ధర్మయుద్ధానికి తరలిరండి | Come to Dharmayudham | Sakshi
Sakshi News home page

ధర్మయుద్ధానికి తరలిరండి

Published Fri, Sep 16 2016 12:20 AM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM

Come to Dharmayudham

వనపర్తిటౌన్‌: దళితుల జీవితాలతో ప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయని ఎంఎస్‌ఎఫ్‌ రాష్ట్ర సమన్వయకర్త పురుషోత్తం మండిపడ్డారు. బుధవారం రాత్రి దాచ లక్ష్మయ్య ఫంక్షన్‌హాల్‌లో జరిగిన సంఘం విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. మాదిగలు దశబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతుంటే, పాలకులు నాన్చుడుధోరణి అవలంభిస్తున్నాయని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణతోనే మాదిగలకు సంపూర్ణ న్యాయం జరుగుతుందన్నారు. నవంబర్‌ 30వ తేదీన హైదరాబాద్‌లో జరిగే మాదిగల ధర్మయుద్ధభేరికి ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు తరలిరావాలని కోరారు. ఈనెల 20వ తేదీ నుంచి విద్యార్థిలోకాన్ని చైతన్యవంతులుగా తీర్చిదిద్దేందుకు అక్టోబర్‌ 10వ తేదీ వరకు జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో పాదయాత్ర  నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్తీక్, రాజేష్, సురేష్, ప్రకాశ్, రాహుల్, బీసన్న, శివ, విష్ణు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement