీ ఫలితాలు చూశాక చాలామందికి ఆయన నాయకత్వ పటిమపై అనుమానాలు పటాపంచలైపోయాయి. నిజానికి కాంగ్రెస్ సాధించిన ఈ విజయం మామూలుదా! ఇంకోపార్టీ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా సొంత కాళ్లమీద మరో ఐదేళ్లు మందగమనంతోనో, వాయువేగంతోనో పరుగెత్తగల ఆత్మవిశ్వాసాన్ని, సత్తాను కాంగ్రెస్‌కు అందించింది. కర్ణాటక కాంగ్రెస్‌కు రెండు కళ్లలాంటి మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మధ్య రగులుతున్న చిరకాల వైరాన్ని చల్లార్చడం ఎవరి తరమూ కాదన్న సమయంలో ఖర్గే జాతీయ అధ్యక్షుని హోదాలో రంగంలోకి దిగి చాకచక్యంగా ఆ అగ్నిని చల్లార్చారు. అదిగో అక్కడే, ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడటానికి ముందే, యుద్ధభూమిలోకి దిగకముందే కాంగ్రెస్‌కు సగం విజయాన్ని చేకూర్చారు. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ప్రచారం మొదలై ఓటేసే తేదీ వచ్చేదాకా సిద్ధరామయ్య, శివకుమార్ పల్లెత్తు మాట అనుకోకుండా ఆప్త మిత్రుల్లా కనిపించడం కర్ణాటక ఓటర్లలోకాంగ్రెస్పై నమ్మకాన్ని పెంచింది. రాహుల్ భారత్ జోడో యాత్ర ఎన్నికలకు ముందే కర్ణాటక మీదుగా వెళ్లేట్టు వ్యూహరచన చేయడం కూడా కాంగ్రెస్‌కు లాభించింది. ఈ రెండు అంశాల్లోనూ ఖర్గే వ్యూహాత్మకంగా వ్యవహరించి కన్నడిగుల మనసు కొల్లగొట్టారు. దాని ఫలితమే ఈ సానుకూల ఫలితాలు. రాజస్తాన్ పరీక్షకు రెడీ తన మొదటి లక్ష్యాన్ని జనం జేజేల మధ్య దిగ్విజయంగా చేరుకున్న ఖర్గే తదుపరి లక్ష్యంవైపు దృష్టి సారించారు. బెంగళూరులో మోగిన విజయదుందుభి 1,921 కిలోమీటర్ల దూరంలో ఉన్న జైపూర్‌లో ప్రతిధ్వనించింది. ఒకరకంగా ఇది రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికలకు ఖర్గే మోగించిన నగారా! అంతర్గత పోరుతో సతమతమవుతున్న అక్కడి పార్టీ వ్యవహారాలను కొలిక్కి తేవడం ఖర్గే ముందున్న తక్షణ కర్తవ్యం. సీఎం గహ్లోత్, యువ నేత సచిన్ పైలట్ మధ్య సయోధ్య కుదర్చాల్సి ఉంది. సీన్ రాజస్తాన్‌కు మారుతుంది. అదే సీన్, అదే దర్శకుడు. పాత్రలే మారతాయి. అంతే. చేయి తిరిగిన దర్శకుడు గనుక అక్కడా లక్ష్యాన్ని చేరతారంటున్నారు. గహ్లోత్– పైలట్ విభేదాలు తారస్థాయికి 2018లో జరిగిన రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను విజయపథంలో నడిపించిన పైలట్‌ను కాదని గహ్లోత్‌కు పట్టం కట్టడంతో వారి మధ్య అగ్గి రాజుకుంది. ఐదేళ్లు గడిచి మళ్లీ ఎన్నికల ముంగిట్లోకి వచ్చేసరికి అది కాస్తా కార్చిచ్చులా వ్యాపించింది. సొంత పార్టీ మీద, ముఖ్యమంత్రి మీదా అలిగి ధర్నా చేసేందుకూ పైలట్ వెనకాడలేదంటే ఆయనలో అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. మరోవైపు గతేడాది సెప్టెంబర్‌లో తనను వరించి వచ్చిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవిని గహ్లోత్ తృణీకరించారు. సీఎం పదవే ముద్దంటూ బింకానికి పోయారు. అప్పటికే ఆయన పేరిట 12 సెట్ల నామినేషన్ పత్రాలు కూడా సిద్ధమయ్యాయి. అధిష్టానం కోరికను, లేదా ఆదేశాన్ని మన్నించకుండా రాష్ట్రానికే పరిమితమైన గహ్లోత్‌కు, తన స్థానంలో అధ్యక్షుడైన ఖర్గే ముందు చేతులు జోడించి నిల్చోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. విభేదాలు పక్కన పెడతారా, అధిష్టానం ముందు హాజరవుతారా అంటూ ఖర్గే ఇప్పటికే ఆ ఇద్దరికీ తాఖీదు పంపించారు. గాంధీల ఆశీర్వాదంతో అధ్యక్షుడైన ఖర్గే కర్ణాటక విజయంతో మరో మెట్టు పైకి చేరుకున్నారు. పార్టీలో ఇప్పుడు ఆయన మాటలకు తిరుగులేదు. త్వరలోనే గహ్లోత్, పైలట్లను పిలిచి బుజ్జగించడమో, తప్పదనుకుంటే హెచ్చరించడమో తప్పని పరిస్థితిలో ఖర్గే ఉన్నారు. ఈ ఏడాది డిసెంబరులో జరగనున్న రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికలను ఎదురీదడం కాంగ్రెస్‌కు కష్టమేనన్నది అంతర్గత నివేదికల సారాంశం. ఈ నివేదికల నేపథ్యంలో ఖర్గే మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించేందుకు అవసరమైన పథకాలను సిద్ధం చేసుకుంటున్నారు. పక్షం రోజుల ముందే సీనియర్ నేతలు కమల్‌నాథ్, వేణుగోపాల్ ద్వారా సచిన్‌కు రాయబారం పంపారు. విభేదాలు పక్కన పెడితే ఏఐసీసీ జనరల్ సెక్రటరీ పదవితో పాటు వర్కింగ్ కమిటీలోనూ చోటు కల్పిస్తానని ఆశ చూపారు. పైలట్ ఈ ప్రతిపాదనను తోసిపుచ్చారని అభిజ్ఞ వర్గాల భోగట్టా. ఈ నేపథ్యంలో పైలట్‌ను రాజస్తాన్ పీసీసీ అధ్యక్షునిగా నియమించాలన్నది ఖర్గే మరో ఆలోచనగా ఉంది. పార్టీ టికెట్ల విషయంలో, మంత్రివర్గంలో కొన్ని స్థానాల విషయంలో తనమాట చెల్లితే అభ్యంతరం లేదని పైలట్ భావిస్తున్నట్టు వినికిడి. అయితే ఈ ప్రతిపాదనకు సమ్మతించేది లేదని గహ్లోత్ బాహాటంగానే స్పష్టం చేశారు. దీనికి విరుగుడుగా పైలట్ ఈ నెల చివరి వారంలోనో, వచ్చే నెల మొదటి వారంలోనో పార్టీని చీల్చడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తన తండ్రి రాజేశ్ పైలట్ వర్ధంతి (జూన్ 11) నాటికి పైలట్ చీలిక వర్గాన్ని తయారు చేసి తీరతారంటున్నారు. అదే జరిగితే వీరి వ్యవహారాన్ని అధిష్టానం మరింత సీరియస్‌గా తీసుకునే అవకాశముంది. గహ్లోత్, పైలట్ తమ వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనపెట్టి పార్టీ నిర్ణయానికి బద్ధులుగా ఉండాలన్నది అధిష్టానం మాటగా ఖర్గే హితవు చెబుతున్నారు. గాంధీలు కూడా ఖర్గే మాటే ఫైనల్ అన్న సంకేతాన్ని పరోక్షంగా ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో గహ్లోత్, పైలట్ మధ్య రాజీ కుదిర్చి రాజస్తాన్‌లోనూ పార్టీని ఎన్నికల యుద్ధక్షేత్రంలో సమర్థంగా ముందుకు నడపడం ఖర్గేకు పెద్ద కష్టమేమీ కాదు. -
ఓవైపు కన్నడనాట హోరాహోరీ.. మరోవైపు కాంగ్రెస్‌లో ఇంటి పంచాయితీ!
రాజస్తాన్ కాంగ్రెస్‌లో సీఎం అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ల మధ్య అంతర్గత విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. మరోసారి ఆ విభేదాలు తెరపైకి వచ్చాయి. ఓ రేంజ్లో సచిన్ పైలట్.. సీఎంపై విమర్శల దాడి చేశారు. గెహ్లాట్ నాయకురాలు వసుంధర రాజేనని.. సోనియా గాంధీ కాదేమో! అని సెటైరికల్ కామెంట్ చేశారు. సచిన్ పైలట్ 2020లో కొంతమంది ఎమ్మెల్యేలతో కలసి గెహ్లాట్ సర్కార్‌పై తిరుగుబాటుకి యత్నించారు. ఐతే ఆ సయమంలో తనని బీజేపీ నాయకురాలు వసుంధర రాజే తనని ఆదుకున్నారని ప్రభుత్వం పడిపోకుండా సాయం చేశారని ధోల్పూర్లో జరిగిన ర్యాలీలో వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే సచిన్ పైలట్ ఆయనకు చురకలు అంటిస్తూ కామెంట్ చేశారు. ఆయన దృష్టి (గెహ్లాట్)లో వసుందర రాజే తనకు చీఫ్ అని సెటైర్ వేశారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న మాదిరి సచిన్ పైలట్ అటు గెహ్లాట్‌ను, ఇటు బీజేపీని టార్గెట్ చేస్తూ మాటల తుటాలు పేల్చారు. అంతేగాదు తాను పదేపదే అవినీతి గురించి అభ్యర్థనలు చేసినా.. ఆయన ఎందుకు ఎటువంటి చర్యలు తీసుకోకుండా మెతకగా వ్యవహరిస్తున్నారో ఇప్పుడు అర్థమైందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీజేపీకి, సీఎం మధ్య అవగాహన ఉంది కాబట్టే ఇలా చేస్తున్నారని తెలిసిందన్నారు. గత రెండున్నరేళ్లుగా గెహ్లాట్ తనపై ఎన్నోసార్లు మాటల దాడి చేసినా, దూషించినా, పార్టీని దెబ్బతీయకూడదనే మౌనంగా ఊరుకున్నాని చెప్పారు. నా యాత్ర సీఎం గెహ్లాట్‌ని లక్ష్యంగా చేసుకుని చేయడం లేదని కూడా పైలట్ స్పష్టం చేశారు. తాను ఎవరికీ వ్యతిరేకం కాదని, అవినీతికి మాత్రమే తాను వ్యతిరేకినని ఆయన నొక్కి చెప్పారు. రాజస్తాన్‌లో కూడా ఎమ్మెల్యేలు నాయకత్వ మార్పును కోరుకుంటున్నారంటూ తాను గతంలో గెహ్లాట్‌పై చేసిన తిరుగుబాటుని సమర్థించుకునే యత్నం చేశారు పైలట్.అయితే, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని వీడే యోచనలో పైలెట్ ఉన్నారని, ఈ క్రమంలోనే ఇలా వ్యవహరిస్తున్నారని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు.ఇదిలా ఉండగా, 2018లో రాజస్తాన్‌లో కాంగ్రెస్ గెలుపొందడంతో ముఖ్యమంత్రి మంతి పదవిపై గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య వైరం రాజుకుంది. ఈ విషయమై 2020లో కొందరు ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేయడమే గాక ఢిల్లీలో రోజుల తరబడి నిరసన చేశాడు పైలట్. ఐతే కాంగ్రెస్ అధినాయకత్వం అతని సమస్యను పరిష్కారిస్తామని హామీ ఇవ్వడంతో సచిన్ వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే. కాగా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల హడావిడిలో ఉన్న కాంగ్రెస్‌కు ఈ సమస్య మింగుడుపడని అంశంగా మారింది. (చదవండి: ఏం స్వారీ చేశాడు భయ్యా! అర్థరాత్రి తాగిన మైకంలో ఎద్దుపైకి ఎక్కి..) -
కాంగ్రెస్ ఖజానా నింపుతున్న గహ్లోత్
భరత్పూర్(రాజస్తాన్): రాజస్తాన్ రాష్ట్ర కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలపై బీజేపీ అగ్రనేత అమిత్ షా విమర్శలు గుప్పించారు. శనివారం రాష్ట్రంలోని భరత్‌పూర్‌లో బీజేపీ బూత్‌స్థాయి కార్యకర్తల సమావేశంలో షా ప్రసంగించారు. ‘ ఓవైపు అవినీతి సొమ్ముతో కాంగ్రెస్ అధిష్టానం ఖజానాను సీఎం గహ్లోత్ నింపేస్తుంటే మరోవైపు సరైన కారణం లేకుండానే సచిన్ పైలట్ ధర్నాకు కూర్చుంటున్నారు. క్షేత్ర స్థాయిలో పైలట్ ఎంతగా చెమటోడ్చినా లాభం లేదు. ఎందుకంటే పార్టీ ఖజానాను నింపేస్తూ అధిష్టానం దృష్టిలో పైలట్ కంటే గెహ్లాట్ కొన్ని మెట్లు పైనే ఉన్నారు. రాష్ట్రాన్ని గెహ్లాట్ అవినీతి అడ్డాగా మార్చారు. రాష్ట్ర సొమ్మును లూటీ చేసి ఆ ధనంతో పార్టీ ఖాతా నింపుతున్నారు. దిగబోనని గహ్లోత్ సీఎం కుర్చీపై భీష్మించుకుని కూర్చున్నారు. ఈసారి సీఎం కుర్చీ నాదేనని పైలట్ ప్రతిజ్ఞ చేస్తున్నారు. వీరిద్దరూ అనవసరంగా అధికారం కోసం పోరాడుతున్నారు. వాస్తవానికి ఈ దఫా అధికారంలోకి వచ్చేది బీజేపీ’ అని అమిత్ షా వ్యాఖ్యానించారు. ‘ వారసత్వ రాజకీయాల కోసమే ఇన్నాళ్లూ గహ్లోత్ ప్రభుత్వం పనిచేసింది. కుల రాజకీయాలను రాజేసింది. బుజ్జగింపుల్లో టాప్ మార్కులు ఈ ప్రభుత్వానికే పడతాయి. రాష్ట్రంలో రెండు డజన్లకుపైగా పేపర్లు లీక్ అయ్యాయి. అయినా ఇంకా మీకు అధికారం కావాలా గహ్లోత్ జీ ? లీకేజీలో సెంచరీ కొడతారా ఏంటి ?. రాష్ట్ర ప్రజలకు మీరిక అక్కర్లేదు. ఈసారి మూడింట రెండొంతుల సీట్లు మావే. మొత్తం పాతిక ఎంపీ సీట్లూ గెల్చేది మేమే’ అని షా ధీమా వ్యక్తంచేశారు. ‘ ఇటీవలే రాహుల్ బాబా దేశమంతటా నడుస్తూ భారీ యాత్ర ముగించారు. కాంగ్రెస్‌కు లబ్ధి ఏమేరకు చేకూరుతుందని నన్ను పాత్రికేయులు అడిగారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయిందిగా’ అని షా అన్నారు. -
అతని వైపుకి కాంగ్రెస్ టర్న్ తీసుకోదు! ఎందుకంటే..
రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు మొదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా భరత్‌పూర్‌లో బూత్ స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజస్తాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ వైపుకి కాంగ్రెస్ టర్న్ తీసుకోదని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి ఆశోక్ గెహ్లాట్ వైపే కాంగ్రెస్ మొగ్గు చూపుతుందని. ఎందుకంటే కాంగ్రెస్ ఖజనాను నింపడంలో గెహ్లాట్ సహకారమే ఎక్కువ కాబట్టి అంటూ సెటైర్లు వేశారు. ఆ విషయంలో సచిన్ పైలట్ సహకారం తక్కువ అని దీంతో అతని వైపు మెజార్టీ సభ్యులు ఉండరన్నారు. అంతేగాదు గెహ్లాట్ రాజస్తాన్ ప్రభుత్వాన్ని అవినీతికి అడ్డాగా మార్చి దోచుకున్నారన్నారు. ఆ అవినీతి సొమ్ము కాంగ్రెస్ పార్టీ ఖజానాకు పోయిందని ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన 2008లో జైపూర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితులను నిర్దోషిగా విడుదల చేయడంపై కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. రాజస్తాన్‌లో త్రీడీ ప్రభుత్వం ఉందని, మూడు 'డీ'లు అర్థం ఏమిటంటే.. డాంగే(అల్లర్లు), దుర్వ్యవర్(అన్యాయంగా ప్రవర్తించడం), దళితులపై ధౌర్జన్యాలు అంటూ కొత్త అర్థాలను ఆపాదిస్తూ విరుచుకుపడ్డారు. అలాగే ప్రజలు ఎన్నికలలో ఈ పభ్రుత్వాన్ని తరిమికొడతారని, అసెంబ్లీలో బీజేపీ భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమాగా చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం పనితీరు, పార్టీ సిద్ధాంతాలు, ఆయనకు ఉన్న ప్రజాధరణ తదితరాల కారణంగానే ఎన్నికల బరీలోకి దిగుతోందన్నారు. ఆశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాజస్తాన్ చరిత్రలోని అవినీతి ప్రభుత్వాల్లో ఒకటని, దీంతో ప్రజలు విసిగిపోయారంటూ అమిత్ షా కాంగ్రెస్‌పై విరుచుకపడ్డారు. కాగా, సచిన్ పైలట్ సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేయడమే గాక పార్టీ వ్యతిరేక చర్యగా పరిగణిస్తామని పెలట్‌ని హెచ్చరించింది కూడా. (చదవండి: పరువు నష్టం కేసులో రాహుల్‌కి ఉపశమనం..ప్రత్యక్ష హాజరుకు మినహాయింపు) -
కాంగ్రెస్‌లో సరికొత్త ముసలం.. సచిన్ పైలట్‌కు కోపం ఎందుకు వచ్చింది?
ఎస్.రాజమహేంద్రారెడ్డి సచిన్ పైలట్‌కు హఠాత్తుగా కోపం వచ్చింది. నాలుగున్నరేళ్లుగా లోలోపల రగిలిపోతున్న అసంతృప్తిని ఒకే ఒక్క చర్యతో బలంగా బహిర్గతం చేశారు. ఎంత బలంగా అంటే, కాంగ్రెస్ అధిష్టానం కంగుతినేంతగా! రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్ ఉక్కిరిబిక్కిరయ్యేంతగా! మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజె అవినీతిపై విచారణకు ఆదేశించకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారంటూ గహ్లోత్ తీరును బాహాటంగానే దుయ్యబట్టిన పైలట్ ఈ నెల 11న ఏకంగా ఒక రోజు నిరసన దీక్షకు కూడా కూర్చున్నారు! అధిష్టానం హెచ్చరించినా, బుజ్జగించినా ఆయన ససేమిరా అన్నారు. దీన్ని ఏమీ పట్టించుకోనట్టుగా గహ్లోత్ పైకి గాంభీర్యం ప్రదర్శించినా లోలోపల తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. స్వపక్షీయుడే అయిన మాజీ కేంద్ర మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం అయిన పైలట్ ప్రతిపక్షంలా తనపైనే దాడికి దిగడం గహ్లోత్‌కు అసలు మింగుడు పడలేదు. ఎవరేమనుకున్నా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రి కావాలన్న తన లక్ష్యాన్ని పైలట్ కాస్త గట్టిగానే వినిపించారు. ఒకవిధంగా ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టారన్నమాట! సీఎం పదవిపై ఉన్న కాంక్షను వెలిబుచ్చడం ఒకటైతే, ప్రస్తుత ముఖ్యమంత్రి గహ్లోత్, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజెల మధ్య ఉన్న లోపాయికారీ ఒప్పందాన్ని వేలెత్తిచూపడంరెండోది. అంతా బాగుందనుకున్న రాజస్తాన్ కాంగ్రెస్‌లో ఇది సరికొత్త ముసలం...! ► గహ్లోత్–పైలట్ తలనొప్పిని ఎలా పరిష్కరించాలో తెలియక కాంగ్రెస్ అధిష్టానం తలపట్టుకు కూర్చుంది. ఇలాంటి అంతర్గత విభేదాలను పరిష్కరించడంలో ఆరితేరిన కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సైతం ఎవరినీ ఏమీ అనలేక, మధ్యేమార్గంగా ‘మేజర్ సర్జరీ’తో వివాదం సద్దుమణిగేలా చేస్తామన్నారు. అయితే ఆ శస్త్రచికిత్స ఎప్పుడు, ఎలా అన్నది మాత్రం దాటవేశారు. బహుశా సోనియా, రాహుల్‌గాంధీల ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నట్టుంది. పైలట్‌లో ఈ రీతిన అసంతృప్తి పేరుకుపోవడానికి అధిష్టానం వైఖరే కారణం. రాజస్తాన్ కాంగ్రెస్ అధ్యక్షునిగా 2018లో పార్టీని విజయపథాన నడిపించిన పైలట్‌కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టినట్టే పెట్టి, గహ్లోత్ చాణక్యానికి తలవంచడం అసంతృప్తిని రాజేసింది. బీజేపీ నుంచి అధికారాన్ని చేజిక్కించుకున్న ఆనందం ఆవిరవకుండా పైలట్‌ను బుజ్జగించి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి మమ అనిపించారు. సందర్భాన్ని బట్టి అప్పట్లో ఆ పదవితో పైలట్ సంతృప్తి పడినట్టు కనిపించినా రెండేళ్లు తిరిగేసరికి తనను తాను సర్దిబుచ్చుకోలేక రాజీనామా చేసి అసంతృప్తిని వెళ్లగక్కారు. తాజాగా దీక్షకు దిగి గహ్లోత్తోనూ, అధిష్టానంతోనూ అమీతుమీకే సిద్ధమయ్యానన్న సంకేతాలను పంపగలిగారు. క్రమశిక్షణ చర్యలు తప్పవని రాజస్తాన్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఎస్.ఎస్.రణ్‌ధవా నేరుగానే హెచ్చరించారు. అయితే పైలట్ మాత్రం ఇవన్నీ పట్టించుకునే స్థితిలో ఉన్నట్టు లేదు. ఈసారి సీఎం పదవి చేజారితే మరో ఐదున్నరేళ్లు ఎదురు చూడాల్సి వస్తుందని ఆయన భయం. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే మళ్లీ గహ్లోత్‌నే సీఎంగా చూడటం పైలట్‌కు సుతరామూ ఇష్టం లేదు. మరోవైపు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగుతున్న రాజస్తాన్ పడవ వివాదాల సుడిగుండంలో చిక్కుకుని మునిగిపోవడం కాంగ్రెస్ అధిష్టానానికి రుచించడం లేదు. గహ్లోత్‌ను మళ్లీ సీఎం పదవి నుంచి తప్పించడానికి అధిష్టానం విముఖంగా ఉంది. ఎన్నికల ముందు సీఎంను మార్చి ఓటర్లను గందరగోళంలో పడేయడం తప్పుడు సంకేతాలను పంపినట్టవుతుందని భావిస్తోంది. గహ్లోత్‌పై పైలట్ చేసిన ఆరోపణలకు బలం చేకూర్చడం కూడా కాంగ్రెస్‌కు సుతరామూ ఇష్టం లేదు. పంజాబ్‌లో సిద్ధూ ఉదంతం అక్కడి ఎన్నికల్లో ఎలాంటి ఫలితాన్నిచ్చిందో కాంగ్రెస్‌కు అనుభవమే కాబట్టి మరోసారి అదే తప్పును పునరావృతం చేయడానికి సాహసించడం లేదు. అయితే ఈ సాకులన్నీ తనను మోసగించడానికేనని పైలట్ గట్టిగా నమ్ముతున్నారు. మరోవైపు కాంగ్రెస్ అంతర్గత పోరును తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ తన ప్రయత్నాలను ముమ్మరం చేయడం గమనార్హం. ఇప్పటికిప్పుడు బీజేపీ పరిస్థితి అమాంతం మెరుగయ్యేలా లేకపోయినా కులం కార్డు తమకు ఈసారి లాభిస్తుందని కమలనాథుల ఆశ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సీపీ జోషి (బ్రాహ్మణ్), బీజేపీ పక్ష నాయకుడిగా రాథోడ్ (రాజ్‌పుత్), ఉప నాయకుడిగా సతీశ్ పునియా (జాట్)లను నియమించడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. పథకాలను నమ్ముకున్న గహ్లోత్ 2018 నుంచి ఇప్పటిదాకా తను ప్రవేశపెట్టిన ప్రజాకర్షక పథకాలు 2023లో మరోసారి విజయం అందిస్తాయని గహ్లోత్ దృఢంగా నమ్ముతున్నారు. పార్టీలకు అతీతంగా ఇతర నాయకులతో తనకున్న సత్సంబంధాలు కూడా విజయావకాశాలను ప్రభావితం చేస్తాయని విశ్వసిస్తున్నారు. ఇటీవలే వందేభారత్ రైలు ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఒక అడుగు ముందుకేసి గహ్లోత్ గుణగణాలను ప్రశంసించడం గమనార్హం. అయితే మరో ఆరేడు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలంటే గహ్లోత్–పైలట్ తమ విభేదాలను పక్కన పెట్టి సామరస్యంగా పనులు చక్కదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాంగ్రెస్ అధిష్టానం కూడా ఇదే కోరుకుంటోంది. కానీ వారు బహిరంగంగానే సై అంటే సై అనుకోవడం కాంగ్రెస్‌పై ఓటర్లకున్న విశ్వాసాన్ని దెబ్బతీసేలా ఉంది. వివాదాలను తెగేదాకా లాగడం కాంగ్రెస్ అధిష్టానానికి అలవాటుగా మారింది. సెప్టెంబరులోనే అధికార మార్పిడికి ఒకసారి విఫలయత్నం చేసి చేతులెత్తేసిన గాంధీలు మరోసారి అలాంటి సాహసానికి దిగే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరు. ఖర్గే కూడా గాంధీల మార్గంలోనే పయనిస్తున్నారు. ఉన్నపళంగా పైలట్‌ను సీఎం చేసే దుస్సాహసానికి ఒడిగట్టే స్థితిలో ఆయన కూడా లేరు. పైలట్ కూడా ఇప్పటికిప్పుడు సీఎం పీఠం అధిష్టించాలన్న ఆలోచనలో లేరు. తాను వచ్చే ప్రభుత్వానికి ‘పైలట్’ కావాలని మాత్రమే కోరుకుంటున్నారు. 2020లో తిరుగుబాటు చేసినప్పుడు తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకోవడంలో పైలట్ విఫలమై ఉన్న డిప్యూటీ సీఎం పదవి కూడా వదులుకున్నారాయన. ప్రస్తుతం ఆయన ముందున్న లక్ష్యం మరోసారి ఎన్నికల ముందు పార్టీ అధ్యక్షునిగా ఎంపికై తన మద్దతుదార్లకు ఎక్కువ టికెట్లు ఇప్పించుకోవడం ఒక్కటే! అదీ అధిష్టానం అనుకూలంగా ఉంటేనే సాధ్యమవుతుంది. కానీ తాజా దీక్షతో ఆ అవకాశం కూడా పైలట్ చేజారినట్టు కన్పిస్తోంది! ఇక పైలట్‌కు మిగిలింది... ► చిన్న పార్టీలైన హనుమాన్ బెనీవాల్ పార్టీ, బీఎస్పీ, ఎన్సీపీలతో జతకట్టి స్వతంత్రంగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం. ► సొంతంగా ప్రాంతీయ పార్టీ స్థాపించి భావసారూప్యం గలవారిని చేర్చుకోవడం. ► పైలట్ గుజ్జర్ వర్గానికి చెందిన వారు కాబట్టి గుజ్జర్ల ఓట్లతో గెలవగలిగిన మొత్తం 30 అసెంబ్లీ సీట్లపైనా పూర్తిగా పట్టు బిగించడం. ► ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి ఎన్నికల్లో పోటీ చేయడం. అయితే రాజకీయాల్లో తనకన్నా జూనియర్ అయిన కేజ్రీవాల్‌తో కూడటం ఆయనకు రుచించకపోవచ్చు. ► కాంగ్రెస్‌లోనే ఉంటూ పోరాటం కొనసాగిస్తూనే తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం. కొసమెరుపు.. రాజస్తాన్ ప్రభుత్వాన్ని పైలట్‌గా ముందుండి నడిపించాలన్న సచిన్ ఆశ నెరవేరుతుందో లేదో ఇప్పటికిప్పుడే చెప్పలేం. కానీ ఒకటి మాత్రం నిజం. కాంగ్రెస్ గనక ఈసారి ఆయన లేకుండా ఎన్నికల బరిలోకి దిగితే 2013లో వచ్చిన 21 సీట్లు కూడా రాకపోవచ్చనేది విశ్లేషకుల అంచనా. అంటే సచిన్ కాస్త కష్టపడితే రాష్ట్రానికి ‘పైలట్’ అవుతారనే కదా!! -
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా.. సచిన్ పైలట్‌కు కాంగ్రెస్ వార్నింగ్
జైపూర్: రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు చల్లారడం లేదు. గత కొన్నేళ్లుగా సాగుతున్న రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ల మధ్య ఆధిపత్య పోరు రోజురోజుకీ తీవ్రతరమవుతోంది. సమయం చిక్కినప్పుడల్లా గహ్లోత్‌పై అసంతృప్తి వెల్లగక్కుతున్న సచిన్.. తాజాగా మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సచిన్ పైలట్ మంగళవారం ఒక రోజు ధర్నా చేపట్టారు. రాజస్థాన్‌లో వసుంధర రాజే నేతృత్వంలోని గత బీజేపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరిపేందుకు అశోక్ గహ్లోత్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్షకు కూర్చునున్నారు. అయితే పైలట్ చర్యపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిని పార్టీ వ్యతిరేక చర్యగా పరిగణించడబుతుందని అతన్ని హెచ్చరించింది. ఈ సమస్యను అసలు పైలట్ తమతో చర్చించలేదని కాంగ్రెస్ పేర్కొంది. ఈ మేరకు రాజస్థాన్ కాంగ్రెస్ ఇంచార్జీ సుఖ్జీందర్ సింగ్ రంధావా ఓ ప్రకటన విడుదల చేశారు. పైలట్ తనతో నిరాహార దీక్ష గురించి ఎప్పుడూ చర్చించలేదని తెలిపారు. అంతేగాక ధర్నా చేయడం పార్టీ ప్రయోజనాలకు, కార్యకలాపాలకు విరుద్ధమని పేర్కొన్నారు. అతనికి సొంత ప్రభుత్వంతో ఏదైనా సమస్య ఉంటే పార్టీతో ప్రశాంతంగా చర్చించాలని సూచించారు. ఇలా మీడియా, ప్రజల ఎదుటకు రావడం సరికాదన్నారు. ‘నేను గత అయిదు నెలలగా ఏఐసీసీ ఇంచార్జ్‌గా ఉన్నారు. పెలట్ ఎప్పుడూ ఈ సమస్య గురించి మాట్లాడలేదు. నేను అతనితో టచ్‌లో ఉన్నాను. సచిన్ కాంగ్రెస్‌కు ఎంతో కావాల్సిన వ్యక్తి. కాబట్టే ప్రశాంతంగా చర్చించుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను’ అని రంధావా తెలిపారు. మరోవైపు.. సొంత పార్టీ నేత తీసుకున్న నిర్ణయం పార్టీ అధిష్టానానికి బహిరంగ సవాల్ అంటూ. కాంగ్రెస్‌ను టార్గెట్‌గా బీజేపీ విమర్శలు గుప్పించింది. చదవండి: భారత్‌లోని ముస్లింలపై నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు.. #WATCH | Rajasthan Congress leader Sachin Pilot on a daylong fast calling for action against alleged corruption during the previous Vasundhara Raje-led government in the state pic.twitter.com/MCav6OinIQ — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) April 11, 2023 -
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేయవద్దు అని అధిష్టానం సూచన
-
కాంగ్రెస్‌కు మరో కొత్త సమస్య..నిరాహార దీక్ష చేస్తానంటున్న సచిన్ పైలట్
కాంగ్రెస్‌లోని అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. రాజస్తాన్‌లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌పై డిప్యూటి ముఖ్యమంత్రి సచిన్ పైలట్ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. దీంతో రాజస్తాన్‌లోని కాంగ్రెస్‌లో తాజగా రాజకీయ సంక్షోభం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్, సీఎం గెహ్లాట్ల మధ్య మొదటి నుంచి ఉన్న విభేధాలు కాస్త ఇప్పుడు మరింత తీవ్ర రూపం దాల్చాయి. గతంలో వసుంధర రాజే నేతృత్వంలో జరిగిన అవినీతికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి అనేక సార్లు లేఖలు రాసినా.. ప్రయోజనం లేకుండా పోయిందన్నారు పైలట్. పైగా ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదని, అందువల్లే తాను అవినీతికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేయనున్నట్లు తెలిపారు. తాను అవినీతిపై చర్యలు తీసుకుంటానని ప్రజలకు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకునేందుకు ఏప్రిల్ 11న నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు చెప్పారు. ఆశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ప్రజలకు కావల్సినవి ఏమీ నెరవేర్చడం లేదని ఆరోపణలు చేశారు. తాను సీఎం అశోక్ గెహ్లాట్‌కు అవినీతి గురించి ఎన్నో లేఖలు రాశానని, కానీ ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదని చెప్పుకొచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మనం ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకున్నామని నిరూపించేలా మన పనులు ఉండాలని పైలట్ అన్నారు. అవినీతిని అరికట్టడానికి దర్యాప్తు సంస్థలను ఉపయోగించలేకపోతున్నామా? లేక దుర్వినియోగ మవుతున్నాయా? అని ప్రజలకు సందేహం వచ్చేలా పరిస్థితి ఉంకూడదన్నారు. మనం వాగ్దానాలు నెరవేర్చడం లేదని కార్యకర్తలు, ప్రజలు భావించకూడదని చెప్పారు. ప్రభుత్వం నుంచి సరైన విధంగా స్పందన రాకపోవడంతోనే తాను నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు పైలట్ తెలిపారు. (చదవండి: సైబర్ మోసంలో డబ్బు పొగొట్టుకున్న భార్య.. తలాక్ చెప్పిన భర్త) -
పుల్వామా అమర జవాన్ల భార్యల అరెస్ట్
జైపూర్: పుల్వామా ఉగ్ర దాడిలో మరణించిన అమరవీర జవాన్ల భార్యలను రాజస్థాన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు డిమాండ్లతో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్ల భార్యలు జైపూర్‌లోని సచిన్ పైలట్ ఇంటి ఎదుట ఆమరణ దీక్ష చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం దీక్షను భగ్నం చేసి.. స్థానిక స్టేషన్‌కు తరలించారు పోలీసులు. కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్ నివాసం ఎదుట ఫిబ్రవరి 28వ తేదీ నుంచి ఈ ముగ్గురు మహిళలు నిరసన ప్రదర్శనకు దిగారు. ఈ క్రమంలో సచిన్ పైలెట్ ఆ ముగ్గురితో మాట్లాడినా కూడా స్పష్టమైన హామీ ఇవ్వలేకపోయారు. దీంతో.. తమ దీక్షను ఆమరణ దీక్షగా మార్చుకున్నారు వాళ్లు. అయితే శుక్రవారం ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి స్థానిక పీఎస్‌కు తరలించారు. అరెస్ట్ క్రమంలో పోలీసులు ఆ మహిళలతో దురుసుగా ప్రవర్తించగా.. సచిన్ పైలట్ పోలీసుల తీరును తప్పుబట్టారు. మరోవైపు ఈ ఉదంతంపై జాతీయ మహిళా కమిషన్ మండిపడింది. వితంతువులపై భౌతిక దాడి జరిగిందంటూ రాజస్థాన్ డీజీపీ లేఖ రాసి.. ఘటనపై వివరణ కోరింది. ఇదిలా ఉంటే.. అమర వీరుల కుటుంబ సభ్యులకు సాధారణంగా ప్రభుత్వాలు ఉద్యోగాలను ప్రకటిస్తుంటాయి. అయితే తమ పిల్లలకు బదులుగా బంధువులకు ఉద్యోగాలు ఇవ్వాలని, ఈ మేరకు అవసరమైతే రూల్స్ సవరించాలని ఈ ముగ్గురు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు.. తమ గ్రామాలకు రోడ్లు వేయించాలని, ఊరి నడిబొడ్డున తమ భర్తల విగ్రహాలు ఏర్పాటు చేయించాలని కోరారు. దీనిపై ట్విటర్ ద్వారా స్పందించిన సీఎం అశోక్ గెహ్లాట్.. ఈ అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. అయితే రాతపూర్వకంగా స్పష్టమైన హామీ ఇస్తేనే దీక్ష విరమిస్తామని చెబుతూ.. తమ దీక్షను కొనసాగించారు వాళ్లు. మరోవైపు బీజేపీ ఈ పరిణామాల ఆధారంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది. అయితే దీనిని రాజకీయం చేయడం సరికాదని అంటున్నారు సీఎం గెహ్లాట్. జమ్ముకశ్మీర్ పుల్వామాలో 2019 ఫిబ్రవరి 14వ తేదీన.. శ్రీనగర్ జాతీయ రహదారిపై పేలుడు పదార్థాలు నింపిన వాహనంతో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRFP) సిబ్బంది కాన్వాయ్ మీద ఆత్మాహుతి దాడికి ఉగ్రవాదులు తెగబడ్డారు. ఈ దాడిలో 40 మంది జవాన్లు అమరులు కాగా, యావత్ దేశం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. -
Video: సచిన్ పైలట్‌ను కరోనాతో పోల్చిన సీఎం అశోక్ గహ్లోత్
జైపూర్: రాజస్థాన్ కాంగ్రెస్ అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. గత కొన్నేళ్లుగా సాగుతున్న రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ల మధ్య ఆధిపత్య పోరు ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. సమయం చిక్కినప్పుడల్లా బహిరంగంగానే విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఇద్దరు అగ్ర నేతల మధ్య వైరం తేటతేల్లమైంది. తాజాగా సీఎం గహ్లోత్.. పైలెట్‌పై పరోక్ష విమర్శలకు దిగారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. బుధవారం ఉద్యోగుల సంఘం ప్రతినిధులతో సీఎం గహ్లోత్ ప్రీ బడ్జెట్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా సంక్షోభం తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద కరోనా ప్రవేశించిందని అన్నారు. దీంతో సమావేశంలో నవ్వులు పూచాయి. అయితే ఎక్కడా ఆయన సచిన్ పైలెట్ పేరును ప్రస్తావించలేదు. అయితే ఈ వ్యాఖ్యలు గహ్లోత్ పరోక్షంగా సచిన్‌ను ఉద్ధేశించే అన్నారని, ఆయన్ను కరోనావైరస్తో పోలుస్తూ మాట్లాడారని పార్టీ నేతలు భావిస్తున్నారు. ‘నేను సమావేశం ప్రారంభించాను. ఇంతకు ముందు కరోనా వచ్చింది.. తరువాత మన పార్టీలో కూడా పెద్ద కరోనా అడుగుపెట్టింది’ అని సీఎం వ్యాఖ్యానించారు. అంతేగాక రాష్ట్రంలో ఉపఎన్నికలు వచ్చినా, రాజ్యసభ ఎన్నికలు వచ్చినా ప్రభుత్వం ఉద్యోగుల మద్దతుతో అద్భుతమైన పథకాలను తీసుకొచ్చిందన్నారు. అయితే ప్రభుత్వంపై పైలట్ చేస్తున్న విమర్శలకు కౌంటర్‌గా గహ్లోత్ ఈ విధంగా వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. కిసాన్ సమ్మేళన్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న సచిన్ పైలట్.. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ప్రశ్నపత్రం లీక్‌ల కారణంగా రాష్ట్రంలో పలు పరీక్షలు రద్దు చేయడం, పార్టీ కార్యకర్తలను పక్కన పెట్టడం వంటి పలు అంశాలపై గహ్లోత్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ పాలన తనకే అప్పగించాలనే సంకేతాలను చూపుతున్నారు. ‘ఐదేళ్లు కష్టపడ్డాను.. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా పది నెలల సమయం ఉంది.. అందరికీ ఇవ్వాల్సిన గౌరవం ఇస్తే.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మనం విజయం సాధించగలం’ అని సచిన్ పేర్కొన్నారు. राजस्थान में अलग ही खेल चल रहा है! पहले कोरोना आ गया फिर एक बड़ा कोरोना और आ गया हमारी पार्टी के अंदर.... - अशोक गहलोत (CM राजस्थान) (यह बड़ा कोरोना कांग्रेस पार्टी में कौन ??) pic.twitter.com/Kkzl3ODNmH — Sachin (@Sachin54620442) January 19, 2023 -
సచిన్ సోలో ప్రచార ర్యాలీ వ్యూహం..టెన్షన్లో కాంగ్రెస్
రాజస్తాన్ అంతటా మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి సచిన్ పైలెట్ సోలోగా ర్యాలీలు చేయనున్నట్లు సమాచారం. దీంతో మళ్లీ రాజస్తాన్‌లో అంతర్గతంగా కాంగ్రెస్ నాయకుల మధ్య కోల్డ్‌వార్ ప్రారంభమైందని భావిస్తున్నాయి పార్టీ వర్గాలు. కేవల 10 నెలల వ్యవధిలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సచిన్ ఇలా సోలోగా ప్రచార ర్యాలీలు నిర్వహించడంపై పార్టీలో రకరకాలు ఊహాగానాలు హల్చల్ చేయడం ప్రారంభించాయి. అదీగాక ఇటీవలే రాజస్తాన్‌లో భారత్ జోడో యాత్ర చాలా విజయవంతం జరిగింది కూడా. అనూహ్యంగా మళ్లీ సచిన్ ఇలా నిర్ణయం తీసుకోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఐతే ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో పార్టీని సంబంధిత వాటిల్లో మరింత బోపేతం చేస్తూ కార్యచరణలో ఉంచడమే లక్ష్యంగా సచిన్ ఈ ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. వచ్చేవారం నుంచే సచిన్ పైలల్ రైతులు, యువతను ఉద్దేశించి వరుస బహిరంగ సభల్లో ప్రసగించనున్నట్లు తెలిపాయి. ఐతే ఒకపక్క రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోటసార అట్టడుగు స్థాయి సంస్థ పనుల్లో బిజీగా ఉండటం, మరోవైపు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా తన చివరి బడ్జెట్‌తో స్వయంగా వెళుతున్నందున, సచిన్ ఇలా సోలోగా ర్యాలీలు నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారని కొందరూ విశ్లేషకులు భావిస్తున్నారు. అదీగాక 2003 లేదా 2013ల మాదిరిగా పార్టీ తుడిచిపెట్టుకుపోకుండా చూసేందుకు మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ జాట్లు ఎక్కువగా ఉండే ప్రాంతాలపై దృష్టి పెట్టాలని చూస్తున్నట్లు సమాచారం. ఐతే పైలట్ ప్రచారానికి రాహుల్ గాంధీ ఆమోదం ఉందని చెబుతున్నప్పటికీ, ఆయన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నుంచి అనుమతి తీసుకులేదని పార్టీ వర్గాలు తెలిపాయి. ఒక రాష్ట్ర నాయకుడిగా సచిన్‌కి ఇదంతా అవసరమా అని పార్టీలో కొందరూ నాయకులు మండిపడుతున్నట్లు సమాచారం. (చదవండి: నిర్జన ప్రదేశంలో.. ఏకంగా రూ. 10 లక్షల నోట్ల కట్టలు) -
మా నాయకుడే అలా అన్నాక ఇక వివాదం ఎక్కడిది!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఒక చిన్న మాటతో ఆ ఇద్దరి నాయకుల మధ్య రగడకు చెక్ పెట్టారు. రాజస్తాన్ ముఖ్యమంత్రి ఆశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి సచిన్ పైలెట్ల మధ్య గత కొంతకాలంగా పొసగడం లేదు. ఇటీవలే సీఎం ఆశోక్ గెహ్లాట్.. 2020లో పైలట్ కాంగ్రెస్ పార్టీని కూల్చేయడానికి ప్రయత్నించిన ద్రోహి అని తిట్టిపోశారు. అలాగే పైలట్ కూడా ఒక సీనియర్ నాయకుడుగా ఐక్యతగా ఉండాల్సిన సమయంలో ఇలాంటి మాటలు తగదు అంటూ గెహ్లాట్‌కి కౌంటరిచ్చారు. దీంతో ఇరువురి మధ్య తారా స్థాయిలో విభేధాలు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో బారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీని ఈ వివాదం మీ యాత్రకు అవరోధం అవుతుందా? అని విలేకరులు ప్రశ్నించగా..ఇది ఎలాంటి ప్రభావం చూపదని తేల్చి చెప్పారు. అంతేగాదు ఆశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్ ఇద్దరూ తమ పార్టీకి ఆస్తులు అని, అదే మా పార్టీ అందం అని రాహుల్ చెప్పారు. దీంతో వారి మధ్య ఉన్న రగడ కాస్త గప్‌చుప్ అంటూ సద్దుమణిగిపోయింది. ఈ మేరకు ఆశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ..మా నాయకుడు మమ్మల్ని పార్టీకి ఆస్తులు అని చెప్పినప్పుడూ ఇక మా మధ్య వివాదం ఎక్కడ ఉంటుందని కొట్టిపారేశారు. అంతేగాదు గెహ్లాట్, సచిన్ ఇద్దరూ కలసి మీడియా ముందుకు వచ్చి.. డిసెంబర్ 4న రాజస్తాన్‌లో అడుగుపెట్టనున్న రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర పెద్ద విజయాన్ని సాధిస్తుందని పునరుద్ఘాటించారు. మా పార్టీయే మాకు అత్యన్నతమైనది, అది కీర్తీవంతంగా సాగాలని కోరుకుంటున్నాని అన్నారు. అలాగే సచిన్ పైలట్ కూడా ఈ భారత్ జోడోయాత్ర చేస్తున్న రాహుల్‌కి రాజస్థాన్ ఘన స్వాగతం పలుకుతుందని అన్నారు. (చదవండి: కాంగ్రెస్ సభలో ఎద్దు హల్చల్.. బీజేపీ కుట్రేనటా!) -
కాంగ్రెస్‌లో కోల్డ్‌వార్.. సచిన్ పైలట్‌పై గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు
Ashok Gehlot.. రాజస్థాన్ కాంగ్రెస్‌లో నేతల మధ్య కోల్డ్‌వార్ మరోసారి బహిర్గతమైంది. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లట్.. సచిన్ పైలట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, వీరిద్దరి మధ్య కొద్దిరోజులుగా పొలిటికల్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇక, గెహ్లట్ వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. అయితే, అశోక్ గెహ్లాట్ గురువారం జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా గెహ్లాట్ మాట్లాడుతూ.. సచిన్ పైలట్ నమ్మక ద్రోహి అని విమర్శించారు. అలాంటి ద్రోహి ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడు. పది మంది ఎమ్మెల్యేల మద్దతు కూడా లేని వ్యక్తి పార్టీలో తిరుగుబాటుకు ప్రయత్నించాడు. కాంగ్రెస్ పార్టీకి నమ్మకద్రోహం చేశాడు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఆయనకు బీజేపీ నుంచి రూ.10 కోట్లు అందాయని ఆరోపించారు. ఇలాంటి వ్యక్తిని కాంగ్రెస్ హైకమాండ్ సీఎంను చేయదని స్పష్టం చేశారు. సచిన్ పైలట్‌ను సీఎంగా రాజస్థాన్ ప్రజలు అంగీకరించరని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే సచిన్ పైలట్ ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిశారని అన్నారు. సచిన్ పైలట్‌కు బీజేపీతో దగ్గరి సంబంధాలున్నాయని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయం నుంచి సచిన్ పైలట్ వర్గం ఎమ్మెల్యేల్లో కొందరికి రూ.5 కోట్లు, మరికొందరికి రూ.10 కోట్లు ముట్టాయని ఆరోపించారు. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని వెల్లడించారు. Ashok Gehlot (@ashokgehlot51) To NDTV: Sachin Pilot Is "Gaddar" https://t.co/sQBWedN4ob#GehlotToNDTV #NDTVExclusive pic.twitter.com/rHXEqlFAJa — NDTV (@ndtv) November 24, 2022 -
సాక్షి కార్టూన్ 04-11-2022
సాక్షి కార్టూన్ 04-11-2022 -
గెహ్లాట్‌పై మోదీ ప్రశంసలు.. తేలిగ్గా చూడొద్దన్న సచిన్ పైలట్
జైపూర్: రాజస్తాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్ మరోసారి సీఎం అశోక్ గెహ్లాట్‌పై దాడికి దిగారు. మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ ఒక కార్యక్రమంలో గెహ్లాట్‌పై ప్రశంసలు కురిపించడాన్ని సీరియస్‌గా తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానానికి సూచించారు. పైలట్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘‘గతంలో మోదీ పార్లమెంటులో గులాం నబీ ఆజాద్‌ను ప్రశంసించారు. తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. తాజాగా గెహ్లాట్‌ను ప్రశంసించారు’’ అంటూ ఆజాద్ కాంగ్రెస్‌ను వీడటాన్ని ఉద్దేశించి అన్యాపదేశంగా గెహ్లాట్ కూడా అదే చేస్తారనే అర్థంలో నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతున్నాయన్నారు. ఆ ఎమ్మెల్యేలపై చర్యలేవీ ? గెహ్లాట్‌తో పాటుగా ఆయన వర్గం ఎమ్మెల్యేల విషయంలో కూడా పైలెట్ అధిష్టానాన్ని నిలదీశారు. సెప్టెంబర్‌లో జరిగిన సీఎల్పీ సమావేశానికి గైర్హాజరై గెహ్లాట్ మద్దతుగా బలప్రదర్శనకు వెళ్లిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే గడువుందని, క్రమ శిక్షణ తప్పిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని పార్టీకి కొత్తగా అధ్యక్షుడైన మల్లికార్జున్ ఖర్గేకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గెహ్లాట్ పోటీలోకి దిగుతారని ప్రచారం జరిగినప్పుడు, సచిన్ పైలెట్‌ను తదుపరి సీఎంను చేస్తారని వార్తలొచ్చాయి. దీంతో గెహ్లాట్‌కు మద్దతుగా ఆయన వర్గం ఎమ్మెల్యేలు బలప్రదర్శనకు దిగిన విషయం తెలిసిందే. సీఎల్పీ సమావేశానికి గైరా>్హజరైన గెహ్లాట్‌కు అత్యంత సన్నిహితులైన ముగ్గురు ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారందరిపైనా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పైలెట్ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు మళ్లీ గళం విప్పారు? సచిన్ పైలట్ ఉన్నట్టుండి గెహ్లాట్నిలెందుకు టార్గెట్ చేశారంటూ చర్చ జరుగుతోంది. రెండు నెలలుగా రాజస్తాన్ రాజకీయాల్లో ఒక విధమైన స్తబ్దత నెలకొంది. నాయకులెవరూ పార్టీ అంతర్గత వ్యవహారాలపై బహిరంగ వ్యాఖ్యలు చేయకూడదన్న అధిష్టానం ఆదేశంతో గెహ్లాట్, పైలట్ వర్గీయులు మౌనం పాటిస్తున్నారు. కానీ ఇటీవల పైలట్‌పై గెహ్లాట్ పరోక్ష విసుర్లకు దిగారు. అధికారంలో కొనసాగడానికి అనుభవానికి మించినది మరేది లేదని, తమ వంతు వచ్చే వరకు సహనంతో వేచి చూడాలని చురకలంటించారు. వచ్చే ఎన్నికల్లో కూడా సీఎం అభ్యర్థిని తానేనంటూ అన్నింట్లోనూ తన ఫోటో బాగా కనిపించేలా చర్యలు చేపడుతున్నారు. రోడ్డు బ్యానర్లు, పత్రికల్లో ప్రకటనలు, బడ్జెట్‌కు సంబంధించిన ప్రతులు, బిల్లు బోర్డులపై గెహ్లాట్ చిత్రాలే దర్శనమిస్తున్నాయి. అటు హైకమాండ్ కూడా గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బిజీగా ఉండడం, రాహుల్ జోడో యాత్రలో ఉండడంతో రాజస్థాన్ వ్యవహారాలను పట్టించుకునే తీరిక వారికి లేదు. ఈ నేపథ్యంలో గెహ్లాట్‌ను ప్రధాని మోదీ ఓ మాటనగానే సచిన్ తన రాజకీయ అస్త్రాలకు పదును పెట్టారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. -
అప్పుడు ఆజాద్.. ఇప్పుడు గెహ్లట్.. ఖర్గే జీ తేలిగ్గా తీసుకోవద్దు!
జైపూర్: రాజస్థాన్ అధికార కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్, సచిన్ పైలట్ వర్గాల మధ్య వైరం కొనసాగుతూనే ఉంది. సందర్భం వచ్చినప్పుడల్లా ఈ వైరం బయటపడుతూనే ఉంది. తాజాగా సచిన్ పైలట్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం అశోక్ గెహ్లట్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించటంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ పార్టీ మాజీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్‌తో పోలుస్తూ విమర్శలు గుప్పించారు. ‘నిన్న ముఖ్యమంత్రిని ప్రధాని మోదీ పొగడటం చాలా ఆసక్తికరం. దీనిని తేలిగ్గా తీసుకోకూడదు. గతంలో పార్లమెంట్ వేదికగా గులాం నబీ ఆజాద్‌ను మోదీ ప్రశంసించారు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికి తెలుసు.’ అని మీడియా సమావేశంలో పేర్కొన్నారు సచిన్ పైలట్. మరోవైపు.. రాజస్థాన్‌లో పార్టీని ధిక్కరిస్తూ తిరుగుబాటు చేసే వారిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలని కొత్త అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సూచించారు. రాజస్థాన్‌లో నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితికి ముగింపు పలకాలన్నారు. సెప్టెంబర్‌లో జరగాల్సిన సీఎల్పీ సమావేశం ఆగిపోవటాన్ని ఏఐసీసీ క్రమశిక్షణా రాహిత్యంగా భావించాలని సూచించారు. రాజస్థాన్ బాన్స్వారాలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో మోదీ ప్రశంసించిన నేపథ్యంలో ఈ మేరకు స్పందించారు పైలట్. ఈ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రులుగా అశోక్ జీ, నేను కలిసి పని చేశాం. మన సీఎంలలో ఆయనే అత్యంత సీనియర్. వేదికపై ఉన్నవారిలోనూ ఆయనే సీనియర్’ అంటూ ప్రశంసలు కురిపించారు. #WATCH | Rajasthan Cong MLA Sachin Pilot says, "...I find the heaps of praises by PM Modi (on CM Gehlot y'day)very interesting. PM had similarly praised GN Azad in Parliament. We saw what happened after that. It was an interesting development y'day. Shouldn't be taken lightly..." pic.twitter.com/QBknOLVWJT — ANI (@ANI) November 2, 2022 ఇదీ చదవండి: ప్రధాని మోదీని ప్రశంసిస్తూనే చురకలు.. ఆ సీఎం మామూలోడు కాదు! -
కాంగ్రెస్‌లో రాహుల్, ప్రియాంకల తర్వాత ఆయనే..!
జైపూర్: కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తన పూర్వవైభవాన్ని తిరిగి సంపాదించుకునే పనిలో నిమగ్నమైంది. సీనియర్ నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు. ప్రస్తుతం పార్టీకి పెద్ద దిక్కుగా మారారు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు. ఓ వైపు పార్టీని తిరిగి పోటీలో నిలబెట్టేందుకు దేశవ్యాప్త యాత్ర చేపట్టారు రాహుల్ గాంధీ. ఈ క్రమంలో రాజస్థాన్ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కోసం పని చేసే వారిలో రాహుల్, ప్రియాంక గాంధీల తర్వాత సచిన్ పైలట్ అత్యంత ప్రజాధరణ కలిగిన వ్యక్తిగా పేర్కొన్నారు రాజస్థాన్ మంత్రి రాజేంద్ర గుడా. అశోక్ గెహ్లోత్ వర్గం నేత, ఆయన ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రాజేంద్ర గుడా ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం. ‘రాహుల్, ప్రియాంకల తర్వాత కాంగ్రెస్ పార్టీ కోసం ప్రజలను ఆకట్టుకోవటంలో సచిన్ పైలట్‌దే స్థానం.’ అని పేర్కొన్నారు. 2020లో సచిన్ పైలట్ వర్గం అశోక్ గెహ్లోత్ నాయకత్వంపై తిరుగుబాటు చేయక ముందు.. పైలట్ పేరును ముఖ్యమంత్రి పదవికి ప్రతిపాదించారు రాజేంద్ర గుడా. ఎమ్మెల్యేలంతా ఆయన వెంటే ఉన్నారని అప్పుడు చెప్పారు. ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేల్లో ఒకరైన రాజేంద్ర గుడా.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత గెహ్లోత్‌కు మద్దతు తెలిపారు. అయితే, ఇటీవలి కాలంలో పలు సందర్భాల్లో సచిన్ పైలట్‌కు మద్దతుగా వ్యాఖ్యానించటం రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. సచిన్ పైలట్ ఇదీ చదవండి: బీజేపీలో చేరలేదనే గంగూలీకి అవకాశం ఇవ్వలేదు: టీఎంసీ -
టైమ్ బ్యాడ్ అంటే ఇదేనేమో.. సీఎం గెహ్లాట్‌కు ఊహించని షాక్!
కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో పలు ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. రెండు రోజుల వరకు కాంగ్రెస్ అధ్యక్షుడి రేసులో ఉన్న అశోక్ గెహ్లాట్‌కు ఊహించని షాక్ తగిలింది. రాజస్తాన్ రాజకీయాల్లో కోల్డ్‌వార్ బహిర్గతం అవడంతో సీఎం అశోక్ గెహ్లాట్‌ను మరో వివాదం చుట్టుముట్టింది. రహస్య నోట్ ఫొటో లీక్ కావడంలో రాజస్తాన్ రాజకీయాల్లో కలకలం సృష్టించింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. సీఎం అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి గెహ్లాట్ పోటీ నేపథ్యంలో రాజస్తాన్ తర్వాతి సీఎం ఎవరు అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. డిప్యూటీ సీఎం సచిన్ పైలట్‌ను తర్వాతి సీఎం చేస్తారనే వార్తలు చక్కర్లు కొట్టడంతో గెహ్లాట్ దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేల భేటీ చర్చనీయాంశంగా మారింది. అనంతరం చోటుచేసుకున్న పరిణామాల కారణంగా అధ్యక్ష రేసులో నుంచి గెహ్లాట్ తప్పుకున్నారు. తర్వాత సోనియా గాంధీని కలిసిన క్షమాపణలు సైతం చెప్పారు. అయితే, సోనియా గాంధీతో సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన అశోక్ గెహ్లాట్ చేతిలో ఉన్న సీక్రెట్ లెటర్ ఒకటి బయటకు వచ్చింది. ఈ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా, ఈ లేఖలో గెహ్లాట్.. సచిన్ పైలట్‌ను ‘SP’గా పేర్కొంటూ సంచలన ఆరోపణలు గుప్పించారు. సచిన్ పైలట్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీజేపీతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నించారని అన్నారు. అలాగే, ఎమ్మెల్యేలను కొనేందుకు 50 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలిపారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం ఎస్పీ పార్టీని కూడా వీడుతారు. దీనిపై గతంలోనే రిపోర్ట్ ఇచ్చి ఉంటే పార్టీకి చాలా మంచిది. తనకు 102 ఎమ్మెల్యేల మద్దతు ఉండగా ‘SP’ వెంట 18 మంది ఉన్నారని అందులో స్పష్టం చేశారు. దీంతో, గెహ్లాట్ లేఖ కాంగ్రెస్‌లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ లేఖ బయటకు రావడంలో కాంగ్రెస్‌పై బీజేపీ సెటైరికల్ కామెంట్స్ చేసింది. ఎస్పీ ఎవరూ అంటూ బీజేపీ నేత షెహజాద్ పూనావాలా ప్రశ్నించారు. “SP will leave party” Who is SP that Ashok Gehlot’s “leaked note” ((deliberately visible note)) speaks of ? Congress Jodo… Bharat to Juda hua hai ji 🙏 pic.twitter.com/ZncFLJf4to — Shehzad Jai Hind (@Shehzad_Ind) September 30, 2022 -
సీఎం గహ్లోత్‌కు పదవి గండం తప్పినట్టే.. కానీ!
సాక్షి, న్యూఢిల్లీ: రాజస్థాన్‌లో ఇటీవల జరిగిన పరిణామాలతో సీఎం అశోక్ గహ్లోత్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం పదవి నుంచి తప్పిస్తుందనే ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఆయన గురువారం సోనియా గాంధీతో ఢిల్లీలో సమావేశమయ్యారు. అనంతరం రాజస్థాన్‌లో జరిగిన దానికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయట్లేదని ప్రకటించారు. తనను సీఎంగా కొనసాగించాలా? వద్దా? అనే విషయంపై సోనియా గాంధీనే తుది నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. అయితే తాజాగా పార్టీ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు రాజస్థాన్ సీఎంగా అశోక్ గహ్లోత్‌నే కొనసాగించాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే డిప్యూటీ సీఎంగా మరోసారి సచిన్ పైలట్‌కు అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. 2020లో పార్టీపై తిరుగుబావుటా ఎగురవేయడానికి ముందు వరకు పైలటే డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆ తర్వాత ఆయనను తప్పించారు. ఇప్పుడు మరోసారి ఆయనకే అవకాశం ఇవ్వనున్నారు. అయితే గహ్లోత్‌కు, సచిన్ పైలట్‌కు అసలు పడదు. ఇటీవల రాజస్థాన్‌లో జరిగిన పరిణామాలకు కూడా ఇదే కారణం. అశోక్ గహ్లోత్ కాంగ్రెస్ అధ్యక్షుడైతే సీఎం పదవికి రాజీనామా చేయాల్సిందేనని రాహుల్ గాంధీ సహా ఇతర కాంగ్రెస్ నేతలు చెప్పారు. ఆయన స్థానంలో సచిన్ పైలట్‌ను కొత్త సీఎంగా నియమిస్తారని ప్రచారం జరిగింది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన గహ్లోత్ వర్గం గత ఆదివారం పెద్ద రచ్చే చేసింది. 82 మంది ఎమ్మెల్యేలు సీఎల్పీ సమావేశానికి డుమ్మా కొట్టి వేరుగా భేటీ అయ్యారు. అనంతరం పైలట్‌ను సీఎం చేస్తే రాజీనామా చేస్తామని బెదిరించారు. ఈ పరిణామాలు కాంగ్రెస్ అధిష్ఠానాన్ని షాక్‌కు గురిచేశాయి. అశోక్ గహ్లోత్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకోవడంతో ఆయన స్థానంలో సీనియర్ నేత, దళితనాయకుడు మల్లికార్జున ఖర్గేను బరిలోకి దింపింది అధిష్ఠానం. ఈ పదవి కోసం సీనియర్ నేత, కేరళ ఎంపీ శశిథరూర్, జార్ఖండ్ కాంగ్రెస్ నేత ఆర్ఎన్ త్రిపాఠి కూడా పోటీ పడుతున్నారు. అయితే పోటీ ప్రధానంగా ఖర్గే, థరూర్ మధ్యే ఉండనుంది. గాంధీల వీరవిధేయుడైన ఖర్గేకే విజయావకాశాలు ఎక్కువ అని అంతా భావిస్తున్నారు. చదవండి: ఐక్యరాజ్యసమితి నుంచి రాజకీయాల్లోకి.. శశి థరూర్ ప్రస్థానమిదే.. -
రాజస్థాన్ సీఎం రేసులో అతడు
ఢిల్లీ: అశోక్ గెహ్లాట్‌పై కాంగ్రెస్ హైకమాండ్ గుర్రుగా ఉండడంతో.. రాజస్థాన్ ముఖ్యమంత్రి మార్పు తప్పబోదనే సంకేతాలు అందాయి. ఈ నేపథ్యంలో.. మరో రెండు రోజుల్లో సోనియా గాంధీ సీఎం మార్పుపై కచ్చితమైన నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. దీంతో.. రాజస్థాన్ కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో రేసులో సచిన్ పైలట్(45) పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అశోక్ గెహ్లాట్ గనుక కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపడితే సచిన్ పైలట్‌కే బాధ్యతలు అప్పజెప్పాలని అధిష్టానం తొలుత భావించింది. ఈలోపు రెబల్ పరిణామాలు మొత్తం సీన్‌ను మార్చేశాయి. అయినప్పటికీ.. సచిన్ పైలట్ వైపు హైకమాండ్ మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాళ అశోక్ గెహ్లాట్ భేటీ అనంతరం.. సచిన్ పైలట్ కూడా 10 జన్‌పథ్‌లోని సోనియా గాంధీ నివాసానికి వెళ్లి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో సచిన్ రాజస్థాన్ ముఖ్యమంత్రి కావడం దాదాపు ఖాయమైందనే ప్రచారం ఊపందుకుంది. #WATCH | Delhi | Rajasthan Congress MLA Sachin Pilot arrives at 10 Janpath, the residence of the party's interim chief Sonia Gandhi. pic.twitter.com/uuleNwThn8 — ANI (@ANI) September 29, 2022 -
Rajasthan Congress crisis: కాంగ్రెస్‌లో ఎడారి తుఫాన్
ఎస్.రాజమహేంద్రారెడ్డి: చిన్న చిన్న సమస్యలను సంక్లిష్టం చేసి పీకల మీదికి తెచ్చుకోవడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. గోటితో పోయేదానికి గొడ్డలిదాకా తెచ్చుకోవడమంటే ఇదే! ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలతో రాజస్తాన్ రాజకీయాలు ముడిపడటం.. వైరి వర్గాలు తెగేదాకా లాగడం కాంగ్రెస్ పార్టీ గందరగోళ వ్యవహార శైలికి తాజా మచ్చుతునక. ఆదిలోనే తప్పటడుగు... కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థిగా రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌ను ఎంచుకోవడం వెనక ఉన్న అజెండాను సరైన రీతిలో స్పష్టీకరించడంలోనే అధిష్టానం తప్పటడుగు వేసింది. దాంతో ఆదిలోనే హంసపాదులా నామినేషన్లకు ముందే ఎడారిలో తుపానును తలపిస్తూ పరిస్థితి చేయిదాటిపోయింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజస్తాన్ రాజకీయాల్లో చాపకింద నీరులా ఉన్న అసంతృప్తి జ్వాలను చల్లార్చేందుకు అధిష్ఠానం చేసిన ప్రయత్నం వికటించింది. అనుభవజ్ఞుడైన గెహ్లాట్‌కు జాతీయ అధ్యక్ష పదవి ఆశచూపి యువ సచిన్ పైలట్‌ను సీఎంగా చేయాలన్నది పార్టీ పెద్దల యోచన. అప్పుడు ఇద్దరికీ సమ న్యాయం చేసినట్టవుతుందని అధిష్టానం భావించింది. కానీ ఇదే విషయాన్ని గెహ్లాట్‌కు స్పష్టంగా చెప్పే విషయంలో అధిష్టానంతో పాటు అగ్ర నాయకులు మీనమేషాలు లెక్కపెట్టి అనవసర ఊహాపోహలకు తావిచ్చారు. రాజస్తాన్‌ను వదలడం సుతరామూ ఇష్టంలేని గెహ్లాట్‌కు ఇది రుచించలేదు. తప్పదంటే తన సన్నిహితునికే సీఎం పదవి కట్టబెట్టాలన్నది ఆయన ఆలోచన. దాంతో గెహ్లాట్ బల ప్రదర్శనకు దిగారు! అస్పష్టత... అయోమయం రాజస్తాన్ రాజకీయ యవనికపై ఆదివారం జరిగిన హైడ్రామా అటు అధిష్టానాన్నీ, ఇటు గెహ్లాట్‌నూ ఇరుకున పెట్టింది. రాజీనామాల వరద ఇద్దరినీ పీకల్లోతు ముంచేసింది. హైకమాండ్ హైకమాండే గనుక ఏం చేసినా చెల్లుతుంది. గెహ్లాట్ పరిస్థితే ఎటుకాకుండా త్రిశంకు స్వర్గంలో వేలాడుతోంది. అధ్యక్ష పదవిని హుందాగా అంగీకరించి, అనుచరులను సముదాయించి అధిష్టానం మాట జవదాటకుండా ఒప్పించగలిగితే తప్ప గెహ్లాట్ ఇప్పుడు రాజకీయ కుర్చీలాటలో ఏ కుర్చీ దొరక్క కిందపడిపోవాల్సి వస్తుందనేది నిపుణుల అంచనా. గెహ్లాట్‌ను కేవలం మధ్యేమార్గంగా అధ్యక్ష అభ్యర్థిగా ఎంచుకున్నారే తప్ప నిజానికి కాంగ్రెస్‌లో సీనియర్లకు, అనుభవజ్ఞులకు కొదవలేదు. చిదంబరం, దిగ్విజయ్ సింగ్, కమల్‌నాథ్ నుంచి సుశీల్ కుమార్ షిండే దాకా చాలామంది ఉన్నారు. అధిష్టానం చెబితే బరిలోకి దిగడానికి వీరంతా సిద్ధంగానే ఉన్నారు. వరుస తప్పిదాలు... కాంగ్రెస్ అధ్యక్ష పదవికి బహుముఖ పోరు అనివార్యమైన పక్షంలో గాంధీల ఆశీస్సులు లేకుండా గెలవడం అసాధ్యమని అందరికీ తెలుసు. అంతేగాక అధిష్టానం చల్లని చూపు ఎవరిపై ఉంటే వారివైపే రాజస్తాన్ ఎమ్మెల్యేలు ఉండటమూ తప్పనిసరే. ఈ నేపథ్యంలో గెహ్లాట్ గనక అధిష్టానం అసంతృప్తికి లోనయితే సీఎం పదవికి దూరం కావాల్సి వస్తుంది. దాదాపు ఐదు దశాబ్దాల కింద కాంగ్రెస్‌తో జతకట్టిన గెహ్లాట్ తన రాజకీయ జీవితంలో ఏనాడూ హైకమాండ్‌ను ధిక్కరించలేదు. పార్టీ కష్టకాలంలోనూ విధేయతను స్పష్టంగా చాటుకున్నారు. కాంగ్రెస్ రాజకీయంగా 2014 నుంచి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ వస్తున్నప్పటికీ సీనియర్లకు, విధేయులకు సమున్నత రీతిలో అన్ని అవకాశాలు కల్పించింది. ఈ క్రమంలో కొందరు సీనియర్లను, విధేయులను కోల్పోయింది కూడా! కానీ పంజాబ్‌లో దెబ్బతిన్న తర్వాత కూడా అధిష్టానం తీరు మార్చుకోకపోవడం దాని కార్యనిర్వహణ సామర్థ్యాన్ని ప్రశ్నార్థకం చేసే పరిణామమే. రాజస్తాన్ రాజకీయ పరిస్థితిని అనవసరంగా చేయి దాటనిచ్చి, ఇప్పుడు దిద్దుబాటుకు దిగడమే ఇందుకు తార్కాణం. ఈ ఎపిసోడ్లో తప్పంతా 10–జన్‌పథ్‌దేనన్నది కొందరి వాదన. సీనియర్ నాయకుల్లో జవాబుదారీతనం లేకపోవడం పెద్ద మైనస్‌పాయింటని మరికొందరి వాదన. రాజస్తాన్ విషయంలోనైతే ఇది మరీ కొట్టొచ్చినట్టు కన్పిస్తోంది. ఆదివారం పార్టీ ఎమ్మెల్యేల రాజీనామాకు ముందు అందరినీ సీఎల్పీ సమావేశానికి తీసుకొచ్చేలా గెహ్లాట్‌కు నచ్చజెప్పడంలో ఖర్గే, మాకెన్ విఫలమయ్యారు. భేటీకి పీసీసీ చీఫ్ గోవింద్‌సింగ్ గైర్హాజరయ్యారు. ఇంత గందరగోళం మధ్య ముఖ్యమంత్రిని, పీసీసీ చీఫ్‌ను దారిలోకి తెచ్చేందుకు క్రమశిక్షణ మార్గదర్శకాలు జారీ చేయడంలో పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ వైఫల్యం ఆశ్చర్యకరం. రాజీనామాలు జరిగిన ఆదివారం రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య ఆయన గనక పరిస్థితిని చాకచక్యంగా చక్కబెట్టి ఉంటే విషయం ఇంతదాకా వచ్చేది కాదు. ఎమ్మెల్యేలకు వారి ఇష్టాయిష్టాలను వెల్లడించే స్వేచ్ఛ ఎప్పుడైనా ఉంటుంది. కానీ వారిని సముదాయించే పాత్రను నిర్వర్తించడంలో సీనియర్ల వైఫల్యం స్పష్టంగా కన్పిస్తోంది. పైగా, ఇంత జరిగినా అధిష్టానం మనోగతం మేరకు ఎమ్మెల్యేలను ఏకతాటిపై నడిపించడంలో విఫలమైన గెహ్లాట్‌కు గానీ, పీసీసీ చీఫ్‌కు గానీ కనీసం షోకాజ్ నోటీసు కూడా ఇవ్వకపోవడం గమనార్హం. ఎలా ముగుస్తుందో...! రాజస్తాన్‌లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందే పైలట్‌ను రాజస్తాన్ సీఎంగా చూడాలన్నది అధిష్టానం ప్రధానోద్దేశం. ఒకరకంగా ఇది గతంలో చేసిన తప్పును చాలా ఆలస్యంగా సరిద్దుకునే ప్రయత్నమే. పైలట్ 2014 నుంచి నాలుగేళ్లు పీసీసీ చీఫ్‌గా పార్టీని సజావుగా నడిపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించారు. దాంతో ఆయన్నే సీఎం చేస్తారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఆ సమయంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న గెహ్లాట్‌కు సీఎం పదవి దక్కింది. అంటే తెర వెనక ఎంత లాబీయింగ్ జరిగిందో ఊహించుకోవచ్చు. రెండు ముక్కల్లో చెప్పాలంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాగానే పైలట్ నేరుగా రాహుల్ నివాసానికి వెళ్లి కలిస్తే గెహ్లాట్ అదే సమయంలో అహ్మద్ పటేల్ నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. అలా మొదలైన లాబీయింగ్ తారస్థాయికి చేరింది. చివరికి అహ్మద్ పటేల్ మాటే చెల్లింది. గెహ్లాట్ సీఎం అయ్యారు. పైలట్ వంటి యువకున్ని సీఎం చేయాలని భావించిన రాహుల్ ఆ తర్వాత గెహ్లాట్ వైపు మొగ్గడంగమనార్హం. సోనియా, ప్రియాంక ఒత్తిడి మేరకు ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకునేందుకు పైలట్ అయిష్టంగానే ఒప్పుకున్నారు. ఆ తప్పిదాన్ని ఇప్పుడు దిద్దుకునేందుకు అధిష్టానం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. పైగా గెహ్లాట్ సారథ్యంలో వెళ్తే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్డం కష్టమని సర్వేల్లోనూ తేలింది. దాంతో పైలట్‌కే రాష్ట్ర పగ్గాలు అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. -
ఇదేం ట్విస్ట్.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో గెహ్లాట్!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో అధిష్టానం చాయిస్‌గా తానే నిలవాలని ఆ పార్టీ సీనియర్ నేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ భావించారు. పార్టీ పగ్గాలతో పాటు సీఎంగానూ కొనసాగాలని ఆశపడ్డారు. అయితే ఒక వ్యక్తి.. ఒకే పదవి సవరణ ఆయన దూకుడుకు బ్రేకులు వేయించింది. ఈ క్రమంలో తన వారసుడిని తన ఇష్ట ప్రకారం ఎంచుకోవాలనుకున్న ప్రయత్నం బెడిసి కొట్టి.. రాజకీయ సంక్షోభానికి దారి తీసింది కూడా. అయితే అధ్యక్ష ఎన్నికల బరి నుంచి గెహ్లాట్ వైదొలిగారన్న ప్రచారానికి తెర పడేలా మరో ప్రచారం ఇప్పుడు మొదలైంది. పార్టీ అధిష్టానం ఆయన్ని కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకోమని ఆదేశాలు ఇవ్వలేదట. అలాగే.. తనంతట తాను తప్పుకుంటానని నిన్న(సోమవారం) సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే వద్ద గెహ్లాట్ ప్రస్తావించినట్లు వస్తున్న వార్తల్లోనూ వాస్తవం లేదని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ మేరకు రాజస్థాన్ పరిణామాలపై సీనియర్ నేత అజయ్ మాకెన్- సమర్పించిన నివేదిక.. ఇప్పుడు కీలకంగా మారనున్నట్లు సమాచారం. మరో 48 గంటల్లో దీనిపై స్పష్టమైన ప్రకటన వస్తుందని, ఈ లెక్కన ప్రస్తుతానికి కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో గెహ్లాట్ ఉన్నట్లేనని పార్టీ సీనియర్ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఎమ్మెల్యేల తిరుగుబాటుతో తనకు సంబంధం లేదని గెహ్లాట్ చెప్పడంతో.. పార్టీ అధినేత్రి(తాత్కాలిక) సోనియాగాంధీని కలుసుకుని వివరణ ఇచ్చే అవకాశం ఆయనకు ఇచ్చినట్లు సమాచారం. అయితే.. గెహ్లాట్ సంగతి పక్కనపెడితే ‘రెబల్’ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలనే యోచనలో అధిష్టానం ఉంది. ఇదిలా ఉంటే.. ఒకవైపు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల కోసం సీనియర్ నేత శశిథరూర్ నామినేషన్ పేపర్లను తీసుకున్నారు. ఈ నెల 30న ఆయన నామినేషన్ వేసే అవకాశం ఉంది. మరోవైపు రాజస్థాన్ సంక్షోభానికి కారణమైన ఎమ్మెల్యే సచిన్ పైలట్.. ఢిల్లీకి వెళ్లి అధిష్టానంతో మంతనాలకు సిద్ధమయ్యాడు. ఇంకోవైపు అధిష్టానం సీరియస్ అయిన నేపథ్యంలో చల్లబడ్డ ఎమ్మెల్యేలు తామంతా ఒకేతాటిపై ఉన్నామంటూ ప్రకటనలు ఇస్తున్నారు. ఇదీ చదవండి: ఢిల్లీ తర్వాత ఇప్పుడు పంజాబ్‌లోనూ సేమ్ సీన్ -
Rajasthan political crisis: గెహ్లాట్ వర్గం ధిక్కారం!
జైపూర్/న్యూఢిల్లీ: రాజస్తాన్‌లో రాజకీయ ప్రతిష్టంభన ముదురుపాకాన పడింది. రాష్ట్రంలో నాయకత్వ మార్పు కోసం కాంగ్రెస్ అధిష్టానం చేసిన ప్రయత్నం కాస్తా బెడిసికొట్టి సంక్షోభంగా మారింది. పార్టీ అధ్యక్ష ఎన్నిక వేళ తలనొప్పులను మరింతగా పెంచుతోంది. అధ్యక్ష బరిలో దింపాలని భావించిన సీనియర్ నాయకుడు అశోక్ గెహ్లాట్ రాజస్తాన్ సీఎం పీఠం వదులుకోవడానికి సుముఖంగా లేకపోవడంతో పార్టీ పెద్దలకు ఎటూ పాలుపోవడం లేదు. సీఎంగా కొనసాగుతూనే అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని గెహ్లాట్ భీష్మించుకున్నారు. ఒకరికి ఒకే పదవి నిబంధన ఈ విషయంలో వర్తించదని ఆయన వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఫలితాలు వచ్చేదాకా గెహ్లాట్‌నే సీఎంగా కొనసాగించాలన్న డిమాండ్‌పై వెనక్కు తగ్గేందుకు ఆయన వర్గం ఎమ్మెల్యేలు కూడా ససేమిరా అంటున్నారు. ఈ క్రమంలో వారంతా అధిష్టానాన్నే ధిక్కరించేలా వ్యవహరించి గట్టి షాకిచ్చారు! గెహ్లాట్ స్థానంలో ఆయన రాజకీయ ప్రత్యర్థి సచిన్ పైలట్‌ను సీఎం చేయాలన్న అధిష్టానం యోచనను వ్యతిరేకిస్తూ 108 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఏకంగా 82 మంది ఆదివారం స్పీకర్‌కు రాజీనామా సమర్పించడం తెలిసిందే. పరిస్థితిని చక్కదిద్దేందుకు మల్లికార్జున ఖర్గే, అజయ్ మాకెన్‌లను ఆదివారం రాత్రి హుటాహుటిన రాజస్తాన్‌కు పరిశీలకులగా పంపిన అధిష్టానానికి మింగుడు పడని రీతిలో మరిన్ని షాకులు తగిలాయి. ఎమ్మెల్యేలు కనీవినీ ఎరగని స్థాయిలో ధిక్కార స్వరం విన్పించారు. దీనిపై బీజేపీ కూడా వ్యంగ్యాస్త్రాలు విసిరింది. పార్టీ నుంచి నేతల నిష్క్రమణ, వరుసగా ఓటములు తదితరాలతో ఇప్పటికే కుదేలైన కాంగ్రెస్ అధిష్టానం ఈ సంక్షోభాన్ని ఎలా పరిష్కరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ పరిణామాలతో గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక బరిలోకి దిగడం అనుమానంగా మారింది. అధిష్టానానికి విశ్వాసపాత్రులైన మల్లికార్జున ఖర్గే, దిగ్విజయ్‌సింగ్, కమల్‌నాథ్, సుశీల్‌కుమార్ షిండే, ముకుల్ వాస్నిక్, కుమారి సెల్జా పేర్లు విన్పిస్తున్నాయి. తాను పోటీ చేయబోనని దిగ్విజయ్ ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. కమల్‌నాథ్ కూడా సోమవారం అదే మాట చెప్పారు. పరిశీలకులకు గెహ్లాట్ వర్గం షాకులు సీఎం గెహ్లాట్ నివాసంలో ఖర్గే, మాకెన్ ఆదివారం రాత్రి అత్యవసరంగా సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేశారు. కానీ గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేలంతా దాన్ని బహిష్కరించడంతో వారు దిమ్మెరపోయారు! చాలాసేపు ఎదురు చూసినా ఎమ్మెల్యేలు రాకపోవడంతో భేటీని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. చివరికి ఒక్కొక్కరిగా వచ్చి తమతో సమావేశం కావాల్సిందిగా ఆదేశించినా ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు. పైగా అదే సమయంలో వారంతా కలిసి ఓ మంత్రి ఇంట్లో విడిగా సమావేశమయ్యారు! ‘‘గెహ్లాట్‌ను తప్పిస్తే ప్రభుత్వ మనుగడే ప్రమాదంలో పడుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ కూడా చిక్కుల్లో పడుతుంది’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీని తాలూకు వీడియో కూడా మీడియాకు లీకైంది! అనంతరం నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనాల్సి ఉందంటూ ఎమ్మెల్యేలంతా తమ తమ నియోజకవర్గాలకు వెళ్లిపోయారు! అనంతరం ఎమ్మెల్యేల తరఫున మంత్రులు శాంతి ధరీవాల్, మహేశ్ జోషి, ప్రతాప్‌సింగ్ పరిశీలకులతో భేటీ అయ్యారు. ‘‘సీఎం ఎవరనే దానిపై అక్టోబర్ 19 తర్వాత కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడే నిర్ణయం తీసుకోవాలి. రెండేళ్ల క్రితం పైలట్ తిరుగుబాటు సమయంలో ప్రభుత్వానికి విధేయులుగా నిలిచిన ఎమ్మెల్యేల నుంచే సీఎంను ఎన్నుకోవాలి. ఒక్కో ఎమ్మెల్యేలతో విడిగా కాకుండా అందరితో కలిసే మీరు భేటీ అవాలి’’ అంటూ షరతుల చిట్టాను వారి ముందుంచారు. ముందుగా ఎమ్మెల్యేల అనుమానాలను అధిష్టానం నివృత్తి చేయాలని చీఫ్ విప్ మహేశ్ జోషి కూడా డిమాండ్ చేశారు. ఎవరిని సీఎం చేసినా అభ్యంతరం లేదంటూనే, అది తమకు అంగీకారయోగ్యంగా ఉండాల్సిందేనంటూ కుండబద్దలు కొట్టారు. దాంతో విస్తుపోవడం ఖర్గే, మాకెన్ వంతయింది. ఈ వరుస భంగపాట్ల నేపథ్యంలో వారిద్దరూ సోమవారం ఉదయమే హస్తినకు తిరుగుముఖం పట్టారు. అధినేత్రి సోనియాగాంధీ నివాసానికి వెళ్లి జరిగిందంతా వివరించారు. దాంతో ఆగ్రహించిన సోనియా మొత్తం ఉదంతంపై లిఖితపూర్వక మంగళవారానికల్లా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. గెహ్లాట్‌తో సన్నిహిత సంబంధాలున్న మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడు కమల్‌నాథ్‌ను హుటాహుటిన ఢిల్లీకి పిలిపించారు. ఆయన సోనియాతో గంటపాటు భేటీ అయ్యారు. గెహ్లాట్‌ను రాజీకి రప్పించేందుకు కమల్‌నాథ్‌ను నియోగించవచ్చంటున్నారు. తీర్మానంలో షరతులా: మాకెన్ గెహ్లాట్ వారసున్ని నిర్ణయించే అధికారాన్ని పార్టీ చీఫ్‌కు కట్టబెడుతూ సీఎల్పీ భేటీలో ఏకవాక్య తీర్మానం ఆమోదింపజేయాలని ఖర్గే, మాకెన్ తలపోయగా, అధ్యక్షునిగా ఎన్నికయ్యేదాకా గెహ్లాట్ సీఎంగా కొనసాగుతారంటూ అందులో చేర్చాలని ఆయన వర్గం ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. ఇది క్రమశిక్షణ రాహిత్యమేనంటూ మాకెన్ మండిపడ్డారు. సోనియాతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘తీర్మానమంటే కేవలం ఏకవాక్యంతో ఉంటుంది. అంతే తప్ప షరతులతో కూడిన తీర్మానాలు కాంగ్రెస్ చరిత్రలో ఎన్నడూ లేవు. సీఎల్పీ భేటీకి డుమ్మా కొట్టి విడిగా సమావేశం కావడం క్షమించరాని విషయం’’ అంటూ ఆగ్రహించారు. ‘‘సీఎంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సింది గెహ్లాటే. తర్వాత అధ్యక్ష పదవికి పోటీ పడేదీ ఆయనే. గెలిస్తే తను సీఎంగా కొనసాగాలో లేదో నిర్ణయించేదీ ఆయనే. ఇది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవదా?’’ అంటూ మండిపడ్డారు. -
‘గెహ్లాట్‌ను రేసు నుంచి తప్పించాల్సిందే!’
రాజస్థాన్ రాజకీయం రసవత్తరంగా మారింది. అశోక్ గెహ్లాట్ స్థానంలో రాజస్థాన్ కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే వ్యవహారం.. పార్టీలో కల్లోలం రేపింది. అధిష్టాన అనుకూలుడైన సచిన్ పైలెట్ పేరును వ్యతిరేకిస్తూ గెహ్లాట్ మద్దతుదారుల రాజీనామా ఎపిసోడ్‌తో ప్రభుత్వమే కుప్పకూలే పరిస్థితికి చేరుకుంది. ఈ తరుణంలో.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు స్పందించారు. న్యూఢిల్లీ: అశోక్ గెహ్లాట్‌ను కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పించాలని కాంగ్రెస్ అధినేత్రి(తాతాల్కిక) సోనియా గాంధీని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు వేరే ఎవరినైనా ఎంపిక చేయాలంటూ కోరుతున్నారు. ఆయన మీద నమ్మకంతో.. బాధ్యతలు అప్పగించడం ఏమాత్రం సరికాదు. పార్టీ అధిష్టానం ఆయన అభ్యర్థిత్వాన్ని పునఃపరిశీలించాలి అని కోరుతున్నారు సీడబ్ల్యూసీ సభ్యులు. ఎమ్మెల్యేలను నియంత్రించకుండా.. తెర వెనుక ఉంటూ ఆయన డ్రామాలు ఆడిస్తున్నారంటూ కొందరు సభ్యులు వ్యాఖ్యానించడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఆదివారం సాయంత్రం నాటి పరిణామాలను సోనియా గాంధీకి వివరించినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే మీడియాకు వెల్లడించారు. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అంతా కట్టుబడి ఉండాలని, పార్టీలో క్రమశిక్షణ ఉండి తీరాల్సిందేనని సోమవారం మధ్యాహ్నాం గెహ్లాట్‌తో భేటీ అనంతరం ఖర్గే వ్యాఖ్యానించారు. ఇక గాంధీ కుటుంబానికి విధేయులుగా ఉండి.. సీనియర్ సభ్యుడిగా ఉన్న వేరే ఎవరినైనా అశోక్ గెహ్లాట్ స్థానంలో ఎంపిక చేయండని కోరుతున్నారు సీడబ్ల్యూసీ సభ్యులు. ఇదిలా ఉంటే..ఆదివారం సాయంత్రం జరిగిన సీఎల్పీ(కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ) భేటీకి గెహ్లాట్ క్యాంప్‌లోని ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడం, మంత్రి శాంతి ధారివాల్ ఇంట్లో వేరుగా భేటీ కావడం, స్పీకర్ సీపీ జోషికి 92 మంది ఎమ్మెల్యేలు రాజీనామా సమర్పించడంతో.. రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభ కలకలం రేగింది. ఈ పరిణామాలపై అధిష్టానం గుర్రుగా ఉంది. భేటీకి హాజరుకాని ఎమ్మెల్యేలకు అధిష్టానం షోకాజ్ నోటీసులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడాలని నిర్ణయించిన అశోక్ గెహ్లాట్.. ముఖ్యమంత్రిగానూ కొనసాగాలని భావించారు. అయితే, ఒకే వ్యక్తికి రెండు పదవులు కుదరవని రాహుల్ గాంధీ చెప్పడంతో అసలు రచ్చ మొదలైంది. సీఎం పీఠం నుంచి తప్పుకుంటూనే తనకు విశ్వాసపాత్రుడైన వ్యక్తికి ఆ పదవిని కట్టబెట్టాలని గెహ్లాట్ భావించారు. కానీ, అధిష్ఠానం మాత్రం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సచిన్ పైలట్‌ను సీఎం చేయాలని భావించింది. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న గెహ్లాట్ మాత్రం ప్రస్తుతం స్పీకర్‌గా ఉన్న సీపీ జోషికి ఆ పదవిని కట్టబెట్టాలని భావించారు. రెండేళ్ల క్రితం గెహ్లాట్ సర్కారుపై సచిన్ పైలట్ తిరుగుబాటు చేశారు. ఇప్పుడిదే ఆయనను సీఎం కాకుండా అడ్డుపడుతోంది. ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించిన వ్యక్తికి సీఎం పీఠం ఎలా అప్పగిస్తారన్నది గెహ్లాట్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేల అభ్యంతరం. అప్పట్లో ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన వారిలో ఒకరిని ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో గెహ్లాట్‌ను గనుక తప్పిస్తే.. శశిథరూర్‌తో పాటు దిగ్విజయ్ సింగ్, ముకుల్ వాస్నిక్ లాంటి కొందరు నేతలు రేసులో నిల్చునే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
రాజస్థాన్ సంక్షోభంపై రాహుల్ సమీక్ష.. హుటాహుటిన ఢిల్లీకి వేణుగోపాల్
సాక్షి,న్యూఢిల్లీ: రాజస్థాన్‌లో సీఎం అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్ వర్గీయుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం ప్రయత్నిస్తోంది. గహ్లోత్ వర్గానికి చెందిన 92 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయగానే పార్టీ పరిశీలకునిగా వెళ్లిన మల్లికార్జున్ ఖర్గే, అజయ్ మాకెన్ వారితో ఆదివారం రాత్రి భేటీ అయ్యారు. అయితే గహ్లోత్ వర్గీయులు పైలట్‌కు సీఎం పదవి ఇచ్చేందుకు ససేమిరా అనడంతో ఎలాంటి పురోగతి లేకుండానే చర్చలు ముగిశాయి. దీంతో ఖర్గే, అజయ్ మాకెన్ తిరిగి ఢిల్లీకి పయనమవుతున్నారు. మరోవైపు రాజస్థాన్‌లో అనూహ్య పరిణామాలను రాహుల్ గాంధీ సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేరళలో భారత్ జోడో యాత్రలో ఉన్న ఆయన.. ఎమ్మెల్యేల రాజీనామా విషయం తెలియగానే హుటాహుటిన కేసీ వేణుగోపాల్‌ను ఢిల్లీకి పంపారు. ఎమ్మెల్యేలను తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ అధిష్ఠానం బావిస్తోంది. అసమ్మతి వర్గంలోని ఒక్కో ఎమ్మెల్యేతో కాంగ్రెస్ పరిశీలకులు ప్రత్యేకంగా చర్చించాలని కాంగ్రెస్ అధిష్ఠానం సూచించింది. అయితే ఎమ్మెల్యేలంతా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తమ ఇళ్లకు వెళ్లారని, ఇవాళ ఎవరితోనూ భేటీ అయ్యే అవకాశం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైవు ఇవాళ సాయంత్రం సోనియా గాంధీతో కాంగ్రెస్ పరిశీలకులు, కేసీ వేణుగోపాల్ సమావేశం అవుతారని, ఆ తర్వాత కీలక నిర్ణయం ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న అశోక్ గహ్లోత్ సీఎం పదవికి రాజీనామా చేస్తే ఆయన స్థానంలో పైలట్‌ను కొత్త సీఎంగా నియమించాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. అయితే గహ్లోత్ వర్గం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమ వర్గానికి చెందిన వారినే సీఎం చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే 92 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం రాష్ట్ర కాంగ్రెస్‌లో సంక్షోభానికి దారితీసింది. బీజేపీ సెటైర్లు.. ఓ వైపు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొంటుంటే.. మరోవైపు రాజస్థాన్‌లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ చోడో అంటున్నారని బీజేపీ సెటైర్లు వేసింది. దేశాన్ని ఏకం చేయడం కాదు రాహుల్, ముందు మీ ఎమ్మెల్యేలను ఏకం చెయ్ అని ఎద్దేవా చేసింది. చదవండి: నా చేతుల్లో ఏం లేదు.. అశోక్ గహ్లోత్ కీలక వ్యాఖ్యలు! -
నా చేతుల్లో ఏం లేదు.. అశోక్ గహ్లోత్ కీలక వ్యాఖ్యలు!
జైపూర్: 90 మందికిపైగా ఎమ్మెల్యేల రాజీనామాతో రాజస్థాన్ కాంగ్రెస్‌లో సంక్షోభం తలెత్తింది. ఈ నేపథ్యంలో సీఎం అశోక్ గహ్లోత్ తన చేతుల్లో ఏమీలేదని, ఎమ్మెల్యేలంతా ఆగ్రహంతో ఉన్నారని అధిష్ఠానానికి చెప్పినట్లు సమాచారం. రాజస్థాన్ పరిణామాలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేకే వేణుగోపాల్‌తో గహ్లోత్ ఫోన్లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే కేకే వేణుగోపాల్ మాత్రం దీన్ని ఖండించారు. అసలు గహ్లోత్‌తో తాను ఫోన్లో మాట్లాడలేదేని చెప్పారు. గహ్లోత్ తనుకు గానీ, తాను గహ్లోత్‌కు గానీ ఫోన్ చేయలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో తలెత్తిన సమస్యను అధిష్ఠానం వీలైనంత త్వరగా పరిష్కరిస్తుందని స్పష్టం చేశారు. రాజస్థాన్ కాంగ్రెస్‌లో ఆదివారం ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న అశోక్ గహ్లోత్.. సీఎంగా తప్పుకోవడానికి వీల్లేదని ఆయన వర్గానికి చెందిన 92 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. ఒకవేళ గహ్లోత్ రాజీనామా చేస్తే ఆయన స్థానంలో తమ వర్గానికి చెందిన నేతనే సీఎం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సచిన్ పైలట్‌ను మాత్రం సీఎం చేయవద్దని తేల్చిచెప్పారు. 2020లో పార్టీపై తిరుగుబావుటా ఎగురవేసి ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించిన ఆయనను సీఎం ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఈ విషయంపై పార్టీ అధిష్ఠానంతోనే చర్చిస్తామన్నారు. ఆదివారం సీఎల్పీ సమావేశానికి ముందే ఈ పరిణామం జరగడం కాంగ్రెస్ అధిష్ఠానాన్ని షాక్‌కు గురిచేసింది. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న అశోక్ గహ్లోత్.. మొదట రాజస్థాన్ సీఎంగా కూడా కొనసాగుతానని చెప్పారు. అయితే రాహుల్ గాంధీ సహా పార్టీ సీనియర్ నేతలు ఒకరికి ఒకే పదవి అని ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను గుర్తుచేశారు. దీంతో అధ్యక్ష ఎన్నికకు నామినేషన్ వేయడానికి ముందే ఆయన సీఎం పదవికి రాజీనామా చేస్తారని, కొత్త సీఎంగా సచిన్ పైలట్ బాధ్యతలు చేపడతాని ప్రచారం జరిగింది. గహ్లోత్ వర్గం దీన్ని వ్యతిరేకించడంతో సంక్షోభ పరిస్థితి తలెత్తింది. చదవండి: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. 92 మంది ఎమ్మెల్యేల రాజీనామా -
కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. 92 మంది ఎమ్మెల్యేల రాజీనామా
జైపూర్: రాజస్థాన్‌లో అధికార కాంగ్రెస్‌లో సంక్షోభం తలెత్తింది. 92 మంది ఎమ్మెల్యేలు ఆదివారం రాజీనామా చేశారు. రాజీనామా లేఖలను అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషికి నివాసానికి వెళ్లి అందజేశారు. దీంతో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు ముందు పార్టీలో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. అయితే రాజీనామా చేసిన వారంతా సీఎం అశోక్ గహ్లోత్ మద్దతుదారులు. గహ్లోత్ కాంగ్రెస్ అధ్యక్షుడైతే రాజస్థాన్ తదపురి సీఎంగా సచిన్ పైలట్‌ను నియమించడాన్ని వీరంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో పార్టీపై తిరుగుబావుటా ఎగురవేసి ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించిన పైలట్‌కు సీఎం పదవి కట్టబెట్టడం ఏంటని వీరంతా ప్రశ్నిస్తున్నారు. రాజస్థాన్ తదుపరి సీఎం కూడా అశోక్ గహ్లోత్ వర్గానికి చెందిన వారే కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం కేబినెట్ మంత్రి శాంతి ధరివాల్ నివాసంలో గహ్లోత్ వర్గం ఎమ్మెల్యేలంతా భేటీ అయ్యారు. అనంతరం ఓ బస్సు ఎమ్మెల్యేలతో స్పీకర్ జోషి నివాసానికి వెళ్లింది. ఆ తర్వాత వారంతా రాజీనామాలు సమర్పించారు. ఎమ్మెల్యేలంతా ఆగ్రహంతో ఉన్నారని, అందుకే రాజీనామా చేశారని అసమ్మతి వర్గంలో ఒకరైన ప్రతాప్ సింగ్ తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని తమను సంప్రదించకుండా అశోక్ గహ్లోత్ నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. సీఎల్పీ సమావేశానికి ముందు ఈ పరిణామాలు జరగడం కాంగ్రెస్ అధిష్ఠానాన్ని షాక్‌కు గురిచేశాయి. గహ్లోత వర్గానికి చెందిన సీపీ జోషి లేదా పీసీసీ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దొటాస్రా కొత్త సీఎంగా ఉండాలని తాము కోరుకుంటున్నట్లు ప్రతాప్ సింగ్ చెప్పారు. ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్ఠానంతో మాట్లాడతామన్నారు. చదవండి: రాజస్థాన్ సీఎం పదవికి అశోక్ గహ్లోత్ రాజీనామా! -
రాజస్థాన్ సీఎం పదవికి అశోక్ గహ్లోత్ రాజీనామా!
జైపూర్: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ వేయడానికి ముందే రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జైపూర్‌లోని అశోక్ గహ్లోత్ నివాసంలో ఆదివారం రాత్రి 7గంటలకు కాంగ్రెస్ శాసనసభా పక్షం సమావేశం కానుంది. సీఎం మార్పు తథ్యమని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఈ భేటీ కీలకంగా మారింది. రాజస్థాన్ కాంగ్రెస్ శాసనసభాపక్షానికి కొత్త సారథిని నిర్ణయించే అధికారం అధ్యక్షురాలు సోనియా గాంధీకే వదిలేస్తూ ఈ సమావేశంలో తీర్మానం చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే సచిన్ పైలట్‌ను నూతన సీఎం చేయడం గహ్లోత్‌కు ఇష్టం లేదు. ఈ విషయంపై ఎమ్మెల్యేలు కూడా మాట్లాడాలని ఆయన కోరుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సచిన్ పైలట్‌కు గాంధీల నుంచి హామీ వచ్చిందని, ఆయనే తదపరి సీఎం అని పార్టీ వర్గాలు చెప్పాయి. అంతేగాక తాను నామినేషన్ సమర్పించిన తర్వాతే రాజస్థాన్ కొత్త సీఎంపై నిర్ణయం తీసుకోవాలని సూచించినట్లు పేర్కొన్నాయి. జైపూర్‌లో జరిగే ఈ సమావేశానికి పరిశీలకుడిగా కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే, రాజస్థాన్ ఇన్‌ఛార్జ్‌గా అజయ్ మాకెన్ హాజరుకానున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఖర్గేను పరిశీలకుడిగా సోనియా గాంధీ నియమించారు. అక్టోబర్ 17న జరగనున్న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ సెప్టెంబర్ 24న మొదలై 30వరకు కొనసాగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 8 వరకు గడువుంది. ఎన్నికలు జరిగిన రెండో రోజు అంటే అక్టోబర్ 19న ఫలితాలు ప్రకటిస్తారు. చదవండి: ‘70 ఏళ్లలో ఏ నాడూ దేశం ఇలా కాలేదు’ -
సచిన్ పైలటే సీఎం.. మంత్రి కీలక వ్యాఖ్యలు
జైపూర్: కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ అతి త్వరలో ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు రాజస్థాన్ మంత్రి రాజేంద్ర గుఢా. ఎమ్మెల్యేలందరి మద్దతు ఆయనకు ఉందని స్పష్టం చేశారు. సీఎం అశోక్ గహ్లోత్‌కు మద్దతు తెలిపిన స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా సచిన్ పైలట్ వైపే ఉంటారని పేర్కొన్నారు. గహ్లోత్ కాంగ్రెస్ అధ్యక్షుడైతే పైలట్ సీఎం అవుతారని, అధిష్ఠానం నిర్ణయాన్ని ఎవరూ వ్యతిరేకించరని చెప్పారు. 2018లో జరిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేల్లో రాజేంద్ర గుఢా ఒకరు. ఆ తర్వాత వీరంతా తమ శాసనసభాపక్షాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. రాజేంద్రకు మంత్రి పదవి దక్కింది. తమ ఆరుగురు ఎమ్మెల్యేలు సచిన్ పైలట్‌కు మద్దతుగానే ఉంటారని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు. అక్టోబర్ 17న జరిగే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో అశోక్ గహ్లోత్ పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. సోమవారం ఆయన నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. అయితే తాను అధ్యక్షుడినైనా సీఎంగా కొనసాగుతానని గహ్లోత్ అన్నారు. రెండు బాధ్యతలూ చేపట్టగలనని పేర్కొన్నారు. కానీ రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ సీనియర్ నేతలు మాత్రం ఒక్కరికి ఒకే పదవి అని ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను గుర్తు చేశారు. దీంతో గహ్లోత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైతే, యువ నేత సచిన్ పైలట్ రాజస్థాన్ సీఎం కావడం ఖాయం. ఆయన రాహుల్‌కు సన్నిహితుడు కావడమే గాక, రాష్ట్రంలో ముఖ్యంగా యువతలో మంచి ఆదరణ ఉంది. చదవండి: బీజేపీకి వెన్నుపోటు పొడిచాడు: అమిత్‌షా -
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ వేస్తా..కానీ: అశోక్ గహ్లోత్
జైపూర్: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్ష ఎన్నికకు సమయం సమీపిస్తున్న కొద్దీ ఆ పార్టీలో పొలిటికల్ హీట్ పెరిగింది. ముఖ్యంగా అధ్యక్ష పదవికి ఎన్నిక హడావిడీ అంతా రాజస్థాన్ రాష్ట్రంలోనే కనిపిస్తోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నట్లు వార్తలు వినిపించినప్పటి నుంచి రాష్ట్రం చుట్టూ రాజకీయం నడుస్తోంది. ఒకవేళ గహ్లోత్ పోటీ చేస్తే రాజస్థాన్ సీఎంగా కొనసాగుతారా? లేదా తదుపరి సీఎం ఎవరవుతారనే చర్చ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఏమవుతుందో ఎదురుచుద్దాం! ఈ క్రమంలో తాజాగా తాను కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయనున్నట్లు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ గురువారం ప్రకటించారు. అయితే రాష్ట్రానికి దూరంగా ఉండనని, రాజస్థాన్ కోసం ఎల్లప్పుడు పనిచేస్తూనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. ‘కాంగ్రెస్ పదవికి నేను నామినేషన్ దాఖలు చేస్తాను. ఆ తరువాత ఇతర ప్రక్రియ అమలులో ఉంటుంది. అలాగే ఎన్నిక కూడా జరగవచ్చు. ఇదంతా భవిష్యత్తుపై ఆధారపడి ఉంటుంది. ఎవరిమీద ప్రత్యేకంగా కామెంట్ చేయాలని అనుకోవడం లేదు. రాజస్థాన్‌లో ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో, కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, రాజస్థాన్ ఎమ్మెల్యేలు ఏమనుకుంటున్నారో చూద్దాం. ఇదంతా దీనిపై ఆధారపడి ఉంటుంది' అని అశోక్ గహ్లోత్’ అన్నారు. రాజస్థాన్ నెక్ట్స్ సీఎం ఎవరూ? ఇదిలా ఉండగా అశోక్ గహ్లోత్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికైతే రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అప్పుడు సీఎం పోస్టుకు గతంలో తిరుగుబాటు చేసిన సచిన్ పైలట్ ముందు వరుసలో ఉన్నారు. కానీ సచిన్ సీఎం అవ్వడం గహ్లోత్‌కు నచ్చడం లేదు. దీంతో సీఎం పదవికి అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి పేరును ఇప్పటికే ఆయన సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. పోటీలో పలువురు తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ కూడా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆ మేరకు బుధవారమే ఆయన సోనియా గాంధీని కలిశారు. అంతేగాక దిగ్విజయ్ సింగ్ తాను రేసులో ఉన్నానంటూ ముందుకు వచ్చారు. మాజీ కేంద్ర మంత్రి మనీష్ తివారీ, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కూడా పోటీ చేసే అవకాశం ఉంది. మరోవైపు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టాలని ఏడు రాష్ట్రాల యూనిట్లు తీర్మానాలు చేశాయి. అయితే రాహుల్ నామినేషన్ దాఖలు చేస్తారా లేదా అనే అంశం పైన సస్పెన్స్ కొనసాగుతోంది కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలకు నోటిఫికేషన్ నేడు(గురువారం) వెలువడింది. ఈ నెల 24 నుంచి 30 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ తెలిపారు. అక్టోబర్ 1న నామినేషన్ పత్రాల పరిశీలన, అక్టోబర్ 8న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఇక పోటీలో ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే అధక్ష ఎన్నిక అక్టోబర్ 17న జరుగుతుంది. అక్టోబర్ 19న ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు. . -
అందరూ కోరితే అధ్యక్ష పదవికి రెడీ...!
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘అధినేత్రి సోనియాగాంధీ కుటుంబంతో పాటు కాంగ్రెస్‌లో చాలామంది నేతలకు నాపై ఎంతో నమ్మకముంది. వారంతా కోరితే అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు సిద్ధం’’ అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. సీఎంగా కొనసాగమన్నా, అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేయమన్నా తోసిపుచ్చలేనన్నారు. బుధవారం ఆయన ఢిల్లీలో సోనియాతో భేటీ అయ్యారు. అధ్యక్ష ఎన్నికపై చాలాసేపు చర్చించినట్టు సమాచారం. ఈ సందర్భంగా గెహ్లాట్ మీడియాతో మాట్లాడారు. ‘‘50 ఏళ్లుగా పార్టీ నాకెన్నో పదవులిచ్చింది. నాకు పదవులు ముఖ్యం కాదు. ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తిస్తా’’ అని చెప్పారు. అయితే, ‘‘ప్రస్తుతం రాజస్తాన్ సీఎంగా నాకప్పగించిన బాధ్యతను నెరవేరుస్తున్నా. ఇకముందు కూడా నెరవేరుస్తూనే ఉంటా’’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలూ చేశారు. తద్వారా అధ్యక్షునిగా ఎన్నికైనా సీఎంగా కొనసాగుతానంటూ సంకేతమిచ్చారు. జోడు పదవులు కాంగ్రెస్ ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌కు విరుద్ధం కాదా అని ప్రశ్నించగా, ‘‘ఆ నిబంధన నామినేటెడ్ పదవులకే వర్తిస్తుంది. అధ్యక్ష పదవికి బహిరంగ ఎన్నిక జరుగుతుంది గనుక ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రుల్లో ఎవరైనా పోటీ పడవచ్చు’’ అని బదులిచ్చారు. ‘‘నేనెక్కడుండాలో కాలమే నిర్ణయిస్తుంది. పార్టీకి సేవ చేయడమే నా లక్ష్యం. పార్టీకి ఉపయోగపడే చోటే ఉండాలన్నది నా అభిమతం’’ అన్నారు. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కూడా బరిలో దిగుతుండటాన్ని ప్రస్తావించగా అలాంటి పోటీ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యానికి చాలా మంచిదన్నారు. పోటీకి రాహుల్‌గాంధీని ఒప్పించేందుకు చివరగా మరోసారి ప్రయత్నిస్తానని చెప్పారు. ఇందుకోసం ఆయన గురువారం కేరళ వెళ్లనున్నారు. మరోవైపు గెహ్లాట్ అభిప్రాయంతో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్ విభేదించారు. ‘‘ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ప్రకారం జోడు పదవుల్లో కొనసాగేందుకు వీల్లేదు. పార్టీ అధ్యక్షునిగా ఎన్నికైతే సీఎం పదవికి రాజీనామా చేయాల్సిందే’’ అని అభిప్రాయపడ్డారు. తాను కూడా బరిలో దిగే అవకాశముందని దిగ్విజయ్ అన్నారు! ‘‘ఇద్దరే పోటీ చేయాలా? నేను చేయొద్దా?’’ అని జాతీయ మీడియాతో ప్రశ్నించారు. రాహులే సారథి కావాలి: పైలట్ మరోవైపు, రాహులే మళ్లీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని రాజస్తాన్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సచిన్ పైలట్ కోరారు. సగటు కాంగ్రెస్ కార్యకర్తలంతా అదే కోరుతున్నారన్నారు. ఆయన రాజకీయ ప్రత్యర్థి గెహ్లాట్ గనక పార్టీ అధ్యక్షుడైతే రాజస్తాన్ సీఎం ఎవరవుతారన్న ప్రశ్నకు బదులిచ్చేందుకు నిరాకరించారు. రాహుల్‌ను ఒప్పించేందుకు పార్టీ నేతలందరం ప్రయత్నిస్తున్నామని సల్మాన్ ఖుర్షీద్ కూడా అన్నారు. మిస్త్రీతో థరూర్ భేటీ కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చీఫ్ మధుసూదన్ మిస్త్రీని శశి థరూర్ కలిశారు. నామినేషన్ దాఖలు ప్రక్రియ గురించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. థరూర్‌కు అన్ని విషయాలూ వివరించినట్టు అనంతరం మిస్త్రీ చెప్పారు. 24న నామినేషన్ పత్రం తీసుకుంటానని చెప్పారన్నారు. ఇదీ చదవండి: ఇద్దరే పోటీ చేయాలా? అధ్యక్ష రేసులో నేనూ ఉన్నా.. కాంగ్రెస్ సీనియర్ నేత కీలక వ్యాఖ్యలు -
అసెంబ్లీ ఎన్నికలే మా టార్గెట్.. సీఎం రేసు వేళ సచిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు గడువు సమీపిస్తున్న కొద్దీ పార్టీలో సీనియర్ల పేర్లు తెరమీదకు వస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీలో పొలిటికల్ హీట్ నెలకొంది. కాగా, కాంగ్రెస్ అధ్యక్ష బరిలోకి రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ దిగడం దాదాపు ఖాయమైంది. ఆయనకు పోటీగా తాజాగా తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ కూడా తెరపైకి వచ్చారు. దీంతో, రాజస్థాన్ సీఎం ఎవరూ అనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో రాజస్తాన్ కాంగ్రెస్‌లో మరో కీలక నేత సచిన్ పైలట్ తెరమీదకు వచ్చారు. ఈ తరుణంలో సచిన్ పైలట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాల్గొనేందుకు కేరళ వచ్చిన సచిన్ పైలట్ మీడియాతో మాట్లాడుతూ.. ‘అశోక్ గెహ్లాట్ చాలా సీనియర్ నాయకుడు. దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తున్నారు. వచ్చే ఏడాది రాజస్థాన్ ఎన్నికల్లో గెలవడమే మా లక్ష్యం’ అని తెలిపారు. ఈ క్రమంలోనే రాజస్తాన్ ముఖ్యమంత్రి ఎవరనే ప్రశ్నకు పైలట్ సమాధానం ఇస్తూ.. కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న నేను అంగీకరిస్తానని స్పష్టం చేశారు. మరోవైపు.. పార్టీ అధ్యక్షునిగా ఎన్నికై ఢిల్లీ వెళ్తే సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వస్తుందన్న కారణంగా విముఖంగా ఉన్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంపై పట్టు వదులుకోవడానికి గెహ్లాట్ అస్సలు సుముఖంగా లేరని సమాచారం. ఒకవేళ తాను సీఎంగా తప్పుకుంటే తన స్థానంలో తన విశ్వాసపాత్రున్ని సీఎం చేయాలని అధిష్టాన్నాన్ని కోరుతున్నట్టు తెలుస్తోంది. కాగా, కొద్దిరోజులుగా గెహ్లాట్, పైలట్ మధ్య కోల్డ్‌వార్ నడుస్తున్న కారణంగా ఇది అధిష్టానానికి కొత్త తలనొప్పిగా పరిణమించిందని సమాచారం. ఇక, స్పీకర్ సీపీ జోషి కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకుల్లో ఒకరు అవడంతో తాను కూడా సీఏం రేసులో ఉన్నానన్న సంకేతాలిస్తున్నారు. దీంతో రాజస్థాన్ తదుపరి సీఏంగా ఎవరిని ఎంపిక చేస్తుందనేది రాజకీయవర్గాల్లో ఆసక్తిగా మారింది. 2023 డిసెంబర్ వరకు రాజస్థాన్ శాసనసభ పదవీకాలం ఉంది. -
సీఎంగానా? వర్కింగ్ ప్రెసిడెంట్‌గానా!... టెన్షన్లో రాజస్తాన్ సీఎం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు అక్టోబర్ 17న జరగనున్న సంగతి తెలిసింది. కాంగ్రెస్ 20 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఈ ఎన్నికలు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రాజస్తాన్ ముఖ్యమంత్రి ఆశోక్ గెహ్లాట్ పార్టీ పగ్గాలు చేపట్టాల్సిందిగా కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ పదేపదే కోరారు. ఐతే అందుకు ఆశోక్ గెహ్లాట్ సిద్దంగా లేరని సమాచారం. పైగా పార్టీ అధ్యక్ష అత్యున్నత పదవిని రాహుల్ గాంధీనే చేపట్టాలని గెహ్లాట్ ఒప్పించే ప్రయత్నం చేయునున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా...రాజస్తాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ కూడా ఢిల్లీకి రావడంతో ఆయనలో మరింత టెన్షన్ మొదలైంది. ఎందుకంటే ఈసారి రాజస్తాన్ ముఖ్యమంత్రిగా సచిన్ పైలెట్‌కి చాన్స్ ఇవ్వాలని పార్టీ సన్నాహాలు చేయడం ఆశోక్‌ని కాస్త ఆందోళనకు గురి చేస్తున్న అంశం. వాస్తవానికి బీజేపీ ఆపరేషన్ కమలం తిరుగుబాటు సమర్థవంతంగా ఎదుర్కొన్న గొప్ప కాంగ్రెస్ అనుభవజ్ఞుడు ఆశోక్ గెహ్లాట్. అందుకే పార్టీ ఆయన్ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టాలని ఆశిస్తుంది. ఐతే ఆయన అందుకు సిద్ధంగా లేకపోవడం గమనార్హం. ఆయన అటూ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గానూ, రాజస్తాన్ ముఖ్యమంత్రిగానూ రెండు పదవులలోనూ కొనసాగాలన్నదే ఆయన ఆలోచన అని పార్టీ సభ్యుల చెబుతున్నారు. తొలుత ఆశోక్ రాహుల్‌ని వర్కింగ్ ఛీప్‌గా ఉండేలా ఒప్పించేందుకు యత్నం చేసిన తదనంతరమే వచ్చే సోమవారం ఈ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయనున్నట్ల సమాచారం. ఆయనకు ప్రత్యర్థిగా శశి థరూర్ పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ ఈ నామినేషన్లను ఈ నెల సెప్టెంబర్ 30 వరకు స్వీకరిస్తుంది. ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేస్తే అక్టోబర్ 17 ఎన్నికలు నిర్వహిస్తుంది లేదంటే ఏకగ్రీవంగా ఎన్నుకుంటుంది. (చదవండి: పంజాబ్ సీఎం నిజంగానే ఫుల్లుగా తాగారా? పౌర విమానాయన శాఖ దర్యాప్తు) -
రాజస్థాన్ కాంగ్రెస్‌లో ముసలం.. పైలట్‌పై గెహ్లాట్ విసుర్లు
జైపూర్: రాజస్థాన్ కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ముఖ్య నేత సచిన్ పైలట్ మధ్య విభేదాలు తీవ్రతరమవుతున్నాయి. పార్టీ కార్యకర్తలను పైలట్ రెచ్చగొడుతున్నారంటూ పంద్రాగస్టు ప్రసంగంలో గెహ్లాట్ పరోక్ష విమర్శలకు దిగారు. కార్యకర్తలకు గౌరవం దక్కడం లేదంటూ కొంతకాలంగా పైలట్ చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. షాహీద్ మెమోరియాల్ వద్ద నిర్వహించిన కార్యక్రమం వేదికగా సచిన్ పైలట్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు గెహ్లాట్. ‘‘ఇటీవల కొందరు నేతలు కొత్త పల్లవి అందుకున్నారు. కార్యకర్తలకు గౌరవం లభించాలని రెచ్చకొడుతున్నారు. అసలు గౌరవమంటే ఏమిటో వారికి తెలుసా? కార్యకర్తలకు కాంగ్రెస్‌లో అత్యున్నత గౌరవముంది. కాబట్టే నేను సీఎం స్థాయికి ఎదిగా’’ అని పేర్కొన్నారు సీఎం అశోక్ గెహ్లాట్. ఆ తర్వాత సాయంత్రం నిర్వహించిన ఓ వీడియో కాన్ఫరెన్స్‌కు సచిన్ పైలట్ గైర్హాజరయ్యారు. ఇదీ చదవండి: బాలుడి హత్య.. కాంగ్రెస్‌లో ముసలం, ఎమ్మెల్యే రాజీనామా -
Rajasthan: కాంగ్రెస్ పార్టీలో ముసలం, ఎమ్మెల్యే రాజీనామా
జైపూర్: రాజస్థాన్‌లో దళిత బాలుడి హత్య అధికార కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. ప్రతిపక్ష బీజేపీ నుంచే కాకుండా సొంత పార్టీ నుంచి కూడా గెహ్లాట్ సర్కారు విమర్శలు ఎదుర్కొంటోంది. తొమ్మిదేళ్ల దళిత విద్యార్థి మృతి తనను తీవ్రంగా కలచివేసిందని బారన్ - అత్రుకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే పనాచంద్ మేఘ్వాల్ తన రాజీనామాను ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు పంపారు. కేసు విచారణలో పోలీసుల నాన్చుడు ధోరణికి వ్యతిరేకంగా రాజీనామా చేసినట్టు మేఘ్వాల్ వెల్లడించారు. అగ్రవర్ణాల కోసం ఉద్దేశించిన కుండలోని నీరు తాగినందుకు ఇంద్రకుమార్ మేఘవాలా దళిత విద్యార్థిని చెయిల్ సింగ్ అనే టీచర్ చావ బాదాడు. బాధిత చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ప్రాణాలు వదిలాడు. రాజస్తాన్‌లోని జలోర్ జిల్లాలోని సురానా గ్రామంలోని ఓ ప్రైవేటు స్కూల్లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. దీనిపై ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. కాంగ్రెస్‌లో పొలిటికల్ డ్రామా దళిత బాలుడి మృతిపై కాంగ్రెస్ పార్టీలో రాజకీయ డ్రామా మొదలైంది. మొదటి నుంచి అశోక్ గెహ్లాట్‌ను వ్యతిరేకిస్తున్న మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మంగళవారం సురానా గ్రామానికి పయనమయ్యారు. బాలుడు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వంపై ప్రశ్నాస్త్రాలు ఎక్కుపెట్టారు. ‘దళిత బాలుడి మృతి దిగ్భ్రాంతికర దారుణ ఘటన. సమాజంలో ప్రబలంగా ఉన్న దురాచారాలను మనం అంతం చేయాలి. ప్రభుత్వం, అధికార యంత్రాంగం మొక్కుబడిగా కాకుండా బాధిత కుటుంబానికి సత్వరమే పూర్తి న్యాయం చేయాల’ని సచిన్ పైలట్ డిమాండ్ చేశారు. పైలట్‌కు చెక్ పెట్టేలా.. జలోర్ జిల్లాకు సచిన్ పైలట్ వెళుతున్నారని తెలియగానే సీఎం గెహ్లాట్ అప్రమత్తమయ్యారు. పైలట్‌కు పొలిటికల్ మైలేజీ రాకుండా చేయాలన్న ఉద్దేశంతో క్యాబినెట్లో సీనియర్ మంత్రులు, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ దోతస్రాను హుటాహుటిన జలోర్‌కు పంపించారు. అంతేకాదు త్వరతగతిన దర్యాప్తు చేసి, బాధిత కుటుంబానికి త్వరగా న్యాయం జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించినట్లు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మీడియాకు తెలిపారు. బాలుడి కుటుంబానికి రూ. 5 లక్షల సాయం కూడా ప్రకటించారు. (క్లిక్: వాళ్ల కాళ్లు విరగొట్టండి.. నేను బెయిల్ ఇస్తా) బీజేపీ మండిపాటు దళిత బాలుడి హత్య సిగ్గుచేటని పేర్కొంటూ గెహ్లాట్ సర్కారుకు ప్రతిపక్ష బీజేపీ విమర్శించింది. రాజస్థాన్‌లో దళితులకు న్యాయం జరిగేలా గెహ్లాట్‌ను రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ఎప్పుడు ఆదేశిస్తారని పశ్నిస్తూ ట్వీట్ చేసింది. కాగా, దళిత బాలుడి మరణానికి కారణమైన టీచర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై హత్యా నేరంతోపాటు ఎస్సీ/ఎస్టీ (అట్రాసిటీ నిరోధక) చట్టం కింద కేసు నమోదు చేశారు. (క్లిక్: ప్రధాని వ్యాఖ్యలు.. బీజేపీని ఉద్దేశించినవే!) -
కొలువుదీరిన రాజస్తాన్ కొత్త కేబినెట్
జైపూర్: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మూడేళ్ల తర్వాత కేబినెట్ పునర్వ్యవస్థీకరణ సజావుగా సాగింది. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, అసమ్మతి నాయకుడు సచిన్ పైలెట్ వర్గాలకు సమ ప్రాధాన్యం ఇస్తూ మంత్రివర్గానికి రూపకల్పన జరిగింది. మొత్తంగా 15 మంది కొత్త మంత్రులు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో 11 మంది కేబినెట్ హోదా కలిగిన వారు కాగా, నలుగురు సహాయమంత్రులు ఉన్నారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కొత్త మంత్రులతో గవర్నర్ కల్రాజ్ మిశ్రా ప్రమాణం చేయించారు. కొత్త మంత్రివర్గంలో సచిన్ వర్గానికి చెందిన అయిదుగురికి చోటు లభించింది. గత ఏడాది ముఖ్యమంత్రి గహ్లోత్‌పై సచిన్ పైలెట్ తిరుగుబాట బావుటా ఎగురవేసిన సమయంలో ఆయన వెంట ఉంటూ వేటుని ఎదుర్కొన్న విశ్వేంద్ర సింగ్, రమేష్ మీనాలను తిరిగి కేబినెట్లోకి తీసుకున్నారు. పైలెట్ వర్గ ఎమ్మెల్యేలైన హేమరామ్ చౌధరి, బ్రిజేంద్రసింగ్ ఒలా, మురారిలాల్ మీనాలకు సహాయ మంత్రులు పదవులు దక్కాయి.కొత్త కేబినెట్‌పై సచిన్ సంతృప్తి వ్యక్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా శుభసందేశాన్ని అందిస్తుందన్నారు.రాజస్థాన్ కాంగ్రెస్ ఐక్యంగా ముందుకు వెళుతుందని, 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఖాయమని చెప్పారు. ప్రమాణ స్వీకారనంతరం ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ విలేకరులతో మాట్లాడుతూ అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యం ఇచ్చేలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేబినెట్లో చోటు కల్పించామన్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా సచిన్? ఉప ముఖ్యమంత్రి , పీసీసీ అధ్యక్ష పదవుల్ని పోగొట్టుకున్న అసమ్మతి నాయకుడు సచిన్ పైలెట్ పాత్ర కాంగ్రెస్‌లో ఎలా ఉండబోతోంది? ఇప్పుడు అందరిలోనూ ఇదే ఆసక్తి రేపుతోంది. ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సచిన్ పైలెట్ సమావేశమైనప్పుడు పార్టీలో తన స్థానంపై చర్చించారని, 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తానని సోనియా హామీ ఇచ్చినట్టుగా పైలెట్ శిబిరం ప్రచారం చేస్తోంది. అప్పటివరకు పార్టీ ప్రధాన కార్యదర్శి, ఏదైనా రాష్ట్రానికి ఇన్చార్జ్ చేసే అవకాశాలు ఉన్నాయి. మరో రాష్ట్రానికి ఇన్చార్జ్గా వెళ్లినప్పటికీ రాజస్థాన్ రాష్ట్ర రాజకీయాల్లో ఇక సచిన్ కీలకంగా వ్యవహరించనున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్ రాష్టానికే ఇన్చార్జ్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రియాంకగాంధీతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉండాలని సచిన్‌కి ఇప్పటికే అధిష్టానం సంకేతాలు పంపినట్టుగా సమాచారం. ఇక ఎన్నికలు జరిగే అయిదు రాష్ట్ర్రాల్లోనూ సచిన్ స్టార్ క్యాంపైనర్‌గా కూడా వ్యవహరిస్తారు. -
పంజాబ్ ముగిసింది.. ఇక రాజస్తాన్‌పై కాంగ్రెస్ దృష్టి
న్యూఢిల్లీ: పంజాబ్‌లో రాజకీయ సంక్షోభం ముగిసిపోవడంతో రాజస్తాన్‌పై కాంగ్రెస్ దృష్టి సారించింది. రాజస్తాన్ కేబినెట్‌ను విస్తరిస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో సీనియర్ కాంగ్రెస్ నేత సచిన్ పైలెట్ శుక్రవారం రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీలను కలుసుకొని చర్చించారు. రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, సచిన్ పైలెట్ల మధ్య అధికార పోరు నడుస్తూ ఉన్న నేపథ్యంలో పైలెట్ పలుమార్లు రాహుల్, ప్రియాంకలను కలుసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కేబినెట్ విస్తరణతో పాటు, కార్పొరేషన్లు, వివిధ ప్రభుత్వ బోర్డుల్లో నియామకం జరపాలని పార్టీలో సంస్థాగతంగా మార్పులు తీసుకురావాలని పైలెట్ డిమాండ్ చేస్తున్నారు. -
పంజాబ్ బాటలో రాజస్తాన్!
సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్ తాజా రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్తాన్‌పై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పంజాబ్‌లో కెప్టెన్ అమరీందర్ సింగ్ స్థానంలో చరణ్‌జీత్ సింగ్ చన్నీని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. అయితే పంజాబ్‌లో పరిస్థితిని చక్కబెట్టామని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్న తరుణంలో, హైకమాండ్ నిర్ణయం ఇతర రాష్ట్రాల్లో అధికార మార్పు దిశగా క్యాంపు రాజకీయాలను పెంచే విధంగా ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. అంతేగాక 2018లో రాజస్తాన్‌లో అశోక్ గహ్లోత్‌ను ముఖ్యమంత్రిగా చేసినప్పుడు మొదలైన గ్రూప్ రాజకీయాలకు పంజాబ్ పరిణామాలు మరింత ఊతం ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. హామీలు నెరవేర్చండి పంజాబ్‌లో సీం మార్పు, రాజస్థాన్‌లోని సచిన్ పైలట్ వర్గంలో నూతనోత్సాహాన్ని నింపిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అశోక్ గహ్లోత్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని గత కొన్నేళ్లుగా పైలట్ వర్గం నాయకులు చేస్తున్న డిమాండ్ మరోసారి ఊపందుకుంటుందని చర్చ జరుగుతోంది. గతంలో రాజస్తాన్‌లో ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకోవడం తెలిసిందే. పైలట్ తిరుగుబాటు చేసి క్యాంపు రాజకీయాలు నెరిపారు. అయితే పార్టీ హైకమాండ్ పంపిన ట్రబుల్ షూటర్, దివంగత అహ్మద్ పటేల్ నేతృత్వంలోని కమిటీ జోక్యంతో పరిస్థితి కాస్త సద్దుమణిగింది. కానీ పార్టీ హైకమాండ్ ఏడాది కిందట ఇచ్చిన కేబినెట్ పునర్వ్యవస్థీకరణ హామీని ఇప్పటికీ నెరవేర్చకపోవడంపై పైలట్ క్యాంపులో గత కొంతకాలంగా అసంతృప్తి కొనసాగుతోంది. పంజాబ్‌లో జరిగిన అధికార మార్పు పరిణామాల ప్రభావంతో తమకు మంచి రోజులు రానున్నాయని పైలట్ వర్గీయులు భావిస్తున్నారని సమాచారం. పార్టీ హైకమాండ్ త్వరలోనే రాజస్తాన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఎమ్మెల్యేల్లో పట్టు అయితే అశోక్ గహ్లోత్‌కు పార్టీ హైకమాండ్ వద్ద పరపతి, ఎమ్మెల్యేల్లో పట్టు ఉన్నందున రాజస్తాన్‌లో రాజకీయ పరిస్థితి పంజాబ్ కంటే భిన్నంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అదే సమయంలో పంజాబ్‌లో వచ్చే ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ అధికార మార్పు నిర్ణయం తీసుకుందని, అయితే రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నందున అధికార మార్పుపై ఎలాంటి నిర్ణయం త్వరలో ఉండకపోవచ్చని భావిస్తున్నారు. అంతేగాక పార్టీలో ఉన్న అసంతృప్తిని తగ్గించేందుకు పార్టీ హైకమాండ్ ఇతర మార్గాలను అన్వేషించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పంజాబ్ ఎపిసోడ్‌తోనైనా కాంగ్రెస్ హైకమాండ్ తాము అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో ఇప్పటికే ఎక్కువైన వర్గపోరుపై దృష్టిసారించాలని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి మధ్యప్రదేశ్‌లో వర్గపోరు కారణంగా కాంగ్రెస్ పార్టీ అధికార పీఠానికి దూరమైన ఎపిసోడ్‌ను గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు అదే పరిస్థితి ఛత్తీస్‌గఢ్‌లో కొనసాగుతోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, రాష్ట్ర ఆరోగ్య మంత్రి టిఎస్ సింగ్ దేవ్ మధ్య వైరం తారాస్థాయికి చేరుకుంది. రెండున్నరేళ్ల తర్వాత రాష్ట్ర పగ్గాలు తనకు అందిస్తానని రాహుల్ గాంధీ చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాలన్న సింగ్ దేవ్ సోమవారం ఢిల్లీకి రావడంతో రాజకీయ ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే తాను వ్యక్తిగత కారణాలతో ఢిల్లీ వచ్చానని, అన్ని సమస్యలు పరిష్కారం అయిపోయాయని సింగ్ దేవ్ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో మీడియాకు తెలిపారు. హస్తినలో మకాం తాజా పరిణామాల నేపథ్యంలో ఇరువర్గాలకు చెందిన కొందరు నాయకులు ఢిల్లీ చేరుకున్నారు. సచిన్ పైలట్ గత మూడు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి పార్టీ ప్రధాన కార్యదర్శులు ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, రాష్ట్ర ఇన్ఛార్జ్ అజయ్ మాకెన్‌లతో భేటీ అయ్యారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. పైలట్ వర్గ ఎమ్మెల్యేలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అపాయింట్మెంట్ కోరారు. అంతేగాక రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితిపై అజయ్ మాకెన్ ఇటీవల తన నివేదికను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సమర్పించారని ఏఐసీసీ కీలక నేత ఒకరు తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు రఘువీర్ మీనా, రెవెన్యూ మంత్రి హరీష్ చౌదరి, ఆరోగ్య శాఖ మంత్రి రఘుశర్మతో సహా పలువురు నాయకులు పార్టీ హైకమాండ్ ముందు సీఎం అశోక్ గహ్లోత్‌కు మద్దతుగా లాబీయింగ్ చేస్తున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. -
రాజస్తాన్‌పై కాంగ్రెస్ దృష్టి
జైపూర్: పంజాబ్‌లో రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించిన కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు తన దృష్టి రాజస్తాన్‌పైకి మళ్లించింది. రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్ల మధ్య ఇంకా ఘర్షణాత్మక వాతావరణమే కొనసాగుతోంది. కేబినెట్లో బెర్త్‌ల కోసం సచిన్ పైలెట్ వర్గీయులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నారు. దీనిపై కాలయాపన జరుగుతూ ఉండటంతో వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మూడు రోజుల క్రితమే సచిన్ పైలెట్ అధిష్టానం తమ డిమాండ్లను నెరవేరుస్తుందని సూచనప్రాయంగా వెల్లడించారు. ఆ తర్వాతే మంత్రివర్గంలోకి తీసుకునే సభ్యులపై కసరత్తు చేయడానికి పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్, రాజస్తాన్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ అజయ్ మాకెన్ జైపూర్‌కు చేరుకొని ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌తో మంతనాలు జరిపారు. ఈ నెల 28న కేబినెట్ విస్తరణ చేపట్టాలని అధిష్టానం భావిస్తున్నట్టుగా సమాచారం. మరోవైపు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోత్సారా ఆదివారం ఉదయం 25 మంది ఎమ్మెల్యేలతో సమావేశమై కేబినెట్ విస్తరణపై చర్చలు జరిపారు. ఈ సమావేశానికి హాజరైన సచిన్ పైలెట్ కేబినెట్లో తన వర్గీయులకి చోటు కల్పించాలని డిమాండ్ చేశారు. తొమ్మిది ఖాళీలు వేణుగోపాల్, అజయ్ మాకెన్ గత రెండు రోజులుగా వరుసగా పార్టీ నాయకుల్ని కలుసుకొని మాట్లాడుతున్నారు. ఆదివారం ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలతో కూడా సమావేశమయ్యారు. ‘‘కేబినెట్ విస్తరణపై చర్చలు జరిపాం. జిల్లా, బ్లాక్ స్థాయిలో పార్టీ చీఫ్‌ల నియామకం, వివిధ పాలకమండళ్లు, కార్పొరేషన్లలో నియామకాలకు సంబంధించిన కసరత్తు మొదలైంది. రాజస్తాన్ కాంగ్రెస్‌లో ఎలాంటి విభేదాలు లేవు. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని నేతలందరూ చెబుతున్నారు ’’ అని మాకెన్ తెలిపారు. రాజస్తాన్ కేబినెట్లో అత్యధికంగా 30 మంది మంత్రులు ఉండొచ్చు. ప్రస్తుతం సీఎం గహ్లోత్‌తో సహా కేబినెట్లో 21 మంది మంత్రులే ఉన్నారు. ఇంకా తొమ్మిది మందికి కేబినెట్లో చోటు కల్పించే అవకాశం ఉంది. గత ఏడాది 18 మంది ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి గహ్లాత్‌పై సచిన్ పైలెట్ తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. అనంతరం కాంగ్రెస్ అధిష్టానంతో సయోధ్య కుదిరి ఆయన వెనక్కుతగ్గారు. -
రాజస్తాన్ కాంగ్రెస్‌లో మళ్లీ అలజడి
న్యూఢిల్లీ: రాజస్తాన్‌లో అధికార కాంగ్రెస్ పార్టీలో మళ్లీ నిరసన గళాలు వినిపిస్తున్నాయి. అసమ్మతి నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ వర్గం అసంతృప్తితో రగిలిపోతోంది. తమకు గతంలో ఇచ్చిన హామీలు ఇంకా అమలు కాలేదని, ప్రభుత్వ పదవులు దక్కడం లేదని మండిపడుతోంది. అధికారంలో తమ వంతు వాటా కావాలని డిమాండ్ చేస్తోంది. పార్టీ అధిష్టానం ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే తమ దారి తాము చూసుకుంటున్నామన్న సంకేతాలను పైలట్ వర్గం ఇస్తోంది. పార్టీలో విభేదాలను పరిష్కరించడానికి ఏఐసీసీ ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల ప్యానెల్ కూడా ఈ వ్యవహారంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్ వర్గం మధ్య సయోధ్య కుదుర్చేందుకు గట్టిగా ప్రయత్నించడం లేదు. తాజా పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ రాజస్తాన్ వ్యవహారాల ఇన్చార్జి అజయ్ మాకెన్ స్పందించారు. కేబినెట్లో కొన్ని పదవులతోపాటు నామినేటెడ్, కార్పొరేషన్ పదవులు ఖాళీగా ఉన్నాయని, వాటిని త్వరలో భర్తీ చేస్తారని, ఎవరూ నిరాశపడొద్దని అసమ్మతి నేతలను కోరారు. సచిన్ పైలట్‌తో తాను తరచుగా మాట్లాడుతూనే ఉన్నానని, ఆయనలో ఎలాంటి అసంతృప్తి లేదని వివరించారు. మరోవైపు తమలో సహనం నశించిపోతోందని పైలట్ వర్గం చెబుతోంది. పైలట్ వర్గం నుంచి బయటకు రావాలని సీఎం గహ్లోత్ తమపై ఒత్తిడి పెంచుతున్నారని ఆరోపిస్తోంది. పార్టీ పరిధులను అతిక్రమించకుండా హక్కుల కోసం పోరాడుతామని తేల్చిచెబుతోంది. పైలట్ వెంట ఉన్న 19 మంది ఎమ్మెల్యేలు గత ఏడాది తిరుగుబాటు చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాదంలో పడింది. దీంతో ప్రభుత్వంలో ప్రాధాన్యం ఇస్తామంటూ అప్పట్లో కాంగ్రెస్ అధిష్టానం పైలట్ అనుచరులకు హామీ ఇచ్చింది. కొందరు ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ అయ్యాయని పైలట్ వర్గ ఎమ్మెల్యే వేద్‌ప్రకాశ్ సోలంకి ఆరోపించారు. దీనిపై రాజస్తాన్ బీజేపీ అధ్యక్షుడు సతీష్ పూనియా స్పందిస్తూ... గహ్లోత్ ప్రభుత్వం ఎమ్మెల్యేలను భయపెడుతోందన్నారు. త్వరలో కేబినెట్ విస్తరణ! సచిన్ పైలట్ వర్గం అసంతృప్తి పెరుగుతుండటంతో కాంగ్రెస్ సీనియర్ నేతలు రంగంలోకి దిగారు. రాజస్థాన్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి అజయ్ మాకెన్ వైరివర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. పైలట్ రెండురోజులగా ఢిల్లీలోనే మకాం వేశారు. కేబినెట్లో ఖాళీగా ఉన్న 9 స్థానాలను భర్తీ చేయనున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌లో విలీనమైన బీఎస్పీ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు కల్పించడం, మహిళలు, మైనారిటీల ప్రాతినిధ్యాన్ని పెంచడం.. సామాజికవర్గ సమీకరణాలు కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారాయి. -
అనివార్యతే వారిని ఏకం చేసిందా..?
సాక్షి, న్యూఢిల్లీ: అంతర్గత కలహాలకు అడ్డాగా మారిన రాజస్థాన్ రాజకీయాల్లో ఉప ఎన్నికలు కాస్త మార్పును తీసుకొచ్చే ప్రయత్నం చేశాయి. అయితే మార్పు అనేది కేవలం అధికార కాంగ్రెస్ పార్టీకి మాత్రమే పరిమితమైందని తాజా పరిణామాలు స్పష్టంచేస్తున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న మూడు స్థానాల ఉప ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులు మంగళవారం నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ సందర్భంగా గత కొంతకాలంగా తమ మధ్య ఉన్న మనస్పర్థలను సీఎం అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్లు పక్కనబెట్టి ఒకే వేదికపై కలిసి ఉన్నారనే సంఘీభావ సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. అయితే అజయ్ మాకెన్ అనేక ప్రయత్నాల తర్వాత అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్లను ఒకే వేదికపైకి తీసుకురావడంలో విజయవంతమయ్యారు. కానీ ఇరువర్గాల ఎమ్మెల్యేలు, మద్దతుదారులు ఒకరికొకరు దూరంగా ఉన్నారు. ఎన్నికల ప్రచార బాధ్యతను సచిన్ పైలట్ మద్దతుదారులకు అశోక్ గహ్లోత్ అప్పగించలేదు. కానీ ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతున్న మూడు స్థానాల్లోని రెండు స్థానాల్లో గుజ్జర్లు కీలకంగా ఉండడంతో పైలట్‌ను తమతో కలుపుకోవడం సీఎం గహ్లోత్‌తో పాటు పార్టీకి అనివార్యంగా మారింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థుల ప్రకటన అనంతరం కొత్త తలనొప్పి మొదలైంది. సహదా, రాజ్సమండ్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన తరువాత అంతర్గత కలహాలు బయటపడ్డాయి. ఈ కారణంగా కాంగ్రెస్ పార్టీ కాస్త నష్టపోవచ్చని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. మరోసారి బయటపడ్డ కమలదళ అంతర్గత కలహాలు విపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీలో నాయకుల మధ్య ఎలాంటి సయోధ్య కుదిరే పరిస్థితి కనిపించట్లేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థి తానే అని అనుయాయులతో ప్రకటింపచేసుకున్న వసుంధరా రాజేను రాష్ట్ర పార్టీలో పట్టించుకొనే నాథుడే కరువయ్యాడనిపిస్తోంది. ఎందుకంటే ఉప ఎన్నికల కోసం కేంద్ర నాయకత్వం విడుదల చేసిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో మాజీ సీఎం వసుంధర రాజేను ఐదవ స్థానానికి నెట్టేశారు. జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇంఛార్జ్ అరుణ్ సింగ్ మొదటి స్థానంలో ఉండగా, కో–ఇంఛార్జ్ భారతి బెన్ను రెండవ స్థానంలో ఉంచారు. రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ పునియా 3వ స్థానంలో, ప్రతిపక్ష నాయకుడు గులాబ్ చంద్ కటారియా నాలుగో స్థానంలో నిలిచారు. ముగ్గురు కేంద్రమంత్రులు గజేంద్రసింగ్ షెఖావత్, అర్జున్ రామ్ మేఘ్వాల్, కైలాష్ చౌదరిలతో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్‌ను స్టార్ క్యాంపెయినర్ల జాబితా చేర్చారు. మొత్తం 30 మంది నాయకుల జాబితాలో వసుంధర మద్దతుదారుల్లో కేవలం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అశోక్ పర్నామి పేరు చేర్చారు. కానీ వసుంధరా రాజేను తీవ్రంగా వ్యతిరేకించే ప్రత్యర్థులను పలువురిని క్యాంపెయినర్ల జాబితాలో చేర్చారు. వీరిలో పార్టీ జాతీయ కార్యదర్శి అల్కా గుర్జర్, రాజ్యసభ సభ్యుడు కిరోడి లాల్ మీనా, ఎమ్మెల్యే రాజేంద్ర రాథోడ్, మదన్ దిలావర్, జోగేశ్వర్ గార్గ్‌లు ఉన్నారు. ప్రచారానికి నో ఛాన్స్ మంగళవారం మూడు స్థానాలకు అభ్యర్థుల నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన తరువాత వసుంధరా రాజే ప్రత్యర్థుల ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి మాజీ ముఖ్యమంత్రి హాజరుకాలేదు. అయితే ఆ సమావేశంలో ఏర్పాటు చేసిన హోర్డింగ్‌ల్లో పార్టీకి సంబంధించిన 10 మంది నాయకుల ఫోటోలు ఉంచినప్పటికీ, వసుంధరా రాజే ఫోటోను చేర్చలేదు. రాష్ట్ర నాయకత్వమే కాకుండా పార్టీ కేంద్ర నాయకత్వం ఆమెపై శీతకన్ను వేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో మాజీ ముఖ్యమంత్రి హోదాలో పలువురు నాయకులను ప్రచారం కోసం పంపించినప్పటికీ రాజేను కావాలనే పక్కనపెట్టారన్న వాదనలు వినిపిస్తున్నాయి. రెండేళ్లుగా రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాల నుంచి దాదాపు దూరం పెడుతూ వస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో కీలక నేతగా ఉన్న వసుంధరా రాజే రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపించే ఏ ఒక్క నిర్ణయాన్ని, చర్యను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.సతీష్ పూనియా, ఆయన మద్దతుదారులు వదులుకోవట్లేదు. -
రాజస్తాన్ సంక్షోభం.. నిజాన్ని అంగీకరించిన సీఎం
జైపూర్: ఫోన్ ట్యాపింగ్ అంశం గతేడాది రాజస్తాన్‌లో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఎమ్మెల్యేల ఫోన్ ట్యాప్ చేస్తున్నారనే ఆరోణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇవి నిజమని నిరూపిస్తే.. తాను రాజీనామా చేస్తానని.. రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించారు సీఎం అశోక్ గహ్లోత్. ఈ క్రమంలో తాజాగా తాము ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు అంగీకరించిది గహ్లోత్ సర్కార్. ఈ విషయాన్ని రాజస్తాన్ అసెంబ్లీ వెబ్సైట్లో చేర్చింది. సీనియర్ బీజేపీ నాయకుడు, మాజీ ఆరోగ్యశాఖ మంత్రి కాళిచరణ్ షరఫ్ గతేడాది అడిగిన ప్రశ్నకు బదులుగా రాజస్తాన్ అసెంబ్లీ వెబ్సైట్లో ఈ విషయాన్ని పోస్ట్ చేసింది. ‘‘ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవమేనా..ఒకవేళ నిజమే అయితే ఏ చట్టం కింద, ఎవరి ఆదేశాల మేరకు ట్యాప్ చేశారు. ఈ వివరాలను అసెంబ్లీ టేబుల్ మీద పెట్టండి’’ అని బీజేపీ ఎమ్మెల్యే కాళిచరణ్ షరాఫ్ ప్రశ్నించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ.. ‘‘ప్రజా ప్రయోజనార్థం, ప్రజల భద్రత కోసం... శాంతి భద్రతలకు భంగం కలిగించగల నేరాలను అడ్డుకునేందుకు టెలీఫోన్లను నియంత్రించడం జరిగింది. భారత టెలీగ్రాఫ్ చట్టం-1885లోని సెక్షన్ 5(2), భారత టెలీగ్రాఫ్ సవరణ చట్టం 2007, ఐటీ చట్టం 2000లోని సెక్షన్ 69 కింద సంబంధిత అధికారి ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకోవడం జరిగింది’’ అని ప్రభుత్వం వెల్లడించింది. సంబంధిత అధికారి నుంచి అనుమతులు తీసుకున్న తర్వాత మాత్రమే పై చట్టాల కింద రాజస్తాన్ పోలీసులు టెలీఫోన్లను నియంత్రించారంటూ చెప్పుకొచ్చింది. అయితే ఏయే నంబర్లతో ఉన్న ఫోన్లను ఇంటర్సెప్ట్ చేశారు.. ఎప్పుడు వాటిపై నిఘా పెట్టారు అనే వివరాలను మాత్రం ప్రభుత్వం వెల్లడించ లేదు. ప్రభుత్వం సమాధానం సరిగా లేకపోవడంతో సీఎం గహ్లోత్‌ని ఉద్దేశించి రాజస్తాన్ బీజేపీ అధ్యక్షుడు సతీశ్ పూనియా ట్విటర్లో విరుచుకుపడ్డారు. తన సొంత పార్టీ నేతలపైనే గహ్లోత్ కుట్రపన్నారంటూ మండి పడ్డారు. గాంధీవాదం ముసుగు వేసుకుని ప్రజాస్వామం కోసం మొసలి కన్నీరు కార్చుతున్నారంటూ సతీశ్ ఎద్దేవా చేశారు. గహ్లోత్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు అంగీకిరంచడంతో ప్రస్తుతం అందరి దృష్టి సచిన్ పైలట్ మీదనే ఉంది. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు నిజమని తెలితే తాను సీఎం పదవికి రాజీనామా చేస్తానని గతంలో గహ్లోత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు సచిన్ పైలట్ ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తారా.. లేక మన్నించి వదిలేస్తారా అనే అంశంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. సచిన్ దీనిపై ఇంతవరకు స్పందించలేదు. కానీ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఒకరు మాట్లాడుతూ.. ‘‘ఫోన్ ట్యాపింగ్ అంశంలో కాంగ్రెస్ హై కమాండ్ ఎలా స్పందిస్తుందో చూశాకే మేము దీనిపై నిర్ణయం తీసుకుంటాము’’ అని తెలిపారు. చదవండి: రాజస్తాన్‌లో మళ్లీ రాజకీయ అలజడి! -
సీఎంకు షాకిచ్చేందుకు సిద్ధమౌతున్న పైలట్ వర్గం!
సాక్షి , న్యూఢిల్లీ: రాహుల్‌గాంధీ రాజస్తాన్ పర్యటన రాష్ట్ర రాజకీయాలను మరోసారి హీటెక్కించింది. సీఎం అశోక్ గహ్లోత్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ల మధ్య ఉన్న దూరం రాహుల్ గాంధీ రాజస్తాన్ పర్యటనతో మరింత పెరిగింది. దీంతో రాజస్తాన్ కాంగ్రెస్‌లో లుకలుకలు మరోసారి బయటపడ్డాయి. రెండు రోజుల పాటు రెండు జిల్లాల్లో జరిగిన నాలుగు సమావేశాలలో గహ్లోత్, సచిన్ పైలట్లు ఇద్దరూ కలిసి కనిపించినప్పటికీ, వారి మధ్య ఉన్న దూరం బహిరంగ వేదికపై బహిర్గతం అయ్యింది. ఈసారి రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటన మొత్తం గహ్లోత్ కనుసన్నల్లోనే జరిగింది. దీంతో సచిన్ పైలట్‌ను రాహుల్ గాంధీకి దూరంగా ఉంచేందుకు సీఎం వర్గం తన వంతు ప్రయత్నం చేశారు. రాహుల్ పర్యటనలో జరిగిన నాలుగు సమావేశాల్లో రెండింటిలో, పైలట్‌కు మాట్లాడేందుకు సైతం అవకాశం ఇవ్వలేదంటే పైలట్ విషయంలో గహ్లోత్ వర్గం ఎంత సీరియస్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు. నినాదాలు.. గందరగోళాలు.. మరోవైపు గతంలో సచిన్ పైలట్ ప్రాతినిధ్యం వహించిన రూపన్‌గఢ్ పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగిన సమావేశం పెద్ద ఎత్తున దుమారానికే తెరలేపింది. రాహుల్‌గాంధీ వేదికపైకి వచ్చిన వెంటనే రాహుల్ సహా మరో ముగ్గురు నేతలు మాత్రమే వేదికపై ఉండాలని ఏఐసీసీ ప్రధానకార్యదర్శి అజయ్ మాకెన్ ప్రకటించారు. దీంతో వేదికపై నుంచి సచిన్ పైలట్ సహా ఇతర నేతలందరినీ కిందికి దింపేయడంతో, ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున నినాదాలు చేసి, సభలో గందరగోళం సృష్టించారు. అయితే నినాదాలు చేస్తున్న వారిని శాంతింపచేసేందుకు అజయ్ మాకెన్, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రఘు శర్మ సహా ఇతరమంత్రులు మైదానంలో హడావిడిగా తిరిగినప్పటికీ, వారె వరూ ఏమాత్రం నినాదాలు ఆపలేదు. అంతేగాక రాహుల్‌గాంధీ మాట్లాడేటప్పుడు పీసీసీ అధ్యక్షుడు దోస్తారా పైలట్ మద్దతుదారులను శాంతించాలని కోరడం, ఆ తర్వాత తన ప్రసంగంలోనూ రాహుల్‌గాంధీ ప్రజలు నినాదాలు చేయడం ఆపాలని చేసిన విజ్ఞప్తిని ఏ ఒక్కరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. మరోవైపు సభ ముగిసిన తర్వాత రాహుల్‌గాంధీ, సీఎం అశోక్ గహ్లోత్‌లు ఇద్దరూ ఒకే వాహనంలో బయలుదేరే సమయంలోనూ ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో పోలీసులు పైలట్ మద్దతుదారులను రాహుల్‌గాంధీ కాన్వాయ్‌వైపు వెళ్ళకుండా ఆపేందుకు విశ్వప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. అయితే రూపన్‌గఢ్‌లో జరిగిన సభ తర్వాత రాహుల్‌గాంధీ నాగౌర్ జిల్లా సభకు వెళ్ళే కాన్వాయ్‌లో సచిన్ పైలట్ కారును చేర్చేందుకు అనుమతి లభించకపోవడంతో ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు. బలం చూపేందుకు.. రాజస్తాన్‌లో రాహుల్‌గాంధీ రెండు రోజుల పర్యటన పార్టీకి లాభం చేకూర్చడం సంగతి పక్కనబెడితే, పార్టీలోని ఇద్దరు నాయకుల మధ్య ఉన్న దూరం మరింత పెరగడానికి కారణమైంది. ఇద్దరి మద్దతుదారులు ఇప్పుడు క్షేత్రస్థాయిలో తమ బలాన్ని చూపించుకొనే ప్రయత్నాలు పెద్దఎత్తున చేస్తున్నారు. రాహుల్‌గాంధీ రెండు రోజుల పర్యటనలో తనను పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన సచిన్ పైలట్, ఇప్పుడు ఫిబ్రవరి 17 న జైపూర్ జిల్లాలోని కోట్ఖావదాలో జరగబోయే కిసాన్ మహాపంచాయత్‌లో బల నిరూపణ చేసుకొనేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో సచిన్ పైలట్‌కు రెండు మహా పంచాయత్‌లను నిర్వహించిన అనుభవం ఉంది. ఈ అంశంపై సీఎం గెహ్లాట్ వర్గం కారాలు మిరియాలు నూరుతున్నారు. మరోవైçపు వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకూడదని, సందర్భాన్ని బట్టి గహ్లోత్ వర్గాన్ని దెబ్బతీయాలని పైలట్ వర్గీయ ఎమ్మెల్యేలు ఉవ్విళూరుతున్నారు. చదవండి: సీఏఏను రద్దు చేస్తాం: రాహుల్ గాంధీ -
ఎమ్మెల్యే కన్నుమూత.. సీఎం దిగ్ర్భాంతి
ఉదయ్‌పూర్: రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ విషాదంలో మునిగింది. పార్టీకి చెందిన వల్లభ్‌నగర్ ఎమ్మెల్యే గజేంద్రసింగ్ శక్తవట్ (48) బుధవారం ఉదయం కన్నుమూశారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆయన మృతిచెందారు. ఉదయ్‌పూర్ జిల్లాలోని వల్లభ్‌నగర్ నియోజకవర్గం నుంచి గజేంద్రసింగ్ ఎమ్మెల్యేగా రెండోసారి ఎన్నికయ్యారు. అతడి మృతికి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్, పార్టీ సీనియర్ నాయకుడు సచిన్ పైలెట్, కాంగ్రెస్ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. పచ్చకామెర్లతో బాధపడుతున్న గజేంద్రసింగ్ ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. ఆ సమయంలో అతడికి కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ తేలింది. దీంతో నెల నుంచి చికిత్స పొందుతున్నాడు. అనారోగ్యంతో గజేంద్రసింగ్ మృతిచెందాడు. గజేంద్రసింగ్ వల్లభ్‌నగర్ నుంచి 2008, 2018లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. స్వాతంత్ర్య సమరయోధుడు గులాబ్ సింగ్ కుమారుడే గజేంద్రసింగ్. ఈయన మేవార్ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. గతేడాది కాంగ్రెస్ పార్టీలో చీలిక వచ్చినప్పుడు అప్పటి ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్ వెంట ఉన్నారు. అతడి మృతికి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ సంతాపం వ్యక్తం చేశారు. అతడి మరణం దిగ్ర్భాంతికి గురి చేసిందని చెప్పారు. సచిన్ పైలెట్ కూడా గజేంద్రసింగ్ మృతికి సంతాపం తెలిపారు. -
రాజస్తాన్‌లో మళ్లీ రాజకీయ అలజడి!
జైపూర్: భారతీయ ట్రైబల్ పార్టీ(బీటీపీ)కి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు రాజస్తాన్‌లోని గహ్లోత్ ప్రభుత్వానికి తమ మద్దుతు ఉపసంహరించుకున్నారు. పంచాయితీ ఎన్నికల్లో బీజేపీ గెలవడంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీటీపీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మరోసారి రాజస్తాన్ కాంగ్రెస్ వర్గాల్లో ఆందోళన మొదలైంది. ఈ ఏడాది ఆరంభంలో డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ తన అనుచర వర్గంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. దీంతో అశోక్ గహ్లోత్ ప్రభుత్వానికి మద్దుతు తెలుపడానికి ఇద్దరు ఎమ్మెల్యేలు 10కోట్లు తీసుకున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే మహేంద్రజిత్ సింగ్ ఆరోపించారు. బీటీపీ ఎమ్మెల్యేలు ముడుపులు తీసుకున్నారని మహేంద్రజిత్ సింగ్ ఆరోపిస్తున్న వీడియోని బీజేపీ చీఫ్ సతీష్ పూనియ నవంబర్ చివర్లో ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలు కాంగ్రెస్ శ్రేణుల్లో కలకలం రేపుతున్నాయి. బీజేపీతో కుమ్మక్కైన కాంగ్రెస్! కాగా పంచాయితీ ఎన్నికల సందర్భంగా, తమ పార్టీ మద్దతు ఇస్తున్న స్వతంత్ర అభ్యర్థిని ఓడించడానికి కాంగ్రెస్ బీజేపీతో చేతులు కలిపిందని బీటీపీ ఆరోపించింది. 27 స్థానాలు గల దుర్గాపుర్ జిల్లాలో కేవలం 8 స్థానాలు గల బీజేపీ, జిల్లా ప్రముఖ్ స్థానాన్ని ఎలా గెలుచుకుంటుందని, ఇది కాంగ్రెస్ , బీజేపీ చీకటి ఒప్పందంని విమర్శించింది. ఇది నమ్మక ద్రోహమని భవిష్యతులో కాంగ్రెస్‌తో అసలు జత కట్టమని బీటీపీ తెలిపింది. కాంగ్రెస్ కంటే బీజేపీకే ఎక్కువ రాజస్తాన్‌లోని 222 పంచాయతి సమితిలోని 4371 సీట్లలో ఎన్నికలు జరగగా అధికార కాంగ్రెస్ పార్టీ 1852 గెలుచుకోగా, బీజేపీ 1989 సీట్లలో గెలుపొందింది. స్వతంత్ర అభ్యర్థులు 439 సీట్లలో గెలుపొందారు. ఎన్డీఏ లో మిత్రపకక్షాం ఆర్ఏల్పీ 60 సీట్లు గెలుచుకుంది. సీపీఐ-ఎం 26 స్థానాలలో విజయాని కైవసం చేసుకుంది. 21 జిల్లా పరిషత్‌లో జరిగిన ఎన్నికల్లో 14 స్థానాలలో బీజేపీ తన అధ్యికతను ప్రదర్శించింది. బీజేపీ 353, కాంగ్రెస్ 252, ఆర్ఎల్పీ 10, సీపీఐ-ఎం 2, స్వతంత్రులు 18 స్థానాలలో గెలిచారు. గత నెలలో జరిగిన ఆరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ 4 స్థానాలు కైవసం చేసుకుంది. అనుహ్యంగా పంచాయితీ ఎన్నికల్లో ప్రజలలో వ్యతిరేకత పెరిగింది. దీంతో పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం చవిచూసింది. మరోసారి రాజకీయ అలజడి! పంచాయితీ ఫలితాలతో రాజస్తాన్‌లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ దిశగా కాంగ్రెస్ ఆలోచిస్తుంది. సంవత్సరం ప్రారంభంలో 19 మంది ఎమ్మెల్యేలు సచిన్ పైలట్‌తో బయటకు వచ్చారు. దీంతో అవిశ్వాస తీర్మాణం అనివార్యమైంది. 200 మంది సభ్యులు గల అసెంబ్లీలో 105 సొంత బలంతో పాటు ..16 మంది ఇతర ఎమ్మెల్యేలు మద్దతు పలకడంతో గహ్లోత్ విశ్వాస తీర్మాణంలో నెగ్గారు. ఇందులో 2018 అసెంబ్లీ ఎన్నికల తరువాత ఆరుగురు బీఎస్పీ సభ్యులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరు కాక 13 మంది స్వతంత్రులు , ఒక ఆర్ ఎల్ డీ సభ్యుడు గహ్లోత్ ప్రభుత్వానికి తమ మద్దతు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు పలికిన 121 మంది సభ్యులలో 21 మంది మంత్రులుగా ఉన్నారు. గరిష్టంగా 30 మంది మంత్రులుగా ఉండవచ్చు. దీంతో మిగిలిన 100 మంది సభ్యులలో 9 మందికి మాత్రమే మంత్రి అయ్యే అవకాశం ఉంది. గహ్లోత్ 9 మంది సభ్యులకు మంత్రి పదవులు, 10 మందికి పార్లమెంట్ కార్యదర్శులుగా, 40 మందిని వివిధ బోర్డులకు కమిషనర్లుగా, 20 మందిని శాసనసభ కమిటీ అధ్యక్షులుగా, 12 మందికి పైగా సభ్యులను స్థానిక సంస్థల అధిపతులుగా నియమిస్తే బాగుంటుందని పార్టీ పెద్దలతో చేర్చించున్నట్టు, సొంత పార్టీ సభ్యులు మాట్లాడుకుంటున్నారు. సంవత్సరం ఆరంభంలో రాజస్తాన్‌లో ఏర్పడిన రాజకీయ అస్థిరతను పరిష్కరించడానికి సోనియా గాందీ ప్యానెల్ ఏర్పరరిచిన విషయం తెలిసిందే ఇందులో అహ్మద్ పటేల్ సభ్యుడు. పటేల్ తన రాజకీయ అనుభవంతో సచిన్ పైలట్‌ని అసంతృప్తి జ్వాలలను చల్లార్చారు. కానీ ఇప్పుడు ఆయన లేరు. ఇటువంటి పరిస్థితులలో బీటీపీ నుంచి ఇద్దరు శాసనసభ్యులు బయటకు రావడం, అలాగే పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి చవిచూడటం వంటి పరిణామాలు అన్ని బీజేపీకి కలిసొచ్చే అంశాలు. బీటీపీ శాసనసభ్యులను భారతీయ జనతా పార్టీలో ఆకర్షించే ప్రయత్నాలు మొదలవుతాయి. ఇవన్నీ కాంగ్రెస్‌కి ప్రతికూలంగా పరిణమించనున్నాయి. -
విశ్వాస పరీక్షలో గహ్లోత్ గెలుపు
జైపూర్: లాంఛనం ముగిసింది. రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో విశ్వాస పరీక్షను విజయవంతంగా ఎదుర్కొంది. సచిన్ పైలట్ నేతృత్వంలోని తిరుగుబాటు ఎమ్మెల్యేలు తిరిగి పార్టీ గూటికి చేరడంతో బల నిరూపణ సునాయాసమైంది. దాంతో, ఎట్టకేలకు దాదాపు నెల రోజులుగా సాగుతున్న రాజస్తాన్ డ్రామా సుఖాంతమైంది. శాసనసభ వ్యవహారాల మంత్రి శాంతి ధరివాల్ విశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. చర్చ అనంతరం, సభ ఆ తీర్మానాన్ని మూజువాణి ఓటుతో ఆమోదించింది. చర్చకు ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ సమాధానమిస్తూ విపక్ష బీజేపీపై విరుచుకుపడ్డారు. ‘మీరెన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ నా ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటాను’ అని స్పష్టం చేశారు. ఈ సంక్షోభానికి అద్భుతమైన రీతిలో ముగింపు లభించిందని, బీజేపీ ఓడిపోయిందని పేర్కొన్నారు. ‘అరుణాచల్‌ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, గోవాల్లో ఏం జరిగింది? ప్రజా ప్రభుత్వాలను కూల్చేశారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది’ అని వ్యాఖ్యానించారు. తన ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలో స్వయంగా ఒక కేంద్రమంత్రి పాల్గొన్నారని గహ్లోత్ ఆరోపించారు. సచిన్ పైలట్ తిరుగుబాటు నేపథ్యంలో.. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, తిరుగుబాటు ఎమ్మెల్యే భన్వర్‌లాల్ శర్మ, మధ్యవర్తి సంజయ్ జైన్ల గొంతులతో సంభాషణలున్న ఆడియో టేప్‌లను కాంగ్రెస్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ‘మెజారిటీ ఉంటే ముందే విశ్వాస పరీక్ష ఎదుర్కోవాలి. నెల రోజుల పాటు ఎమ్మెల్యేలను హోటల్లో నిర్బంధించాల్సిన అవసరం ఏంటి?’ అని అసెంబ్లీలో విపక్ష నేత గులాబ్ చంద్ కటారియా గహ్లోత్‌ను ప్రశ్నించారు. పైలట్‌పై స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ పెట్టిన దేశద్రోహం కేసు విషయాన్ని కూడా కటారియా ప్రస్తావించారు. ప్రభుత్వం విశ్వాస తీర్మానాన్ని గెలిచిన అనంతరం సభను వచ్చే శుక్రవారానికి వాయిదా వేశారు. 200 మంది సభ్యుల అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 107. మిత్రపక్షాలు బీటీపీ(2), సీపీఎం(2), ఆరెల్డీ(1), స్వతంత్రులు(13)తో కలిసి కాంగ్రెస్‌కు మద్దతిచ్చే వారి సంఖ్య 125 వరకు ఉంటుంది. బీజేపీ సభ్యుల సంఖ్య 72. మిత్రపక్షం(ఆర్ఎల్పీ 3)తో కలుపుకుని బీజేపీకి 75 మంది సభ్యుల మద్దతుంది. ఇప్పుడు బోర్డర్లో ఉన్నా: పైలట్ చర్చలో సచిన్ పైలట్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో తన స్థానం ఇప్పుడు బోర్డర్లో ఉందని వ్యాఖ్యానించారు. పార్టీలో తాను శక్తిమంతమైన యోధుడినని పేర్కొన్నారు. గతంలో సీఎం గహ్లోత్ పక్కన కూర్చొనే పైలట్ స్థానం తాజా సమావేశాల సందర్భంగా మారింది. దీన్ని పైలట్ ప్రస్తావిస్తూ.. ఇప్పుడు తాను తన పార్టీ, విపక్షం మధ్య సరిహద్దులో యోధుడిలా ఉన్నానని పేర్కొన్నారు. ‘సరిహద్దులకు ఎవరిని పంపిస్తారు? అత్యంత బలమైనవాడినే పంపిస్తారు’ అని వ్యాఖ్యానించారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా పార్టీ ప్రయోజనాలను కాపాడుతానన్నారు. ‘నా సీట్ మారేముందు నేను సేఫ్. ప్రభుత్వంలో భాగంగా ఉండేవాడిని. ఇప్పుడు నా స్థానం స్పీకర్, చీఫ్ విప్ ఎందుకు మార్చారా అని రెండు నిమిషాలు ఆలోచించాను. ఇది విపక్షంతో పోరాటంలో కీలకమైన బోర్డర్ స్థానం అని అర్థం చేసుకున్నా. నాకు ఒకవైపు అధికార పక్షం. మరోవైపు ప్రతిపక్షం. సరిహద్దులకు ఎవరిని పంపిస్తారు? శక్తిమంతుడైన యోధుడినే కదా!’ అన్నారు. ‘మా సమస్యలను డాక్టర్‌కు వివరించాం. చికిత్స తరువాత ఇప్పుడు మొత్తం 125 మంది సభ్యులం ఇక్కడ సభలో ఉన్నాం’ అని వ్యాఖ్యానించారు. తిరుగుబాటు అనంతరం, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పైలట్ సమావేశమై రాష్ట్ర నాయకత్వంపై తన ఫిర్యాదులను వివరించిన విషయం తెలిసిందే. ఆ తరువాత సయోధ్య కుదిరి తిరిగి ఆయన పార్టీ గూటికి వచ్చారు. అదే విషయాన్ని ఆయన డాక్టర్‌ను కన్సల్ట్ అయినట్లుగా నర్మగర్భంగా వెల్లడించారు. -
రాజస్తాన్ అసెంబ్లీలో పైలట్ కీలక వ్యాఖ్యలు
జైపూర్ : రాజీ ఫార్ములా ఫలించిన అనంతరం రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌తో భేటీ అయిన మరుసటి రోజు సచిన్ పైలట్ శుక్రవారం అసెంబ్లీలో తనకు కేటాయించిన సీటుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజస్తాన్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ముఖ్యమంత్రి గహ్లోత్‌కు దూరంగా విపక్షాలకు దగ్గరగా పైలట్‌కు సీటు కేటాయించడం చర్చనీయాంశమైంది. అయితే తనకు ప్రతిపక్షాలకు సమీపంలో సీటు కేటాయించడంపై పైలట్ తనదైన శైలిలో స్పందించారు. తనకు బోర్డర్లో సీటు కేటాయించడం, విపక్షాల పక్కనే తాను కూర్చుండటం అందరిలో ఆసక్తి రేపుతోందని అన్నారు. సరిహద్దుల్లో అత్యంత శక్తివంతమైన సైనికుడినే మోహరిస్తారు కాబట్టే తనకు అక్కడ సీటు కేటాయించారని పైలట్ వ్యాఖ్యానించారు. కాగా రాజస్తాన్ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో గహ్లోత్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని విపక్ష బీజేపీ ప్రకటించగా, పైలట్ రాకతో బలోపేతమవడంతో తామే విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని గహ్లాత్ శిబిరం యోచిస్తోంది. కాగా, 200 మంది సభ్యులు కలిగిన రాజస్తాన్ అసెంబ్లీలో మెజారిటీకి 101 మంది సభ్యులు అవసరం కాగా, కాంగ్రెస్ పార్టీకి 107 మంది ఎమ్మెల్యేలున్నారు. ఇండిపెండెంట్లు, చిన్నపార్టీల ఎమ్మెల్యేలు కలుపుకుని ఆ పార్టీకి 125 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఇక విపక్ష బీజేపీకి 72 మంది ఎమ్మెల్యేలున్నారు. చదవండి : ‘కత్తులు దూసి.. కరచాలనంతో కలిసి’ -
గహ్లోత్, పైలట్ షేక్‌హ్యాండ్!
జైపూర్: రాజస్తాన్ కాంగ్రెస్‌లో గత నెల రోజులుగా నెలకొన్న సంక్షోభం సమసి పోయింది. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, తిరుగుబాటు నేత సచిన్ పైలట్ కలసిపోయారు. గహ్లోత్ అధికారిక నివాసంలో గురువారం పార్టీ సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, అవినాశ్ పాండే, రణ్‌దీప్ సూర్జెవాలా, అజయ్ మాకెన్‌ల సమక్షంలో ఇరువురు నేతలు కరచాలనం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశానికి ముందు ఈ భేటీ జరిగింది. పైలట్‌తో పాటు వెళ్లిన ఇద్దరు ఎమ్మెల్యేలు భన్వర్‌లాల్ శర్మ, విశ్వేంద్ర సింగ్‌లపై విధించిన సస్పెన్షన్‌ను కూడా పార్టీ ఎత్తి వేసింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేశారని ఆరోపిస్తూ ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా, వారి సస్పెన్షన్‌ను ఎత్తివేసినట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అవినాశ్ పాండే గురువారం ట్వీట్ చేశారు. సీఎం గహ్లోత్‌పై తిరుగుబాటు చేసి.. పార్టీ విప్‌ను ఉల్లంఘిస్తూ జూలై 14న జరిగిన సీఎల్పీ భేటీకి హాజరుకాకపోవడంతో నాడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న పైలట్‌ను, పర్యాటక మంత్రిగా ఉన్న విశ్వేంద్ర సింగ్‌ను పదవుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. పైలట్‌ను పీసీసీ చీఫ్ పదవి నుంచి సైతం తొలగించారు. తనతో పాటు తిరుగుబాటు చేసిన 18 మంది ఎమ్మెల్యేలను పైలట్ గురుగ్రామ్‌లోని ఒక హోటల్లో ఉంచారు. అనంతరం, ఇటీవల అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలతో భేటీ అయిన అనంతరం మళ్లీ పార్టీ గూటికి పైలట్ తిరిగొచ్చారు. పైలట్ వర్గం ఎమ్మెల్యేలు కూడా జైపూర్ తిరిగి వచ్చారు. గహ్లోత్ వర్గం ఎమ్మెల్యేలు జైసల్మేర్ నుంచి జైపూర్ వచ్చి, ఇక్కడి ఫెయిర్మాంట్ హోటల్లో ఉన్నారు. ఆగస్ట్ 14న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేవరకు వారు అక్కడే ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. అపార్థాలను క్షమించాలి.. మరచిపోవాలి కాంగ్రెస్ పార్టీలో అపార్థాలు చోటు చేసుకుంటూనే ఉంటాయని, వాటిని క్షమించి మరచిపోయి, ముందుకు సాగుతూ ఉండాలని ముఖ్యమంత్రి గహ్లోత్ వ్యాఖ్యానించారు. ‘నెల రోజులుగా కొన్ని అపార్థాలు చోటు చేసుకున్నాయి. దేశం, రాష్ట్రం, ప్రజాస్వామ్యం ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వాటిని క్షమించి, మరచిపోయి, ముందుకు సాగాలి’ అని గహ్లోత్ ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే ప్రమాదకర ఆట దేశంలో సాగుతోందని బీజేపీపై విమర్శలు చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా సోనియాగాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పనిచేస్తోందన్నారు. ‘దేశవ్యాప్తంగా ఎన్నికైన ప్రజా ప్రభుత్వాలను ఒకటొకటిగా కూల్చే కుట్ర జరుగుతోంది. కర్ణాటక, మధ్యప్రదేశ్, అరుణాచల్‌లలో అదే జరిగింది. ఈడీ, సీబీఐ, ఐటీ, న్యాయవ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారు’ అని వరుస ట్వీట్లు చేశారు. విశ్వాస పరీక్ష నేటి నుంచి ప్రారంభమవుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది. గెహ్లోత్ అధ్యక్షతన గురువారం జరిగిన సీఎల్పీ భేటీ అనంతరం ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రకటించింది. అయితే, అందుకు కొన్ని గంటల ముందే, అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడ్తామని విపక్ష బీజేపీ ప్రకటించింది. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నామని బీజేపీ శాసనసభాపక్ష భేటీ అనంతరం అసెంబ్లీలో విపక్ష నేత గులాబ్ చంద్ కటారియా ప్రకటించారు. ‘కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా ఉంది. ఇవన్నీ అసెంబ్లీలో లేవనెత్తుతాం’ అన్నారు. అసెంబ్లీలో శుక్రవారమే అవిశ్వాస తీర్మానం పెడతామని రాజస్తాన్ బీజేపీ చీఫ్ సతిశ్ పూనియా తెలిపారు. ‘గహ్లోత్ సర్కారు కోమాలో ఉంది. ప్రభుత్వం స్థిరంగా లేదు. రాష్ట్రంలో అభివృద్ధి పనులన్నీ ఆగిపోయాయి. అందుకే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించాం’ అని బీజేపీ ఎమ్మెల్యే మదన్ దిలావర్ పేర్కొన్నారు. -
‘కత్తులు దూసి.. కరచాలనంతో కలిసి’
జైపూర్ : కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వంతో సంప్రదింపుల అనంతరం తిరిగి పార్టీ గూటికి చేరిన తిరుగుబాటు నేత సచిన్ పైలట్ రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌ను గురువారం ఆయన నివాసంలో కలిశారు. పైలట్ తిరుగుబాటుతో రాజస్తాన్‌లో నెల రోజులు పైగా రాజకీయ సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. రాజస్తాన్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అశోక్ గహ్లోత్ నివాసంలో ఏర్పాటైన కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశానికి సచిన్ పైలట్ హాజరయ్యారు. పైలట్‌ను సాదరంగా ఆహ్వానించిన గహ్లోత్ చిరునవ్వులు చిందిస్తూ యువనేతతో కరచాలనం చేశారు. ఈ భేటీలో ఇరువురు నేతలు పక్కపక్కనే కూర్చున్నారు. శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో గహ్లోత్ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని బీజేపీ వెల్లడించిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, పైలట్ సహా ఆయనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలందరూ సీఎల్పీ సమావేశానికి హాజరయ్యారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక వాధ్రాలతో సంప్రదింపుల అనంతరం పైలట్ సొంతగూటికి తిరిగివచ్చేందుకు అంగీకరించిన సంగతి తెలసిందే. పైలట్ పార్టీ ముందుంచిన ప్రధాన డిమాండ్లనూ నెరవేర్చుతామని హైకమాండ్ ఆయనకు హామీ ఇచ్చింది. రెబెల్ నేతలు తిరిగి పార్టీలోకి రావడంతో వారిని మన్నించి ముందుకు సాగుదామని ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కోరారు. మరోవైపు రాజస్తాన్‌లో పార్టీ వ్యవహారాలను చక్కదిద్దేందుకు సీనియర్ నేత కేసీ వేణుగోపాల్‌ను కాంగ్రెస్ అధిష్టానం రాజస్తాన్‌కు పంపింది. 200 మంది సభ్యులు కలిగిన రాజస్తాన్ అసెంబ్లీలో మెజారిటీకి 101 మంది సభ్యులు అవసరం కాగా, కాంగ్రెస్ పార్టీకి 107 మంది ఎమ్మెల్యేలున్నారు. ఇండిపెండెంట్లు, చిన్నపార్టీల ఎమ్మెల్యేలు కలుపుకుని ఆ పార్టీకి 125 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఇక విపక్ష బీజేపీకి 72 మంది ఎమ్మెల్యేలున్నారు. చదవండి : రాజస్తాన్: కుటుంబ పెద్దపై అలకబూనాం అంతే! #WATCH Jaipur: Congress leader Sachin Pilot meets CM Ashok Gehlot at his residence. Congress Legislature Party meeting to take place here, ahead of the special session of the #Rajasthan Assembly tomorrow. pic.twitter.com/0pIZ1vr2dM — ANI (@ANI) August 13, 2020 -
కెమెరాకు అడ్డంగా దొరికిపోయారు..
జైపూర్: న్యాయస్థానాల్లో ఎంతో మర్యాదగా మెలగాలి. ఎంత పెద్ద నాయకుడైనా, సెలబ్రిటీ అయినా సరే కోర్టు వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు. అసలు కోర్టు హాల్లో సెల్‌ఫోన్ కూడా మోగకూడదు. అంత క్రమశిక్షణగా ఉండాలి. ఇక లాయర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్రస్తుతం ఓ సీనియర్ న్యాయవాది ప్రవర్తన పట్ల దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. కారణం ఏంటంటే ఓ కేసు విచారణ జరుగుతుండగా.. సదరు లాయర్ తాపీగా హుక్కా పీల్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరలవ్వడంతో అతడి మీద ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఆ వివరాలు.. రాజస్తాన్ రాజకీయాలకు సంబంధించిన ఓ ముఖ్యమైన కేసును ఆ రాష్ట్ర హైకోర్టు గురువారం ఆన్లైన్లో విచారణ జరిపింది. ఈ సమయంలో సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ హుక్కా(సిగరెట్ లాంటి) సేవించారు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రాజస్తాన్‌లో బీఎస్పీ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్న విషయం తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ కోర్టులో కేసు దాఖలైంది. ఈ రోజు కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపింది. ఈ సమయంలో సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ హుక్కా పీలుస్తూ కనిపించారు. కాగితాలు అడ్డం పెట్టుకుని మరి ఈ పని హుక్కా పీల్చారు. విచారణలో కాంగ్రెస్ పార్టీ తరఫున కపిల్ సిబాల్ వాదించారు. కాగా అశోక్ గహ్లోత్ సారథ్యంలోని రాజస్తాన్ సర్కార్‌పై యువనేత సచిన్ పైలట్ తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. అయితే హైకమాండ్‌తో చర్చల అనంతరం ఆయన తిరిగి సొంతగూటికి చేరారు. చదవండి: పైలట్ తొందరపడ్డారా!? There is no smoke without fire: #Rajasthan High Court hearing on disqualification of the 6 BSP MLAs who later merged with #Congress. That's Sr Adv Rajeev Dhavan, using a hookah. He is also the lawyer for adv Prashant Bhushan in the latter's contempt case. pic.twitter.com/iF0FmeUuaV — Utkarsh Anand (@utkarsh_aanand) August 12, 2020 -
గహ్లోత్ సర్కార్‌పై బీజేపీ అవిశ్వాస తీర్మానం
జైపూర్ : తిరుగుబాటు నేత సచిన్ పైలట్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరడంతో రాజస్తాన్‌లో రాజకీయ సంక్షోభం సమసిపోగా అశోక్ గహ్లోత్ సర్కార్‌కు కాషాయ పార్టీ నుంచి సమస్యలు ఎదురవనున్నాయి. గహ్లోత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదని బీజేపీ నేత, రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే అన్నారు. గహ్లోత్ సర్కార్‌పై రాజస్తాన్ అసెంబ్లీలో బీజేపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనుంది. శుక్రవారం ఉదయం శాసనసభాపక్ష సమావేశం నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. జైపూర్‌లో గురువారం పార్టీ సీనియర్ నేత మురళీధర్‌రావు, వసుంధర రాజేలు గురువారం పార్టీ ఎమ్మెల్యేలతో ముచ్చటించారు. కాంగ్రెస్ సర్కార్‌కు ముగింపు పలుకుతామని, రాజస్తాన్ అసెంబ్లీలో శుక్రవారం ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని విపక్ష నేత గులాబ్ చంద్ కటారియా స్పష్టం చేశారు. ఇక రెబెల్ ఎమ్మెల్యేలు తిరిగి పార్టీలోకి రావడంతో వారిని మన్నించి కలుపుకుపోదామని రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మరోసారి కోరారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో తాము ముందుకు సాగుతామని ఆయన స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక వాధ్రాలు తిరుగుబాటు నేత సచిన్ పైలట్‌తో జరిగిన సంప్రదింపులు ఫలించడంతో రాజస్తాన్‌లో రాజకీయ సంక్షోభం ముగిసిన సంగతి తెలిసిందే. గహ్లోత్ సర్కార్‌పై తిరుగుబాటు జెండా ఎగురవేసిన పైలట్ వర్గానికి చెందిన 19 మంది ఎమ్మెల్యేలు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. చదవండి : ‘లక్ష్మణ రేఖను దాటలేదు’ -
సచిన్ పైలట్‌కు భంగపాటు
నెలరోజులపాటు కొన ప్రాణంతో కొట్టుమిట్టాడిన రాజస్తాన్ ప్రభుత్వం మళ్లీ నిటారుగా నిలబడింది. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌పై తిరుగుబాటు జెండా ఎగరేసి ఉపముఖ్యమంత్రి పదవిని, పీసీసీ అధ్యక్ష పదవిని వదులుకోవడంతోపాటు మరికొందరు ఎమ్మెల్యేలను తోడు తీసుకుని హరియాణాలో శిబిరం నడిపిన సచిన్ పైలట్ బుద్ధిమంతుడిలా స్వగృహానికి తిరిగొచ్చారు. ‘నేను కాంగ్రెస్‌ను విడిచి పోలేదు. తిరుగుబాటూ చేయలేదు. పార్టీ అధినాయకత్వానికి సమస్యల గురించి చెప్పినా పరిష్కారం కాలేదు సరికదా, రాజద్రోహం కేసు పెట్టడానికి కూడా సిద్ధపడ్డారు. కనుకనే ఇలా చేయాల్సివచ్చింది’ అంటున్నారు పైలట్. మొత్తానికి అంతా అయిన తర్వాత ‘గజం మిధ్య... పలాయనం మిధ్య’ అంటూ ఆయన తేల్చేశారు. పైలట్ లేవనెత్తిన సమస్యలపై ముగ్గురు సభ్యుల కమిటీ వేస్తామని కాంగ్రెస్ అనడం కంటితుడుపు చర్య. రాజస్తాన్ ప్రహసనం అందరికీ అన్నీ నేర్పింది. కానీ పైలట్ పరువు తీసింది. ఆయన ఇన్నేళ్లుగా నిర్మించుకుంటూ వచ్చిన రాజకీయ జీవితంపై మరక మిగిల్చింది. కేంద్రమంత్రి, బీజేపీ నేత గజేంద్ర సింగ్ షెఖావత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బేరసారాలు జరిపారని చెబుతూ అందుకు సంబంధించి గత నెలలో కాంగ్రెస్ రెండు ఆడియో టేపులు విడుదల చేసింది. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు కావడం, పైలట్ శిబిరంలో వున్న సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భన్వర్ లాల్ శర్మను ప్రశ్నించడానికి రాజస్తాన్ పోలీసులు హరియాణాలోని గుర్గావ్కు తరలిరావడం, అక్కడ రెండు రాష్ట్రాల పోలీసుల మధ్యా కాసేపు వివాదం సాగడం అందరూ చూశారు. ఇప్పుడు ఆ భన్వర్‌లాల్ శర్మ హఠాత్తుగా పైలట్ శిబిరం నుంచి పలాయనం చిత్తగించడం వల్లే పైలట్‌కు లొంగి పోవడం మినహా మరో మార్గం లేకపోయిందంటున్నారు. గెలుపు, ఓటములకు నిర్దిష్టమైన ఫార్ములాలంటూ ఏమీ లేనట్టే ప్రభుత్వాలను కూల్చే ఫార్ము లాలు కూడా రెడీగా వుండవు. రాజస్తాన్‌లో బీజేపీకి అది ఆలస్యంగా అర్ధమైంది. కరోనా విరుచుకు పడటం మొదలైన తొలినాళ్లలో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం సులభంగానే పతనమైంది. ఆ ఉత్సాహంతోనే రాజస్తాన్ డ్రామా కూడా మొదలుపెట్టినా అది ప్రతిష్టంభనలో పడింది. సంక్షోభం పుట్టుకొచ్చిన కొద్దిరోజుల్లోనే దాన్ని ఎటువైపు నడిపించాలో, ఎలాంటి ఎత్తుగడలేయాలో తెలియని అయోమయంలో పడిపోయారు తెరవెనక నేతలు. మధ్యప్రదేశ్‌లో విజయం సాధించిన వ్యూహం రాజస్తాన్‌లో కుప్పకూలడానికి చాలా కారణాలే వున్నాయి. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్, బీజేపీల మధ్య సంఖ్యాపరంగా పెద్ద వ్యత్యాసం లేదు. పైగా అక్కడ శివరాజ్ సింగ్ చౌహాన్‌తో దీటురాగల నేతలు బీజేపీలో లేరు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ నుంచి నిష్క్రమించిన జ్యోతిరాదిత్య సింధియా నుంచి చౌహాన్‌కు తక్షణం వచ్చే ముప్పేమీ లేదు. జ్యోతిరాదిత్యకు వెనువెంటనే సీఎం కావాలన్న కోరికా లేదు. కాంగ్రెస్‌లో కమల్‌నాథ్, దిగ్విజయ్ సింగ్, జ్యోతిరాదిత్యల వర్గాలున్నాయి. అక్కడ మార్చిలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనానికి కారణమైన రాజకీయ సంక్షోభం కన్నా ముందు చిన్న సైజు తిరుగు బాటు రేగింది. 8 మంది ఎమ్మెల్యేలు పైలట్ తరహాలోనే హరియాణాలోని గుర్గావ్కు వలస పోయారు. కానీ దిగ్విజయ్ వారితో చర్చించి ఒప్పించి వెనక్కి రప్పించారు. రెండోసారి 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కర్ణాటక వెళ్లిపోవడం, అక్కడినుంచే పార్టీకి చెల్లుచీటి ఇవ్వడంతో కమల్‌నా«ద్‌కు మరో ప్రత్యామ్నాయం లేకపోయింది. రాజస్తాన్ తీరు వేరు. అక్కడ టికెట్ల పంపిణీ సమయంలోనే అశోక్ గహ్లోత్ ముందు చూపుతో తన వర్గానికి అధికంగా టిక్కెట్లు ఇప్పించుకున్నారు. వారిలో ఎక్కువమందిని గెలిపించుకున్నారు. ఆయన వ్యూహం ముందు పైలట్ నిలబడలేకపోయారు. కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీని నమ్ము కోవడం వల్ల ఉప ముఖ్యమంత్రి పదవి, పీసీసీ అధినేత పదవి దక్కాయి. అంతకు మించి ఆశించడం వల్ల పైలట్ భంగపడ్డారు. 200 మంది సభ్యులుండే అసెంబ్లీలో కాంగ్రెస్‌కు స్వతంత్రులు, నిరుడు వచ్చిచేరిన ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలసహా 102 మంది మద్దతుంది. అటు బీజేపీకి 72 మంది ఎమ్మెల్యేలున్నా వారిలో అత్యధికులు మాజీ ముఖ్యమంత్రి వసుంధరరాజే వర్గంలో ఉన్నారు. పైలట్ రాక వల్ల కాంగ్రెస్ నుంచి మరో రాష్ట్రాన్ని ఊడబెరికామన్న తృప్తి బీజేపీ అధినేతలకు వుంటే వుండొచ్చు. కానీ వసుంధరకు అదంతా అనవసరం. ఎందుకంటే ఈ సంక్షోభంతో ప్రధానంగా బల హీనపడేది ఆమె వర్గమే. కనుకనే వసుంధర సహకరించలేదు. ఈ విషయంలో ఆమెను ఒప్పిం చడానికి చేసిన ప్రయత్నాలు ఎంతకూ ఫలించకపోవడంతో పైలట్ తిరుగుబాటులో కీలకపాత్ర పోషించిన వృద్ధ నేత భన్వారీలాల్ శర్మ అక్కడినుంచి జారుకుని ఉండొచ్చు. ఇదంతా బహిరంగంగా జరగలేదు గనుక బీజేపీ సులభంగా చేతులు దులుపుకుంది. సంక్షోభంలో తమ పాత్రలేదని, అది కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటల ఫలితమని మొదటే చెప్పామని ఆ పార్టీ తప్పుకుంది. ఎటొచ్చీ పైలట్ అన్నివిధాలా నష్టపోయారు. కొన్ని విలువల కోసం పోరాడానని ఆయన ఇప్పుడు గంభీరంగా చెబుతున్నారు. విలువల కోసం పోరాడదల్చుకుంటే శిబిరాలు నడపరు. మరో పార్టీ ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం రక్షణ తీసుకోరు. వెనక ఎందరున్నారన్న లెక్కలతో నిమిత్తం లేకుండా నమ్మిన విశ్వాసాల కోసం పనిచేస్తారు. ఈ క్రమంలో ఎలాంటి ఇబ్బందులెదురైనా మనో నిబ్బరంతో ముందుకెళ్తారు. యువ నాయకుడైనా, రాష్ట్రం నలుమూలలా చెప్పుకోదగ్గ పలుకుబడి వున్నా సచిన్ పైలట్ అందుకు సిద్ధపడలేకపోయారు. తన నిర్ణయం రాజకీయంగా ఆత్మహత్యా సదృశం కావొచ్చునన్న సంశయం ఆయనకు కలగలేదు. ఆయన మాటెలావున్నా ఇక్కడితో అంతా అయిపోలేదని కాంగ్రెస్ గ్రహించాలి. ఇది విరామం మాత్రమే. ఈ వ్యవధిలో పనితీరు మార్చుకుని స్వీయప్రక్షాళనకు సిద్ధపడాలి. సంస్థాగతంగా బలపడాలి. అడ్హాకిజం అన్నివేళలా ఫలితాలనీయదని గుర్తించాలి. -
తప్పులను క్షమించి ముందుకు సాగుదాం..
జైపూర్: దాదాపు నెల రోజుల పాటు రసవత్తరంగా సాగిన రాజస్తాన్ రాజకీయ సంక్షోభానికి రెండు రోజుల క్రితం తెర పడింది. తిరుగుబాటు నేత సచిన్ పైలట్‌తో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు జరిపిన మంతనాలు ఫలించాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఒక మెట్టు దిగి వచ్చారు. జైసల్మెర్ హోటల్లో బస చేస్తున్న ఎమ్మెల్యేలతో నిన్న సాయంత్రం సమావేశమయ్యారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న సంఘటనలను మర్చిపోయి.. తిరుగుబాటు ఎమ్మెల్యేలను క్షమించి ముందుకు సాగాలని తన మద్దతుదారులను కోరారు గహ్లోత్. ఈ సందర్భంగా అశోక్ గహ్లోత్ మాట్లాడుతూ.. ‘గత నెల రోజులుగా జరిగిన పరిణామాలు మనల్ని ఇబ్బందులకు గురి చేశాయి. తిరుగుబాటుదారుల వైఖరితో మనం బాధపడ్డాం. అయితే దేశానికి, రాష్ట్రానికి, ప్రజలకు సేవ చేయడానికి మనం ఇక్కడ ఉన్నాం. కాబట్టి సహనంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మనం వారి తప్పులను క్షమించాలి. ప్రజాస్వామం కోసం ఇలా చేయక తప్పదు. మోదీ పాలనలో ప్రజాస్వామ్యం పెను ప్రమాదంలో పడింది. దాన్ని కాపాడటమే మన ప్రథమ కర్తవ్యం. కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో చేసిన మాదిరిగానే రాజస్తాన్‌లో మన ప్రభుత్వాన్ని కూలదోయడానికి బీజేపీ ప్రయత్నించింది. కానీ మనం అలా జరగనివ్వలేదు. బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాం. ప్రజాస్వామ్యం కోసం మనం ఐక్యంగా ఉండాలి’ అని తన వర్గం ఎమ్మెల్యేలను కోరారు గహ్లోత్. (పైలట్ తొందరపడ్డారా!? ) తిరుగుబాటు నేత సచిన్ పైలట్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో భేటీ అనంతరం అలక వీడారు. తిరుగుబాటుకు కారణం తెలిపారు. అశోక్ గహ్లోత్ తనను పనికిమాలిన వ్యక్తి అంటూ పరుష పదజాలంతో విమర్శించారని.. ఆయన ప్రవర్తన తనను తీవ్రంగా కలిచి వేసిందని.. అందుకే తిరుగుబాటు చేశానని తెలిపారు. అయితే తిరుగుబాటు నేతలను పార్టీలోకి తీసుకోవడం పట్ల మిగతా ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరైన శిక్ష విధించకుండా వారిని పార్టీలోకి తీసుకోవద్దని కోరుతున్నారు. వారికి పదవులు ఇవ్వకూడదని డిమాండ్ చేస్తున్నారు. కానీ అధిష్టానం వారిని క్షమించిందని.. మనం కూడా తప్పులను మర్చిపోయి క్షమించి ముందుకు సాగాలని అశోక్ గహ్లోత్ వారికి తెలిపారు. (రాజస్తాన్: కుటుంబ పెద్దపై అలకబూనాం అంతే!) -
పైలట్ తొందరపడ్డారా!?
న్యూఢిల్లీ/జైపూర్: రాజస్తాన్ డ్రామా సుఖాంతమైంది. కాంగ్రెస్‌లోని వైరి పక్షాల మధ్య ఈ సయోధ్య తాత్కాలికమేనని.. ఇప్పుడు కాకపోతే మరి కొన్నాళ్లకైనా ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ప్రభుత్వం కుప్పకూలడం తథ్యమని బీజేపీ చెబుతోంది. బీజేపీ అంచనాల వెనుక ‘లెక్క’లేమిటో స్పష్టంగా తెలియదు. కానీ రాజస్తాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ‘విఫల’యత్నం చేసిందనేది అందరూ నమ్ముతున్న విషయం. రాష్ట్రంలో కాంగ్రెస్ కురువృద్ధుడు గహ్లోత్‌పై తిరుగుబాటు చేసిన యువనేత సచిన్ పైలట్ వెనుక ‘కాషాయ’ ధీమా ఉందనే అంతా విశ్వసిస్తున్నారు. అయితే, మధ్యప్రదేశ్ తరహాలో రాజస్తాన్‌లోనూ కాంగ్రెస్ సర్కారు కూల్చివేత సాధ్యం కాకపోవడం వెనుక పలు కారణాలను విశ్లేషకులు పేర్కొంటున్నారు. మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా స్పష్టమైన ప్రణాళికతో, బీజేపీ నుంచి స్పష్టమైన హామీతో ముందుకు వెళ్లారు. అక్కడ నంబర్ గేమ్‌లోనూ బీజేపీకి అడ్వాంటేజ్ ఉంది. 20 మందికి పైగా సింధియా అనుకూల ఎమ్మెల్యేల రాజీనామాలతో.. అరకొర మెజారిటీతో నెట్టుకొస్తున్న కమల్‌నాథ్‌కు రాజీనామా తప్ప మార్గం లేకపోయింది. 230 మంది ఎమ్మెల్యేల అసెంబ్లీలో అప్పుడున్న మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 227(ఇద్దరు చనిపోయారు. ఒకరు సస్పెండ్ అయ్యారు). కాంగ్రెస్ బలం ఆరుగురు మిత్రపక్ష ఎమ్మెల్యేలతో కలిపి 120(114+6). బీజేపీ బలం 107. మెజారిటీ మార్క్ 114. 21 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 93కి పడిపోయింది. మొత్తం సభ్యుల సంఖ్య 206కి తగ్గింది. దాంతో మెజారిటీకి అవసరమైన ఎమ్మెల్యేల సంఖ్య 104కి చేరింది. దాంతో, బీజేపీ తన 107 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. రాజస్తాన్‌లో ఆ అంచనా తప్పింది. 30కి పైగా ఎమ్మెల్యేలు తనవైపు వస్తారని పైలట్ ఆశించారు. వాస్తవానికి ఆయన వెంట నడిచింది 18 మందే. అంటే తనతో కలిపి 19 మంది. అసెంబ్లీలో 13 మంది వరకు స్వతంత్ర ఎమ్మెల్యేలున్నారు. వారిని సైతం ఆయన తనవైపు ఆకర్షించలేకపోయారు. మరోవైపు, ఈ సంక్షోభాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీనియర్ నేత గహ్లోత్ మెజారిటీ ఎమ్మెల్యేలు ‘చే’జారకుండా చూసుకున్నారు. కేంద్రమంత్రి షెకావత్, తిరుగుబాటు ఎమ్మెల్యే భన్వర్‌లాల్ శర్మ, మధ్యవర్తి సంజయ్ జైన్ల గొంతులతో ఉన్న ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన ఆడియో టేపులపై దుమారం లేపారు. పోలీసు కేసులతో హడలెత్తించారు. ఈ కుట్ర వెనుక బీజేపీ ఉందని, ఎమ్మెల్యేలను సీబీఐ, ఈడీ, ఐటీల ద్వారా బెదిరిస్తోందని ఆరోపణలు గుప్పిస్తూ, బీజేపీని డిఫెన్స్‌లో నెట్టారు. ఏ ఒక్క ఎమ్మెల్యే చేజారకుండా, అందరినీ జైపూర్ శివార్లలోని రిసార్ట్‌కు తరలించి, నెలపాటు అక్కడే ఉంచారు. ప్రభుత్వాన్ని కాపాడుకుంటానని అధిష్టానానికి హామీ ఇచ్చి మద్దతు సంపాదించారు. పైలట్‌కు అగ్ర నాయకత్వం నుంచి ఎలాంటి సహకారం అందకుండా చూశారు. పాలుపోని స్థితిలో పైలట్ సొంతగూటికి వచ్చే పరిస్థితి కల్పించారు. రాహుల్, ప్రియాంకలతో ఉన్న సాన్నిహిత్యం, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం వెనుక పైలట్ కృషిని గుర్తించిన అగ్ర నాయకత్వం కూడా ఆయనను కోల్పోవాలనుకోలేదు. అందుకే, పైలట్‌పై పరుష వ్యాఖ్యలు చేయవద్దని పార్టీ నాయకత్వం ఆదేశించింది. అయినప్పటికీ, ఆగ్రహం అణచుకోలేని గహ్లోత్ దద్దమ్మ అంటూ పైలట్‌ను దూషించారు. కాగా, 200 మంది సభ్యుల అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 107. ఇండిపెండెంట్లు, మిత్ర పక్షాలు కలుపుకుని ఆ సంఖ్య 124కు చేరుతుంది. బీజేపీ బలం 72. మిత్రపక్షాలతో కలిసి 76. పైలట్ నేతృత్వంలోని 19 మందిని స్పీకర్ అనర్హులుగా ప్రకటిస్తే.. ఎమ్మెల్యేల సంఖ్య 181 అవుతుంది. మెజారిటీ మార్క్ 92కు తగ్గుతుంది. ఈ నంబర్‌కు చేరుకోవడం బీజేపీకీ కష్టమే. తిరుగుబాటు ఎమ్మెల్యేలను మినహాయిస్తే కాంగ్రెస్ బలం 88 అవుతుంది. మిత్రపక్షాలు, స్వతంత్రుల దన్నుతో గహ్లోత్ సునాయాసంగా విశ్వాస పరీక్ష నెగ్గగలరు. కక్ష సాధింపు రాజకీయాలు ఉండరాదు: సచిన్ పైలట్ కక్షపూరిత రాజకీయాలకు పాల్పడటం తగదని సచిన్ పైలట్ అన్నారు. కాంగ్రెస్ అధిష్టానంతో సయోధ్య అనంతరం దాదాపు నెల రోజుల తర్వాత పైలట్ మంగళవారం జైపూర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఏ పదవి కోసం కూడా అధిష్టానాన్ని డిమాండ్ చేయలేదు. రాజకీయాల్లో వ్యక్తిగత విభేదాలకు తావులేదు. కక్ష సాధింపు రాజకీయాలు ఉండరాదు’అని వ్యాఖ్యానించారు. తాను ఎన్నడూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదనీ, అధిష్టానంతో చర్చించేందుకే ఢిల్లీ వెళ్లానన్నారు. తనకు వ్యతిరేకంగా వస్తున్న ప్రకటనలు విచారకరమంటూ ఆయన.. ఆ వ్యాఖ్యలు బాధించాయనీ, ఇటువంటి వాటిపై మాట్లాడలేననీ, రెండు తప్పులు కలిస్తే ఒప్పుగా మారవు కదా అని వ్యాఖ్యానించారు. ‘నాతోపాటు ఇతర అసంతృప్త ఎమ్మెల్యేలు ప్రధానంగా రాష్ట్రంలో నాయకత్వానికి సంబంధించిన సమస్య, ప్రజలకిచ్చిన వాగ్దానాల అమలుకు, పాలన సరిగ్గా లేకపోవడానికి సంబంధించిన సమస్యలను అధిష్టానానికి వివరించా’అని తెలిపారు. రాజీ ఫార్ములా వివరాలు నాకు తెలియవు: గహ్లోత్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తిరుగుబాటు వర్గం నేత సచిన్ పైలట్ మధ్య కుదిరిన సయోధ్యపై రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్ స్పందించారు. ఆ ఎమ్మెల్యేలు తిరుగుబాటు ఎందుకు చేశారో, వారికిప్పుడు హైకమాండ్ ఎలాంటి హామీ ఇచ్చిందో తనకు తెలియదని వ్యాఖ్యానించారు. దాదాపు నెల రోజులపాటు కొనసాగిన సంక్షోభానికి కారణమైన సచిన్ పైలట్‌తో అధిష్టానానికి కుదిరిన రాజీ ఫార్ములా వివరాలు తనకు తెలియవని పేర్కొన్నారు. పైలట్‌కు ఏవైనా సమస్యలుంటే అధిష్టానం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీకి చెప్పుకోవచ్చన్నారు. ఏదేమైనా, గతంలో మాదిరిగానే ఎమ్మెల్యేల ఇబ్బందులు తీర్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. మంగళవారం జైసల్మీర్ వెళ్లే ముందు సీఎం గహ్లోత్ మీడియాతో మాట్లాడారు. ‘నా వల్ల ఎమ్మెల్యేలెవరైనా ఇబ్బంది పడితే పరిష్కరించడం నా బాధ్యత. గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా వారి సమస్యలను తీరుస్తా’అని తెలిపారు. ఈ విషయంలో పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామన్నారు. -
‘లక్ష్మణ రేఖను దాటలేదు’
జైపూర్/న్యూఢిల్లీ : అశోక్ గహ్లోత్ సారథ్యంలోని రాజస్తాన్ సర్కార్‌పై తిరుగుబాటు చేసి రాహుల్, ప్రియాంకలతో భేటీ అనంతరం తిరిగి కాంగ్రెస్ గూటికి చేరిన సచిన్ పైలట్ తాజా పరిణామాలపై మంగళవారం పెదవివిప్పారు. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ తనపై చేసిన తీవ్ర వ్యాఖ్యలపైనా స్పందించారు. గహ్లోత్ పలు సందర్భాల్లో పైలట్‌ను నికమ్మ (పనికిరాని నేత)గా అభివర్ణించడంతో పాటు తన సర్కార్‌ను కూలదోసేందుకు బీజేపీతో చేతులు కలిపారని ఆరోపించారు. తాను తన కుటుంబం నుంచి విలువలను పుణికిపుచ్చుకున్నానని, తాను ఎవరిని ఎంతగా వ్యతిరేకించినా అలాంటి తీవ్ర పదజాలం వాడబోనని స్పష్టం చేశారు. అశోక్ గహ్లోత్ తన కంటే వయసులో పెద్దవారని ఆయనను తాను వ్యక్తిగతంగా గౌరవిస్తానని, అయితే పనికి సంబంధించిన అంశాలు, ఆందోళనలను లేవనెత్తే హక్కు తనకుందని చెప్పుకొచ్చారు. ప్రజా జీవితంలో లక్ష్మణ రేఖ ఉంటుందని, 20 ఏళ్లుగా తాను ఎన్నడూ లక్ష్మణ రేఖను దాటలేదని చెప్పారు. ప్రజాజీవితంలో ఒకరిపై ఒకరు వ్యక్తిగత దాడులు, దూషణలు చేసుకోవడం ఎంతమాత్రం అవసరం లేదనే సంప్రదాయాన్ని మనం నెలకొల్పాల్సిన అవసరం ఉందని అన్నారు. రాజకీయాల్లో సిద్ధాంత వైరుధ్యాలున్నా వ్యక్తిగత విభేదాలకు తావులేదని పైలట్ వ్యాఖ్యానించారు. కాగా గహ్లోత్ సర్కార్‌పై సచిన్ పైలట్ తిరుగుబాటు అనంతరం పైలట్‌ను డిప్యూటీ సీఎం పదవితో పాటు పీసీసీ చీఫ్‌గా కాంగ్రెస్ పార్టీ తొలగించింది. ఇక రాహుల్, ప్రియాంకల సమక్షంలో జరిగిన చర్చల అనంతరం 18 మంది ఎమ్మెల్యేలతో సహా తిరిగి పార్టీ గూటికి చేరేందుకు పైలట్ అంగీకరించడంతో రాజస్తాన్‌లో రాజకీయ సంక్షోభానికి తెరపడింది. -
పైలట్‌ను సీఎం అభ్యర్థిగా చూడొచ్చా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాలతో చర్చించిన తర్వాత రెబల్ నేత సచిన్ పైలట్ కాస్త శాంతించారు. తన ఫిర్యాదులపై అధిష్టానం సానుకూలంగా స్పందించడంతో తిరిగి సొంతగూటికి చేరుకునేందుకు సిద్ధమయ్యారు. దీంతో రాజస్థాన్ కాంగ్రెస్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభానికి తెరపడినట్లయింది. అంతేగాక పైలట్ వర్గం లేవనెత్తిన పరిష్కారాలు చూపేందుకు పార్టీ అధ్యక్షురాలు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో గహ్లోత్ ప్రభుత్వం బలనిరూపణకు తిరుగుబాటు నేతలు మద్దతు ఇవ్వనున్నట్టు సమాచారం. అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబట్టి భంగపడి.. డిప్యూటీ సీఎం పదవితో సరిపెట్టుకున్న సచిన్ పైలట్‌కు సోమవారం నాటి చర్చల్లో గాంధీ కుటుంబం ఎటువంటి హామీలు ఇచ్చి సంక్షోభాన్ని చల్లార్చిందనే విషయం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. అధిష్టానంతో రాజీ ఫార్ములా కుదిరిన నేపథ్యంలో.. సీఎం అశోక్ గహ్లోత్‌తో తీవ్ర విభేదాలు నెలకొన్నప్పటికీ పైలట్ మళ్లీ ఆయనతో కలిసి పనిచేస్తారా? లేదా దేశ రాజకీయాలపై దృష్టి సారించి పార్టీ వ్యవహరాల్లో కీలకంగా మారుతారా అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సచిన్ పైలట్ మాట్లాడుతూ.. ‘‘నేను కేంద్ర మంత్రిగా ఉన్నపుడు ఢిల్లీలో ఉన్నాను. రాజస్తాన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని అయినపుడు జైపూర్‌లో ఉన్నాను. పార్టీ నిర్ణయంపైనే నేను ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి అన్న విషయాలు ఆధారపడి ఉంటాయి’’ అంటూ అధిష్టానం చెప్పినట్లే తాను నడచుకుంటానని పేర్కొన్నారు. అదే సమయంలో.. తాను టోంక్ నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచానని, అక్కడి ప్రజలకు జవాబుదారీగా ఉండటం తన బాధ్యత అంటూ సొంత రాష్ట్రంలోనే ఉంటానని స్పష్టం చేశారు. (సొంత గూటికి పైలట్!) ఈ క్రమంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పైలట్‌ను చూడవచ్చా అని ప్రశ్నించగా.. ‘‘గహ్లోత్ గతంలో రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తదుపరి ఎన్నికల్లో ఫలితాలు మాకు అనుకూలంగా రాలేదు. అప్పటి ఎన్నికల్లో కేవలం 21 స్థానాల్లో గెలుపొందాం. నేను పార్టీ చీఫ్‌గా పగ్గాలు చేపట్టే సమయంలో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాం. మరో మూడేళ్లలో మళ్లీ ఎన్నికలు వస్తాయి. అందుకు సిద్ధంగా ఉండాలి. అప్పుడు కూడా ఇలాంటి ఫలితాలు రాకుండా ఉండాలంటే పదునైన వ్యూహంతో ముందుకు సాగాల్సి ఉంటుంది కదా’’ అని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. (రాజీ ఫార్ములాపై రాహుల్, పైలట్ మంతనాలు) కాగా 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి తర్వాత 2014 జనవరిలో సచిన్ పైలట్‌ను రాజస్తాన్ పార్టీ అధ్యక్షుడిగా పార్టీ నియమించింది. ఈ క్రమంలో ఐదేళ్లపాటు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి విస్తృత ప్రచారం చేసి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ 99 స్థానాల్లో గెలుపొందడంలో పైలట్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ సుదీర్ఘ పాలనతో విసుగెత్తి పోయిన ప్రజలను కాంగ్రెస్ వైపునకు తీసుకురావడంలో ఈ యువనేత సఫలీకృతడయ్యాడంటూ ప్రశంసలు సైతం అందుకున్నారు. ఇక ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టడమే తరువాయి అన్న తరుణంలో అధిష్టానం సీనియర్ నేత అశోక్ గహ్లోత్ వైపు మొగ్గుచూపడంతో పైలట్‌కు నిరాశే ఎదురైంది. డిప్యూటీ సీఎం పదవి దక్కినప్పటికీ గహ్లోత్ పాలనా తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తితోనే ఉన్నారు. ఈ క్రమంలో గత నెల 12న తిరుగుబాటు బావుటా ఎగురవేసిన విషయం తెలిసిందే. (గహ్లోత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయలేదు : సచిన్) ఆ విషయం నన్ను బాధించింది.. ఇక తిరుగుబాటుకు దారి తీసిన పరిస్థితుల గురించి మాట్లాడుతూ.. తమ మధ్య గత 18 నెలలుగా మాటలు లేవని ముఖ్యమంత్రే స్వయంగా చెప్పారని, కాబట్టి అటువైపు నుంచి స్పందన లేకపోవడంతోనే ఇలా చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఏదేమైనా తాను ఏనాడు పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదని, ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీకి వెళ్లినపుడు కూడా ఇదే పంథా అనుసరించానని చెప్పుకొచ్చారు. అదే విధంగా తాను ఎప్పుడూ ఎవరిపై అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, ప్రజా ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తానని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు పన్నానని స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్(ఎస్ఓజీ) చేత ప్రభుత్వం (దేశ ద్రోహం కింద) ఎఫ్ఐఆర్ నమోదు చేయించడం తనను వేదనకు గురిచేసిందని పేర్కొన్నారు. కాగా రాహుల్ గాంధీ, ప్రియాంక భేటీతో అనంతరం సచిన్ పైలట్ మాట్లాడుతూ.. ‘స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్(ఎస్ఓజీ) పెట్టిన దేశద్రోహం కేసు, రాష్ట్రంలో పాలన తీరు సహా పార్టీకి సంబంధించిన కొన్ని అంశాలను భేటీలో లేవనెత్తాను. వాటిని సమయానుకూలంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కొందరు నాపై కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. అలాంటి రాజకీయాల్లో బురదజల్లే వ్యవహార శైలికి నేను వ్యతిరేకం’ అని పైలట్ పేర్కొన్న విషయం తెలిసిందే. -
గహ్లోత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయలేదు : సచిన్
జైపూర్ : రాజస్తాన్ లో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడింది. తిరుగుబాటు నేత సచిన్ పైలట్ వర్గం చివరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నట్లు ప్రకటించింది. పార్టీ అధిష్ఠానంతో చర్చల అనంతరం సచిన్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీలతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ సమస్యలను గుర్తించడంతోపాటు పరిష్కారానికి కృషి చేసిన సోనియా, రాహుల్, ప్రియాంకతోపాటు పార్టీ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశాడు. నెల రోజుల తన తిరుగబాటుపై స్పందిస్తూ.. రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయలేదన్నారు. తన కుటుంబం నుంచి కొన్ని విలువలు నేర్చుకున్నానని, ఎవరిని ఎంత వ్యతిరేకించినా, నేనెప్పుడూ అనుచిత వ్యాఖ్యలు చేయలేదని పైలట్ అన్నారు. అశోక్ గహ్లోత్ తన కన్నా పెద్దవారు అని, ఆయన్ను వ్యక్తిగతంగా గౌరవిస్తానని, కానీ ప్రభుత్వ పరంగా ప్రశ్నిస్తానని తెలిపారు. తనకు ఎలాంటి పదవి వద్దన్న సచిన్ పైలట్.. అవి వస్తుంటాయి, పోతుంటాయని వ్యాఖ్యానించారు. ప్రజల విశ్వాసాన్ని, మనపై వారి నమ్మకాన్ని బలోపేతం చేసే దిశలో మనం పనిచేయాలని సచిన్ పైలట్ తెలిపారు. (చదవండి : సొంత గూటికి పైలట్!) కాగా, రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌పై అసమ్మతి స్వరం వినిపిస్తూ మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్‌తోపాటు మరో 18మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. దీంతో వీరిపై చర్యలు తీసుకునేందుకు స్పీకర్ ఇచ్చిన నోటీసులపై న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది. మరోవైపు ఈనెల 14 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే సమయంలో తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి. -
ఘర్‌వాపసి..!
-
సొంత గూటికి పైలట్!
న్యూఢిల్లీ/జైపూర్: రాజస్తాన్ కాంగ్రెస్‌లో రాజకీయ సంక్షోభానికి తెరపడింది. పార్టీలోకి తిరుగుబాటు నేత సచిన్ పైలట్ పునః ప్రవేశానికి రంగం సిద్ధమైంది. పైలట్ సోమవారం పార్టీ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాలతో సమావేశమయ్యారు. దాంతో, కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న రాజస్తాన్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మరో 3 రోజుల్లో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్నారనే వార్తల నేపథ్యంలో సచిన్ పైలట్ పార్టీ అగ్ర నేతలను కలుసుకోవడం ఆసక్తికరంగా మారింది. రాహుల్ గాంధీతో సచిన్ పైలట్ భేటీ అనంతరం.. కాంగ్రెస్ ఒక ప్రకటన విడుదల చేసింది. పైలట్ పార్టీ, రాష్ట్రంలో ప్రభుత్వ ప్రయోజనాల కోసం పనిచేస్తారని అందులో పేర్కొంది. ఇద్దరు నేతల మధ్య నిర్మాణాత్మకమైన, స్పష్టతతో కూడిన చర్చ జరిగిందని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ‘పైలట్, ఇతర ఎమ్మెల్యేలు లేవనెత్తిన ఫిర్యాదులను పరిశీలించి, పరిష్కారాలను సూచించేందుకు త్వరలో పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేస్తారు’ అని అందులో స్పష్టం చేశారు. మరోవైపు, పైలట్ తిరుగుబాటులో కీలకంగా వ్యవహరించిన ఎమ్మెల్యే భన్వర్‌లాల్ శర్మ సోమవారం ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్‌ను కలిశారు. గహ్లోత్ నివాసంలో జరిగిన ఆ భేటీ అనంతరం.. ‘ప్రభుత్వం క్షేమం. రేపటికి అంతా చక్కబడుతుంది’ అని శర్మ వ్యాఖ్యానించారు. దాదాపు నెల క్రితం 18 మంది ఎమ్మెల్యేలతో పైలట్ సీఎం గహ్లోత్‌పై తిరుగుబాటు చేసి, రాష్ట్రంలో రాజకీయ సంక్షోభానికి కారణమైన విషయం, గహ్లోత్ సర్కారు మనుగడకు ముప్పుగా పరిణమించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి గహ్లోత్, పైలట్లు తమ మద్దతుదారులను హోటళ్లలో ఉంచి, క్యాంప్ రాజకీయాలు నడుపుతున్నారు. రెబెల్స్‌పై చర్యలుండవు రాహుల్ గాంధీ నివాసంలో సోమవారం మధ్యాహ్నం ఈ భేటీ జరిగిందని పార్టీ వర్గాలు తెలిపాయి. పైలట్ మళ్లీ కాంగ్రెస్‌లోకి తిరిగి వచ్చేందుకు వీలుగా ఒక ఫార్మూలా సైతం సిద్ధమైందని వెల్లడించాయి. రాహుల్, ప్రియాంకలతో పైలట్ రెండు గంటలకు పైగా సమావేశమయ్యారని, పైలట్ లేవనెత్తిన అభ్యంతరాలపై అగ్రనేతలిద్దరూ సానుకూలంగా స్పందించారని తిరుగుబాటు నేతకు సన్నిహితులైన నాయకులు తెలిపారు. రెబెల్ ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని, పదవుల నుంచి తొలగించినవారికి మళ్లీ మంత్రి పదవులు ఇస్తామని పైలట్‌కు హామీ ఇచ్చారన్నాయి. అయితే, గహ్లోత్ శాసనసభలో బల నిరూపణకు సిద్ధమైతే.. తన వర్గం ఎమ్మెల్యేలతో సహా అనుకూలంగా ఓటేయాలని పైలట్‌కు వారు స్పష్టం చేసినట్లు సమాచారం. పైలట్ వర్గం ఎమ్మెల్యేల్లో మరి కొందరు కూడా అధిష్టానంతో సంప్రదింపులు జరుపుతున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ పరిస్థితుల్లో పార్టీలోకి మళ్లీ వెళ్లక తప్పని పరిస్థితులు పైలట్‌కు నెలకొన్నాయన్నారు. త్రిసభ్య కమిటీ పైలట్ వర్గం లేవనెత్తిన ఫిర్యాదులను పరిశీలించి, పరిష్కరించేందుకు ప్రియాంక గాంధీ, అహ్మద్ పటేల్, కేసీ వేణుగోపాల్‌లతో పార్టీ చీఫ్ సోనియాగాంధీ ఒక త్రిసభ్యకమిటీని ఏర్పాటు చేశారు. జూలై 12 నుంచి.. దాదాపు నెల క్రితం, జూలై 12న రాజస్తాన్ పీసీసీ చీఫ్, ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ పార్టీ రాష్ట్ర నాయకత్వంపై తిరుగుబాటు చేశారు. తను సహా 19 మంది ఎమ్మెల్యేలతో సీఎం గహ్లోత్‌పై తిరుగుబాటు చేశారు. తమవైపు 30 మంది వరకు ఎమ్మెల్యేలున్నారన్నారు. దాంతో ఒక్కసారిగా రాజస్తాన్ రాజకీయాలు వేడెక్కాయి. వెంటనే స్పందించిన కాంగ్రెస్, పైలట్‌ను పీసీసీ చీఫ్, ఉప ముఖ్యమంత్రి పదవుల నుంచి తొలగించింది. మెజారిటీ ఎమ్మెల్యేలు తనవైపే ఉన్నారని, ప్రభుత్వాన్ని నిలబెడ్తానని గహ్లోత్ హామీ ఇవ్వడంతో అధిష్టానం కూడా ఆయన వైపే నిలిచింది. ఇదంతా బీజేపీ కుట్ర అని, భారీ ఆఫర్లు ఇస్తూ ఎమ్మెల్యేల కొనుగోలుకు తెర తీశారని గహ్లోత్ ఆరోపించారు. తన ఆరోపణలకు మద్దతుగా కేంద్ర మంత్రి షెకావత్, తిరుగుబాటు ఎమ్మెల్యే భన్వర్‌లాల్ శర్మ, వ్యాపారవేత్త సంజయ్ జైన్ల ఆడియోటేప్లను చూపారు. వారిపై కేసులు పెట్టారు. అలాగే, తన వర్గం ఎమ్మెల్యేలను జైపూర్‌లోని హోటల్‌కు తరలించారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్‌ను కోరారు. దాంతో, పైలట్, ఆయన వర్గం కోర్టును ఆశ్రయించింది. పదవి కోసం పాకులాడను పదవి కోసం తాను పాకులాడనని సచిన్ పైలట్ పేర్కొన్నారు. విలువల కోసమే తన పోరాటమన్నారు. తనకు పదవి ఇచ్చింది పార్టీనేనని, కావాలనుకుంటే ఆ పదవిని పార్టీ మళ్లీ వెనక్కు తీసుకోవచ్చని పేర్కొన్నారు. రాహుల్‌తో భేటీ అనంతరం పైలట్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్(ఎస్ఓజీ) పెట్టిన దేశద్రోహం కేసు, రాష్ట్రంలో పాలన తీరు సహా పార్టీకి సంబంధించిన కొన్ని అంశాలను భేటీలో లేవనెత్తాను. వాటిని సమయానుకూలంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కొందరు నాపై కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. అలాంటి రాజకీయాల్లో బురదజల్లే వ్యవహార శైలికి నేను వ్యతిరేకం’ అని పైలట్ పేర్కొన్నారు. -
రాజస్తాన్: కుటుంబ పెద్దపై అలకబూనాం అంతే!
జైపూర్: రాజస్తాన్ రాజకీయ సంక్షోభం కొలిక్కి వచ్చినట్టే కనబడుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ తిరుగుబాటు నేత సచిన్ పైలట్ రాహుల్, ప్రియాంక గాంధీతో భేటీ అయి కొన్ని డిమాండ్లు వారి ముందు పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా పైలట్ మద్దతుదారు భన్వర్‌లాల్ శర్మ సీఎం అశోక్ గహ్లోత్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గహ్లోత్ నాయకత్వంలో పనిచేస్తామని అన్నారు. తమ నాయకుడు గహ్లోతేనని పేర్కొన్నారు. తాను ఎప్పుడూ కాంగ్రెస్ నేతనేనని స్పష్టం చేశారు. ‘కుటుంబం అన్నాక చిన్నచిన్న గొడవలు ఉంటాయి. కుటుంబ పెద్దపై పిల్లలు అలకబూని కొద్ది రోజులు అన్నం తినకుండా మొండికేస్తారు. మేమూ అంతే. మా నాయకుడిపై అసహనంతో నెలపాటు దూరంగా ఉన్నాం. ఇప్పుడు అన్ని వివాదాలు సమసిపోయాయి. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను మా ప్రభుత్వం నెరవేర్చుతుంది’అని భన్వర్‌లాల్ ట్విటర్లో పేర్కొన్నారు. ఇక నిన్నటి వరకు ఉప్పు నిప్పులా సాగిన పైలట్, గహ్లోత్ మద్దతుదారుల మధ్య సంబంధాలు ఒక్కసారిగా మారిపోవడంతో అవాక్కయ్యామంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇదిలాఉండగా.. అశోక్ గహ్లోత్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలపై బయటికొచ్చిన ఆడియో టేపుల వ్యవహారాన్ని భన్వర్‌లాల్ తోసిపుచ్చారు. ఎలాంటి ఆడియో టేపులు లేవని, అవన్నీ అబద్దాలని పేర్కొన్నారు. తనకు గజేంద్ర సింగ్ మాత్రమే తెలుసని, షెకావత్, సంజయ్ జైన్ ఎవరో తెలియదని అన్నారు. కాగా, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ నేత సంజయ్ జైన్‌తో కలిసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గహ్లోత్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్రలు చేశారని ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. వారి సంభాషణలకు సంబంధించిన ఆడియో టేపులు కూడా కాంగ్రెస్ బయటపెట్టింది. ఆడియో టేపుల్లో భన్వర్‌లాల్ పేరు ప్రముఖంగా వినపడింది. (రాజీ ఫార్ములాపై రాహుల్, పైలట్ మంతనాలు) -
హైకమాండ్ ముందు పైలట్ డిమాండ్లు ఇవే..
సాక్షి, న్యూఢిల్లీ: క్యాంపు రాజకీయాలతో వేడెక్కిన రాజస్తాన్ రాజకీయ హైడ్రామా కీలక ఘట్టానికి చేరింది. ఆగస్ట్ 14 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడంతో పాలక కాంగ్రెస్‌లో గహ్లోత్, పైలట్ శిబిరాల మధ్య రాజీ ఫార్ములాకు తెరలేచింది. తిరుగుబాటు నేత సచిన్ పైలట్ సోమవారం రాహుల్ గాంధీ నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటల పాటు కొనసాగిన సమావేశంలో పార్టీలో చీలికను నివారించి రాజకీయ సంక్షోభానికి తెరదించడంపై రాహుల్, ప్రియాంక గాంధీలతో తిరుగుబాటు నేత సచిన్ పైలట్ చర్చించారు. తాను తిరిగి పార్టీ గూటికి చేరాలంటే మూడు ప్రధాన డిమాండ్లను పైలట్ అగ్ర నేతల ముందుంచినట్టు తెలిసింది. భవిష్యత్‌లో తనను ముఖ్యమంత్రిగా ఎంపిక చేస్తామని బహిరంగ ప్రకటన చేయడం, ఇది సాధ్యం కానిపక్షంలో తన వర్గానికి చెందిన ఇద్దరు సీనియర్ నేతలను డిప్యూటీ సీఎంలుగా నియమించాలని స్పష్టం చేశారు. తమ వర్గానికి చెందిన ఇతర నేతలను రాష్ట్ర కేబినెట్లోకి తీసుకోవడంతో పాటు నామినేషన్ పదవులకు ఎంపిక చేయాలని పైలట్ హైకమాండ్‌కు స్పష్టం చేశారు. తనను జాతీయస్ధాయిలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించాలని పైలట్ హైకమాండ్ ముందు రాజీ ఫార్ములాను ప్రతిపాదించారు. కాగా పార్టీపై తిరుగుబాటు నేపథ్యంలో పైలట్ కోల్పోయిన డిప్యూటీ సీఎంతో పాటు రాజస్తాన్ పీసీసీ చీఫ్ పదవులను తొలుత చేపట్టాలని ఆయనను రాహుల్ కోరారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ గూటికి తిరిగి వస్తే ప్రభుత్వ పనితీరు కోసం కమిటీని ఏర్పాటు చేస్తామని పైలట్‌కు రాహుల్ హామీ ఇచ్చారని తెలిసింది. సచిన్ పైలట్ శిబిరానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలందరితో మాట్లాడేందుకు రాహుల్ ఆసక్తి కనబరిచారని సమాచారం. ఇక అసెంబ్లీలో బలనిరూపణకు గడువు ముంచుకొస్తుండటంతో అసమ్మతి ఎమ్మెల్యేలు తిరిగివస్తే స్వాగతిస్తామని రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ పేర్కొన్నారు. చదవండి : గహ్లోత్‌కు మద్దతుగా పైలట్ వర్గం! -
రాహుల్‌తో భేటీ.. సొంతగూటికి పైలట్?!
జైపూర్: అసెంబ్లీ సమావేశాలు సమీపిస్తోన్న తరుణంలో రాజస్తాన్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తిరుగుబాటు నేత సచిన్ పైలట్ నేడు రాహుల్ గాంధీ నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. పార్టీలో చీలిక, తాజా రాజకీయ పరిణామాలపై పైలట్, రాహుల్, ప్రియాంక గాంధీలతో చర్చించారు. ఈ నేపథ్యంలో తాజా భేటీతో రాజస్తాన్ రాజకీయ సంక్షోభానికి తెర పడనున్నట్లు సమాచారం. పైలట్‌ను బుజ్జగించడంలో అధిష్ఠానం సఫలీకృతమయినట్టు తెలుస్తోంది. ఈ చర్చల్లో సచిన్ పైలట్ మనోవేదనను అధిష్టానం అర్థ చేసుకుందని.. అశోక్ గహ్లోత్ పనితీరుతో సహా రాజస్తాన్‌కు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి రాహుల్ గాంధీ అంగీకరించారని సమాచారం. (గహ్లోత్‌కు మద్దతుగా పైలట్ వర్గం!) ‘ఘర్-వాప్సి’ సూత్రంలో భాగంగా సచిన్ పైలట్ కోల్పోయిన ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ పదవులను పొందే అవకాశం ఉన్నట్లు సమాచారం. సోమవారం రాత్రి వరకు పైలట్ నుంచి సానుకూల ప్రకటన వెలువడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అశోక్ గహ్లోత్ ప్రభుత్వంపై తిరుగుబాటును ప్రకటించినందుకు సచిన్ పైలట్‌తో పాటు అతని వర్గం నేతలను కాంగ్రెస్ పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. అనంతరం ప్రియాంక గాంధీ పైలట్‌తో చర్చలు జరిపారు. ఆ తర్వాత కూడా ఈ చర్చలు కొనసాగుతున్నాయి. రాజస్తాన్ అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 14 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇరువర్గాలు చర్చలు ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలు తిరిగి వస్తే స్వాగతిస్తామని గహ్లోత్ పేర్కొన్నారు. (సత్యం పక్షాన నిలబడండి) అశోక్ గహ్లోత్‌ను వ్యతిరేకిస్తూ.. సచిన్ పైలట్‌తో పాటు 19 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడిన విషయం తెలిసిందే. దీంతో డిప్యూటీ సీఎం పదవి నుంచి సచిన్ పైలట్ నుంచి తప్పించారు. సచిన్ పైలట్ తాను బీజేపీలో చేరడం లేదని ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఆయనతో మంతనాలు జరుపుతూనే ఉంది. -
గహ్లోత్‌కు మద్దతుగా పైలట్ వర్గం!
జైపూర్: అశోక్ గహ్లోత్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నించి విఫలమైన సచిన్ పైలట్ వర్గం ఎట్టకేలకు రాజీకి వచ్చినట్లు తెలుస్తోంది. పైలట్ వర్గంతో కాంగ్రెస్ అధిష్టానం జరుపుతున్న చర్చలు సానూకూలంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. తిరుగుబాటు ఎమ్మెల్యేలతో జరుపుతున్నచర్చల్లో పురోగతి కనిపిస్తోందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. చివరగా ప్రియాంక గాంధీ, సచిన్‌ల భేటీతో ఈ చర్చలు ఓ కొలిక్కి వస్తాయని కాంగ్రెస్ భావిస్తుంది. చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని, తిరుగుబాటు ఎమ్మెల్యేలు గహ్లోత్ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తాయని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ వార్తలను పైలట్ వర్గం ఖండించింది. గహ్లోత్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిస్తేనే మద్దతుగా నిలుస్తామని ఆయన వర్గం పేర్కొంది. (చదవండి : సత్యం పక్షాన నిలబడండి: గహ్లోత్) అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై తిరుగుబాటును ప్రకటించినందుకు సచిన్ పైలట్ తో పాటు పలువురు అతని వర్గం నేతలను కాంగ్రెస్ పదవులు నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. అనంతరం ప్రియాంక గాంధీ పైలట్‌తో చర్చలు జరిపారు. ఆ తర్వాత కూడా ఈ చర్చలు కొనసాగుతున్నాయి. రాజస్తాన్ అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 14 నుంచి ప్రారంభం కానున్ననేపథ్యంలో ఇరువర్గాలు చర్చలు ముమ్మరం చేశాయి. తిరుగుబాటు ఎమ్మెల్యేలు తిరిగి వస్తే స్వాగతిస్తామని గహ్లోత్ పేర్కొనగా, గహ్లోత్ ప్రభుత్వానికి తాము మద్దతు ఇచ్చేది లేదని తిరుగుబాటు ఎమ్మెల్యేలు తేల్చి చెబుతున్నారు. మరో వైపు తిరుబాటు చేసిన19 మంది ఎమ్మెల్యేల మద్దతు లేకుండానే విశ్వాస పరీక్షలో నెగ్గాలని గహ్లోత్ భావిస్తున్నారు. ఆ దిశగా చర్చలు జరుపుతున్నారు. విశ్వాస పరీక్షలు మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యేలకు ఆదివారం లేఖలు రాశారు.‘సత్యం పక్షాన నిలవండి–ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు రాష్ట్ర సంక్షేమం కోసం పనిచేయడానికి, ఓటర్ల అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోండి’అని లేఖలో వ్యాఖ్యానించారు.అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీజేపీ కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే 18 మంది ఎమ్మెల్యేలను గుజరాత్‌కి తరలించింది. శనివారం ఆరుగురు శాసనసభ్యులు పోరుబందర్‌కి, మరో 12 మంది ఎమ్మెల్యేలు అహ్మదాబాద్‌కు తరలించింది. -
గహ్లోత్ సర్కార్‌కు ఊరట
జైపూర్ : రాజస్తాన్‌లో రాజకీయ హైడ్రామా కొనసాగుతోంది. పాలక కాంగ్రెస్‌లో ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేల విలీన ప్రక్రియను నిలిపివేయాలని బీఎస్పీ దాఖలు చేసిన పిటిషన్‌ను రాజస్తాన్ హైకోర్టు కొట్టివేయడంతో అశోక్ గహ్లోత్ సారథ్యంలోని కాంగ్రెస్ సర్కార్‌కు ఊరట లభించింది. సచిన్ పైలట్ సహా 19 మంది రెబెల్ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న గహ్లోత్ సర్కార్‌కు ఈ పరిణామం భారీ ఊరటగా భావిస్తున్నారు. రాజస్తాన్ అసెంబ్లీలో మెజారిటీ మార్క్‌కు ఒక్కరు అధికంగా తనకు 102 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గహ్లోత్ చెబుతున్నారు. బీఎస్పీ ఎమ్మెల్యేల విలీనం నిలిపివేస్తే గహ్లోత్ మద్దతుదారుల సంఖ్యాబలం 102 నుంచి 96కు పడిపోయి మెజారిటీ నిరూపణకు ఆయన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది. 200 మంది సభ్యులతో కూడిన రాజస్తాన్ అసెంబ్లీలో బీజేపీకి 72 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు, తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలుపుకుని ప్రత్యర్థి వర్గానికి 97 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. 2019 సెప్టెంబర్‌లో కాంగ్రెస్‌లో ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేల విలీనాన్ని సవాల్ చేస్తూ బీఎస్పీ, బీజేపీలు కోర్టును ఆశ్రయించాయి. సభా కార్యకలాపాల్లో ఆరుగురు ఎమ్మెల్యేలను పాల్గొనకుండా స్టే విధించాలని ఆ పార్టీలు కోరుతున్నాయి. చదవండి : ‘గహ్లోత్ ఆనందం ఆవిరే’ -
వెనక్కి రండి.. గెహ్లాత్ రాజీమంత్రం
జైసల్మీర్/జైపూర్ : రాజస్తాన్ ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నాలు మానుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ప్రధాని మోదీని అభ్యర్థించారు. సచిన్ పైలట్ నేతృత్వంలోని తిరుగుబాటు ఎమ్మెల్యేలను హైకమాండ్ క్షమిస్తే వారిని అక్కున చేర్చుకుంటానని చెప్పారు. ఆగస్టు 14 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో తన వర్గం ఎమ్మెల్యేలు చేజారిపోకుండా జైసల్మీర్‌లోని సూర్యగఢ్ రిసార్టుకి తరలించిన విషయం తెలిసిందే. వారితో పాటు ఒక రోజంతా గడిపిన గహ్లోత్ జైపూర్‌కి వెనక్కి తిరిగి రావడానికి ముందు విలేకరులతో మాట్లాడారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు తిరిగి కాంగ్రెస్ గూటికి వస్తే సాదరంగా ఆహ్వానిస్తానన్న గహ్లోత్ హైకమాండ్‌దే తుది నిర్ణయమని చెప్పారు. కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, ధర్మేంద్ర ప్రధాన్‌లు ప్రభుత్వాన్ని కూల్చి వేసే కుట్రలో ఉన్నారని ఆరోపించారు. నైతిక విలువలకు కట్టుబడి షెకావత్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 200 స్థానాలున్న రాజస్థాన్ అసెంబ్లీలో తిరుగుబాటు ఎమ్మెల్యేలు 19 మంది సహా కాంగ్రెస్ బలం 107 కాగా, బీజేపీకి 72 స్థానాలున్నాయి. -
రాజస్తాన్ హైడ్రామా: జైపూర్ నుంచి జైసల్మేర్‌కు
జైపూర్ : రాజస్తాన్‌లో రాజకీయ హైడ్రామా కొనసాగుతోంది. జైపూర్ ఫెయిర్‌మోంట్ హోటల్లో బసచేసిన ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ శిబిరానికి చెందిన ఎమ్మెల్యేలను జైసల్మేర్‌కు తరలిస్తున్నారు. జైసల్మేర్‌కు వెళ్లేందుకు జైపూర్ హోటల్ నుంచి గహ్లోత్‌కు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు ఎయిర్‌పోర్ట్‌కు బస్సుల్లో తరలివెళ్లారు. ఆగస్ట్ 14 నుంచి అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్ అంగీకరించడంతో తనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు గహ్లోత్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పైలట్ శిబిరం నుంచి ఎమ్మెల్యేలను తిరిగి కాంగ్రెస్ గూటికి రప్పించే ప్రయత్నాలు చేస్తూనే తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవాలని యోచిస్తున్నారు. మరోవైపు ఆగస్ట్ 17న అశోక్ గహ్లోత్ బలపరీక్షను కోరే అవకాశం ఉందని భావిస్తున్నారు. చివరి ప్రయత్నంగా తిరుగుబాటు నేత సచిన్ పైలట్‌ను తిరిగి కాంగ్రెస్ గూటికి రప్పించే ప్రయత్నాలు సాగుతున్నాయి. పార్టీలోకి తిరిగి రావాలని పైలట్‌కు రాజస్తాన్ పీసీసీ చీఫ్ గోవింద్ సింగ్ దోత్సరా విజ్ఞప్తి చేశారు. 2018లో పార్టీ టికెట్‌పై గెలిచిన వారంతా కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలని కోరారు. ఇక ఆగస్ట్ 14 నుంచి రాజస్తాన్ అసెంబ్లీ సమావేశాలు జరిపేందుకు గవర్నర్ కల్రాజ్ మిశ్రా అంగీకరించిన వెంటనే ఎమ్మెల్యేల బేరసారాలు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఆరోపించారు. చదవండి : ‘అసెంబ్లీ సమావేశాలు అడ్డుకోలేదు, కానీ..’ గతంలో ఎమ్మెల్యేలు గోడ దూకేందుకు రూ 10 కోట్ల నుంచి రూ 15 కోట్లు ఆఫర్ చేయగా ఇప్పుడవి ఊహించని స్ధాయికి చేరాయని గహ్లోత్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర పన్నిందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. పైలట్ వెనకుండి బీజేపీ కుట్రకు తెరలేపిందని గహ్లోత్ సైతం ఇటీవల కాషాయ పార్టీపై ఆరోపణలు గుప్పించారు. -
రాజస్తాన్ డ్రామాకు తెర
జైపూర్: రాజస్తాన్ రాజకీయ డ్రామాకు ప్రస్తుతానికి తెర పడింది. ఆగస్ట్ 14 నుంచి అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించేందుకు గవర్నర్ కల్రాజ్ మిశ్రా అంగీకరించారు. దాంతో గవర్నర్, కాంగ్రెస్ సర్కార్ల మధ్య నెలకొన్న ప్రచ్ఛన్న యుద్ధం ముగిసింది. అంతకుముందు, బుధవారం పలు కీలక ఘటనలు చోటు చేసుకున్నాయి. జులై 31 నుంచి అసెంబ్లీని ప్రారంభించాలని కోరుతూ సీఎం అశోక్ గహ్లోత్ కేబినెట్ గవర్నర్‌కు పంపిన మూడో సిఫారసును గవర్నర్ వెనక్కు పంపించారు. అసెంబ్లీ సమావేశాల విషయంలో తను కోరిన వివరణలకు సంతృప్తికర సమాధానాలు ఇవ్వలేదని, అసెంబ్లీ భేటీలను ప్రారంభించడానికి సహేతుక కారణం పేర్కొంటూ మళ్లీ ప్రతిపాదన పంపాలని గవర్నర్ పేర్కొన్నారు. దాంతో, బుధవారం మళ్లీ సమావేశమైన సీఎం గహ్లోత్ కేబినెట్.. ఆగస్ట్ 14 నుంచి సమావేశాలను ప్రారంభించాలని కోరుతూ మరో ప్రతిపాదనను గవర్నర్‌కు పంపించింది. కేబినెట్ సిఫారసులను వెనక్కు పంపిస్తూ.. గవర్నర్ ప్రతీసారి ప్రస్తావిస్తున్న 21 రోజుల నోటీసు పీరియడ్ నిబంధన అమలయ్యేలా ఆగస్ట్ 14వ తేదీని అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి సీఎం గహ్లోత్ ఎంచుకున్నారు. గవర్నర్‌కు తొలి ప్రతిపాదన పంపిన జులై 23 నుంచి పరిగణనలోకి తీసుకుని తాజా ప్రతిపాదనను పంపించారు. స్వల్ప వ్యవధి నోటీసుతో సమావేశాలను ప్రారంభించేందుకు కారణం చూపకపోతే 21 రోజుల నోటీసు వ్యవధితో సమావేశాలను ప్రారంభించవచ్చని గత ప్రతిపాదనలను తిరస్కరిస్తూ గవర్నర్ పేర్కొన్న విషయం తెలిసిందే. ప్రేమ లేఖ అందింది: ఈ నేపథ్యంలో గవర్నర్‌తో రాజ్‌భవన్‌లో దాదాపు పావుగంట పాటు సీఎం గహ్లోత్ సమావేశమయ్యారు. ‘ప్రేమ లేఖ అందింది. తేనీటి సేవనం కోసం ఇప్పుడు ఆయన దగ్గరకు వెళ్తున్నాను’అని రాజ్‌భవన్‌కు వెళ్లేముందు గహ్లోత్ వ్యాఖ్యానించారు. గవర్నర్‌తో సమావేశం తరువాత కేబినెట్ భేటీ నిర్వహించారు. అనంతరం, ఆగస్ట్ 14 నుంచి శాసన సభ సమావేశాలను ప్రారంభించాలని కోరుతూ మరో ప్రతిపాదనను గవర్నర్ పంపించారు. మరోవైపు, గవర్నర్ కల్రాజ్ మిశ్రాను బుధవారం అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి కలిశారు. కాగా, ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ విలీనం చేసుకోవడాన్ని సవాలు చేస్తూ బహుజన్ సమాజ్ పార్టీ బుధవారం రాజస్తాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 2018లో జరిగిన ఎన్నికల్లో బీఎస్పీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచిన ఆరుగురు.. ఆ తరువాత 2019 సెప్టెంబర్‌లో కాంగ్రెస్‌లో చేరారు. ఈ విలీనాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ వేశామని, స్పీకర్ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేశామని బీఎస్పీ రాజస్తాన్ శాఖ అధ్యక్షుడు భగవాన్ సింగ్ బాబా తెలిపారు. -
పక్షపాతం లేకుండా వ్యవహరించండి: పైలట్
సాక్షి, జైపూర్: ముఖ్యమంత్రిపై తిరుగుబాటు చేయడంతో సచిన్ పైలట్‌ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ రాజస్తాన్ నూతన అధ్యక్షుడిగా గోవింద్ సింగ్ దోతస్రా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడికి సచిన్ పైలట్ అభినందనలు తెలిపారు. ఎటువంటి ఒత్తిడి, పక్షపాతం లేకుండా వ్యవహరించాలని సూచించారు. ‘రాజస్తాన్ కాంగ్రెస్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన దోతస్రాజీకి అభినందనలు. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేసిన పార్టీ కార్యకర్తలను ఎటువంటి ఒత్తిడి, పక్షపాతం లేకుండా పూర్తిగా గౌరవిస్తారని ఆశిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. అలానే అసెంబ్లీ స్పీకర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు సచిన్ పైలట్. (రాజస్తాన్ హైడ్రామా : పట్టు కోల్పోతున్న పైలట్!) ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌కు ఎదురుతిరిగిన సచిన్ పైలట్‌ను డిప్యూటీ సీఎం పదవితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి ఈ నెల 14న పార్టీ హైకమాండ్ తొలగించింది. ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీతో కలిసి కుట్ర పన్నుతున్నారన్న ఆరోపణలతో సచిన్ పైలట్‌తోపాటు ఆయనకు మద్దతిస్తున్న 18 ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ పార్టీ అనర్హత వేటు వేయగా వారు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. -
రాజస్తాన్ హైడ్రామా : పట్టు కోల్పోతున్న పైలట్!
జైపూర్ : రాజస్తాన్‌లో రాజకీయ హైడ్రామా కొనసాగుతుండగా.. తిరుగుబాటు నేత, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్‌కు కాంగ్రెస్ శిబిరంలో మద్దతు, సానుభూతి తరిగిపోతోందని పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటును కొనసాగిస్తుండటంతో పార్టీలో అంతర్గతంగా పైలట్‌కున్న పట్టు, సానుభూతిని ఆయన కోల్పోయారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీఎల్పీ భేటీలకు డుమ్మా కొట్టడంతో రాజస్తాన్ డిప్యూటీ సీఎంగా పైలట్‌ను తొలగించిన సమయంలో ఆయన పట్ల కాంగ్రెస్ పార్టీలో సానుభూతి పెరిగింది. ఈ క్రమంలో అధీర్ రంజన్ చౌధరి, అభిషేక్ సింఘ్వి, సల్మాన్ ఖుర్షీద్, శశి థరూర్, జితిన్ ప్రసాద, ప్రియా దత్ వంటి సీనియర్ నేతలు సైతం పైలట్ తిరిగి పార్టీ గూటికి చేరతారని, పరిస్థితి సద్దుమణుగుతుందని ఆశించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం వంటి నేతలు కూడా పైలట్‌తో రాజీ యత్నాలకు చొరవ చూపారు. పైలట్‌తో చర్చించి తిరిగి ఆయనను పార్టీ గూటికి చేర్చాలంటూ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు సీనియర్ నేతలను రాయబారానికి పంపినా ఫలితం లేకపోయింది. ఈ ఆఫర్లను తోసిపుచ్చిన పైలట్ ముఖ్యమంత్రిగా అశోక్ గహ్లోత్ తొలగించాలని పట్టుపట్టారు. గహ్లోత్ సైతం గద్దెదిగేందుకు అంగకరించకపోవడంతో పాటు అదే రోజు డిప్యూటీ సీఎంగా పైలట్‌పై వేటు వేయడం పైలట్ సహా 18 మంది అసంతృప్త పార్టీ ఎమ్యెల్యేలకు రాజస్తాన్ అసెంబ్లీ స్పీకర్ అనర్హత నోటీసులు జారీ చేయడం చకచకా జరిగిపోయాయి. గహ్లాత్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీతో కలిసి రెబల్ నేతలు కుట్ర పన్నారంటూ విడుదలైన ఆడియో టేప్‌లు కలకలం రేపాయి. సొంతపార్టీని గద్దెదింపేందుకు పైలట్ బీజేపీతో చేతులు కలుపుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. చదవండి : రాజస్తాన్ హైడ్రామా : అది మా హక్కు పైలట్ సహా రెబల్ ఎమ్మెల్యేలకు జారీ అయిన అనర్హత పిటిషన్లపై విచారణ న్యాయస్ధానాల పరిధిలో ఉంది. మరోవైపు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే పైలట్ ఏ పార్టీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారో వెల్లడవుతుందని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. అసెంబ్లీని సమావేశపరచడంపై పైలట్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని పార్టీ నేతలు ఆయనను నిలదీస్తున్నారు. 20, 25 మంది ఎమ్మెల్యేలతో పైలట్ ముఖ్యమంత్రి కాలేరని, బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు పైలట్‌కు పార్టీ తలుపులు తెరిచే ఉన్నాయని కాంగ్రెస్ నేతలు చెబుతుంటే ముఖ్యమంత్రి గహ్లోత్ మాత్రం విమర్శలతో చెలరేగుతున్నారని పైలట్ వర్గీయులు అంటున్నారు. ఇది ద్వంద్వ ప్రమాణాలను అనుసరించడం కాదా అని పైలట్ శిబిరం ప్రశ్నిస్తోంది. అసెంబ్లీని సమావేశపరిస్తే పైలట్ ఎలాంటి వ్యూహం అనుసరిస్తారనేది ఆసక్తి రేపుతోంది. -
రాజస్తాన్ హైడ్రామా : అది మా హక్కు..
జైపూర్ : రాజస్తాన్ హైడ్రామా రోజుకో మలుపు తిరుగుతూ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు గవర్నర్ పంపిన మార్గదర్శకాలపై చర్చించేందుకు రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లాత్ అధ్యక్షతన మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించి గవర్నర్ లేవనెత్తిన అంశాలపై తాము సవివరంగా చర్చించి సమాధానాలను సిద్ధం చేశామని భేటీ అనంతరం మంత్రి హరీష్ చౌధరి పేర్కొన్నారు.జులై 31నుంచి అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని తాము కోరుతున్నామని, అసెంబ్లీని సమావేశపరచడం తమ హక్కని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలు ఎలా నిర్వహిస్తారనేది స్పీకర్ నిర్ణయమని చెప్పారు. కేబినెట్ ప్రతిపాదనలను గవర్నర్ ముందుంచుతామని చెప్పారు. 21 రోజుల నోటీస్‌తో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకోవచ్చని గవర్నర్ తెలిపిన క్రమంలో ఈ పరిణామం బీజేపీ బేరసారాలకు దిగేందుకు అనుకూలంగా ఉందని కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి విశ్వాస పరీక్షకు సిద్ధపడితే 21 రోజుల నోటీస్ అవసరం లేదని గవర్పర్ పేర్కొన్న క్రమంలో ఈ దిశగా కేబినెట్ భేటీలో ఎలాంటి చర్చ జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో తక్కువ వ్యవధిలో ఎమ్మెల్యేలను సమావేశాలకు రప్పించలేరని గవర్నర్ పేర్కొంటూ ఎమ్మెల్యేలకు 21 రోజుల నోటీస్‌ను అందిస్తారా అని గవర్నర్ అశోక్ గహ్లాత్ ప్రభుత్వాన్ని వివరణ కోరిన సంగతి తెలిసిందే. మరోవైపు సభలో భౌతికదూరం నిబంధనలను ఎలా పాటిస్తారని ఆయన ప్రభుత్వాన్ని వివరణ కోరారు. మరోవైపు తమ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో విలీనం చేయడంపై ఆ పార్టీ అధినేత్రి మాయావతి విరుచుకుపడ్డారు. ఓ వైపు ఈ వ్యవహారంలో న్యాయపోరాటం జరుగుతుండగా కాంగ్రెస్ పార్టీకి, అశోక్ గహ్లాత్‌కు గుణపాఠం చెబుతామని ఆమె హెచ్చరించారు. చదవండి : మాయావతి విప్ : గహ్లోత్ సర్కార్‌కు షాక్ -
కాపాడండి: ప్రధాని మోదీకి గహ్లోత్ ఫోన్
జైపూర్ : రాజస్తాన్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం రోజుకో మలుపు తిరుగుతోంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ గవర్నర్ కల్రాజ్ మిశ్రాకు ఆదివారం లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇప్పటికే మంత్రివర్గ సిఫారసును వెనక్కి పంపిన గవర్నర్.. మరోసారి అదే బాటను ఎంచుకున్నారు. బలపరీక్షపై సరైన స్పష్టత లేదని సీఎం లేఖను వెనక్కి పంపారు. ఇదిలావుండగా.. గవర్నర్ తీరుపై గెహ్లాత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వ్యవహారశైలిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేశారు. సోమవారం మోదీకి స్వయంగా ఫోన్ చేసి గెహ్లాత్ మంత్రివర్గ తీర్మానానికి వ్యతిరేకంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. (రాజస్తాన్‌లో రాజకీయ హైడ్రామా) దీని ద్వారా రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని, ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వ జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించి, ప్రభుత్వాన్ని కాపాడాలని కోరారు. తన రాజకీయ ప్రయాణంలో గవర్నర్ ఈ విధంగా వ్యవహరించడం ఇప్పటి వరకూ చూడలేదని విమర్శించారు. మరోవైపు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. తిరుగుబాటు ఎమ్మెల్యేపై అసెంబ్లీ స్పీకర్ పీసీ జోషీ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఉపసంహరించుకున్నారు. ఇదిలావుండగా బీఎస్పీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో విలీనం చేయడంపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనిపై రాజస్తాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. (బీఎస్పీ విప్‌తో సంకట స్థితిలో గహ్లోత్ సర్కార్) -
నన్ను లాక్ చేశారని ఎవరు చెప్పారు?
జైపూర్: రాజస్తాన్ తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో తనను హోటల్లో బంధించారంటూ వస్తున్న వార్తలపై కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యే విశ్వేంద్ర సింగ్ స్పందించారు. భార్యా, కొడుకుతో తాను సరదాగా గడుతున్నానంటూ... ఇందుకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ మేరకు.. ‘‘నన్ను లాక్ చేశారని ఎవరు చెప్పారు? కుటుంబంతో సాయంత్రం! అనిరుద్ తన ప్లేట్లో ఉన్న పదార్థాలేవీ ఎప్పుడూ పూర్తి చేయడు. నాతో మాటలు పడుతూనే ఉంటాడు! ఇక శ్రీమతి తన డైట్‌ను పక్కన పెట్టేశారు!’’ అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం తాము హర్యానాలోని గురుగ్రాంలో గల ఒబెరాయ్ హోటల్లో ఉన్నట్లు వెల్లడించారు. (గెహ్లోత్ ప్రతిపాదనను తిరస్కరించిన గవర్నర్ ) కాగా విశ్వేంద్ర సింగ్.. డీగ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. రాజస్తాన్ మంత్రిగా ఉన్న ఆయన.. అశోక్ గెహ్లోత్ సర్కారుకు వ్యతిరేకంగా వ్యతిరేకంగా తిరుగుబాటు జెండా ఎగురవేసిన సచిన్ పైలట్ వర్గంలో ఉన్నారు. ఇక తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ బలవంతంగా హోటల్‌కు తరలించి, బంధించందంటూ సీఎం గెహ్లోత్ ఆరోపణలు గుప్పించిన నేపథ్యంలో ఈ మేరకు సోమవారం ఆయన ట్వీట్ చేయడం గమనార్హం. కాగా సచిన్ పైలట్ సహా ఆయనకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలపై స్పీకర్ సీపీ జోషి అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారికి ఊరట కల్పించిన రాజస్తాన్ హైకోర్టు.. సోమవారం వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన స్పీకర్.. తాజాగా తన పిటిషన్‌ను వెనక్కి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. Who says I am locked ? An evening with my family ! Been a while ! Anirudh has always is being told off by me for not finishing everything in his plate. Wifey for once indulged in food, keeping aside her diet fusses! @OberoiGurgaon pic.twitter.com/5UbfeuWsRe — Vishvendra Singh Bharatpur (@vishvendrabtp) July 26, 2020 -
రాజస్తాన్ హైడ్రామా : స్పీకర్ పిటిషన్ వెనక్కి..
జైపూర్ : రాజస్తాన్‌లో రాజకీయ హైడ్రామా కొనసాగుతోంది. అశోక్ గహ్లోత్ సర్కార్‌పై సచిన్ పైలట్ తిరుగుబాటుతో నెలకొన్న ఉత్కంఠకు తెరపడలేదు. తిరుగుబాటు నేత సచిన్ పైలట్ సహా అసంతృప్త ఎమ్మెల్యేలకు జారీచేసిన అనర్హత పిటిషన్లపై హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను రాజస్తాన్ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషీ సోమవారం ఉపసంహరించుకున్నారు. మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్‌తో పాటు ఆయనకు మద్దతిస్తున్న 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ప్రక్రియను వాయిదా వేయాలని ఈనెల 21న రాజస్ధాన్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ స్పీకర్ సీపీ జోషీ సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. రాజస్తాన్ హైకోర్టు ఈనెల 24న యథాతథ స్ధితి కొనసాగించాలని ఆదేశిస్తూ జారీ చేసిన సమగ్ర ఉత్తర్వుల్లో సుప్రీంకోర్టు లేవనెత్తిన న్యాయపరమైన అంశాలన్నింటినీ ప్రస్తావించినందున ఈ పిటిషన్‌ను ఉపసంహరించేందుకు అనుమతించాలని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్‌ను స్పీకర్ సీపీ జోషీ కోరారు. జోషీ తరపు న్యాయవాది కపిల్ సిబల్ వినతి మేరకు పిటిషన్ ఉపసంహరణకు అనుమతించేందుకు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కృష్ణ మురారి సభ్యులుగా ఉన్న సుప్రీంకోర్టు బెంచ్ అంగీకరించింది. మరోవైపు రాజస్తాన్ అసెంబ్లీ సమావేశాలను జూలై 31 నుంచి ప్రారంభించాల్సిందిగా కోరుతూ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ నేతృత్వంలోని కేబినెట్ గవర్నర్ కల్రాజ్ మిశ్రాకు పంపిన ప్రతిపాదనను గవర్నర్ తోసిపుచ్చారు. కేంద్రం ఒత్తిడికారణంగానే గవర్నర్ అసెంబ్లీని సమావేశపర్చే నిర్ణయం తీసుకోవడం లేదని కాంగ్రెస్ ఆరోపించింది. అర్థం లేని కారణాలు చూపుతూ అసెంబ్లీని సమావేశపర్చడం లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి అభి షేక్ సింఘ్వీ విమర్శించారు. మరోవైపు... ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడాన్ని తప్పుబడుతూ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌ను రాజస్తాన్ హైకోర్టు నేడు విచారించనుంది. ఈ క్రమంలో బీఎస్పీ సైతం ఈ విషయంలో హైకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. చదవండి : ప్రధాని ఎదుట ధర్నా చేస్తాం -
ముఖ్యమంత్రి ప్రతిపాదన బుట్టదాఖలు!
జైపూర్: రాజస్తాన్ రాజకీయాల్లో పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. జూలై 31 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేసిన గహ్లోత్ ప్రభుత్వ ప్రతిపాదనను గవర్నర్ కల్రాజ్ మిశ్రా మరోసారి తిరస్కరించారు. మహమ్మారి కరోనా వ్యాప్తిపై చర్చ, రాష్ట్ర ఆర్థిక స్థితి, అత్యవసరంగా చేపట్టాల్సిన బిల్లులు.. తదితర అంశాలపై చర్చించేందుకు అసెంబ్లీని సమావేశపరచాలంటూ ముఖ్యమంత్రి చేసిన వినతి బుట్టదాఖలే అయింది. ఇక అనర్హత వేటుకు గురైన సచిన్ పైలట్ వర్గానికి ఊరట కలిగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాజస్తాన్ స్పీకర్ సీపీ జోషి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. మరోవైపు... ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడాన్ని తప్పుబడుతూ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌ను రాజస్తాన్ హైకోర్టు నేడు విచారించనుంది. ఈ క్రమంలో బీఎస్పీ సైతం ఇదే అంశంపై హైకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమచారం. తాజా పరిణామాల నేపథ్యంలో బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైంది. ఒకవేళ విశ్వాస పరీక్ష అనివార్యమైతే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాల్సిందిగా ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలకు ఆమె విప్ జారీ చేయడంతో ఉత్కంఠ మరింత పెరిగింది. (రాహుల్ సేనపై దృష్టి) కాగా, బీఎస్పీ ఎమ్మెల్యేలను ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల సమయంలో ఈ విషయంపై మాయావతి కేంద్ర ఎన్నికల సంఘాన్ని సంప్రదించగా.. ఇది స్పీకర్ పరిధిలోని అంశమని.. తాము జోక్యం చేసుకోలేమని ఈసీ స్పష్టం చేసింది. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో బీఎస్పీ జారీ చేసిన విప్ ఏ మేరకు చెల్లుబాటు అవుతుందన్నది కీలకం కానుంది. ఇక ఢిల్లీ స్థాయిలో బీజేపీ పెద్దల ఒత్తిడితో రాష్ట్ర గవర్నర్ నిర్ణయాలు తీసుకుంటున్నారని సీఎం గహ్లోత్ గవర్నర్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ భేటీ కోరుతూ శుక్రవారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసిన ధర్నా అనంతరం, ఆరు అంశాల్లో ప్రభుత్వం నుంచి గవర్నర్ వివరణ కోరారు. పూర్తి వివరాలతో మళ్లీ ప్రతిపాదనలు పంపాలని సీఎంకు చెప్పారు. అదే విధంగా మెజారిటీ ఉన్నప్పుడు మళ్లీ నిరూపించుకోవాల్సిన అవసరమేంటని గవర్నర్ ప్రశ్నించారు. దాంతో శనివారం మళ్లీ సమావేశమైన కేబినెట్ ఈనెల 31 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాల్సిందిగా కొత్త ప్రతిపాదన పంపినప్పటికీ గవర్నర్ సోమవారం దానిని తిరస్కరించారు. -
రాహుల్ సేనపై దృష్టి
న్యూఢిల్లీ: జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్ తదితర తనకు సన్నిహితులైన యువ నాయకులకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండగా రాహుల్ గాంధీ పార్టీలో కీలక బాధ్యతలను అప్పగించారు. జ్యోతిరాదిత్య సింధియా మధ్యప్రదేశ్‌లో తిరుగుబాటు చేసి, బీజేపీలో చేరి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చారు. తాజాగా, రాజస్తాన్‌లో సచిన్ పైలట్ రాష్ట్రంలో నాయకత్వ మార్పు కోరుతూ సీఎం గహ్లోత్‌పై తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. దాంతో, ఇప్పుడు అందరి దృష్టి రాహుల్ బ్రిగేడ్‌లో మిగిలిన నాయకులపై పడింది. ‘తరువాత ఎవరు?’ అనే ప్రశ్న కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. ‘అత్యంత తక్కువ సమయంలో పార్టీలో ఉన్నత స్థాయికి వెళ్లినవారే బయటకు వెళ్లారంటే పార్టీ తీరులో ఏదో లోపం ఉన్నట్లే’ అని సీడబ్ల్యూసీ సభ్యుడొకరు వ్యాఖ్యానించారు. రాహుల్ సన్నిహితులకు పార్టీలో కీలక పదవులు దక్కడాన్ని పార్టీలో కొందరు జీర్ణించుకోలేకపోయారని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం రాహుల్ సేనలో హరియాణా మాజీ పీసీసీ చీఫ్ అశోక్ తన్వర్, మధ్యప్రదేశ్ మాజీ పీసీసీ అధ్యక్షుడు అరుణ్ యాదవ్, మహారాష్ట్రలో మిలింద్ దేవ్రా, సంజయ్ నిరుపమ్, పంజాబ్ మాజీ పీసీసీ అధ్యక్షుడు ప్రతాప్ సింగ్ బాజ్వా, కర్ణాటకలో సీనియర్ నేత దినేశ్ గుండూరావు ఉన్నారు. వీరిలో చాలామంది గతంలో పీసీసీ అధ్యక్షులుగా పనిచేశారని, పదవి పోవడంతో పార్టీలో గ్రూప్ రాజకీయాలు ప్రారంభించారని పార్టీ వర్గాలు తెలిపాయి. నమ్మకంతో బాధ్యతలు అప్పగిస్తే.. కొందరు రాహుల్‌కు విశ్వాసఘాతకులుగా మారారన్నాయి. -
గెహ్లాత్ ఎత్తుగడ: గవర్నర్‌కు కొత్త ప్రతిపాదన
జైపూర్ : రాజస్తాన్ రాజకీయం పూటకో మలుపు తిరుగుతోంది. నిన్నటి వరకు అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని పట్టుపట్టిన ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ తాజాగా మరో కొత్త ఎత్తుగడ వేశారు. ఆదివారం గవర్నర్‌కు రాసిన లేఖలో జూలై 31 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా నియంత్రణ, పరీక్షలు, సహా వివిధ అంశాలపై చర్చించాలని అజెండాలో వివరించారు. కానీ బలపరీక్ష అంశం అజెండాలో మాత్రం ప్రస్తావించలేదు. దీనిపై గవర్నర్ తుది నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. అయితే గవర్నర్‌కు సమర్పించిన లేఖ బలపరీక్ష అంశం లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై చర్చించేందుకు ఆదివారం కేబినెట్ సమావేశం నిర్వహించారు. అనంతరం అజెండాను తయారుచేసి గవర్నర్‌కు అందించారు. (ప్రధాని ఎదుట ధర్నా చేస్తాం) వ్యూహంలో భాగంగా సీఎం కొత్త ఎత్తుగడ వేశారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే మూడు సార్లు కల్‌రాజ్‌మిశ్రాతో భేటీ అయిన గెహ్లాత్ ఫోర్ల్‌టెస్ట్‌కు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. గవర్నర్ ఎంతకీ స్పందించకపోవడంతో శుక్రవారం రాజ్‌భవన్ ముందు ధర్నాకు దిగారు. రాష్ట్రంలో సంక్షోభం సమసిపోయేందుకు జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతిని కలిసి కోరుతామనీ, అవసరమైతే ప్రధాని నివాసం ఎదుట ధర్నా చేపడతామన్నారని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నేత వెల్లడించారు. (వేడి రగిల్చిన పైలట్ దారెటు?) -
ప్రధాని ఎదుట ధర్నా చేస్తాం
జైపూర్/న్యూఢిల్లీ: రాజస్తాన్ రాజకీయ పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తమ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించాలని రాష్ట్రపతిని కలిసి కోరతామనీ, అవసరమైతే ప్రధానమంత్రి నివాసం ఎదుట ధర్నాకు దిగుతామని ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ప్రకటించారు. ఈ నెల 31వ తేదీన అసెంబ్లీని సమావేశపరచాలని గవర్నర్‌ను కోరాలని రాష్ట్ర కేబినెట్ శనివారం తీర్మానించింది. బీజేపీ కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడుతోందంటూ కాంగ్రెస్ శ్రేణులు శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. ప్రస్తుతం జైపూర్‌లోని ఓ హోటల్లో మకాం వేసిన తమ విధేయ ఎమ్మెల్యేలతో సీఎం గహ్లోత్ శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గహ్లోత్.. రాష్ట్రంలో సంక్షోభం సమసిపోయేందుకు జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతిని కలిసి కోరుతామనీ, అవసరమైతే ప్రధాని నివాసం ఎదుట ధర్నా చేపడతామన్నారని పార్టీకి చెందిన ఓ నేత వెల్లడించారు. హోటల్లో కనీసం మరో 21 రోజులు మకాం కొనసాగించేందుకు సిద్ధంగా ఉండాలని కూడా ఎమ్మెల్యేలను కోరారన్నారు. మెజారిటీ సభ్యుల బలం తమకు ఉన్నందున బీజేపీ కుట్రలేవీ సాగవని తెలిపారన్నారు. రాజ్యాంగాన్ని లోబడి నడుచుకుంటున్నాననీ, తనపై ఎటువంటి ఒత్తిడులు లేవని గవర్నర్ మిశ్రా చెప్పడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శుక్రవారం రాత్రి రాజ్‌భవన్ ఎదుట ఆందోళనకు విరమించారు. అయితే.. ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ ఏ మేరకు ఉంది, ప్రభుత్వానికి మెజారిటీ ఉన్నప్పటికీ సభను సత్వరమే సమావేశ పరచాలనే డిమాండ్‌కు కారణం తదితర ఆరు అంశాలపై స్పష్టతనివ్వాలని సీఎం గహ్లోత్‌ను గవర్నర్ కోరారు. దీంతో శనివారం సీఎం గహ్లోత్ నేతృత్వంలో కేబినెట్ సమావేశమై ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చలు జరిపింది. ఈనెల 31వ తేదీన అసెంబ్లీని సమావేశపరచాలని గవర్నర్‌ను కోరాలని నిర్ణయించింది. అయితే, గవర్నర్‌తో ముఖ్యమంత్రి గహ్లోత్ భేటీపై తుది నిర్ణయం తీసుకోలేదు. కాంగ్రెస్ నిరసన ప్రదర్శనలు తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రపన్నిందంటూ కాంగ్రెస్ శ్రేణులు శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు జైపూర్‌తోపాటు జిల్లా కేంద్రాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని బీజేపీ వ్యతిరేక నినాదాలు చేశారు. అసెంబ్లీని వెంటనే సమావేశపరచాలని గవర్నర్‌ను డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశం జరగకుండా బీజేపీ ప్రయత్నిస్తోందని పీసీసీ అధ్యక్షుడు గోవింద్æ ఆరోపించారు. అరాచక వాతావరణం సృష్టించింది: బీజేపీ రాజస్తాన్‌లో అశోక్ గహ్లోత్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక వాతావరణం సృష్టించిందని బీజేపీ ఆరోపించింది. అసెంబ్లీని సమావేశపరిచేందుకు ఆదేశాలు ఇవ్వాలనే డిమాండ్‌తో గవర్నర్ కార్యాలయాన్ని భయపెట్టేందుకే రాజ్‌భవన్ ఎదుట గహ్లోత్ ఆందోళన చేపట్టారని ఆరోపించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్ పూనియా నేతృత్వంలోని 15 మంది సభ్యుల బృందం శనివారం గవర్నర్ మిశ్రాను కలిసివినతి పత్రం అందజేసింది. అనంతరం బీజేపీ శాసనసభా పక్షనేత గులాబ్ చంద్ కటారియా మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ హక్కు పేరుతో రాజ్‌భవన్ వద్ద కాంగ్రెస్ ఆడిన డ్రామా దురదృష్టకరం. ఏ ఎజెండా లేకుండానే శాసనసభను సమావేశపరచాలని ప్రభుత్వం గవర్నర్‌ను కోరింది. ఇలా గవర్నర్‌పై ఒత్తిడి తేవడం రాజ్యాంగ విలువలను అగౌరవపరచడమే’ అని ఆయన అన్నారు. ï రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయాలని గవర్నర్‌ను కోరారా? అని మీడియా ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని ఆయన చెప్పారు. -
వేడి రగిల్చిన పైలట్ దారెటు?
జైపూర్/ఢిల్లీ: రాజస్తాన్ ప్రభుత్వంపై తిరుగుబాటుతో దేశవ్యాప్తంగా రాజకీయ వేడి రగిల్చిన సచిన్ పైలట్, అతని వర్గం అనర్హతకు గురవుతుందా? అలా అయితే, యువనేత తీసుకునే నిర్ణయం ఏమై ఉంటుందనే ప్రశ్నలు రాజకీయ ఉద్ధండుల నుంచి సామాన్యుల వరకు తొలుస్తున్నాయి. స్పీకర్ సీపీ జోషి అనర్హత వేటు నిర్ణయంపై పైలట్ కోర్టుకెక్కగా.. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని చెప్పిన హైకోర్టు నిన్న కూడా మరోసారి అలాంటి ఉత్తర్వులే జారీ చేసింది. సోమవారం వరకు సంయమనం పాటించాలని, అప్పటి వరకు స్టేటస్ కో (యథాతథ స్థితి) కొనసాగించాలని స్పీకర్‌ను ఆదేశించింది. దీంతో రెండు వారాల క్రితం మొదలైన రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. (చదవండి: సీఎం అశోక్ గహ్లోత్ కీలక వ్యాఖ్యలు) కాషాయంపై ఆసక్తి లేదు సీఎం అశోక్ గహ్లోత్‌తో విభేదాలతో ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన పైలట్ కాంగ్రెస్ అధిష్టానం ఎన్ని చర్చలు జరిపినా దిగిరాలేదు. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరుతారనే వార్తలు వినిపించాయి. అయితే, తాను కాంగ్రెస్ మనిషినని, కమలం పార్టీలో చేరేది లేదని పైలట్ తెగేసి చెప్పారు. గహ్లోత్‌తో మాత్రమే తన పంచాయితీ అని తెలిపారు. మరోవైపు పైలట్‌కు, అతని వర్గం ఎమ్మెల్యేలకు ఇప్పటికీ తలుపులు తెరిచే కాంగ్రెస్ అధిష్టానం చెప్తుండగా పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. గహ్లోత్ వర్గం పైలట్‌ను పూర్తిగా దూరం పెట్టినట్టుగా కనిపిస్తోంది. ఈ క్రమంలో పైలట్‌పై అనర్హత వేటు విషయం పక్కనపెడితో రాజకీయంగా అతని నిర్ణయంపై మాత్రం ఉత్కంఠ నెలకొంది. గహ్లోత్‌తో విభేదాలు మర్చిపోయి.. హస్తం పార్టీలో ఇమడలేక, కాషాయ తీర్థం పుచ్చుకోలేక సొంత పార్తీ వైపే పైలట్ అడుగులు పడతాయేమో చూడాలి!! ప్రగతి శీల కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా మాదిరిగా కాంగ్రెస్‌కు ‘నై’అని బీజేపీలో కీలక నేతగా ఎదుగుదామనుకున్న పైలట్‌కు అదంతా చిన్న విషయం కాదని తెలిసిపోయినట్టుంది. మాజీ సీఎం, సీనియర్ నేత వసుంధర రాజే పార్టీలో ఉండగా పైలట్‌కు అక్కడ తగిన ప్రాధాన్యం దొరకడం సాధ్యం కాదు. ఇదంతా తెలుసుకునే పైలట్ కాషాయానికి దూరంగా ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి పదవే లక్ష్యంగా సొంత పార్టీపై తిరుగుబాటు చేసిన పైలట్ ‘ప్రగతి శీల కాంగ్రెస్’ పేరుతో పార్టీ పెట్టాలని అనుచర వర్గం కోరుతోందనే వార్తలూ వినిపిస్తున్నాయి. తనకు 30 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని అసమ్మతి గళం ఎత్తిన పైలట్‌కు సొంత పార్టీయే మేలు చేస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. (భార్య ప్రేమ కోసం సైకిల్ మీద ఖండాంతరాలు దాటి..) -
స్వతంత్రుల చేతుల్లోకి గెహ్లాత్ ప్రభుత్వం..!
జైపూర్ : ఎడారి రాష్ట్రం రాజస్తాన్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం ఎంతకీ వీడటంలేదు. నిన్నటి వరకు రిసార్టులు, న్యాయస్థానాల వేదికగా చోటుచేసుకున్న హైడ్రామా తాజాగా గవర్నర్ అధికారికి నివాసమైన రాజ్‌భవన్‌కు చేరింది. హైకోర్టు ఉత్తర్వుల నేపపథ్యంలో తిరుగుబాటు నేతల నుంచి తమ ప్రభుత్వానికి ముంపు పొంచి ఉందన్న విషయాన్ని పసిగట్టిన ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ పరిస్థితి చేయిదాటకముందే బల నిరూపణ చేసుకోవాలని వ్యూహాలు రచించారు. అయితే కాంగ్రెస్ ప్రయత్నాలకు గవర్నర్ కల్రాజ్ మిశ్రా మోకాలొడ్డుతున్నారు. ప్రస్తుతమున్న కోవిడ్ పరిస్థితుల్లో అసెంబ్లీని సమావేశపరిచేలా చర్యలు తీసుకోలేనని తేల్చిచెప్పారు. దీంతో అధికార పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా.. అదికాస్తా రాజ్‌భవన్ ఎదుట ధర్నాకు దారితీసింది. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి అత్యవసరంగా మంత్రివర్గాన్ని సమావేశపరిచిన గెహ్లాత్.. శాసనసభను సమావేశపరచాలని తీర్మాన్నించారు. (రాజ్‌భవన్ ఎదుటే బైటాయింపు) గవర్నర్‌కు వేరే మార్గం లేదు.. అంతేకాకుండా అసెంబ్లీలో తనకు 102 మంది సభ్యుల మద్దతుందని గవర్నర్‌కు విన్నపించారు. ఈ నివేదికను శనివారం ఉదయమే గవర్నర్‌కు పంపనున్నారు. మరోవైపు రాజస్తాన్ గవర్నర్ తీరుపై పలువురు విశ్లేషకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇదే సమస్య ఉత్పన్నమైనప్పడు కర్ణాటకలో వ్యవహరించిన రీతిలో ఇక్కడ గవర్నర్ వ్యహరించకపోవడానికి రాజకీయ పరమైన ఒత్తిడే కారనమని అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యక్షంగా తలదూర్చలేని కేంద్రం గవర్నర్‌ను పావుగా ఉపయోగించుకుని గెహ్లాత్ వ్యూహాలకు చెక్పెడుతుందన్న విమర్శా వినిపిస్తోంది. మరోవైపు అసెంబ్లీని సమావేశపర్చే విషయంలో మంత్రి మండలి సిఫారసులను ఆమోదించడం మినహా గవర్నర్‌కు వేరే మార్గం లేదని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. (రాజస్తాన్ సంక్షోభం : పైలట్‌కు భారీ ఊరట) సర్కార్ ఊడుతుందా..? రాజ్యాంగంలోని ఆర్టికల్ 175 ప్రకారం నడుచుకుంటానని చివరకు గవర్నర్ హామీ ఇవ్వడంతో కాంగ్రెస్ ఆగ్రహం కొంత చల్లబడినట్లు కనిపిస్తోంది. అసెంబ్లీ సమావేశంపై శనివారం మధ్యాహ్నంలోపు గవర్నర్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చే అవకాశం ఉందని సీఎం భావిస్తున్నారు. ఈ మేరకు బలపరీక్షకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే అధికార పార్టీకి చెందిన 19 మంది సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఉంటడంతో గెహ్లాత్ భవిష్యత్ అంతా స్వతంత్ర ఎమ్మెల్యేల చేతుల్లోకి వెళ్లింది. వారి నిర్ణయంపైనే సర్కార్ ఊడుతుందా..? నిలబడుతుందా అనేది ఆధారపడి ఉంది. -
రాజ్‌భవన్ ఎదుటే బైటాయింపు
జైపూర్: రాజస్తాన్‌లో రాజకీయ డ్రామా కొనసాగుతోంది. తాజాగా, గవర్నర్ అధికార నివాసమైన రాజ్‌భవన్‌కు వేదిక మారింది. సోమవారం నుంచి అసెంబ్లీని సమావేశపర్చాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌కు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు రాజ్‌భవన్ వద్ద శుక్రవారం సాయంత్రం ధర్నాకు దిగారు. రాజ్‌భవన్‌లోనికి వెళ్లిన గహ్లోత్ గవర్నర్ కల్రాజ్ మిశ్రాతో మాట్లాడారు. ఆ తరువాత గవర్నర్ రాజ్‌భవన్ ప్రాంగణంలో ఉన్న ఎమ్మెల్యేల వద్దకు వచ్చి మాట్లాడారు. అసెంబ్లీ భేటీపై ప్రకటన చేసే వరకు ధర్నా చేస్తా్తమని ఎమ్మెల్యేలు తేల్చిచెప్పారు. అసెంబ్లీని సమావేశపర్చే విషయంలో రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటానని గవర్నర్ హామీ ఇవ్వడంతో ఐదు గంటల అనంతరం ఎమ్మెల్యేలు ధర్నా విరమించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 174 ప్రకారం నడుచుకుంటానని గవర్నర్ హామీ ఇచ్చారని కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా వెల్లడించారు. అయితే, సీఎం నుంచి గవర్నర్ కొన్ని వివరణలు కోరారని, వాటిపై ఈ రాత్రి కేబినెట్ భేటీలో గహ్లోత్ నిర్ణయం తీసుకుంటారని వివరించారు. అయితే, అసెంబ్లీని సమావేశపర్చే విషయంలో మంత్రి మండలి సిఫారసులను ఆమోదించడం మినహా గవర్నర్‌కు వేరే మార్గం లేదని న్యాయ నిపుణులు తెలిపారు. జైపూర్ శివార్లలోని ఒక హోటల్లో ఉంటున్న ఎమ్మెల్యేలు నాలుగు బస్సుల్లో అక్కడి నుంచి గహ్లోత్ నేతృత్వంలో రాజ్‌భవన్ చేరుకున్నారు. అంతకుముందు, ఆ హోటల్ వద్ద గహ్లోత్ మీడియాతో మాట్లాడుతూ గవర్నర్‌పై విమర్శలు గుప్పించారు. గవర్నర్‌ను తన రాజ్యాంగబద్ధ విధులు నిర్వర్తించనివ్వకుండా ‘పై’నుంచి ఒత్తిడి వస్తోందని పరోక్షంగా కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. అసెంబ్లీని సోమవారం నుంచి సమావేశపర్చాలని కోరుతూ గురువారమే గవర్నర్‌కు లేఖ రాశామని, ఇప్పటివరకు స్పందించలేదన్నారు. ప్రజలు రాజ్‌భవన్‌ను ముట్టడిస్తే తమది బాధ్యత కాబోదన్నారు. 103 మంది ఎమ్మెల్యేలు రాజ్‌భవన్ వద్ద ధర్నా చేస్తున్నారని, ఇకనైనా గవర్నర్ అసెంబ్లీని సమావేశపర్చేందుకు ఆదేశాలను ఇవ్వాలని రాష్ట్ర మంత్రి సుభాష్ గార్గ్ డిమాండ్ చేశారు. రాజ్‌భవన్ వద్ద ఘర్షణ వద్దని, గాంధీ మార్గంలో నిరసన తెలపాలని ఎమ్మెల్యేలకు గహ్లోత్ విజ్ఞప్తి చేశారు. తన ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ ఉందని, అసెంబ్లీ వేదికగానే ఆవిషయాన్ని రుజువు చేస్తామని గహ్లోత్ పేర్కొన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న హరియాణాలో ఆ ఎమ్మెల్యేలను బౌన్సర్లను పెట్టి వారిని ఎక్కడికి వెళ్లకుండా నిర్బంధించారని ఆరోపించారు. ఇప్పుడే అసెంబ్లీని సమావేశపర్చవద్దని గవర్నర్‌పై ఒత్తిడి వస్తోందని గహ్లోత్ ఆరోపించారు. ‘రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి, కరోనా వైరస్ విస్తృతి, ఆర్థిక రంగ దుస్థితిపై చర్చించేందుకు అసెంబ్లీని సోమవారం నుంచి సమావేశపర్చాలని కేబినెట్ భేటీ అనంతరం గవర్నర్‌ను కోరాం. కానీ, ఇప్పటివరకు గవర్నర్ నుంచి స్పందన లేదు. పైలట్ వర్గం ప్రస్తుతానికి సేఫ్ సచిన్ పైలట్ వర్గం ఎమ్మెల్యేలపై స్పీకర్ జారీ చేసిన అనర్హత నోటీసులపై శుక్రవారం హైకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, తదుపరి ఉత్తర్వులిచ్చేవరకు యథాతథ స్థితి కొనసాగించాలని స్పష్టం చేసింది. తాజాగా, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఈ కేసులో ప్రతివాదిగా చేర్చడానికి కోర్టు ఆమోదం తెలిపింది. హైకోర్టులో రిట్ పిటషన్‌పై విచారణ సాగుతుండగానే.. అసెంబ్లీ స్పీకర్ జోషి బుధవారం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. మరోవైపు, కాంగ్రెస్‌లో కొన్ని నెలల క్రితం ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలు చేరడాన్ని చట్ట విరుద్ధంగా పేర్కొంటూ, ఆ విలీనాన్ని రద్దు చేయాలని కోరుతూ బీజేపీ ఎమ్మెల్యే మదన్ దిలావర్ శుక్రవారం హైకోర్టులో కేసు వేశారు. ఆ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్‌ను అభ్యర్థించానని, దానిపై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోలేదని ఆ ఎమ్మెల్యే పిటిషన్లో వివరించారు. ఈ కేసుపై సోమవారం విచారణ జరగనుంది. ఆ బీఎస్పీ ఎమ్మెల్యేల విలీనంతోనే గహ్లోత్ సర్కారు పూర్తి మెజారిటీ సాధించగలిగింది. -
ఎవరి బలమెంతో అక్కడే తేలుతుంది
-
అందుకే గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు!
జైపూర్: రాజస్తాన్ రాజకీయాల్లో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ కేంద్రంపై ఆరోపణలు గుప్పించారు. కేంద్రం ఒత్తిడి కారణంగానే గవర్నర్ కల్రాజ్ మిశ్రా తమకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఆరోపించారు. కర్ణాటక, మధ్యప్రదేశ్‌లలో ప్రభుత్వాలను కూల్చిన విధంగానే రాజస్తాన్‌లో కూడా బీజేపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. అసెంబ్లీలో బల నిరూపణకు సిద్ధంగా ఉన్నామని.. ఎవరి బలమెంతో అక్కడే తేలుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఐకమత్యంగా ఉన్నారని.. మెజారిటీ నిరూపించుకుని తీరతామని ధీమా వ్యక్తం చేశారు. (రాజస్తాన్ సంక్షోభం : పైలట్ వర్గానికి ఊరట) అదే విధంగా కొంతమంది అసంతృప్త నేతలు కూడా అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉందని గెహ్లోత్ అభిప్రాయపడ్డారు. కేంద్రం నుంచి ఒత్తిడి వస్తున్న కారణంగానే గవర్నర్ తమను కలిసేందుకు అనుమతి ఇవ్వలేదన్న ఆయన.. రాజ్‌భవన్‌ను ప్రజలు ముట్టడిస్తే తాము బాధ్యత వహించబోమన్నారు. కాగా సీఎం అశోక్ గెహ్లోత్ ఆరోపణలను ఖండించిన గవర్నర్ కల్రాజ్ మిశ్రా.. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయడం సబబు కాదని పేర్కొన్నారు. ఇక గెహ్లోత్ సర్కారుపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన సచిన్ పైలట్ సహా 19 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అధ్యక్షతన ఏర్పాటు చేసిన పార్టీ సమావేశానికి హాజరుకానందున శాసనసభ స్పీకర్ అనర్హత నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పైలట్ వర్గం హైకోర్టును ఆశ్రయించగా.. శుక్రవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం తిరుగుబాటు ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పీకర్‌ను ఆదేశించింది. ఈ విషయంలో సంయమనం పాటించాలని పేర్కొంటూ.. యథాతథ స్థితిని (స్టేటస్ కో) కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సచిన్ పైలట్ వర్గానికి ఊరట లభించింది. ఈ నేపథ్యంలో తీర్పు వెలువడిన వెంటనే సీఎం గెహ్లోత్ గవర్నర్‌ను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరారు. -
రాజస్తాన్ సంక్షోభం : గెహ్లాత్‌కు చుక్కెదురు
-
రాజస్తాన్ సంక్షోభం : పైలట్‌కు భారీ ఊరట
జైపూర్ : రాజస్తాన్ రాజకీయలు మరో మలుపు తిరిగాయి. హైకోర్టులో అశోక్ గెహ్లాత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. తాజా సంక్షోభంలో కేంద్ర ప్రభుత్వాన్ని భాగస్వామ్యంగా చేర్చాలన్న తిరుగుబాటు నేత సచిన్ పైలట్ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. స్వీకర్ జారీచేసిన అనర్హత నోటీసులపై శుక్రవారం విచారణ ప్రారంభించిన న్యాయస్థానం సచిన్ పైలట్ దాఖలు చేసిన పిటిషన్‌కు అనుమతినిచ్చింది. మరోవైపు తాజా పరిస్థితుల నేపథ్యంలో సచిన్ పైలట్ వర్గానికి ఊరట లభించింది. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు స్పీకర్‌ను ఆదేశించింది. పరిస్థితులు చక్కబడేవరకు సంయమనం పాటించాలని సూచించింది. ఎమ్మెల్యేల అనర్హత నోటీసులపై శుక్రవారం న్యాయస్థానం విచారించింది. ఈ సందర్భంగా యథాతథ స్థితిని (స్టేటస్ కో) పాటించాలని న్యాయస్థానం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో గత రెండు వారాలుగా సాగుతున్న రాజకీయ సంక్షోభానికి తాత్కాలికంగా తెరపడింది. (రాజస్తాన్ హైడ్రామా : సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు) కాగా ముఖ్యమంత్రి అధ్యక్షతన ఏర్పాటు చేసిన పార్టీ సమావేశానికి హాజరుకానందున 19 మంది ఎమ్మెల్యేలకు శాసనసభ స్పీకర్ అనర్హత నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో పైలట్ వర్గం హైకోర్టును ఆశ్రయించింది. అక్కడ స్పీకర్ నోటీసులపై విచారణ సాగుతుండగానే ప్రభుత్వం.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పు తమ తుది తీర్పు లోబడి ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం ప్రకటించడంతో తాజాగా వెలువరించే తీర్పుపై మొదటినుంచీ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. -
ట్రిగ్గర్ నొక్కిన వేళ్లను ఆదేశించిన మెదళ్లేవి?
ఇవ్వాళ నిన్న రెండు పతాక శీర్షికలు పక్కపక్కనే మన ప్రజాస్వామ్య స్వతంత్ర న్యాయ రక్షకభట బాధ్యతల గురించి నమ్మకాలు, అనుమానాలు పెంచేవి. జూలై 22: పైలట్‌కు హైకోర్టులో ఊరట. దాని పక్కవార్త, ఎమ్మెల్యేను హత్య చేసిన 11 మంది పోలీసుల నేరం రుజువు. జూలై 23: హైకోర్టు ఉత్తర్వుపై సుప్రీంకోర్టుకు స్పీకర్.. విచారణ ఈరోజు. పక్కవార్త: 11 మంది పోలీసులకు హత్య కేసులో యావజ్జీవ కారాగారశిక్ష. విచిత్రమేమంటే ఈ రెండూ రాజస్తాన్ రాజకుతంత్రాలే. ఒకవైపు ఊరించే రాజకీయ యుద్ధభేరీలు, ఒకవైపు మెదళ్ల కుదుళ్లను కుదిపిలేపే పోలీసు హత్యలు. ఆవైపు ఒక్కరోజులో ఆకస్మిక అద్భుత న్యాయం. ఈ వైపు మూడున్నర తరాల కాలం పాటు (35ఏళ్లు) నేరం రుజువుకాక రాజ్యమేలిన పోలీసు ఎన్కౌంటర్ న్యాయం. ఏ దేశంలో నైనా ఇంత గొప్ప వైవిధ్యం ఉంటుందా? రాజ్యాంగ పాలనకు నిలువెత్తు అద్దాలివి. రాజస్తాన్ ప్రభుత్వాన్ని కూల్చడానికి విఠలాచార్య (పూర్వ అపూర్వ జానపద చిత్ర దర్శకుడు) లెవల్ కుట్రలు జరుగుతున్నాయి. ప్రజలు ఎడతెగని కత్తి యుద్ధాల్ని చూస్తూ ప్రపంచాన్ని మరిచిపోతూ ఉంటారు. కొనుక్కున్న ఎమ్మెల్యేలు సరిపోవడం లేదు. తూకానికి ఇంకా బరువు కావాలంటే గెహ్లోత్ వర్గం సరుకు అయిదుతారల పూటకూళ్ల మందిరంలో రక్షకభటుల రక్షణలో నిలువ చేయబడ్డారు. సచిన్ పైలట్ వారి సరుకు మరొక నక్షత్ర భోజనవసతిశాలలో భద్రంగా భద్రతా దళాల మధ్య సేదతీరుతున్నారు. ఆ విధంగా పోలీసులు మన ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తుంటే రాజ్యాంగ న్యాయం చేయడానికి కళ్లకు గంతలు కట్టుకుని చేత కత్తి బట్టుకుని మరోచేత్తో తరాజు పట్టుకుని పామును తొక్కుతూ (ఎక్కడ పడతారో తెలియదు) న్యాయదేవతను రమ్మని వకీళ్లు ఆవాహనచేస్తున్నారు. అటు గెహ్లాట్ ఇటు పైలట్. ఇరువురూ బరువులే. బలమైన పార్టీలు వారి వెంట ఉన్నాయి. స్పీకర్ ఏదో ఒక నిర్ణయంతీసుకునే దాకా మనకళ్లగంతలు విప్పవద్దురా నాయనా అని సుప్రీంకోర్టు పదేపదే చెప్పింది. అయినా కత్తి తిప్పుతున్నది రాజస్తాన్ హైకోర్టు. ‘‘స్పీకర్ గారూ నేను ఇంకో రెండు రోజుల తరువాత మీ సంగతి చెబుతాను అందాకా ఏమీచేయకండి ప్లీజ్’’ అని బతిమాలింది. పాతగుర్రాల తబేలా నుంచి గుర్రాలు పారిపోకుండా ఉండాలని కట్లు, ఆ కట్లు తెంపి తరలించుకుపోవడానికి ప్రయత్నాలు. మహాఘనత వహించిన రాజస్తాన్ ఎమ్మె ల్యేలను వారి శిబిరాలనుండి కిడ్నాప్ చేయడానికి చట్టాలు, రాజ్యాంగం, రక్షకభటులు, (సైన్యాన్ని ఒక్కటి వాడడం లేదేమో) అనే రకరకాల పద్మవ్యూహాలను అల్లుతున్న సమయంలో ఒక్కరోజు గడువు ఇచ్చినా బేరసారాల వ్యాపారానికి కొత్త ఊపు వస్తుందని అందరికీ తెలుసు. కానీ చేతిలో కత్తి, కళ్లకు గంతలు. కాలికింద పాము. పీత కష్టాలు పీతవి. సుప్రీంకోర్టు వారు కూడా తమ విలువైన సమయాన్ని వాడి రాజస్తాన్‌లో రాజ్యం గాన్ని రక్షించడానికి జూలై 23న ప్రయత్నిస్తామన్నారు. చివరికి గురువారం రాజస్తాన్ హైకోర్టు విచారణపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తిరిగీ హైకోర్టుకే వెళ్లాలని సూచించింది. నాలుగైదు రోజులనుంచి కరోనాకన్నా గొప్ప కలకలం సృష్టిస్తున్న వార్త ఏదైనా ఉంటే అది సచిన్ పైలట్ ఆత్మనిర్భర యజ్ఞమే. నిజం చెప్పిన బుల్లెట్లు : మరొకవైపు గొంతుచించుకుని అరిచే మీడియా కథనాలు అల్లే కథ 1985 పోలీసు హత్యాకాండ. రాజామాన్‌సింగ్ ఆనాటి భరత్పూర్ రాజు. భరత్పూర్ రాజ్యపతాకాన్ని కాంగ్రెస్ నాయకులు అవమానిస్తుంటే రాజామాన్‌సింగ్ ఆవేశ పడి ఫిబ్రవరి 20, 1985న రాజస్తాన్ ముఖ్యమంత్రి శివచరణ్ మాథుర్ ఎన్నికల సభావేదిక వైపు తన మిలిటరీ వాహనంతో శరవేగంగా దూసుకువచ్చి అక్కడ ఆగిన హెలికాఫ్టర్‌ను ఢీకొన్నాడట. హత్యాప్రయత్నమని కేసుపెట్టారు. మరునాడు ఫిబ్రవరి 21న పోలీసుస్టేషన్లో లొంగి పోవడానికి ఠాకూర్ హరిసింగ్, ఠాకూర్ సుమర్ సింగ్‌తో కలిసి వెళ్తున్నారు. పకడ్బందీగా అల్లిన కుట్ర ప్రకారం డిఎస్పీ కాన్ సింగ్ భాటి అతని అనుచర పోలీసులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి ముగ్గురినీ చంపేశారు. ఆనాడది ఎన్ కౌంటర్. తమపై కాల్పులు జరుపుతూ ఉంటే ఎదురు కాల్పులు జరిపామని పాతకట్టుకథే. మాన్సింగ్ వీపులో వెనుకనుంచి దిగబడిన బుల్లెట్లు నిజం చెప్పాయి. కోర్టు నిజం వినిపించుకున్నది. మరునాడు ముఖ్యమంత్రి రాజీ నామా చేయడం 1985నాటి విలువ. 35 ఏళ్లకైనా ఎన్ కౌంటర్ హత్య రుజువుకావడానికి కారణం హత్యకేసు పెట్టడమే. ఇప్పుడు కేసు పెడుతున్నారా? ఇందులోకూడా హైకోర్టు సుప్రీంకోర్టుల్లో తుది న్యాయం ఎన్నేళ్లకు, ఎవరికి దక్కుతుందో తెలియదు. అయినా ట్రిగ్గర్ నొక్కిన పోలీసు వేళ్లను ఆదేశించిన మెదళ్లు కోర్టులకు దొరుకుతాయా? నక్కలు, తమ జిత్తుల రాజకుట్రలకు వకీళ్లను, కోర్టులను, పోలీసులను వాడుకుంటారనే పాఠం అర్థమవుతున్నదా? వ్యాసకర్త మాడభూషి శ్రీధర్ బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
‘అమెరికా ల్యాబ్‌లో తేల్చుకుందాం’
జైపూర్: రాజస్తాన్‌లో కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలతో కొంత నీరసించినా, ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ మాత్రం ప్రతిపక్షాలకు దీటుగా బదులిస్తున్నాడు. తాము విడుదల చేసిన ఆడియో టేపులు సరియైనవో కాదో అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పరీక్షిద్దామని బీజేపీకి సవాలు విసిరారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల గహ్లోత్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్‌తోపాటు మరో ఇద్దరి ప్రమేయం వున్నదని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఆడియో టేపులు విడుదల చేయడంతో రాజస్తాన్‌లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అయితే బీజేపీ వారు రాష్ట్ర దర్యాప్తు సంస్థలను, తాము బీజేపీకి చెందిన సీబీఐని విశ్వసించమని, అందువల్ల ఇరు పార్టీలు యూఎస్(అమెరికా)ఫోరెన్సిక్ ల్యాబ్‌లో ఆడియో టేపులను పరీక్షిద్దామని గెహ్లోత్ తెలిపారు. బీజేపీ నేతలు ప్రధాని నరేంద్ర మోదీని తప్పుదోవ పట్టిస్తున్నారని ఇటీవల మోదీకి గెహ్లోత్ లేఖ రాశారు. మరోవైపు తిరుగుబాటు నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్‌పై మాటల దాడిని ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కొనసాగించారు. రాజస్థాన్ లో మొత్తం శాసనసభ్యుల సంఖ్య 200 కాగా, మ్యాజిక్ ఫిగర్ 101. నిన్నటి వరకు కాంగ్రెస్‌కు 107మంది సభ్యుల బలం ఉంది. సచిన్ పైలట్ వర్గం తిరుగుబాటు జెండా ఎగురవేయడంతో రాజస్తాన్ రాజకీయాలు ఏ మలుపు తిరగనున్నాయో త్వరలో తేలనుంది. -
రాజస్తాన్ హైడ్రామా : గహ్లోత్ సర్కార్‌కు షాక్
సాక్షి, న్యూఢిల్లీ : అనర్హత నోటీసులను సవాల్ చేస్తూ తిరుగుబాటు నేత సచిన్ పైలట్ సహా అసంతృప్తి ఎమ్మెల్యేల పిటిషన్లపై ఉత్తర్వులు జారీ చేయకుండా రాజస్తాన్ హైకోర్టును నిలువరించలేమని సర్వోన్నత న్యాయస్ధానం గురువారం స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై విచారణను హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు బదలాయించాలని రాజస్తాన్ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ప్రజాస్వామ్యంలో అసమ్మతి స్వరాలను అణిచివేయలేమని సుప్రీంకోర్టు పేర్కొంటూ పైలట్ సహా 19 మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలకు అనర్హత నోటీసుల జారీకి కారణాలను వివరించాలని రాజస్తాన్ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషీని వివరణ కోరింది. అసంతృప్త ఎమ్మెల్యేలు పార్టీ సమావేశాలకు హాజరు కాకపోవడంతో పాటు సొంత ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్రపన్నారని స్పీకర్ జోషి తరపున వాదనలు వినిపిస్తూ సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ కోర్టుకు నివేదించారు. ఇది మామూలు విషయయం కాదని..ఈ ఎమ్మెల్యేలు ఎన్నికైన ప్రజా ప్రతినిధులని ఈ దశలో జోక్యం చేసుకున్న జస్టిస్ అరుణ్ మిశ్రా పేర్కొన్నారు. అసమ్మతి ఎమ్మెల్యేలపై అనర్హత ప్రక్రియ అనుమించదగినదా..కాదా అనేది నిర్దారించేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఈ ఎమ్మెల్యేలు హరియాణాలో హోటల్లో గడుపుతూ మీడియాకు అభిప్రాయాలు వెల్లడిస్తున్నారని....వారు ప్రభుత్వం బలపరీక్షను ఎదుర్కోవాలని కోరుతున్నారని కపిల్ సిబల్ కోర్టుకు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ దశలో అనర్హత నోటీసులపై కోర్టులు జోక్యం చేసుకోజాలవని వాదించారు. కాగా సచిన్ పైలట్ సహా 19 మంది ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌పై ఈనెల 24న ఉత్తర్వులు జారీ చేసే వరకూ వారిపై అనర్హత ప్రక్రియను చేపట్టరాదని రాజస్తాన్ హైకోర్టు ఈనెల 21న స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. రాజస్తాన్ హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ అసెంబ్లీ స్పీకర్ జోషీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చదవండి : అనర్హతపై కోర్టు జోక్యమా! -
‘అలా అయితే నా రాజకీయ జీవితం ముగిసినట్టే’
జైపూర్: రాజస్తాన్ రాజకీయాలు రోజురోజుకు ముదిరి న్యాయస్థానం మెట్లు ఎక్కిన విషయం తెలిసిందే. పార్టీ శాసనసభాపక్ష సమావేశానికి గైర్హాజరు అంశాన్ని తీవ్రంగా భావించిన ముఖ్యమంత్రి ఆశోక్ గెహ్లాట్ దానికి గల కారణాలను వెంటనే తమ ముందుంచాలని ఆదేశించారు. దీంతో సచిన్ పైలట్‌తో సహా సమావేశానికి హాజరుకానీ 19 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ నోటీసులు జారీ చేసింది. అంతే కాకుండా వారిపై అనర్హత వేటును వేస్తూ నోటీసులు పంపింది. చదవండి: ‘మీ పోరాటాన్ని యావత్ భారత్ గమనిస్తోంది’ అనర్హత నోటీసులపై సచిన్ పైలట్ వర్గం రాజస్తాన్ హైకోర్టును ఆశ్రయించింది. తమకు జారీచేసిన నోటీసులను సవాలు చేస్తూ 19 మంది ఎమ్మెల్యేలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీని గురించి సచిన్ పైలట్ ...‘ఒక వేళ తీర్పు తనకు వ్యతిరేకంగా వస్తే నా రాజకీయ జీవితం ఇంకా ముగిసినట్లే అని తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు’ తెలుస్తోంది. ఒకవేళ తనకు అనుకూలంగా తీర్పు వస్తే తన హక్కుల విషయంలో కాంగ్రెస్ పార్టీతో పోరాడతానని చెప్పినట్లు కథనాలు వినిపిస్తున్నాయి. తాము శాసన సభలో పార్టీని వ్యతిరేకించలేదని, తమకు భిన్న అభిప్రాయాలు ఉండటం వల్ల పార్టీ సమావేశానికి హాజరు కాలేదని సచిన్ వర్గీయులు తెలిపారు. ఇది యాంటీ డిఫెక్షన్ కిందకు రాదని వారంటున్నారు. ఆశోక్ గెహ్లాట్ నాయకత్వాన్ని సచిన్ పైలట్ వర్గీయులు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు అయింది. రాజస్థాన్ హైకోర్టు విచారణపై స్టే విధించేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. 19 మంది ఎమ్మెల్యేల అనర్హత విషయంలో హైకోర్టు తీర్పు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. చదవండి: పైలట్‌పై గహ్లోత్ సంచలన వ్యాఖ్యలు -
సుప్రీంకోర్టులో రాజస్థాన్ రాజకీయా సంక్షోభంపై వాదనలు
-
అనర్హతపై కోర్టు జోక్యమా?
న్యూఢిల్లీ: స్పీకర్ ముందు పెండింగ్‌లో ఉన్న ఎమ్మెల్యేల అనర్హతను నిర్ణయించే విషయంలో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవడం ఎప్పుడూ ఊహించలేనిదని రాజస్తాన్ అసెంబ్లీ స్పీకర్ సి.పి.జోషి పేర్కొన్నారు. ఇది అంతిమంగా రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 19 మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించి నిర్ణయం తీసుకునే విషయంలో ఈనెల 24వరకు తనను నిరోధిస్తూ రాష్ట్రహైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు బుధవారం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. జూలై 21న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుపై మధ్యంతర స్టే విధించాలని కోరారు. తమ పిటిషన్‌పై విచారణ చేపట్టాలన్నారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్లో ఉన్న ఆర్టికల్ 212లో పేరా 6(2) ప్రకారం స్పీకర్ తీసుకునే చర్యల్లో(చట్టసభ సభ్యులపై అనర్హత వేటుకు సంబంధించి) న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదని తెలిపారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వు చట్ట విరుద్ధమని స్పష్టం చేశారు. ఇది స్పీకర్ అధికారాలను తగ్గించి వేయడమే అవుతుందన్నారు. స్పీకర్ పిటిషన్‌పై నేడు సుప్రీం విచారణ అసెంబ్లీ స్పీకర్ సి.పి.జోషి పిటిషన్‌పై జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ బి.ఆర్.గావై, జస్టిస్ కృష్ణ మురారితో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టనుంది. ఈ మేరకు జూలై 23న విచారణకు వచ్చే పిటిషన్ల జాబితాలో దీన్ని చేర్చింది. ఈ సమాచారాన్ని తన అధికారిక వెబ్సైట్లో పొందుపర్చింది. స్పీకర్ పిటిషన్‌పై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దు రాజస్తాన్ శాసన సభ స్పీకర్ దాఖలు చేసిన పిటిషన్‌పై తన వాదన, తన మద్దతుదారులైన ఎమ్మెల్యేల వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయొద్దని మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం కోర్టులో కేవియెట్ దాఖలు చేశారు. జోషి పిటిషన్‌పై ఇప్పుడే ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దని, తమ వాదన సైతం వినాలని సచిన్ పైలట్ కోరుతున్నారు. తప్పుడు ఆరోపణలపై క్షమాపణ చెప్పు బీజేపీలో చేరాలంటూ తనకు రూ.కోట్లు ఎర చూపారని సంచలన ఆరోపణలు చేసిన రాజస్తాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గిరిరాజ్‌సింగ్ మాలింగకు మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ బుధవారం తన అడ్వొకేట్ ద్వారా నోటీసు జారీ చేశారు. మాలింగ అబద్ధాలకోరు అని దుయ్యబట్టారు. తప్పుడు ఆరోపణలు చేసినందుకు గాను ప్రసార మాధ్యమాల సమక్షంలో లిఖితపూర్వకంగా సమాధానం చెప్పాలని, ఒక రూపాయి చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. దీనిపై వారం రోజుల్లోగా స్పందించాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. 2019 డిసెంబర్లో సచిన్ పైలట్ నివాసంలోనే తనను ప్రలోభాలకు గురి చేశారని గిరిరాజ్‌సింగ్ మాలింగ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే, 7 నెలలుగా ఆయన మౌనంగా ఎందుకు ఉన్నారో, ఇప్పుడే ఎందుకు ఆరోపణలు చేస్తున్నారో చెప్పాలని సచిన్ పైలట్ డిమాండ్ చేశారు. మాలింగ ప్రస్తుతం ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ క్యాంపులో ఉన్నారు. సచిన్ పైలట్ నుంచి తనకు ఇప్పటిదాకా ఎలాంటి నోటీసు రాలేదని, దీనిపై ఇప్పుడేమీ మాట్లాడలేనని మాలింగ చెప్పారు. మోదీకి గహ్లోత్ లేఖ మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు తమ ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయని సీఎం గహ్లోత్ ఆరోపించారు. కుట్రదారుల్లో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఉన్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తూ ఆదివారం ఒక లేఖ రాశారు. ‘ఇదంతా మీకు తెలుసో లేదో నాకు తెలియదు. కానీ, కొందరు మమ్మిల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు’ అని మోదీని ఉద్దేశించి పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని కూల్చివేయాలనుకోవడం ప్రజాతీర్పును అపహాస్యం చేయడం, రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కడమే అవుతుందన్నారు. గత ఏడాది కాలంలో కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో ఇలాంటి అనుచిత ఘటనలే చోటుచేసుకున్నాయని అశోక్ గహ్లోత్ గుర్తుచేశారు. గహ్లోత్ సోదరుడి నివాసాలపై ఈడీ దాడులు 2007–09 నాటి ఎరువుల కుంభకోణంతో సంబంధం ఉన్న మనీ ల్యాండరింగ్ కేసులో రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ సోదరుడు, విత్తనాలు, ఎరువుల సంస్థ ‘అనుపమ్ కృషి’ వ్యవస్థాపకుడు అగ్రసేన్ గహ్లోత్ నివాసాలతోపాటు దేశవ్యాప్తంగా 13 ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బధవారం దాడులు నిర్వహించింది. అశోక్ గహ్లోత్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య రాజకీయ విభేదాలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో ఈ దాడులు జరగడం గమనార్హం. జోద్పూర్ జిల్లాలోని మాందోర్ ప్రాంతంలో ఉన్న అగ్రసేన్ ఇల్లు, ఫామ్‌హౌస్‌లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. సీఆర్పీఎఫ్ జవాన్ల రక్షణ మధ్య ఈ సోదాలు జరిగాయి. అగ్రసేన్తో సంబంధాలున్న కాంగ్రెస్ మాజీ ఎంపీ నివాసం, ఇద్దరు రాజస్తాన్ కాంగ్రెస్ నాయకులు, మరో వ్యాపార సంస్థపైనా ఈడీ దాడులు జరిగాయి. రాజస్తాన్‌లో 6 ప్రాంతాల్లో, పశ్చిమబెంగాల్లో 2, గుజరాత్లో 4, ఢిల్లీలో ఒక ప్రాంతంలో దాడులు చేసినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. రాజస్తాన్‌లో 2007– 09లో మారియేట్ ఆఫ్ పొటాష్(ఎంఓపీ)ను రైతులపై రాయితీపై సరఫరా చేశారు. ఈ వ్యవహారంలో అవకతవకలు జరిగాయని, రూ.60 కోట్లు పక్కదారి పట్టాయని ఆరోపణలు వచ్చాయి. ఈడీ ఫిర్యాదు మేరకు మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం కింద(పీఎంఎల్ఏ) కేసు నమోదైంది. దాడులతో బెదిరించలేరు: సూర్జేవాలా మోదీ దేశంలో దాడుల రాజ్యం సృష్టిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా బుధవారం మండిపడ్డారు. ఈ దాడులకు తమ పార్టీ భయపడే ప్రసక్తే లేదని అన్నారు. రాష్ట్ర ఎమ్మెల్యేలు, ప్రజలు బీజేపీలో పన్నిన ఉచ్చులో చిక్కుకోలేదని పేర్కొన్నారు. అందుకే ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ సోదరుడి నివాసంపై దాడులు ప్రారంభించారని ఆరోపించారు. -
కాంగ్రెస్ ఎమ్మెల్యేకు సచిన్ పైలట్ నోటీసు
జైపూర్ : బీజేపీలో చేరితే తనకు 35 కోట్ల రూపాయలు అందచేస్తానని ప్రలోభాలకు గురిచేశారని తిరుగుబాటు నేత సచిన్ పైలట్‌పై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే గిరిరాజ్ సింగ్ మలింగకు రెబెల్ నేత షాక్ ఇచ్చారు. తనపై ముడుపుల ఆరోపణలు చేసిన గిరిరాజ్ సింగ్‌కు పైలట్ బుధవారం లీగల్ నోటీసులు పంపారు. తమ నేతపై నిరాధార, తప్పుడు ఆరోపణలు చేసిన గిరిరాజ్ సింగ్‌కు నోటీసులు జారీ చేశారని పైలట్ వర్గీయులు నిర్ధారించారు. కాగా పైలట్ తనతో సంప్రదింపులు జరుపుతూ పార్టీ మారేందుకు మీకు ఎంత మొత్తం కావాలని అడిగారని, 35 కోట్ల రూపాయలు అందిస్తామని చెప్పారని గిరిరాజ్ సింగ్ మంగళవారం తిరుగుబాటునేతపై ఆరోపణలు గుప్పించారు. గత ఏడాది డిసెంబర్ నుంచి బేరసారాలు సాగుతున్నాయని..తాను ఇలాంటి పనికి పాల్పడలేనని వారికి చెప్పానని..రెండు మూడు సార్లు పైలట్‌తోనూ మాట్లాడానని కాంగ్రెస్ ఎమ్మెల్యే పేర్కొన్నారు. గిరిరాజ్ సింగ్ మలింగ ఆరోపణలను సచిన్ పైలట్ తోసిపుచ్చారు. ఇవి నిరాధార ఆరోపణలని, తన ప్రతిష్టను మసకబార్చేందుకు కాంగ్రెస్ నేతలు దిగజారి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇక అశోక్ గహ్లోత్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ తిరుగుబాటు నేత సచిన్ పైలట్‌ను ఉపముఖ్యమంత్రితో పాటు, కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ పదవుల నుంచి కాంగ్రెస్ తొలగించింది. మరోవైపు పైలట్ సహా 18 మంది ఆయన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ జారీ చేసిన అనర్హత నోటీసుల వ్యవహారంపై ప్రస్తుతం న్యాయస్ధానంలో విచారణ జరుగుతోంది. కాగా తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు పైలట్ బీజేపీతో కలిసి కుట్రపన్నారని ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఆరోపిస్తుండగా బీజేపీతో కలిసేదిలేదని పైలట్ స్పష్టం చేస్తున్నారు. చదవండి : సచిన్ పైలట్ వర్గానికి 24 వరకు ఊరట -
సచిన్ పైలట్ వర్గానికి 24 వరకు ఊరట
జైపూర్: అనర్హత నోటీసులకు సంబంధించి రాజస్తాన్ కాంగ్రెస్ తిరుగుబాటు నేత సచిన్ పైలట్, ఆయన వర్గం 18 మంది ఎమ్మెల్యేలకు మంగళవారం హైకోర్టులో కొంత ఊరట లభించింది. ఆ నోటీసులను సవాలు చేస్తూ పైలట్ వర్గం దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై శుక్రవారం తీర్పునిస్తామని, అప్పటివరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషికి హైకోర్టు సూచించింది. స్పీకర్ జారీ చేసిన అనర్హత నోటీసులపై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇంద్రజిత్ మహంతి, జస్టిస్ ప్రకాశ్ గుప్తా ధర్మాసనం ముందు వాదనలు ముగిశాయి. శుక్రవారంలోగా తమ వాదనలను లిఖిత పూర్వకంగా సమర్పించాలని ధర్మాసనం ఇరు వర్గాలను ఆదేశించింది. అయితే, ఈ కేసుకు సంబంధించి శుక్రవారం కోర్టు తుది తీర్పును ప్రకటిస్తుందా? లేక మధ్యంతర ఉత్తర్వులను ఇస్తుందా? అనే విషయంలో స్పష్టత లేదు. మరోవైపు, తిరుగుబాటు నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్‌పై మాటల దాడిని ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కొనసాగించారు. పార్టీని మోసం చేసిన వారు ప్రజలకు ముఖం చూపించలేరని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోందని తెలిసినా.. తన విశ్వాసం సడలలేదని, ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుంటానన్న నమ్మకం తనకుందని పేర్కొన్నారు. ‘కరోనా వైరస్‌తో అంతా పోరాడుతున్న సమయంలో.. పీసీసీ చీఫ్ కొందరు ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నారు. దీన్ని సహించబోం’ అని పైలట్ పేరెత్తకుండా మంగళవారం జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్ష భేటీలో ఆరోపణలు గుప్పించారు. వారం రోజుల వ్యవధిలో సీఎల్పీ భేటీ జరగడం ఇది మూడోసారి. జైపూర్ శివార్లలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విడిది చేసిన హోటల్లోనే ఈ సీఎల్పీ సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, అజయ్ మాకెన్, రణ్‌దీప్ సూర్జేవాలా, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ అవినాశ్ పాండే తదితరులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. సీఎల్పీ భేటీ అనంతరం సీఎం గహ్లోత్ నివాసంలో కేబినెట్ సమావేశం నిర్వహించారు. కరోనాపై పోరు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సంక్షేమ పథకాలు.. తదితరాలపై కేబినెట్ భేటీలో చర్చించారని అధికారులు తెలిపారు. -
సీబీఐకి గహ్లోత్ పొగ
రాజస్తాన్ కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలు చివరకు సీబీఐకి ఆ రాష్ట్రంలో తలుపులు మూశాయి. దాడులు నిర్వహించాల్సివున్నా, దర్యాప్తు చేయాల్సివున్నా ఆ సంస్థ ముందుగా తమ అనుమతి తీసుకోవడం తప్పనిసరంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం హుకుం జారీ చేసింది. గహ్లోత్ ప్రభుత్వాన్ని కూల్చడానికి జరిగిన కుట్రలో కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్‌తోపాటు మరో ఇద్దరి ప్రమేయం వున్నదని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఆడియో టేపులు విడుదల చేయడం పర్యవసానంగా అక్కడి రాజకీయ సంక్షోభం కొత్త మలుపు తీసుకుంది. ఆ టేపుల వ్యవహారంపై రాజస్తాన్ పోలీస్ విభాగం స్పెషల్ ఆపరేషన్ గ్రూప్(ఎస్ఓజీ) దర్యాప్తు మొదలుపెట్టడం, హరియాణాలోని అయిదు నక్షత్రాల హోట ల్లో కొలువుదీరిన అసమ్మతి కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరిని ప్రశ్నించడానికి ఆర్భాటంగా వెళ్లడం అందరూ చూశారు. అటు టెలిఫోన్ ట్యాపింగ్‌పై సీబీఐ దర్యాప్తు జరపాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఆ కారణంతోనే సీబీఐ ముందస్తు అనుమతి పొందాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. రాజస్తాన్ సంక్షోభంలో అంతిమంగా ఎవరిది పైచేయి అవుతుందన్న సంగతలా వుంచితే... సీబీఐ పదే పదే ఇలాంటి నింద ఎదుర్కొనక తప్పడం లేదని మరోసారి రుజువైంది. కేంద్రంలో అధికారంలో వుండే వారు చెప్పినట్టుగా వింటుందన్న అభియోగం సీబీఐపై ఎప్పటినుంచో వుంది. ఆ సంస్థ డైరెక్టర్లుగా వున్నవారు ఆ నిందను రూపుమాపడానికి బదులు దాన్ని బలపరిచేవిధంగానే ప్రవర్తించారు. కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో ఇదంతా బాహాటంగా సాగింది. కనుకనే ఒక దశలో స్వయంగా సర్వోన్నత న్యాయస్థానమే దాన్ని ‘పంజరంలో చిలుక’గా అభి వర్ణించింది. బొగ్గు కుంభకోణంలో దర్యాప్తు నివేదికలను నిర్దిష్ట సమయంలో సుప్రీంకోర్టుకు సీల్డ్ కవర్లో సమర్పించాల్సివుండగా, అంతకన్నా ముందు ఆ నివేదికల్ని ప్రభుత్వంలోని కీలక నేతలకు చూపుతున్నదని ఆరోపణలొచ్చాయి. మొదట్లో అదంతా అబద్ధమని కొట్టిపారేసిన సీబీఐ, చివరకు తప్పు ఒప్పుకోవాల్సివచ్చింది. ‘నిజమే... నివేదికల్ని చూపాం. అది ఇకపై జరగనివ్వబోమ’ని అఫిడ విట్ సమర్పించింది. అప్పటి ఏలికలుగా కాంగ్రెస్ నేతలే దాన్ని ఆ స్థితికి తెచ్చారు. స్వపక్షం, విపక్షం అన్న తేడా లేకుండా తమను ప్రశ్నించినవారినల్లా సీబీఐ బూచిని చూపించి బెదిరించడానికి ప్రయ త్నించిన చరిత్ర వారిది. రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తు మొదలైతే ఏం జరుగుతుందో తెలియబట్టే గహ్లోత్ ఈ ముందు జాగ్రత్త చర్య తీసుకున్నారు. గహ్లోత్ ప్రభుత్వ నిర్ణయాన్ని చూస్తే ఏడాదిన్నరక్రితం ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రవర్తించిన తీరు గుర్తొస్తుంది. ఆయన కేంద్రంపై వీరోచితంగా పోరాడుతున్నానంటూ జనాన్ని మభ్యపెట్టడానికి ప్రధాని నరేంద్ర మోదీపై వ్యక్తిగత దూషణలకు దిగేవారు. రాష్ట్రంలో అడుగుపెట్టనీయబోమంటూ శపథాలు చేసేవారు. ఒకసారి కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిరుమల వచ్చినప్పుడు కొందరితో ఆయనపై రాళ్ల దాడి చేయించారు. పోలవరం ప్రాజెక్టులోనూ, రాజధాని భూముల విషయంలోనూ అప్పటికే బాబు, ఆయన అనుచరగణం భారీయెత్తున అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. కనుక తన అవినీతి చరిత్ర అంతా బట్టబయలవుతుందేమో... సీబీఐ దర్యాప్తు తప్పదేమో అన్న బెంగ ఆయన్ను పీడించింది. దాంతో రాష్ట్రంలో ముందస్తు అనుమతి వుంటే తప్ప సీబీఐ దర్యాప్తు చేయరాదన్న ఉత్తర్వులు తెచ్చారు. చిత్రమేమంటే అధికారంలో వున్నా, విపక్షంలో వున్నా సీబీఐని కొన్నేళ్లపాటు తన జేబు సంస్థగా మార్చుకోగలిగిన చరిత్ర బాబుది. కనుకనే ఈ బాపతు నేతలందరికీ సీబీఐ మున్ముందు ఏం చేస్తుందో అందరికన్నా బాగా తెలుసు. పదవి, అధికారం ముసు గులో వాస్తవాలను మరుగుపర్చడానికి ప్రయత్నిస్తే... అందుకోసం వ్యవస్థల్ని దిగజారిస్తే వ్యక్తులతో పాటు ఆ వ్యవస్థలు కూడా దెబ్బతింటాయి. సీబీఐ అలా దెబ్బతిన్నదని ఈ నేతలు భావిస్తుండవచ్చు. కానీ అందులో తమ భాగస్వామ్యం కూడా ఎక్కువే వున్నదని ముందుగా వీరంతా ఒప్పుకోవాలి. రాజస్తాన్‌లో ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణలు తీవ్రమైనవి. డబ్బుకు ఆశపడి పార్టీ మారడానికి, ప్రభుత్వాలను కూల్చడానికి ప్రజా ప్రతినిధులే ప్రయత్నించడం అనేది ఆందోళ నకరమైన పరిణామమే. దేశంలో తరచుగా ఇలాంటివి జరుగుతూనేవున్నాయి. ఇప్పుడు ఇదంతా అన్యాయమని మొత్తుకుంటున్నవారు గతంలో ఇలాంటి పనులు చేసిన చరిత్ర వున్నవారే. ఇంతకూ సీబీఐని రాష్ట్రంలో రానీయకపోవడమన్నది గహ్లోత్ స్వీయ నిర్ణయమా లేక పార్టీ నిర్ణయమా? ఇతర రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కూడా ఇదే మాదిరి చేస్తారా అన్నది చూడాలి. పైలట్‌ను అసమర్థుడు, పనికిమాలినవాడు అని తిట్టిన గహ్లోత్ తన చర్యల తీరును కూడా పరిశీలించుకోవాలి. ఒకపక్క హరియాణా హోటల్లో పైలట్ వర్గం ఎమ్మెల్యేలు తలదాచుకోవడం తప్పంటున్న ఆయన... తన ఎమ్మెల్యేలను జైపూర్‌లోని హోటల్లో ఎందుకు వుంచాల్సివచ్చిందో చెప్పాలి. రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్‌దే గనుక తమ ఎమ్మెల్యేలను ఎవరో అపహరిస్తారన్న సంశయం ఆ పార్టీకి వుండనక్కరలేదు. అందుకవసరమైన బందోబస్తు వారి వారి ఇళ్ల దగ్గరే ఏర్పాటు చేయొచ్చు. కానీ వారిని స్వేచ్ఛగా వుంచితే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో... ఏం జరుగుతుందోనన్న బెంగ వల్లనే అధికార పక్షం సైతం తన ఎమ్మెల్యేలను హోటల్‌కు తరలించింది. మొత్తానికి సొంత ఇంటిని చక్కదిద్దుకోవడం చేతగాక కాంగ్రెస్ చేజేతులా ఈ పరిస్థితి తెచ్చుకుంది. బీఎస్పీ వగైరా పార్టీల నుంచి కొత్తగా కాంగ్రెస్‌కు వలసలు వచ్చినా ఇప్పుడున్నది అరకొర మెజారిటీయే. కనుక తక్షణం బలపరీక్ష జరిగితే ఈ లెక్కలు కూడా తారుమారై గహ్లోత్ సర్కారు చిక్కుల్లో పడినా పడొచ్చు. ఇప్పుడు గట్టెక్కినా అది దినదినగండంగా బతుకీడ్వాల్సిందే. ఈలోగా సీబీఐని రానివ్వబోమని, మరెవరినో అడ్డుకుంటామని నిర్ణయాలు తీసుకోవడం వల్ల గహ్లోత్‌కు అదనంగా ఒరిగేదేమీ వుండదు. -
‘మీ పోరాటాన్ని యావత్ భారత్ గమనిస్తోంది’
జైపూర్/ఢిల్లీ: ఎప్పటికైనా సత్యమే జయిస్తుందని రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ వ్యాఖ్యానించారు. తమ ఎమ్మెల్యేలు పోరాడుతున్న తీరును యావత్ భారత్ గమనిస్తోందని చెప్పారు. తన ప్రభుత్వానికి మద్దతిస్తున్న ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మంగళవారం మరోసారి కాంగ్రెస్ శాసన సభా పక్ష (సీఎల్పీ) భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సత్యమే దైవం, దైవమే సత్యం. సత్యం మనతో ఉంది. అసమ్మతి వాదుల కుట్రల నుంచి ప్రభుత్వాన్ని, దాంతోపాటు ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు మీరు చేస్తున్న పోరాటాన్ని దేశ ప్రజలందరూ గౌరవిస్తున్నారు. మనమంతా సర్వశక్తిమంతంగా ఉన్నాం’అని పేర్కొన్నారు. ‘మీపై ఉన్నగౌరవం ఎన్నో రెట్లు పెరిగింది. ఇది సాదారణ విషయం కాదు. అసెంబ్లీని రద్దు చేసి, ఎన్నికలు జరగాలని కాంగ్రెస్ గానీ, బీజేపీ గానీ కోరుకోలేదు. కొందరి కుట్రల వల్లే ఈ పరిస్థితులు తలెత్తాయి. అయినప్పటికీ పోరాడి విజయం సాధిద్దాం’ అని అన్నారు. ఇదిలాఉండగా.. హోటల్లో తమను నిర్బంధిచారని భారతీయ ట్రైబల్ పార్టీ (బీటీపీ) ఎమ్మెల్యే ఒకరు వారం క్రితం చెప్పడంతో గహ్లోత్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, బీటీపీ తర్వాత గహ్లోత్ ప్రభుత్వానికి స్పష్టమైన మద్దతు ప్రకటించడంతో ఆ విషయం అంతటితో ముగిసిపోయింది. ఈనేపథ్యంలోనే గహ్లోత్ వర్గం ఎమ్మెల్యేలు అంత్యాక్షరీ ఆడినవి, యోగా ఫొటోలు, వంటలు నేర్చుకుంటున్న వీడియోలను విడుదల చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రజలు కరోనా వైరస్‌తో పోరాడుతుంటే సీఎం, ఎమ్మెల్యేలు పార్టీలు చేసుకుంటున్నారని బీజేపీ విమర్శలు చేస్తోంది. ఇక అసమ్మతి ఎమ్మెల్యేల అనర్హతపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని హైకోర్టు రాజస్తాన్ స్పీకర్‌ను నేడు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై వచ్చే శుక్రవారం (జులై 24) హైకోర్టు తీర్పు వెలువరించనుంది. (చదవండి: రాజస్తాన్: సచిన్ పైలట్‌కు హైకోర్టులో ఊరట) (అసమర్థుడు.. పనికిరాని వాడు! ) -
సచిన్ పైలట్‌కు హైకోర్టులో ఊరట
-
రాజస్తాన్: సచిన్ పైలట్‌కు హైకోర్టులో ఊరట
జైపూర్/ఢిల్లీ: రాజస్తాన్‌లో రాజకీయ సంక్షోభానికి కారణమైన అసమ్మతి నేత సచిన్ పైలట్‌కు రాష్ట్ర హైకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 24 వరకు రెబల్ ఎమ్మెల్యేల అనర్హతపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని హైకోర్టు రాజస్తాన్ స్పీకర్‌ను ఆదేశించింది. అనర్హత ఎమ్మెల్యేల పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం వాదనలు ముగిసిన అనంతరం ఈ మేరకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై వచ్చే శుక్రవారం (జులై 24) హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ఇక రాజస్తాన్ మంత్రివర్గం కాసేపట్లో భేటీ కానున్నట్టు తెలుస్తోంది. కాగా, అశోక్ గహ్లోత్ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత సచిన్ పైలట్, అతని వర్గం ఎమ్మెల్యేలు 18 మంది తిరుగుబాటు బావుటా ఎగరేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ శాసన సభా పక్షం రెండు భేటీలకూ వారు హాజరు కాలేదు. దాంతో సచిన్ సహా 19 మంది అసమ్మతి ఎమ్మెల్యేలపై అనర్హతన వేటు వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విప్ ధిక్కరణపై స్పీకర్ సీపీ జోషి వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయితే, నిబంధనలు అనుసరించకుండా తమకు నోటీసులు ఇచ్చారని పేర్కొంటూ అసమ్మతి ఎమ్మెల్యేలు కోర్టు మెట్లెక్కారు. (చదవండి: అసమర్థుడు.. పనికిరాని వాడు!) (ఛత్తీస్‌గఢ్ సీఎంపై మండిపడ్డ ఒమర్ అబ్దుల్లా) -
సచిన్ పైలట్ బావ మరిది కాబట్టే..
శ్రీనగర్: రాజస్తాన్‌లోని రాజకీయ పరిణామాలు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా మధ్య మాటల యుద్ధానికి తెరతీశాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన తన బావ సచిన్ పైలట్‌ను లక్ష్యంగా చేసుకుని తమపై విమర్శలకు దిగిన భూపేశ్ భగేల్‌పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఒమర్ హెచ్చరించారు. హానికరమైన, తప్పుడు ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి తీరుతో విసిగిపోయానని.. అందుకే పార్టీ పరిస్థితి ఇలా ఉందంటూ ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు స్పందించిన భూపేశ్ భగేల్.. తాను అడిగింది కేవలం ఒక ప్రశ్నేనని, ఇకపై కూడా అలాగే అడుగుతూ ఉంటానని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని.. ఇలాంటి సమయంలో తన మాటలను అవకాశంగా మలచుకునేందుకు ప్రయత్నించవద్దంటూ హితవు పలికారు. ఇందుకు బదులిచ్చిన ఒమర్.. ‘‘నా లాయర్లకు మీరు మీ సమాధానాలు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పు ఇదే. మీకు మీ స్నేహితులెవరో, వ్యతిరేకులు ఎవరో తెలియదు. అందుకే ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో చిక్కుకుపోయారు. మీ ప్రశ్న హానికరమైనది’’ అంటూ కౌంటర్ ఇచ్చారు. (నిర్బంధం నుంచి ఒమర్ అబ్దుల్లా విడుదల) సచిన్ పైలట్ బావమరిది కాబట్టే.. కాగా గత కొన్ని రోజులుగా రాజస్తాన్‌లో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై భూపేశ్ భగేల్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. సచిన్ పైలట్ తిరుగుబాటుకు, జమ్మూ కశ్మీర్ నేతలు ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా గృహ నిర్బంధం నుంచి విడుదల కావడానికి సంబంధం ఉన్నట్లు భావిస్తున్నానన్నారు. సచిన్ పైలట్ మామ, బావ మరిది అయినందు వల్లే వీరికి విముక్తి కలిగి ఉండవచ్చని సందేహం వ్యక్తం చేశారు. ఈ మేరకు.. ‘‘రాజస్తాన్‌లో జరుగుతున్న సంఘటనలను, సచిన్ పైలట్ తీరును జాగ్రత్తగా పరిశీలిస్తే.. ఒమర్ అబ్దుల్లా ఎందుకు విడుదలయ్యాడో అర్థం చేసుకోవచ్చు. ఒమర్‌తో పాటు మెహబూబా ముఫ్తి(జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం)కూడా హౌజ్ అరెస్ట్ అయ్యారు. కానీ ముఫ్తీజీ మాత్రం నేటికీ ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. కానీ సచిన్ పైలట్ బావ మరిది అయినందు వల్ల ఒమర్‌కు విముక్తి లభించింది’’అంటూ సచిన్ పైలట్ ఎపిసోడ్, ఆయనతో రాజస్తాన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర పన్ని.. అందుకు ప్రతిఫలంగా ఒమర్‌ను విడుదల చేశారనే అర్థంలో నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన ఒమర్ అబ్దుల్లా... తమ పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించిన భూపేశ్ భగేల్‌పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని.. ఆయన తన లాయర్లకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అన్యాయంగా తమ నాయకులను నిర్బంధంలో ఉంచితే చట్టపరంగా సవాలు చేసి విముక్తి పొందారంటూ భూపేశ్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఎన్సీ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా ఒమర్ అబ్దుల్లా సోదరి సారా అబ్దుల్లా సచిన్ పైలట్‌ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇరు కుటుంబాల మధ్య సాన్నిహిత్యం ఉన్నప్పటికీ తొలుత వీరి ప్రేమకు అంగీకారం లభించకపోవడంతో పెద్దలను ఎదిరించి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కొన్నాళ్లు గడిచిన తర్వాత విభేదాలన్నీ తొలగిపోయి ఇరు కుటుంబాలు కలిసి పోవడంతో కథ సుఖాంతమైంది. I am fed up of the downright malicious and false allegation that what Sachin Pilot is doing is somehow linked to my or my father’s release from detention earlier this year. Enough is enough. Mr @bhupeshbaghel will be hearing from my lawyers. Cc @RahulGandhi @INCIndia @rssurjewala https://t.co/Gojb7vN1V3 — Omar Abdullah (@OmarAbdullah) July 20, 2020 -
పనికిమాలిన పైలట్..!
-
అసమర్థుడు.. పనికిరాని వాడు!
జైపూర్ : తిరుగుబాటు నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్‌పై రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ సోమవారం తీవ్ర స్థాయిలో మాటల దాడి చేశారు. ‘అసమర్ధుడు, పనికిరాని వాడు’ అంటూ నోరు చేసుకున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉండగా పైలట్ పార్టీ కోసం ఏమీ చేయలేదని హిందీలో ‘నాకారా, నికమ్మా’ అంటూ దూషణలకు దిగారు. అయినా, పార్టీ పరువును దృష్టిలో పెట్టుకుని ఎవరూ ఏమీ మాట్లాడలేదని, పీసీసీ చీఫ్‌ను మార్చాలని కోరలేదని వివరించారు. పైలట్ పేరును ప్రస్తావించకుండా, మాజీ యువ సహచరుడు అంటూ సంబోధించారు. ‘నేనేమైనా కూరగాయాలు అమ్మడానికి వచ్చానా? ముఖ్యమంత్రి కావడానికే వచ్చాను అనేవాడు’ అంటూ పైలట్‌పై విమర్శలు గుప్పించారు. ‘ఒక పీసీసీ అధ్యక్షుడు పార్టీకి వెన్నుపోటు పొడవడం బాధాకరం. నా ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి బీజేపీ చేస్తున్న కుట్ర ఫలించదు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీనే అది దెబ్బతీస్తుంది’ అని గహ్లోత్ మండిపడ్డారు. సాధారణంగా బీజేపీ, బీజేపీ ప్రభుత్వాల తరఫున న్యాయస్థానాల్లో వాదించే ముకుల్ రోహత్గీ, హరీశ్ సాల్వేలు పైలట్ తరఫున హైకోర్టులో వాదించడాన్ని గహ్లోత్ ప్రస్తావించారు. వారి ఫీజు కోట్లలో ఉంటుందని, ఆ మొత్తాన్ని పైలట్ స్వయంగా చెల్లిస్తున్నారా? అని ప్రశ్నించారు. 30 కోట్లా.. 35 కోట్లా? బీజేపీలో చేరాలని కోరుతూ తనకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చేందుకు పైలట్ ప్రయత్నించారని కాంగ్రెస్ ఎమ్మెల్యే గిరిరాజ్ సింగ్ మలింగ ఆరోపించారు. ‘పైలట్‌జీ నాతో మాట్లాడారు. బీజేపీలో చేరాలని అడిగారు. పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తామన్నారు. బీజేపీలో చేరడం నాకు ఇష్టం లేదని చెప్పాను’ అని వివరించారు. ఈ విషయాన్ని వెంటనే సీఎం గహ్లోత్ దృష్టికి తీసుకువెళ్లానన్నారు. ఎంత మొత్తం ఇస్తామన్నారు? రూ. 30 కోట్లా లేక రూ. 35 కోట్టా? అని ప్రశ్నించగా.. ప్రస్తుతం నడుస్తున్న రేటే అంటూ సమాధానమిచ్చారు. ఇవి నిరాధారమని, తన ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఈ ఆరోపణలు చేస్తున్నారని సచిన్ పైలట్ చెప్పారు. ముందస్తు అనుమతితోనే సీబీ‘ఐ’ దర్యాప్తుల విషయంలో సీబీఐకి ఇచ్చిన ‘సాధారణ అనుమతి’ని రాజస్తాన్ ప్రభుత్వం తాజాగా ఉపసంహరించుకుంది. ఇకపై దాడులు చేయాలన్నా, ఎటువంటి విచారణ జరపాలన్నా, కేసుల వారీగా సీబీఐ ముందుస్తుగా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కాగా, గహ్లోత్ ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర పన్నారని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ తెరపైకి తెచ్చిన ఆడియో టేప్‌లు నకిలీవని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మరోసారి పేర్కొన్నారు. -
పైలట్‌పై గహ్లోత్ సంచలన వ్యాఖ్యలు
జైపూర్ : రాజస్ధాన్‌లో రాజకీయ హైడ్రామా కొనసాగుతోంది. తిరుగుబాటు నేత సచిన్ పైలట్‌పై ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ విమర్శల దాడి పెంచారు. పైలట్ కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు పొడిచారని గహ్లోత్ ఆరోపించారు. ఎవరన్ని కుట్రలు పన్నినా సత్యమే గెలుస్తుందని, తన ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని ధీమా వ్యక్తం చేశారు. సచిన్ పైలట్ పనికిరాడని తమకు తెలిసినా ఏడేళ్లుగా రాష్ట్ర పీసీసీ చీఫ్‌ను మార్చలేదని గహ్లోత్ పేర్కొన్నారు. మరోవైపు సచిన్ పైలట్ సహా 18 మంది రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ జారీ చేసిన అనర్హత నోటీసులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై కోర్టులో విచారణ కొనసాగుతోంది. హైకోర్టు తీర్పుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక సచిన్ పైలట్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే గిరిరాజ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. తమ వర్గంలోకి వస్తే రూ. 35 కోట్లు ఇస్తామంటూ తిరుగుబాటు నేత ఆఫర్ ఇచ్చారని ఆయన బాంబు పేల్చారు. అశోక్ గెహ్లోత్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు సహకరించాలని కోరినట్టు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా గిరిరాజ్ సింగ్ ఆరోపణలపై పైలట్ తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన గిరిరాజ్‌పై పైలట్ పరువునష్టం దావా వేస్తారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. మనేసర్ రిసార్ట్స్‌లో ఉన్న తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని పైలట్ ఆరోపించారు. చదవండి : బీజేపీలో చేరి పీఎం అవుతారా! -
సంచలన ఆరోపణలు: 35 కోట్లకు పైలట్ బేరం
జైపూర్ : దేశ వ్యాప్తంగా దృష్టిని ఆకర్షించిన రాజస్తాన్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అసమ్మతి నేత సచిన్ పైలట్ వర్గానికి స్పీకర్ జారీచేసిన అర్హత వేటు నోటీసులపై హైకోర్టులో ఓ వైపు విచారణ జరుగుతుండగా.. సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా సచిన్ పైలట్‌పై కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే గిరిరాజ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. తన వర్గంలోకి వస్తే రూ. 35 కోట్లు ఇస్తామంటూ తిరుగుబాటు నేత ఆఫర్ ఇచ్చారని జైపూర్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాంబు పేల్చారు. అంతేకాకుండా అశోక్ గెహ్లత్ ప్రభుత్వాన్ని కూల్చిందుకు సహకరించాలని కోరినట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. గిరిరాజ్ సింగ్ ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీశాయి. మరోవైపు హర్యానాలో ఉన్న తమ ఎమ్మెల్యేలతో బేరాసారాలు కుదుర్చుకునేందుకు అధికార కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని సచిన్ పైలట్ వర్గం నేతలు విమర్శిస్తున్నారు. (కోర్టు తీర్పుపై ఉత్కంఠ: అర్థరాత్రి హైడ్రామా) ఇదిలావుండగా.. స్పీకర్ జారీచేసిన షోకాజు నోటీసులపై హైకోర్టులో విచారణ సాగుతోంది. పైలట్‌తో పాటు 18 ఎమ్మెల్యేలు విప్‌ను ధిక్కరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించారని, సభాపతి తీసుకున్న నిర్ణయంలో కోర్టు జోక్యం సరికాదని ప్రభుత్వ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింగ్వీ వాదించారు. కాంగ్రెస్ వాదనను పైలట్ తరపు న్యాయవాది హరీష్ సాల్వే తీవ్రంగా తప్పుబట్టారు. అసమ్మతి తెలియజేయడమంటే పార్టీ ఫిరాయించినట్లు కాదని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం విచారణ కొనసాగిస్తోంది. హైకోర్టు ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
రాజస్ధాన్ హైడ్రామా : బీజేపీలో చేరి ప్రధాని అవుతారా!
సాక్షి, న్యూఢిల్లీ : రాజస్ధాన్‌లో అశోక్ గహ్లోత్ ప్రభుత్వంపై సచిన్ పైలట్ తిరుగుబాటును కాంగ్రెస్ నేత మార్గరెట్ అల్వా తప్పుపట్టారు. బీజేపీలో చేరి 45 ఏళ్లకే ప్రధాని కావాలని పైలట్ తొందరపడుతున్నారా అని రెబల్ నేతను ప్రశ్నించారు.కరోనా వైరస్‌తో పాటు చైనాతో సరిహద్దు వివాదం వంటి సమస్యల మధ్య సచిన్ పైలట్ తిరుగుబాటు చేయడం సరైంది కాదని మాజీ కేంద్ర మంత్రి మార్గరెట్ అల్వా అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజస్ధాన్‌లో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, సచిన్ పైలట్ డిప్యూటీ సీఎంతో పాటు పార్టీ చీఫ్‌గానూ ఎన్నికయ్యారని చెప్పారు. 26 ఏళ్ల వయసులోనే సచిన్ పైలట్ ఎంపీ అయ్యారని, ఆ తర్వాత కేంద్ర మంత్రిగా ఎదిగి పీసీసీ చీఫ్‌గానూ నియమితులయ్యారని ఆమె గుర్తుచేశారు. చదవండి : గవర్నర్‌తో సీఎం భేటీ అందుకేనా! బీజేపీలో చేరి 45 ఏళ్లకే ప్రధానమంత్రి కావాలనుకుంటున్నారా అని పైలట్‌ను ప్రశ్నించారు. మరోవైపు మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింథియా తిరుగుబాటునూ ఆమె ఆక్షేపించారు. అన్ని డిమాండ్లను నెరవేర్చడం సాధ్యం కాదని, ఇలాంటి నేతలకు పార్టీ పట్ల, సిద్ధాంతం పట్ల చిత్తశుద్ధి లేదని విమర్శించారు. సింథియాకు పార్టీ ప్రధానకార్యదర్శి పదవి అప్పగించారని, మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేసినా ఆయన నిరాకరించారని చెప్పారు. సిద్ధాంతాలు లేని వీరంతా స్వార్ధం కోసం పదవుల కోసం పార్టీని వీడుతున్నారని దుయ్యబట్టారు. 150 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని ఏ ఒక్కరూ నిర్వీర్యం చేయలేరని వ్యాఖ్యానించారు. -
ఎమ్మెల్యేల కొనుగోలులో కేంద్రమంత్రికి నోటీసులు
జైపూర్: రాజస్తాన్‌లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్రలు పన్నుతున్నారని, ఈ విషయంలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు సంబంధం ఉందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ విషయంలో ఆయనను ప్రశ్నించనున్నారు. దీనికి సంబంధించిన ఆయనకు నోటీసులు పంపించారు. ఈ ఆరోపణలను ఆయన ఖండించారు. కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మెల్యేలతో షకావత్ బేరసారాలు ఆడిన ఒక ఆడియో బయటకు వచ్చి సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టింది. దీంతో కాంగ్రెస్ పార్టీ పోలీసులకు ఈ విషయంపై ఫిర్యాదు చేసింది. (తీర్పుపై ఉత్కంఠ: అర్థరాత్రి హైడ్రామా) దీనిపై షకావత్ స్పందిస్తూ ‘నేను ఈ విషయంలో ఎలాంటి దర్యాప్తునైనా ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ ఆడియోలో ఉన్నది నా గొంతు కాదు. నన్ను ప్రశ్నించడానికి రమ్మంటే తప్పకుండా వెళతాను’ అని షెకావత్ తెలిపారు. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అసమ్మతి నాయకుడు సచిన్ పైలట్ క్యాంప్‌లోని తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిసి కుట్ర చేస్తున్నారని గత వారం కాంగ్రెస్ ఆరోపించింది. కాంగ్రెస్ ఈ ఆరోపణలు చేయగానే పోలీసులు ఇద్దరిపై ఎఫ్ఆర్ఐ నమోదు చేశారు. అందులో ఒకరు గజేంద్రసింగ్ షకావత్. దీనిపై స్పందించిన బీజేపీ తమ పార్టీలోని వివాదాలను కప్పి పుచ్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ బీజేపీ నేతలపై ఆరోపణలు చేస్తోందని మండిపడింది. ఫోన్ కాల్స్‌ను ట్రాప్ చేస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. ఈ ఆడియో టేపులకు సంబంధించి విచారణ జరిపాలని సీఎం ఆశోక్ గ్లెహాట్ పోలీసులను ఆదేశించారు. (రాజస్తాన్ రాజకీయ రచ్చ.. రంగంలోకి అమిత్ షా) -
తీర్పుపై ఉత్కంఠ: అర్థరాత్రి హైడ్రామా
జైపూర్ : సమయం గడుస్తున్నా కొద్ది రాజస్తాన్ రాజకీయాల్లో ఉత్కంఠ పెరుగుతోంది. ఓవైపు దేశ వ్యాప్తంగా ప్రజలంతా కరోనా వైరస్ విజృంభణకు వణుకుతుంటే ఎడారి రాష్ట్రంలోని మాత్రం రాజకీయ వేడిసెగలు పుట్టిస్తోంది. హైకోర్టు వేదికగా జరుగుతున్న రాజకీయ డ్రామా దేశ వ్యాప్తంగా ప్రత్యేక దృష్టిని ఆకర్షించింది. పైలట్ వర్గానికి అనుకూలంగా తీర్పు వెలుడితే అశోక్ గెహ్లత్ సర్కార్ కూలుతుందా లేక బలనిరూపణలో తిరుగుబాటు నేతలకు చెక్ పెడుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. తీర్పు నేపథ్యంలో ఎమ్మెల్యేల లెక్కలు, బల నిరూపణకు కాల్సిన మద్దతుపై అధికార కాంగ్రెస్ దృష్టి సారించింది. ఓ వర్గం చీలిపోవడంతో కేవలం 88 మంది సభ్యులకే పరిమితమైన అధికార పార్టీ తిరుగుబాటు నేతలను తమ వైపుకు తిప్పుకునేందుకు మంతనాలు చేస్తోంది. (ఈ వారంలో బలపరీక్ష!) దీనిలో భాగంగానే పైలట్ వర్గంలోని కొంతమంది నేతలతో రహస్యంగా టచ్‌లో ఉంటూ వారి ఎత్తుగడలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోంది. వారిలో కొంతమంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తారనే ధీమాను సైతం కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బీజేపీకి, సచిన్ పైలట్‌కు, ఆయన మద్దతుదారులకు సరైన గుణపాఠం చెప్పాలనే లక్ష్యంతో వ్యూహ రచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా.. ప్రస్తుతం సచిన్ పైలట్‌తో పాటు ఆయన వెంటున్న 18 ఎమ్మెల్యేలు హర్యానాలోని ఓ రిసార్టులో క్యాంపు పెట్టారు. గడిచిన మూడు రోజుల్లో పలువురు పోలీసు అధికారులు ఈ క్యాంపు రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఆదివారం అర్థరాత్రి సైతం పోలీసులో రిసార్టులోకి ప్రవేశించారు. సుమారు 30 నిమిషాల పాటు అక్కడ గడిపారు. దీంతో రీసార్టు వద్ద అర్థరాత్రి సమయంలో కొంత హైడ్రామా నెలకొంది. అయితే వీరు ఎందుకు వెళ్లారనే రహస్యం మాత్రం అంతుపట్టడంలేదు. 103 ఎమ్మెల్యేల మద్దతు.. అయితే ప్రస్తుతం సచిన్ క్యాంపులో ఉన్న ఇద్దరు నేతలపై ప్రభుత్వం అనర్హత వేటు వేసింది. వారిపై రాజస్తాన్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ కేసు నమోదు చేసి విచారణ జరపుతోంది. దీనిలో భాగంగానే పోలీసులు రిసార్టుకు వచ్చినట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు. కాగా మొత్తం 200 మంది సభ్యులున్న అసెంబ్లీలో కాంగ్రెస్(88), బీటీపీ(2), సీపీఎం(2), ఆర్ఎల్డీ(1), స్వతంత్రులు(10).. మొత్తం 103 మంది ఎమ్మెల్యేల మద్దతుందని గహ్లోత్ భావిస్తున్నారు. -
కొత్తగా తెరపైకి సంజయ్ జైన్..
జైపూర్: రాజస్తాన్ లో ఈ వారంలోనే అసెంబ్లీ ప్రత్యేక భేటీ జరిగే అవకాశముందని కాంగ్రెస్ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. గవర్నర్ కల్రాజ్ మిశ్రాతో ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ శనివారం దాదాపు ముప్పావు గంట పాటు సమావేశమైన విషయం తెలిసిందే. కాగా, అసెంబ్లీలో విశ్వాస పరీక్ష జరపాలా? వద్దా? బలనిరూపణకు వెళ్లాలనుకుంటే.. ఎప్పుడు వెళ్లాలి? తదితర విషయాల్లో తుది నిర్ణయం ముఖ్యమంత్రిదేనని కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ ఆదివారం వ్యాఖ్యానించారు. (తీర్పుపై ఉత్కంఠ: అర్థరాత్రి హైడ్రామా ) యువ నాయకుడు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సచిన్ పైలట్ తిరుగుబాటు చేయడంతో పైలట్‌ను ఉప ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ పదవుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. అలాగే, పార్టీ విప్‌ను ఉల్లంఘించి, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై పైలట్ సహా 19 ఆయన వర్గం ఎమ్మెల్యేలకు అనర్హత నోటీసులను కూడా స్పీకర్ జారీ చేశారు. ఆ నోటీసులపై పైలట్ వర్గం హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై నేడు(సోమవారం) డివిజన్ బెంచ్ విచారణ జరపనుంది. దాంతో హైకోర్టు ఇవ్వనున్న ఆదేశాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 200 మంది సభ్యుల అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 107. ఇందులోపైలట్ సహా ఆయన వర్గం 19 మంది ఎమ్మెల్యేలు. ఈ పరిస్థితుల్లో ఆ ఎమ్మెల్యే ల సహకారం లేకుండా, గహ్లోత్ విశ్వాస పరీక్షలో ఎలా నెగ్గుతారనేది ఆసక్తికరంగా మారింది. కాగా, ప్రభుత్వ కూల్చివేత కుట్రకు సంబంధించి బయటపడిన ఆడియో టేప్‌లు నిజమైనవేనని సీఎం గహ్లోత్ తేల్చి చెప్పారు. బీజేపీ చెబుతున్నట్లు ఆ ఆడియో టేప్‌లు నకిలీవైతే.. రాజకీయాల నుంచి వైదొలగుతానన్నారు. షెకావత్ రాజీనామా చేయాలి: రాజస్తాన్‌లో తమ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేసిన బీజేపీ నేత గజేంద్ర సింగ్ షెకావత్ కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆదివారం కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే విషయమై వెలుగు చూసిన ఆడియో టేప్‌ల్లో షెకావత్ సంభాషణలు బయటపడడాన్ని ప్రస్తావిస్తూ.. నైతిక బాధ్యత వహిస్తూ షెకావత్ రాజీనామా చేయాలని ఆ పార్టీ సీనియర్ నేత అజయ్ మాకెన్ డిమాండ్ చేశారు. మరో వైపు, పైలట్‌ను తిరిగి కుటుం బం(పార్టీ)లోకి రావాలని కాంగ్రెస్ అధికా ర ప్రతినిధి సూర్జేవాలా మరో సారి కోరారు. బీజేపీ వల నుంచి ఇకనైనా బయటపడాలని సూచించారు. విశ్వాస పరీక్షతో బలం తేలుతుంది అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోవడం ద్వారానే మెజారిటీ తేలుతుందని బీజేపీ నాయకుడు, అసెంబ్లీలో విపక్ష నేత గులాబ్ చంద్ కటారియా స్పష్టం చేశారు. ‘గవర్నర్‌తో భేటీలో సీఎం ఏం చెప్పారనేది ఎవరికీ తెలియదు. తనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేల జాబితా ఇచ్చి ఉండవచ్చు, లేదా ప్రస్తుత రాజకీయ సంక్షోభంపై చర్చించి ఉండవచ్చు. కానీ అంతిమంగా అసెంబ్లీలో బలపరీక్ష ద్వారానే మెజారిటీ ఉందా? లేదా? అనేది స్పష్టమవుతుంది’ అన్నారు. వ్యూహాత్మకంగా కాంగ్రెస్..! సచిన్ పైలట్ తిరుగుబాటుతో హుటాహుటిన జైపూర్‌కు వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేతలు గహ్లోత్ సర్కారుకు ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేమీ లేదని తేలిన తరువాత కూడా జైపూర్‌లోనే ఉంటూ వ్యూహ రచన చేస్తున్నారు. ఈ సంక్షోభం నుంచి బయటపడడమొక్కటే కాదు..ముఖ్యంగా బీజేపీకి, సచిన్ పైలట్‌కు, ఆయన మద్దతుదారులకు సరైన గుణపాఠం చెప్పాలనే లక్ష్యంతో వ్యూహ రచన చేస్తున్నామని చెబుతున్నారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు.. గురుగ్రామ్‌లోని రిసార్ట్‌లో ఉన్న తిరుగుబాటు ఎమ్మెల్యేలలోని కొందరితో టచ్‌లో ఉంటూ, పైలట్ వర్గం భవిష్యత్ వ్యూహాలను తెలుసుకుంటోంది. కాంగ్రెస్ వ్యూహంలో భాగంగానే.. శనివారం సీఎం గహ్లోత్ అకస్మాత్తుగా గవర్నర్ కల్రాజ్ మిశ్రాను కలిసి, బీటీపీ ఎమ్మెల్యేల మద్దతు లేఖలను చూపారు. కాంగ్రెస్(88), బీటీపీ(2), సీపీఎం(2), ఆర్ఎల్డీ(1), స్వతంత్రులు(10).. మొత్తం 103 మంది ఎమ్మెల్యేల మద్దతుందని గహ్లోత్ భావిస్తున్నారు. దాంతో, ఈ వారం విశ్వాస పరీక్షకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. అకస్మాత్తుగా విశ్వాస పరీక్షకు వెళ్లాలన్న ఆలోచన వెనుక, పైలట్ వర్గంలో ఉన్న కొందరు ఎమ్మెల్యేలను వెనక్కు లాగే వ్యూహముందని పార్టీ వర్గాలు తెలిపాయి. తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించి హైకోర్టు తీర్పు కూడా అనుకూలంగానే వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. అనర్హత విషయంలో హైకోర్టు ఎలాంటి తీర్పునిచ్చినా మెజారిటీకి అవసరమైన ఎమ్మెల్యేలు తమకున్నారని ధీమాగా ఉంది. అనర్హత వేటు వేసేందుకు వీలు కలగనట్లైతే.. మెజారిటీ మార్క్‌కి మించి, 103 మంది సభ్యులు మద్దతిస్తున్నారని చెబుతోంది. ‘అనర్హత వేటు వేసేందుకు వీలు కలిగితే.. 107 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 19 మంది అనర్హులుగా తేలుతారు. దాంతో అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 181కి చేరుతుంది. అప్పుడు మెజారిటీ మార్క్ 91 అవుతుంది. ఆ మార్క్‌ను గహ్లోత్ సునాయాసంగా చేరుకుంటారు’ అని విశ్వసిస్తోంది. సంజయ్ జైన్ ఎవరు? రాజస్తాన్ సంక్షోభంలో కొత్తగా తెరపైకి వచ్చిన పేరు సంజయ్ జైన్. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి వెలుగులోకి వచ్చిన ఆడియోటేప్ల్లో ఉన్నది కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యే భన్వర్‌లాల్ శర్మ, సంజయ్జైన్ల స్వరాలేనని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే, ఆ గొంతులు తమవి కావని వారు స్పష్టం చేశారు. జైన్ బీజేపీ వ్యక్తి అని కాంగ్రెస్ ఆరోపిస్తుండగా.. తమ పార్టీకి అతడితో ఏ సంబంధం లేదని బీజేపీ చెబుతోంది. అయితే, జైన్ ఫేస్బుక్ ప్రొఫైల్‌లో ఆయన బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం వసుంధర రాజెతో దిగిన ఫొటో ఉంది. అలాగే, రాజస్తాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కూడా జైన్ పాల్గొన్నట్లుగా ఫొటోలు ఉన్నాయి. కాంగ్రెస్ ఫిర్యాదుపై షెకావత్, శర్మలతో పాటు జైన్‌పై కూడా రాజస్తాన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆయన పోలీస్ కస్టడీలో ఉన్నారు. మాజీ సీఎం వసుంధర రాజెను ఒకసారి కలవమని, బీజేపీలో చేరమని తనను సంజయ్ జైన్ 8 నెలల క్రితమే కోరారని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర గుహ తాజాగా వెల్లడించారు. -
రాజస్తాన్ రచ్చ.. రంగంలోకి అమిత్ షా
సాక్షి, న్యూఢిల్లీ : రాజస్తాన్ రాజకీయాల్లో నెలకొన్న సంక్షోభం జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. స్వయంగా కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎమ్మెల్యేలతో భేరసారాలకు దిగారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించడం సంచలనం రేపుతోంది. మరోవైపు కేంద్ర మంత్రితో పాటు మరో ఇద్దరు నేతలతో రాజస్తాన్ ప్రభుత్వం ఇదివరకే కేసు నమోదు చేసి విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరా తీశారు. ఫోన్ ట్యాంపరింగ్ ఆరోపణలపై స్పందించారు. దీనిపై పూర్తి నివేదికను తమకు అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదివారం ఆదేశించారు. దీంతో రాష్ట్ర రాజకీయం మరింత వేడెక్కింది. (గవర్నర్‌తో సీఎం భేటీ అందుకేనా!) ఇదిలావుండగా రాజస్తాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రాతో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లత్ సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. తిరుగుబాటు నేత సచిన్ పైలట్‌తో పాటు మరో 18 మందికి పార్టీ అధిష్టానం పంపిన సోకాజు నోటీసులను సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషిన్ సోమవారం విచారణకు రానుంది. తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తుందనే దానిపై పార్టీ, ప్రభుత్వ వర్గాల్లో విస్తృత చర్చసాగుతోంది. తీర్పు సచిన్ వర్గాన్నికి వ్యతిరేకంగా వస్తే అసెంబ్లీలో బలపరీక్షలకు గెహ్లెత్ సిద్ధమవ్వక తప్పదు. దీనిని దృష్టిలో ఉంచుకునే ముఖ్యమంత్రి గవర్నర్‌తో సమావేశమైనట్లు తెలుస్తోంది. విశ్వాస పరీక్షకు తాము సిద్ధంగా ఉన్నామన్న కబురును కల్రాజ్ మిశ్రాకు చేరవేసేందుకే భేటీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక హైకోర్టు ఇచ్చి తీర్పుపై ప్రభుత్వ భవిష్యత్ ఆధారపడి ఉంది. (పైలట్‌తో 18 నెలలుగా మాటల్లేవ్..) -
గవర్నర్‌తో సీఎం భేటీ అందుకేనా!
జైపూర్/ఢిల్లీ: రాజస్తాన్‌లో వారం క్రితం మొదలైన రాజకీయ సంక్షోభం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. అయితే, అక్కడ పరిస్థితులు చక్కబడుతున్నాయని, సంక్షోభం ముగియనుందని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి చెందిన కీలక నేత మజీద్ మీమాన్ చెప్తున్నారు. అశోక్ గహ్లోత్ ప్రభుత్వానికి ఢోకా లేదని అంటున్నారు. కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో మాదిరిగా రాజస్తాన్‌లో ఆపరేషన్ లోటస్ విజయవంతం కాబోదని ఆయన జోస్యం చెప్పారు. విశ్వాసపరీక్షలో కాంగ్రెస్ ప్రభుత్వం నెగ్గుతుందని మీమాన్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. గవర్నర్ కల్రాజ్ మిశ్రాతో భేటీ కావడంలోనే సీఎం గహ్లోత్ విశ్వాసం తెలుస్తోందన్నారు. బీజేపీ పెద్దలతో కలిసి పైలట్ వేసిన ఎత్తుగడలు పారలేదని మీమాన్ చురకలు వేశారు. భేటీ అందుకేనా? గవర్నర్ కల్రాజ్ మిశ్రాతో సీఎం గహ్లోత్ రాజ్‌భవన్‌లో శనివారం భేటీ అయ్యారు. 45 నిముషాలపాటు జరిగిన ఈ భేటీలో తమ ప్రభుత్వానికి మద్దతిస్తున్న ఎమ్మెల్యేల లిస్టును ముఖ్యమంత్రి గవర్నర్‌కు అందించినట్టు విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోపాటు, భారతీయ ట్రైబల్ పార్టీ (బీటీపీ)కి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, మరికొందరు స్వతంత్ర ఎమ్మెల్యేల వివరాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. దాంతోపాటు బలపరీక్షకు అసెంబ్లీని సమావేశ పరచాలని కూడా ఈ భేటీలో సీఎం కోరి ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. స్పీకర్ అనర్హత నోటీసులపై సచిన్ పైలట్, అతని వర్గం ఎమ్మెల్యేలు 18 మంది హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. వారి పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ శుక్రవారం విచారించింది. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు అనర్హత నోటీసులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని స్పీకర్ హైకోర్టుకు విన్నవించారు. (చదవండి: పైలట్‌తో 18 నెలలుగా మాటల్లేవ్: గహ్లోత్) ఆహ్వానిస్తాం కాగా, పైలట్, అతని వర్గం ఎమ్మెల్యేలు తిరిగి పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని సీఎం గహ్లోత్, కాంగ్రెస్ పెద్దలు చెప్తున్నారు. మరోవైపు బీజేపీలో చేరేది లేదని పైలట్ ఇదివరకే స్పష్టం చేశాడు. తదుపరి కార్యాచరణ చెప్పలేదు. ఈనేపథ్యంలో సోమ, మంగళవారాలు రాజస్తాన్ రాజకీయాలు కీలకం కానున్నాయి. ఇక రాజస్తాన్ పోలీస్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్ఓజీ) ప్రభుత్వ కుట్రలపై ఆడియో టేపులను సెషన్స్‌లో కోర్టులో సమర్పించింది. బీజేపీ నేతలు అశోక్ సింగ్, భరత్ మిలానీని ఎస్ఓజీ ఇప్పటికే అదుపులోకి తీసుకుంది. అయితే, ఆడియో టేపులన్నీ అసత్య ఆరోపణలనీ బీజేపీ నేతలు కొట్టిపడేస్తున్నారు. ఒకవేళ ఎవరి ఫోన్లనైనా ట్యాపింగ్ చేస్తే ఆ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. (నేను బీజేపీతోనే..) Desert storm in Rajasthan seems to have blown over with CM confidently meting the Governor and contemplating convening Assaembly session soon. ‘Operation Lotus’ appears to have failed this time. — Majeed Memon (@advmajeedmemon) July 19, 2020 -
రాజస్థాన్ రచ్చ
-
పైలట్‌తో 18 నెలలుగా మాటల్లేవ్..
సచిన్ పైలట్‌తో తనకు గడిచిన 18 నెలలుగా మాటలు లేవని సీఎం గహ్లోత్ సంచలన విషయం చెప్పారు. తన ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు పైలట్ మొదటి రోజు నుంచే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బీజేపీలో చేరడం లేదని చెబుతున్న పైలట్ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వస్తే ఆలింగనంతో ఆహ్వానిస్తానని ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గహ్లోత్ అన్నారు. ‘గత ఏడాదిన్నర కాలం నుంచి మేం ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదు. ముఖ్యమంత్రితో మాట్లాడని మంత్రి అతడు’అని అన్నారు. ‘నేను మొదటిసారి ఎంపీ అయినప్పటికి అతడి వయస్సు మూడేళ్లు. దశాబ్దాలుగా అతని కుటుంబంతో నాకు సంబంధాలు కొనసాగుతున్నాయి. మళ్లీ పార్టీలోకి వస్తే అతడిని మనస్ఫూర్తిగా ఆలింగనం చేసుకుని ఆహ్వానిస్తా’అని తెలిపారు. గహ్లోత్ ప్రభుత్వానికి బీటీపీ మద్దతు గహ్లోత్ ప్రభుత్వానికే తమ మద్దతని భారతీయ ట్రైబల్ పార్టీ (బీటీపీ) తెలిపింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, పీసీసీ అధ్యక్షుడి సమక్షంలో శనివారం ఈ విషయం ప్రకటించారు. గహ్లోత్ శనివారం సాయంత్రం గవర్నర్ కల్రాజ్ మిశ్రాతో భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు కొనసాగిన భేటీలో రాష్ట్రంలో కోవిడ్‌పై చర్చించినట్లు సీఎం తెలిపారు. గహ్లోత్ సన్నిహితులపై ఐటీ కన్ను గహ్లోత్ సన్నితులైన పారిశ్రామిక వేత్తలు, వాణిజ్యవేత్తలకు పన్ను ఎగవేతకు సంబంధించి త్వరలో నోటీసులు జారీ చేయనున్నట్లు ఆదాయ పన్ను శాఖ తెలిపింది. రతన్‌కాంత్ శర్మ, సునీల్ కొఠారి, రాజీవ్ అరోరాలతోపాటు ఎమ్మెల్యే ధర్మేంద్ర రాథోడ్లను విచారించనున్నట్లు తెలిపింది. ముంబై, ఢిల్లీ, కోటా, జైపూర్‌ల్లో వీరికి చెందిన 43 ప్రాంతాల్లో ఈ నెల 13వ తేదీన జరిపిన సోదాల్లో అనేక కీలక పత్రాలు, రూ.12 కోట్ల నగదు, రూ.1.5 కోట్ల విలువైన నగలు లభ్యమైనట్లు వెల్లడించింది. -
నేను బీజేపీతోనే..
జైపూర్/న్యూఢిల్లీ: రాజస్తాన్‌లో రాజకీయ పరిణామాలపై కొందరు కావాలనే గందరగోళం సృష్టిస్తున్నారని బీజేపీ నేత, రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే వ్యాఖ్యానించారు. తాను బీజేపీలోనే కొనసాగుతాననీ, పార్టీ సిద్ధాంతాలను అనుసరిస్తానని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, తిరుగుబాటు వర్గం నేత, మాజీ డిప్యూటీ సీఎం పైలట్ మధ్య విభేదాలతో తలెత్తిన సంక్షోభంలో గహ్లోత్‌కు వసుంధరా రాజే అంతర్గతంగా మద్దతిస్తున్నారంటూ రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ నేత, ఎంపీ హనుమాన్ బెణివాల్ శుక్రవారం ఆరోపించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలతో గహ్లోత్ ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. బీజేపీ నేతలు, అధిష్టానంపై కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోందన్నారు. రాజస్తాన్ కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ నేతల ఫోన్లను చట్ట విరుద్ధంగా ట్యాప్ చేయిస్తే సీబీఐతో విచారణ చేయించాలని బీజేపీ డిమాండ్ చేసింది. రాష్ట్రంలోని గహ్లోత్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తదితర బీజేపీ నేతల హస్తం ఉందంటూ కాంగ్రెస్ ఆడియో టేపులు విడుదల చేయడంపై బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర శనివారం స్పందించారు. ‘ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానాన్ని, గహ్లోత్‌ను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం. నేతల ఫోన్లు ట్యాప్ అయ్యాయా? ఒక వేళ జరిగితే, నిర్దేశిత నిబంధనల మేరకే చేశారా? తమ గుట్టు బయటపడకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడిందా?’అని ప్రశ్నించారు. బీజేపీ తప్పు చేసినట్లే: కాంగ్రెస్ ఆడియో టేపుల వ్యవహారంలో బీజేపీ సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేయడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. అలాగైతే, ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌పై సచిన్ పైలట్ తదితరుల తిరుగుబాటు వెనుక తమ ప్రమేయం ఉన్నట్లు బీజేపీ ఒప్పుకున్నట్లే అవుతుందని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. బీజేపీ నేతల ప్రమేయమే లేకుంటే హరియాణాలోని ఓ రిసార్టులో ఉన్న కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలను ప్రశ్నించడానికి వెళ్లిన రాజస్తాన్ పోలీసులను ఎందుకు అనుమతించలేదని రాజస్తాన్ పీసీసీ నూతన అధ్యక్షుడు గోవింద్ సింగ్ ప్రశ్నించారు. గహ్లోత్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు పన్నిన కుట్రకు సంబంధించినవిగా చెబుతున్న రెండు ఆడియో క్లిప్పులపై చీఫ్ విప్ మహేశ్ జోషి ఫిర్యాదు మేరకు ఆ రాష్ట్ర అవినీతి నిరోధక బ్యూరో(ఏసీబీ) కేసు నమోదు చేసింది. -
5 స్టార్ హోటల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల రిలాక్స్!
జైపూర్: అసమ్మతి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పంచాయితీ కోర్టుకు చేరడంతో రాజస్తాన్ రాజకీయాల్లో వేడి కాస్త తగ్గుముఖం పట్టింది. స్పీకర్ అనర్హత నోటీసులపై సచిన్ పైలట్, అతని వర్గం ఎమ్మెల్యేలు 18 మంది హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆ కేసు విచారణను శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ విచారించింది. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు ఆ అనర్హత నోటీసులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని స్పీకర్ హైకోర్టుకు విన్నవించారు. అనంతరం కేసు విచారణ సోమవారం ఉదయానికి వాయిదా పడింది. దీంతో ఈ నాలుగు రోజుల సమయాన్ని జైపూర్‌లోని ఫెయిర్మాంట్ ఫైవ్ స్టార్ హోటల్లో బస చేస్తున్న సీఎం అశోక్ గహ్లోత్ వర్గం ఎమ్మెల్యేలు సరదాసరదాగా గడుపుతున్నారు. అంతా ఓకే.. కానీ, కోవిడ్ నిబంధనలు ఉదయం లేవగానే చాలా మంది ఎమ్మెల్యేలు యోగాలో మునిగిపోయారు. కొందరు మహిళా ఎమ్మెల్యేల హోటల్ చీఫ్ చెఫ్‌తో చేరి పిజ్జా, బట్టర్ పన్నీర్ చేయడం నేర్చుకున్నామని చెప్తున్నారు. ఇక సభ్యుల కోసం 1960లో వచ్చిన సూపర్ హిట్ మూడీ మొఘల్ ఏ ఆజం సినిమాను ప్రదర్శించామని హోటల్ వర్గాలు తెలిపాయి. అయితే, ఎమ్మెల్యేలెవరూ మాస్కులు ధరించకుండా ఉండటం చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఆదర్శంగా ఉండాల్సిన వారు ఇలా నిబంధనలు ఉల్లంఘిస్తారా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. (చదవండి: వైరల్: గుండు కొట్టించి.. జై శ్రీరాం నినాదాలు) ఇదిలాఉండగా.. హైకోర్టులో కేసు విచారణ అనంతరం అసలు కథ మొదలు కానుంది. సచిన్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత అమలైతే అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ సంఖ్య తగ్గిపోనుంది. దాంతో అశోక్ గహ్లోత్ ప్రభుత్వం సులభంగా విశ్వాస పరీక్షలో విజయం సాధిస్తుంది. ఒకవేళ సచిన్ వర్గానికి విశ్వాస పరీక్షలో ఓటు వేసే అవకాశం గనుక వస్తే... కాంగ్రెస్ ప్రభుత్వానికి చిక్కులు తప్పవు. అయితే, తమకు 106 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే నిజమైతే రాజస్తాన్‌లో ప్రస్తుతానికి రాజకీయ సంక్షోభం ముగింపు దశకు చేరుకున్నట్టే. 200 సభ్యులున్న రాజస్తాన్ అసెంబ్లీలో ప్రభుత్వ మనుగడకు 101 ఎమ్మెల్యేల బలం అవసరం. (రాజస్తాన్ హైడ్రామా: పోలీసులకు బీజేపీ ఫిర్యాదు) -
రాజస్థాన్ రచ్చ
-
రసవత్తరంగా రాజస్తాన్ డ్రామా
జైపూర్: రాజస్తాన్‌లో రాజకీయ డ్రామా రోజుకో మలుపుతో ఆసక్తికరంగా సాగుతోంది. గహ్లోత్ సర్కారుకు ముప్పు తొలగిన నేపథ్యంలో.. కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. తాజాగా, ప్రభుత్వాన్ని కూల్చే కుట్రకు సంబంధించినవిగా పేర్కొంటూ రెండు ఆడియో టేప్‌లను సాక్ష్యాలుగా చూపింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ టేప్‌ల ఆధారంగా ఎమ్మెల్యేలను ప్రలోభపర్చి, ప్రభుత్వాన్ని కూల్చే కుట్రకు పాల్పడ్డారని ఆరోపిస్తూ బీజేపీ నేత, కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, తిరుగుబాటు వర్గ ఎమ్మెల్యే భన్వర్‌లాల్ శర్మ, వ్యాపారవేత్త సంజయ్ జైన్‌లపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. జైన్‌ను బీజేపీ నేతగా పేర్కొంది. షెకావత్, భన్వర్‌లాల్, సంజయ్ జైన్లను తక్షణమే అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ మహేశ్ జోషి చేసిన ఫిర్యాదు మేరకు.. స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్(ఎస్ఓజీ) వారిపై భారతీయ శిక్షాస్మృతి(ఐపీసీ)లోని దేశద్రోహం, కుట్రకు సంబంధించిన 124–ఏ, 120–బీ సెక్షన్ల కింద రెండు కేసులను నమోదు చేసింది. అయితే, ఎఫ్ఐఆర్లో కేంద్ర మంత్రి అనే ప్రస్తావన లేకుండా గజేంద్ర సింగ్ అని మాత్రమే పేర్కొంది. ప్రభుత్వాన్ని కూల్చే కుట్రకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కేంద్ర మంత్రి షెకావత్ స్పందించారు. ఆ ఆడియో టేప్‌ల్లో వినిపించిన స్వరం తనది కాదని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఏ విచారణకైనా సిద్ధమని ప్రకటించారు. మరోవైపు, తనతో పాటు తన వర్గం ఎమ్మెల్యేలు 18 మందిపై స్పీకర్ జారీ చేసిన అనర్హత నోటీసుల విషయంలో తిరుగుబాటు వర్గం నేత సచిన్ పైలట్‌కు కాస్త ఊరట లభించింది. ఆ నోటీసులను సవాలు చేస్తూ పైలట్, ఆయన వర్గం ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆ కేసు విచారణను శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ విచారించింది. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు ఆ అనర్హత నోటీసులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని స్పీకర్ హైకోర్టుకు విన్నవించారు. మరోవైపు, తిరుగుబాటు ఎమ్మెల్యేలు భన్వర్‌లాల్ శర్మ, విశ్వేంద్ర సింగ్‌లను పార్టీ నుంచి కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. వారికి షోకాజ్ నోటీసులను జారీ చేసింది. ఈ ఆడియో టేప్‌లే సాక్ష్యం అశోక్ గహ్లోత్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నించిందనేందుకు కీలక ఆధారాలు లభించాయని కాంగ్రెస్ సీనియర్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా ప్రకటించారు. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యే భన్వర్‌లాల్ శర్మ, బీజేపీ నేత సంజయ్సింగ్లకు సంబంధించిన రెండు ఆడియో టేప్‌లను సాక్ష్యాలుగా చూపారు. ఆ టేప్ల్లోని సంభాషణ పూర్తి వివరాలను మీడియాకు చదివి వినిపించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రకు పాల్పడిన ఈ ముగ్గురిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ‘బీజేపీకి ఎమ్మెల్యేల జాబితా ఇవ్వాలి’ అని ఆ టేప్‌ల్లో పేర్కొనడంపై తిరుగుబాటు నేత సచిన్ పైలట్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గహ్లోత్‌కు వసుంధర సాయం! గహ్లోత్ ప్రభుత్వం కూలిపోకుండా బీజేపీ నాయకురాలు, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే సాయం చేశారా? గహ్లోత్‌ను వీడి వెళ్లవద్దని ఎమ్మెల్యేలను ఆమె కోరారా?.. ఈ ప్రశ్నలకు అనూహ్యంగా అవుననే సమాధానమిస్తోంది బీజేపీ మిత్రపక్షం ఒకటి. సీఎం అశోక్ గహ్లోత్, వసుంధర రాజేల మధ్య అంతర్గత అవగాహన ఉందని రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ చీఫ్, లోక్‌సభ సభ్యుడు హనుమాన్ బెణివాల్ ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు స్వయంగా రాజేనే ఫోన్ చేసి గహ్లోత్‌కు మద్దతివ్వాలని కోరుతున్నారని బెణివాల్ పేర్కొన్నారు. హైకోర్టులో పైలట్‌కు ఊరట తిరుగుబాటు నేత సచిన్ పైలట్, ఆయన వర్గ ఎమ్మెల్యేలు 18 మందికి హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఎమ్మెల్యేలుగా వారి అనర్హతపై మంగళవారం సాయంత్రం వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని స్పీకర్ సీపీ జోషి శుక్రవారం హైకోర్టుకు తెలిపారు. పార్టీ విప్‌ను ధిక్కరించి, సీఎల్పీ భేటీకి గైర్హాజరు కావడంతో పాటు ప్రభుత్వాన్ని కూల్చే కుట్రకు పాల్పడిన ఆరోపణలపై శుక్రవారం లోగా వివరణ ఇవ్వాలని పైలట్ సహా 19 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ జోషి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ నోటీసులను సవాలు చేస్తూ పైలట్ వర్గం హైకోర్టును ఆశ్రయించింది. ఆ కేసు విచారణను శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇంద్రజిత్ మొహంతి, జస్టిస్ ప్రకాశ్ గుప్తాల ధర్మాసనం విచారించింది. ౖò అనర్హతకు సంబంధించి షోకాజ్ నోటీసులను జారీ చేసే అధికారం స్పీకర్‌కు ఉంటుందని, ఈ విషయంలో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోకూడదని సింఘ్వీ వాదించారు. అనర్హత నోటీసులపై మంగళవారం సాయంత్రం వరకు ఏ చర్య తీసుకోబోమని స్పీకర్ జోషి ధర్మాసనానికి తెలిపారు. అనంతరం కేసు విచారణ సోమవారం ఉదయానికి వాయిదా పడింది. హరియాణాలో హై డ్రామా ఆడియో టేప్‌ల వ్యవహారానికి సంబంధించి కాంగ్రెస్ చేసిన ఫిర్యాదు నేపథ్యంలో.. బహిష్కృత ఎమ్మెల్యే భన్వర్‌లాల్ శర్మను ప్రశ్నించడంతో పాటు, ఆయన స్వర నమూనాలను సేకరించేందుకు హరియాణాలోని గురుగ్రామ్‌లోని మానెసర్‌లో ఉన్న ఒక హోటల్‌కు రాజస్తాన్ పోలీసులు శుక్రవారం సాయంత్రం వెళ్లారు. అయితే, వారిని లోపలికి వెళ్లకుండా, హరియాణా పోలీసులు గంటపాటు అడ్డుకున్నారు. -
పైలట్ నేర్పుతున్న గుణపాఠం
రాజస్తాన్ తాజా పరిణామాలను చూస్తున్నవారికి ఒక విషయం స్పష్టంగా బోధపడుతుంది. అదేమిటంటే, ఆ రాష్ట్రంలో అశోక్ గెహ్లోత్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎలాగోలా నిలబెట్టుకునే సంకేతాలు వెలువడుతున్నప్పటికీ, అంతిమ ప్రయోజనం బీజేపీకే సిద్ధించనుంది. రాజస్తాన్‌లో సచిన్ పైలట్ తిరుగుబాటును వ్యక్తిగత ఆశలు, ఆకాంక్షల ఫలితంగా మాత్రమే చూసేవారు దీనితో కాంగ్రెస్ పార్టీకి సంభవించే పర్యవసానాలను గురించి ఆలోచించడం లేదు. సచిన్ పైలట్ పార్టీ నుంచి వైదొలగడాన్ని సమీప భవిష్యత్తే నిర్ణయించవచ్చు కానీ ఆయన నిష్క్రమణ మాత్రం కాంగ్రెస్‌పార్టీ సంస్థాగత రాజకీయాల సంపూర్ణ పరాజయంగానే చెప్పాల్సి ఉంటుంది. బీజేపీతో ఫలవంతమైన ఒప్పందం కుదుర్చుకోలేకపోవడం, మాతృసంస్థతో బంధనాలు పూర్తిగా తెంచుకోలేకపోవడం మధ్య కొట్టుమిట్టులాడుతున్న సచిన్ పైలట్ ఇప్పుడు అస్వాభావికమైన రాజకీయ శక్తుల దయాదాక్షిణ్యాల క్రూరత్వం మధ్య నలుగుతున్నారు. ఈ పరిస్థితిని రేపు దీర్ఘకాలిక రాజకీయ అవకాశంగా తాను మల్చుకోగలరా అనేది కాలమే నిర్ణయించాల్సి ఉంది. మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియాలాగా బీజేపీ సచిన్ పైలట్‌ని, అతని అనుయాయుల్నీ చేర్చుకోవడానికి ప్రాధాన్యమిచ్చింది. కానీ మధ్యప్రదేశ్ తరహా రాజకీయ తిరుగుబాటును సత్వరం ప్రేరేపించడంలో రాజస్తాన్ బీజేపీ విజయవంతం కాలేకపోయింది. మరోవైపున మొన్న జ్యోతిరాదిత్య సింధియా, నేడు సచిన్ పైలట్ వంటి యువ నాయకులు పార్టీనుంచి నిష్క్రమించాలని ప్రయత్నించడం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీలో యువనేతలు ఏమంత సంతోషంగా లేరని స్పష్టమవుతోంది. అందుకే ముఖ్యమంత్రి గెహ్లోత్ తాత్కాలికంగా బతికి బట్టకట్టినట్లు కనిపిస్తున్నా, అంతిమంగా బీజేపీనే ప్రయోజనం పొందనుంది. ఫిరాయింపులకు బీజేపీ డబ్బు ఆశ చూపిందా? రాజస్తాన్‌లో పార్టీని చీల్చి ముందుగా ప్రాంతీయ పార్టీని పెట్టాలని తర్వాత బీజేపీ పొత్తుతో ప్రభుత్వం ఏర్పర్చాలని పైలట్ భావించారని తెలుస్తోంది. అయితే ఇది పనిచేయదని భావించిన బీజేపీ నాయకత్వం పైలట్‌ని తన అనుయాయులను జ్యోతిరాదిత్య సింధియాలాగే పార్టీలోకి నేరుగా చేర్చుకోవడానికే ప్రాధాన్యమిచ్చింది. సింధియా విషయంలో వ్యవహరించినట్లే పైలట్‌కు కూడా కేంద్రంలో మంత్రి పదవి లేక రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టడానికి కూడా సిద్ధమైపోయింది. అయితే సచిన్‌తో సంభాషించిన బీజేపీ నేతలు తన అనుయాయులందిరికీ మంత్రిపదవులు ఇవ్వడానికి కానీ, అనర్హత వేటు పడితే వారికి ఉప ఎన్నికల్లో సీట్లు ఇవ్వడానికి కానీ హామీ ఇచ్చి ఉండకపోవచ్చు. పైగా రాజస్తాన్‌లోనూ అధికార మార్పిడికోసం ఫిరాయింపు చేసే ఎమ్మెల్యేలకు డబ్బు ఎర చూపినట్లు పుకార్లు వ్యాపించాయి. దీనికి సంబంధించిన టెలిఫోన్ సంభాషణలు కూడా రాజస్తాన్ పోలీస్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్‌కు లభించాయి. అది సర్వసాధారణంగా జరిగే ప్రక్రియే అనుకోండి. కానీ ఇలాంటి ఆధారం లభించిందంటే మాత్రం సచిన్ పైలట్ ప్రతిష్ట మసకబారిపోతుంది. పైగా ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ మాజీ ఉపముఖ్యమంత్రి పైలట్‌పై దూకుడుగా గురిపెట్టారు. రాజస్తాన్‌లో చోటుచేసుకున్న పరిణామాలను ఈ మార్చి నెలలో మధ్యప్రదేశ్‌లో జరిగిన పరిణామాలతో పోల్చి చూడవచ్చు. రెండు చోట్లా పార్టీని వీడి కాంగ్రెస్ యువనేతలు బయటకు రావాలనుకున్నారు. పోలిక అంతవరకే కానీ తదనంతర పరిణామాలు మాత్రం రెండు రాష్ట్రాల్లో పూర్తి భిన్నంగా పర్యవసించాయి. అంతర్గత కారణాల వల్ల రాజస్తాన్‌లో అధికారం అందిపుచ్చుకోవడానికి బీజేపీ సిద్ధం కాకపోయి ఉండవచ్చు. దీంతో మొత్తం పరిస్థితి తిరగబడింది. పైగా మధ్యప్రదేశ్‌లో రేపిన తిరుగుబాటులాంటిదాన్ని రాజస్తాన్‌లో బీజేపీ నిర్వహించలేకపోయింది. ఎందుకంటే రాజస్తాన్‌లో తన పార్టీ అంతర్గత పరిస్థితి సరిగా లేదు. రాజస్తాన్‌లో బీజేపీ మాజీ ముఖ్యమంత్రి, బలవంతురాలైన వసుంధరా రాజే సింధియాను సవాలు చేయాలని బీజేపీ కేంద్ర నాయకత్వం భావించలేదు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు సాధించినప్పటికీ వసుధరా రాజేకి అధికారం మరోసారి కట్టబెట్టడానికి బీజేపీ సిద్ధంగాలేదు. ప్రస్తుతం జోథ్‌పూర్ ఎంపీ గజేంద్ర సింగ్ షెకావత్‌కు బీజేపీ మద్దతిస్తూ వచ్చింది. అయితే అంచనాలు తప్పిపోయిన స్థితిలో అక్టోబర్ 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్తాన్‌లో 200 సీట్లు ఉన్న శాసనసభలో బీజేపీకి 70 స్థానాలు రాగా, వంద స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. అదే మధ్యప్రదేశ్‌లో 230 స్థానాలున్న శాసనసభలో బీజేపీకి 109 సీట్లు రాగా కాంగ్రెస్‌కి 114 స్థానాలు వచ్చాయి. శివరాజ్ సింగ్ చౌహాన్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా నిలపాలని బీజేపీ కేంద్ర నాయకత్వం పట్టుపట్టకపోయి ఉంటే ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చివేయగలిగి ఉండేది కాదు. అయితే రాజస్తాన్ విషయానికి వస్తే మాజీ సీఎం వసుంధరా రాజేకి శాసనసభలో లభిస్తున్న సమర్థనను చూసినప్పడు బీజేపీ అంత సౌకర్యంగా భావించడం లేదు. కాంగ్రెస్‌లో ప్రాంతీయ నేతల ఆవిర్భావం బీజేపీకి సంతోషదాయకం స్థానిక పరిస్థితులను బేరీజు వేసుకున్నప్పుడు కాంగ్రెస్‌లో ఆవిర్భవిస్తున్న ప్రత్యామ్నాయ ప్రాంతీయ నేతలను తన గుప్పిట్లోకి తెచ్చుకోవడం పట్ల బీజేపీ చాలా సంతోషంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. నేడు అస్సామ్‌లో హిమంత బిశ్వ శర్మ కానీ, రేపు మహారాష్ట్రలో లేదా ఉత్తర ప్రదేశ్‌లో ఆవిర్బవించే మరో యువనేత కానీ బీజేపీ అవసరాలకు సరిగ్గా సరిపోతారు. ఇలాంటి యువనేతలు తమ సొంత పునాదితో బీజేపీలోకి వస్తారు కాబట్టి సాంప్రదాయికంగా రాష్ట్రీయ స్వయం సేవక్ క్షేత్ర స్థాయి నిర్మాణంనుంచి వచ్చే బలానికి భిన్నంగా బీజేపీకి ఇప్పుడు క్షేత్రస్థాయిలో పుట్టుకొచ్చిన యువనేతల దన్నును స్వీకరించే అవకాశం కూడా ఉంటుంది. దీంతో పార్టీ రాజకీయ పునాది పెరిగి, ఓటర్లలోని కొత్త సెక్షన్లలో బీజేపీ పట్ల ఆమోదం కూడా పెరిగే అవకాశం ఉంటుంది ముందే చెప్పినట్లుగా సింధియా, పైలట్ వంటి యువనేతల వరుస నిష్క్రమణను చూస్తే కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలతో దాని యువనేతలు సంతుష్టిగా లేరని రాజకీయ సంకేతాలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో సచిన్ పైలట్ యువ సహచరులైన జితిన్ ప్రసాద వంటివారు పైలట్‌కు మద్దతుగా ప్రకటనలు గుప్పించడం దీన్నే రుజువు చేస్తోంది. మరో యువనేత మిలింద్ దేవరా ఇంకా స్పందించలేదు కానీ తానుకూడా పైలట్ బాటలోనే పయనించబోతున్నట్లు సూచనలు వస్తున్నాయి. ఈ పరిణామాలన్నింటినీ బేరీజు వేసుకున్నప్పుడు యూపీఏ–2 పాలనలో మంత్రి పదవులు పొందిన రాహుల్ యువ శక్తి, కాంగ్రెస్ భవిష్యత్తుగా భావించిన యువనేతలు ఈరోజు పార్టీతో కొనసాగాలని ఏమాత్రం కోరుకోవడం లేదు. దెబ్బతిన్న కాంగ్రెస్ పులులే బీజేపీ బలం బీజేపీలో చేరదల్చుకున్న కాంగ్రెస్ యువనేతలు ఆ పార్టీ భావజాలం పట్ల ఆకర్షితులై చేరుతున్నట్లు ఏ పరిస్థితుల్లోనూ భావించవద్దు. తమ వ్యక్తిగత ఆకాంక్షలు, ఆశల కోసమే వారు మాతృసంస్థకు దూరమవుతున్నారు. పైగా పార్టీ తమను చిన్నచూపు చూస్తోందన్న అభద్రత కూడా వారిలో అలుముకున్నట్లుంది. కాంగ్రెస్ నాయకత్వానికి గుణపాఠం నేర్పడానికి, పార్టీలోని రాజకీయ ప్రత్యర్థులకు సవాలు విసరడానికి చిట్టచివరి సాధనంగా మాత్రమే వీరు ఫిరాయింపులను ఎంచుకుంటున్నారు. తాను పార్టీనుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటిస్తున్న సందర్బంలో జ్యోతిరాదిత్య సింధియా ‘పెద్దపులి ఇంకా బతికే ఉంది’ (టైగర్ అభి జిందా హై) అంటూ ఉద్వేగపూరితమైన ప్రకటన చేశారు. అంటే ఇది కచ్చితంగా దెబ్బతిన్న పెద్దపులి మనస్తత్వాన్నే తెలుపుతుంది. తనను దెబ్బ తీసిన వారిలో కొందరి పని పట్టకుండా, పార్టీకి నష్టం చేకూర్చకుండా తాను వెళ్లననే హెచ్చరిక సింధియా ప్రకటనలో దాగి ఉంది. పైగా పార్టీలోని అంతర్గత వివాదాలను సంస్థాగతంగా గానీ, కేంద్ర నాయకత్వం కానీ పరిష్కరించలేకపోతోందని సింధియా ప్రకటన తేల్చిచెబుతోంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాజస్తాన్‌లో అశోక్ గెహ్లోత్ ప్రభుత్వాన్ని ఎలాగోలా నిలుపుకున్నప్పటికీ ఇప్పటికీ బీజేపీకే అది లబ్ధి చేకూరుస్తోంది. మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లో సంక్షోభాలు కాంగ్రెస్ పార్టీలోని సంస్థాగతలోపాలను ఎత్తి చూపాయి. అందుకే తన సమస్యలకు ప్రత్యర్థి పార్టీలను కారణంగా చూపడానికి బదులుగా కాంగ్రెస్ ముందుగా తన సొంత ఇంటిని చక్కదిద్దుకోవడం మంచిది. ఆ పార్టీలో తగవులను పరిష్కరించే యంత్రాంగం కానీ, పరిణితి చెందిన కేంద్ర నాయకత్వం కానీ లేదని స్పష్టంగా సంకేతాలు వెలువడుతున్నాయి. (ది క్వింట్.కామ్ సౌజన్యంతో) వ్యాసకర్త భరత్ భూషణ్ సీనియర్ పాత్రికేయుడు -
రాజస్తాన్‌లో టేపుల పర్వం
రాజస్తాన్‌లో నాలుగురోజులనాడు రాజుకున్న రాజకీయ సంక్షోభంలో మరో ఘట్టం ఆవిష్కృతమైంది. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర జరిగిందని, అందులో కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ ప్రధాన పాత్ర పోషించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ రెండు ఆడియో టేపులు విడుదల చేసింది. ఈ విషయంలో స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్(ఎస్ఓజీ) పోలీస్ విభాగం ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతోపాటు ప్రస్తుతం హర్యానాలోని గుర్గావ్లో సచిన్ పైలట్ శిబిరంలో వున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే భన్వర్‌లాల్ శర్మను ప్రశ్నించడానికి శుక్రవారం అధికారులను పంపింది. అక్కడ రెండు రాష్ట్రాల పోలీసుల మధ్యా కాసేపు కొనసాగిన తమాషా దేశమంతా గమనించింది. సరిగ్గా రాజస్తాన్ సంక్షోభం మొదలైన వెంటనే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆదాయం పన్ను విభాగం అధికారులు ఐటీ దాడులు నిర్వహిస్తే... ఇప్పుడు రాజస్తాన్ పోలీస్ విభాగం కూడా ఆ మాదిరి ‘కర్తవ్యాన్నే’ నిర్వర్తించడానికి హరియాణా తరలివెళ్లింది. పైలట్ వర్గీ యులు కొలువుదీరిన అయిదు నక్షత్రాల హోటల్‌కి వెళ్లబోయిన నలుగురు ఎస్ఓజీ అధికారులను అడ్డగించడానికి 200మంది హరియాణా పోలీసులు అక్కడ పహారా కాశారు. ఈ పరిణామాలన్నీ చూశాక సాధారణ పౌరులకు ప్రజాస్వామ్య వ్యవస్థల పనితీరుపై ఏవగింపు కలిగితే ఆశ్చర్యం లేదు. ఆడియో టేపులపై దర్యాప్తును ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తే భన్వర్‌లాల్ శర్మ, సంజయ్ లతోపాటు కేంద్రమంత్రి షెఖావత్‌ను కూడా అరెస్టు చేయాలన్నది కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా డిమాండు. అలాగని ఎస్ఓజీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ఎవరి పేర్లూ లేవు. ‘కొందరు వ్యక్తుల’ ఫోన్ సంభాషణలుగానే అందులో ప్రస్తావించారు. సంక్షోభం ముదిరి, ఆడియో టేపులు బయటి కొచ్చి ఇంత వివాదం రేగుతున్నా సచిన్ పైలట్ ఇంకా కాంగ్రెస్ నేతగానే వున్నారు. కాంగ్రెస్‌ను విడనాడలేదని ఆయన చెబుతున్నారు. ఇంతవరకూ పార్టీ ఆయన్నుగానీ, ఆయన అనుచరులను గానీ బహిష్కరించలేదు. కనుకనే మీ అంతర్గత కలహాలను చక్కదిద్దుకోలేక మాపై బురదజల్లుతారేమని బీజేపీ ప్రశ్నిస్తోంది. చూసేవారికి ఇది సహేతుకమన్న అభిప్రాయం కలుగుతుంది. ఈ వివాదానికంతకూ మూలకారణం ఎక్కడుందో, ఏ పరిణామాలు దానికి దారితీశాయో అందరికీ తెలుసు. కాంగ్రెస్ తన ఇంటిని సకాలంలో చక్కదిద్దుకుంటే సమస్య ఇంతవరకూ వచ్చేది కాదన్నది వాస్తవం. ఆ వివాదాన్ని బీజేపీ చాకచక్యంగా ఉపయోగించుకుంటున్నదన్న అభిప్రాయం ఏర్పడటానికి కారణం పైలట్ వర్గం వెళ్లి ఆ రాష్ట్రంలో తలదాచుకోవడమే. ఇందులో తమకేమీ సంబంధం లేకపోతే హరియాణా ప్రభుత్వం అయిదు నక్షత్రాల హోటల్ ముందు అంత హడావుడి చేసేది కాదని అందరికీ తెలుసు. రాజస్తాన్‌లో విపక్షంగా వుంటున్న బీజేపీ ప్రభుత్వ పాలనలోని వైఫల్యాలపై ప్రశ్నిస్తే, వాటిపై ఉద్యమిస్తే అది ఆ పార్టీకి మేలు చేస్తుంది. పాలక పక్షంలోని అంతః కలహాలను సాకుగా తీసుకుని ఏం చేయడానికి ప్రయత్నించినా దాని ప్రతిష్టను మసకబారుస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ వెల్లడించిన రెండు ఆడియో టేపులు అసలా, నకిలీయా అన్నది ఫోరెన్సిక్ నిపు ణులు ఎటూ తేలుస్తారు. సంక్షోభాలు తలెత్తినప్పుడు, బలాబలాల సమస్య ఎదురైనప్పుడు రాజ కీయాల్లో డబ్బు ప్రమేయం లేకుండా ఎవరికి వారు స్వచ్ఛందంగా గోడదూకుళ్లకు సిద్ధపడతారని ఇప్పుడెవరూ నమ్మే పరిస్థితి లేదు. రాజకీయ బేరసారాలకు సంబంధించిన టేపులు బయటపడటం కొత్తేమీ కాదు. జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) ఎంపీలు పార్టీ ఫిరాయించినప్పటినుంచి ఇలా సాక్ష్యాధారాలు అడపా దడపా బయటికొస్తూనే వున్నాయి. కానీ ఇంతవరకూ ఆ కేసుతోసహా ఏ కేసులోనూ నిందితులకు శిక్ష పడలేదు. ఎక్కడివరకో అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు 2015లో కీలకపాత్ర పోషించిన ‘ఓటుకు కోట్లు’ కేసుకు ఏ గతి పట్టిందో అందరికీ తెలుసు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే వద్దకు లక్షల రూపాయల కరెన్సీ కట్టలు పట్టుకొచ్చిన రేవంత్ రెడ్డి అప్పట్లో బాబుకు అత్యంత సన్నిహితుడు. ఫోన్లో చంద్రబాబు ఏమేం మాట్లాడారో చెప్పే సంభాషణల టేపుంది. రేవంత్ రెడ్డి స్వయంగా పట్టుకొచ్చిన నోట్లకట్టలు, ఆ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు వీడియోలో రికార్డయ్యాయి. అయినా ఆ కేసు ఇంకా ఎటూ తేలలేదు. ఇప్పుడు రాజస్తాన్ టేపులకు కూడా అదే గతి పట్టొచ్చు. ఈ తీరు మన చట్టబద్ధ పాలనను నవ్వులపాలు చేస్తుంది. కేసుల్లో ప్రముఖ నేతల ప్రమేయం వుంటే చట్టాలు కళ్లూ చెవులు మూసుకుంటాయన్న అభిప్రాయం స్థిరపడిపోతుంది. రాజస్తాన్ సంక్షోభానికి ఎవరినో నిందించడానికి బదులు కాంగ్రెస్ ఆత్మ పరిశీలన చేసు కోవాల్సివుంది. ఆ పార్టీని చాకచక్యంగా నడపడంలో, పార్టీ శ్రేణులకు స్ఫూర్తినిచ్చి వారిని ముందుకు ఉరికించడంలో విఫలమైన అధినాయకత్వం కారణంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ పార్టీలో అంతర్గత కలహాలు ముదిరాయి. అధికారం వున్నచోట సహజంగానే అవి మరింత ఎక్కువగా వున్నాయి. వీటిని సకాలంలో గమనించి సరిచేయడంలో విఫలమైనందుకే రాజస్తాన్‌లో సచిన్ పైలట్ వర్గం తిరుగుబాటును ఎంచుకుంది. నాలుగు నెలలక్రితం మధ్యప్రదేశ్‌లో బీజేపీ పావులు కదిపిన పర్యవసానంగా అధికారాన్ని చేజార్చుకున్న కాంగ్రెస్, ఇప్పుడు రాజస్తాన్‌లో దాన్ని పునరావృతం కానీయరాదన్న పట్టుదలతో పనిచేస్తున్నట్టు కనబడుతోంది. ఆ రాష్ట్రంలో ముఠా కలహాల నివారణకు సకాలంలో మేల్కొనని అధినాయకత్వం ఇప్పుడు మాత్రం అధికారాన్ని నిలుపుకోవడంపై సర్వ శక్తులూ ఒడ్డుతోంది. అన్ని రాష్ట్రాల్లాగే రాజస్తాన్‌లో కూడా కరోనా తీవ్రత ఎక్కువే వుంది. దాన్ని ఎదుర్కొనడానికి సర్వశక్తులూ ఒడ్డి పోరాడాల్సిన సమయంలో రాష్ట్రంలో రాజకీయ రగడ రేగడం ఆశ్చర్యకరం. ఒకరిపై ఒకరు పైచేయి సాధించడానికి కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్న ప్రయత్నాలవల్ల వ్యవస్థల పరువు ప్రతిష్టలు దెబ్బతింటున్నాయి. ఇప్పుడు అందరికీ ఆందోళన కలిగిస్తున్నది ఇదే. -
పైలట్ శిబిరం వద్ద హైడ్రామా
జైపూర్ : రాజస్దాన్‌లో రాజకీయ హైడ్రామా ఉత్కంఠ రేపుతోంది. తిరుగుబాటు నేత సచిన్ పైలట్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలున్న మనేసర్ రిసార్ట్స్ వద్దకు చేరుకున్న రాజస్ధాన్ పోలీసులను హరియాణ పోలీసులు అడ్డుకున్నారు. అశోక్ గహ్లోత్ సర్కార్‌ను కూలదోసేందుకు కుట్రపన్నిన బీజేపీ నేతలతో రెబల్ ఎమ్మెల్యే భన్వర్‌లాల్ శర్మ మంతనాలు సాగించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఆడియో టేపులను విడుదల చేసింది. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు భన్వర్ లాల్ శర్మ కోసం రాజస్ధాన్ పోలీసులు ఢిల్లీ సమీపంలోని మనేసర్ రిసార్ట్స్‌కు శుక్రవారం సాయంత్రం చేరుకున్నారు. 18 మంది సచిన్ పైలట్ వర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గత వారాంతం నుంచి ఈ రిసార్ట్స్‌లో గడుపుతున్నారు. కాగా బీజేపీతో వీరు ముడుపుల వ్యవహారం నడిపారనే ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే భన్వర్ లాల్ శర్మ మరో ఎమ్మెల్యే విశ్వేంద్ర సింగ్‌లను సస్పెండ్ చేసింది. ఇక వీరి కోసం మనేసర రిసార్ట్స్‌కు చేరుకున్న రాజస్దాన్ పోలీసులను హరియాణ పోలీసులు కొద్దిసేపు అడ్డుకున్నారు. కాగా ఆడియో టేపుల వ్యవహారాన్ని రెబెల్ ఎమ్మెల్యేలు భన్వర్ లాల్ శర్మ, విశ్వేంద్ర సింగ్‌లు తోసిపుచ్చారు. ఈ టేపుల్లో రికార్డయింది తమ వాయిస్ కాదని స్పష్టం చేశారు. మరోవైపు తన ప్రభుత్వాన్ని కూలదోసేందుకు సచిన్ పైలట్ బాహాటంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని రాజస్ధాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఆరోపించారు. ఇక ప్రియాంక గాంధీ సహా సీనియర్ కాంగ్రెస్ నేతల రాజీ ప్రతిపాదనలకు సచిన్ పైలట్ అంగీకరించలేదని ఆయన వర్గీయులు తేల్చిచెప్పారు. చదవండి : కాంగ్రెస్‌కు కాషాయ నేతల కౌంటర్ -
ముదురుతున్న రాజకీయ సంక్షోభం
జైపూర్ : రాజస్తాన్‌లో రాజుకున్న రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. అసమ్మతి నేత సచిన్ పైలట్‌తో పాటు 18 మంది రెబల్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌పై ఆ రాష్ట్ర హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా 19 మంది రెబల్ ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన షోకాజు నోటీసులను కొట్టివేయాలంటూ పిటిషనర్ల తరఫు ప్రముఖ న్యాయవాదులు హరీష్‌సాల్వే, ముకుల్ రోహత్గి న్యాయస్థానాన్ని కోరారు. అసమ్మతి అంటే పార్టీ ఫిరాయించడంకాదని, అసెంబ్లీ సమావేశాలు లేని సమయంలో నోటీసులు ఇవ్వడం సరైనదికాదని వాదించారు. పిటిషనర్ వాదనలు విన్న ధర్మాసనం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. కోర్టు విచారణ నేపథ్యంలో ఆ రోజు సాయంత్రం 5 గంటల వరకు ఎలాంటి చర్యలు తీసుకోనని ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చంద్రప్రకాశ్ ధర్మాసనానికి నివేదించారు. (రాజస్తాన్: ఆడియో టేపుల కలకలం) కేంద్రమంత్రిపై కేసు నమోదు.. మరోవైపు రాష్ట్ర రాజకీయాల్లో రోజురోజుకూ అనేక ఉత్కంఠ పరిణామాలు చేసుకుంటున్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే 19 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన కాంగ్రెస్ అధిష్టానం తాజా మరో ఇద్దరు శాసన సభ్యులపై వేటు వేసింది. ప్రతిపక్ష బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని పడేసేందుకు కుట్రలు పన్నారన్న ఆరోపణలతో భన్వర్‌లాల్, విశ్వేంద్ర సింగ్‌ల సభ్యత్వాలను రద్దు చేసింది. మరోవైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిన ఆడియో టేపుల అంశం రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపుతోంది. దీనిపై అధికార పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆడియో టేపుల వివాదంపై పార్టీ నేతల ఫిర్యాదు మేరకు రాజస్తాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్ఓజీ) కేసు నమోదు చేసింది. పార్టీ ఎమ్మెల్యేలు భన్వర్‌లాల్, సంజయ్‌సింగ్‌తో పాటు కేంద్రమంత్రి, బీజేపీ నేత గజేంద్ర సింగ్‌లపై కేసు నమోదైనట్లు ఎస్ఓజీ ప్రకటించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామా.. ఇదిలావుండగా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సుమిత్రాదేవి తన పదవికి రాజీనామా చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. నేపా నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సుమిత్రా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. పైలట్‌పై వేటు వేసినందుకు ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
ఎలాంటి విచారణకైనా సిద్దం
-
అది నకిలీ ఆడియో.. విచారణకు సిద్ధం
సాక్షి, న్యూఢిల్లీ: రాజస్ధాన్‌లో అశోక్ గహ్లోత్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు రెబల్ ఎమ్మెల్యే భన్వర్‌లాల్ శర్మతో కలిసి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ నేత సంజయ్ జైన్ యత్నించారన్న కాంగ్రెస్ ఆరోపణలపై షెకావత్ స్పందించారు. ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేశారనే కాంగ్రెస్ ఆరోపణలు అవాస్తవమని, సోషల్ మీడియాలో వైరలైన ఆడియో క్లిప్ నకిలీదని కేంద్ర మంత్రి షెకావత్ స్పష్టం చేశారు. ఈ క్లిప్‌లో వాయిస్ తనది కాదని అన్నారు. ఈ వ్యవహారంలో ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని, దర్యాప్తు సంస్ధ ఎదుట హాజరయ్యేందుకు సిద్డమని చెప్పారు. రాజస్ధాన్ సర్కార్‌ను కూల్చేందుకు కేంద్ర మంత్రి షెకావత్, బీజేపీ నేత సంజయ్ జైన్, రెబల్ ఎమ్మెల్యే భన్వర్‌లాల్ శర్మతో కలిసి ప్రయత్నించారని కాంగ్రెస్ పార్టీ రాజస్ధాన్ పోలీస్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్ఓజీ)నకు ఫిర్యాదు చేసింది. వారి కుట్రలకు సంబంధించిన మూడు ఆడియో టేపులు కూడా తమ వద్ద ఉన్నాయని కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాల తెలిపారు. అసమ్మతి ఎమ్మెల్యేలు, బీజేపీ నేతల కుట్రలను వెలికి తీయాలని ఆయన ఎస్ఓజీ పోలీస్ అధికారులను కోరారు. కాంగ్రెస్ ఫిర్యాదు మేరకు గజేంద్ర సింగ్ షెకావత్, సంజయ్ జైన్, భన్వర్‌లాల్ శర్మపై ఎస్ఓజీ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు సమాచారం. ఈ ఆరోపణలపై రెబల్ ఎమ్మెల్యేలు భన్వర్‌లాల్ శర్మ, విశ్వేంద్ర సింగ్‌ల పార్టీ ప్రాథమిక సభ్యత్వాలను కాంగ్రెస్ రద్దు చేసింది. వారికి షోకాజ్ నోటీసులను జారీ చేసింది. చదవండి: వసుంధర రాజేపై సంచలన ఆరోపణలు -
రాజస్తాన్: ఆడియో టేపుల కలకలం
జైపూర్/ఢిల్లీ: రాజస్తాన్ రాజకీయాల్లో ఆడియో టేపుల కలకలం రేగింది. అశోక్ గహ్లోత్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు రెబల్ ఎమ్మెల్యే భన్వర్‌లాల్ శర్మతో కలిసి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ నేత సంజయ్ జైన్ యత్నించారని పేర్కొంటూ కాంగెస్ పార్టీ రాజస్తాన్ పోలీస్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్ఓజీ)నకు ఫిర్యాదు చేసింది. వారి కుట్రలకు సంబంధించిన మూడు ఆడియో టేపులు కూడా తమ వద్ద ఉన్నాయని కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాల తెలిపారు. అసమ్మతి ఎమ్మెల్యేలు, బీజేపీ నేతల కుట్రలను వెలికి తీయాలని ఆయన ఎస్ఓజీ పోలీస్ అధికారులను కోరారు. కాంగ్రెస్ ఫిర్యాదు మేరకు గజేంద్ర సింగ్ షెకావత్, సంజయ్ జైన్, భన్వర్‌లాల్ శర్మపై ఎస్ఓజీ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు సమాచారం. (చదవండి: రాజకీయ సంక్షోభం: వసుంధరపై సంచలన ఆరోపణలు) ఇక ఇప్పటికే తిరుగుబాటు నేత సచిన్ పైలట్, అతని వర్గం ఎమ్మెల్యేల పదవులను ఊడబెరికిన కాంగ్రెస్ మరో అడుగు ముందుకేసింది. బీజేపీ నాయకులతో కలిసి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర చేశారన్న ఆరోపణల నేపథ్యంలో రెబల్ ఎమ్మెల్యేలు భన్వర్‌లాల్ శర్మ, విశ్వేంద్ర సింగ్‌ల పార్టీ ప్రాథమిక సభ్యత్వాలను కాంగ్రెస్ రద్దు చేసింది. వారికి షోకాజ్ నోటీసులను జారీ చేసింది. కాగా, కాంగ్రెస్ ఆరోపణనలన్నీ అవాస్తవాలేనని రెబల్ ఎమ్మెల్యే భన్వర్‌లాల్ శర్మ తోసిపుచ్చారు. ఆడియో టేపుల్లో ఉన్నది తన గొంతు కాదని ఆయన స్పష్టం చేశారు. ఇదిలాఉండగా.. తమకు 109 మంది ఎమ్మెల్యేల బలం ఉందని రాష్ట్ర ప్రభుత్వ విప్ మహేష్ జోషి వెల్లడించారు. అవసరమైనప్పుడు బలపరీక్షకు సిద్ధమని ప్రకటించారు. మరోవైపు రాజస్తాన్ స్పీకర్ జారీ చేసిన నోటీసులపై సచిన్ పైలట్ వేసిన పిటిషన్‌పై రాష్ట్ర హైకోర్టు కాసేపట్లో విచారించనుంది. (19 మంది ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ నోటీసులు)