గణశ్యామ్ తివారీ, ఇన్‌సెట్‌లోఅఖిలేశ్ తివారీ (పాత చిత్రం)
జైపూర్ : బీజేపీ తిరుగుబాటు ఎమ్మెల్యే గణశ్యామ్ తివారీ కుమారుడు అఖిలేశ్ తివారీ ఆ పార్టీకి షాకిచ్చారు. ఏకంగా సొంత పార్టీని స్థాపించిన అఖిలేశ్ వచ్చే రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. భారత్ వాహినీ పార్టీ (బీవీపీ) రానున్న ఎన్నికల్లో 200 అసెంబ్లీ స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపనుందని తెలిపారు. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) భారత్ వాహినీ పార్టీని రిజిస్టర్ చేయడంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతినిచ్చింది. డిసెంబర్ 11, 2017లో అఖిలేశ్ తివారీ పార్టీ రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.
తన తండ్రి గణశ్యామ్ తివారీ నేతృత్వంలో బీవీపీ నిర్ణయాలు తీసుకుంటుందని, ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అఖిలేశ్ చెప్పారు. జూలై 3వ తేదీన జైపూర్‌లో తమ పార్టీ తొలిసారి సమావేశం కానుందని, ఇందులో నేతలు, కార్యకర్తలు కలిపి 2000 మంది పాల్గొంటారని పేర్కొన్నారు. దీన్ దయాల్ వాహినీ సంస్థకు పనిచేస్తున్న వారిలో నియోజకవర్గం నుంచి 10 మందికి ఆహ్వానాలు అందాయి. వీరిలో ఒకరికి పోటీ చేసే అవకాశం ఇస్తారు.
అయితే వసుంధర రాజేకు భారత్ వాహినీ పార్టీ నుంచి ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీన్ దయాల్ వాహినీ సంస్థకు పనిచేసే కార్యకర్తలు అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగనున్న నేపథ్యంలో.. బీజేపీ ఓట్లు చీలే అవకావాలు కనిపిస్తున్నాయి. గత 7 నెలల నెంచి బీజేపీ తిరుగుబాటు ఎమ్మెల్యే గణశ్యామ్, ఆయన కుమారుడు అఖిలేశ్ తివారీలు అసెంబ్లీ ఎన్నికల విషయంపై వ్యూహాలు రచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment