swachh bharat abhiyan
-
స్వచ్ఛతలో హ్యాట్రిక్.. కరోనాతో కకావికలం
సాక్షి, సిటీబ్యూరో: ఇండోర్.. దేశంలోనే స్వచ్ఛతలో ఈ నగరానిది ప్రథమ స్థానం. వరుసగా మూడుసార్లు (2017, 2018, 2019) నంబర్ వన్ నగరంగా నిలిచింది. అక్కడ అమలు చేస్తున్న అద్భుతమైన కార్యక్రమాలను, స్వచ్ఛత కోసం పాటిస్తున్న నిబంధనలను తెలుసుకునేందుకు వివిధ నగరాలు అప్పట్లో క్యూ కట్టాయి. అదే దారిలో జీహెచ్ఎంసీ నుంచి సైతం పలువురు అధికారులు, పలు పర్యాయాలు ఇండోర్‌ను గతంలో చుట్టి వచ్చారు. వీరిలో ఐఏఎస్‌లు, అడిషనల్, జోనల్ కమిషనర్లు, చీఫ్ సిటీప్లానర్ సహా ఎందరో ఉన్నారు. ఇండోర్‌లో అమలవుతున్న కార్యక్రమాల అధ్యయన యాత్రలకు జీహెచ్ఎంసీ అప్పట్లో దాదాపు కోటి రూపాయలు ఖర్చు చేసిందంటే అతిశయోక్తి కాదు. స్వచ్ఛతలో మేటిగా ఉన్న ఆ నగరంలో వ్యాధులుఉండవని, ప్రస్తుతం కరోనా కూడా తక్కువ సంఖ్యలో మాత్రమే ఉండవచ్చని ఎవరైనా భావిస్తారు. కానీ.. అంతటి మహత్తర నగరం ప్రస్తుతం కరోనా కోరల్లో విలవిల్లాడుతోంది. ఎందుకీ పరిస్థితి..? ఇండోర్ నగరంలో సుమారు 900 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎందుకు?. ప్రస్తుతం ఎందరినో తొలుస్తున్న ప్రశ్న ఇది. స్వచ్ఛ కార్యక్రమాల అమలులో గొప్ప గొప్ప నగరాలనే తలదన్నిన ఇండోర్ యంత్రాంగం కరోనాను ఎందుకు కట్టడి చేయలేక పోయిందన్నది అంతు పట్టడం లేదు. కరోనాతో అక్కడ దాదాపు యాభై మంది మరణించారు. మార్చి 25న నాలుగు పాజిటివ్ కేసులు మాత్రమే ఉన్న ఇండోర్ నగరంలో ప్రస్తుతం 200 రెట్లకు మించి పోయాయి. ఈ నేపథ్యంలో లాక్డౌన్,కంటైన్మెంట్ నిబంధనలు, సామాజిక దూరం పాటించకపోవడమే కారణం కావచ్చనిజీహెచ్‌ఎంసీలో చర్చ నడుస్తోంది. ఇండోర్‌లో ఇలా.. ♦ స్వచ్ఛతకు సంబంధించి ఇండోర్ విధానాలను జీహెచ్ఎంసీలో అమలు చేసేందుకు అక్కడికి వెళ్లి వచ్చిన అధికారులు గుర్తించిన అంశాలు ఇలా ఉన్నాయి.. ♦ ఇండోర్ నగర జనాభా దాదాపు 35 లక్షలు ♦ అక్కడ రోడ్డుపై చెత్త వేస్తే రూ. 500– 1000 జరిమానా ♦ రోడ్లపై ప్రతి 100 మీటర్లకు రెండు చెత్త డబ్బాల ఏర్పాటు ♦ చెత్త పరిమాణాన్ని బట్టి తరలింపు చార్జీలు రూ.500 నుంచి రూ.30,000 వరకు ♦ చెత్త తరలింపు వాహనాల్లో తడి పొడితో పాటు న్యాప్కిన్లకు ప్రత్యేక చాంబర్ ♦ ఏదైనా ఫంక్షన్ జరిగితే విందు నిర్వహించినా, ఆహార వ్యర్థాల తరలింపునకు చార్జీలు చెల్లించాలి. హాజరయ్యే వారి సంఖ్యను బట్టి మనిషికి రూ.50 వంతున వసూలు చేస్తారు. ఆదర్శంగా తీసుకుని.. ♦ ఇండోర్ జనాభా హైదరాబాద్‌లో దాదాపు మూడో వంతే అయినప్పటికీ.. స్వచ్ఛత అమలుకు ఆ నగరాన్ని ఆదర్శంగా తీసుకున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల్లో ఉత్తమస్థానం సాధించేందుకు ఆ విధానాలను అమలు చేసేందుకు అక్కడి నుంచి కన్సల్టెంట్లను సైతం రప్పించారు. ♦ జీహెచ్ఎంసీ స్వతహాగానూ ఏటికేడు ఎన్నో వినూత్య కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. ♦ నగర పౌరులు, స్వచ్ఛంద సంస్థలు, కాలనీ సంక్షేమ సంఘాలు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలను భాగస్వాముల్ని చేసింది. ప్రస్తుతం దేశంతో పాటు మొత్తం ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచిన స్వచ్ఛ నమస్కారాన్ని కూడా ఈ నగరమే ఆరంభించింది. మొదట్నుంచీ ఇక్కడ అమలవుతున్న కంటెయిన్మెంట్ నిబంధనలు, లాక్డౌన్, సామాజిక దూరం వంటి వాటితోనే ఇండోర్ లాంటి పరిస్థితులు రాలేదని అభిప్రాయపడుతున్న వారూ ఉన్నారు. ♦ జీహెచ్ఎంసీలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న దాదాపు 24వేల మంది కార్మికులు నగరప్రజల ఆరోగ్య భద్రతకు వీర సైనికుల్లా పనిచేస్తున్నారని చెబుతున్నారు. అయినప్పటికీ.. ఇంకా మరింత అప్రమత్తంగా ఉండాలని.. మరింత పరిశుభ్రంగా, అన్ని ప్రాంతాలను మరింత స్వచ్ఛంగా ఉంచాలని కోరుతున్నారు. కరోనా మహమ్మారిని అరికట్టడంలో విఫలమైన ఇండోర్ పాఠంతో నగర ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, అన్ని విధాలా ప్రభుత్వానికి సహకరించాలని జీహెచ్ఎంసీ విజ్ఞప్తి చేస్తోంది. -
పరువుకు పాడెకట్టిన ‘యూజీసీ’
సాక్షి, న్యూఢిల్లీ : ‘విశ్వవిద్యాలయాల్లో బోధన, పరీక్షలు, పరిశోధనల ప్రమాణాలను కొనసాగించడమే కాకుండా వాటిని పెంచేందుకు, అలాగే యూనివర్శిటీ విద్య ప్రోత్సహానికి దోహదపడుతాయని భావించిన చర్యలను ఎప్పటికప్పుడు యూనివర్శిటీలు లేదా సంబంధిత సంస్థలతో సంప్రతింపులు జరపడం ద్వారా అమలు చేయడం యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ సాధారణ విధులు’ అని 1956 నాటి చట్టం నిర్దేశిస్తోంది. దేశంలోని అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో సెప్టెంబర్ 29వ తేదీన ‘సర్జికల్ దాడుల దినోత్సవం’ను జరపాల్సిందిగా ఆదేశిస్తూ ‘యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్’ తాజాగా ఓ సర్కులర్ జారీ చేసింది. విద్యార్థులు, అధ్యాపకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఈ సర్కులర్‌కు యూజీసీ విధులకు ఎలాంటి సంబంధం లేదు. విద్యా, బోధన, పరిశోధనకు సంబంధించిన ఏ అంశం ఇందులో లేదు. పైగా యూనివర్శిటీలతో ఎలాంటి సంప్రతింపులు లేకుండానే యూజీసీ ఏకపక్షంగా ఈ సర్కులర్‌ను జారీ చేసింది. ఇప్పుడే కాదు, గత నాలుగేళ్లుగా సంస్థ ప్రమాణాలను, పరువును పణంగా పెట్టి, తనకు అస్సలు సంబంధంలేని వ్యవహారాలకు సంబంధించి సర్కులర్లను జారీ చేసింది. ‘స్వచ్ఛ భారత అభియాన్’లో పాల్గొన్న విద్యార్థులకు విద్యా ప్రమాణాలకిచ్చే అవార్డులు ఇవ్వాలని యూనివర్శిటీలను ఆదేశిస్తూ, ఐక్యతా పరుగులో పాల్గొనాల్సిందిగా విద్యార్థులకు పిలుపునిస్తూ, యూనివర్శిటీ ఆవరణలో భారత సైనిక ధైర్య సాహసాలను ప్రతిబింబించే గోడలను ఏర్పాటు చేయాలంటూ యూజీసీ పలు సర్కులర్లను జారీ చేసింది. ఇలా తనకు సంబంధంలేని వ్యవహారాల్లో తలదూర్చి ఉన్న మెదడు కాస్త యూజీసీ పోగొట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఎంఫిల్, పీహెచ్డీ, టీచింగ్ పోస్టుల రిజర్వేషన్లకు సంబంధించిన మార్గదర్శకాలను తరచూ మారుస్తూ విద్యార్థుల లోకంలో గందరగోళం సృష్టించడమే కాకుండా తాను గందరగోళంలో పడిపోయింది. ఫలితంగా దేశంలోని అన్ని యూనివర్శిటీల్లో వేలాది టీచింగ్ పోస్టులు ఖాళీగా పడి ఉన్నాయి. సరైన లైబ్రరీలు, లాబరేటరీలు లేక యూనివర్శిటీలు ఇబ్బందులు పడుతుంటే వాటిని పట్టించుకోవాల్సిన యూజీసీ ఈ యాత్రలో పాల్గొనండీ, ఆ యాత్రలో పాల్గొనండంటూ సర్కులర్ల మీద సర్కులర్లు జారీ చేస్తోంది. రెండేళ్ల క్రితం పాక్ భూభాగంలోకి చొచ్చుకుపోయి భారత సైన్యం జరిపిన ‘సర్జికల్ స్ట్రైక్స్’కు ఇప్పుడు, అంటే ఇంత ఆలస్యంగా దినోత్సవాన్ని జరుపుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందో?! ఇవేవి విద్యకు సంబంధించిన సర్కులర్లు కాకపోవడం వల్ల వీటిని పట్టించుకోవాల్సిన అవసరమే యూనివర్శిటీలకు లేదు. అయితే గ్రాంటుల కోసం యూజీసీ మీద ఆధారపడాలి కనుక యూజీసీ ఆదేశాలనుగానీ సూచనలనుగానీ తిరస్కరించే పరిస్థితుల్లో యూనివర్శీటీలు ఉండకపోవచ్చు. కానీ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్లు ఇలాంటి సర్కులర్లను ప్రశ్నించవచ్చు. యూజీసీ గత నాలుగేళ్లుగా తన స్వయం ప్రతిపత్తిని, పరువును పణంగా పెట్టి కేంద్రంలోని పాలక ప్రభుత్వానికి ఓ కొరియర్‌గా పనిచేస్తున్నా ఒక్క వీసీ అంటే ఒక్క వీసీ ప్రశ్నించడం లేదంటే ఎంత సిగ్గు చేటో! -
మంత్రివర్యా.. నీకిది తగునా?
