turn
-
నేటితో ‘హిమాచల్’కు 76 ఏళ్లు!
హిమాచల్ ప్రదేశ్ ఈరోజు 76వ ఏట అడుగుపెట్టింది. ఈ రాష్ట్రం 1948 ఏప్రిల్ 15న ఆవిర్భవించింది. నేడు హిమాచల్ దినోత్సవాన్ని సిమ్లాలోని రిడ్జ్ గ్రౌండ్లో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జానపద కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు. అనేక మైలురాళ్లను దాటిన హిమాచల్ ప్రదేశ్ నేడు అన్ని రంగాల్లోనూ ముందు వరుసలో ఉంది. 1948లో హిమాచల్ ప్రదేశ్‌లో అక్షరాస్యత రేటు ఏడు శాతంగా ఉంది. ఇది 76 సంవత్సరాల తర్వాత అంటే నేటికి 82.80 శాతానికి చేరుకుంది. రాష్ట్రంలో మూడు విమానాశ్రయాలు ఉన్నాయి. 1948లో వీటి సంఖ్య సున్నా. ఆరోగ్య రంగంలో కూడా రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. హిమాచల్‌లో ప్రస్తుతం ఒక ఎయిమ్స్, ఐదు వైద్య కళాశాలలు, ఐదు డెంటల్ కళాశాలలు, పలు నర్సింగ్, ఫార్మసీ కళాశాలలు ఉన్నాయి. దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి కూడా విద్యనభ్యసించేందుకు విద్యార్థులు ఇక్కడికి వస్తున్నారు. 1948వ సంవత్సరంలో హిమాచల్ ప్రజల తలసరి ఆదాయం రూ.240 కాగా, ప్రస్తుతం రూ.2,35,199కి చేరుకుంది. స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త యశ్వంత్ సింగ్ పర్మార్ హిమాచల్ తొలి ముఖ్యమంత్రి. ఈయన 1952 నుండి 1977 వరకు అధికారంలో ఉన్నారు. ఠాకూర్ రామ్ లాల్ 1977, 1980లలో రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. శాంత కుమార్ 1977, 1990లో రెండుసార్లు అధికారంలో కొనసాగారు. వీరభద్ర సింగ్ 1985, 1993, 2003, 2012,2017లో ఆరుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రేమ్ కుమార్ ధుమాల్ 1998, 2007లో అధికారాన్ని చేపట్టారు. 2017లో జైరాం ఠాకూర్ ముఖ్యమంత్రి అయ్యారు. సుఖ్విందర్ సింగ్ సుఖు 2023 నుండి అధికారంలో కొనసాగుతున్నారు. -
అతని వైపుకి కాంగ్రెస్ టర్న్ తీసుకోదు! ఎందుకంటే..
రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు మొదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా భరత్‌పూర్‌లో బూత్ స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజస్తాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ వైపుకి కాంగ్రెస్ టర్న్ తీసుకోదని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి ఆశోక్ గెహ్లాట్ వైపే కాంగ్రెస్ మొగ్గు చూపుతుందని. ఎందుకంటే కాంగ్రెస్ ఖజనాను నింపడంలో గెహ్లాట్ సహకారమే ఎక్కువ కాబట్టి అంటూ సెటైర్లు వేశారు. ఆ విషయంలో సచిన్ పైలట్ సహకారం తక్కువ అని దీంతో అతని వైపు మెజార్టీ సభ్యులు ఉండరన్నారు. అంతేగాదు గెహ్లాట్ రాజస్తాన్ ప్రభుత్వాన్ని అవినీతికి అడ్డాగా మార్చి దోచుకున్నారన్నారు. ఆ అవినీతి సొమ్ము కాంగ్రెస్ పార్టీ ఖజానాకు పోయిందని ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన 2008లో జైపూర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితులను నిర్దోషిగా విడుదల చేయడంపై కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. రాజస్తాన్‌లో త్రీడీ ప్రభుత్వం ఉందని, మూడు 'డీ'లు అర్థం ఏమిటంటే.. డాంగే(అల్లర్లు), దుర్వ్యవర్(అన్యాయంగా ప్రవర్తించడం), దళితులపై ధౌర్జన్యాలు అంటూ కొత్త అర్థాలను ఆపాదిస్తూ విరుచుకుపడ్డారు. అలాగే ప్రజలు ఎన్నికలలో ఈ పభ్రుత్వాన్ని తరిమికొడతారని, అసెంబ్లీలో బీజేపీ భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమాగా చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం పనితీరు, పార్టీ సిద్ధాంతాలు, ఆయనకు ఉన్న ప్రజాధరణ తదితరాల కారణంగానే ఎన్నికల బరీలోకి దిగుతోందన్నారు. ఆశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాజస్తాన్ చరిత్రలోని అవినీతి ప్రభుత్వాల్లో ఒకటని, దీంతో ప్రజలు విసిగిపోయారంటూ అమిత్ షా కాంగ్రెస్‌పై విరుచుకపడ్డారు. కాగా, సచిన్ పైలట్ సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేయడమే గాక పార్టీ వ్యతిరేక చర్యగా పరిగణిస్తామని పెలట్‌ని హెచ్చరించింది కూడా. (చదవండి: పరువు నష్టం కేసులో రాహుల్‌కి ఉపశమనం..ప్రత్యక్ష హాజరుకు మినహాయింపు) -
వామ్మో.. మహబూబా ఘాట్స్!
సారంగాపూర్ : అందమైన మలుపుల వెనుక అగాధాలెన్నో ఉన్నాయి. వాహన చోదకులు ఏ కొంచెం ఆదమరిచినా మలుపులపై రక్తాలు ధారలుగా పారడం ఖాయం. అందమైన ఆ మలుపులపై ప్రమాద సూచికలు సరిగా లేక ప్రమాదాలకు నెలవవుతున్నాయి. ఈ మలుపులపై కొన్నేళ్లుగా ఎన్నో కుటుంబాలు వీధిన పడిన దాఖలాలున్నాయి. అయినా అంతటి ప్రమాదకర మలుపుల వద్ద రక్షణ కల్పించడానికి సంబంధిత శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆ దారి గుండా ప్రయాణించే వాహన చోదకులు ఏకంగా శాపనార్థాలు పెట్టేస్తున్నారు. అందమైన మలుపుల వద్ద.. సారంగాపూర్ మండలంలోని చించోలి(బి) సమీపంలోని మహబూబా ఘాట్స్ ప్రకృతి ప్రేమికులకు కనుల విందు చేయడమే కాదు అందాల మోజులో పడి ఆదమరిచి వాహనాలు నడిపేవారి పాలిట మృత్యు కూపాలుగానూ మారుతున్నాయి. మహబూబా ఘాట్స్ మాత్రమే కాదు ఘాట్స్ మొదలుకుని చించోలి(బి) ఎక్స్‌రోడ్డు వరకు వచ్చే 44వ జాతీయ రహదారిపైన ఉన్న మూడు మూల మలుపులు ప్రమాద ఘంటికలు మోగిస్తూనే ఉన్నాయి. మూడేళ్లుగా ఎన్నో ప్రమాదాలు జరిగి ఎంతో మంది జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి. అయినా ఇంతవరకు ఘాట్స్తో పాటు ప్రమాదకర మలుపులు పట్టించుకున్నవారే కరువయ్యారు. గతంలో పలు ఘటనలు మహబూబా ఘాట్లు ఈ మూడేళ్లలో ఇప్పటివరకు దాదాపు 12 కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. 2013 ఫిబ్రవరి 2వ తేదీన ఆదిలాబాద్ నుంచి నిర్మల్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిలయ్యాయి. అది గమనించిన నేరడిగొండ మండలం నంద్యానాయక్ తండాకు చెందిన ఆడె రమేశ్ అనే యువకుడు తన ప్రాణాలను కాపాడుకోబోయి అదే బస్సు కింద పడి మృతిచెందాడు. అంతేకాకుండా 2013 జూన్ 6వ తేదీన మహబూబా ఘాట్స్ సమీపంలో ఘాట్ల పైనుంచి వేగంగా నిర్మల్ వైపు వస్తున్న లారీ ఎడ్లబండిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చించోలి(బి) గ్రామానికి చెందిన నారాయణ అనే రైతు అక్కడికక్కడే మృతిచెందాడు. 2015 ఆగస్టు 28న ఘాట్స్ పైనుంచి లారీ వేగంగా వచ్చి ఆవుల మంద, మేకల మందను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 ఆవులు, 3 మేకలు మృతిచెందాయి. మే 18, 2016న మహిళా ప్రాంగణం సమీపంలోని మూలమలుపు వద్ద కడెం మండలం మొర్రిపేట్ గ్రామానికి చెందిన మర్సుకోల తిరుపతి(15) అనే బాలుడు మృతిచెందాడు. తన ద్విచక్రవాహనంపై నిర్మల్ నుంచి రాణాపూర్ వైపు వెళ్తుండగా ఆటో ఢీకొట్టింది. ఇలా దాదాపు ఎంతోమంది మనుషులు, పశువుల ప్రాణాలు గాలిలో కలిసిపోయి వారి కుటుంబాల్లో తీరని దు:ఖం మిగిలింది. ఇవన్నీ పెద్దవి కాగా చిన్నచిన్న ప్రమాదాలు జరిగి గాయాలపాలైన ఘటనలు అనేకం ఉన్నాయి. ఇంతటి ప్రమాదాలు కళ్లెదుటే జరుగుతున్నా మూలమలుపుల వద్ద ప్రమాద సూచికలు లేకపోవడం గమనార్హం. కొన్ని చోట్ల ప్రమాద సూచిక బోర్డులు ఉన్నా అవి చెడిపోయి, రంగులు వెలిసి పోయి ఉండటంతో ఈ రోడ్డుపై రాకపోకలు సాగించే వారికి అవి అర్థం కావడం లేదని వాహనచోదకులు అంటున్నారు. విషాద కుటుంబం..! ఘాట్స్పైన జరుగుతున్న ప్రమాదాలతో పాటు చించోలి(బి) ఎక్స్ రోడ్డు వరకు ఉన్న మలుపుల వద్ద ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు వీధిపాలవుతున్నాయి. తాజాగా మహబూబా ఘాట్స్పైన శుక్రవారం జరిగిన ప్రమాదమే ఇందుకు తార్కాణం. ఇంటికి పెద్ద దిక్కయిన అనంత్వార్ మాధవరావు, ఆయన పెద్ద కుమారుడు హరీశ్ మృతిచెందిన ఘటనే. కుటుంబానికి పెద్ద దిక్కయిన మాధవరావు మృతిచెందడంతో ప్రస్తుతం ఆ కుటుంబం రోడ్డున పడినట్లయ్యింది. దీంతో పాటే అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసిన తన పెద్ద కుమారుడు హరీశ్ మృతి ఆ కుటుంబానికి తీరని దు:ఖాన్ని మిగిల్చింది. వారి మరణంతో పాటు చిన్న కుమారుడు సాయిప్రసాద్, మాధవరావు భార్య నమితలు తీవ్రంగా గాయపడటంతో వారి పరిస్థి«తి దయానీయంగా మారింది. -
వేధింపులు కాదు.. లైంగికదాడి
చాంద్రాయణగుట్ట: పది రోజుల క్రితం ఛత్రినాక ఠాణాలో నమోదైన బాలికపై వేధింపుల కేసు మలుపు తిరిగింది. బాధితురాలు పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడించని కారణంగా మొదట వేధింపుల కేసు నమోదు చేసిన పోలీసులు.. బాలిక తేరుకొని మరోసారి ఇచ్చిన ఫిర్యాదుతో లైంగిక దాడి కేసు నమోదు చేశారు. దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ ఆదివారం రాత్రి తెలిపిన వివరాల ప్రకారం... ఉత్తరప్రదేశ్‌కు చెందిన అజిత్ కుమార్ (18) కుటుంబంతో పాటు మరికొన్ని కుటుంబాలు ఉప్పుగూడ శివాజీనగర్‌లో ఉంటూ పీసు మిఠాయి విక్రయిస్తూ జీవిస్తున్నాయి. అజిత్ తన ఇంటి పక్కనే ఉండే బాలిక (16)పై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలు తన తల్లితో కలిసి గతనెల 30 ఛత్రినాక ఠాణాకు వచ్చి అజిత్కుమార్పై ఫిర్యాదు చేసింది. ‘చాలా రోజులుగా అజిత్ తనను వేధిస్తున్నాడని... వారం నుంచి వేధింపులు మరింత ఎక్కువయ్యాయని’ ఫిర్యాదులో పేర్కొంది. నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి ఈ నెల 1న అజిత్‌ను జైలుకు తరలించగా.. రెండు రోజుల్లోనే బెయిల్‌పై బయటికి వచ్చి దర్జాగా తిరగసాగాడు. దీంతో బాలిక కుటుంబం తమ కూతురిపై లైంగికదాడికి పాల్పడిన యువకుడికి రెండు రోజుల్లోనే బెయిల్ ఎలా వచ్చిందని ప్రశ్నించడంతో పాటు తమ కూతురిపై లైంగికదాడి జరిగిందని మరోసారి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఈ నెల 5న బాలికను భరోసా సెంటర్‌కు తరలించారు. బాలికను పూర్తి స్థాయిలో విచారించిన భరోసా సెంటర్ సభ్యులు నివేదికను అందజేశారు. దీంతో ఛత్రినాక పోలీసులు ఆదివారం నిందితుడిపై ‘376 క్లాజ్ (1),(2), లైంగిక వేధింపుల నుంచి బాలల పరిరక్షణ చట్టం–506, నిర్భయ చట్టం, లైంగికదాడి’ కింద మొత్తం నాలుగు కేసులు నమోదు చేశారు. కాగా నిందితుడి బెయిల్‌ను సోమవారం ఉదయమే రద్దు చేయించి... ఈ సెక్షన్ల కింద జైలుకు తరలిస్తామని డీసీపీ సత్యనారాయణ తెలిపారు. ఈ కేసులో నిందితుడితో పాటు అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేస్తామన్నారు. -
మలుపు మాటున...?
దారి మలుపు తర్వాత ఏ ప్రమాదం పొంచి ఉందో తెలియని పరిస్థితి. భయంకరమైన మూలమలుపులు. కనీసం కనబడని హెచ్చరిక బోర్డులు, తరుచూ ప్రమాదాలు. పట్టించుకోని అధికారులు వెరసి రహదారులు రక్తసిక్తం అవుతున్నాయి. చెన్నూర్ మండలంలోని పలు గ్రామాలకు వెళ్లే రహదారుల మూలమలుపులు ప్రమాదభరితంగా ఉన్నాయి. వాహనదారులు భయపడక తప్పని పరిస్థితులు. చాలా రహదారుల మూలమలుపుల వద్ద చెట్లు ఎదిగి రహదారిని కనబడక కుండా చేస్తున్నాయి. రోడ్డు, భవనాల అధికారులు పట్టించుకోని పరిస్థితి. కిష్టంపేట గ్రామం నుంచి జాతీయ రహదారి, సుద్దాల గ్రామానికి వెళ్లే దారిలో, అలాగే జోడువాగులు దగ్గర నుంచి కిష్టంపేటకు వెళ్లే మంచిర్యాల, చెన్నూర్ ప్రధాన రహదారిలో కూడా మూలమలుపులు ప్రమాదకరంగా ఉన్నాయి. – చెన్నూర్ రూరల్ -
మలుపు తిరగనున్న సుశీల హత్య కేసు
♦ పథకం ప్రకారమే..? ♦ ఒక్కడే నిందితుడని చేతులు దులుపుకున్న పోలీసులు ♦ తాజాగా వెలుగులోకి సరికొత్త అంశం పుల్కల్: గిరిజన మహిళ హత్య కేసు మరో మలుపు తిరగనుంది. ఇప్పటికే పోలీసులు గిరిజన మహిళను హత్య చేసింది ఒక్కరే అని నిర్ధారించి కోర్టుకు సైతం రిమాండ్ చేశారు. తీరా బుధవారం మృతురాలికి సంబంధించిన టిఫిన్ బాక్సుతోపాటు ఇతర సామగ్రి, అక్కడే హత్యకు ఉపయోగించినట్లు భావిస్తున్న యాక్సర్ బ్లేడు లభించడంతో ఈ కేసు కొత్త మలుపు తిరగనుంది. ఇప్పటికే హత్యకు గురైన మహిళ వివాహేతర సంబంధం పెట్టుకున్న బస్వాపూర్‌కు చెందిన వెండికోల్ రాజు జూన్ 1న రాత్రి ఆమెతో గడపాలనుకున్నాడు. కానీ ఆమె నిరాకరించినందు వల్లే కరెంటు వైరుతో గొంతు నులిమి హత్య చేసినట్లుగా పోలీసులు ధృవీకరించారు. కానీ గురువారం లభించిన యాక్సర్ బ్లేడును పరిశీలించినట్లయితే ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే ఆమెను హత్య చేసినట్లుగా తెలుస్తోంది. హత్య జరిగిన స్థలానికి కొద్ది దూరంలోనే లభించిన బీరు బాటిళ్లను పరిశీలిస్తే రాజుతోపాటు మరో ఇద్దరు కలిసి హత్య చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి హత్యకు గురైన సుశీల టిఫిన్ బాక్సుతోపాటు బీరు బాటిళ్లు లభించడం ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. నిందితుడు