ఢిల్లీ: దేశంలో గడిచిన నాలుగేళ్లలో ఎనిమిది కోట్ల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చినట్లు శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ఉద్యోగాలకు సంబంధించి ప్రధాని మోదీ అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు.
‘‘ ప్రధాని మోదీ నిన్న(శనివారం) ముంబైలో ఉద్యోగాల కల్పనపై అబద్దాలు చెప్పారు. నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ ( ఎన్‌ఆర్‌ఏ)పై మీరు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తాను. కోట్ల మంది యువకులు ఎన్‌ఆర్‌ఏ ఒక వరం. ఒకే జనరల్ ఎగ్జామ్.. అనేక పరీక్షలను నిర్వహించాల్సిన అవసరాన్ని తొలగిస్తుంది. అభ్యర్థులు సమయం, వనరులను ఆదా చేస్తుంది.
.. దీంతో పారదర్శకత కూడా పెరుగుతుంది. ఈ నాలుగు ఏళ్లలో ఎన్‌ఆర్‌ఏ ఒక్క పరీక్ష కూడా ఎందుకు నిర్వహించలేదు. దాని నిర్వహణకు కేటాయించిన మొత్తం రూ. 1517 కోట్లకు కేవలం రూ. 58 కోట్లు మాత్రమే ఎందుకు ఖర్చు చేశారు. ఎన్‌ఆర్‌ఏ అనేది ఉద్యోగాల నియామకానికి ఏర్పాటు చేశారా?. లేదా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ నిజర్వేషన్లను లాక్కోవడానికి ఉద్దేశపూర్వకంగానే పనిచేయకుండా చేస్తున్నారా?’ ’అని మోదీపై ప్రశ్నలు సంధించారు.
శనివారం ప్రధాని మోదీ ముంబైలోని ఓ కార్యక్రమంలో పాల్గొని రిజర్వు బ్యాంక్ రిపోర్టు ప్రకారం 2023-24లో భారత్ 4.7 కోట్ల ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. మొత్తంగా నాలుగేళ్లలో 8 కోట్ల ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చి ఉద్యోగాలపై అసత్యాలు ప్రచారం చేసేవారిని మాట్లాడనివ్వకుండా చేసిందని ప్రతిపక్షాలను విమర్శలు చేశారు. పెట్టుబడులు, మౌలిక వనరుల అభివృద్ధి, దేశాభివృద్దిపై అసత్యాలు ప్రచారం చేసే శత్రువులన్నారు. ప్రతిపక్షాలు అబద్దాలను ప్రజలు తిరస్కరించారని మోదీ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment