Rajasthan Elections
-
'ఏళ్లుగా సాగతున్న సంప్రదాయానికే కట్టుబడిన రాజస్థాన్'! సీఎం ఎవరంటే..?
రాజస్థాన్ ఎన్నికల పరంగా సాగుతున్న సంప్రదాయాన్ని మార్చి చరిత్ర తిరగరాయాలనుకున్న కాంగ్రెస్ మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోలేకపోయింది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల కౌంటింగ్‌లో బీజేపీ అనూహ్యంగా ఆధిక్యం చూపింది. కాంగ్రెస్ నమ్ముకున్న గ్యారంటీ హామీ గేమ్ కంటే బీజేపీ స్ట్రాటజీనే గెలించిందన్నట్లుగా ఓట్ల ఆధిక్యం చూపిస్తోంది. రాజస్థాన్ కాంగ్రెస్ సాగించిన పాలనపై విమర్శలు కురిపిస్తూ అవి ప్రజల్లోకి వెళ్లే దిశగా చేసిన ప్రచార స్ట్రాటజీ ఫలించింది. ఇక ఓట్ల లెక్కింపులో మధ్యాహ్నాం 1.00 గంట బీజేపీ కాంగ్రెస్ ఇతరులు 111 72 02 దీంతో బీజేపీ కార్యాలయాల్లో 'మోదీ'..'మోదీ' అంటూ నినాదాలు మిన్నంటాయి. ఈ ఎన్నికల్లో మహిళల అంశమే కీలకపాత్ర పోషించదని అన్నారు ముఖ్యమంత్రి అభ్యర్థి దియా కుమారి అన్నారు. బీజేపీ రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో మహిళలకే పెద్ద పీఠం వేస్తూ.. లడో ప్రోత్సాహన్ యోజన కింద ఆడపిల్ల పుట్టినప్పుడు రూ. 2 లక్షల పొదుపు బాండ్, లక్షపతి దీదీ పథకం కింద దాదాపు ఆరు లక్షల మంది గ్రామీణ మహిళలకు నైపుణ్య శిక్షణ, 12వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన ప్రతిభావంతులైన బాలికలకు స్కూటర్లు, కేజీ నుంచి ఉచిత విద్య కల్పిస్తామని కూడా బీజేపీ వాగ్దానం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి ఎవరంటే..? ఇక బీజేపీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే ప్రశ్నకు అధిష్టానం నిర్ణయానికే వదిలేశామని చెప్పారు. కాగా, రాజస్తాన్‌లో మూడు దశాబ్దాలుగా ఒకసారి కాంగ్రెస్ మరోసారి బీజేపీ అంటూనే సాగినప్పటికీ 2018లో ఏ పార్టీకి మెజారిటీ రాకుండా ఆశ్చర్యపరిచింది. దాదాపు 200 మంది సభ్యులుండే సభలో 101 మందికి ఒక్కటి తక్కువ ఉన్న కాంగ్రెస్, మాయావతి బహుజన్ సమాజ్ పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. (చదవండి: రాజస్థాన్ ఎన్నికల కౌంటింగ్ లైవ్ అప్డేట్స్) -
Rajasthan Results 2023: రాజస్థాన్‌లో బీజేపీ ఘన విజయం
Live Updates.. బీజేపీకి 115 సీట్లు రాజస్థాన్‌లో మొత్తం 115 స్థానాల్లో బీజేపీ విజయం 68 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు. ఒక చోట ఆధిక్యం భారత్ ఆదివాసీ పార్టీకి 3 సీట్లు 2 స్థానాల్లో బీఎస్పీ గెలుపు ఆర్ఎల్డీ, ఆర్‌ఎల్‌టీడీ పార్టీలకు చెరొక సీటు. తాజా సమాచారం: బీజేపీ 103 గెలుపొందగా, 12 లీడ్‌లోఉంది. కాంగ్రెస్‌లో 58 స్థానాల్లో గెలుపొంది, 11 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది ఉదయ్‌పూర్‌లో బీజేపీ అభ్యర్థి తారాచంద్ జైన్ కాంగ్రెస్‌కు చెందిన గౌరవ్ వల్లభ్‌పై 32,771 ఓట్లతేడాతో విజయం. ఆప్ అభ్యర్థి మనోజ్ లబానా 348 ఓట్లు మాత్రమే రావడం గమనార్హం. కాంగ్రెస్ అభ్యర్థి, రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి నాథ్ ఓటమి. ఈ స్థానంలో బీజేపీకి చెందిన విశ్వరాజ్ సింగ్ మేవార్ 7,504 ఓట్ల మెజారిటీతో గెలుపు. ఈ ఫలితాలు షాక్ ఇచ్చాయి. ప్రజల తీర్పును అంగీకరిస్తున్నాం. భవిష్యత్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పని చేస్తారని ఆశిస్తున్నాను- రాజస్థాన్‌లో బీజేపీ ఆధిక్యంపై సీఎం అశోక్ గెహ్లోత్ #WATCH | Delhi: On BJP's lead in Rajasthan, CM Ashok Gehlot says "I have always said that I will accept the mandate of the people and I extend my best wishes to the future government. I hope they work for the welfare of the people of the state...The results are shocking..." pic.twitter.com/r7uxhOUk2P — ANI (@ANI) December 3, 2023 కాంగ్రెస్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ 29,475 ఓట్ల తేడాతో విజయం బీజేపీ 79 స్థానాల్లో విజయం 36చోట్ల ఆధిక్యం, కాంగ్రెస్ 43 స్థానాల్లో విజయం, 26 చోట్ల ఆధిక్యం భారత ఆదివాసీ పార్టీ 2 స్థానాల్లో గెలుపొందగా, 3 చోట్ల ఆధిక్యంలో ఉంది. బీఎస్పీ ఒక చోట విజయం సాధించగా, మరో స్థానంలో లీడింగ్‌లో ఉంది. తిజారా అసెంబ్లీ స్థానం నుంచి మహంత్ బాబా బాలక్‌నాథ్ విజయం అశోక్ గెహ్లోత్ ఈ సాయంత్రం గవర్నర్ కల్ రాజ్ మిశ్రాను కలిసి ఓటమిని అంగీకరించి సీఎం పదవికి రాజీనామా చేసే అవకాశం. #WATCH | Rajasthan BJP MLA candidate Diya Kumari, in Jaipur says, "The credit for this win goes to PM Modi, Amit Shah ji, JP Nadda ji, state leaders and party workers. Modi ji's magic worked in Rajasthan and also MP & Chhattisgarh...We will ensure good governance and development… pic.twitter.com/3stn8l8Vj1 — ANI (@ANI) December 3, 2023 ఈ ఘనత ప్రధానిమోదీ, అమిత్‌షా, రాష్ట్ర బీజేపీ శ్రేణులకే దక్కుతుంది. సీఎం ఎవనేది అధిష్టానం నిర్ణయిస్తుంది-దియా కుమారి బీజేపీ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, ఎంపీ దియా కుమారి విజయం. మాజీ కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ జోత్వారా నియోజకవర్గం నుంచి గెలుపొందారు. మూడు స్థానాల్లో వెలువడిన ఫలితం రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో మూడు స్థానాలకు ఫలితాల వెల్లడి. రెండు చోట్ల బీజేపీ, ఒక స్థానంలో భారత్ ఆదివాసీ పార్టీ గెలుపు. పిండ్వారా అబు, మనోహర్ తానా నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థుల విజయం. చోరాసి నియోజకవర్గంలో భారత్ ఆదివాసీ పార్టీ అభ్యర్థి రాజ్‌కుమార్ రౌత్ 69,166 మెజార్టీతో భారీ విజయం. గెలుపు దిశగా బీజేపీ.. రాజస్థాన్‌లో బీజేపీ గెలుపు దిశగా సీట్లును సాధిస్తోంది. ఈసీ ట్రెండ్స్ ప్రకారం.. బీజేపీ ఇప్పటికే 100 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. కాంగ్రెస్.. 78 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. దీంతో, బీజేపీ కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు. #WATCH | #RajasthanElection2023 | The beating of drums and dancing by BJP workers continue outside the party office in Jaipur as official EC trends show the party leading on 98 of the 199 seats so far. pic.twitter.com/WYYaU8cATQ — ANI (@ANI) December 3, 2023 #WATCH | Rajasthan BJP cadre celebrate party's lead in state elections, in Jaipur pic.twitter.com/WzqB4lVrZe — ANI (@ANI) December 3, 2023 విజయం మాదే: బీజేపీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత గజేంద్రసింగ్ షెకావత్ మాట్లాడుతూ.. రాజస్థాన్‌లో బీజేపీ భారీ మెజార్టీతో గెలుస్తుంది. 2/3 మెజార్టీతో బీజేపీ గెలుస్తుంది. ఛత్తీస్‌గఢ్‌లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. #WATCH | Union minister and BJP leader Gajendra Singh Shekhawat says, "BJP will win with a huge majority in Rajasthan. Jadugar ka jadoo khatam ho gaya hai. In MP, the BJP will form govt with a 2/3 majority. In Chhattisgarh, the party will form the govt." pic.twitter.com/G2kO36kHlu — ANI (@ANI) December 3, 2023 రాజస్థాన్‌లో లీడ్‌లో బీజేపీ బీజేపీ.. 86 స్థానాల్లో లీడింగ్ కాంగ్రెస్.. 64 స్థానాలు సీపీఎం.. 2 స్థానాలు ఇతరులు.. 11 In initial trends, BJP leading on 73 seats, Congress on 28 seats in Madhya Pradesh pic.twitter.com/ESwsSQqkwy — ANI (@ANI) December 3, 2023 రాజస్థాన్ బీజేపీ చీఫ్ సీపీ జోషి మాట్లాడుతూ.. మా పార్లీ లీడింగ్‌లో ఉంది. దాదాపు 135 స్థానాల్లో బీజేపీ గెలుస్తుందన్నారు. #WATCH | As early trends show BJP leading in Rajasthan, state BJP president CP Joshi says, "This lead will keep growing. We will win over 135 seats." pic.twitter.com/YHJjvr4D97 — ANI (@ANI) December 3, 2023 రాజస్థాన్‌లో లీడింగ్‌లో బీజేపీ.. బీజేపీ.. 34 కాంగ్రెస్.. 28 Rajasthan elections 2023 | BJP-34, Congress-28, as per official ECI trends https://t.co/dLB9iDlVqH pic.twitter.com/Yo2foMCzaT — ANI (@ANI) December 3, 2023 రాజస్థాన్‌లో కాంగ్రెస్ లీడ్.. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్.. 8 బీజేపీ.. 6 బీఎస్పీ.. 1 ఇతరులు..2 Rajasthan elections 2023 | Congress-8, BJP-6, BSP-1, RLD-1 and RLTP-1, as per official ECI trends pic.twitter.com/HgN7vvpPLF — ANI (@ANI) December 3, 2023 బీజేపీ లీడ్.. Rajasthan elections 2023 | BJP-17, Congress-13, BSP-1, RLD-1, as per official ECI trends pic.twitter.com/5iYiEZTXEU — ANI (@ANI) December 3, 2023 కృష్ణపోలే నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజ రాజస్థాన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి అజిన్ కాగ్జి ముందంజ Rajasthan Congress MLA candidate Amin Kagzi from Kishan Pole constituency leading in early trends, as per ECI. pic.twitter.com/zeNbmOSwWV — ANI (@ANI) December 3, 2023 మూడు రాష్ట్రాల పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్ ముందంజ రాజస్థాన్‌లో.. బీజేపీ..42, కాంగ్రెస్.. 49 మధ్యప్రదేశ్‌లో.. బీజేపీ.. 42, కాంగ్రెస్.. 40 ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ.. 28 కాంగ్రెస్.. 34 న్యాయం గెలుస్తుంది.. గెలుపు మాదే: బీజేపీ రాజస్థాన్ బీజేపీ చీఫ్ సీపీ జోషి మాట్లాడుతూ.. భారీ మెజార్టీతో బీజేపీ గెలుస్తుంది. రాజస్థాన్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ప్రజలు బీజేపీని పూర్తి మెజారిటీతో ఆశీర్వదించారు. దుష్పరిపాలన మరియు అన్యాయం కోల్పోతాయి. సుపరిపాలన మరియు న్యాయం గెలుస్తుంది. #WATCH | On poll results day, Rajasthan BJP chief CP Joshi says, "The public has blessed BJP with complete majority. Misgovernance and injustice will lose; Good governance and justice will prevail." pic.twitter.com/KiLVJ4pXtf — ANI (@ANI) December 3, 2023 ముందంజలో బీజేపీ.. ►పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో రాజస్థాన్‌లో బీజేపీ ముందంజలో కొనసాగుతోంది. కాంగ్రెస్..35, బీజేపీ.. 54 కేంద్ర మంత్రి ప్రత్యేక పూజలు.. ►కేంద్రమంత్రి, బీజేపీ నేత గజేంద్ర సింగ్ షకావత్ ప్రత్యేక పూజలు.. బీజేపీ గెలుపును ఆకాంక్షిస్తూ జైపూర్‌లోని గోవింద్ దేవ్‌జీ టెంపుల్లో పూజలు.. Rajasthan | Union minister & BJP leader Gajendra Singh Shekhawat offered prayers at Jaipur's Govind Dev Ji temple on counting day pic.twitter.com/KAdg4MPyVw — ANI (@ANI) December 3, 2023 ►జైపూర్‌లో కౌంటింగ్ ప్రక్రియకు రెడీ.. #WATCH | Rajasthan | EVMs all set to be opened at University Commerce College counting centre in Jaipur, for the counting of votes. pic.twitter.com/nF6PSvlpkg — ANI (@ANI) December 3, 2023 ►రాజస్థాన్‌లో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. Counting of votes for Chhattisgarh, Madhya Pradesh, Rajasthan and Telangana Assembly elections begins. pic.twitter.com/Raj87zBuaI — ANI (@ANI) December 3, 2023 ►రాజస్థాన్‌లో విజయం తమదంటే తమదేనని కాంగ్రెస్, బీజేపీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. #WATCH | Ahead of poll verdict, Rajasthan minister & Congress leader BD Kalla says, "I can say that I will get mandate of people of Bikaner and enter the Legislative Assembly...Congress will repeat government in the state." pic.twitter.com/2IwJCPSozs — ANI (@ANI) December 3, 2023 #WATCH Churu, Rajasthan: On the counting of votes, Leader of Opposition in the Assembly Rajendra Rathore says, "...After some time, a new government will be formed...BJP will win with a huge majority & form government..." pic.twitter.com/BUWI84spIZ — ANI (@ANI) December 3, 2023 ►ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్త ఒకరు హనుమాన్ వేశధారణలో ఢిల్లీలో కనిపించారు. ►కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్ వద్ద జైహనుమాన్ నినాదాలు చేశారు. #WATCH | Ahead of the counting of 4-state elections, a Congress worker - dressed as Lord Hanuman - stands outside the party HQ in Delhi. He says, "Truth will triumph. Jai Sri Ram!" pic.twitter.com/L61e28tBln — ANI (@ANI) December 3, 2023 ►రాజస్థాన్.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో ఎన్నికల పోరు హోరాహోరీగా సాగింది. ప్రతి ఐదేళ్లకూ ప్రభుత్వాన్ని మార్చేయడం రాజస్థాన్ ప్రజల అలవాటు. ఈ ఆనవాయితీ ఈసారీ కొనసాగుతుందని, మోదీ మేనియా తోడై తమకు అధికారం కట్టబెడుతుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ►సీఎం గెహ్లోత్ మాత్రం ఈసారి ఆనవాయితీ మారుతుందని నమ్మకం పెట్టుకున్నారు. తన సంక్షేమ పథకాలు ఖచ్చితంగా గట్టెక్కిస్తాయని చెబుతున్నారు. 2018 ఎన్నికల్లో అధికారంలోకి వచి్చన నాటినుంచీ గెహ్లోత్‌పై కారాలూ మిరియాలూ నూరుతూ వస్తున్న కాంగ్రెస్ యువ నేత సచిన్ పైలట్ ప్రచార పర్వంలో మాత్రం సంయమనం పాటించారు. రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు: 200 మెజారిటీ మార్కు: 101 -
‘ప్రజలు మార్చేసే మూడ్‌లో ఉన్నారు’
చిత్తోర్‌గఢ్ (రాజస్థాన్): రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా చిత్తోర్‌గఢ్, నాథ్‌ద్వారా నియోజకవర్గాల్లో మెగా రోడ్‌షోలు నిర్వహించారు. రెండు చోట్లా అభిమానులు, పార్టీ శ్రేణులు భారీ ఎత్తున తరలివచ్చారు. పూలవర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. అంతకుముందు జైపూర్‌లో విలేకరుల సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాను ఆరు నెలల్లో రాష్ట్రమంతటా పర్యటించానని, ప్రజల్లో మార్పు మూడ్ ఉందని, రాజస్థాన్‌లో తదుపరి ప్రభుత్వం తమదేనని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాజస్థాన్‌లోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విమర్శలు చేశారు. రాష్ట్రంలో మత ఘర్షణలు ప్రణాళికాబద్ధమైన వ్యూహాలతో జరిగాయని ఆరోపించారు. 'ఓటు బ్యాంకు' రాజకీయాల కారణంగా రాష్ట్రంలో జరిగిన అల్లర్లపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఎటువంటి ఎటువంటి చర్యలూ తీసుకోలేదని మండిపడ్డారు. -
ఆ సభాపతి గురి.. ఆరోసారి!
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు ఈసారి హోరాహోరీగా సాగుతున్నాయి. అధికార కాంగ్రెస్, బీజేపీల మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ఐదేళ్లకు మించి ఏ పార్టీకి అధికారం ఇవ్వని రాజస్థాన్ ఓటర్లు ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తారా లేక కాంగ్రెస్‌కి మరోసారి అధికారం ఇచ్చి కొత్త సంప్రదాయానికి తెరతీస్తారా శనివారం జరగనున్న ఎన్నికల్లో తేలనుంది. ఇదిలా ఉండగా ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్, కాంగ్రెస్ సీనియర్ నేత సీపీ జోషి ఎమ్మెల్యేగా ఆరోసారి గెలుపుపై గురి పెట్టారు. అత్యంత సీనియర్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నాయకుడైన సీపీ జోషికి కేంద్ర, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. 1998-2003లో రాజస్థాన్ మంత్రివర్గంలో పనిచేశారు. 2009లో భిల్వారా నుంచి లోక్‌సభకు ఎన్నికైన తర్వాత అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ క్యాబినెట్లో రైల్వే మంత్రిగా, రవాణా, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా కూడా కొద్దికాలం పనిచేశారు. స్పీకర్‌గా గుర్తింపు 2020లో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సచిన్ పైలట్ తిరుగుబాటు చేసిన సమయంలో అసెంబ్లీ స్పీకర్‌గా సీపీ జోషి వ్యవహరించిన పాత్ర చర్చనీయాంశమైంది. తిరుగుబాటుదారులపై అనర్హత నోటీసులు కూడా జారీ చేయడమే కాకుండా దీనిపై సుప్రీంకోర్టును సైతం ఆయన ఆశ్రయించారు. విద్యావేత్త కూడా.. సీపీ జోషి అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడే కాకుండా విద్యావేత్త కూడా. అర్హత కలిగిన న్యాయవాది అయిన ఆయన ఉదయపూర్‌లోని కళాశాలలలో సైకాలజీ బోధించేవారు. 1973లో మోహన్‌లాల్ సుఖాడియా యూనివర్శిటీలో స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్‌గా ఎన్నికవడం రాజకీయాలలో ఆయన తొలి అడుగు. ఎమ్మెల్యేగా ఐదుసార్లు సీపీ జోషి 1980 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా తన సొంత నియోజకవర్గం నాథ్‌ద్వారా నుంచి గెలుపొందారు. అప్పటి నుంచి ఆయన ఆ నియోజకవర్గానికి ఐదుసార్లు ప్రాతినిధ్యం వహించారు. 2003-2005 మధ్య రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడిగానూ పనిచేశారు. నాథ్‌ద్వారా ఎన్నికల్లో ప్రముఖ మేవార్ రాజు మహారాణా ప్రతాప్ సింగ్ వారసుడు, బీజేపీకి చెందిన విశ్వరాజ్ సింగ్ మేవార్‌తోనూ ఆయన తలపడ్డారు. ఒకే ఒక్క ఓటుతో.. 2008 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, సీపీ జోషి ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థిపై కేవలం ఒకే ఒక ఓటు తేడాతో సీటును కోల్పోయారు. ఆ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ ప్రచార కమిటీకి సారథ్యం వహించారు. ప్రస్తుత ఎన్నికల్లో సీపీ జోషి మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. -
Rajasthan Elections 2023: ఆ ముగ్గురూ జేబు దొంగలు.. రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు
భరత్పూర్ (రాజస్థాన్): ప్రధాని నరేంద్రమోదీపై కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోపాటు పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని పిక్‌పాకెటర్లతో పోలుస్తూ రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. జేబు దొంగల ముఠా లాగానే ఈ ముగ్గురు కలిసి దేశంలోని ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించారు. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో బుధవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘జేబుదొంగ ఎప్పుడూ ఒంటరిగా రాడు. ముఠాలో ముగ్గురు వ్యక్తులు ఉంటారు. ఒకరు ముందు నుంచి, మరొకరు వెనుక నుంచి వస్తారు. ఇంకొకరు దూరం నుంచి గమనిస్తూ ఉంటారు. వీరిలో మీ దృష్టిని మరల్చడమే ప్రధాని నరేంద్ర మోదీ పని. ముందు నుంచి టీవీల్లో వచ్చి హిందూ-ముస్లిం, నోట్ల రద్దు, జీఎస్టీ వంటి అంశాలతో ప్రజల దృష్టి మరల్చుతాడు. ఇంతలో అదానీ వెనుక నుంచి వచ్చి డబ్బును దోచుకుంటాడు. ఇక అమిత్ షా మూడవ వ్యక్తి. పర్యవేక్షించడం ఆయన పని. అక్కడ జరుగుతున్నది ఎవరికీ తెలియకుండా చూసుకుంటాడు’ అని పేర్కొన్నారు. కేంద్రంలో కార్యదర్శి స్థాయి పదవుల నియామకంలో వెనుకబడిన కులాలు, ఈడబ్ల్యూఎస్ వర్గాల భాగస్వామ్యంపై రాహుల్ గాంధీ మరోసారి ప్రశ్నను లేవనెత్తారు. కేంద్రంలో కేవలం ముగ్గరు ఓబీసీలు మాత్రమే సెక్రటరీలుగా పనిచేస్తున్నారని తెలిసి ఆశ్చర్యపోయానని, అదీ కూడా చిన్న డిపార్ట్మెంట్లు కేటాయించారని ఆరోపించారు. జనాభాలో సగానికిపైగా ఉన్న వెనుకబడిన తరగతులకు అన్యాయం జరుగుతోందని రాహుల్ విమర్శించారు. -
Rajasthan Elections 2023: ప్రచారాస్త్రంగా ‘మహిళలపై నేరాలు’.. ఇవీ గణాంకాలు..
‘మహిళలపై నేరాలు’ ప్రధాన ప్రచారాస్త్రంగా రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు సాగుతున్నాయి. వీటిపైనే బీజేపీ తమ ప్రచార ర్యాలీలు, బహిరంగ సభల్లో అధికార కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ రెండూ తమ మేనిఫెస్టోలలో మహిళా భద్రతకు సంబంధించి అనేక హామీలు ప్రకటించాయి. ప్రచార సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా బీజేపీ నేతలందరూ రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలపై కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు. నవంబర్ 15న బార్మర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో మహిళలపై అఘాయిత్యాల్లో రాజస్థాన్ అగ్రగామిగా ఉందని ఆరోపించారు. గణాంకాలు ఇవీ.. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో డేటా ప్రకారం.. 2021 సంవత్సరంలో అత్యధికంగా రేప్ కేసులు నమోదైన రాష్ట్రంగా రాజస్థాన్ అవతరించింది. రాష్ట్రంలో ఐపీసీ సెక్షన్ 376 కింద 6,337 అత్యాచార కేసులు నమోదయ్యాయి. దీని తర్వాత ఉత్తరప్రదేశ్‌లో 2,845 కేసులు నమోదయ్యాయి. ఇక 2021లో దేశవ్యాప్తంగా 31,677 అత్యాచార కేసులు నమోదయ్యాయి. మహిళలపై ఇతర నేరాల విషయానికి వస్తే.. ఉత్తరప్రదేశ్ తర్వాత రాజస్థాన్ రెండో స్థానంలో ఉంది. 2021లో అత్యధికంగా 56,083 కేసులతో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉండగా, రాజస్థాన్‌లో 40,738 కేసులు నమోదయ్యాయి. రాజస్థాన్‌లో మహిళలపై నేరాల సంఖ్య 2020 కంటే 2021లో దాదాపు 17 శాతం పెరిగింది. అయితే ఇది 2019 కేసుల సంఖ్య 41,550 కంటే 2 శాతం తగ్గడం గమనార్హం. 2021లో దేశవ్యాప్తంగా మహిళలపై నేరాలకు సంబంధించి 4,28,278 కేసులు నమోదయ్యాయని ఎన్సీఆర్బీ గణాంకాలు చెబుతున్నాయి. -
Rajasthan Elections 2023: ఇక్కడ 651 మంది అభ్యర్థులు కోటీశ్వరులే!
