రాజౌరి : భారత ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ కశ్మీర్ రాజౌరి జిల్లాలోని నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ) వద్ద ఆర్మీ అధికారులతో కలిసి ఆదివారం దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తాజాగా ఈ వేడుకలకు సంబంధించిన వీడియోనూ మోదీ ట్విటర్ వేదికగా పంచుకున్నారు. దేశ భద్రత కోసం తమ ప్రాణాలనే త్యాగం చేస్తూ నిరంతరం శ్రమిస్తున్న ఆర్మీ అధికారులతో ఈ వేడుక జరుపుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.కాగా, ఆర్టికల్ 370 రద్దు తర్వాత మొదటిసారి జమ్మూ కశ్మీర్‌లో పర్యటించిన మోదీ ఆర్మీ అధికారులతో కలిసి సంయుక్తంగా ఈ వేడుకలను నిర్వహించారు. బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్‌లో ఆర్మీ అధికారులుతో సమావేశంలో ఆర్మీ సిబ్బందితో కరచాలనం చేస్తూ , స్వీట్లు పంచి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు ఆర్మీ సిబ్బంది తమ సంతోషాన్నిమీడియాతో పంచుకున్నారు. 'స్వయంగా ప్రధాని ఇక్కడకు రావడం మాకు ఆశ్చర్యం కలిగించింది. మాతో కలిసి దీపావళి వేడుకలు చేసుకున్నందుకు ప్రధాని మోదీకు కృతజ్ఞతలు' అని ఓ సైనికుడు తెలిపారు.
#Diwali is sweeter when celebrated with our brave soldiers. pic.twitter.com/skO2SfcwJ3
— Narendra Modi (@narendramodi) October 27, 2019
Comments
Please login to add a commentAdd a comment