జైపూర్: రాజస్తాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ దూకుడు పెంచారు. గత బీజేపీ ప్రభుత్వ హయాంలో అవినీతిపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలన్న తన డిమాండ్‌ను ఈ నెలాఖరులోగా నెరవేర్చకుంటే ఆందోళనను తీవ్రతరం చేస్తామంటూ సొంత పార్టీకే చెందిన సీఎం అశోక్ గహ్లోత్‌కు అల్టిమేటం జారీ చేశారు. ఈ డిమాండ్ సాధనలో భాగంగా ఆయన చేపట్టిన ఐదు రోజుల పాదయాత్ర సోమవారంతో ముగిసింది.
ఈ సందర్భంగా తన మద్దతు దారులైన 15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో జైపూర్‌లో భారీ ర్యాలీ చేపట్టారు. రాజస్తాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఆర్‌పీఎస్‌సీ)ని రద్దు చేసి, పునర్వ్యవస్థీకరించాలని, పేపర్ లీక్‌తో పరీక్షలను రద్దు వల్ల నష్టపోయిన వారికి పరిహారం చెల్లించాలన్న రెండు కొత్త డిమాండ్లను వినిపించారు. నెలాఖరులోగా చర్యలు తీసుకోకుంటే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment