జైపూర్: బీజేపీ నేత అమిత్ మాలవ్య ట్విట్టర్‌లో సచిన్ పైలట్ తండ్రి రాజేష్ పైలట్, సురేష్ కల్మాడీలపై సంచలన ఆరోపణలు చేశారు. వారిద్దరూ కలిసి 1966, మార్చి 5న మిజోరాం ఐజ్వాల్‌లో బాంబు దాడి జరిపారని అన్నారు. అందుకు సచిన్ పైలట్ స్పందిస్తూ మా నాన్న బాంబులు వేసిన మాట వాస్తవమే కానీ మీరు చెప్పిన డేట్లు, సమాచారం తప్పని ట్విట్టర్ వేదికగా స్పందించారు.
బీజేపీ ఐటీ విభాగాధిపతి అమిత్ మాలవ్య ట్వట్టర్‌లో రాస్తూ.. "1966, మార్చిలో రాజేష్ పైలట్, సురేష్ కల్మాడీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్లేన్‌లో మిజోరాం రాజధాని ఐజ్వాల్‌పై బాంబుల వర్షం కురిపించారు. తదనంతర కాలంలో వారిద్దరికీ కాంగ్రెస్ ప్రభుత్వం టికెట్లు ఇచ్చి మంత్రులుగా కూడా చేర్చుకుంది. ఈశాన్య రాష్ట్రాల్లోని సొంత ప్రజలపై దాడులు చేసినందుకు కానుకగా ఇందిరా గాంధీ వారికి ఆ పదవులు ఇచ్చారని స్పష్టంగా తెలుస్తోంది" అని రాశారు.
అమిత్ మాలవ్య చేసిన వ్యాఖ్యలకు సచిన్ పైలట్ బదులిస్తూ.. "మీ దగ్గర తప్పుడు తేదీలు.. తప్పుడు సమాచారముంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా మా నాన్న బాంబులు వేసిన మాట వాస్తవమే కానీ అది తూర్పు పాకిస్తాన్ పైన అదికూడా 1971లో జరిగిన భారత్-పాకిస్తాన్ యుద్ధం సందర్భంగా జరిగింది. మీరు చెప్పినట్టు 1966, మార్చి 5న మిజోరంపై కాదు. ఎందుకంటే ఆయన 1966, అక్టోబరు 29న విధుల్లో చేరారు. జై హింద్.. అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు." అని రాసి కింద తన తండ్రి రాజేష్ పైలట్ జాయినింగ్ డేటు ఉన్న సర్టిఫికేటును జతపరిచారు.
.@amitmalviya - You have the wrong dates, wrong facts…
— Sachin Pilot (@SachinPilot) August 15, 2023
Yes, as an Indian Air Force pilot, my late father did drop bombs. But that was on erstwhile East Pakistan during the 1971 Indo-Pak war and not as you claim, on Mizoram on the 5th of March 1966.
He was commissioned into the… https://t.co/JfexDbczfk pic.twitter.com/Lpe1GL1NLB
ఇది కూడా చదవండి: Nuh Violence : హర్యానా అల్లర్లలో బజరంగ్‌దళ్ కార్యకర్త అరెస్టు
Comments
Please login to add a commentAdd a comment