నేడు జమ్మూకాశ్మీర్లో పర్యటించనున్న మోడీ | Jammu and Kashmir: Narendra Modi to visit flood-hit state today as death toll reaches 160 | Sakshi
Sakshi News home page

నేడు జమ్మూకాశ్మీర్లో పర్యటించనున్న మోడీ

Published Sun, Sep 7 2014 10:48 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

నేడు జమ్మూకాశ్మీర్లో పర్యటించనున్న మోడీ - Sakshi

నేడు జమ్మూకాశ్మీర్లో పర్యటించనున్న మోడీ

న్యూఢిల్లీ: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతన్న జమ్మూకాశ్మీర్లో పర్యటనకు ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం న్యూఢిల్లీ నుంచి బయలుదేరారు. జమ్మూ చేరుకున్న వెంటనే ఆయన శ్రీనగర్కు పయనమవుతారు. అక్కడి నుంచి రాష్ట్రంలో ముంపునకు గురైన ప్రాంతాలలో ఆయన పర్యటించనున్నారు. అనంతరం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతోపాటు ఇతర ఉన్నతాధికారులతో మోడీ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

అయితే ఇటీవల కురిసిన వర్షాలు, పోటిత్తిన వరదలతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 160కి చేరుకుంది. ఎంతో మంది గల్లంతయ్యారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు సైనం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. భారీ వర్షాలతో అక్కడక్కడ సహాయక చర్యలకు అటంకాలు ఏర్పడుతున్నాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement