PM Modi Will Gift 75,000 Jobs To Young People Across The Country On Occassion Of Diwali - Sakshi
Sakshi News home page

PM Modi Diwali Gift: 75వేల మంది యువతకు ప్రధాని మోదీ దివాళీ గిఫ్ట్‌

Published Thu, Oct 20 2022 11:57 AM | Last Updated on Thu, Oct 20 2022 1:08 PM

This Diwali PM Modi Will Gift Jobs To 75000 Youth Across Country - Sakshi

న్యూఢిల్లీ: ఈ ఏడాది దీపావళికి దేశవ్యాప్తంగా 75వేల మంది యువతకు అదిరిపోయే గిఫ్ట్‌ ఇవ్వనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దివాళీకి రెండు రోజుల ముందు శనివారం వారితో వర్చువల్‌గా సమావేశమై వివిధ అంశాలపై మాట్లాడనున్నారు. 75వేల మంది యువతకు ప్రభుత్వ విభాగాలు, వివిధ మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇవ్వనున్నారు. అదే రోజు వారికి ఉద్యోగ నియామక పత్రాలు(అపాయింట్‌మెంట్‌ లెటర్స్‌) అందించనున్నారు ప్రధాని మోదీ. 

ప్రధాని స్పెషల్‌ గిఫ్ట్‌ అందుకునే యువత.. రక్షణ, రైల్వే, హోం, కార్మిక, ఉపాధి శాఖలు, తపాలా విభాగం, సీఐఎస్‌ఎఫ్‌, సీబీఐ, కస్టమ్స్‌, బ్యాంకింగ్‌ వంటి రంగాల్లో వారికి పోస్టింగ్‌ ఇవ్వనున్నారు. దేశవ్యాప్తంగా వివిధ నగరాల నుంచి కేంద్ర మంత్రులు సైతం ఈ వర్చువల్‌ సమావేశానికి హాజరుకానున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేద్ర ప్రధాన్‌ ఒడిశా నుంచి, ఆరోగ్య శాఖ మంత్రి మాన్‌సుఖ్‌ మాండవియా గుజరాత్‌ నుంచి, సమాచార ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ చండీగఢ్‌ నుంచి, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ మహారాష్ట్ర నుంచి హాజరుకానున్నారు. అలాగే.. ఎంపీలందరూ వారి వారి పార్లమెంట్‌ నియోజకవర్గాల నుంచి హాజరుకానున్నారు.

ఇదీ చదవండి: ముందస్తు దీపావళి కాంతులు: ఐటీ ఉద్యోగులకు తీపి కబురు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement