Rajasthan minister
-
ఊహించని పరిణామం.. మంత్రిని సన్మానిస్తుండగా కూలిన స్టేజ్
రాజస్థాన్‌లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. కోటాలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమం అనూహ్య మలుపు తిరిగింది. రాష్ట్ర ప్రభుత్వంలో కొత్తగా మంత్రిగా నియమితులైన బీజేపీ నేతను సన్మానిస్తుండగా..స్టేజీ కుప్పకూలింది. దీంతో పలువురు బీజేపీ నాయకులు కిందపడటంతో గాయాలయ్యాయి. వివరాలు.. రాజస్థాన్‌లో కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం.. కేబినెట్లోని మంత్రులకు నేడు శాఖలను కేటాయించిన విషయం తెలిసిందే. సంగోత్ ఎమ్మెల్యే హీరాలాల్ నగర్‌కు సైతం మంత్రి బాధ్యతలు అప్పజెప్పింది. ఎన్నికల్లో గెలిచిన అనంతరం తొలిసారి మంత్రి తన సొంత నియోజక వర్గానికి విచ్చేశారు. అక్కడ ఆయనకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. హీరాలాల్‌కు స్వాగతం పలికేందుకు జనం అధికంగా తరలి వచ్చారు. ఈ క్రమంలో పార్టీ శ్రేణులు మంత్రికి పూలమాలలు వేస్తుండగా అకస్మాత్తుగా స్టేజ్ కుప్పకూలింది. कोटा में राज्यमंत्री हीरालाल नागर के स्वागत समारोह में टूटा मंच • मंत्री नागर, सांगोद प्रधान सहित 5 लोगों को आई चोट, दो की हालत बताई जा रही गंभीर#kota #Rajasthan pic.twitter.com/LiKRMMbYsy — Avdhesh Pareek (@Zinda_Avdhesh) January 4, 2024 ఈ ఘటనలో మంత్రి సహా వైదికపై ఉన్నవారంతా ఒక్కసారిగా కిందపడిపోయారు. దీంతో ప్రజల్లోనూ, స్థానికంగానూ గందరగోళం నెలకొంది. ఈ ప్రమాదంలో గ్రామపెద్ద సహా ఐదుగురికి గాయాలు కాగా, వారిని ఆసుపత్రికి తరలించారు. మంత్రి హీరాలాల్‌కు సైతం స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం ఆయన ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. అయితే స్టేజ్‌ను 15 మంది ఎక్కేందుకు వీలుగా ఏర్పాటు చేయగా.. 40 మంది ఒకేసారి నిల్చోడంతో బరువు ఎక్కువై కూలినట్లు తెలిసింది. -
ఇండిపెండెంట్లే కీలకం.. రాజస్థాన్ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
జైపూర్: రాజస్థాన్‌లో కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోటీ ఉందని రాజస్థాన్ మంత్రి, కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతాప్ సింగ్ ఖచరియావాస్ అన్నారు. 200 మంది సభ్యుల అసెంబ్లీలో రెండు పార్టీలకు 90-100 సీట్లు వస్తే స్వతంత్ర అభ్యర్థులు కీలక పాత్ర పోషిస్తారని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఖచరియావాస్ తాజాగా ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ ‘ఇరు పార్టీలు 90-100 సీట్లు సాధిస్తే, బీజేపీ, కాంగ్రెస్ రెండూ స్వతంత్ర అభ్యర్థులు, ఇతర పార్టీలను గౌరవించాల్సిందే. అప్పుడు ఎవరికి మద్దతు ఇవ్వాలో వారు నిర్ణయిస్తారు. ప్రస్తుతం రాజస్థాన్‌లో నెక్ టు నెక్ ఫైట్ జరుగుతోందని నేను భావిస్తున్నాను’ అన్నారు. రాజస్థాన్‌లో తమకు 125 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని బీజేపీ చేసిన వాదనలను పలు ఎగ్జిట్ పోల్స్ తోసిపుచ్చాయని ప్రతాప్ సింగ్ గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ 100 పైగా సీట్లు సాధిస్తుందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చాలా ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నట్లు తెలిపారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఓటమిని తాము ఊహించామని, కానీ ఎగ్జిట్ పోల్స్ ఆ పార్టీ ఆధిక్యంలో ఉన్నట్లు చూపిస్తున్నాయన్నారు. రాజస్థాన్‌లో గట్టి పోటీ ఉంటుందని చాలా ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. మూడు ఎగ్జిట్ పోల్లు బీజేపీ స్పష్టమైన విజయాన్ని సాధిస్తుందని అంచనా వేయగా, మరో రెండు రాష్ట్రంలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ ముందంజలో ఉందని పేర్కొన్నాయి. డిసెంబరు 3న ఫలితాలు వెలువడినప్పుడు ప్రభుత్వ ఏర్పాటులో చిన్న పార్టీలు, స్వతంత్రులతో సహా "ఇతరులు" కీలక పాత్ర పోషిస్తారని ఎగ్జిట్ పోల్ అంచనాలు స్పష్టం చేశాయి. 200 స్థానాలున్న రాజస్థాన్ అసెంబ్లీకి 199 స్థానాలకు నవంబర్ 25న ఎన్నికలు జరిగాయి. -
‘చంద్రయాన్-3లో ప్రయాణించిన వారికి సెల్యూట్’.. మంత్రిపై ట్రోల్స్
అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు సాకారం చేస్తూ ఇస్రో ప్రయోగించిన ప్రతిష్టాత్మక చంద్రయాన్-3 ప్రయోగం బుధవారం విజయవంతం అయ్యింది. ఇప్పటి వరకు ఏ దేశం అడుగుపెట్టని జాబిల్లి దక్షిణ ధ్రువంపై మువ్వన్నెల జెండా పాతేసింది. చంద్రుడి దక్షిణధ్రువంపై అడుగుపెట్టిన మొదటి దేశంగా భారత్ రికార్డు నెలకొల్పింది. ల్యాండర్‌తోపాటు రోవర్ కూడా క్షేమంగా దిగడంతో దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. చివరి దశలో వ్యోమనౌక జాబిల్లిపై కాలు మోపే క్షణాలను టీవీలు, ఫోన్లలో ప్రత్యక్షంగా చూసి ఉద్విగ్నానికి లోనయ్యారు. దేశ, విదేశాల నుంచి ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో చంద్రయాన్-కు సంబంధించి రాజస్థాన్ మంత్రి విచిత్ర వ్యాఖ్యలు చేశారు. చదవండి: Chandrayaan-3: ఆ సంతోషం మాటల్లో చెప్పలేం.. ఇస్రో చైర్మన్ రాష్ట్ర క్రీడా, యువజన వ్యవహారాలశాఖ మంత్రి అశోక్ చందన్.. చంద్రుడి మీదకు వెళ్లిన ప్రయాణికులకు సెల్యూట్ అంటూ నోరూజారారు.. ‘చంద్రుడిపై సురక్షితంగా కాలుమోపాం.. అందులో ప్రయణించిన వారికి సెల్యూట్. సైన్స్ స్పేస్ రీసెర్చ్‌లో ఇండియా మరో అడుగు ముందుకేసింది. మిషన్ సక్సెస్ అయిన సందర్భంగా భారత పౌరులందరికీ కూడా శుభాకాంక్షలు చెబుతున్నా’ అని మీడియాతో ముందు తెలిపారు. ఈ వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. కాగా చంద్రయాన్-3 మానవ రహిత మిషన్. ఇస్రో ఇందులో కేవలం విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్ మాత్రమే పంపిన విషయం తెలిసిందే. వ్యోమగాములను రోదసిలోకి పంపలేదు. అయితే మంత్రి స్థానం ఉన్న అశోక్ చందన్. ప్రయోగం గురించి తెలుసుకోకుండా, సరైన అవగాహన లేకుండా మాట్లాడి ట్రోల్స్‌కు గురవుతున్నారు.దీనిపై నెటిజన్లు జోకులు పేలుస్తూ.. మంత్రికి చురకలంటిస్తున్నారు. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 వ్యోమనౌక బుధవారం సాయంత్రం 6.04 గంటలకు జాబిల్లిపై ఎలాంటి అవాంతరాలు లేకుండా సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. విక్రమ్ ల్యాండ్ అయిన నాలుగు గంటల తర్వాత అంటే రాత్రి 10.04 గంటలకు రోవర్ బయటకు వచ్చింది. ల్యాండర్లో పంపించిన రోవర్ పేరు ప్రగ్యాన్. ప్రస్తుతం జాబిల్లిపై అడుగుపెట్టిన రోవర్ ‘ప్రజ్ఞాన్’.. అక్కడ తన అధ్యయనం మొదలుపెట్టింది. చంద్రుడిపై వాతావరణ, నీటి వనరులు, భూగర్భ శాస్త్రం, భవిష్యత్తులో మానవ మనుగడకు సామర్థ్యాలను అధ్యయనం చేయనుంది. చదవండి: చంద్రయాన్ ల్యాండర్.. మెరిసేదంతా బంగారమేనా.. -
మణిపూర్ కాదు.. మన సంగతేంది?
