న్యూఢిల్లీ: పంజాబ్‌లో రాజకీయ సంక్షోభం ముగిసిపోవడంతో రాజస్తాన్‌పై కాంగ్రెస్ దృష్టి సారించింది. రాజస్తాన్ కేబినెట్‌ను విస్తరిస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో సీనియర్ కాంగ్రెస్ నేత సచిన్ పైలెట్ శుక్రవారం రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీలను కలుసుకొని చర్చించారు. రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, సచిన్ పైలెట్‌ల మధ్య అధికార పోరు నడుస్తూ ఉన్న నేపథ్యంలో పైలెట్ పలుమార్లు రాహుల్, ప్రియాంకలను కలుసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కేబినెట్ విస్తరణతో పాటు, కార్పొరేషన్లు, వివిధ ప్రభుత్వ బోర్డుల్లో నియామకం జరపాలని పార్టీలో సంస్థాగతంగా మార్పులు తీసుకురావాలని పైలెట్ డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment