Union Ministers
-
ప్రధానికి రాసిన లేఖలో వాస్తవాల్ని పరిశీలించండి: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: తిరుమల తిరుపతి దేవస్థానాల పవిత్రతను, ప్రతిష్టను కోలుకోలేని విధంగా దెబ్బ తీసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఇవాళ మరింత మంది కేంద్ర మంత్రులను ఆ లేఖకు ట్యాగ్ చేశారు.తాను రాసిన లేఖలోని వాస్తవాల్ని పరిగణనలోకి తీసుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తూ.. ఆయన కేంద్ర మంత్రులను ఎక్స్ ఖాతా ద్వారా కోరారు. శ్రీ వెంకటేశ్వరస్వామికి భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందూ భక్తులు ఉన్నారు. వాళ్లందరి మనోభావాలు దెబ్బ తిన్నాయి. ఈ వ్యవహారాన్ని జాగ్రత్తగా చూడకపోతే పరిస్థితులు దిగజారే ప్రమాదం ఉంది. లేకపోతే చంద్రబాబు చెప్తున్న అబద్ధాలు అందరికీ వ్యాపించి, తీవ్ర వేదనను కలిగిస్తాయని, భవిష్యత్తులో కూడా అనేక పరిణామాలకు దారి తీస్తాయని జగన్ తన లేఖలో రాశారు.Kind Attention: Please take note of the facts presented in this letter addressed to the Honorable Prime Minister Narendra Modi Ji regarding the severe pain caused to the religious sentiments of Hindu devotees https://t.co/TI3vgkaZ0e. @rajnathsingh @AmitShah @nitin_gadkari…— YS Jagan Mohan Reddy (@ysjagan) September 23, 2024ఇంకా ఆ లేఖలో.. ఏపీలో ప్రభుత్వం 100 రోజులు పూర్తైంది. తమ పాలన అద్భుతంగా ఉందంటూ టీడీపీ గొప్పలు చెప్పుకుంటోంది కానీ ప్రజాభిప్రాయం ప్రతికూలంగా ఉంది. ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలను, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో, నిలబెట్టుకోవడంలో కొత్త ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రజల దృష్టిని మరల్చడానికి టీటీడీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పచ్చి అబద్ధాలను ప్రచారం చేశారని జగన్ తన లేఖలో కుట్ర కోణాన్ని ప్రస్తావించారు. ఇదీ చదవండి: చంద్రబాబు స్వార్థ రాజకీయం.. జరగని తప్పుపై 'రాద్ధాంతం' -
బాధ్యతలు చేపట్టిన కేంద్ర మంత్రులు
-
రేపు కేంద్రమంత్రులుగా కిషన్‌రెడ్డి, సంజయ్ బాధ్యతలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్రమంత్రుల బాధ్యతల స్వీకారానికి ముహూర్తాలు ఖరారయ్యాయి. ఈనెల 13న ఉదయం 11 గంటల కు జి.కిషన్‌రెడ్డి కేంద్ర బొగ్గు, గనుల శాఖమంత్రి గా శాస్త్రి భవన్‌లోని ఆ శాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. కేంద్ర హోంశాఖ సహా య మంత్రిగా బండి సంజయ్ నార్త్ బ్లాక్‌లోని తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించనున్నారు.తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్రమంత్రులు సీఎంగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం తర్వాత బాధ్యతలు స్వీకరించే అవకాశముంది. కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రిగా రామ్మోహన్ నాయు డు, కేంద్ర సహాయ మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్ గురువారం లేదా శుక్రవారం, శ్రీనివాస వర్మ శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. -
తెలుగు కేంద్ర మంత్రులపై సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర ట్వీట్
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో మూడోసారి ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణస్వీకారం ఆదివారం అట్టహాసంగా జరిగింది. మోదీతోపాటు 72 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసింది తెలిసిందే. తాజాగా వీరిని ఉద్దేశిస్తూ.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ నుంచి ఎంపికైన కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, బూపతిరాజు శ్రీనివాస వర్మకు రేవంత్ అభినందనలు తెలిపారు. విభజన చట్టంలోని అంశాల అమలు, కేంద్రం నుంచి తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నిధులు, పథకాలు, ప్రాజెక్టుల సాధనకు వీరంతా కృషి చేయాల్సిందిగా కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ట్విటర్లో ట్వీట్ చేశారుతెలుగురాష్ట్రాల నుండి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ జి. కిషన్ రెడ్డి, శ్రీ బండి సంజయ్ కుమార్, శ్రీ కె.రామ్మోహన్ నాయుడు, శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ కు శుభాకాంక్షలు. విభజన చట్టంలోని అంశాల అమలు, కేంద్రం నుండి తెలుగు రాష్ట్రాలకు…— Revanth Reddy (@revanth_anumula) June 10, 2024కాగా మోదీ కేబినెట్లో అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మల సీతారామన్, నితిన్ గడ్కరీ, జైశంకర్ మరోసారి మంత్రులుగా కొనసాగుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి అయిదుగురు మంత్రి పదవులు దక్కాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు, తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్రమంత్రులుగాప్రమాణ స్వీకారం చేశారు.కిషన్‌రెడ్డి, రామ్మోహన్లకు కేబినెట్ పదవులు దక్కగా.. బండి సంజయ్, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మలకు సహాయ బెర్తులు దక్కాయి. మొత్తం 30 కేబినెట్, 5 స్వతంత్ర, 36 మంది సహాయ మంత్రులు మోదీ 3.0 కేబినెట్లో కొలువుదీరారు. 11 బెర్తులతో ఎన్డీఏ భాగస్వాములకు సముచిత ప్రాధాన్యం లభించింది. -
తొలిసారి కేంద్రమంత్రి పదవి చేపట్టిన వారిలో పలువురి విశేషాలు...