జైపూర్: మహిళలపై జరుగుతున్న అకృత్యాలకుగానూ.. సొంత ప్రభుత్వాన్ని, అదీ అసెంబ్లీ సాక్షిగా నిలదీసిన మంత్రికి గంటల వ్యవధిలోనే కేబినెట్ నుంచి ఉద్వాసన పలికింది రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం. శుక్రవారం ఈ పరిణామం చోటు చేసుకోగా.. ఆ నేత వ్యాఖ్యలతో ప్రతిపక్ష బీజేపీ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. రెండున్నర నెలలుగా మణిపూర్‌లో నెలకొన్న హింసాత్మక పరిస్థితులు.. తాజాగా వెలుగులోకి వచ్చిన అకృత్యాలపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్రంతో పాటు మణిపూర్ ప్రభుత్వం పైనా ధ్వజమెత్తుతున్న సంగతి తెలిసిందే. అయితే.. అసెంబ్లీలో ఈ అంశాన్ని ప్రస్తావించిన మంత్రి రాజేంద్ర సింగ్ గుధా.. రాజస్థాన్‌లో మహిళలపై జరుగుతున్న నేరాల కట్టడికి మన ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. ‘‘ఇక్కడ కఠిన వాస్తవం ఏంటంటే.. మన ప్రభుత్వం మహిళలకు భద్రత కల్పించడంలో విఫలమవుతోంది. రాజస్థాన్‌లో మహిళలపై అకృత్యాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. కాబట్టి.. మణిపూర్ అంశంపై దృష్టిసారించే బదులు ముందు నా సహచరులు ముందు మన సంగతి చూసుకోవడం ఉత్తమం’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారాయన. రాజస్థాన్ మినిమమ్ గ్యారెంటీ బిల్ 2023పై చర్చ సందర్భంగా గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖల మంత్రిగా ఉన్న గుధా ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు రాజకీయ సంచలనానికి దారి తీయగా.. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించారు. రాజేంద్ర సింగ్ గుధాను మంత్రివర్గం నుంచి వెంటనే తొలగిస్తున్నట్లు రాజస్థాన్ రాజ్‌భవన్‌కు సిఫార్సు పంపగా.. గవర్నర్ కల్రాజ్ మిశ్రా దానికి ఆమోదం తెలిపినట్లు సమాచారం. గంట వ్యవధిలోనే ఈ పరిణామాలు చకచకా జరిగిపోయాయి. ఇక ప్రతిపక్ష బీజేపీ రాజేంద్ర వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మార్చుకుని.. కాంగ్రెస్ సర్కార్‌పై విమర్శలు గుప్పిస్తోంది. అంతకు ముందు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ఆరంభానికి ముందు కూడా ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లోనూ శాంతి భద్రతలు ఘోరంగా దెబ్బ తింటున్నాయని, మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: మా దగ్గరా మణిపూర్‌లాంటి ఘటనే జరిగింది: బీజేపీ ఎంపీ -
కాంగ్రెస్‌లో రాహుల్, ప్రియాంకల తర్వాత ఆయనే..!
జైపూర్: కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తన పూర్వవైభవాన్ని తిరిగి సంపాదించుకునే పనిలో నిమగ్నమైంది. సీనియర్ నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు. ప్రస్తుతం పార్టీకి పెద్ద దిక్కుగా మారారు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు. ఓ వైపు పార్టీని తిరిగి పోటీలో నిలబెట్టేందుకు దేశవ్యాప్త యాత్ర చేపట్టారు రాహుల్ గాంధీ. ఈ క్రమంలో రాజస్థాన్ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కోసం పని చేసే వారిలో రాహుల్, ప్రియాంక గాంధీల తర్వాత సచిన్ పైలట్ అత్యంత ప్రజాధరణ కలిగిన వ్యక్తిగా పేర్కొన్నారు రాజస్థాన్ మంత్రి రాజేంద్ర గుడా. అశోక్ గెహ్లోత్ వర్గం నేత, ఆయన ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రాజేంద్ర గుడా ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం. ‘రాహుల్, ప్రియాంకల తర్వాత కాంగ్రెస్ పార్టీ కోసం ప్రజలను ఆకట్టుకోవటంలో సచిన్ పైలట్‌దే స్థానం.’ అని పేర్కొన్నారు. 2020లో సచిన్ పైలట్ వర్గం అశోక్ గెహ్లోత్ నాయకత్వంపై తిరుగుబాటు చేయక ముందు.. పైలట్ పేరును ముఖ్యమంత్రి పదవికి ప్రతిపాదించారు రాజేంద్ర గుడా. ఎమ్మెల్యేలంతా ఆయన వెంటే ఉన్నారని అప్పుడు చెప్పారు. ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేల్లో ఒకరైన రాజేంద్ర గుడా.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత గెహ్లోత్‌కు మద్దతు తెలిపారు. అయితే, ఇటీవలి కాలంలో పలు సందర్భాల్లో సచిన్ పైలట్‌కు మద్దతుగా వ్యాఖ్యానించటం రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. సచిన్ పైలట్ ఇదీ చదవండి: బీజేపీలో చేరలేదనే గంగూలీకి అవకాశం ఇవ్వలేదు: టీఎంసీ -
భర్తల ఆయురారోగ్యాల కోసం ఇంకా జల్లెడ నుంచి చంద్రుడిని చూస్తారా?
జైపూర్: కర్వాచౌత్ నాడు భారతీయ మహిళలు జల్లెడ ద్వారా చంద్రుడిని చూసి తమ భర్తల ఆయురారోగ్యాల కోసం ప్రార్థనలు నిర్వహించడం దురదృష్టకరమని రాజస్తాన్ మంత్రి గోవింద్ రామ్ మేఘవాల్ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేపాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో మహిళలు సైన్స్ ప్రపంచంలో బతుకుతూ ఉంటే, మన దేశంలో జల్లెడ ద్వారా చంద్రుడిని చూస్తూ భర్త ఆయుష్షు కోసం పూజలు చేస్తున్నారని మరి ఆ భర్తలు భార్యల కోసం జల్లెడలోంచి ఎప్పుడూ చంద్రుడిని చూడలేదని వ్యాఖ్యానించారు. మంత్రి వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఎందరో భారతీయ మహిళలు విమాన పైలెట్లుగా ఉన్నారని, కల్పనా చావ్లా వంటి వారు అంతరిక్షంలోకి వెళ్లారని బీజేపీ ఎమ్మెల్యే రామ్‌లాల్ శర్మ గుర్తు చేశారు. -
మంత్రి కొడుకుపై అత్యాచారం కేసు.. మత్తు మందు ఇచ్చి.. నగ్నంగా ఫొటోలు తీసి
న్యూఢిల్లీ: రాజస్తాన్ రాష్ట్ర మంత్రి కుమారుడు తనపై పలుమార్లు అత్యాచారం చేశాడంటూ జైపూర్ మహిళ(23) చేసిన ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రజారోగ్య శాఖ మంత్రి మహేశ్ జోషి కొడుకు రోహిత్ బాధితురాలికి ఏడాది క్రితం ఫేస్బుక్ ద్వారా పరిచయమయ్యాడు. పెళ్లి పేరుతో గత ఏడాది జనవరి 8 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 17వ తేదీ వరకు పలుమార్లు అత్యాచారం చేశాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. చదవండి: దంపతుల హత్య కేసు.. వెలుగులోకి విస్తుపోయే విషయాలు ‘మొదటిసారి అతడు మత్తు మందిచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై నగ్నంగా ఫొటోలు తీసి, వాటిని ఆన్లైన్లో పెడతానంటూ బెదిరించాడు’అని పేర్కొంది. గర్భవతినని తెలిసి, అబార్షన్ చేయించేందుకు కూడా ప్రయత్నించాడని తెలిపింది. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు వివిధ సెక్షన్ల కింద జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సమాచారాన్ని రాజస్తాన్ పోలీసులకు పంపి, దర్యాప్తు చేపట్టామన్నారు. -
మంత్రిపై చేయిచేసుకున్న మరో మంత్రి
జైపూర్ : ఉపాధ్యాయుల బదిలీల అంశంపై ఇద్దరు మంత్రుల మధ్య తలెత్తిన వివాదం ఒకరిపై ఒకరు చేయిచేసుకునే వరకు వెళ్లింది. రాజస్థాన్‌లో చోటు చేసుకున్న ఈ సంఘటన సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. శిఖర్ జిల్లా ఖండేలా నియోజకవర్గంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా జరగడం లేదనే ఆరోపణలు రావడంతో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి బన్షీధర్ బజియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై విద్యాశాఖ మంత్రి వసుదేవ్ దేవ్నానీతో చర్చించేందుకు శుక్రవారం బన్షీధర్ బజియా ఆయన ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ ఇద్దరు మంత్రుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన బజియా మంత్రి దేవ్నానీపై చేయిచేసుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనపై స్పందింయేందుకు దేవ్నానీ నిరాకరించగా, బజియా మొబైల్‌ను స్విచ్చాఫ్ చేసినట్టు సమాచారం. మరో వైపు ఈ ఘటనపై బీజేపీ మీడియా విభాగం ఇంఛార్జి అనంద్ శర్మ మాట్లాడుతూ ఉపాధ్యాయుల బదిలీ విషయంలో ఇరు మంత్రుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్టు ధ్రువీకరించారు. అంతే కాకుండా ఈ ఘటన సంచలనంగా మారడంతో రాజస్థాన్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అవినాశ్ రాయ్ ఇద్దరు మంత్రులను పిలిపించి మాట్లాడినట్టు తెలుస్తోంది. తాజా అంశంపై వసుంధర రాజే ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శలు సంధిస్తోంది. -
‘మహేశ్వరి ముక్కు, చెవులు కోస్తాం...’
జైపూర్ : రాజ్‌పుత్ కర్ణిసేన మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచింది. రాజస్థాన్ విద్యా శాఖ మంత్రి కిరణ్ మహేశ్వరి రాజ్‌పుత్‌లను ఎలుకలతో పోల్చినందుకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. అలా జరగని పక్షంలో ఆమె ముక్కు, చెవులు కోస్తామని కర్ణిసేన బెదిరింపులకు పాల్పడింది. వివరాలు... సోమవారం జరిగిన మీడియా సమావేశంలో మహేశ్వరి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా... వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ‘సర్వ్ రాజ్‌పుత్ సమాజ్ సంఘర్ష్ సమితి బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించబోతున్న వార్తలు నిజమేనా’ అన్న ప్రశ్నకు బదులుగా.. ‘వర్షాకాలంలో కలుగు నుంచి బయటికి వచ్చే ఎలుకల లాంటి కొందరు వ్యక్తులు ఎన్నికల సమయంలో బయటకు వస్తారంటూ’ ఆమె వ్యాఖ్యానించారు. మహేశ్వరి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కర్ణిసేన... ‘దీపికా పదుకొనె ‘పద్మావతి వివాదాన్ని’ మహేశ్వరి మర్చిపోయినట్టున్నారు. రాజ్‌పుత్‌ల వల్లే బీజేపీకి రాజస్థాన్‌లో బలం చేకూరింది. మహేశ్వరి అన్నట్లే ఆమె నియోజక వర్గంలో ఉన్న 40 వేల ఎలుకల వల్లే గత ఎన్నికల్లో గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో ఆమెకు తప్పక బుద్ధి చెప్తామంటూ’ మండిపడింది. ‘మహేశ్వరి వెంటనే క్షమాపణలు చెప్పాలి. ప్రభుత్వం కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. మేము మహిళలకు గౌరవం ఇస్తాం. కానీ హద్దులు దాటి మాట్లాడే మహిళలను ఎన్నటికీ సహించబోమంటూ’ కర్ణిసేన చీఫ్ మహిపాల్ మక్రానా వీడియో విడుదల చేశారు. కాగా ఈ విషయంపై స్పందించిన మహేశ్వరి మాట్లాడుతూ...తాను రాజ్‌పుత్‌ల గురించి ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చారు. రాజకీయ ప్రత్యర్థులను(కాంగ్రెస్ పార్టీని) ఉద్దేశించే అలా మాట్లాడానని చెప్పారు. క్షమాపణలు చెప్పాల్సిందే : సచిన్ పైలట్ రాజ్‌పుత్‌లను అవమానించిన మహేశ్వరి వెంటనే క్షమాపణలు చెప్పాలని రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ సచిన్ పైలట్ డిమాండ్ చేశారు. ప్రజల మనోభావాలకు విలువ ఇచ్చే సంస్కృతి బీజేపీకి లేదని విమర్శించారు. తమను తాము రక్షించుకోవడానికి బీజేపీ నేతలు ఎంతకైనా దిగజారుతారంటూ వ్యాఖ్యానించారు. -
మంత్రివర్యా.. నీకిది తగునా?
సాక్షి, న్యూఢిల్లీ : స్వచ్ఛ భారత్ కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న కృషిని స్ఫూర్తిగా తీసుకొని రాజస్థాన్ ప్రభుత్వం ‘స్వచ్చ్ భారత్ అభియాన్’ కింద మంచి ర్యాంక్‌ను కొట్టేయాలని ప్రయత్నిస్తోంది. సరిగ్గా ఈ సమయంలోనే రాజస్థాన్ ఆరోగ్య మంత్రి కాలిచరణ్ శరఫ్ బుధవారం జైపూర్‌లోని ఓ గోడకు మూత్రం పోస్తూ దొరికిపోయారు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి ఇబ్బందికరంగా పరిణమించింది. ఇది చాలా చిన్న విషయమంటూ మంత్రి కాలిచరణ్ శరఫ్ కొట్టివేయగా, కాంగ్రెస్ పార్టీ మాత్రం బహిరంగంగా మూత్ర విసర్జన చేసినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తోంది. సోషల్ మీడియాలో కూడా చాలా మంది మంత్రి ప్రవర్తనను విమర్శిస్తున్నారు. ఈ ఫొటోను షేర్ చేసిన ప్రముఖ క్రికెటర్ హరిభజన్ సింగ్ కూడా మంత్రి ప్రవర్తనను సున్నితంగా విమర్శించారు. -
మంత్రి షాకింగ్ కామెంట్స్
జైపూర్: బీజేపీ నాయకుడు, రాజస్థాన్ మంత్రి కాళిచరణ్ సరాఫ్ అనుచిత వ్యాఖ్యలతో వివాదంలో ఇరుక్కున్నారు. అత్యాచారాలను అరికట్టలేమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. మైనర్ బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటనపై స్పందిస్తూ ఆయన వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ‘నగల దుకాణం యాజమాని ఇంట్లో పనిచేసే వ్యక్తి ఓనర్ కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు లేదా ప్రభుత్వం ఏం చేయగలుగుతుంద’ని అన్నారు. ఇలాంటి కేసులు నమోదైనప్పుడు నిందితుడిపై కఠిన చర్య తీసుకోవడం, బాధితురాలికి మంచి వైద్య సహాయం అందించడం మినహా తామేమి చేయలేమని చెప్పుకొచ్చారు. రాజస్థాన్‌లో రేప్ కేసులు పెరిగిపోతుండడం గురించి ప్రశ్నించగా మంత్రి విచణక్ష కోల్పోయారు. ‘రాష్ట్రంలో ప్రతి ఇంటికి తాళం వేయాలని మీరు భావిస్తున్నారా? ప్రతి గుమ్మం దగ్గర పోలీసులను కాపలా పెట్టాలా? రోజురోజుకు నేరాలు పెరుగుతున్నాయి. దీనికి మేమేం చేయగలమ’ని ఎదురు ప్రశ్నించారు. మంత్రి వ్యాఖ్యలపై విపక్షాలు, ప్రజా సంఘాలు మండిపడ్డాయి. -
హత్య కేసులో మంత్రి కొడుకు పేరు
జైపూర్: ఓ హత్య కేసులో రాజస్థాన్ మంత్రి రామ్ ప్రతాప్ కుమారుడు అమిత్ సాహుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరో హత్య కేసులో సాక్షిగా ఉన్న హరీష్ సింధి అనే వ్యక్తి సోమవారం హనుమాన్ నగర్ కోర్టుకు రాగా, కోర్టు ఆవరణంలో ఇద్దరు దుండగులు ఆయన్ను కాల్చిచంపారు. నిందితులు సుఖ్బీర్, ధర్మేంద్రలను పోలీసులు నిన్ననే అరెస్ట్ చేశారు. పోలీసులు నిందితులను విచారించిన మీదట ఈ కేసులో మంత్రి కొడుకు అమిత్ సాహూతో పాటు మొత్తం ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా ఈ హత్యతో తనకు ఎలాంటి సంబంధంలేదని సాహు చెప్పాడు. రాజకీయ కారణాలతో తన పేరును ఈ కేసులోకి లాగారని ఆరోపించాడు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు తనను సంప్రదించలేదని తెలిపాడు. కోర్టుకు దగ్గరలోనే ఉన్న కలెక్టర్ కార్యాలయానికి పనిమీద వెళ్లానని, అంతేకాని తనకు ఈ కేసుకు సంబంధంలేదని చెప్పాడు. కాగా ఈ మంత్రి రామ్‌ప్రతాప్ ఈ కేసు విషయంపై స్పందించలేదు. -
స్కూటర్ ఢీకొని.. మంత్రి కాలికి ఫ్రాక్చర్
జైపూర్: ఓ స్కూటరిస్ట్ ఢీకొట్టడంతో రాజస్థాన్ విద్యా శాఖ మంత్రి వాసుదేవ్ దేవ్నాని గాయపడ్డారు. శనివారం అజ్మీర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మంత్రి అనుచరులతో కలసి పక్కనే ఉన్న మరో ప్రదేశానికి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మంత్రి వాసుదేవ్‌ను వెంటనే అజ్మీర్‌లోని జేఎల్ఎన్ ఆస్సత్రికి తరలించారు. ఆయన కాలికి ఫ్రాక్చర్ అయిందని, శస్త్రచికిత్స చేయాలని వైద్యులు సూచించారు. -
అత్యాచార ఆరోపణలతో రాజస్థాన్ మంత్రి రాజీనామా
అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజస్థాన్ ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి బాబూలాల్ నగర్(53) తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపారు. 35 ఏళ్ల మహిళపై ఆయన అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. నైతిక బాధ్యతగా రాజీనామా చేశానని బాబూలాల్ తెలిపారు. దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలన్న ఉద్దేశంతో పదవిని వదులుకున్నట్టు చెప్పారు. తన ఎటువంటి నేరం చేయలేదని ఆయన అన్నారు. అయితే తనను రాజీనామా చేయాలని ఎవరూ అడగలేదని వెల్లడించారు. ఉద్యోగం ఇస్తానని నమ్మబలికి ఈనెల 11న తన అధికార నివాసంలో బాధిత మహిళపై బాబూలాల్ అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీఐడీ నిన్న దర్యాప్తు ప్రారంభించింది. ఏ క్షణంలోనైనా బాబూలాల్ ను అరెస్ట్ చేస్తారని భావిస్తున్నారు.