జైపూర్: కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తన పూర్వవైభవాన్ని తిరిగి సంపాదించుకునే పనిలో నిమగ్నమైంది. సీనియర్ నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు. ప్రస్తుతం పార్టీకి పెద్ద దిక్కుగా మారారు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు. ఓ వైపు పార్టీని తిరిగి పోటీలో నిలబెట్టేందుకు దేశవ్యాప్త యాత్ర చేపట్టారు రాహుల్ గాంధీ. ఈ క్రమంలో రాజస్థాన్ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కోసం పని చేసే వారిలో రాహుల్, ప్రియాంక గాంధీల తర్వాత సచిన్ పైలట్ అత్యంత ప్రజాధరణ కలిగిన వ్యక్తిగా పేర్కొన్నారు రాజస్థాన్ మంత్రి రాజేంద్ర గుడా. అశోక్ గెహ్లోత్ వర్గం నేత, ఆయన ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రాజేంద్ర గుడా ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం. ‘రాహుల్, ప్రియాంకల తర్వాత కాంగ్రెస్ పార్టీ కోసం ప్రజలను ఆకట్టుకోవటంలో సచిన్ పైలట్‌దే స్థానం.’ అని పేర్కొన్నారు.
2020లో సచిన్ పైలట్ వర్గం అశోక్ గెహ్లోత్ నాయకత్వంపై తిరుగుబాటు చేయక ముందు.. పైలట్ పేరును ముఖ్యమంత్రి పదవికి ప్రతిపాదించారు రాజేంద్ర గుడా. ఎమ్మెల్యేలంతా ఆయన వెంటే ఉన్నారని అప్పుడు చెప్పారు. ఆరుగురు బీఎస్‌పీ ఎమ్మెల్యేల్లో ఒకరైన రాజేంద్ర గుడా.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత గెహ్లోత్‌కు మద్దతు తెలిపారు. అయితే, ఇటీవలి కాలంలో పలు సందర్భాల్లో సచిన్ పైలట్‌కు మద్దతుగా వ్యాఖ్యానించటం రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారి తీసింది.
సచిన్ పైలట్
ఇదీ చదవండి: బీజేపీలో చేరలేదనే గంగూలీకి అవకాశం ఇవ్వలేదు: టీఎంసీ
Comments
Please login to add a commentAdd a comment