‘మామ’కు తొలిసారి కేంద్ర మంత్రి పదవి నాలుగు సార్లు మధ్యప్రదేశ్ సీఎంగా చేసిన బీజేపీ సీనియర్ నేత ‘మామ’ శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు తొలిసారి కేంద్ర మంత్రి పదవి దక్కింది. 1977లో ఆర్ఎస్ఎస్లో వాలంటీర్‌గా చేరి అంచెలంచెలుగా ఎదిగారు. ఆరు సార్లు ఎంపీగా గెలిచారు. సీఎంగా రైతులు, మహిళలు, గ్రామీణ ప్రజల అభివృద్ధికి పెద్దపీట వేశారు. మృదు స్వభావి. నిరాడంబర నాయకుడు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో బీజేపీకి బంపర్ మెజారిటీ సాధించినా సీఎంగా కొనసాగింపు దక్కలేదు. ఆయనను పూర్తిగా పక్కన పెడతారన్న ప్రచారానికి భిన్నంగా కేంద్ర మంత్రి పదవి దక్కడం విశేషం.నడ్డా.. వివాదాలకు దూరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు 63 ఏళ్ల జగత్ ప్రకాశ్ నడ్డా హిమాచల్ ప్రదేశ్ నుంచి కేబినెట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక నాయకుడు. ఏబీవీపీలో చురుగ్గా పనిచేశారు. బీజేపీలో పలు హోదాల్లో పలు రాష్ట్రాల్లో పనిచేశారు. 2012లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. మోదీ తొలి కేబినెట్లో 2014 నుంచి 2019 దాకా ఆరోగ్య మంత్రిగా ఉన్నారు. 2020లో బీజేపీ అధ్యక్షుడయ్యారు. వివాదరహితుడు.మోదీ సన్నిహితుడిగా పదవీ యోగం గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు 69 ఏళ్ల చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్‌కు అనూహ్యంగా కేంద్ర మంత్రి పదవి లభించింది. నాలుగోసారి ఎంపీగా నెగ్గారు. ఈసారి ఏకంగా 7.73 లక్షల మెజారీ్ట సాధించారు. మహారాష్ట్రలో జని్మంచిన పాటిల్ గుజరాత్లో బీజేపీకి సారథ్యం వహించడం విశేషం. కానిస్టేబుల్‌గా చేసిన ఆయన 1989లో బీజేపీలో చేరారు. 1991లో నవగుజరాత్ అనే పత్రికను స్థాపించారు. 1995 నుంచి మోదీతో సాన్నిహిత్యముంది. సామాన్యులకు నిత్యం అందుబాటులో ఉంటారు.బిహార్ దళిత తేజం లోక్‌జనశక్తి పారీ్ట(రామ్‌విలాస్) పార్టీ చీఫ్, దళిత నాయకుడు చిరాగ్ పాశ్వాన్ తన తండ్రి, దివంగత రామ్‌విలాస్ పాశ్వాన్ వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. బిహార్‌లో ఐదుకు ఐదు ఎంపీ స్థానాలూ గెలుచుకున్నారు. 41 ఏళ్ల చిరాగ్ 2011లో ఓ హిందీ సినిమాలో నటించారు. అందులో హీరోయిన్ ఈసారి బీజేపీ తరఫున తొలిసారి ఎంపీగా గెలిచిన బాలీవుడ్ నటి కంగానా రనౌత్ కావడం విశేషం. చిరాగ్కా రోజ్‌గార్ సంస్థ ద్వారా బిహార్ యువతకు ఉపాధి కలి్పంచేందుకు చిరాగ్ కృషి చేస్తున్నారు.యాక్షన్ హీరో మాస్ ఎంట్రీ ప్రముఖ మలయాళ యాక్షన్ హీరో 65 ఏళ్ల సురేశ్ గోపి తన సొంత రాష్ట్ర కేరళలో బీజేపీ తరఫున గెలిచిన తొలి ఎంపీగా చరిత్ర సృష్టించారు. అలా మాస్ ఎంట్రీ ఇచ్చి, అదే ఊపులో కేంద్ర మంత్రి అయ్యారు! ఆయన వామపక్షాలు, కాంగ్రెస్‌కు పట్టున్న త్రిసూర్ లోక్‌సభ స్థానంలో 2019 లోక్‌సబ, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా పట్టు విడవకుండా ఈసారి గెలవడం విశేషం. బీజేపీతో ఆయనకు చాలా ఏళ్లుగా అనుబంధం ఉంది. మోదీ, అమిత్ షాలకు సన్నిహితుడు. 2016లో రాజ్యసభకు నామినేటయ్యారు. ‘మోదీ ఆదేశిస్తారు, నేను పాటిస్తా’ అంటారు సురేశ్ గోపి. బిహార్ ఈబీసీ నేత ప్రముఖ సోషలిస్టు నాయకుడు, భారతరత్న కర్పూరి ఠాకూర్ కుమారుడైన రామ్‌నాథ్ ఠాకూర్ మోదీ మంత్రివర్గంలో చేరారు. జేడీ(యూ) అధినేత, బిహార్ సీఎం నితీశ్ కుమార్‌కు ఆయన సన్నిహితుడు. ప్రముఖ ఈబీసీ నాయకుడిగా ఎదిగారు. 74 ఏళ్ల రామ్‌నాథ్ 2014 ఏప్రిల్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయన తండ్రి కర్పూరి ఠాకూర్ రెండు సార్లు బిహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.ప్రతాప్ జాదవ్64 ఏళ్ల జాదవ్‌కు శివసేన కోటాలో చోటు దక్కింది. నాలుగుసార్లు ఎంపీగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎంపీగా లోక్‌సభలో పలు చర్చల్లో చురుగ్గా పాలుపంచుకున్నారు.ఒకప్పటి చురుకైన విద్యార్థి నేత..సంజయ్ సేథ్ (64) జార్ఖండ్‌కు చెందిన వ్యాపారవేత్త. 1976లో ఏబీవీపీ నేతగా ప్రస్థానం ప్రారంభించి అనేక సమస్యలపై జైలుకూ వెళ్లారు. ఈయనను 2016లో జార్ఖండ్ ప్రభుత్వం ఖాదీ గ్రామోద్యోగ్ బోర్డు చైర్మన్‌గా నియమించడం వివాదానికి దారి తీసింది. 2019లో తొలిసారి రాంచీ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నేత సుబోధ్ కాంత్ సహాయ్ను, తాజా ఎన్నికల్లో ఆయన కుమార్తె యశస్వినిని ఓడించారు!గిరిజన నేత ఉయికెమధ్యప్రదేశ్కు చెందిన గిరిజన నేత దుర్గా దాస్ ఉయికె(58). తాజా ఎన్నికల్లో బెతుల్(ఎస్టీ) నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున వరుసగా రెండోసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే స్కూల్లో ఈయన టీచర్‌గా పనిచేసేవారు. 2019లో బీజేపీలో చేరి మొదటిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన రాము టెకంపై 3.79 లక్షల మెజారిటీతో విజయం సాధించారు. కుల సమీకరణాల ఆధారంగానే తాజాగా కేంద్రంలో సహాయ మంత్రి పదవి ఈయన్ను వరించిందని భావిస్తున్నారు. రెండుసార్లు సీఎం.. నేడు కేంద్ర మంత్రిమాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవెగౌడ కుమారుడు కుమారస్వామి (64). ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బీజేపీ, కాంగ్రెస్‌లతో వేర్వేరుగా జట్టుకట్టి రెండుసార్లు కర్నాటక సీఎంగా చేశారు. జేడీఎస్ అధ్యక్షుడు. కర్ణాటకలోని పలుకుబడి గత వొక్కలిగ వర్గానికి చెందిన నేత. సినిమాలంటే తెగపిచ్చి. అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చానని చెబుతుంటారు!వీరేంద్ర కుమార్మధ్యప్రదేశ్లో షెడ్యూల్డ్ కులానికి చెందిన బీజేపీ సీనియర్ నేత వీరేంద్ర కుమార్(70). ఎనిమిదిసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. చిన్నతనంలో తండ్రి నడిపే సైకిల్ షాపులో పంక్చర్లు వేశారు. అంచెలంచెలుగా ఎదిగి బాల కార్మికుల వెతలే అంశంగా పీహెచ్డీ చేయడం విశేషం. 2017లో మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అయ్యారు. ఎమర్జెన్సీ సమయంలో 16 నెలలపాటు జైలు శిక్ష అనుభవించారు. ఇప్పటికీ సొంతూళ్లో స్కూటర్‌పై తిరుగుతూ సైకిల్ రిపేర్ దుకాణదారులతో ముచ్చటిస్తుంటారు.మాంఝీకి దక్కిన ఫలితంబిహార్ రాజకీయాల్లో సుపరిచితుడు జితన్ రాం మాంఝీ(80). మాజీ సీఎం. హిందుస్తానీ ఆవామ్ మోర్చా(సెక్యులర్) వ్యవస్థాపకుడు. 2014 నితీశ్ కుమార్ వైదొలగడంతో సీఎం అయినా ఆయనతో విభేదాలతో కొద్దినెలలకే తప్పుకుని సొంత పార్టీ పెట్టారు. కాంగ్రెస్‌తో మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం జనతాదళ్, ఆర్జేడీ, జేడీయూల్లో సాగింది.టంటా.. ఉత్తరాఖండ్ సీనియర్ నేతఉత్తరాఖండ్కు చెందిన సీనియర్ బీజేపీ ఎంపీ అజయ్ టంటా(51). అల్మోరా నుంచి వరుసగా మూడుసార్లు ఎన్నికయ్యారు. అంతకుపూర్వం, 2009లో తన చిరకాల ప్రత్యర్థి కాంగ్రెస్ నేత ప్రదీప్ టంటా చేతిలో ఓటమి చవిచూశారు. ఆ తర్వాత 2014, 2019, 2024 ఎన్నికల్లో ప్రదీప్‌పై వరుస విజయాలు సాధించడం గమనార్హం. 2014లో టెక్స్టైల్స్ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2007, 2012 ఎన్నికల్లో రెండుసార్లు రాష్ట్ర శాసనసభకు సైతం ఎన్నికయ్యారు. 2007లో రాష్ట్రమంత్రిగా ఉన్నారు. 23 ఏళ్లకే రాజకీయాల్లోకి ప్రవేశించి పంచాయతీ స్థాయిలో చురుగ్గా అనేక ఏళ్లపాటు పనిచేశారు. వివాదరహితుడిగా, స్వచ్ఛమైన నేతగా పేరుంది.ఖట్టర్.. ప్రచారక్ నుంచి కేంద్ర మంత్రి 1977లో ఆర్ఎస్ఎస్ శాశ్వత సభ్యుడిగా మారిన మనోహర్ లాల్ ఖట్టర్(70)కు ఆ సంస్థతో దాదాపు 40 ఏళ్ల అనుబంధం ఉంది. బ్రహ్మచారి. మోదీకి సన్నిహితునిగా పేరుంది. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఈయన 2014లో హరియాణా సీఎం అయ్యారు. పదేళ్ల అనంతరం గత మార్చిలో నాయబ్ సింగ్ సైనీకి బాధ్యతలు అప్పగించారు. దేశ విభజన సమయంలో పాకిస్తాన్ నుంచి ఈయన కుటుంబం వలస వచ్చి 1954లో హరియాణాలోని రొహ్తక్ జిల్లా నిందానలో స్థిరపడింది.ఓరం.. ఒడిశా గిరిజన నేత63 ఏళ్ల జువల్ ఓరమ్ఒడిశాలో గిరిజన నేతగా ఎంతో పేరుంది. వాజ్‌పేయీ కేబినెట్లో గిరిజన సంక్షేమ శాఖకు తొలి మంత్రిగా చరిత్ర నెలకొల్పారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఆరుసార్లు ఎంపీగా గెలిచారు. మూడుసార్లు ఒడిశా బీజేపీ చీఫ్‌గా చేశారు.రాజీవ్ రతన్ సింగ్ ‘లలన్’లలన్ సింగ్‌గా సుపరిచితుడు. 69 ఏళ్ల ఈ నేత బిహార్‌లో పలుకుబడి కలిగిన భూమిహార్ వర్గానికి చెందిన నేత. నితీశ్ కుమార్‌కు అత్యంత సన్నిహితుడు. 2009, 2019, 2024 ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైనప్పటికీ రాజ్యసభకు నితీశ్ కుమార్ ఈయన్ను జేడీయూ తరఫున నామినేట్ చేశారు.జిల్లా పంచాయతీ సభ్యురాలి నుంచి కేంద్రమంత్రిగాఇటీవలి ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లోని ధార్ లోక్‌సభ నియోజకవర్గం(ఎస్టీ)నుంచి సావిత్రీ ఠాకూర్(46) ఎన్నికయ్యారు. 2003లో మొదటిసారిగా జిల్లా పంచాయతీ సభ్యురాలిగా ఈమె రాజకీయ ప్రస్థానం మొదలైంది. పార్టీలో వివిధ పదవులను రాష్ట్రం, జాతీయ స్థాయిలో నిర్వహించిన సావిత్రీ ఠాకూర్ మధ్యప్రదేశ్‌లో ప్రముఖ గిరిజన మహిళా నేతగా ఎదిగారు. 2014లో మొదటిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2019లో బీజేపీ ఆమెకు టిక్కెటివ్వలేదు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ నేత రాధేశ్యామ్ మువెల్పై 2.18లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు. రెండుసార్లు భావ్‌నగర్ మేయర్..తాజా లోక్‌సభకు గుజరాత్ నుంచి ఎన్నికైన ముగ్గురు మహిళల్లో నిముబెన్ బంభానియా(57) ఒకరు. భావ్‌నగర్ నుంచి ఆప్ అభ్యర్థి ఉమేశ్ మక్వానాపై 4.55 లక్షల భారీ మెజారిటీతో ఈమె విజయం సాధించారు. 2009–10, 2015–18 సంవత్సరాల్లో భావ్‌నగర్ మేయర్‌గా రెండు సార్లు పనిచేశారు. బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలిగా 2013 నుంచి 2021 వరకు బాధ్యతల్లో ఉన్నారు. కోలి వర్గానికి చెందిన మాజీ ఉపాధ్యాయిని అయిన నిముబెన్ 2004లో బీజేపీ కండువా కప్పుకున్నారు. అదే ఏడాదిలో స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొంది రాజకీయ జీవితం ప్రారంభించారు.సినీ నిర్మాత.. రాజకీయ నేతరెండు సాంస్కృతిక మేగజీన్లకు ఎడిటర్‌గా ఉన్న పబిత్రా మర్ఘెరిటా(49)..అస్సామీస్ ఫీచర్, షార్ట్ ఫిల్మ్‌లను నిర్మించారు. జున్బాయ్ సిరీస్‌తో తీసిన తక్కువ నిడివి కలిగిన చిత్రాలకు ఎంతో పేరు వచ్చింది. ఈయన నటించిన ఫీచర్ ఫిల్మ్ ‘మొన్ జాయ్’ పలువురి ప్రశంసలు అందుకుంది. ప్రముఖ అస్సామీ నటి గాయత్రి మహంతాను పెళ్లి చేసుకున్నారు. 2014లో బీజేపీలో చేరి రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2022 మార్చిలో రాజ్యసభకు ఎన్నికయ్యారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