రాజు వెల్లడించిన వివరాలను పరిశీలిస్తే... తనకు సహకరించనందునే మహిళను హత మార్చినట్లుగా వెల్లడించడానికి, సంఘటన స్థలంలో లభించిన వాటిని పరిశీలిస్తే ఏమాత్రం పొంతన లేకుండా పోయింది. దీంతో సుశీలను హత్య చేసింది రాజు ఒక్కడేనా? మరి ఇంకెవరితో అయినా కలిసి చేశాడా? అనే దానిపై విచారణ జరిపితే అసలు నిందితులు బయటపడే అవకాశముంది. ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్న యాక్సర్ బ్లేడు, సుశీలకు సంబంధించిన క్లిప్పులు, టిఫిన్ బాక్సు లభించడాన్ని చూస్తే ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే హత్య చేసినట్లుగా తెలుస్తోంది. హతురాలు సుశీల మెడ పైన స్వల్ప గాయమున్నా, గొంతు మాత్రం పూర్తిగా తెగిపోవడాన్ని పరిశీలిస్తే ప్రస్తుతం లభించిన యాక్సర్ బ్లేడుతోనే కోసినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. ఏమైనా సుశీల హత్యలో గోపాల్‌తోపాటు మరికొంత మంది హస్తం ఉందని తెలుస్తోంది. -
పర్యావరణ పరిరక్షణలో కీలక ముందడుగు!
లండన్: పర్యావరణ కాలుష్యానికి ముఖ్య కారణమైన కార్బన్ డైఆక్సైడ్ వాయువును తగ్గించడానికి శాస్త్రవేత్తలు నిర్వహిస్తున్న ప్రయోగాల్లో కీలక ముందడుగు పడింది. అంతర్జాతీయ శాస్త్రవేత్తలు బృందం నిర్వహించిన ప్రయోగాల్లో ఈ గ్రీన్హౌస్ కారక వాయువు బసాల్ట్ రకపు శిలలతో వేగంగా చర్యజరుపుతోందని కనుగొన్నారు. దీంతో పర్యావరణానికి హాని చేయని ఖనిజాలు ఏర్పడుతాయని ఈ ప్రయోగానికి సంబంధించిన ఫలితాలను 'జర్నల్ సైన్స్'లో ప్రచురించారు. పర్యావరణం నుంచి కార్బన్ డైఆక్సైడ్ పరిమాణాన్ని తగ్గించడానికి గతంలో శాస్త్రవేత్తలు నిరుపయోగంగా ఉన్నటువంటి ఆయిల్, గ్యాస్ రిజర్వాయర్లలో సీల్ చేయాలని భావించారు. అయితే దీనిలో లీకేజీ సమస్య ఉండటంతో ఈ దిశగా ముందడుగు పడలేదు. దీంతో కార్బన్ డైఆక్సైడ్‌ను మినరలైజ్ చేసే అంశంపై శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. ఇప్పటి వరకూ కార్బన్ ఖనిజాలుగా రూపాంతరం చెందడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుందని భావించారు. అయితే శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా ప్రయోగంలో బసాల్ట్ రకపు శిలలతో కార్బన్ డైఆక్సైడ్ వేగంగా చర్య జరుపుతుందని, కేవలం రెండేళ్ల వ్యవధిలోనే ఖనిజంగా రూపాంతరం(మినరలైజ్) చెందుతుంది అని గుర్తించారు. ఈ రకమైన శిలలు భూమిపై విరివిగా అందుబాటులో ఉన్నాయని.. పర్యావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ పరిమాణాన్ని తగ్గించడానికి ఈ ఫలితాలు దోహదం చేస్తాయని యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ శాస్త్రవేత్త జ్యూర్గ్ మేటర్ తెలిపారు. -
అదిగో దయ్యాల మలుపు..!
♦ పెద్ద దోర్నాల మండలంలో భారీగా ప్రమాదాలు ♦ మూడు నెలల్లో అనంత వాయువుల్లో కలిసిన 9 మంది ప్రాణాలు ప్రయాణం ఎక్కడ ప్రారంభమైనా.. సమయం ఏదైనా.. ముహూర్తం ఎలాగున్నా.. పెద్దదోర్నాల మండలంలోకి ప్రవేశించాక ఒళ్లు గగుర్పాటుకు గురవుతుంది.. దయ్యూల మలుపు సమీపిస్తే స్టీరింగ్ అదుపు తప్పుతుంది జస్ట్ మూడు నెలలల్లో 9 మంది పరలోకాలకు వెళ్లారు 8 మంది మృత్యువును అతి దగ్గరగా చూసొచ్చారు పదుల కొద్దీ మూగజీవాలు బలయ్యూరుు.. ఈ మండలంలో ఏం జరుగుతోంది..? -పెద్దదోర్నాల పెద్దదోర్నాల మండలం పేరు వింటేనే వాహనదారులు హడలెత్తిపోతున్నారు. వరుసగా జరుగుతున్న ప్రమాదాల్లో ప్రాణాలు పోతుండటంతో ఆయూ మార్గాల్లో వెళ్లేందుకు జంకుతున్నారు. మండల పరిధిలోని కర్నూల్-గుంటూర్ రోడ్డుతో పాటు శ్రీశైలం ఘాట్ రోడ్లు (దయ్యూల మలుపు) ఘోర ప్రమాదాలకు నిలయంగా మారారుు. కనీసం హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదాల నివారణ అసాధ్యంగా మారింది. అలాగే అధిక వేగం, నిద్రలేమి, అనుభవరాహిత్యంతో పాటు మద్యం మత్తు, ఆందోళన వంటివి ప్రతికూల అంశాలుగా మారారుు. జనవరి నుండి ఇప్పటి వరకు 3 నెలల కాలంలో 9 రోడ్డు ప్రమాదాలు జరగ్గా.. 9 మంది మృత్యువాత పడ్డారు. మరో 8 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఇలా.. ♦ కర్నూలు- గుంటూరు రోడ్డులోని గంటవానిపల్లి వద్ద జనవరిలో 21న లారీ ఢీకొన్న సంఘటనలో మహిళ మృతి చెందగా, అదే నెల 29న శ్రీశైలం రోడ్డులోని అయ్యప్ప స్వామిగుడి వద్ద ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో ఒకరు మృతి చెందారు. ♦ ఇదే నెల 31న జమ్మిదోర్నాల వద్ద ఓ వాహనం ఢీ కొని మహిళ మృతి చెందింది. ♦ ఫిబ్రవరి 12న వెలుగొండ ప్రాజెక్టు వద్ద జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మార్చి 2న జమ్మిదోర్నాల వద్ద లారీ, డీసీఎంలు ఢీకొనడంతో డీసీఎం క్లీనర్ మృతి చెందాడు. ♦ ఇదే నెల 5వ తేదీన శ్రీశైలం ఘాట్ రోడ్‌లోని తుమ్మలబైలు వద్ద బైక్‌ను ఆర్టీసీ బస్ ఢీకొన్న ప్రమాదంలో కర్నూల్ జిల్లాకు చెందిన యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ♦ ఫిబ్రవరి 11న చిన్నగుడిపాడు వద్ద ఇన్నోవా కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొన్న ప్రమాదంలో కృష్ణా జిల్లా గుడివాడ తహసీల్దార్ తల్లి మృత్యువాత పడగా మరో ముగ్గురు తీవ్రంగా గాయాల పాలయ్యారు. ♦ 17న శ్రీశైలం ఘాట్ రోడ్‌లోని దయ్యాల మలుపులో సిమెంటు లారీ లోయలోకి దూసుకు పోయిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ♦ కర్నూల్ రోడ్డులోని రోళ్లపెంట వద్ద మంగళవారం రాత్రి ఓ కార్గో లారీ బోల్తా పడటంతో 20 ఆవులు మృతి చెందగా, మరో ఆరు ఆవులు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. నివారణ సాధ్యం కాదా? ♦ అత్యంత దారుణంగా జరుగుతున్న సంఘటనలు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని మిగుల్చుతున్నారుు. ♦ ద్విచక్రవాహణదారులు లెసైన్సులు లేకుండా ప్రయాణిస్తున్నారు. అలాంటి వారిపై ఆర్టీఏ, పోలీస్ శాఖాధికారులు తనిఖీలు నిర్వహించాలి. అనుమతి, ధ్రువీకరణ పత్రాలు లేకుండా వాహనాన్ని నడిపితే కఠిన చర్యలు తీసుకోవాలి. ♦ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలి. ♦ మద్యం సేవించి వాహనాన్ని నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మితిమీరిన వేగంతో వాహనాన్ని నడిపే వారిని గుర్తించి భారీగా జరిమానాలను విధించాలి. ♦ హెచ్చరిక బోర్డులు.. ఏర్పాటు చేయూలి. డ్రైవింగ్‌పై అవగాహన సదస్సులు కల్పించాలి. -
ఫ్యూయెల్ సెల్ తో మూత్రాన్ని విద్యుత్తుగా...
లండన్ : వ్యర్థాల నుంచి విద్యుత్ అంటూ ఇప్పటికే శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు చేశారు. ఇప్పటికే మనిషి మూత్రాన్ని విద్యుత్తుగా మార్చేందుకు సైతం అనేక పరిశోధనలు జరిపారు. విద్యుత్ ఉత్పాదకత పెంచేందుకు ప్రపంచమంతా పలు రకాల అధ్యయనాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో తాజాగా చవకైన, శక్తివంతమైన అతి చిన్న ఫ్యూయెల్ సెల్ పరికరంతో మూత్రాన్ని విద్యుత్తుగా మార్చవచ్చని కొత్త తరహా పరిశోధనలద్వారా కనుగొన్నారు. మూత్రం ఉండే పునరుత్పాదక జీవశక్తిని వినియోగించి ఫ్యూయెల్ సెల్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చంటున్నారు అధ్యయనకారులు. లండన్ బాత్ విశ్వవిద్యాలయం, మెరీ యూనివర్శిటీ లు బ్రిస్టల్ రోబోటిక్ ల్యాబరెటరీ ద్వారా సరికొత్త టెక్నాలజీతో పరిశోధనలు నిర్వహించారు. ఈ కొత్త రకం ఫ్యూయెల్ సెల్స్ గురించి ఎలక్ట్రో కిమికా ఆక్టా జర్నల్ లో ప్రచురించారు. దీనిద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు ఎటువంటి ఖరీదైన వస్తువులు అవసరం లేదని, కార్బన్, కాటన్, టిటానియమ్ వైర్లతో తయారయ్యే అతి చవుకైన కాథోడ్ ఉపయోగించి శక్తివంతమైన విద్యుత్తును వెలికి తీయవచ్చని వివరించారు. ఆహార వ్యర్థాల్లో... ముఖ్యంగా గుడ్డు తెల్లసొనలోని వొవాల్బుమిన్ ప్రొటీన్, గ్లూకోజ్ లు విద్యుత్తును వెలికి తీసేందుకు ఉత్ప్రేరకాలుగా ఉపయోగపడతాయి. వీటితో ఫ్యూయెల్ సెల్స్ మరింత వేగంగా స్పందించి, మరింత శక్తిని సృష్టించేందుకు వీలవుతుంది. అయితే ఈ పరిశోధనల్లో ఎలక్ట్రోడ్ల పొడవు పెంచి మెలిపెట్టడంద్వారా విద్యుత్ ఉత్పత్తి పదిరెట్లు పెరిగినట్లు కనుగొన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, ముఖ్యంగా నిరుపేద, గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఫ్యూయెల్ సెల్స్ ద్వారా వ్యర్థాలను వినియోగించి విద్యుత్తును ఉత్పత్తి చేయడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రధాన రచయిత జోన్ ఖౌలర్ వెల్లడించారు. తాము రూపొందించిన డిజైన్ సంప్రదాయ నమూనాలకంటే తక్కువ ధర కలిగి, మరింత శక్తివంతంగా పనిచేస్తుందని చెప్తున్నారు. వ్యర్థాల నుంచి విద్యుత్ వెలికి తీసే మిగిలిన అన్ని పరికరాలకన్నా, మూత్రం నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేసే ఈ ఫ్యూయెల్ సెల్ పరికరంతో అత్యధిక విద్యుత్తు ఉత్పత్తికావడం గమనించవచ్చని ఖౌలర్ తెలిపారు. -
ట్రావెల్స్ బస్సు బోల్తా : ఏడుగురికి గాయాలు