సాక్షి, న్యూఢిల్లీ : స్వచ్ఛ భారత్ కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న కృషిని స్ఫూర్తిగా తీసుకొని రాజస్థాన్ ప్రభుత్వం ‘స్వచ్చ్ భారత్ అభియాన్’ కింద మంచి ర్యాంక్‌ను కొట్టేయాలని ప్రయత్నిస్తోంది. సరిగ్గా ఈ సమయంలోనే రాజస్థాన్ ఆరోగ్య మంత్రి కాలిచరణ్ శరఫ్ బుధవారం జైపూర్‌లోని ఓ గోడకు మూత్రం పోస్తూ దొరికిపోయారు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి ఇబ్బందికరంగా పరిణమించింది. ఇది చాలా చిన్న విషయమంటూ మంత్రి కాలిచరణ్ శరఫ్ కొట్టివేయగా, కాంగ్రెస్ పార్టీ మాత్రం బహిరంగంగా మూత్ర విసర్జన చేసినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తోంది. సోషల్ మీడియాలో కూడా చాలా మంది మంత్రి ప్రవర్తనను విమర్శిస్తున్నారు. ఈ ఫొటోను షేర్ చేసిన ప్రముఖ క్రికెటర్ హరిభజన్ సింగ్ కూడా మంత్రి ప్రవర్తనను సున్నితంగా విమర్శించారు. -
‘మరుగు’లో మెరుగయ్యేదెన్నడు?
రాయ్‌చూర్‌కు చెందిన 25 ఏళ్ల మహేశ్వరి అన్న ఈ మాటలు దేశంలో సామాన్యుల ‘టాయిలెట్’కష్టాలకు అద్దం పడుతున్నాయి! స్వచ్ఛభారత్ అభియాన్ పేరిట కేంద్రం కోట్లు వెచ్చించి మరుగుదొడ్లను నిర్మిస్తున్నా పరిస్థితి తీసికట్టుగానే ఉంది. ఐదు.. పది కోట్లు కాదు.. మన దేశంలో ఏకంగా 73.22 కోట్ల మందికి మరుగుదొడ్డి సౌకర్యం లేదు. అంటే 130 కోట్లకుపైగా ఉన్న దేశ జనాభాలో సగానికిపైగా (56 శాతం) ప్రజలు ఆరు బయటే కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. ప్రపంచంలో అత్యధిక మంది మరుగుదొడ్లకు దూరంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ మొదటి స్థానంలో ఉన్నట్టు వాటర్ ఎయిడ్ సంస్థ తాజాగా వెల్లడించింది. ఈ నెల 19న ‘వరల్డ్ టాయిలెట్ డే’ సందర్భంగా ‘ఔట్ ఆఫ్ ఆర్డర్: ది స్టేట్ ఆఫ్ ద వరల్డ్స్ టాయ్‌లెట్స్–2017’ పేరిట మూడో వార్షిక నివేదికను వెలువరించింది. ఈ జాబితాలో భారత్ తర్వాత చైనా రెండో స్థానంలో ఉంది. ఆ దేశంలో 34.35 కోట్ల మంది(జనాభాలో 25%)కి టాయిలెట్ సౌకర్యం లేదని నివేదిక తెలిపింది. తర్వాతి స్థానాల్లో వరుసగా నైజీరియా(12.28 కోట్లు– దేశ జనాభాలో 67%), ఇథియోఫియా(9.24 కోట్లు– జనాభాలో 93%), బంగ్లాదేశ్(8.55 కోట్లు– జనాభాలో 85.5%) నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 230 కోట్ల మందికి టాయిలెట్ సౌకర్యం అందుబాటులో లేదని నివేదిక తెలిపింది. అలాగే మరుగుదొడ్లు లేక ప్రపంచవ్యాప్తంగా 110 కోట్ల మంది మహిళలు, అమ్మాయిలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, చదువుకు సైతం దూరమవుతున్నారని, అనారోగ్య సమస్యలు, వేధింపులు, దాడుల బారిన పడుతున్నారని పేర్కొంది. మా ఇంట్లో టాయిలెట్ లేదు. గర్భిణిగా ఉన్న సమయంలో మరుగుదొడ్డికి వెళ్లాలంటే ఎంతో కష్టంగా ఉండేది. ఆరుబయటకు వెళ్లాల్సిందే. ఆ దారేమో అంత సురక్షితం కాదు. నిలబడాలన్నా, కూర్చోవాలన్నా సాయం కావాలి కదా.. అందుకే వెంట మా అత్తమ్మను తోడుగా తీసుకెళ్లేదాన్ని.. మార్పు వస్తోంది.. కానీ.. దేశంలో పారిశుధ్యంపై అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం 2014 అక్టోబర్‌లో స్వచ్ఛ భారత్ పథకాన్ని ప్రారంభించింది. దీనిద్వారా దేశంలో 39 శాతంగా ఉన్న ‘పారిశుధ్య కవరేజీ’ని 65 శాతానికి చేర్చినట్టు ప్రభుత్వం చెబుతోంది. గ్రామీణ భారతంలో గత మూడేళ్లలో 5.2 కోట్ల మరుగు దొడ్లను నిర్మించినట్లు అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గతంతో పోలిస్తే పరిస్థితి మెరుగుపడినట్టు వాటర్ ఎయిడ్ సంస్థ కూడా ధ్రువీకరించింది. పారిశుధ్యంపై ప్రచారంతో బహిరంగ మల విసర్జన 40 శాతం మేర తగ్గిందని, కొత్తగా 10 కోట్ల మందికిపైగా టాయిలెట్లు వినియోగిస్తున్నారని వివరించింది. కనీస పారిశుధ్య సౌకర్యానికి నోచుకోని ప్రజలు 2000లో 78.3 శాతం ఉంటే 2015 కల్లా 56 శాతానికి తగ్గారని తెలిపింది. అలాగే బహిరంగ మల విసర్జనను నిర్మూలించి, పారిశుధ్య సౌకర్యాలు పెంచేందుకు కృషి చేస్తున్న ప్రపంచంలోని తొలి పది దేశాల్లో భారత్ ఆరో స్థానంలో ఉన్నట్టు పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇదీ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2015–16 వివరాల ప్రకారం... తెలంగాణలో మొత్తం 50.2 శాతం (పట్టణ ప్రాంతాల్లో 64.4%, గ్రామీణ ప్రాంతాల్లో 38.9%) కుటుంబాలకు మెరుగైన పారిశుధ్య వసతి ఉంది. ఏపీలో 53.6% కుటుంబాలకు (పట్టణ ప్రాంతాల్లో 77.4 %, గ్రామీణ ప్రాంతాల్లో 43.1 % ) మెరుగైన పారిశుధ్య వసతి ఉంది నివేదికలో మరిన్ని అంశాలు - భారత్‌లో టాయిలెట్ సౌకర్యానికి నోచుకోలేని 35.50 కోట్ల మంది మహిళలు, ఆడపిల్లలను వరుసగా నిలబెడితే.. ఆ వరుస భూమిని నాలుగు సార్లు చుట్టి వచ్చేంతగా ఉంటుంది! - అపరిశుభ్రత వల్ల డయేరియా ప్రబలి దేశంలో ఏటా 60,700 మంది చిన్నారులు మరణిస్తున్నారు. వీరిలో తొలి ఐదేళ్లలో చనిపోతున్నవారే ఎక్కువ. - 2015 నాటికి ప్రతిరోజు 321 మంది పిల్లలు డయేరియాతో మృతి చెందుతున్నారు - బహిరంగ మల విసర్జన కారణంగా కొంకిపురుగుల ఇన్ఫెక్షన్తో డయేరియా వ్యాప్తి చెందుతోంది. దీనివల్ల మహిళలు రక్తహీనత, బరువు తగ్గిపోవడం వంటి అనారోగ్యాల బారిన పడుతున్నారు - ఐదేళ్ల వయసు చిన్నారుల్లో 38% మంది ఎత్తుకు తగ్గ బరువు ఉండటం లేదు. (2015–16 జాతీయ కుటుంబ, ఆరోగ్య లెక్కలు) - నెలసరి సమస్య వల్ల భారత్‌లో 23 శాతం మంది అమ్మాయిలు స్కూళ్లకు వెళ్లకుండా డ్రాపౌట్స్‌గా మిగిలిపోతున్నారు. స్కూళ్లలో తమకు ఎలాంటి పారిశుధ్య వసతులు ఉండటం లేదని వారిలో 28% మంది తెలిపారు. (ఇండియాస్పెండ్ నివేదిక) - అపరిశుభ్రత వల్ల వ్యాధులు ప్రబలి ప్రపంచంలో ఏటా 2,89,000 మంది ఐదేళ్ల లోపు పిల్లలు చనిపోతున్నారు. రోజుకు 800 మంది, ప్రతి రెండు నిమిషాలకు ఒకరు చొప్పున మరణిస్తున్నారు. - మంచినీరు, టాయ్లెట్ల కోసం ఖర్చు చేసే ప్రతి డాలర్‌కు సగటున 4 డాలర్ల చొప్పున ఉత్పాదకతను పెంచవచ్చు – సాక్షి నాలెడ్జ్ సెంటర్, తెలంగాణ డెస్క్ -
మ్యాచ్ అయ్యాక వీళ్లంతా ఏం చేశారో తెలుసా?
సాధారణంగా క్రికెట్ మ్యాచ్ కాని, ఫుట్ బాల్ మ్యాచ్ కానీ చూశామా? ఎంజాయ్ చేశామా? వెళ్లామా? అన్నట్టే ఉంటారు ప్రేక్షకులు. స్టేడియంను డస్టు బిన్ లా మార్చేసే తాము వేసే వ్యర్థాల గురించి ఎవరూ పట్టించుకోరు. కానీ శనివారం షిల్లాంగ్ లో జరిగిన దేశంలోనే అతిపెద్ద పురుషుల ఫుట్ బాల్ టోర్నమెంట్ కు వచ్చిన ప్రేక్షకులు చేసిన స్వచ్ఛమైన పని సోషల్ మీడియా యూజర్ల హృదయాలను కొల్లగొడుతోంది. మిజోరాం ఐజ్వాల్ ఎఫ్‌సీ తన తొలి మ్యాచ్ ను గెలువగానే, ఆ టీమ్ ఫ్యాన్స్ దాదాపు 23వేల మంది వెంటనే స్టేడియంను క్లీన్ చేయడం ప్రారంభించారు. తమ టీమ్ గెలుపును స్వచ్ఛ్ భారత్ తో సెలబ్రేట్ చేసుకున్నారు. ''మ్యాచ్ అయిపోగానే డస్ట్ నంతా క్లీన్ చేసినందుకు ఐజ్వాల్ ఫుట్ బాల్ ప్యాన్స్ కు ధన్యవాదాలు. మాతో పాటు మిగతవారందరూ మీ దగ్గరనుంచి చాలా నేర్చుకోవాల్సి ఉంది'' అని ఓ ఫ్యాన్ వారి క్లీనింగ్ ను ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు. అతను ఈ మెసేజ్ ను రాస్తున్నంత సేపట్లోనే ఆ ఫోటోగ్రాఫ్ కు 840 షేర్లు, 1800 లైక్స్ వచ్చాయి. అంతేకాక ఈ మెసేజ్, ఫోటోగ్రాఫ్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇటు ఫేస్ బుక్ మాత్రమే కాక, మరో సామాజిక మాధ్యమం ట్విట్టర్ సైతం ఫుట్ బాల్ ప్యాన్స్ ను పొగడ్తలో ముంచెత్తుతోంది. దీనిపై యువజన వ్యవహారాల, క్రీడా సహాయ మంత్రి విజయ్ గోయల్ కూడా స్పందించారు. '' ఐ-లీగ్ గెలుపు, ఐజ్వాల్ ఎఫ్‌సీ ప్యాన్స్ షిల్లాంగ్ స్టేడియమంతటిన్నీ క్లీన్ చేయడం నిజంగా మా హృదయాలను గెలుచుకుంది. ఇదే నిజమైన స్వచ్ఛ్ భారత్ కు ఉదాహరణ. అందరూ వీరిని చూసి నుంచి నేర్చుకోవాల్సి ఉంది'' అని ట్వీట్ చేశారు. ఒకే సమయంలో ఒకే స్థలంలో జరిగే మ్యాచ్ లతో స్టేడియంలలో ఎక్కువ ఘన వ్యర్థ్యాలను ఉత్పత్తి అవుతాయి. మ్యాచ్ అయిన తర్వాత స్టేడియమంతా ఓ డస్టు బిన్ లా మారిపోతుంది. 2016 లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ జరిగే సమయంలో మొత్తం 40వేల మంది ప్రేక్షకులు దీనిలో పాలుపంచుకుంటున్నారని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంచనావేసింది. దీంతో ఒక్కో మ్యాచ్ జరినే సమయంలో 10మెట్రిక్ టన్నుల వ్యర్థ్యాలు జనరేట్ అవుతాయని ఆందోళన కూడా వ్యక్తంచేసింది. -
రాజదర్బారులో దసరాకు ఎంతపని చేశారు!?
దేశంలోనై మైసూర్ అత్యంత పరిశుభ్రమైన నగరం.. ప్రధాని మోదీ కలల ప్రాజెక్టు స్వచ్ఛ భారత్‌లో భాగంగా మొదటి ర్యాంకు ఈ నగరానికి వచ్చింది. ఇక్కడి మైసూర్ రాజభవనంలో జరిగే దసరా వేడుకలకు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి ఉంది. కానీ ఈసారి ప్యాలెస్‌లో జరిగిన దసరా వేడుకలు మాత్రం మరో చేదు వాస్తవాన్ని బయటపెట్టాయి. నగర వాసులకు పరిశ్రుభత మీద పెద్దగా శ్రద్ధలేదనే విషయాన్ని చాటాయి. ప్యాలెస్‌లో జరిగిన దసరా వేడుకలకు సంబంధించి మైసూర్ రాజకుటుంబ వారసుడు యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఆసక్తికరమైన ఫొటోను పెట్టారు. దర్బార్ హాల్లో దసరా వేడుకలు ముగిసిన తర్వాత.. ఎంత దారుణంగా పరిసరాలు మారిపోయాయో ఈ ఫొటో చాటుతున్నది. దసరా వేడుకల్లో పాల్గొన్న ప్రజలు ప్లాస్టిక్ బాటిళ్లు, పేపర్ ప్లేట్లు, టీ కప్పులు యథేచ్ఛగా విసిరేసి వెళ్లిపోయారు. దీంతో రాజదర్బార్ చెత్తకుండీలా మారిపోయింది. "అత్యంత పరిశుభ్రమైన నగరం అన్న కీర్తిని మనం సీరియస్‌గా తీసుకుంటున్నట్టు లేదు. పరిశుభ్రతకు మారుపేరైన మన నగరంలో పరిస్థితి ఇలా ఉంది. రాజ దర్బారు అనేది థియేటర్ కాదు.. అక్కడ తినకూడదు.. థియేటర్ మాదిరిగా అక్కడ చెత్త వేయకూడదన్న విషయం ప్రజలకు ఎప్పుడు అర్థమవుతుంది. (థియేటర్లో కూడా ఇలా చుట్టూ చెత్త వేసుకోకూడదు). మన సంప్రదాయ పండుగ, మన గొప్ప నగరం ప్రత్యేకతలను నిలబెట్టుకుందాం. పవిత్రమైన భవనాన్ని ఇలా కించపరచడం ఇకముందు జరగకుండా చూసుకుందాం' అని పేర్కొంటూ.. చెత్తచెదారంతో మురికిగా మారిన రాజదర్బార్ ఫొటోను ఆయన పోస్టుచేశారు. -
105 ఏళ్ళ బామ్మ.. మేకలు అమ్మి...
న్యూఢిల్లీః పరిశుభ్రతే ప్రధాన లక్ష్యంగా ప్రారంభమైన.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రవేశ పెట్టిన స్వచ్ఛభారత్ అభియాన్.. ఆ వృద్ధురాలిని మెస్మరైజ్ చేసింది. 105 ఏళ్ళ వయసులో ఆమె.. తన మేకలను అమ్మకానికి పెట్టి మరీ ఇంట్లో టాయిలెట్ల నిర్మాణం చేపట్టింది. అంతేకాక పరిసర గ్రామాల్లోని ప్రజలకు ఇంట్లో మరుగుదొడ్ల నిర్మాణంపై అవగాహన కల్పిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది. దీంతో కున్వర్ బాయ్ ని ఈ నెల సెప్టెంబర్ 17న నిర్వహించే స్వచ్ఛతా దివస్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో ప్రత్యేకంగా సత్కరించనున్నారు. గత ఫిబ్రవరి నెలలో ఛత్తీస్ గఢ్ లోని రాజనందగ్రామంలో నిర్వహించిన ర్యాలీ సందర్భంలో ప్రధాని.. ఆ శతాధిక వృద్ధురాలైన కున్వర్ బాయ్ కాళ్ళకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. ఛత్తీస్ గఢ్ లో ని ధమ్ తరి కోటభర్రి గ్రామంలో శ్యామ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ (రూరల్-అర్బన్) మిషన్ ప్రారంభోత్సవ సందర్భంలో కున్వర్ బాయ్ కు ప్రత్యేక అభినందనలు తెలిపిన ప్రధాని.. ఆపై ఆమె ఆశీర్వాదాన్ని పొందారు. -
పాట రాసిన గవర్నర్
పణజి: స్వచ్ఛ భారత్ అభియాన్ కోసం గోవా గవర్నర్ మృదులా సిన్హా తట్టా, బుట్టానే కాదు పెన్ను కూడా పట్టారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలంటూ ఓ పాటను రాశారు. ఇప్పుడు ఆ పాటలోని కొన్ని స్లోగన్లను రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు ముద్రిస్తున్నారు. ఈ పాటలో పరిశుభ్రతకు సంబంధించి స్లోగన్లతో పాటూ విద్యార్థులతో చేయించే ప్రతిజ్ఞ కూడా ఉంది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచవలసిన ఆవశ్యకతను ఈ పాటలో వివరించారు. పరిశుభ్రంగా ఉండటానికి 'ఏం చేయాలి', 'ఏం చేయకూడదు' లాంటి అంశాలను అందులో ప్రస్తావించారు. కాగా, స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రధాని నరేంద్ర మోదీ, మృదులా సిన్హాను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. -
స్వచ్ఛభారత్‌లో ప్రియాంక వైవిధ్యం!
స్వచ్ఛభారత్ కార్యక్రమంలో ఇప్పటికి చాలామంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. అయితే, అక్కడక్కడ ఉన్న కొంత చెత్తను చీపురు పట్టుకుని ఊడవడం తప్ప వాస్తవంగా పూర్తిస్థాయిలో కార్యక్రమ స్ఫూర్తిని అందిపుచ్చుకున్నవాళ్లు తక్కువే. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా ఈ విషయంలో అందరి కంటే ఓ అడుగు ముందుకేసింది. ముంబైలోని వెర్సోవా సమీపంలో పూర్తి చెత్తకుప్పలతో నిండి ఉన్న ప్రాంతాన్ని ఆమె ఎంచుకుంది. ఆ ప్రాంతంలో ఒకటి, రెండు రోజులు కాకుండా మొత్తం 16 రోజుల పాటు తన బృందంతో కలిసి చెత్త మొత్తాన్ని శుభ్రం చేయించింది. అక్కడ వాతావరణం అంతటినీ సమూలంగా మార్చేసింది. మొక్కలు నాటించి, ఇళ్లకు రంగులు వేయించి, అక్కడ అందరికీ అవగాహన పెంచింది. తాను అనుకున్న సమయం కంటే కొంచెం ఎక్కువే పట్టిందని, స్వచ్ఛభారత్ చేపట్టిన వాళ్లలోని నవరత్నాల్లో ఒకరిగా ఉండాలని ప్రధాని తనకు చెప్పారని, దాంతో తాను చాలా ఉద్వేగానికి గురయ్యానని అన్నారు. అప్పుడే.. సుదీర్ఘకాలం పాటు ఉండేలా ఏదైనా కార్యక్రమం చేపట్టాలని అనుకున్నానని ప్రియాంక చెప్పారు. అగ్నిపథ్ సినిమా షూటింగ్ సమయంలో తాను చూసిన వెర్సోవా ప్రాంతాన్ని ఆమె ఎంచుకున్నారు. పిల్లలు చెత్తకుప్పల మీదే ఆడుకోవడం అప్పట్లో చూశానని, అందుకే కేవలం శుభ్రం చేయడంతో సరిపెట్టకుండా ఆ ప్రాంతం మొత్తాన్ని మార్చేయాలనుకున్నానని తెలిపారు. తాను ఈ కార్యక్రమం చేపట్టిన తర్వాత మరికొందరిని కూడా ఆమె నామినేట్ చేశారు. వారిలో విక్రమ్‌జిత్ సాహ్నీ, సన్ ఫౌండేషన్, దర్శకుడు మధుర్ భండార్కర్, సిద్ధార్థ రాయ్ కపూర్, ఐఐఎం అహ్మదాబాద్ విద్యార్థులు, అధ్యాపకులు, ప్రణయ్ రాయ్, విక్రమ్ చంద్ర, ఎన్డీటీవీ బృందం, ముంబైలోని టాక్సీ, ఆటోరిక్షా యూనియన్లు, లయన్స్ క్లబ్ ఆఫ్ ముంబై.. ఇలాంటి సంస్థలు ఉన్నాయి. The #MyCleanIndia video - http://t.co/hZe3ssVvQn - is a Purple Pebble Pictures production. My First baby steps into this exciting new world. — PRIYANKA (@priyankachopra) November 24, 2014 ప్రియాంక ప్రయత్నాన్ని ప్రధాని నరేంద్రమోదీ కూడా అభినందించారు. ప్రియాంకా చోప్రా చాలా సృజనాత్మకంగా చేశారని, ప్రజలందరినీ ఒక్కచోటుకు చేర్చి స్వచ్ఛభారతాన్ని సృష్టించడానికి ఇది చాలా అద్భుతమైన మార్గమని ఆయన ట్విట్టర్లో తెలిపారు. ఆమెకు మనస్ఫూర్తిగా అభినందనలు చెప్పారు. An innovative effort by @priyankachopra. It is a wonderful way to bring people together to create a Swachh Bharat. Kudos! #MyCleanIndia — Narendra Modi (@narendramodi) November 24, 2014 -
గోదావరి జలాలు సద్వినియోగమయ్యేలా చూడండి
ముంబై: గోదావరి బేసిన్‌కు చెందిన 150 టీఎంసీలకు పైగా నీటిని రాష్ట్ర ప్రభుత్వం సరిగా వినియోగించుకోలేకపోతోందని రాష్ట్ర గవర్నర్ విద్యాసాగరరావు అభిప్రాయపడ్డారు. రైతాంగ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ జలాల సద్వినియోగానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని హితవు పలికారు. లేకపోతే రైతాంగం ఇక్కట్లపాలవుతారన్నారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఆర్థిక శాఖమంత్రి సుధీర్ మునగంటివార్, ఉన్నత విద్యాశాఖ మంత్రి, గిరిజన సంక్షేమ శాఖ విష్ణు సర్వలతోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో రాజ్‌భవన్‌లో గవర్నర్ శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్వయంప్రయంపత్తి బోర్డులు, గిరిజన సంక్షేమం, ఉన్నత విద్య, విశ్వవిద్యాలయాలు, స్వచ్ఛ్ భారత్ అభియాన్ తదితర అంశాలపై చర్చించారు. -
టెలివిజన్ ఛానెల్‌లను అభినందించిన మోడీ!
న్యూఢిల్లీ: దీపావళి పర్వదినం తర్వాత వీధుల్లో పేరుకు పోయిన చెత్తపై ప్రత్యేక కథనాల్ని ప్రసారం చేసిన టెలివిజన్ చానెల్లను ప్రధాని నరేంద్రమోడీ అభినందించారు. పరిశుభ్రత ఆవశ్యకతను తెలిపే కథనాలు ప్రసారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధాని అన్నారు. పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఇలాంటి టెలివిజన్ ప్రసారాలు ఉపయోగపడుతాయని మోడీ అన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా దీపావళి పండగ తర్వాత చెత్త చెదారాన్ని తొలగించడానికి పూనుకున్న ప్రతి ఒక్కరికి ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. పండగ తర్వాత వీధుల్లో చెత్త పేరుకుపోవడాన్ని టెలివిజన్ చానెల్లు ప్రసారం చేశాయి. పరిశ్రుభత అవగాహన కల్పించడానికి టెలివిజన్ చానెల్లు చేసిన కృషి ప్రశసించదగినది అని ట్విటర్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా పరిశుభ్రతపై అవగాహన కల్పించడానికి అక్టోబర్ 2 తేదిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మోడీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. I saw several TV channels showing dirt left behind after crackers. I congratulate them for spreading awareness on importance of cleanliness — Narendra Modi (@narendramodi) October 24, 2014 -
మలినాలతో పాతఢిల్లీవాసులు విసిగిపోయారు
న్యూఢిల్లీ: మలినాల మధ్య కాలం గడపలేక పాత ఢిల్లీవాసులు విసిగిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ పేర్కొన్నారు. అందువల్లనే ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆరంభించిన ‘స్వచ్ఛ్ భారత్ అభియాన్’ చక్కగా ప్రతిస్పందించారన్నారు. నగరంంలోని చాందినీ చౌక్ ప్రాంతంలో సోమవారం నిర్వహించిన పారిశుధ్య కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ‘ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి కుడ్యనగరవాసులు చక్కగా స్పందించడాన్ని నేను గుర్తించాను. మలినాల మధ్య కాలం వెళ్లదీయలేక పాత ఢిల్లీవాసులు ఇప్పటికే బాగా విసిగిపోయారు. గడచిన రెండు దశాబ్దాల కాలంలో పాతఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో నేను పర్యటించా. ఈ సందర్భంగా అనేకమంది నగరవాసుల్లో పారిశుధ్యం ఆవశ్యకతపై స్ఫూర్తి కలిగించా. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ముందుకు రావాలని కోరా. ఈ ఆలోచన వారికి ఎంతగానో నచ్చింది’ అని అన్నారు. పారిశుధ్య కార్యక్రమం చేపట్టడానికి బక్రీద్ శుభదినమని భావిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తరచూ తనిఖీలు చేయండి పాత ఢిల్లీని తరచూ తనిఖీలు చేపట్టాలని మంత్రి హర్షవర్ధన్ ఆరోపించారు. ఈ ప్రాంతంలో మరిన్ని మరుగుదొడ్లను నిర్మించాలని సూచించారు. ప్రతిరోజూ వ్యర్థాలను తొలగించాలన్నారు. ఫటక్ తెలియాన్ ప్రాంతంలోని కమ్యూనిటీ హాలుకు మరమ్మతు పనులు చేపట్టాలన్నారు. అభివృద్ధి పనులపై అవసరమని భావిస్తే మరింత శ్రద్ధ చూపాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో రెండున స్వచ్ఛ్ భారత్ అభియాన్
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే నెల రెండో తేదీన ప్రభుత్వ పాఠశాలల్లో స్వచ్ భారత్ అభియాన్ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు పాఠశాలలకు విధిగా హాజరుకావాలని విద్యాశాఖ డెరైక్టరేట్ ఆదేశించింది. గాంధీ జయంతి నాడు విద్యార్థులు, సిబ్బంది పాఠశాలలకు విధిగా హాజరుకావాలని, వారు స్వచ్చ్ భారత్ ప్రతిజ్ఞ చేసి, పాఠశాల ప్రాంగణాన్ని శుభ్రం చేసి ఇంటికి వెళ్లిపోవచ్చని పేర్కొంది. సింగిల్ షిఫ్టులో పనిచేసే పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులతోపాటు సిబ్బంది ఉదయం తొమ్మిది గంటల నుంచి 11 గంటల వరకు, రెండో షిఫ్టులో పనిచేసే పాఠశాలల విద్యార్థులు , సిబ్బంది మధ్యాహ్నం ఒకటి నుంచి మూడు గంటల వరకు ఈ కార్యక్రమానికి హాజరుకావాలని విద్యాశాఖ తన సర్య్కులర్ పేర్కొంది. అరగంటసేపు అసెంబ్లీ జరిపి విద్యార్థులకు పరిశుభ్రత ప్రాధాన్యాన్ని బోధించాలని ఆ తరవాత వారితో స్వచ్ఛ్ భారత్ ప్రతిజ్ఞ చేయించాలని పేర్కొంది. ఆతరువాత వారికి మధ్యాహ్న భోజనం వడ్డించి ఇంటికి పంపించాలని పేర్కొంది. ఆ తరువాత కూడా విద్యార్థులకు ప్రతిరోజూ అసెంబ్లీలో పరిశుభ్రతపై అవగాహరన కల్పించాలని, స్వచ్చ్ భారత్ ప్రతిజ్ఞ చేయించాలని, విద్యార్థుల పుట్టిన రోజున వారితో మొక్కలు నాటించాలని కూడా విద్యాశాఖ డైరక్టరేట్ పాఠశాలలకు సూచించింది. స్వచ్ఛ్ భారత్ మిషన్ కోసం తాము జారీ చేసిన ఆదేశాల ఏవిధంగా అమలు చేస్తున్నారనే విషయం తెలుసుకోవడం కోసం విద్యాశాఖ అధికారులతో పాటు ఇతర అధికారులు ఆయా పాఠశాలలను సందర్శిస్తారు. ఇదిలాఉంచితే స్వచ్ ్ఛ భారత్ మిషన్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర పట్టణ అభివృద్ధి మంత్రిత్వశాఖ ఇండియా గేట్ వద్ద నిర్వహించే నడక కార్యక్రమంలో 2,500 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొననున్నారు. వారితో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వచ్చ్ భారత్ ప్రతిజ్ఞ చేయిస్తారు. -
ఉల్లాసంగా.. ఉత్సాహంగా
‘స్వచ్ఛ్ భారత్ అభియాన్’లో నిన్న స్మృతి ఇరానీ, నేడు రవిశంకర్ ప్రసాద్ సాక్షి, న్యూఢిల్లీ: ‘స్వచ్ఛ్ భారత్ అభియాన్’ కింద చేపట్టిన పారిశుధ్య కార్యక్రమాల్లో కేంద్ర మంత్రులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ.. ఆర్కేపురంలోని కేంద్రీయ విద్యాలయ మైదానంలో గురువారం చెత్త ఎత్తివేయగా, మరో కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ శుక్రవారం శాస్త్రిభవన్‌లో చీపురుపట్టారు. కేంద్ర టెలికం, న్యాయశాఖ మంత్రి శుక్రవారం శాస్త్రిభవన్ కాంపౌండ్‌లో పారిశుధ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. గదులు, బాత్ రూంలలోకి వెళ్లి పారిశుధ్య పరిస్థితిని పరిశీలించారు. మహాత్మాగాంధీ 150వ జయంతి నాటికి అంటే 2019 అక్టోబర్ రెండో నాటికి దేశాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారని, ఇందులోభాగంగా తమకు ఆదర్శమైన దీన్ దయాళ్ ఉపాధ్యాయ 98వజయంతిని పురస్కరించుకుని పారిశుధ్య కార్యక్రమాన్ని ప్రారంభించామని రవి శంకర్ ప్రసాద్ చెప్పారు. ఈ కార్య్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన్పటికీ స్వచ్ఛ్ భారత్‌ను ప్రజా ఉద్యమంగా మార్చడంలో ఇదొక భాగమని, ఇదే అందుకు ఆరంభమని ఆయన అభిప్రాయపడ్డారు. వచ్చే నెల రెండో తేదీన తాను పాట్నా రైల్వే స్టేషన్లో స్వచ్ఛ్ భారత్ అభియాన్‌ను చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. రెండున విధులకు ప్రభుత్వోద్యోగులు ప్రతి ఏడాదీ గాంధీ జయంతి రోజున హాయిగా కుటుంబసభ్యులతో కాలక్షేపం చేస్తున్న ప్రభుత్వోద్యోగులకు ఈసారి ఆ అవకాశమే లేకుండాపోయిం ది. ఇందుకు కారణం అదే రోజున స్వచ్ఛ్ భారత్ అభియాన్’ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిర్ణయించడమే. దీంతో వా రంతా కంగుతిన్నారు. గాంధీ జయంతి, దసరా, బక్రీద్లతో పాటు శని, ఆదివారాలను కలుపుకుని వరుసగా ఐదు రోజులు సెలవు దినాలు రావడంతో విహారయాత్రకు వెళ్లేందుకు వీరంతా రూపొందిం చుకున్న ప్రణాళికలు ఈ కార్యక్రమం కారణంగా తలకిందులయ్యాయి. ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాలతో పాటు కేంద్ర ప్రభత్వ కార్యాలయాలు గాంధీ జయంతి రోజున పనిచేయనున్నాయి. ఉద్యోగులు వచ్చే నెల రెండో తేదీన తమ తమ కార్యాలయాలకు హాజరై ‘స్వచ్ఛ్ భారత్ శపథం’ చేయాల్సి ఉంటుంది. ప్రతి మంత్రిత్వశాఖ పారి శుధ్య కార్యక్రమాన్ని చేపట్టాలని, ఉన్నతాధికారుల నేతృత్వంలో అన్ని ప్రభుత్వ కార్యాయాలలో గురువారం నుంచి వా రం రోజులపాటు పారిశుధ్య కార్యక్రమం చేపట్టాలంటూ కేబినెట్ కార్యదర్శి అజితసేథ్... కేంద్ర ప్ర భుత్వ కార్యదర్శులందరికీ ఆదేశాలు జారీ చేశారు. యాత్రను రద్దు చేసుకున్నా అక్టోబర్ రెండు నుంచి వరుసగా ఐదు రోజుల సెల వు దినాలను పురస్కరించుకుని కుటుంబసమేతం గా ఉత్తరాఖండ్‌లోని అల్మోడా పరిసర ప్రాంతాలను సందర్శించాలనుకున్నామని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని విమలా భల్లా చెప్పారు. అయితే రెండున సెల వు లేకపోవడంతోయాత్రను రద్దుచే సుకున్నామని అన్నారు. నవరాత్రుల ఆఖరి రోజుకూడా రెండో తేదీయే కావడంతో నవమి పూజకు ఏర్పాట్లు చేసుకున్నవారు కూడా పునరాలోచనలో పడిపోయారు.