రాజస్థాన్‌లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కళంకిత అభ్యర్థులతో పాటు కోటీశ్వరులైన నేతల సంఖ్య కూడా పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ అసెంబ్లీ స్థానాలకు బరిలో నిలిచిన 1,875 మంది అభ్యర్థుల్లో ఈసారి ఏకంగా 651 మంది కోటీశ్వరులు ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో అభ్యర్థుల సగటు ఆస్తి రూ. 3.12 కోట్లు కాగా, గత ఎన్నికల్లో ఇది రూ. 2.12 కోట్లు. అభ్యర్థులు సమర్పించిన ఎలక్షన్ అఫిడవిట్ల విశ్లేషణ ఆధారంగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అండ్ ఎలక్షన్ వాచ్ రూపొందించిన నివేదికలో ఈ సమాచారం వెల్లడైంది. ఈ నివేదిక ప్రకారం.. కోటీశ్వరులైన అభ్యర్థుల్లో బీజేపీ నుంచి 160 మంది, కాంగ్రెస్ నుంచి 149 మంది ఉన్నారు. ఎనిమిది మంది అభ్యర్థులు తమకు ఎలాంటి ఆస్తి లేదని ప్రకటించడం గమనార్హం. చురు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి రఫీక్ మండెలియా అత్యంత సంపన్న అభ్యర్థి. ఆయన ఆస్తుల విలువ రూ.166 కోట్లు. ఆయన తర్వాత నీమ్‌కథానా బీజేపీ అభ్యర్థి ప్రేమ్ సింగ్ బజౌర్ రూ.123 కోట్ల విలువైన ఆస్తులతో రెండో స్థానంలో ఉన్నారు. ఇక నింబహెరా నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఉదయ్‌లాల్ అంజన మూడో స్థానంలో నిలిచారు. ఇక కేసుల విషయానికి వస్తే.. ఈసారి 236 మంది అభ్యర్థులు తమపై తీవ్రమైన క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లలో పేర్కొన్నారు. వీరిలో బీజేపీకి చెందిన 42 మంది, కాంగ్రెస్‌కు చెందినవారు 34 మంది, రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ అభ్యర్థులు 24 మంది ఉన్నారు. అలాగే ఆప్‌కు చెందినవారు 15 మంది, సీపీఎంకు చెందిన 12 మంది, బీఎస్పీకి చెందిన 8 మంది అభ్యర్థులు తీవ్రమైన నేరాల్లో నిందితులుగా ఉన్నట్లు తెలుస్తోంది. -
Rajasthan Elections 2023: ‘కాంగ్రెస్ మళ్లీ గెలుస్తుంది.. నా భవిష్యత్తు మాత్రం..’
జైపూర్: మరో మూడు రోజుల్లో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని ప్రస్తుత సీఎం అశోక్ గెహ్లాట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్నికల తర్వాత తన రాజకీయ భవిష్యత్తు ఏంటన్నది మాత్రం పార్టీ హైకమాండ్‌కే వదిలేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం తన పాత్ర ఎలా ఉండోబోతోందన్న దానిపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ "నా పాత్రను పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుంది. ఎలాంటి పాత్ర ఇచ్చినా దానికి కట్టుబడి ఉంటాను" అని అన్నారు. ఆ సంప్రదాయం మారుతుంది రాజస్థాన్‌లో అధికార వ్యతిరేకతను అధిగమించి మరోసారి ప్రజామోదం పొందుతామని అశోక్ గెహ్లాట్ విశ్వాసం వ్యక్తం చేశారు. 2ఈసారి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని పునరావృతం చేసేలా ప్రజలు తమ మూడ్‌ని ఏర్పరచుకున్నారు. మేము 156 సీట్ల దిశగా పయనిస్తున్నామని నమ్ముతున్నాను. ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయానికి ఈసారి బ్రేక్ పడబోతోంది’ అని గెహ్లాట్ అన్నారు. ‘కేరళలో 76 ఏళ్ల ఇలాంటి రికార్డును ఆ రాష్ట్ర ప్రజలు బద్దలు కొట్టారు. కోవిడ్ సమయంలో మెరుగైన సేవలు అందించిన ప్రభుత్వాన్ని మరోసారి కొనసాగించారు. ఇక్కడ రాజస్థాన్‌లో మేం కూడా కోవిడ్ సమయంలో ప్రజలకు విశేష సేవలు అందించాం. కేరళ ప్రజల లాగే రాజస్థాన్ ప్రజలు కూడా తెలివైనవారు ప్రభుత్వాన్ని పునరావృతం చేస్తారు’ అని ధీమా వ్యక్తం చేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రభుత్వాలను పడగొట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వంటి ఏజెన్సీలను ఉపయోగిస్తోందని అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. తాము అమలు చేసిన వివిధ సామాజిక పథకాలే తమను మరోసారి గెలిపిస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని ఉపయోగిస్తున్న భాషపైనా ఆయన అభ్యంతరం వెలిబుచ్చారు. -
రాజస్థాన్ ఎన్నికలు: కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ కీలక వ్యాఖ్యలు
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, సీనియర్ నేత మాజీ డిప్యూటీ స్పీకర్ సచిన్ పైలట్ మధ్య నెలకొన్న టెన్షన్ నేపథ్యంలో పైలట్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్‌లో గత 30 ఏళ్లుగా ఎన్నికల్లో వరుసగా ఎందుకు గెలవ లేకపోతున్నామో కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పైలట్ మాట్లాడుతూ రాజస్థాన్‌లో 30 ఏళ్లుగా వరుసగా ఎన్నికల్లో గెలుపొందలేదు. దీనికి కారణం ఏంటి అనే దానిపై ఆత్మపరిశీలన చేసుకోవాలి. అయితే ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ దీన్ని బ్రేక్ చేస్తుందని పేర్కొనడం గమనార్హం. రాజస్థాన్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుపై ఆయన ధీమా వ్యక్తం చేశారు. సామాజిక సంక్షేమం , పెట్టుబడులు, సంపద సృష్టిపై దృష్టిపెట్టాం. అసమాతనలు లేని రాజస్థాన్ కావాలి. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు. అలాగే బీజేపీ "డబుల్ ఇంజిన్" ప్రభుత్వంపై కూడా మండిపడ్డారు. రాష్ట్ర అగ్ర నాయకత్వం మధ్య విభేదాలపై స్పందిస్తూ తాము సమిష్టిగా ఎన్నికల్లో పోరాడతామని, ఇక పదవులు ఎంపిక హైకమాండ్ చూసుకుంటుందని వ్యాఖ్యానించారు. అలాగే పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సలహా మేరకు తాను ‘క్షమించండి, మరచిపోయి ముందుకు సాగండి’ ఈ మంత్రాన్ని అనుసరిస్తున్నట్లు పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పైలట్ తెలిపారు. అశోక్ గెహ్లాట్‌ని ఉద్దేశించి గతంలో చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ గతంలో తానేం మాట్లాడినా దానికి బాధ్యత వహిస్తాననీ, రాజకీయ చర్చల్లో గౌరవాన్ని కాపాడుకోవాలని పేర్కొన్నారు. కాగా గత కొన్ని ఎన్నికల్లో రాజస్థాన్ అధికార పీఠం బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మధ్య హోరీ హోరీ పోరు ఉంటుంది. ఒకసారి బీజేపీ పైచేయి సాధిస్తే, తదుపరి ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకుంటోంది. ఇపుడు రాజకీయ విశ్లేషకులు ఈ లెక్కల్ని నిశితంగా గమనిస్తున్నారు. రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల 25న పోలింగ్ జరగనుండగా డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు, అధికారం చేపట్టిన పార్టీలు 1993 - బీజీపీ 1998 - కాంగ్రెస్ 2003 - బీజేపీ 2008 - కాంగ్రెస్ 2013 - బీజేపీ 2018 - కాంగ్రెస్ -
వాళ్లు ఒకరినొకరు రనౌట్ చేసుకునే బ్యాట్స్‌మెన్: ప్రధాని మోదీ
Rajasthan Elections: క్రికెట్‌కు ముడిపెడుతూ రాజస్థాన్ కాంగ్రెస్ నాయకులపై ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర విమర్శలు చేశారు. రాజస్థాన్ కాంగ్రెస్.. తమను తామే రనౌట్ చేసుకునే క్రికెట్ జట్టు లాంటిదని, తమ బ్యాట్స్‌మెన్ ఒకరినొకరు రనౌట్ చేసుకోవడానికి ఐదేళ్లు ప్రయత్నించారని మోదీ ఎద్దేవా చేశారు. రాజస్థాన్ చురు జిల్లా తారానగర్‌లో ఆదివారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెట్టాలంటే నవంబర్ 25న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీ, అభివృద్ధి అనేవి పరస్పర శత్రవులని వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ పార్టీకి మంచి ఉద్దేశాలు ఉండవని, వాటి మధ్య ఉన్న సంబంధం వెలుగు, చీకటి మధ్య ఉన్న సంబంధం లాంటిదన్నారు. వన్ ర్యాంక్, వన్ పెన్షన్ విషయంలో కాంగ్రెస్ మాజీ సైనికులను దశాబ్దాలుగా తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ దుష్పరిపాలన కారణంగా రాజస్థాన్‌లో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం అదుపుతప్పాయని విమర్శించారు. ఇదీ చదవండి: వరల్డ్‌కప్ ఫైనల్‌పై శివసేన ఎంపీ తీవ్ర విమర్శలు -
81 స్థానాలకు మహిళా అభ్యర్థులు కరువు
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్, బీజేపీ ఈసారి రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు పెద్ద సంఖ్యలో టికెట్లివ్వలేదు. నారీ శక్తి వందన్ చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించినప్పుడు కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు మద్దతిచ్చాయి. సీట్ల కేటాయింపులో మాత్రం ఆ స్ఫూర్తి ప్రతిఫలించలేదు. ఈ నెల 25న పోలింగ్ ప్రక్రియకు సిద్ధమైన రాజస్తాన్‌లోని 81 స్థానాల్లో ఒక్క మహిళా అభ్యర్థి కూడా బరిలో లేరని గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 200 స్థానాలకు గాను మొత్తం 1,875 మంది అభ్యర్థులు బరిలో ఉండగా వారిలో 1,692 మంది పురుషులు, 183 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ 28 (14%) మంది మహిళా అభ్యర్థులను నిలబెట్టగా, బీజేపీ 20 (10%) మంది మహిళా అభ్యర్థులను బరిలోకి దింపింది. కాగా 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 189 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేయగా 24 మంది విజయం సాధించారు. ఈసారి బరిలో బీజేపీకి చెందిన ప్రముఖ మహిళా అభ్యర్థులలో మాజీ సీఎం వసుంధర రాజే సింధియా, బికనీర్ ఎమ్మెల్యే సిద్ధి కుమారి, మాజీ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అనితా భాదేల్, రాజ్‌సమంద్ ఎమ్మెల్యే దీప్తి మహేశ్వరి, రాజ్‌సమంద్ ఎంపీ దియా కుమారి ఉన్నారు. కాగా, కాంగ్రెస్‌లో మాల్వియా నగర్ నుంచి అర్చన శర్మ, చోము నుంచి షికా మీల్ బరాలా, ప్రస్తుత మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మమతా భూపేష్, కామా నుంచి జాహిదాలకు ఉన్నారు. ఈ మహిళా అభ్యర్థులలో ఎక్కువ మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాగా... అల్వార్‌లోని రామ్‌గర్గ్ జిల్లా నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సఫియా జుబేర్ స్థానంలో ఆమె భర్త జుబేర్ అహ్మద్‌కు కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చింది. -
2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
సాక్షి, న్యూఢిల్లీ: రాజస్తాన్ అసెంబ్లీకి ఈ నెల 25న జరగనున్న ఎన్నికలకు బీజేపీ గురువారం మేనిఫోస్టోను విడుదల చేసింది. ఉజ్వల పథకం లబ్ధిదారులకిచ్చే వంటగ్యాస్ సిలిండర్‌పై రూ.450 చొప్పున సబ్సిడీ, వచ్చే అయిదేళ్లలో 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, పీఎం కిసాన్ యోజన కింద రైతులకిచ్చే ఆర్థిక సాయం పెంపు వంటివి ఇందులో ఉన్నాయి. ఈ మేరకు మేనిఫెస్టో ‘సంకల్ప పత్ర’ను బీ జేపీ చీఫ్ జేపీ నడ్డా గురువారం జైపూర్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రశ్నపత్రాల లీకేజీతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలపై దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తుందని కూడా ఈ సందర్భంగా నడ్డా ప్రకటించారు. సంకల్ప పత్రలోని మరికొన్ని హామీలు.. గోధుమలను కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కు బోనస్‌తో కలిపి క్వింటాలుకు రూ.2,700 చొప్పున కొనుగోలు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఆర్థిక సాయం ఏడాదికి రూ.6 వేల నుంచి రూ.12 వేలకు పెంపు. ఈస్టర్న్ రాజస్తాన్ కెనాల్ ప్రాజెక్టు(ఈఆర్సీపీ)ను కేంద్రం సాయంతో నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేయడం. ఈ ప్రాజెక్టుతో 13 జిల్లాలకు తాగు, సాగునీటి సమస్య తీరుతుంది. మహిళలు, బాలికల కోసం... జిల్లాకో మహిళా పోలీస్ స్టేషన్. ప్రతి పోలీస్ స్టేషన్లో మహిళా డెస్క్..ప్రతి నగరంలో యాంటీ రోమియో స్క్వాడ్ల ఏర్పాటు. లాడో ప్రోత్సాహన్ యోజన కింద పుట్టిన ప్రతి బాలిక పేరిట రూ.2 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్. లక్పతి దీదీ పథకం ద్వారా ఆరు లక్షల మంది గ్రామీణ మహిళలకు నైపుణ్య శిక్షణ. 12వ తరగతి పూర్తి చేసుకున్న ప్రతిభావంతులైన బాలికలకు స్కూటీల పంపిణీ. పేద కుటుంబాల బాలికలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య. రాష్ట్రంలో మూడు మహిళా బెటాలియన్ల ఏర్పాటు. పీఎం మాతృ వందన్ పథకం కింద అందించే ఆర్థిక సాయం రూ.5 వేల నుంచి 8 వేలకు పెంపు. యువత కోసం.. వచ్చే అయిదేళ్లలో 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ పేద కుటుంబాల విద్యార్థులు పుస్తకాలు, దుస్తులు కొనుక్కునేందుకు ఏటా రూ.12 వేలు పంపిణీ. ప్రతి డివిజన్లో రాజస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రాజస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏర్పాటు. ఆరోగ్యరంగంలో.. భామాషా హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ ద్వారా ఆరోగ్య రంగంపై రూ.40 వేల కోట్ల పెట్టుబడి కొత్తగా 15 వేల మంది వైద్యులు, 20 వేల పారామెడికల్ సిబ్బంది నియామకం. వీటితోపాటు 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా, జైపూర్ మెట్రో విస్తరణ, పారదర్శక బదిలీ విధానం, పేద కుటుంబాలకు ఉచిత రేషన్, దివ్యాంగులకు రూ.1,500 పింఛను, వృద్ధాప్య పింఛను పెంపు వంటివి ఉన్నాయి. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 350 బిలియన్ డాలర్లకు పెంచుతామని వాగ్దానం చేసింది. జైపూర్, ఉదయ్‌పూర్, కోటా, అజీ్మర్, జోథ్‌పూర్, బికనీర్‌లను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయడాన్ని కూడా మేనిఫెస్టో పేర్కొంది. ఓబీసీలకు నిర్ణిత వ్యవధిలో ధ్రువీకరణ పత్రాల జారీ, వారికి రూ.15 వరకు విద్యారుణం. ప్రత్యేకంగా వెల్ఫేర్ బోర్డు. ఇవి కాకుండా, ఎస్సీ,ఎస్టీలు, గిరిజనులు, వీధి వ్యాపారులు, గిగ్ వర్కర్లు, ఆటో డ్రైవర్లకు సంక్షేమ పథకాలు కూడా ఉన్నాయి. -
చూస్తూ ఉండండి..సనాతన ధర్మమే గెలుస్తుంది : అమిత్ షా
జైపూర్: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. జైపూర్‌లో 'పరివర్తన యాత్ర' ప్రారంభోత్సవంలో ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై అమిత్ షా తీవ్ర స్థాయిలో స్పందించారు. త్వరలో రాజస్థాన్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దుంగార్పూర్ వేదికగా 'పరివర్తన యాత్ర'ను ప్రారంభించిన కేంద్ర మంత్రి అమిత్ షా ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టే అర్ధమవుతుంది ఇండియా కూటమి హిందూత్వాన్ని వ్యతిరేకమని.. ఇది ఒకరకంగా హిందూత్వ వారసత్వంపై దాడి చేయడమేనని.. స్టాలిన్ తనయుడు చేసిన వ్యాఖ్యలు ఇండియా కూటమి ఓటు బ్యాంక్ రాజకీయాలకు, బుజ్జగింపు రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. డీఎంకే నాయకుడి కుమారుడు.. కాంగ్రెస్ నేత కుమారుడు మారణహోమానికి పిలుపునిస్తున్నారని అన్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా గతంలో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలను చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఆనాడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ రాడికల్ హిందూ సంస్థలు లష్కర్-ఏ-తోయిబా వంటి ఉగ్రవాద సంస్థల కంటే ప్రమాదమని అన్నారు. మీ హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే కూడా ఇది హిందూ ఉగ్రవాదమని అన్నారు. కానీ ఈనాడు సనాతన ధర్మం ప్రజల మనుసును గెలుచుకుందని మళ్ళీ మోదీ అధికారంలోకి వస్తే సనాతన పరిపాలన వస్తుందని వారు ఆశాభావంతో ఉన్నారని అన్నారు. అయోధ్యలో రామ మందిరం నిర్మించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఏళ్ళు అడ్డుకుందని.. మా హయాంలోనే రామ మందిరం నిర్మాణ పనులు మొదలయ్యాయని జనవరికల్లా మందిర నిర్మాణం పూర్తవుతుందని దాన్ని అడ్డుకోవడం కాంగ్రెస్ వల్ల కాదని అన్నారు. ఇక ఈరోజు ప్రారంభమైన 'పరివర్తన యాత్ర' 19 రోజుల పాటు 2500 కి.మీ కొనసాగుతుందని.. మొత్తం 52 నియోజకవర్గాల్లో 152 చిన్న సభలు.. 54 భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నామని.. అవినీతిలో పీకల్లోతు కూరుకుపోయిన అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని అన్నారు. అమిత్ షా వ్యాఖ్యల నేపథ్యంలో తమిళనాడు సీఎం స్టాలిన్ మాట్లాడుతూ ఉదయనిధి వ్యాఖ్యలను సమర్ధించడమే కాదు సనాతన ధర్మం మతం పేరిట ప్రాంతం పేరిట ప్రజలను వేరు చేసే సిద్ధాంతమని అన్నారు. ఉదయనిధి స్టాలిన్ కూడా అమిత్ షా వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ నేను చెప్పిందాంట్లో తప్పేమీ లేదని.. ఒక్క మాట కూడా వెనక్కి తీసుకోబోవడం లేదని స్పష్టం చేశారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించడమంటే మానవత్వాన్ని, సమానత్వాన్ని కాపాడటమేనని అన్నారు. సనాతన ధర్మం వలన అణగారిన వర్గాల తరపునే నేను ఆ మాటలన్నానని తెలిపారు. మాజీ మంత్రి పి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం కూడా ఉదయ నిధి స్టాలిన్ వ్యాఖ్యలను సమర్ధిస్తూ.. కులం దేశానికి శాపమని అన్నారు. చెన్నైలో రైటర్ల సదస్సులో మాట్లాడుతూ స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో పోల్చారు. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించలేమని నిర్మూలించడం ఒక్కటే మార్గమని అన్నారు. ఇది కూడా చదవండి: జమిలీ ఎన్నికలపై స్పందించిన రాహుల్.. ఏమన్నారంటే? -
సచిన్ సోలో ప్రచార ర్యాలీ వ్యూహం..టెన్షన్లో కాంగ్రెస్
రాజస్తాన్ అంతటా మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి సచిన్ పైలెట్ సోలోగా ర్యాలీలు చేయనున్నట్లు సమాచారం. దీంతో మళ్లీ రాజస్తాన్‌లో అంతర్గతంగా కాంగ్రెస్ నాయకుల మధ్య కోల్డ్‌వార్ ప్రారంభమైందని భావిస్తున్నాయి పార్టీ వర్గాలు. కేవల 10 నెలల వ్యవధిలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సచిన్ ఇలా సోలోగా ప్రచార ర్యాలీలు నిర్వహించడంపై పార్టీలో రకరకాలు ఊహాగానాలు హల్చల్ చేయడం ప్రారంభించాయి. అదీగాక ఇటీవలే రాజస్తాన్‌లో భారత్ జోడో యాత్ర చాలా విజయవంతం జరిగింది కూడా. అనూహ్యంగా మళ్లీ సచిన్ ఇలా నిర్ణయం తీసుకోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఐతే ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో పార్టీని సంబంధిత వాటిల్లో మరింత బోపేతం చేస్తూ కార్యచరణలో ఉంచడమే లక్ష్యంగా సచిన్ ఈ ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. వచ్చేవారం నుంచే సచిన్ పైలల్ రైతులు, యువతను ఉద్దేశించి వరుస బహిరంగ సభల్లో ప్రసగించనున్నట్లు తెలిపాయి. ఐతే ఒకపక్క రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోటసార అట్టడుగు స్థాయి సంస్థ పనుల్లో బిజీగా ఉండటం, మరోవైపు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా తన చివరి బడ్జెట్‌తో స్వయంగా వెళుతున్నందున, సచిన్ ఇలా సోలోగా ర్యాలీలు నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారని కొందరూ విశ్లేషకులు భావిస్తున్నారు. అదీగాక 2003 లేదా 2013ల మాదిరిగా పార్టీ తుడిచిపెట్టుకుపోకుండా చూసేందుకు మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ జాట్లు ఎక్కువగా ఉండే ప్రాంతాలపై దృష్టి పెట్టాలని చూస్తున్నట్లు సమాచారం. ఐతే పైలట్ ప్రచారానికి రాహుల్ గాంధీ ఆమోదం ఉందని చెబుతున్నప్పటికీ, ఆయన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నుంచి అనుమతి తీసుకులేదని పార్టీ వర్గాలు తెలిపాయి. ఒక రాష్ట్ర నాయకుడిగా సచిన్‌కి ఇదంతా అవసరమా అని పార్టీలో కొందరూ నాయకులు మండిపడుతున్నట్లు సమాచారం. (చదవండి: నిర్జన ప్రదేశంలో.. ఏకంగా రూ. 10 లక్షల నోట్ల కట్టలు) -
సాక్షి కార్టూన్: 03-06-2022
హోటల్ కూడా సేఫ్ కాదని ఇలా ఏర్పాటు చేశాన్సార్! -
రాజస్థాన్‌లో కాంగ్రెస్ జయభేరి
జైపూర్/ చండీగఢ్ : రాజస్థాన్‌లో అధికార కాంగ్రెస్ పార్టీ మరోసారి జయభేరి మోగించింది. రామ్‌గఢ్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి షఫియా జుబేర్ 12వేల ఓట్ల మెజారిటీతో గురువారం విజయం సాధించారు. జుబేర్‌కు 83,311 ఓట్లు రాగా.. సమీప భాజపా అభ్యర్థి సువంత్ సింగ్‌కు 71,083 ఓట్లు వచ్చాయి. ఈ విజయంతో 200 శాసనసభ స్థానాలున్న రాజస్థాన్ అసెంబ్లీలో కాంగ్రెస్ సంఖ్యాబలం 100కు పెరిగింది. గతేడాది డిసెంబరు 7న రాజస్థాన్ శాసనసభ ఎన్నికలు జరిగాయి. అయితే అప్పుడు రామ్‌గఢ్‌లో బీఎస్పీ అభ్యర్థి మృతితో ఆ నియోజకవర్గంలో ఎన్నిక వాయిదా వేసి తిరిగి జనవరి 27న ఎన్నికలు నిర్వహించారు. గురువారం ఓట్ల లెక్కింపు చేపట్టగా కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. జింద్...మళ్లీ బీజేపీ వశం హరియాణాలో జరిగిన జింద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో అధికార బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఉప ఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థి కృష్ణ మిద్దా గెలుపొందారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన విజయానికి తోడ్పడిన కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. కాగా ఐఎన్ఎల్డీ పార్టీకి చెందిన జింద్ సిట్టింగ్ ఎమ్మెల్యే హరిచంద్ మిద్దా మరణంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు కృష్ణ మిద్దా బీజేపీ తరపున బరిలో దిగారు. ఇక కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా, ఐఎన్ఎల్డీ నుంచి ఉమ్ సింగ్, కొత్తగా ఏర్పాటైన జేజేపీ నుంచి దిగ్విజయ్ చౌతాలా పోటీ చేశారు. -
బీజేపీకి షాకిచ్చిన రెబల్ ఎమ్మెల్యే కుమారుడు
జైపూర్ : బీజేపీ తిరుగుబాటు ఎమ్మెల్యే గణశ్యామ్ తివారీ కుమారుడు అఖిలేశ్ తివారీ ఆ పార్టీకి షాకిచ్చారు. ఏకంగా సొంత పార్టీని స్థాపించిన అఖిలేశ్ వచ్చే రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. భారత్ వాహినీ పార్టీ (బీవీపీ) రానున్న ఎన్నికల్లో 200 అసెంబ్లీ స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపనుందని తెలిపారు. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) భారత్ వాహినీ పార్టీని రిజిస్టర్ చేయడంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతినిచ్చింది. డిసెంబర్ 11, 2017లో అఖిలేశ్ తివారీ పార్టీ రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. తన తండ్రి గణశ్యామ్ తివారీ నేతృత్వంలో బీవీపీ నిర్ణయాలు తీసుకుంటుందని, ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అఖిలేశ్ చెప్పారు. జూలై 3వ తేదీన జైపూర్‌లో తమ పార్టీ తొలిసారి సమావేశం కానుందని, ఇందులో నేతలు, కార్యకర్తలు కలిపి 2000 మంది పాల్గొంటారని పేర్కొన్నారు. దీన్ దయాల్ వాహినీ సంస్థకు పనిచేస్తున్న వారిలో నియోజకవర్గం నుంచి 10 మందికి ఆహ్వానాలు అందాయి. వీరిలో ఒకరికి పోటీ చేసే అవకాశం ఇస్తారు. అయితే వసుంధర రాజేకు భారత్ వాహినీ పార్టీ నుంచి ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీన్ దయాల్ వాహినీ సంస్థకు పనిచేసే కార్యకర్తలు అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగనున్న నేపథ్యంలో.. బీజేపీ ఓట్లు చీలే అవకావాలు కనిపిస్తున్నాయి. గత 7 నెలల నెంచి బీజేపీ తిరుగుబాటు ఎమ్మెల్యే గణశ్యామ్, ఆయన కుమారుడు అఖిలేశ్ తివారీలు అసెంబ్లీ ఎన్నికల విషయంపై వ్యూహాలు రచిస్తున్నారు. -
‘ఆప్’ రాజస్థాన్ ఇంచార్జ్ తొలగింపు
న్యూఢిల్లీ : రాజస్థాన్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని చూస్తోన్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్ ఆప్ ఇంచార్జ్‌గా ఉన్న కుమార్ విశ్వాస్ను ఆ పదవి నుంచి తప్పించింది. ఈ విషయాన్ని ఆప్ జాతీయ అధికార ప్రతినిధి అశుతోష్ వెల్లడించారు. విశ్వాస్ స్థానంలో దీపక్ బాజ్పాయిని ఇంచార్జ్‌గా నియమిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. విశ్వాస్‌కు తీరిక లేనందువల్లే ఆయనను ఈ బాధ్యతల నుంచి తప్పించినట్టు అశుతోష్ తెలిపారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యతను దీపక్‌కు అప్పగించామని, జాబితాపై తుది నిర్ణయం మాత్రం పొలిటికల్ కమిటీ తీసుకుంటుదని ఆయన పేర్కొన్నారు. అయితే విశ్వాస్‌కు, పార్టీ సీనియర్ నేతలకు మధ్య సంబంధాలు దెబ్బతినడం వల్లే ఆయనను పదవి నుంచి తొలగించినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్.. పంజాబ్ మంత్రికి క్షమాపణలు చెప్పడంపై విశ్వాస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. -
జాట్ పవర్ కనిపించేనా ?
తమ వాడు సీఎం కావాలన్న కోరిక తీరేనా? రాజస్థాన్ ఎన్నికల ముఖచిత్రం రాజస్థాన్ అసెంబ్లీలో మొత్తం సీట్లు : 200 జనరల్‌కు కేటాయించినవి:143 ఎస్సీ: 33, ఎస్టీ : 24 జైపూర్: రాజస్థాన్ రాజకీయాల్లో మొదట్నుంచీ కుల సమీకరణాలదే ప్రధాన పాత్ర. పాలనాపరమైన అంశాల కన్నా కులం, వర్గం రాజస్థాన్ రాజకీయాలను శాసిస్తుంటాయి. డిసెంబర్ 1న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ అవే ఓటర్లను ప్రభావితం చేయనున్నాయి. అక్కడి రాజకీయాల్లో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాజ్‌పుత్‌లు, జాట్ వర్గీయులే ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. రాచరిక నేపథ్యం మొదట్లో రాజ్‌పుత్‌లను అందలం ఎక్కించగా, ప్రస్తుతం బలహీన వర్గాల ప్రతినిధిగా జాట్ వర్గం ముందుకు వచ్చింది. అయితే, ఇప్పటివరకు జాట్లకు సీఎం పీఠం దక్కలేదు. దాంతో అంతా ఈ సారైనా ‘జాట్స్’ జాక్‌పాట్ కొడ్తారా? అని చూస్తున్నారు. ఇప్పటివరకు రాజస్థాన్‌లోని దాదాపు అన్ని కీలక వర్గాలకు కనీసం ఒకసారైనా సీఎం పదవి వరించింది. జాట్లను తప్ప. రాష్ట్రంలో సుమారు 11 శాతం ఓటర్లున్నప్పటికీ, రాజకీయంగా ప్రభావం చూపగల వర్గం అయినప్పటికీ, దాదాపు కీలక పార్టీలన్నింటిలో ప్రాధాన్య స్థానాల్లో తమవాళ్లు ఉన్నప్పటికీ.. సీఎం కుర్చీపై ఇంతవరకు ఒక జాట్ కూర్చోలేకపోయాడు. 1998లో ఆ కల నెరవేరే అవకాశం వచ్చింది. కాంగ్రెస్ గెలిస్తే తమవాడైన పరస్ రామ్ మాదెర్న సీఎం అయ్యే అవకాశాలుండటంతో తమ వారిలో 42 మందిని జాట్లు అసెంబ్లీకి పంపించారు. కానీ అప్పుడా అవకాశాన్ని ‘తమవాడు’ కాని అశోక్ గెహ్లాట్ తన్నుకుపోయాడు. ఆ కసితో ఆ తరువాతి అసెంబ్లీ ఎన్నికల్లో(2003) బీజేపీ వైపు మొగ్గు చూపారు. జాట్ వర్గీయుల కోడలైన వసుంధర రాజే ముఖ్యమంత్రి అయ్యారు. కనీసం జాట్ వర్గీయుల కోడలైనా సీఎం అయిందని సంతోషించారు. అయితే, వసుంధర రాజే జాట్ వర్గీయుల ఆకాంక్షలను పెద్దగా పట్టించుకోలేదు. దాంతో ఈ సారైనా అవకాశమిస్తారన్న ఆశతో 2008లో జాట్లు మరోసారి కాంగ్రెస్‌కు మద్దతిచ్చారు. కానీ జాట్ల బద్ధ శత్రువు అశోక్ గెహ్లాటే మళ్లీ సీఎం అయ్యాడు. జాట్ పవర్ చూపించి సీఎం కుర్చీలో జాట్‌ను కూర్చోబెట్టాలన్న వారి కోరిక 2013 ఎన్నికల్లో అయినా తీరుతుందేమో చూడాలి. పార్టీ ఏదైనా.. మా వాడే గెలవాలి..! జాట్లకు ‘స్వ’ అభిమానం ఎక్కువ. జాట్ల ఓటింగ్ సరళి గురించి ఇలా చెప్పుకుంటారు. పార్టీలకు సంబంధం లేకుండా పోటీలో తమ వాడుంటే ఆ అభ్యర్థికే దాదాపు అందరూ ఓటేస్తారు. తమవాళ్లే ఇద్దరు ఉంటే ఇద్దరిలో వయసులో పెద్దవాడిని గెలిపించేందుకు ప్రయత్నిస్తారు(1990లో బలరామ్ జాఖఢ్‌పై దేవీలాల్ గెలుపును ఈ కోణంలోనే విశ్లేషిస్తారు). అందుకే ఒక పార్టీ జాట్‌ను నిలబెడ్తే.. మరో ప్రధాన పార్టీ కూడా జాట్నే నిలబెట్టేందుకు ప్రయత్నిస్తుంది. పార్టీలకిచ్చే మద్దతు విషయానికొస్తే.. ముస్లింల వలె జాట్లు మొదటినుంచి కాంగ్రెస్ వోట్‌బ్యాంక్. అయితే, బీజేపీ రాజకుటుంబీకుల పార్టీ. రాజ్‌పుత్‌ల మద్ధతు ఆ పార్టీకి ఎక్కువ. రాజ్‌పుత్‌లు, జాట్ల మధ్య రాష్ట్రంలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొని ఉంది. దాంతో సాధారణంగా వాళ్లు వేరువేరు పార్టీలకు మద్దతిస్తుంటారు. అశోక్ గెహ్లాట్‌పై కోపంతో 2003లో వసుంధర రాజేకు మద్దతిచ్చినట్లు.. పరిస్థితులు డిమాండ్ చేస్తే జాట్లు బీజేపీనీ గద్దెనెక్కించగలరు. ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీ.. రెండు పార్టీలు జాట్ ఓట్లపై ఆశలు పెట్టుకున్నాయి. ఈ మధ్య కాలంలో పరిస్థితులు కూడా మారాయి. రాజ్‌పుత్‌లు సామాన్యులకు దూరమయ్యారు. ప్రజలేం కోరుకుంటున్నారు? డిసెంబర్ 1న రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ, జేడీ(యూ), ఎన్సీపీ, వామపక్షాలు.. తదితర జాతీయ, ప్రాంతీయ పార్టీలు బరిలో ఉన్నా.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యే ప్రధానంగా పోటీ ఉంటుంది. అయితే, పార్టీలకు అతీతంగా ఆ రాష్ట ప్రజలు ఎలాంటి ప్రభుత్వం కోరుకుంటున్నారు? రాబోయే ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు?.. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రజలు కోరుకుంటున్న మూడు ప్రధాన డిమాండ్లుగా ఇవి పలు సర్వేల్లో తేలింది. 1) అవినీతిరహిత ప్రభుత్వం: అశోక్ గెహ్లాట్‌ది అవినీతిమయ పాలనగా పేరుగాంచడంతో ప్రజలు నీతిమంత పాలనను కోరుకుంటున్నారు. అభ్యర్థి ఏ పార్టీ వాడైనా అవినీతి మరకలుంటే దూరం పెట్టాలని నిర్ణయించుకున్నారు. 2) భద్రత: రాష్ట్రంలో శాంతి, భద్రతలను కాపాడడానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా స్త్రీలు, మైనారిటీలు తమపై జరిగే నేరాలను అరికట్టే ప్రభుత్వం కావాలంటున్నారు. 3) నాణ్యమైన పాలన: అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టి నాణ్యమైన పాలనను అందించే ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఆర్థికరంగం, విద్య, ఉపాధి.. తదితర రంగాలపై దృష్టి పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపే నాయకత్వాన్ని ఆశిస్తున్నారు. అయితే, సీట్ల సంఖ్యకు సంబంధం లేకుండా ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని పలు సర్వేలు సూచిస్తున్నాయి. అవినీతిమయ రాజకీయాలు కాంగ్రెస్ ఓటమికి ప్రధాన కారణం కాగలవని భావిస్తున్నాయి. -
మినీ మహా సమరం!
వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సెమీ ఫైనల్స్ అనదగ్గ అయిదు రాష్ట్రాల ఎన్నికల నగారా మోగింది. ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల్లో కొత్త సభలను కొలువుతీర్చే పనికి ఎన్నికల సంఘం శుక్రవారం శ్రీకారం చుట్టింది. నవంబర్ 11న జరిగే ఛత్తీస్‌గఢ్ ఎన్నికలతో మొదలై...డిసెంబర్ 4న నిర్వహించే ఢిల్లీ, మిజోరం ఎన్నికలతో ఈ మినీ మహా సమరం ముగుస్తుంది. ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 8న వెల్లడవుతాయి. ఢిల్లీ, రాజస్థాన్, మిజోరంలలో కాంగ్రెస్...మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ ఇప్పుడు పాలకపక్షాలుగా ఉన్నాయి. సుప్రీంకోర్టు ఈమధ్య ఇచ్చిన రెండు తీర్పుల ప్రభావం ఈ ఎన్నికల్లో కనబడబోతున్నది. మొదటిది-పోటీచేస్తున్న అభ్యర్థుల్లో ‘ఎవరూ నచ్చలేద’ని చెప్పేందుకు ఓటర్లకు తొలిసారి అవకాశం కల్పిస్తున్నారు. ఇందుకోసం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల(ఈవీఎం)లలో అదనపు మీటను ఏర్పాటుచేయబోతున్నారు. అలాగే, నేరచరితులుగా తేలి రెండేళ్లకు మించి శిక్షపడే సందర్భంలో ప్రజాప్రతినిధుల సభ్యత్వం వెనువెంటనే రద్దవుతుందని ఇచ్చిన తీర్పు కూడా అన్ని పార్టీలనూ భయపెట్టేదే. సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నవారిపై క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నపక్షంలో అలాంటివారికి టిక్కెట్ ఇచ్చేందుకు ఈసారి పార్టీలు ఉత్సాహం చూపించే అవకాశం లేదు. ఈ అయిదేళ్లలోనూ ఎప్పుడైనా తీర్పు వెలువడి, అందులో శిక్షకు గురైతే వెంటనే వారి సభ్యత్వం ఎగిరిపోతుందన్న భయం అన్ని పార్టీలకూ ఉంటుంది. ఎన్నికలనేసరికి పాలకపక్షాలుగా ఉన్న పార్టీలకు వణుకు సహజం. అయిదేళ్ల తమ పాలన తీసుకొచ్చిన మార్పులూ, అందులోని గుణదోషాలూ విస్తృతంగా చర్చకొచ్చే సమయం గనుక వాటిని సమర్ధించుకోవాల్సిరావడం ఇబ్బందే. ఆ రకంగా చూస్తే ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికలూ కే ంద్రంలో యూపీఏ ప్రభుత్వానికి నేతృత్వంవహిస్తున్న కాంగ్రెస్‌కు అగ్నిపరీక్షలాంటివి. ఇప్పుడేలుతున్న రాష్ట్రంలో తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోగలమనిగానీ, బీజేపీ పాలిత రాష్ట్రంలో ఈసారి సునాయాసంగా పాగా వేయగలమనిగానీ ఆ పార్టీకి నిండైన విశ్వాసం లేదు. కేంద్రంలో కుంభకోణాల పరంపర, అధిక ధరలు, అస్తవ్యస్థ పరిపాలన మాత్రమే కాదు...ఆయా రాష్ట్రాల్లో ఆ పార్టీ పాలకపక్షంగా లేదా ప్రతిపక్షంగా విఫలమైన తీరే అందుకు కారణం. దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఓటర్లు వరసగా మూడుసార్లు కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారు. మూడుసార్లూ షీలాదీక్షిత్ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. గత ఎన్నికల్లో అక్కడున్న 70 స్థానాల్లో కాంగ్రెస్‌కు 41 వచ్చాయి. బీజేపీ 24 స్థానాలతో సరిపెట్టుకుంది. ఢిల్లీలోని ఏడు పార్లమెంటు స్థానాల్లోనూ గత ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఢిల్లీ పౌరుల్లో నెలకొన్న అభద్రతాభావం ఆమెకు ఈసారి ఆమెకు శాపమే. శాంతిభద్రతలు సక్రమంగా లేవని, మరీ ముఖ్యంగా మహిళల భద్రత అత్యంత అధ్వాన్నంగా ఉన్నదని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. గత ఏడాది డిసెంబర్లో జరిగిన నిర్భయ ఉదంతం ప్రజల మనసుల్లో ఇంకా సజీవంగా ఉంది. ఇదికాక తరచుగా పెరిగిన విద్యుత్ చార్జీలు, నీటి బిల్లులు పౌరుల్లో ఆగ్రహావేశాలు కలిగించాయి. నిత్యావసర సరుకులు...మరీ ముఖ్యంగా ఉల్లిగడ్డ ధర ఆకాశాన్నంటడం మధ్యతరగతి, దిగువతరగతి ప్రజలను బాగా కుంగదీసింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ను మూడుగా విభజించాక గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మూడుచోట్లా విపక్ష బీజేపీ విజయఢంకా మోగించింది. అయితే, ఈసారి కొత్తగా బరిలోకి దిగబోతున్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం తమ విజయావకాశాలను దెబ్బతీస్తుందేమోనన్న భయం అటు బీజేపీని, ఇటు కాంగ్రెస్‌నూ వెన్నాడుతోంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న మరో రాష్ట్రం రాజస్థాన్. అక్కడకూడా కాంగ్రెస్ పరిస్థితి ఆశావహంగా లేదు. శాంతిభద్రతల క్షీణత, మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలు, విద్యుత్‌చార్జీల పెంపు అశోక్ గెహ్లాట్ ప్రభుత్వానికి గుదిబండలు. ఉద్యోగాల్లో 4శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న మాటను నిలుపుకోలేదని గుజ్జర్లు ఆగ్రహంతో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్‌ది అత్తెసరు మెజారిటీయే. 200 స్థానాలున్న సభలో అప్పుడు కాంగ్రెస్ గెలుచుకున్నవి 96 స్థానాలు మాత్రమే. అప్పట్లో ఆరుగురు సభ్యులున్న బీఎస్పీ కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించింది. గత ఎన్నికల్లో 78 స్థానాలతో సరిపెట్టుకున్న బీజేపీ ఇప్పుడు సునాయాసంగా గెలవగలనన్న విశ్వాసంతో ఉంది. ఇప్పుడు పరిపాలిస్తున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ మళ్లీ తమకే దక్కుతాయని బీజేపీ ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంది. ప్రజాదరణపొందిన వివిధ పథకాలవల్లా, అభివృద్ధి కార్యక్రమాలవల్లా వరసగా మూడోసారి కూడా సునాయాసంగా విజయం సాధించగలనని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ భావిస్తున్నారు. చౌహాన్ సన్నిహితులపై ఐటీ శాఖ దాడులు, కేంద్ర నిధులను దుర్వినియోగం చేశారన్న కాంగ్రెస్ ఆరోపణలు ఓటర్లపై ప్రభావం చూపబోవని పార్టీ భావిస్తోంది. ఆ రాష్ట్ర అసెంబ్లీలోని 230 స్థానాల్లో బీజేపీకి ఇప్పుడు 153 స్థానాలుండగా కాంగ్రెస్ 66 స్థానాలు గెల్చుకుంది. ఇక ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న 90 స్థానాల్లో బీజేపీ గత ఎన్నికల్లో 49 సాధించగా, కాంగ్రెస్ 39 స్థానాలు గెల్చుకుంది. ఆమధ్య కాంగ్రెస్ కాన్వాయ్‌పై నక్సలైట్లు దాడిచేసి ముఖ్య నాయకులను హతమార్చిన ఘటన తర్వాత తమపై సానుభూతి వెల్లువెత్తుతోందన్న అభిప్రాయం కాంగ్రెస్‌లో ఉంది. కానీ, పాలనలోనూ...మరీ ముఖ్యంగా ప్రజాపంపిణీ వ్యవస్థను తీర్చిదిద్దడంలో సమర్ధతను కనబరిచిన రమణ్‌సింగ్ సర్కారును సవాల్ చేయడం అంత సులభమేమీ కాదు. మొత్తమ్మీద ఈ ఎన్నికల ఫలితాలు వచ్చే లోక్‌సభ ఎన్నికలను గణనీయంగా ప్రభావితం చేస్తాయి. కాంగ్రెస్ సంగతలా ఉంచి బీజేపీ ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగిన నరేంద్రమోడీ దీక్షాదక్షతలకు ఈ ఎన్నికలు అగ్నిపరీక్ష. ఇందులో ఘనవిజయం సాధిస్తేనే తన పార్టీలో మోడీ తిరుగులేని నేతగా ఎదుగుతారు... వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఆశలు ఈడేరతాయి.