ఉల్లాసంగా.. ఉత్సాహంగా
‘స్వచ్ఛ్ భారత్ అభియాన్’లో నిన్న స్మృతి ఇరానీ, నేడు రవిశంకర్ ప్రసాద్
సాక్షి, న్యూఢిల్లీ: ‘స్వచ్ఛ్ భారత్ అభియాన్’ కింద చేపట్టిన పారిశుధ్య కార్యక్రమాల్లో కేంద్ర మంత్రులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ.. ఆర్‌కేపురంలోని కేంద్రీయ విద్యాలయ మైదానంలో గురువారం చెత్త ఎత్తివేయగా, మరో కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ శుక్రవారం శాస్త్రిభవన్‌లో చీపురుపట్టారు. కేంద్ర టెలికం, న్యాయశాఖ మంత్రి శుక్రవారం శాస్త్రిభవన్ కాంపౌండ్‌లో పారిశుధ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. గదులు, బాత్ రూంలలోకి వెళ్లి పారిశుధ్య పరిస్థితిని పరిశీలించారు.
మహాత్మాగాంధీ 150వ జయంతి నాటికి అంటే 2019 అక్టోబర్ రెండో నాటికి దేశాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారని, ఇందులోభాగంగా తమకు ఆదర్శమైన దీన్ దయాళ్ ఉపాధ్యాయ 98వజయంతిని పురస్కరించుకుని పారిశుధ్య కార్యక్రమాన్ని ప్రారంభించామని రవి శంకర్ ప్రసాద్ చెప్పారు. ఈ కార్య్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన్పటికీ స్వచ్ఛ్ భారత్‌ను ప్రజా ఉద్యమంగా మార్చడంలో ఇదొక భాగమని, ఇదే అందుకు ఆరంభమని ఆయన అభిప్రాయపడ్డారు. వచ్చే నెల రెండో తేదీన తాను పాట్నా రైల్వే స్టేషన్‌లో స్వచ్ఛ్ భారత్ అభియాన్‌ను చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు.
రెండున విధులకు ప్రభుత్వోద్యోగులు
ప్రతి ఏడాదీ గాంధీ జయంతి రోజున హాయిగా కుటుంబసభ్యులతో కాలక్షేపం చేస్తున్న ప్రభుత్వోద్యోగులకు ఈసారి ఆ అవకాశమే లేకుండాపోయిం ది. ఇందుకు కారణం అదే రోజున స్వచ్ఛ్ భారత్ అభియాన్’ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిర్ణయించడమే. దీంతో వా రంతా కంగుతిన్నారు. గాంధీ జయంతి, దసరా, బక్రీద్‌లతో పాటు శని, ఆదివారాలను కలుపుకుని వరుసగా ఐదు రోజులు సెలవు దినాలు రావడంతో విహారయాత్రకు వెళ్లేందుకు వీరంతా రూపొందిం చుకున్న ప్రణాళికలు ఈ కార్యక్రమం కారణంగా తలకిందులయ్యాయి.
ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాలతో పాటు కేంద్ర ప్రభత్వ కార్యాలయాలు గాంధీ జయంతి రోజున పనిచేయనున్నాయి. ఉద్యోగులు వచ్చే నెల రెండో తేదీన తమ తమ కార్యాలయాలకు హాజరై ‘స్వచ్ఛ్ భారత్ శపథం’ చేయాల్సి ఉంటుంది. ప్రతి మంత్రిత్వశాఖ పారి శుధ్య కార్యక్రమాన్ని చేపట్టాలని, ఉన్నతాధికారుల నేతృత్వంలో అన్ని ప్రభుత్వ కార్యాయాలలో గురువారం నుంచి వా రం రోజులపాటు పారిశుధ్య కార్యక్రమం చేపట్టాలంటూ కేబినెట్ కార్యదర్శి అజితసేథ్... కేంద్ర ప్ర భుత్వ కార్యదర్శులందరికీ ఆదేశాలు జారీ చేశారు.
యాత్రను రద్దు చేసుకున్నా
అక్టోబర్ రెండు నుంచి వరుసగా ఐదు రోజుల సెల వు దినాలను పురస్కరించుకుని కుటుంబసమేతం గా ఉత్తరాఖండ్‌లోని అల్మోడా పరిసర ప్రాంతాలను సందర్శించాలనుకున్నామని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని విమలా భల్లా చెప్పారు. అయితే రెండున సెల వు లేకపోవడంతోయాత్రను రద్దుచే సుకున్నామని అన్నారు. నవరాత్రుల ఆఖరి రోజుకూడా రెండో తేదీయే కావడంతో నవమి పూజకు ఏర్పాట్లు చేసుకున్నవారు కూడా పునరాలోచనలో పడిపోయారు.