రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు మొదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా భరత్‌పూర్‌లో బూత్ స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజస్తాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ వైపుకి కాంగ్రెస్ టర్న్ తీసుకోదని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి ఆశోక్ గెహ్లాట్ వైపే కాంగ్రెస్ మొగ్గు చూపుతుందని. ఎందుకంటే కాంగ్రెస్ ఖజనాను నింపడంలో గెహ్లాట్ సహకారమే ఎక్కువ కాబట్టి అంటూ సెటైర్లు వేశారు.
ఆ విషయంలో సచిన్ పైలట్ సహకారం తక్కువ అని దీంతో అతని వైపు మెజార్టీ సభ్యులు ఉండరన్నారు. అంతేగాదు గెహ్లాట్ రాజస్తాన్ ప్రభుత్వాన్ని అవినీతికి అడ్డాగా మార్చి దోచుకున్నారన్నారు. ఆ అవినీతి సొమ్ము కాంగ్రెస్ పార్టీ ఖజానాకు పోయిందని ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన 2008లో జైపూర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితులను నిర్దోషిగా విడుదల చేయడంపై కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.
రాజస్తాన్‌లో త్రీడీ ప్రభుత్వం ఉందని, మూడు 'డీ'లు అర్థం ఏమిటంటే.. డాంగే(అల్లర్లు), దుర్వ్యవర్(అన్యాయంగా ప్రవర్తించడం), దళితులపై ధౌర్జన్యాలు అంటూ కొత్త అర్థాలను ఆపాదిస్తూ విరుచుకుపడ్డారు. అలాగే ప్రజలు ఎన్నికలలో ఈ పభ్రుత్వాన్ని తరిమికొడతారని, అసెంబ్లీలో బీజేపీ భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమాగా చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం పనితీరు, పార్టీ సిద్ధాంతాలు, ఆయనకు ఉన్న ప్రజాధరణ తదితరాల కారణంగానే ఎన్నికల బరీలోకి దిగుతోందన్నారు. ఆశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాజస్తాన్ చరిత్రలోని అవినీతి ప్రభుత్వాల్లో ఒకటని, దీంతో ప్రజలు విసిగిపోయారంటూ అమిత్ షా కాంగ్రెస్‌పై విరుచుకపడ్డారు. కాగా, సచిన్ పైలట్ సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేయడమే గాక పార్టీ వ్యతిరేక చర్యగా పరిగణిస్తామని పెలట్‌ని హెచ్చరించింది కూడా.
(చదవండి: పరువు నష్టం కేసులో రాహుల్‌కి ఉపశమనం..ప్రత్యక్ష హాజరుకు మినహాయింపు)
Comments
Please login to add a commentAdd a comment