తొలి దశలో దిగ్గజాల పోరు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రులుగా, ఏకంగా ముఖ్యమంత్రులుగా పదవీ బాధ్యతలు మోసి దిగపోయిన నేతలు మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఒక మాజీ గవర్నర్‌సహా 8 మంది కేంద్ర మంత్రలు, ఇద్దరు సీఎంలు రేపు జరగబోయే లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోరులో పోటీపడుతున్నారు. రేపు పోలింగ్ జరగబోయే 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు ప్రచారం బుధవారంతో ముగిసింది. తమ తమ నియోజకవర్గాల్లో గట్టిపోటీ ఎదురవుతున్నాసరే పక్కా వ్యూహరచనతో ముందడుగు వేస్తున్నారు. నితిన్ గడ్కరీ మహారాష్ట్రలోని నాగ్ పూర్ నియోజకవర్గంలో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్దమైన బీజేపీ నేత నితిన్ గడ్కరీ తన గెలుపుపై ధీమాగా ఉన్నారు. 2014లో ఏడుసార్లు ఎంపీగా గెలిచిన విలాస్ ముట్టెంవార్‌పై 2.84 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించి గడ్కరీ తన సత్తా ఏమిటో అందరికీ తెలిసేలా చేశారు. ప్రస్తుత మహారాష్ట్ర కాంగ్రెస్ సారథి నానా పటోలేను 2019లో ఇదే నాగ్‌పూర్‌లో 2.16 లక్షల మెజారిటీతో మట్టికరిపించి తనకు ఎదురులేదని గడ్కరీ నిరూపించారు. అయితే ఇటీవల స్థానికంగా బాగా పట్టు సాధించిన కాంగ్రెస్ నేత వికాస్ థాకరే(57) గడ్కరీకి గట్టి సవాలు విసురుతున్నారు. నాగ్‌పూర్ వెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న థాకరే కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు. ప్రకాశ్ అంబేద్కర్‌కు చెందిన వంచిత్ బహుజన్ అఘాడి పార్టీ సైతం థాకరేకి మద్దతు పలికింది. కాంగ్రెస్‌లో అన్ని వర్గాలు ఒక్కటై థాకరే విజయం కోసం పనిచేస్తుండడంతో గడ్కరీ అప్రమ్తత మయ్యారు. కాంగ్రెస్ నేతలు నిరుద్యోగం, స్థానిక సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ఓటర్లకు దగ్గర అవుతున్నారు. దీంతో గడ్కరీ ఆయన సతీమణి, కుమారుడు, కోడలు సైతం నిప్పులు కక్కే ఎండల్లో విరివిగా ప్రచారం చేశారు. కిరెన్ రిజిజు: 2004 నుంచి అరుణాచల్ ప్రదేశ్ నుంచి మూడు సార్లు ఎంపీగా గెలిచిన బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు నాలుగోసారి సార్వత్రిక సమరంలో దూకారు. 52 ఏళ్ల రిజిజుకు ఈసారి నబాం టుకీ రూపంలో గట్టి ప్రత్యర్థి ఎదురయ్యారు. టుకీ అరుణాచల్ మాజీ ముఖ్యమంత్రి మాత్రమే కాదు ప్రస్తుతం ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా. టుకీకి కరిష్మా తక్కువేం లేదు. దీంతో ఆసక్తి సర్వత్రా నెలకొంది. సర్బానంద సోనోవాల్: నౌకాశ్రయాలు, షిప్పింగ్, నదీజలాల రవాణా మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సోనోవాల్ సైతం ఈసారి అస్సాంలోని దిబ్రూగఢ్ నుంచి బరిలో దిగారు. రాజ్యసభ సభ్యుడైన సోనోవాల్ ఈసారి లోక్‌సభలో తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ సహాయమంత్రి రామేశ్వర్ తేలికి బీజేపీ ఈసారి టికెట్ నిరాకరించి సోనోవాల్‌ను నిలబెట్టింది. సంజీవ్ భలియా: ఉత్తరప్రదేశ్‌లో కులరాజ కీయాలకు పేరొందిన ముజఫర్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంజీవ్ భలియా పోటీకి నిలబడ్డారు. ఈయనకు సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి హరీంద్ర మాలిక్, బహుజన్‌సమాజ్ పార్టీ అభ్యర్థి దారాసింగ్ ప్రజాపతి నుంచి గట్టిపోటీ ఉంది. ఈ త్రిముఖపోరులో గెలుపు ఎవరిని వరిస్తుందో. జితేంద్ర సింగ్: జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. మోదీ హయాంలో సహాయ మంత్రిగా సేవలందించారు. హ్యాట్రిక్ కొట్టాలని లక్ష్యంగా పెట్టుకుని తెగ ప్రచారం చేశారు. భూపేంద్ర యాదవ్: రాజ్యసభ సభ్యుడైన భూపేంద్ర మోదీ మంత్రివర్గంలో పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా సేవలందిస్తున్నారు. రాజస్థాన్‌లోని అల్వార్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. బీజేపీ సిట్టింగ్ ఎంపీ బాలక్ నాథ్‌ను పక్కనబెట్టిమరీ పార్టీ ఈయనకు టికెట్ ఇచ్చింది. జిల్లాలో సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే లలిత్ యాదవ్ ఈయనకు గట్టిపోటీ ఇస్తున్నారు. జిల్లాలోని మత్స్య ప్రాంతంలో యాదవుల మద్దతు ఇద్దరికీ ఉండటంతో ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అర్జున్‌రాం మేఘ్వాల్: రాజస్థాన్‌లోని బికనీర్ నుంచి తలపడుతున్న కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్తో మాజీ కాంగ్రెస్ మంత్రి గోవింద్ రామ్ మేఘ్వాల్ తలపడుతున్నారు. ఎల్.