
డానిష్ అబ్రార్ ట్విటర్‌లో పోస్ట్ చేసిన ఫొటో
సాక్షి, న్యూఢిల్లీ : స్వచ్ఛ భారత్ కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న కృషిని స్ఫూర్తిగా తీసుకొని రాజస్థాన్ ప్రభుత్వం ‘స్వచ్చ్ భారత్ అభియాన్’ కింద మంచి ర్యాంక్‌ను కొట్టేయాలని ప్రయత్నిస్తోంది. సరిగ్గా ఈ సమయంలోనే రాజస్థాన్ ఆరోగ్య మంత్రి కాలిచరణ్ శరఫ్ బుధవారం జైపూర్‌లోని ఓ గోడకు మూత్రం పోస్తూ దొరికిపోయారు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి ఇబ్బందికరంగా పరిణమించింది.
ఇది చాలా చిన్న విషయమంటూ మంత్రి కాలిచరణ్ శరఫ్ కొట్టివేయగా, కాంగ్రెస్ పార్టీ మాత్రం బహిరంగంగా మూత్ర విసర్జన చేసినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తోంది. సోషల్ మీడియాలో కూడా చాలా మంది మంత్రి ప్రవర్తనను విమర్శిస్తున్నారు. ఈ ఫొటోను షేర్ చేసిన ప్రముఖ క్రికెటర్ హరిభజన్ సింగ్ కూడా మంత్రి ప్రవర్తనను సున్నితంగా విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment