సచిన్‌ సోలో ప్రచార ర్యాలీ వ్యూహం..టెన్షన్‌లో కాంగ్రెస్‌ | Sachin Pilot Plan Rallies Worries Congress Over Rajasthan Elections | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ని కలవరపెడుతున్న..సచిన్‌ సోలో ‍ప్రచారం

Published Sat, Jan 14 2023 10:21 AM | Last Updated on Sat, Jan 14 2023 10:30 AM

Sachin Pilot Plan Rallies Worries Congress Over Rajasthan Elections - Sakshi

రాజస్తాన్‌ అంతటా మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి సచిన్‌ పైలెట్‌ సోలోగా ర్యాలీలు చేయనున్నట్లు సమాచారం. దీంతో మళ్లీ రాజస్తాన్‌లో అంతర్గతంగా కాంగ్రెస్‌ నాయకుల మధ్య కోల్డ్‌వార్‌ ప్రారంభమైందని భావిస్తున్నాయి పార్టీ వర్గాలు. కేవల 10 నెలల వ్యవధిలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సచిన్‌ ఇలా సోలోగా ప్రచార ర్యాలీలు నిర్వహించడంపై పార్టీలో రకరకాలు ఊహాగానాలు హల్‌చల్‌ చేయడం ప్రారంభించాయి. అదీగాక ఇటీవలే రాజస్తాన్‌లో భారత్‌ జోడో యాత్ర చాలా విజయవంతం జరిగింది కూడా. అనూహ్యంగా మళ్లీ  సచిన్‌ ఇలా నిర్ణయం తీసుకోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది.

ఐతే ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో పార్టీని సంబంధిత వాటిల్లో మరింత బోపేతం చేస్తూ కార్యచరణలో ఉంచడమే లక్ష్యంగా సచిన్‌ ఈ ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. వచ్చేవారం నుంచే సచిన్‌ పైలల్‌  రైతులు, యువతను ఉద్దేశించి వరుస బహిరంగ సభల్లో ప్రసగించనున్నట్లు తెలిపాయి. ఐతే ఒకపక్క రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోటసార అట్టడుగు స్థాయి సంస్థ పనుల్లో బిజీగా ఉండటం, మరోవైపు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా తన చివరి బడ్జెట్‌తో స్వయంగా వెళుతున్నందున, సచిన్‌ ఇలా సోలోగా ర్యాలీలు నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారని కొందరూ విశ్లేషకులు భావిస్తున్నారు.

అదీగాక 2003 లేదా 2013ల మాదిరిగా పార్టీ తుడిచిపెట్టుకుపోకుండా చూసేందుకు మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌  జాట్‌లు ఎక్కువగా ఉండే ప్రాంతాలపై దృష్టి పెట్టాలని చూస్తున్నట్లు సమాచారం. ఐతే పైలట్‌ ప్రచారానికి రాహుల్‌ గాంధీ ఆమోదం ఉందని చెబుతున్నప్పటికీ, ఆయన ఆల్‌ ఇండియా కాంగ్రెస్‌ కమిటీ నుంచి అనుమతి తీసుకులేదని పార్టీ వర్గాలు తెలిపాయి. ఒక రాష్ట్ర నాయకుడిగా సచిన్‌కి ఇదంతా అవసరమా అని పార్టీలో కొందరూ నాయకులు మండిపడుతున్నట్లు సమాచారం. 

(చదవండి: నిర్జన ప్రదేశంలో.. ఏకంగా రూ. 10 లక్షల నోట్ల కట్టలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement