న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఒక చిన్న మాటతో ఆ ఇద్దరి నాయకుల మధ్య రగడకు చెక్ పెట్టారు. రాజస్తాన్ ముఖ్యమంత్రి ఆశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి సచిన్ పైలెట్‌ల మధ్య గత కొంతకాలంగా పొసగడం లేదు. ఇటీవలే సీఎం ఆశోక్ గెహ్లాట్.. 2020లో పైలట్ కాంగ్రెస్ పార్టీని కూల్చేయడానికి ప్రయత్నించిన ద్రోహి అని తిట్టిపోశారు. అలాగే పైలట్ కూడా ఒక సీనియర్ నాయకుడుగా ఐక్యతగా ఉండాల్సిన సమయంలో ఇలాంటి మాటలు తగదు అంటూ గెహ్లాట్‌కి కౌంటరిచ్చారు.
దీంతో ఇరువురి మధ్య తారా స్థాయిలో విభేధాలు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో బారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీని ఈ వివాదం మీ యాత్రకు అవరోధం అవుతుందా? అని విలేకరులు ప్రశ్నించగా..ఇది ఎలాంటి ప్రభావం చూపదని తేల్చి చెప్పారు. అంతేగాదు ఆశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్ ఇద్దరూ తమ పార్టీకి ఆస్తులు అని, అదే మా పార్టీ అందం అని రాహుల్ చెప్పారు. దీంతో వారి మధ్య ఉన్న రగడ కాస్త గప్‌చుప్ అంటూ సద్దుమణిగిపోయింది.
ఈ మేరకు ఆశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ..మా నాయకుడు మమ్మల్ని పార్టీకి ఆస్తులు అని చెప్పినప్పుడూ ఇక మా మధ్య వివాదం ఎక్కడ ఉంటుందని కొట్టిపారేశారు. అంతేగాదు గెహ్లాట్, సచిన్ ఇద్దరూ కలసి మీడియా ముందుకు వచ్చి.. డిసెంబర్ 4న రాజస్తాన్‌లో అడుగుపెట్టనున్న రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర పెద్ద విజయాన్ని సాధిస్తుందని పునరుద్ఘాటించారు. మా పార్టీయే మాకు అత్యన్నతమైనది, అది కీర్తీవంతంగా సాగాలని కోరుకుంటున్నాని అన్నారు. అలాగే సచిన్ పైలట్ కూడా ఈ భారత్ జోడోయాత్ర చేస్తున్న రాహుల్‌కి రాజస్థాన్ ఘన స్వాగతం పలుకుతుందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment