Rajasthan Results 2023: రాజస్థాన్‌లో బీజేపీ ఘన విజయం | Rajasthan Assembly Election Results 2023 LIVE Updates | Sakshi
Sakshi News home page

Rajasthan Election Results 2023: రాజస్థాన్‌లో బీజేపీ ఘన విజయం

Published Sun, Dec 3 2023 7:21 AM | Last Updated on Sun, Dec 3 2023 9:14 PM

Rajasthan Assembly Election Results 2023 LIVE Updates - Sakshi

Live Updates..

బీజేపీకి 115 సీట్లు

  • రాజస్థాన్‌లో మొత్తం 115 స్థానాల్లో బీజేపీ విజయం
  • 68 స్థానాల్లో కాంగ్రెస్‌ గెలుపు. ఒక చోట ఆధిక్యం
  • భారత్‌ ఆదివాసీ పార్టీకి 3 సీట్లు
  • 2 స్థానాల్లో బీఎస్పీ గెలుపు
  • ఆర్‌ఎల్‌డీ, ఆర్‌ఎల్‌టీడీ పార్టీలకు చెరొక  సీటు.

తాజా సమాచారం:  బీజేపీ 103 గెలుపొందగా,    12 లీడ్‌లోఉంది.
కాంగ్రెస్‌లో    58 స్థానాల్లో గెలుపొంది,    11   స్థానాల్లో  ఆధిక్యంలో ఉంది 

ఉదయ్‌పూర్‌లో బీజేపీ అభ్యర్థి తారాచంద్ జైన్‌   కాంగ్రెస్‌కు చెందిన గౌరవ్ వల్లభ్‌పై  32,771 ఓట్లతేడాతో  విజయం. ఆప్ అభ్యర్థి మనోజ్ లబానా 348 ఓట్లు మాత్రమే రావడం గమనార్హం.

కాంగ్రెస్ అభ్యర్థి, రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి నాథ్‌  ఓటమి. ఈ స్థానంలో బీజేపీకి చెందిన విశ్వరాజ్ సింగ్ మేవార్ 7,504 ఓట్ల  మెజారిటీతో గెలుపు.

ఈ ఫలితాలు  షాక్‌ ఇచ్చాయి.  ప్రజల  తీర్పును అంగీకరిస్తున్నాం. భవిష్యత్ ప్రభుత్వానికి  శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పని చేస్తారని ఆశిస్తున్నాను- రాజస్థాన్‌లో బీజేపీ ఆధిక్యంపై  సీఎం  అశోక్ గెహ్లోత్‌

 కాంగ్రెస్‌ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి  సచిన్ పైలట్ 29,475 ఓట్ల తేడాతో విజయం

బీజేపీ 79  స్థానాల్లో విజయం 36చోట్ల ఆధిక్యం, కాంగ్రెస్‌ 43  స్థానాల్లో విజయం, 26   చోట్ల ఆధిక్యం

భారత ఆదివాసీ పార్టీ 2 స్థానాల్లో గెలుపొందగా, 3 చోట్ల ఆధిక్యంలో ఉంది.

బీఎస్‌పీ ఒక చోట విజయం సాధించగా, మరో స్థానంలో లీడింగ్‌లో ఉంది. 

తిజారా అసెంబ్లీ స్థానం నుంచి మహంత్ బాబా బాలక్‌నాథ్ విజయం

అశోక్ గెహ్లోత్‌  ఈ సాయంత్రం గవర్నర్ కల్ రాజ్ మిశ్రాను కలిసి ఓటమిని అంగీకరించి సీఎం పదవికి రాజీనామా చేసే అవకాశం.

ఈ ఘనత ప్రధానిమోదీ,   అమిత్‌షా, రాష్ట్ర బీజేపీ శ్రేణులకే దక్కుతుంది. సీఎం ఎవనేది అధిష్టానం నిర్ణయిస్తుంది-దియా కుమారి 

బీజేపీ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే,  ఎంపీ దియా కుమారి విజయం. 

మాజీ కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ జోత్వారా నియోజకవర్గం నుంచి గెలుపొందారు.

మూడు స్థానాల్లో వెలువడిన ఫలితం

రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మూడు స్థానాలకు ఫలితాల వెల్లడి.

రెండు చోట్ల బీజేపీ, ఒక స్థానంలో భారత్‌ ఆదివాసీ పార్టీ గెలుపు.

పిండ్వారా అబు, మనోహర్‌ తానా నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థుల విజయం.

చోరాసి నియోజకవర్గంలో భారత్‌ ఆదివాసీ పార్టీ అభ్యర్థి రాజ్‌కుమార్‌ రౌత్‌ 69,166 మెజార్టీతో భారీ విజయం.

గెలుపు దిశగా బీజేపీ.. 
రాజస్థాన్‌లో బీజేపీ గెలుపు దిశగా సీట్లును సాధిస్తోంది. 
ఈసీ ట్రెండ్స్‌ ప్రకారం.. బీజేపీ ఇప్పటికే 100 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. 
కాంగ్రెస్‌.. 78 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది.
దీంతో, బీజేపీ కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు. 

విజయం మాదే: బీజేపీ
కేంద్ర మంత్రి, బీజేపీ నేత గజేంద్రసింగ్‌ షెకావత్‌ మాట్లాడుతూ.. రాజ‍స్థాన్‌లో బీజేపీ భారీ మెజార్టీతో గెలుస్తుంది. 2/3 మెజార్టీతో బీజేపీ గెలుస్తుంది. ఛత్తీస్‌గఢ్‌లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. 

రాజస్థాన్‌లో లీడ్‌లో బీజేపీ
బీజేపీ.. 86 స్థానాల్లో లీడింగ్‌
కాంగ్రెస్‌.. 64 స్థానాలు 
సీపీఎం.. 2 స్థానాలు
ఇతరులు.. 11

రాజస్థాన్‌ బీజేపీ చీఫ్‌ సీపీ జోషి మాట్లాడుతూ.. మా పార్లీ లీడింగ్‌లో ఉంది. దాదాపు 135 స్థానాల్లో బీజేపీ గెలుస్తుందన్నారు. 

రాజస్థాన్‌లో లీడింగ్‌లో బీజేపీ..
బీజేపీ.. 34
కాంగ్రెస్‌.. 28

రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ లీడ్‌..
ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో 
కాంగ్రెస్‌.. 8
బీజేపీ.. 6
బీఎస్పీ.. 1
ఇతరులు..2

బీజేపీ లీడ్‌..

కృష్ణపోలే నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి ముందంజ
రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి అజిన్‌ కాగ్జి ముందంజ

మూడు రాష్ట్రాల పోస్టల్‌ బ్యాలెట్లలో కాంగ్రెస్‌ ముందంజ
రాజస్థాన్‌లో.. 
బీజేపీ..42, 
​కాంగ్రెస్‌.. 49

మధ్యప్రదేశ్‌లో..
బీజేపీ.. 42,
కాంగ్రెస్‌.. 40

ఛత్తీస్‌గఢ్‌లో
బీజేపీ.. 28
కాంగ్రెస్‌.. 34

 

న్యాయం గెలుస్తుంది.. గెలుపు మాదే: బీజేపీ
రాజస్థాన్‌ బీజేపీ చీఫ్‌ సీపీ జోషి మాట్లాడుతూ.. భారీ మెజార్టీతో బీజేపీ గెలుస్తుంది. రాజస్థాన్‌ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ప్రజలు బీజేపీని పూర్తి మెజారిటీతో ఆశీర్వదించారు. దుష్పరిపాలన మరియు అన్యాయం కోల్పోతాయి.  సుపరిపాలన మరియు న్యాయం గెలుస్తుంది.
 

ముందంజలో బీజేపీ.. 
►పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో రాజస్థాన్‌లో బీజేపీ ముందంజలో కొనసాగుతోంది. 
కాంగ్రెస్‌..35,
బీజేపీ.. 54

కేంద్ర మంత్రి ప్రత్యేక పూజలు..
►కేంద్రమంత్రి, బీజేపీ నేత గజేంద్ర సింగ్‌ షకావత్‌ ప్రత్యేక పూజలు.. బీజేపీ గెలుపును ఆకాంక్షిస్తూ జైపూర్‌లోని గోవింద్‌ దేవ్‌జీ టెంపుల్‌లో పూజలు..

►జైపూర్‌లో కౌంటింగ్‌ ప్రక్రియకు రెడీ..

►రాజస్థాన్‌లో ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. 

►రాజస్థాన్‌లో విజయం తమదంటే తమదేనని కాంగ్రెస్‌, బీజేపీ నేతలు కామెంట్స్‌ చేస్తున్నారు.

►ఎన్నికల కౌంటింగ్‌ సందర్భంగా కాంగ్రెస్‌ కార్యకర్త ఒకరు హనుమాన్‌ వేశధారణలో ఢిల్లీలో కనిపించారు. 

►కాంగ్రెస్‌ పార్టీ హెడ్‌ క్వార్టర్స్‌ వద్ద జైహనుమాన్‌ నినాదాలు చేశారు. 

►రాజస్థాన్‌.. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రంలో ఎన్నికల పోరు హోరాహోరీగా సాగింది. ప్రతి ఐదేళ్లకూ ప్రభుత్వాన్ని మార్చేయడం రాజస్థాన్‌ ప్రజల అలవాటు. ఈ ఆనవాయితీ ఈసారీ కొనసాగుతుందని, మోదీ మేనియా తోడై తమకు అధికారం కట్టబెడుతుందని బీజేపీ నేతలు చెబుతున్నారు.

►సీఎం గెహ్లోత్‌ మాత్రం ఈసారి ఆనవాయితీ మారుతుందని నమ్మకం పెట్టుకున్నారు. తన సంక్షేమ పథకాలు ఖచ్చితంగా గట్టెక్కిస్తాయని చెబుతున్నారు. 2018 ఎన్నికల్లో అధికారంలోకి వచి్చన నాటినుంచీ గెహ్లోత్‌పై కారాలూ మిరియాలూ నూరుతూ వస్తున్న కాంగ్రెస్‌ యువ నేత సచిన్‌ పైలట్‌ ప్రచార పర్వంలో మాత్రం సంయమనం పాటించారు.

రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు: 200
మెజారిటీ మార్కు: 101

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement