సాక్షి, న్యూఢిల్లీ : రాజస్తాన్ రాజకీయాల్లో నెలకొన్న సంక్షోభం జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. స్వయంగా కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎమ్మెల్యేలతో భేరసారాలకు దిగారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించడం సంచలనం రేపుతోంది. మరోవైపు కేంద్ర మంత్రితో పాటు మరో ఇద్దరు నేతలతో రాజస్తాన్ ప్రభుత్వం ఇదివరకే కేసు నమోదు చేసి విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరా తీశారు. ఫోన్ ట్యాంపరింగ్ ఆరోపణలపై స్పందించారు. దీనిపై పూర్తి నివేదికను తమకు అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదివారం ఆదేశించారు. దీంతో రాష్ట్ర రాజకీయం మరింత వేడెక్కింది. (గవర్నర్‌తో సీఎం భేటీ అందుకేనా!)
ఇదిలావుండగా రాజస్తాన్ గవర్నర్ కల్‌రాజ్ మిశ్రాతో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లత్ సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. తిరుగుబాటు నేత సచిన్ పైలట్‌తో పాటు మరో 18 మందికి పార్టీ అధిష్టానం పంపిన సోకాజు నోటీసులను సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషిన్ సోమవారం విచారణకు రానుంది. తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తుందనే దానిపై పార్టీ, ప్రభుత్వ వర్గాల్లో విస్తృత చర్చసాగుతోంది. తీర్పు సచిన్ వర్గాన్నికి వ్యతిరేకంగా వస్తే అసెంబ్లీలో బలపరీక్షలకు గెహ్లెత్ సిద్ధమవ్వక తప్పదు. దీనిని దృష్టిలో ఉంచుకునే ముఖ్యమంత్రి గవర్నర్‌తో సమావేశమైనట్లు తెలుస్తోంది. విశ్వాస పరీక్షకు తాము సిద్ధంగా ఉన్నామన్న కబురును కల్‌రాజ్ మిశ్రాకు చేరవేసేందుకే భేటీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక హైకోర్టు ఇచ్చి తీర్పుపై ప్రభుత్వ భవిష్యత్ ఆధారపడి ఉంది. (పైలట్‌తో 18 నెలలుగా మాటల్లేవ్..)
Comments
Please login to add a commentAdd a comment