కాశ్మీర్ వరద బాధితులకు ప్రధాని సాయం | Rs.745 crore for Kashmir's damaged homes, hospitals | Sakshi

కాశ్మీర్ వరద బాధితులకు ప్రధాని సాయం

Oct 23 2014 6:19 PM | Updated on Jun 4 2019 6:19 PM

జమ్మూకాశ్మీర్లో వరదల వల్ల ఇటీవల నష్టపోయిన బాధితులకు ప్రధాని నరేంద్ర మోడీ సాయం ప్రకటించారు.

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో వరదల వల్ల ఇటీవల నష్టపోయిన బాధితులకు ప్రధాని నరేంద్ర మోడీ సాయం ప్రకటించారు. వరదలకు దెబ్బతిన్ని ఇళ్లు, ఆస్పత్రుల నిర్మాణాల కోసం 745 కోట్ల రూపాయలు తక్షణం ఇవ్వనున్నట్టు మోడీ చెప్పారు.

దీపావళి సంబరాలు చేసుకునేందుకు ఆ రాష్ట్రానికి వెళ్లిన మోడీ సియాచిన్ను సందర్భించిన అనంతరం శ్రీనగర్ చేరుకున్నారు. రాజ్భవన్లో గురువారం సాయంత్రం మోడీ మీడియాతో మాట్లాడారు. కాశ్మీర్లో వరదల వల్ల భారీ నష్టం వాటిల్లిందని, బాధితులకు సాధ్యమైనంత సాయం చేస్తామని హామీ ఇచ్చారు. మోడీని పలువురు రాజకీయ ప్రముఖులు కలసి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement