టెలివిజన్ ఛానెల్లను అభినందించిన మోడీ!
దీపావళి పర్వదినం తర్వాత వీధుల్లో పేరుకు పోయిన చెత్తపై ప్రత్యేక కథనాల్ని ప్రసారం చేసిన టెలివిజన్ చానెల్లను ప్రధాని నరేంద్రమోడీ అభినందించారు.
న్యూఢిల్లీ: దీపావళి పర్వదినం తర్వాత వీధుల్లో పేరుకు పోయిన చెత్తపై ప్రత్యేక కథనాల్ని ప్రసారం చేసిన టెలివిజన్ చానెల్లను ప్రధాని నరేంద్రమోడీ అభినందించారు. పరిశుభ్రత ఆవశ్యకతను తెలిపే కథనాలు ప్రసారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధాని అన్నారు. పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఇలాంటి టెలివిజన్ ప్రసారాలు ఉపయోగపడుతాయని మోడీ అన్నారు.
స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా దీపావళి పండగ తర్వాత చెత్త చెదారాన్ని తొలగించడానికి పూనుకున్న ప్రతి ఒక్కరికి ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. పండగ తర్వాత వీధుల్లో చెత్త పేరుకుపోవడాన్ని టెలివిజన్ చానెల్లు ప్రసారం చేశాయి. పరిశ్రుభత అవగాహన కల్పించడానికి టెలివిజన్ చానెల్లు చేసిన కృషి ప్రశసించదగినది అని ట్విటర్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా పరిశుభ్రతపై అవగాహన కల్పించడానికి అక్టోబర్ 2 తేదిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మోడీ ప్రారంభించిన సంగతి తెలిసిందే.