జైపూర్: రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు చల్లారడం లేదు. గత కొన్నేళ్లుగా సాగుతున్న రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్‌ల మధ్య ఆధిపత్య పోరు రోజురోజుకీ తీవ్రతరమవుతోంది. సమయం చిక్కినప్పుడల్లా గహ్లోత్‌పై అసంతృప్తి వెల్లగక్కుతున్న సచిన్.. తాజాగా మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సచిన్ పైలట్ మంగళవారం ఒక రోజు ధర్నా చేపట్టారు. రాజస్థాన్‌లో వసుంధర రాజే నేతృత్వంలోని గత బీజేపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరిపేందుకు అశోక్ గహ్లోత్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్షకు కూర్చునున్నారు. అయితే పైలట్ చర్యపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిని పార్టీ వ్యతిరేక చర్యగా పరిగణించడబుతుందని అతన్ని హెచ్చరించింది.
ఈ సమస్యను అసలు పైలట్ తమతో చర్చించలేదని కాంగ్రెస్ పేర్కొంది. ఈ మేరకు రాజస్థాన్ కాంగ్రెస్ ఇంచార్జీ సుఖ్‌జీందర్ సింగ్ రంధావా ఓ ప్రకటన విడుదల చేశారు. పైలట్ తనతో నిరాహార దీక్ష గురించి ఎప్పుడూ చర్చించలేదని తెలిపారు. అంతేగాక ధర్నా చేయడం పార్టీ ప్రయోజనాలకు, కార్యకలాపాలకు విరుద్ధమని పేర్కొన్నారు. అతనికి సొంత ప్రభుత్వంతో ఏదైనా సమస్య ఉంటే పార్టీతో ప్రశాంతంగా చర్చించాలని సూచించారు. ఇలా మీడియా, ప్రజల ఎదుటకు రావడం సరికాదన్నారు.
‘నేను గత అయిదు నెలలగా ఏఐసీసీ ఇంచార్జ్‌గా ఉన్నారు. పెలట్ ఎప్పుడూ ఈ సమస్య గురించి మాట్లాడలేదు. నేను అతనితో టచ్‌లో ఉన్నాను. సచిన్ కాంగ్రెస్‌కు ఎంతో కావాల్సిన వ్యక్తి. కాబట్టే ప్రశాంతంగా చర్చించుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను’ అని రంధావా తెలిపారు. మరోవైపు.. సొంత పార్టీ నేత తీసుకున్న నిర్ణయం పార్టీ అధిష్టానానికి బహిరంగ సవాల్ అంటూ. కాంగ్రెస్‌ను టార్గెట్‌గా బీజేపీ విమర్శలు గుప్పించింది.
చదవండి: భారత్‌లోని ముస్లింలపై నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు..
#WATCH | Rajasthan Congress leader Sachin Pilot on a daylong fast calling for action against alleged corruption during the previous Vasundhara Raje-led government in the state pic.twitter.com/MCav6OinIQ
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) April 11, 2023
Comments
Please login to add a commentAdd a comment