శ్రీనగర్: జమ్మూకాశ్మీర్పై మరోసారి విరుచుకుపడిన వరద ప్రళయాన్ని ఎదుర్కొనేందుకు ఏ చర్యలు తీసుకున్నారని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీ సర్కార్ను ప్రశ్నించారు.
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్పై మరోసారి విరుచుకుపడిన వరద ప్రళయాన్ని ఎదుర్కొనేందుకు ఏ చర్యలు తీసుకున్నారని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీ సర్కార్ను ప్రశ్నించారు. ఇప్పటికే వరదల బారిన పడి కనీసం ఏడు నెలలు కూడా పూర్తికాకముందే మరోసారి ప్రజలు దాని బారిన పడాల్సి వచ్చిందని గుర్తుచేశారు. సోమవారం అసెంబ్లీలో మాట్లాడిన ఆయన ఈ వరదల్లో ప్రజలకు సాయం చేసేందుకు ఏమాత్రం ఆలస్యం జరగకూడదని నొక్కి చెప్పారు.
ఈ అంశాన్ని తాము రాజకీయం చేయాలని చూడటం లేదని, వారిని రక్షించాల్సిన బాధ్యత కేంద్రం, రాష్ట్రంపై ఉందని గుర్తుచేస్తున్నానని అన్నారు. ప్రస్తుతం రాజకీయాలపై చర్చించే సమయం కాదని కూడా అన్నారు. 2014లో వచ్చిన వరదల సమయంలో కూడా కేంద్రం సాయం చేయడంలో నిర్లక్ష్యం వహించిందని చెప్పిన ఆయన ఈసారైనా సత్వరంగా స్పందించి సహాయక చర్యలకు దిగాలని సూచించారు.