కాంగ్రెస్‌లోని అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. రాజస్తాన్‌లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌పై డిప్యూటి ముఖ్యమంత్రి సచిన్ పైలట్ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. దీంతో రాజస్తాన్‌లోని కాంగ్రెస్‌లో తాజగా రాజకీయ సంక్షోభం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్, సీఎం గెహ్లాట్‌ల మధ్య మొదటి నుంచి ఉన్న విభేధాలు కాస్త ఇప్పుడు మరింత తీవ్ర రూపం దాల్చాయి. గతంలో వసుంధర రాజే నేతృత్వంలో జరిగిన అవినీతికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి అనేక సార్లు లేఖలు రాసినా.. ప్రయోజనం లేకుండా పోయిందన్నారు పైలట్. పైగా ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదని, అందువల్లే తాను అవినీతికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేయనున్నట్లు తెలిపారు.
తాను అవినీతిపై చర్యలు తీసుకుంటానని ప్రజలకు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకునేందుకు ఏప్రిల్ 11న నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు చెప్పారు. ఆశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ప్రజలకు కావల్సినవి ఏమీ నెరవేర్చడం లేదని ఆరోపణలు చేశారు. తాను సీఎం అశోక్ గెహ్లాట్‌కు అవినీతి గురించి ఎన్నో లేఖలు రాశానని, కానీ ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదని చెప్పుకొచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మనం ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకున్నామని నిరూపించేలా మన పనులు ఉండాలని పైలట్ అన్నారు.
అవినీతిని అరికట్టడానికి దర్యాప్తు సంస్థలను ఉపయోగించలేకపోతున్నామా? లేక దుర్వినియోగ మవుతున్నాయా? అని ప్రజలకు సందేహం వచ్చేలా పరిస్థితి ఉంకూడదన్నారు. మనం వాగ్దానాలు నెరవేర్చడం లేదని కార్యకర్తలు, ప్రజలు భావించకూడదని చెప్పారు. ప్రభుత్వం నుంచి సరైన విధంగా స్పందన రాకపోవడంతోనే తాను నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు పైలట్ తెలిపారు.
(చదవండి: సైబర్ మోసంలో డబ్బు పొగొట్టుకున్న భార్య.. తలాక్ చెప్పిన భర్త)
Comments
Please login to add a commentAdd a comment