మలుపు మాటున...?
దారి మలుపు తర్వాత ఏ ప్రమాదం పొంచి ఉందో తెలియని పరిస్థితి. భయంకరమైన మూలమలుపులు. కనీసం కనబడని హెచ్చరిక బోర్డులు, తరుచూ ప్రమాదాలు. పట్టించుకోని అధికారులు వెరసి రహదారులు రక్తసిక్తం అవుతున్నాయి. చెన్నూర్ మండలంలోని పలు గ్రామాలకు వెళ్లే రహదారుల మూలమలుపులు ప్రమాదభరితంగా ఉన్నాయి. వాహనదారులు భయపడక తప్పని పరిస్థితులు. చాలా రహదారుల మూలమలుపుల వద్ద చెట్లు ఎదిగి రహదారిని కనబడక కుండా చేస్తున్నాయి. రోడ్డు, భవనాల అధికారులు పట్టించుకోని పరిస్థితి. కిష్టంపేట గ్రామం నుంచి జాతీయ రహదారి, సుద్దాల గ్రామానికి వెళ్లే దారిలో, అలాగే జోడువాగులు దగ్గర నుంచి కిష్టంపేటకు వెళ్లే మంచిర్యాల, చెన్నూర్ ప్రధాన రహదారిలో కూడా మూలమలుపులు ప్రమాదకరంగా ఉన్నాయి. – చెన్నూర్ రూరల్