
జైపూర్: రాజస్థాన్ కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ముఖ్య నేత సచిన్ పైలట్ మధ్య విభేదాలు తీవ్రతరమవుతున్నాయి. పార్టీ కార్యకర్తలను పైలట్ రెచ్చగొడుతున్నారంటూ పంద్రాగస్టు ప్రసంగంలో గెహ్లాట్ పరోక్ష విమర్శలకు దిగారు. కార్యకర్తలకు గౌరవం దక్కడం లేదంటూ కొంతకాలంగా పైలట్ చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. షాహీద్ మెమోరియాల్ వద్ద నిర్వహించిన కార్యక్రమం వేదికగా సచిన్ పైలట్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు గెహ్లాట్.
‘‘ఇటీవల కొందరు నేతలు కొత్త పల్లవి అందుకున్నారు. కార్యకర్తలకు గౌరవం లభించాలని రెచ్చకొడుతున్నారు. అసలు గౌరవమంటే ఏమిటో వారికి తెలుసా? కార్యకర్తలకు కాంగ్రెస్‌లో అత్యున్నత గౌరవముంది. కాబట్టే నేను సీఎం స్థాయికి ఎదిగా’’ అని పేర్కొన్నారు సీఎం అశోక్ గెహ్లాట్. ఆ తర్వాత సాయంత్రం నిర్వహించిన ఓ వీడియో కాన్ఫరెన్స్‌కు సచిన్ పైలట్ గైర్హాజరయ్యారు.
ఇదీ చదవండి: బాలుడి హత్య.. కాంగ్రెస్‌లో ముసలం, ఎమ్మెల్యే రాజీనామా
Comments
Please login to add a commentAdd a comment