
సాక్షి, జైపూర్: ముఖ్యమంత్రిపై తిరుగుబాటు చేయడంతో సచిన్ పైలట్‌ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ రాజస్తాన్ నూతన అధ్యక్షుడిగా గోవింద్ సింగ్ దోతస్రా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడికి సచిన్ పైలట్ అభినందనలు తెలిపారు. ఎటువంటి ఒత్తిడి, పక్షపాతం లేకుండా వ్యవహరించాలని సూచించారు. ‘రాజస్తాన్ కాంగ్రెస్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన దోతస్రాజీకి అభినందనలు. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేసిన పార్టీ కార్యకర్తలను ఎటువంటి ఒత్తిడి, పక్షపాతం లేకుండా పూర్తిగా గౌరవిస్తారని ఆశిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. అలానే అసెంబ్లీ స్పీకర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు సచిన్ పైలట్. (రాజస్తాన్ హైడ్రామా : పట్టు కోల్పోతున్న పైలట్!)
ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌కు ఎదురుతిరిగిన సచిన్ పైలట్‌ను డిప్యూటీ సీఎం పదవితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి ఈ నెల 14న పార్టీ హైకమాండ్ తొలగించింది. ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీతో కలిసి కుట్ర పన్నుతున్నారన్న ఆరోపణలతో సచిన్ పైలట్‌తోపాటు ఆయనకు మద్దతిస్తున్న 18 ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ పార్టీ అనర్హత వేటు వేయగా వారు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment