కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో పలు ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. రెండు రోజుల వరకు కాంగ్రెస్ అధ్యక్షుడి రేసులో ఉన్న అశోక్ గెహ్లాట్‌కు ఊహించని షాక్ తగిలింది. రాజస్తాన్ రాజకీయాల్లో కోల్డ్‌వార్ బహిర్గతం అవడంతో సీఎం అశోక్ గెహ్లాట్‌ను మరో వివాదం చుట్టుముట్టింది. రహస్య నోట్ ఫొటో లీక్ కావడంలో రాజస్తాన్ రాజకీయాల్లో కలకలం సృష్టించింది.
ఇంతకీ ఏం జరిగిందంటే.. సీఎం అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి గెహ్లాట్ పోటీ నేపథ్యంలో రాజస్తాన్ తర్వాతి సీఎం ఎవరు అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. డిప్యూటీ సీఎం సచిన్ పైలట్‌ను తర్వాతి సీఎం చేస్తారనే వార్తలు చక్కర్లు కొట్టడంతో గెహ్లాట్ దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేల భేటీ చర్చనీయాంశంగా మారింది. అనంతరం చోటుచేసుకున్న పరిణామాల కారణంగా అధ్యక్ష రేసులో నుంచి గెహ్లాట్ తప్పుకున్నారు. తర్వాత సోనియా గాంధీని కలిసిన క్షమాపణలు సైతం చెప్పారు.
అయితే, సోనియా గాంధీతో సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన అశోక్ గెహ్లాట్ చేతిలో ఉన్న సీక్రెట్ లెటర్ ఒకటి బయటకు వచ్చింది. ఈ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా, ఈ లేఖలో గెహ్లాట్.. సచిన్ పైలట్‌ను ‘SP’గా పేర్కొంటూ సంచలన ఆరోపణలు గుప్పించారు. సచిన్ పైలట్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీజేపీతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నించారని అన్నారు.
అలాగే, ఎమ్మెల్యేలను కొనేందుకు 50 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలిపారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం ఎస్పీ పార్టీని కూడా వీడుతారు. దీనిపై గతంలోనే రిపోర్ట్ ఇచ్చి ఉంటే పార్టీకి చాలా మంచిది. తనకు 102 ఎమ్మెల్యేల మద్దతు ఉండగా ‘SP’ వెంట 18 మంది ఉన్నారని అందులో స్పష్టం చేశారు. దీంతో, గెహ్లాట్ లేఖ కాంగ్రెస్‌లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ లేఖ బయటకు రావడంలో కాంగ్రెస్‌పై బీజేపీ సెటైరికల్ కామెంట్స్ చేసింది. ఎస్పీ ఎవరూ అంటూ బీజేపీ నేత షెహజాద్ పూనావాలా ప్రశ్నించారు.
“SP will leave party”
— Shehzad Jai Hind (@Shehzad_Ind) September 30, 2022
Who is SP that Ashok Gehlot’s “leaked note” ((deliberately visible note)) speaks of ?
Congress Jodo… Bharat to Juda hua hai ji 🙏 pic.twitter.com/ZncFLJf4to
Comments
Please login to add a commentAdd a comment