జమ్ముకశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లాకు ప్రధాని మోదీ విషెస్‌.. | PM Modi congratulates Omar Abdullah, pledges Centre's support for JK progress | Sakshi
Sakshi News home page

జమ్ముకశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లాకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

Published Wed, Oct 16 2024 2:51 PM | Last Updated on Wed, Oct 16 2024 3:13 PM

PM Modi congratulates Omar Abdullah, pledges Centre's support for JK progress

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌ నూతన ముఖ్యమంత్రిగా నేడు ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం చేశారు. శ్రీనగర్‌లోని షెరి కశ్మీర్‌ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్‌ సిన్హా ఆయనతో ప్రమాణం చేయించారు. సురిందర్ కుమార్ చౌదరీ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు సేవ చేసేందుకు ఆయన చేస్తున్న కృషికి మంచి జరగాలని ఆకాంక్షించారు. జమ్ముకశ్మీర్‌ ప్రాంత అభివృద్ధి కోసం తాము ఒమర్ అబ్దుల్లా సర్కారుతో కలిసి పనిచేస్తామని చెప్పారు. అంతేగాక ప్రమాణస్వీకారానికి ముందు ఒమర్‌ అబ్దుల్లా కూడా జమ్ముకశ్మీర్‌ అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తానని చెప్పారు.
చదవండి: J&K cabinet: మంత్రి పదవి ఆఫర్‌.. తిరస్కరించిన కాంగ్రెస్‌ <

ఇక జమ్ముకశ్మీర్‌ రాష్ట్రం జమ్ముకశ్మీర్‌, లఢఖ్‌ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయిన తర్వాత తొలిసారి జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ ఘన విజయం సాధించడంతో.. ఆ పార్టీ అగ్రనేత ముఖ్యమంత్రి అయ్యారు. దాంతో కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్‌కు తొలి సీఎంగా ఒమర్‌ అబ్దుల్లా గుర్తింపు పొందారు. గతంలో ఆయన జమ్ముకశ్మీర్‌ రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు.

ఓమర్‌ అబ్దుల్లా ప్రమాణ స్వీకార  కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు హాజరయ్యారు. వీరితో పాటు ఇండియా కూటమికి చెందిన ఇతర నేతలు వచ్చారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు చేసి, కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన తర్వాత ఏర్పాటైన తొలి ప్రభుత్వం ఇది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement