purushotham
-
స్టార్టప్‌లతో లక్ష్యాలను చేరుకోండి
సాక్షి, మణికొండ: యువ ఇంజినీర్లు స్టార్టప్‌లను ఏర్పాటుచేసి ఇతరుకుల ఉపాధిని చూపే స్థాయి ఎదగాలని జాతీయ పరిశోధనా సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పురుషోత్తం ఆకాంక్షించారు. గండిపేటలోని సీబీఐటీ కళాశాలలో శనివారం 3వ గ్రాడ్యుయేషన్ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని విద్యార్థులకు కళాశాల అధ్యక్షుడు డాక్టర్ వి.మాలకొండారెడ్డితో కలిసి పట్టాలు అందించారు. కేంద్ర ప్రభుత్వం స్టార్టప్‌లకు యేటా రూ.10వేల కోట్లను కేటాయించి ప్రోత్సహిస్తోందని తెలిపారు. క్రమశిక్షణతో జీవితంలో స్థిరపడి వచ్చిన సంపాదనలో కొంత సమాజానికి తిరిగి ఇవ్వాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం నైపుణ్యం ఉన్నవారికి పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తూ, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించటంతో పాటు ఎన్ఆర్డీసీ సహకరిస్తుందని తెలిపారు. ఇంజినీరింగ్ విద్యార్థుల్లో యేటా 18 నుంచి 20శాతం మంది మాత్రమే ఉపాధి పొందుతున్నారని చెప్పారు. చదువుతో పాటు సమాజంపై పరిజ్ఞానం ఉంటేనే రాణించే అవకాశం ఉందని పేర్కొన్నారు. 700మంది విద్యార్థులకు పట్టాలను అందజేశారు. కార్యక్రమంలో డెవలప్మెంట్, పర్చెజింగ్ కమిటీ చైర్పర్సన్ సంధ్యశ్రీ, ప్రిన్సిపాల్ డాక్టర్ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పట్టాలను అందుకున్న ఆనందంలో విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. -
జగన్ సీఎం అవ్వడంతో మొక్కులు తీర్చుకుంటున్న అభిమానులు
-
మావో కీలకనేతల లొంగుబాటు
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీ కీలక నేతలు కోటి పురుషోత్తం(68), వినోదిని(63) దంపతులు మంగళవారం హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ఎదుట లొంగిపోయారు. వీరు మావోయిస్టు పార్టీ యాజిటేషన్ ప్రాపగాండ కమిటీ(ఏపీసీ)లో కీలకంగా వ్యవహరించారు. వీరు పార్టీ అగ్రనేతలు ఆర్కే, గణపతిలతో సన్నిహితంగా మెలిగారు. చాలాకాలంగా అజ్ఞాతంలో ఉంటున్నారు. రీజనల్ కమిటీ సభ్యుడి హోదాలో ఉన్న పురుషోత్తంపై రూ.8 లక్షలు, దళ కమాండర్ హోదాలో ఉన్న వినోదినిపై రూ.5 లక్షల రివార్డు ఉంది. వీరు ఏ విధ్వంసంలోనూ పాల్గొనలేదని, రివార్డులు వారి హోదాలపై మాత్రమే ఉన్నాయని అంజనీకుమార్ తెలిపారు. ఇద్దరూ ఉపాధ్యాయ వృత్తి నుంచే... నగరంలోని భోలక్‌పూర్‌కు చెందిన పురుషోత్తం 1974లో నల్లకుంట కేంద్రంగా పనిచేస్తున్న ఆంధ్ర సారస్వత పరిషత్ నుంచి ఓరియంటల్ లాంగ్వేజెస్‌లో బ్యాచులర్ డిగ్రీ, 1987లో ఓపెన్ యూనివర్సిటీలో ఎంఏ పూర్తి చేశారు. 1981లో అడ్డగుట్టలోని ఓ స్కూలులో ప్రధానోపాధ్యాయులుగా పనిచేశారు. ఈ వృత్తిలో ఉండగానే ఈయనకు అప్పటి నక్సలైట్ నేతలు మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీ, కేజీ సత్యమూర్తిలతో పరిచయం ఏర్పడింది. వారి ప్రభావంతో 1981లో పురుషోత్తం తన 31వ ఏట మావోయిస్టు పార్టీలో చేరారు. నగరంలోని అడ్డగుట్టకు చెందిన వినోదిని అలియాస్ విజయలక్ష్మి అలియాస్ భారతక్క తండ్రి పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేస్తూ ఆమె చిన్నతనంలోనే కన్నుమూశారు. ఆమె 1982లో అడ్డగుట్టలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. వృత్తుల నేపథ్యంలోనే పరిచయమైన వీరు 1982లో వివాహం చేసుకున్నారు. శివశంకర్ కుమారుడి కిడ్నాప్‌తో విడుదల పురుషోత్తం 1981 నుంచి 1986 వరకు మావోయిస్టు పార్టీ సిటీ కమిటీ సభ్యుడిగా, కార్యదర్శిగా పనిచేశారు. వివాçహానంతరం వినోదిని సైతం తన 27వ ఏట మావోయిస్టు పార్టీలో చేరడంతో భార్యాభర్తలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. హైదరాబాద్, విశాఖపట్నం కేంద్రంగా పార్టీలో పనిచేశారు. 1991 మార్చ్‌లో వీరిద్దరితోపాటు అప్పటి రాష్ట్ర కమిటీ సభ్యుడు నిమ్మలూరి భాస్కర్‌రావు, జిల్లా కమిటీ సభ్యుడు సమ్మిరెడ్డి అరెస్టు అయ్యారు. అదే ఏడాది మేలో నాటి కేంద్రమంత్రి పి.శివశంకర్ కుమారుడు, యూత్ కాంగ్రెస్‌నేత పి.సుధీర్‌కుమార్‌ను హైదరాబాద్‌లో కిడ్నాప్ చేశారు. వారి డిమాండ్ మేరకు విడుదలైన నలుగురు నక్సలైట్ నేతల్లో పురుషోత్తం, వినోదిని సైతం ఉన్నారు. బయటకు వచ్చాక మళ్లీ పార్టీ వైపు... జైలు నుంచి బయటకు వచ్చిన పురుషోత్తం 1996 వరకు విశాఖపట్నం కేంద్రంగా రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, వినోదిని నల్లమల అటవీ ప్రాంత ప్రకాశం, ఆంధ్రా ఒడిశా బోర్డర్, అనంతగిరి, ఉద్దానం, శ్రీకాకుళం దళాల్లో 1996 వరకు పనిచేశారు.1996 నుంచి 2005 వరకు సబ్–కమిటీ ఆన్ పొలిటికల్ ఎడ్యుకేషన్(స్కోప్)లో విధులు నిర్వర్తించారు. చెన్నైకు వెళ్లి అక్కరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే, గణపతి ఆదేశాల మేరకు కొంతకాలం పనిచేశారు. పురుషోత్తం 13 ఏళ్లపాటు కొరియర్లు అందించే లేఖల ద్వారా ఆర్కేతో సంబంధాలు కలిగి ఉన్నారు. ఆ సమయంలో వినోదిని డీటీపీ వర్క్ చేసేవారు. ఈమె అనారోగ్యం కారణంగా ఇద్దరూ 2014లో హైదరాబాద్‌కు వచ్చేశారు. వినోదిని గత ఏడాది నుంచి బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. దీంతోపాటు ఇతర కారణాలతో వీరిద్దరూ మంగళవారం నగర పోలీసు కమిషనర్ ముందు లొంగిపోయారు. -
మావోయిస్టు నేత ఆర్కే అసమర్థుడు
సాక్షి, హైదరాబాద్: లొంగిపోయిన మావోయిస్టుపార్టీ కీలకనేత కోటి పురుషోత్తం ఆ పార్టీ అగ్రనేతలు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే, గణపతిలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆర్కే అసమర్థుడని, ఆయనకు స్వార్థం ఎక్కువని, ఎదుటివారిని ఎదగనీయడని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధిలో పాత్రధారులం కావాలనే ఆకాంక్షతోనే జనజీవన స్రవంతిలోకి వచ్చామన్నారు. ఇటీవల ఏపీలోని విశాఖ ఏజెన్సీలో జరిగిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యలు ఘోర తప్పిదాలని అన్నారు. వీటిపై పార్టీలో విభేదాలు ఉన్నాయని, అందుకే ఇప్పటివరకు ఈ హత్యలపై మావోయిస్టులు ప్రకటన చేయలేకపోయారన్నారు. పాతికేళ్లు ఆర్కే, గణపతిలతో సన్నిహితంగా మెలిగానంటున్న పురుషోత్తం మీడియా సమావేశంలో పలు విషయాలు చెప్పారు... ‘స్వయంగా ఎదిగిన ఏకలవ్యుడి వేలు కోరే ద్రోణాచార్యులు, నమ్మించి చంపే బాహుబలిలోని కట్టప్ప లాంటి వాళ్లకు పార్టీలో కొదవ లేదు. కొన్నేళ్లుగా నేను, నా భార్య వినోదిని ఈ రెంటికీ గురయ్యాం. సుదీర్ఘకాలం ఆర్కే, గణపతిలతో కలసి ఉన్నా పార్టీ మమ్మల్ని నిర్లక్ష్యం చేసింది. వేరే రాష్ట్రంలో ఉంచి అక్కడ నుంచి రావద్దంటూ డబ్బు పంపకుండా వేధించింది. అక్కడ ఎలా ఉండా లో అర్థం కాక ఎన్నో లేఖలు రాశాం. ఏ జవాబు లేదు. పార్టీలో ఎవరి మేలు వారు చూసుకుంటున్నారు. అగ్రనాయకత్వం ఒడిదుడుకుల్లో ఉంది. పదేళ్లుగా ఆర్కే, గణపతి మారతారని ఎదురుచూశాం. అనేక సందర్భాల్లో వారిద్దరూ నా భార్య వినోదిని చేతివంట తిన్నారు. ఆమె పదేళ్లుగా అనారోగ్యంతో ఉందని తెలిసినా వారు పట్టించుకోలేదు. పార్టీలో మానవసంబంధాలు కనుమరుగయ్యాయి. అందుకే ఉద్యమం ప్రస్తుతం ఆదివాసీలకే పరిమితమైంది. కార్యక్రమాల్లో ఉన్న లోపాల కారణంగానే యువత, విద్యార్థులు పార్టీలోకి రావట్లేదు. వారు లేకుండా ఉద్యమం ఎక్కువకాలం నడవదు. అగ్రనేతలు 2007 లో ఏపీ(ఉమ్మడి) నుంచి సెట్‌బ్యాక్, రిట్రీట్ అంటూ ప్రకటించారు. వారి విజన్ దెబ్బతినడంతోనే అప్పటి నుంచి ముందుకు పోలేకపోతున్నారు. మాలాగా ఇతర రాష్ట్రాల్లో ఉన్న పార్టీ క్యాడర్ మమ్మల్ని కలిసినప్పుడు బాధపడ్డారు. పదేళ్లుగా సెంట్రల్ కమిటీకీ ఉత్తరాలు రాస్తున్నా స్పందనలేదు. 1969, 1972ల్లో జరిగిన తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్నాను. నా జీవితంలో తెలంగాణ వస్తుందని అనుకోలేదు. 1946 నుంచి 2014 వరకు తెలంగాణ విధ్వంసమైంది. తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ వల్ల 2014 నుంచి అభివృద్ధి చెందుతోంది. ఇక్కడి ప్రజల్లో కొనుగోలుశక్తి పెరిగింది. ఆసరా, రైతుబంధు, కల్యాణలక్ష్మి వంటి పథకాలు అద్భుతం గా ఉన్నాయి. రాష్ట్రం కోసం మా వంతుగా సాయం చేయాలని ఆశిస్తున్నాం’అని పురుషోత్తం అన్నారు. బయటి రాష్ట్రంలో ఉండగా తాను ప్రింటింగ్ ప్రెస్ నడిపానని వినోదిని చెప్పారు. 2000లో తాను అనారోగ్యానికి గురైనా పార్టీ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్ల క్రితం తమను పట్టించుకుంటే అందులో కొనసాగేవారమే. కానీ, ఇప్పుడిక సాధ్యం కాదని స్పష్టం చేశారు. మరింత మంది ముందుకు రావాలి ఇది మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ. పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలను ఎత్తి చూపిస్తోంది. అజ్ఞాతంలో ఉన్న మరికొంత మంది మావోయిస్టు పార్టీ నేతలు పురుషోత్తం, వినోదినిలను స్ఫూర్తిగా తీసుకుని బయటకు రావాలి. బయటికి వచ్చినవారికి పోలీసులు అన్ని విధాలుగా సహకరిస్తారు. వారిపై ఉన్న రివార్డు మొత్తాలు వారికే అందించడంతోపాటు చిన్న, చిన్న ఉద్యోగాలు సైతం ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నాం. – అంజనీకుమార్, పోలీసు కమిషనర్ -
టీజేఏసీ చైర్మన్‌గా కంచర్ల రఘు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జేఏసీ (టీజేఏసీ) నూతన చైర్మన్‌గా కంచర్ల రఘు, కన్వీనర్‌గా ప్రొఫెసర్ పురుషోత్తం ఎన్నికయ్యారు. నగరంలో ఆదివారం జరిగిన టీజేఏసీ విస్తృత స్థాయి సమావేశంలో వీరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇప్పటివరకు జేఏసీ కన్వీనర్‌గా రఘు, కో–చైర్మన్‌గా పురు షోత్తం ఉన్నారు. అంతకుముందు ప్రొఫెసర్ కోదండరామ్, ఇతర కార్యవర్గ సభ్యుల రాజీనామాలను సమావేశం ఆమోదించింది. ఈ సందర్భంగా పలువురు టీజేఏసీ నేతలు, తెలంగాణ జన సమితి నాయకులు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర సాధనలో టీజేఏసీ పాత్ర కీలకమైందని అభివర్ణించారు. రాజకీయాల్లో మార్పు కోసమే వైదొలిగాను రాజకీయాల్లో మార్పు కోసమే తాను టీజేఏసీ నుంచి వైదొలిగానని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ పేర్కొన్నారు. జేఏసీ బలోపేతం కావాలని, బలమైన ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణానికి కృషి చేయాలన్నారు. జేఏసీని వీడుతున్నందుకు బాధగా ఉందని, అయితే ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం తప్పడం లేదన్నారు. రాష్ట్ర సాధనలో టీజేఏసీ పాత్ర మరువలేనిదన్నారు. టీజేఏసీ నిర్ణయాలు తీసుకున్నా ప్రజలు సంఘటితంగా ఉద్యమం చేశారన్నారు. సమష్టి ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు పని చేయాలని, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని అందుకోసం టీజేఏసీ కృషి చేయాలన్నారు. అనుకున్నంత ఈజీగా రాజకీయాలు మారవని, పాలనలో లోపాలను ఎత్తిచూపుతూ మనం అనుకున్నది కచ్చితంగా ప్రజలకు చెప్పాలన్నారు. కోదండరామ్ లేని జేఏసీని ఊహించలేము తెలంగాణ సమాజానికే కోదండరామ్ ఒక ప్రతీక అని, ఆయన లేని జేఏసీని ఊహించలేమని జేఏసీ చైర్మన్ రఘు పేర్కొన్నారు. రకరకాల వ్యక్తిత్వాలను ఒక వేదికపైకి తీసుకురావడంతోపాటు ఎంతో ఓపిక, సహనంతో పని చేశారన్నారు. త్వరలోనే టీజేఏసీ సమావేశం ఏర్పాటు చేసి, స్టీరింగ్ కమిటీ ప్రకటనతోపాటు భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. జేఏసీ కన్వీనర్‌గా తనను ఎన్నుకున్నందుకు ప్రొఫెసర్ పురుషోత్తం ధన్యవాదాలు తెలిపారు. -
కొత్త రూట్లలో సిటీ బస్సులు..
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో పలు కొత్త రూట్లలో సిటీ బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ పురుషోత్తం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. డిసెంబర్ 1 నుంచి సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. కోఠి–ఈసీఐఎల్ (40/16ఎన్) రూట్లో సెమీ లోఫ్లోర్ బస్సు అందుబాటులోకి రానుంది. ఇది ఏఎస్‌రావునగర్, సైనిక్‌పురి, నేరేడ్మెట్, సఫిల్‌గూడ, మల్కాజిగిరి, ఆలుగడ్డబావి, సికింద్రాబాద్, కవాడీగూడ, హిమాయత్‌నగర్ మార్గంలో కోఠి వరకు రాకపోకలు సాగిస్తుంది. బండ్లగూడ– జగద్గిరిగుట్ట (90బీ/30) మార్గంలో 3 మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు బండ్లగూడ నుంచి ఉప్పల్ క్రాస్‌రోడ్స్ తార్నాక, సికింద్రాబాద్, బాలానగర్, ఐడీపీఎల్ మీదుగా జగద్గిరిగుట్టకు రాకపోకలు సాగించనుంది. ప్రణీత్ హౌసింగ్ కాలనీ నుంచి సికింద్రాబాద్ (10కె/పీ) రూట్లో 3 సెమీ లోఫ్లోర్ బస్సులు బాచుపల్లి, నిజాంపేట్, జేఎన్టీయూ, కేపీహెచ్‌బీ, ఎర్రగడ్డ, ఎస్ఆర్నగర్, బేగంపేట్ రూట్లో నడుస్తాయి. హయత్‌నగర్–గండిమైసమ్మ (290/272జీ) రూట్లో 2 మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు ఎల్బీనగర్, ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్, బాలానగర్, జీడిమెట్ల మీదుగా తిరుగనున్నాయి. జగద్గిరిగుట్ట– మెహదీపట్నం మార్గంలో (19కెజె) ఆర్డినరీ బస్సు ఆల్విన్ కాలనీ, కూకట్పల్లి, ఎర్రగడ్డ, అమీర్‌పేట్, రోడ్‌నెంబర్ 1 బంజారాహిల్స్, మాసాబ్‌ట్యాంక్ మార్గంలో నడుస్తుంది. హయత్‌నగర్–సికింద్రాబాద్ (290), కోఠి–సికింద్రాబాద్(40), దిల్సుఖ్నగర్–సికింద్రాబాద్(107వీఆర్), ఇబ్రహీంపట్నం–దిల్సుఖన్ నగర్(277డి) రూట్లలో అదనపు బస్సులు నడుపనున్నట్లు వెల్లడించారు. బస్సు సర్వీసుల పొడిగింపు.... మరి కొన్ని బస్సుల రూట్లను పొడిగించనున్నారు. కోఠి–కొండాపూర్ మధ్య నడిచే (127కె),కోఠి–నందినగర్ (127ఎన్) బస్సులను ఎల్బీనగర్ వరకు పొడిగిస్తారు. సికింద్రాబాద్–ఎల్బీనగర్ మధ్య నడిచే (40 ఎల్) బస్సును ఎన్జీవోస్ కాలనీ వరకు, వీఎస్టీ–బీర్‌బాగ్ (137) బస్సును జియాగూడ వరకు పొడిగిస్తారు. సికింద్రాబాద్–జియాగూడ (86జె) బస్సును టోలీమసీద్ వరకు నడుపుతారు. చార్మినార్– కాటేదాన్ మధ్య నడిచే (178కె) మినీ బస్సులను శ్రీరామ్ కాలనీ వరకు నడుపుతారు. కేశవగిరి–సికింద్రాబాద్ (102/38) బస్సులను ఈస్ట్‌మారేడ్‌పల్లి వరకు, హయత్‌నగర్–మెహదీపట్నం (156/126) బస్సులను జేఎన్ టీయూ వరకు పోడిగించనున్నారు. ఉప్పల్–మెహదీపట్నం (113 ఐఎం/126) మధ్య నడిచే బస్సులను జేఎన్టీయూ వరకు నడుపుతారు. కోఠి–ఇందిరానగర్ (74) మధ్య నడిచే బస్సులను మెహిదీపట్నం వరకు పొడిగించనున్నారు. -
ధర్మయుద్ధానికి తరలిరండి
వనపర్తిటౌన్: దళితుల జీవితాలతో ప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయని ఎంఎస్ఎఫ్ రాష్ట్ర సమన్వయకర్త పురుషోత్తం మండిపడ్డారు. బుధవారం రాత్రి దాచ లక్ష్మయ్య ఫంక్షన్హాల్లో జరిగిన సంఘం విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. మాదిగలు దశబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతుంటే, పాలకులు నాన్చుడుధోరణి అవలంభిస్తున్నాయని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణతోనే మాదిగలకు సంపూర్ణ న్యాయం జరుగుతుందన్నారు. నవంబర్ 30వ తేదీన హైదరాబాద్‌లో జరిగే మాదిగల ధర్మయుద్ధభేరికి ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు తరలిరావాలని కోరారు. ఈనెల 20వ తేదీ నుంచి విద్యార్థిలోకాన్ని చైతన్యవంతులుగా తీర్చిదిద్దేందుకు అక్టోబర్ 10వ తేదీ వరకు జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్తీక్, రాజేష్, సురేష్, ప్రకాశ్, రాహుల్, బీసన్న, శివ, విష్ణు పాల్గొన్నారు. -
సీఎం సభకు వెళ్తున్న బస్సు ఢీకొని బాలుడి దుర్మరణం
మదనపల్లె: చిత్తూరు జిల్లా మదనపల్లె మండలంలో గురువారం ముఖ్యమంత్రి సభకు జనాన్ని తరలించే బస్సు ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ప్రమాదంలో పురుషోత్తం(5) అనే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల కథనం మేరకు... కురబలకోటలో జరిగే సీఎం సభకు రామసముద్రం నుంచి టీడీపీ కార్యకర్తలను బస్సులో తరలిస్తున్నారు. ఆ బస్సు దాదినాయునితాండ వద్ద ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం నడుపుతున్న మదనపల్లె మండలం కృష్ణాపురానికి చెందిన పి. ఈశ్వర్ (45), వెనుక కూర్చుని ఉన్న పవన్(12), ఈశ్వర్ తమ్ముడి కుమారుడు పురుషోత్తం(5) తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించగా, పురుషోత్తం అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈశ్వర్, పవన్ చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దారిమళ్లిన ‘ఉపాధి’ నిధులు
గ్రామీణప్రాంతాల్లో నిలిచిపోయిన పనులు రూ.85.77 కోట్లు వెనక్కి తీసుకున్న గ్రామీణాభివృద్ధి శాఖ ఏడాదైనా విడుదల చేయని వైనం హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు చేరాల్సిన ఉపాధి హామీ నిధులు దారిమళ్లాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి హామీ పథకం కింద గ్రామ పంచాయతీల్లో సిమెంటు రోడ్లు, కల్వర్టులు, సైడ్ డ్రైయిన్లు, పంచాయితీ భవనాలు, కమ్యూనిటీహాళ్ల నిర్మాణం.. తదితర అభివృద్ధి పనుల నిమిత్తం గ్రామీణాభివృద్ధి విభాగం నిధులు మంజూరు చేసింది. మంజూరు చేసిన నిధుల్లో పదిశాతం నిధులను ఏడాది క్రితం గ్రామీణాభివృద్ధి విభాగం వెనక్కి తీసుకుంది. తొమ్మిది జిల్లాల్లోని 25 పంచాయితీరాజ్ డివిజన్ల నుంచి తీసుకున్న మొత్తం సుమారు రూ.85.77 కోట్లను ఇప్పటికీ తిరిగి ఇవ్వలేదు. పాత బకాయిలు విడుదల చేయకపోవడంతో గ్రామ పంచాయతీల్లో సర్పంచుల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఆయా జిల్లాల్లో పనులు చే సి న కాంట్రాక్టర్లు నిధులు రాకపోవడంతో కూలీలకు వేతనాలు చెల్లించడం లేదు. ఈ విషయమై స్థానికంగా ఉండే ఇంజనీర్లను సంప్రదిస్తే గ్రామీణాభివృద్ధిశాఖ నిధులు ఇవ్వడం లేదంటున్నారని సర్పంచులు వాపోతున్నారు. వెనక్కి తీసుకున్న నిధులను గ్రామీణాభివృద్ధి విభాగం అధికారులు దేనికి వినియోగించారో ఎవరికీ అంతుబట్టడం లేదు. క్షేత్రస్థాయిలో ఉపాధి హామీ నిధుల దుర్వినియోగాన్ని అరికట్టాల్సిన ఉన్నతాధికారులే వాటిని దారి మళ్లిం చేందుకు పూనుకోవడం పట్ల సర్పంచుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అసలు ఏం జరిగింది..? ఉపాధి హామీ పథకం కింద గ్రామ పంచాయ తీల్లో చేపట్టిన పనులకు 90 శాతం నిధులను వివిధ దశల్లో కాంట్రాక్టర్లకు డివిజన్ స్థాయిలో పంచాయతీరాజ్ ఇంజనీర్ చెల్లిస్తారు. ఆపై ఆయా పనులను క్వాలిటీ సెల్, సోషల్ ఆడిట్ బృందాలు పరిశీలించి సంతృప్తికర నివేదికలు ఇస్తేనే మిగిలిన మొత్తాన్ని విడుదల చేస్తారు. అయితే ఏపీ పునర్విభజన ప్రక్రియ సందర్భం లో.. అన్ని డివిజన్ల నుంచి ఇంజనీర్ల ఖాతాల్లో ఉన్న నిధులను గ్రామీణాభివృద్ధి విభాగం వెనక్కి తీసుకుంది. సకాలంలో క్వాలిటీ బృం దాన్ని పనుల పరిశీలనకు అధికారులు పంపకపోవడం, సోషల్ ఆడిట్ బృందాలు పనులను సందర్శించకపోవడంతో కొంత జాప్యమైంది. ఆపై ఆయా బృందాలు పంచాయతీల్లో పర్యటించి సంతృప్తికరమైన నివేదికలు ఇచ్చినా, గ్రామీణాభివృద్ధి విభాగం మాత్రం ఎందుకోగానీ నిధులను తిరిగి వెనక్కి ఇవ ్వలేదు. ఉపాధి హామీ నిధులను దారిమళ్లించి ఉంటారని సర్పంచులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అవమానపడాల్సి వస్తోంది.. ఉపాధి హామీ పథకం కింద గ్రామ పంచాయితీల ద్వారా వివిధ రకాల అభివృద్ధి పనులను చిన్నచిన్న కాంట్రాక్టర్లు, కూలీలతో చేయించాం. పనులు పూర్తయి ఏళ్లు గడుస్తున్నా.. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో కాంట్రాక్టర్లు వేరే పనులు చేపట్టేందుకు నిరాకరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి సొమ్ము వచ్చి నా.. తాము దాచుకొని ఇవ్వట్లేదేమోనని కాంట్రాక్టర్లు, కూలీలు అపనిందలు వేస్తున్నారు. కొన్ని గ్రామాల్లోనైతే సర్పం చులకు అవమానాలు తప్పడం లేదు. ప్రభుత్వం తక్షణం నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. - పురుషోత్తం, మెంటెపల్లి సర్పంచ్, మహబూబ్‌నగర్ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు.