come
-
అతని వైపుకి కాంగ్రెస్ టర్న్ తీసుకోదు! ఎందుకంటే..
రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు మొదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా భరత్‌పూర్‌లో బూత్ స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజస్తాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ వైపుకి కాంగ్రెస్ టర్న్ తీసుకోదని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి ఆశోక్ గెహ్లాట్ వైపే కాంగ్రెస్ మొగ్గు చూపుతుందని. ఎందుకంటే కాంగ్రెస్ ఖజనాను నింపడంలో గెహ్లాట్ సహకారమే ఎక్కువ కాబట్టి అంటూ సెటైర్లు వేశారు. ఆ విషయంలో సచిన్ పైలట్ సహకారం తక్కువ అని దీంతో అతని వైపు మెజార్టీ సభ్యులు ఉండరన్నారు. అంతేగాదు గెహ్లాట్ రాజస్తాన్ ప్రభుత్వాన్ని అవినీతికి అడ్డాగా మార్చి దోచుకున్నారన్నారు. ఆ అవినీతి సొమ్ము కాంగ్రెస్ పార్టీ ఖజానాకు పోయిందని ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన 2008లో జైపూర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితులను నిర్దోషిగా విడుదల చేయడంపై కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. రాజస్తాన్‌లో త్రీడీ ప్రభుత్వం ఉందని, మూడు 'డీ'లు అర్థం ఏమిటంటే.. డాంగే(అల్లర్లు), దుర్వ్యవర్(అన్యాయంగా ప్రవర్తించడం), దళితులపై ధౌర్జన్యాలు అంటూ కొత్త అర్థాలను ఆపాదిస్తూ విరుచుకుపడ్డారు. అలాగే ప్రజలు ఎన్నికలలో ఈ పభ్రుత్వాన్ని తరిమికొడతారని, అసెంబ్లీలో బీజేపీ భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమాగా చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం పనితీరు, పార్టీ సిద్ధాంతాలు, ఆయనకు ఉన్న ప్రజాధరణ తదితరాల కారణంగానే ఎన్నికల బరీలోకి దిగుతోందన్నారు. ఆశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాజస్తాన్ చరిత్రలోని అవినీతి ప్రభుత్వాల్లో ఒకటని, దీంతో ప్రజలు విసిగిపోయారంటూ అమిత్ షా కాంగ్రెస్‌పై విరుచుకపడ్డారు. కాగా, సచిన్ పైలట్ సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేయడమే గాక పార్టీ వ్యతిరేక చర్యగా పరిగణిస్తామని పెలట్‌ని హెచ్చరించింది కూడా. (చదవండి: పరువు నష్టం కేసులో రాహుల్‌కి ఉపశమనం..ప్రత్యక్ష హాజరుకు మినహాయింపు) -
ధర్మయుద్ధానికి తరలిరండి
వనపర్తిటౌన్: దళితుల జీవితాలతో ప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయని ఎంఎస్ఎఫ్ రాష్ట్ర సమన్వయకర్త పురుషోత్తం మండిపడ్డారు. బుధవారం రాత్రి దాచ లక్ష్మయ్య ఫంక్షన్హాల్లో జరిగిన సంఘం విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. మాదిగలు దశబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతుంటే, పాలకులు నాన్చుడుధోరణి అవలంభిస్తున్నాయని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణతోనే మాదిగలకు సంపూర్ణ న్యాయం జరుగుతుందన్నారు. నవంబర్ 30వ తేదీన హైదరాబాద్‌లో జరిగే మాదిగల ధర్మయుద్ధభేరికి ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు తరలిరావాలని కోరారు. ఈనెల 20వ తేదీ నుంచి విద్యార్థిలోకాన్ని చైతన్యవంతులుగా తీర్చిదిద్దేందుకు అక్టోబర్ 10వ తేదీ వరకు జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్తీక్, రాజేష్, సురేష్, ప్రకాశ్, రాహుల్, బీసన్న, శివ, విష్ణు పాల్గొన్నారు. -
హోదాతో విదేశీ కంపెనీలు క్యూ కడతాయి
-
వానొస్తే దుకాణాల మూతే..
షాపులను ముంచెత్తుతున్న వర్షపునీరు నీళ్లువెళ్లే దారిలేక తంటాలు లోతట్టు ప్రాంతాలు జలమయం వర్షం కురిసినప్పుడల్లా వ్యాపారాలు బంద్ వేములవాడ : వేములవాడ రాజన్న ఆలయం ముందున ఉన్న దుకాణాలు వానొస్తే మూతపడుతున్నాయి. భారీ వర్షం కురిస్తే.. ముల్లె–మూటా సర్దుకుని షాపులకు తాళాలు వేస్తున్నారు. ఇందుకు కారణం.. వర్షపు నీరు ఎటూ వెళ్లే దారిలేదు. ఎక్కడపడితే అక్కడే నిలిచిపోతోంది. లోతట్టు ప్రాంతాల్లోని దుకాణాల్లోకి చేరుతోంది. ప్రధానంగా బద్దిపోచమ్మ, భీమన్నగుడి ప్రాంతాల నుంచి వచ్చే వర్షపు నీరంతా అంబేద్కర్ చౌరస్తా, రాజన్న గుడి, జాత్రాగ్రౌండ్ ప్రాంతాల్లోని దుకాణాల్లోకి వచ్చి చేరుతోంది. దీంతో దుకాణాలు మూసివేసి సరుకులు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. సాలీనా రూ.70 కోట్ల పైచిలుకు ఆదాయం వస్తున్నా.. రాజన్న ఆలయ అధికారులు, రూ.కోట్లలో ఆదాయం సమకూర్చుకుంటున్న నగరపంచాయతీ అధికారులు లోతట్టు ప్రాంతాల్లోని వరద తాకిడి ప్రాంతాలను పట్టించుకున్న పాపాన పోవడం లేదు. సుమారు అరవై ఏళ్లుగా ఇదే దుస్థితి కొనసాగుతోంది. వర్షం కురిసినప్పుడల్లా ఆ నీటిలో రూ.లక్షల విలువైన సరుకులు తడిసి ఎందుకూ పనికిరాకుంటాపోతున్నాయి. ఆగస్టు 3వ తేదీన శ్రావణమాసం ప్రారంభమవుతుంది. నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. వర్షాలు కురిస్తే భక్తులు సైతం ఈమార్గం గుండా నడవడం గగనమే. పాలుకులు ఇప్పటికైనా స్పందించి ఈ ప్రాంతంలో తగిన చర్యలు తీసుకోవాలని వ్యాపారులు కోరుతున్నారు. వేములవాడ– కరీంనగర్ రోడ్డు అధ్వానంగా మారింది. వేములవాడ నుంచి కొదురుపాక వరకు వేలాది గుంతలు, గతుకులతో వాహనదారులకు తీవ్ర ఇక్కట్లు కలుగుతున్నాయి. తద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయి. వచ్చేనెల 3వ తేదీ నుంచి శ్రావణమాసం వేడుకలు నిర్వహిస్తారు. దీంతో నిత్యం వేలాది మంది భక్తులు వేములవాడ రాజన్న దర్శనం కోసం ఈ మార్గం ద్వారానే వస్తుంటారు. కనీసం ప్యాచ్ వర్క్ అయినా చేయించాలని స్థానికులు కోరుతున్నారు. సర్కారు సేవలకు దారేది..? పట్టణంలోని పశువైద్యశాల, కోర్టు భవనం, నగరపంచాయతీ కార్యాలయం ముందు వర్షపు నీరు నిలిచి ఉంటోంది. కనీసం కార్యాలయంలోకి వెళ్లేందుకు దారి లేకుండాపోయింది. బురద, నీరు నిల్వకావడంతో కాలినడక సైతం గగనమవుతోంది. -
నేడు ఐజీ సౌమ్య మిశ్రా రాక
ఏర్పాట్లను పర్యవేక్షించిన డీఎస్పీ, ఎమ్మెల్యే సుల్తానాబాద్: మండలంలోని ఐతరాజుపల్లి మైసమ్మగుట్ట వద్ద మంగళవారం జరిగే హరితహారం బహిరంగసభకు ఐజీ సౌమ్యమిశ్రా హాజరవుతున్నారు. ఈ సభ ఏర్పాట్లను సోమవారం పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, డీఎస్పీ మల్లారెడ్డి పరిశీలించారు. గుట్టను పోలీసులు దత్తత తీసుకుని 50 ఎకరాల విస్తీర్ణంలో పండ్ల మొక్కలను నాటేందుకు గుంతలు తవ్వారు. ఇప్పటికి గుట్ట వద్ద రెండు బోర్‌వెల్స్ ఏర్పాటు చేశారు. వాటర్ ట్యాంకు నిర్మించి, స్ప్రిక్లర్ల ద్వారా మొక్కలకు నీరందించే ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీఐజీ ప్రభాకర్‌రావు, ఎస్పీ జోయల్‌డేవిస్, ఏఎస్పీ అన్నపూర్ణ హాజరుకానున్నారని తెలిపారు. పదిరోజులుగా స్థానిక సీఐ తుల శ్రీనివాస్‌రావు, ఎస్సై ఇంద్రసేనారెడ్డి, సర్పంచ్ లావణ్య, ఎంపీటీసీ భూమేష్ పర్యవేక్షణలో పనులు నిర్వహిస్తున్నారు. సభకు తరలించే సుమారు 6వేల మందికి అవసరమైన ఏర్పాటు చేస్తున్నారు. వీరితో పాటు జూలపల్లి ఎస్ఐ రఫీక్‌ఖాన్, ట్రైనింగ్ ఎస్సై జగన్, వీపీవో వీరస్వామి ఉన్నారు. -
కుదిరిన ముహూర్తం
ఆర్ఎఫ్సీఎల్, ఎన్టీపీసీ తెలంగాణ స్టేజ్–1 ప్లాంట్లకు ముహూర్తం ఆగస్టు 7న ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతుల మీదుగా శంకుస్థాపన ఏర్పాట్లలో నిమగ్నమైన యాజమాన్యాలు గోదావరిఖని : ఎట్టకేలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ రామగుండం పారిశ్రామిక ప్రాంత పర్యటనకు ముహూర్తం ఖరారైంది. గత ఏడాది నవంబర్, డిసెంబర్, ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని ఈ ప్రాంతానికి వస్తారని స్వయంగా కేంద్రమంత్రులే ప్రకటించినప్పటికీ ఆయన పర్యటన రదై్దంది. తాజాగా సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర పర్యటనకు రావాలని కోరడంతో ప్రధాని అంగీకరించారు. ఆగస్టు 7వ తేదీన రాష్ట్ర పర్యటనకు వస్తున్న క్రమంలో రామగుండం ఎన్టీపీసీ తెలంగాణ స్టేజ్–1 ప్లాంట్, ఆర్ఎఫ్సీఎల్ గ్యాస్ ఆధారిత ఎరువుల కర్మాగారం పనులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. మూసివేసిన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని గ్యాస్ ఆధారితంగా పునర్నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన అంతర్గత పనులు మార్చి 25న (జీరో డేట్) ప్రారంభమయ్యాయి. అలాగే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను నిర్మించే క్రమంలో రామగుండంలో తెలంగాణ స్టేజ్–1 కింద 800 మెగావాట్ల రెండు యూనిట్లను నెలకొల్పుతోంది. ఈ పనులు జనవరి 29న (జీరో డేట్) అంతర్గతంగా ప్రారంభమయ్యాయి. ఈ రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల పనులకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆగస్టు 7న లాంఛనప్రాయంగా శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకోసం రామగుండం ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్షిప్లో మూడు హెలీక్యాప్టర్లు ల్యాండ్ అయ్యేవిధంగా హెలీప్యాడ్లను సిద్ధం చేస్తున్నారు. పక్కనే గల స్టేడియంలో బహిరంగసభ నిర్వహించే అవకాశాలున్నాయి. ఆర్‌ఎఫ్‌సీఎల్‌తో మహర్దశ గతంలో రామగుండం పారిశ్రామికాభివృద్ధికి ఎరువుల కర్మాగారం కీలకంగా నిలిచింది. అన్నపూర్ణ పేరుతో ఎరువులను తెలంగాణ ప్రాంతానికి అందించింది. అయితే నిర్వహణ లోపాలు, అప్పుల కారణంగా ఈ కర్మాగారం నష్టాల్లో కూరుకుపోయింది. దీంతో 1999 మార్చి 31న ఉత్పత్తిని నిలిపివేశారు. బీఐఎఫ్ఆర్కు వెళ్లిన ఈ కంపెనీ రూ.10 వేల కోట్ల అప్పులను మాఫీ చేయడంతో చాలాకాలం తర్వాత అందులో నుంచి బయటపడింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ కర్మాగారాన్ని గ్యాస్ ఆధారితంగా పునర్నిర్మించడానికి నిర్ణయించింది. ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్, నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్, ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జాయింట్ వెంచర్లో రూ.5,700 కోట్ల అంచనా వ్యయంతో పునర్నిర్మిస్తున్నారు. 3,850 మెట్రిక్ టన్నులు అమోనియా, 2,200 మెట్రిక్ టన్నుల యూరియా ఈ కర్మాగారంలో ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. గ్యాస్ సరఫరాకు సంబంధించి ఈనెల 8న గుజరాత్‌కు చెందిన కంపెనీతో ఒప్పందం జరిగింది. కాకినాడ నుంచి మల్లవరం వరకు వేసే పైపులైన్ నుంచి గ్యాస్‌ను తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం రామగుండం ఎరువుల కర్మాగారం ఆవరణలోని పాత యంత్రాలు, విభాగాలను పూర్తిగా తొలగించి నేలను చదును చేశారు. యూరియా ప్రిల్లింగ్ టవర్, యూరియాను నిల్వ ఉంచే సైలో మినహా అన్నింటిని తొలగించారు. ఇందులో 500 మంది శాశ్వత ఉద్యోగులు, మరో వెయ్యి మంది కాంట్రాక్ట్ కార్మికులకు ఉపాధి లభించనుంది. రెండు ప్లాంట్లు... 1600 మెగావాట్లు తెలంగాణ స్టేజ్–1 మొదటి దశలో 800 మెగావాట్ల రెండు యూనిట్ల నిర్మాణ పనులు వేగంగా నడుస్తున్నాయి. బాయిలర్ కాంట్రాక్టు పొందిన బీహెచ్ఈఎల్ సంస్థ గ్రౌండ్ లెవల్, గ్రేడింగ్ పనులను పూర్తి చేసి బాయిలర్లు నెలకొల్పేందుకు ఫౌండేషన్‌ను సిద్ధం చేసింది. టర్బైన్ కాంట్రాక్టును దక్కించుకున్న ఆల్స్టాం సంస్థ మట్టి పరీక్ష పనులను పూర్తి చేసి పవర్‌హౌస్ స్థలాన్ని చదును చేసి స్ట్రక్చర్ల నిర్మాణానికి సిద్ధం చేసింది. అలాగే పవర్‌హౌస్, బాయిలర్లు, కూలింగ్ టవర్లు, స్విచ్యార్డుతోపాటు 275 మీటర్ల చిమ్నీని నిర్మిస్తారు. తెలంగాణ ఫేస్–1 కోసం ఇప్పటికే రూ.10,500 కోట్లు మంజూరయ్యాయి. బాయిలర్, టర్బైన్ పనులు నడుస్తుండగా, మిగతా సివిల్ పనులను బీహెచ్ఈఎల్, ఆల్స్టాం సంస్థలు సబ్‌కాంట్రాక్టర్లకు అప్పగించాయి. సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మిస్తున్నందున ప్రాజెక్టు పూర్తి చేసేందుకు 42 నెలల సమయం పడుతుంది. ఫేస్–2లో 800 మెగావాట్ల 3 యూనిట్లను ప్రస్తుత కొత్త ప్లాంట్ ప్రతిపాదిత స్థలంలోనే నిర్మించేందుకు కార్పొరేట్ ఇంజనీరింగ్ విభాగం నిర్ణయించింది. ఈ మూడు యూనిట్లకు అనుసంధానంగా ఉండే మెయిన్ ప్లాంటులోని బాయిలర్, టర్బైన్ తదితర విభాగాలను ఫేస్–1 పరిసరాలలోనే ఏర్పాటు చేయనున్నారు. ఆగస్టు 7వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుండడంతో పనులు మరింత వేగవంతమవుతాయని భావిస్తున్నారు. -
సైనిక స్కూళ్ల ఏర్పాటుకు అంగీకారం!
ఇటానగర్ః అరుణాచల్ ప్రదేశ్ లో రెండు సైనిక పాఠశాలలు సహా రెండు పర్మనెంట్ రిక్రూట్ మెంట్ సెంటర్ల స్థాపనకు రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అంగీకరించారు. రాష్ట్రంలో రక్షణ దళాల నియామకాలను మరింతగా పెంచేందుకు వీలుగా రిక్రూట్ మెంట్ సెంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అరుణాచల్ ముఖ్యమంత్రి కలిఖో పుల్ ప్రతిపాదనను రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అంగీకరించారు. గురువారం రక్షణ మంత్రితో ఢిల్లీలో సమావేశమైన కలిఖో... సైనిక పాఠశాలల స్థాపన విషయాన్ని ఓ అధికారిక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఆర్మీ స్టాఫ్ జనరల్ దల్బీర్ సింగ్ ను కూడ ముఖ్యమంత్రి కలిఖో కలుసుకున్నారు. తాజా ప్రతిపాదన ప్రకారం ఒక పాఠశాలను పశ్చిమ ప్రాంతంలోని షెర్గాన్ లోనూ, మరొకటి తూర్పు ప్రాంతంలోని తెజు లోనూ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. అయితే పర్మనెంట్ రిక్రూట్ మెంట్ సెంటర్లను మాత్రం పశ్చిమ ప్రాంతంలోని తవాంగ్ లో ఒకటి, తూర్పు ప్రాంతంలోని తెజులో ఒకటి స్థాపించేందుకు రక్షణ మంత్రి అంగీకరించినట్లు తెలిపారు. అంతేకాక, పౌర అవసరాల కోసం రక్షణ దళాలు వినియోగించే అత్యవసర హెలికాప్టర్ల విస్తరణను సులభతరం చేసేందుకు అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్ (ఏఎల్జీ) ఎంవోఏ ను కూడ పునరుద్ధరించేందుకు రక్షణమంత్రి పారికర్ అంగీకరించారు. అయితే బోర్డర్ రోడ్స్ అర్గనైజేషన్ ద్వారా సరిహద్దు రోడ్ల నిర్మాణం, నిర్వహణ విషయాన్నికూడ కలిఖో పాల్ రక్షణమంత్రిని కోరినట్లు తెలుస్తోంది. -
'శ్రీమంతుడి' రాక కోసం
-
జిహాదీ జాన్ ఎప్పటికైనా తిరిగొస్తాడు..!
భారతీయ మూలాలు కలిగిన బ్రిటిష్ పౌరుడు.. కొత్త 'జిహాదీ జాన్' గా పిలుస్తున్న సిద్ధార్థ ధర్ చనిపోయినట్లు తాను నమ్మడం లేదని తాజాగా అతడి సోదరి కోనికా ధర్ తాజాగా బ్రిటిష్ పార్లమెంట్ లో ప్రకటించింది. ఎప్పటికైనా అతడు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడన్న నమ్మకం తమకు ఉందంటోంది. ఐసిస్ ఉగ్రవాదుల్లో జిహాదీ జాన్ గా అవతరించిన సిద్ధార్థ్ అలియాస్ అబు రుమేసహ్ వైమానిక దాడుల్లో చనిపోయినట్లు ఇటీవల ఐఎస్ అధికారిక మేగజైన్ దబిక్ నిర్థారించినప్పటికీ ఆ విషయాన్నిఆమె అంగీకరించడం లేదు. తన సోదరుడు అంత దయలేని వ్యక్తి కాదని, హత్యకు గురై ఉండడంటూ ఆమె భావోద్వేగ ప్రకటన చేసింది. సిద్ధార్థ అలియాస్ అబు రుమేసహ... భార్య, నలుగురు పిల్లలతో సహా 2014లో బ్రిటన్ నుంచి పారిపోయి సిరియాకు వెళ్ళి ఐసిస్ లో చేరాడు. పుట్టుకతో హిందువు అయిన అబు.. వ్యాపారం నిమిత్తం బ్రిటన్ వచ్చి, ఇస్లాం మతాన్ని స్వీకరించాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ లో అల్ ముహజిరౌన్ అనే రాడికల్ గ్రూప్ లో చేరాడు. అక్కడినుంచి సిరియా వెళ్ళి ఐసిసితో చేతులు కలిపిన అతడు అనేక దారుణాలకు పాల్పడ్డట్లుగా విడుదలైన వీడియోను అప్పట్లో అతడి సోదరి కోనికా, తల్లి శోభితా ప్రత్యక్షంగా చూశారు. అయితే అతడి గొంతు మాత్రం గుర్తుపట్టేలా లేదని, తమను షాక్ కు గురి చేస్తోందని చెప్పారు. అయితే తాజాగా ఇప్పుడు కోనికా మరోసారి ఆ వీడియోలో వ్యక్తి తన సోదరుడు కాదని, అతడు ఎప్పటికైనా తిరిగి ఇంటి వస్తాడని ఆశాభావం వ్యక్తం చేసింది. సిద్ధార్థ ఓ ఉదారవాద హిందూ కుటుంబంలో పెరిగాడని.. అతడిది అటువంటి తీవ్రవాద చర్యలకు పాల్పడే మనస్తత్వం కాదని కోనికా చెప్తోంది. అతడు ఎక్కడున్నాడో ఎలాగైనా తెలుసుకునే ప్రయత్నం చేస్తానని, తన సోదరుడు ఉగ్రవాది కాదని నిరూపిస్తానని అంటోంది. కాగా అతడు హత్యకు గురి కాలేదని ఎలా నిరూపించగలవంటూ ఆమెను కామన్స్ హోం ఎఫైర్స్ కమిటీ ప్రశ్నించగా... తన అన్నను గత సెప్టెంబర్ లో చూశానని, ఆ తర్వాత కొన్నాళ్ళకు అతడు సిరియా వెళ్ళిపోయాడని, అప్పట్నుంచీ అతడితో మాట్లాడేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించామని, కానీ రెండుసార్లు మాత్రం అతడు సమాధానం ఇచ్చాడని చెప్తోంది. అయితే మొదటిసారి అతన్ని టీవీలో చూసినప్పుడు మాత్రం అబూ ఎవరు? అని గుర్తించలేకపోయానంది. అతడిని ఐసిస్ కు సంబంధించిన వ్యక్తులు ప్రేరేపించి ఉండొచ్చని, తన మాటలు సాధారణ ప్రజలు నమ్మకపోయినా.. అతడు తన సోదరుడని వక్కాణిస్తోంది. సిరియాలో వారు నివసించే అవకాశం లేదు కనుక తన సోదరుడి కుటుంబం బంధించబడి ఉంటుందని.... అతడి ఇంగ్లీషు భాషను బట్టి బ్రిటిష్ ప్రధాని అతడే తన సోదరుడనడం సరికాదని ఆమె ఆందోళన వ్యక్తం చేస్తోంది. -
సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభం