న్యూఢిల్లీ: స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగస్వామి అయినందుకు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందించారు. ఒమర్ క్రియాశీల ప్రయత్నం జమ్మూకాశ్మీర్ ప్రజలకు ప్రేరణ అవుతుందని ఆయన ప్రశంసించారు. ఒమర్ ప్రయత్నం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేస్తుందని మోదీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మోదీ స్వచ్ఛభారత్ పిలుపునకు స్పందించిన ఒమర్ అబ్దుల్లా శ్రీనగర్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులతో కలసి బుధవారం రాత్రి వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిశుభ్రతా కార్యక్రమంలో పాలుపంచుకున్న సంగతి తెలిసిందే.
చీపురు పట్టి శ్రీనగర్ వీధులను ఒమర్ శుభ్రపరిచారు. ఈ సందర్భంగా స్వచ్ఛభారత్‌కు తన పేరును నామినేట్ చేసినందుకు బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్‌కు ఒమర్ అబ్దుల్లా కృతజ్ఞతలు చెప్పారు. అలాగే తాను కూడా మరో తొమ్మిది మందిని నామినేట్ చేశారు. ఈ జాబితాలో తన సోదరి, సచిన్ పైలట్ భార్య సారా పైలట్‌తో పాటు పీడీపీ నాయకురాలు మొహబూబా ముఫ్తీ, నోబెల్ విజేత కైలాస్ సత్యార్థి, బాలీవుడ్ నటి దీపికా పదుకొనే తదితరులు ఉన్నారు.
ఒమర్ అబ్దుల్లాపై మోదీ ప్రశంసలు
Published Sat, Oct 25 2014 3:13 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement