
Ashok Gehlot.. రాజస్థాన్ కాంగ్రెస్‌లో నేతల మధ్య కోల్డ్‌వార్ మరోసారి బహిర్గతమైంది. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లట్.. సచిన్ పైలట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, వీరిద్దరి మధ్య కొద్దిరోజులుగా పొలిటికల్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇక, గెహ్లట్ వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
అయితే, అశోక్ గెహ్లాట్ గురువారం జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా గెహ్లాట్ మాట్లాడుతూ.. సచిన్ పైలట్ నమ్మక ద్రోహి అని విమర్శించారు. అలాంటి ద్రోహి ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడు. పది మంది ఎమ్మెల్యేల మద్దతు కూడా లేని వ్యక్తి పార్టీలో తిరుగుబాటుకు ప్రయత్నించాడు. కాంగ్రెస్ పార్టీకి నమ్మకద్రోహం చేశాడు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఆయనకు బీజేపీ నుంచి రూ.10 కోట్లు అందాయని ఆరోపించారు. ఇలాంటి వ్యక్తిని కాంగ్రెస్ హైకమాండ్ సీఎంను చేయదని స్పష్టం చేశారు. సచిన్ పైలట్‌ను సీఎంగా రాజస్థాన్ ప్రజలు అంగీకరించరని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ క్రమంలోనే సచిన్ పైలట్ ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిశారని అన్నారు. సచిన్ పైలట్‌కు బీజేపీతో దగ్గరి సంబంధాలున్నాయని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయం నుంచి సచిన్ పైలట్ వర్గం ఎమ్మెల్యేల్లో కొందరికి రూ.5 కోట్లు, మరికొందరికి రూ.10 కోట్లు ముట్టాయని ఆరోపించారు. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని వెల్లడించారు.
Ashok Gehlot (@ashokgehlot51) To NDTV: Sachin Pilot Is "Gaddar" https://t.co/sQBWedN4ob#GehlotToNDTV #NDTVExclusive pic.twitter.com/rHXEqlFAJa
— NDTV (@ndtv) November 24, 2022