మురుగన్: తమిళనాడులోని నీలగిరి నియోజకవర్గంలో కేంద్ర మంత్రి, బీజేపీ నేత ఎల్.మురుగన్ తన అదృష్టం పరీక్షించుకోనున్నారు. ఇక్కడ డీఎంకే సిట్టింగ్ ఎంపీ, మాజీ కేంద్ర టెలికం మంత్రి ఏ.రాజా నుంచి మురుగన్‌కు గట్టి పోటీ ఎదురవుతోంది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన మురుగన్ తొలిసారిగా నీలిగిరి నుంచి నిలబడ్డారు. తమిళిసై సౌందరరాజన్: తెలంగాణ గవర్నర్‌గా పనిచేసి రాజీనామా చేసి మళ్లీ రాజకీయరంగప్రవేశం చేసిన తమిళనాడు బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ చెన్నై సౌత్ స్థానం నుంచి పోటీచేస్తున్నారు. గతంలో తూత్తుకుడి నుంచి తమిళిసై పోటీచేసి డీఎంకే నాయకురాలు కనిమొళి చేతిలో ఓటమిని చవిచూశారు. బిప్లవ్‌కుమార్ దేవ్: త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేవ్ ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. వెస్ట్ త్రిపురలో బిప్లవ్ దేవ్‌కు పోటీగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఆశిశ్ కుమార్ సాహా నిలబడ్డారు. ఇద్దరికీ ఈ నియోజకవర్గంపై గట్టిపట్టుంది. దీంతో ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టంగా మారింది. -
రాజ్‌నాథ్‌తో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ భేటీ
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి బృందం పర్యటన ముగిసింది. ఏఐసీసీ నిర్వహించిన లోక్‌సభ ఎన్నికల సన్నాహక భేటీలో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన రేవంత్, ఉత్తమ్.. నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరీ, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌లతో విడివిడిగా భేటీ అయ్యారు. ఈ రోజు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌తో సమావేశమయ్యారు. రక్షణ శాఖ భూములు, కంటోన్మెంట్ సమస్యలపై చర్చించారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. సుమారు గంట పాటు సమావేశం కొనసాగింది. కేంద్ర నుంచి బీఆర్జీఎఫ్ కింద రావలసిన రూ.1800 కోట్ల రూపాయల బకాయిలు ఇవ్వాలని వినతించారు. 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం తీవ్రమైన అప్పుల ఊబిలో కూరుకుపోయిన విషయాన్ని ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకువచ్చిన సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్.. రాష్ట్రానికి తగిన ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇదీ చదవండి: Volunteer Jobs: ఏపీ బాటలో తెలంగాణ! -
నేడే ప్రజాస్వామ్య సౌధం ప్రారంభం
న్యూఢిల్లీ: దేశ ప్రజలందరికీ గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా అభివర్ణించిన పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ప్రజాస్వామ్య సౌధాన్ని ఆదివారం ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభించనున్నారు. షెడ్యూల్ ప్రకారం తెల్లవారుజాము నుంచే యాగం, పూజలు, ప్రార్థనలతో ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టనున్నారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు, వివిధ పార్టీల నేతలు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రముఖు లు హాజరవుతారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ఆహ్వానించనందుకు నిరసనగా పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవాన్ని తాము బహిష్కరిస్తున్నట్లు 20 విపక్ష పార్టీలు ఇప్పటికే ప్రకటించారు. ఇదిలా ఉండగా, 25 పార్టీల నాయకులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ప్రజాస్వామ్య దేవాలయాన్ని నిర్మించుకోవడానికి దేశ ప్రజలంతా ఒక్కటై, చేతులు కలపిన తీరు అసలు సిసలైన ‘ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్’ స్ఫూర్తిని ప్రతిబింబిస్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవం నేపథ్యంలో లుటెన్స్ ఢిల్లీ ప్రాంతంలో అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పార్లమెంట్ చుట్టుపక్కల ఏరియాలను పోలీసుల తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అదనపు బలగాలను మోహరించారు. సీసీటీవీ కెమెరాల ద్వారా నిఘా కొనసాగిస్తున్నారు. సెంట్రల్ ఢిల్లీలో ప్రత్యేకంగా పికెట్లు ఏర్పాటు చేశారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌తో కొత్త భవనం వద్ద ధర్నా చేస్తామని మహిళా రెజ్లర్లు ప్రకటించగా, అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. అధీనం మఠం పెద్దలతో మోదీ భేటీ ప్రధాని మోదీ శనివారం తన నివాసంలో అధీనం మఠం పెద్దలతో సమావేశమయ్యారు. వారు ఆయనకు ఆశీస్సులు అందించారు. సెంగోల్తోపాటు కొన్ని బహుమతులు అందజేశారు. అనంతరం మోదీ వారిని సత్కరించారు. పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంలో పాల్గొనడానికి అధీనం మఠం పెద్దలు, ప్రతినిధులు తమిళనాడు నుంచి శనివారం ఉదయమే ఢిల్లీకి చేరుకున్నారు. ప్రతి శకంలో భారత జాతీయవాదానికి తమిళనాడు కేంద్రంగా నిలిచిందని ప్రధాని మోదీ తెలిపారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో తమిళనాడు ప్రజల భాగస్వామ్యానికి తగిన గుర్తింపు దక్కకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సెంగోల్‌కు గౌరవం దక్కాల్సి ఉండగా, దాన్నొక ‘వాకింగ్ స్టిక్’గా ప్రయాగ్‌రాజ్‌లోని ఆనంద్ భవన్లో మూలన పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మన ప్రభుత్వం దాన్ని ఆనంద్ భవన్ నుంచి బయటకు తీసుకువచ్చిందన్నారు. దేశ మహోన్నత సంప్రదాయానికి ప్రతీక అయిన సెంగోల్‌ను పార్లమెంట్ నూతన భవనంలో ప్రతిష్టిస్తుండడం సంతోషకరమని ప్రధాని మోదీ చెప్పారు. హాజరయ్యే పార్టీలు, ఉభయ సభల్లో వాటి ఎంపీల సంఖ్య ఎన్డీయే పార్టీలు 1. బీజేపీ (394) 2. శివసేన (15) 3. నేషనలిస్టు పీపుల్స్ పార్టీ – మేఘాలయా(2) 4. నేషనలిస్టు డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ(1) 5. సిక్కిం క్రాంతికారీ మోర్చా(1) 6. జననాయక్ జనతా పార్టీ 7. ఏఐఏడీఎంకే(5) 8. ఐఎంకేఎంకే 9. ఏజేఎస్‌యూ(1) 10. ఆర్పీఐ–అథవాలే(1) 11. మిజో నేషనల్ ఫ్రంట్(2) 12. తమిళ మానిల కాంగ్రెస్(1) 13. ఐటీఎఫ్‌టీ–త్రిపుర 14. బోడో పీపుల్స్ పార్టీ 15. పీఎంకే(1) 16. మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ 17. ఆప్నా దళ్(2) 18. అస్సాం గణపరిషత్ (1) నాన్–ఎన్డీయే పార్టీలు 1. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (31) 2. తెలుగుదేశం పార్టీ(4) 3. లోక్ జనశక్తి పార్టీ– రామ్ విలాస్ పాశ్వాన్(1) 4. బిజూ జనతాదళ్(21) 5. బీఎస్పీ(10) గైర్హాజరయ్యే పార్టీలు 1. కాంగ్రెస్ (81) 2. డీఎంకే (34) 3. శివసేన–యూబీటీ(7) 4. ఆమ్ ఆద్మీ పార్టీ (11) 5. సమాజ్‌వాదీ పార్టీ (6) 6. సీపీఐ (4) 7. జేఎంఎం (2) 8. కేరళ కాంగ్రెస్–మణి(2) 9. విడుదలై చిరుతైగళ్ కట్చీ(1) 10. రాష్ట్రీయ లోక్‌దళ్ (1) 11. తృణమూల్ కాంగ్రెస్ (35) 12. జేడీ–యూ (21) 13. ఎన్సీపీ (9) 14. సీపీఎం (8) 15. ఆర్జేడీ (6) 16. ఐయూఎంఎల్ (4) 17. నేషనల్ కాన్ఫరెన్స్ (3) 18. ఆర్ఎస్పీ (1) 19. ఎండీఎంకే (1) 20. ఎంఐఎం (2) -
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై దుమారం... దద్దరిల్లిన పార్లమెంట్
న్యూఢిల్లీ: భారత్‌లో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల యూకేలో చేసిన వ్యాఖ్యల పట్ల సోమవారం పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. రాహుల్ వెంటనే క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రులు డిమాండ్ చేయగా, గౌతమ్ అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాల్సిందేనని కాంగ్రెస్ పునరుద్ఘాటించింది. ఇరు పక్షాల నడుమ వాగ్వాదాలతో ఉభయ సభలు స్తంభించాయి. నినాదాలు, అరుపులు కేకలతో హోరెత్తిపోయాయి. ఎలాంటి కార్యకలాపాలు జరక్కుండానే లోక్‌సభ, రాజ్యసభ మంగళవారానికి వాయిదా పడ్డాయి. రాహుల్‌కు కొంతైనా సిగ్గుంటే.. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం పునఃప్రారంభమయ్యాయి. ఇటీవల మరణించిన మాజీ సభ్యులకు లోక్‌సభలో సంతాపం ప్రకటించారు. అనంతరం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. భారత ప్రజాస్వామ్యంపై ఇష్టానుసారంగా నోరుపారేసుకున్నారని, లండన్‌లో మన దేశ ప్రతిష్టను, గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించారని దుయ్యబట్టారు. విదేశీ శక్తులే భారత్‌ను కాపాడాలంటూ రాహుల్ మాట్లాడడం ఏమిటని నిలదీశారు. రాహుల్ వ్యాఖ్యలను లోక్‌సభ మొత్తం ఖండించాలని, ఈ దిశగా చొరవ తీసుకోవాలని స్పీకర్ ఓం బిర్లాకు విజ్ఞప్తి చేశారు. రాహుల్‌ను సభకు రప్పించి, క్షమాపణ చెప్పించాలని అన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీకి కొంతైనా సిగ్గుంటే సభకు వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ.. మన దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ బలంగా ఉందని, రోజురోజుకూ బలోపేతం అవుతోందని వెల్లడించారు. సభ సజావుగా సాగేలా సభ్యులంతా సహకరించాలని సూచించారు. నినాదాలు ఆపాలని కోరారు. మన ప్రజాస్వామ్యంపై ప్రజలకు గొప్ప విశ్వాసం ఉందన్నారు. సభను మరుసటి రోజుకు వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. రాజ్యసభలో అదే రగడ రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై రాజ్యసభలోనూ అధికార, విపక్ష సభ్యుల మధ్య రగడ జరిగింది. ఎవరూ శాంతించకపోవడంతో చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ సభను మంగళవారానికి వాయిదా వేశారు. రాజ్యసభలో కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ మాట్లాడారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను రాజ్యసభ ఖండించాలని డిమాండ్ చేశారు. పీయూష్ గోయల్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని ఖర్గే కోరారు. రాహుల్‌పై దేశద్రోహం కేసు పెట్టాలి కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మీడియాతో మా ట్లాడారు. తుక్డే–తుక్డే గ్యాంగ్ తరహాలో మాట్లాడిన రాహుల్‌పై చర్యలు తీసుకోవాలన్నా రు. ఆయనపై దేశ ద్రోహం కేసు నమోదు చేయా లని డిమాండ్ చేశారు. భారత ప్రజాస్వామ్యాన్ని రాహుల్ కించపర్చారని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ఆక్షేపించారు. పార్లమెంట్‌కు రాహుల్ క్షమాపణ చెప్పాలన్నారు. -
Global Investors Summit:గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు ఘనంగా ఏర్పాట్లు
విశాఖపట్నంలో నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కి వచ్చే అతిథులకు ఎటువంటి లోటుపాట్లు తలెత్తకుండా ఏపీ ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. కేంద్ర మంత్రులు, పారిశ్రామిక దిగ్గజాల కోసం హెలికాప్టర్లు, లగ్జరీ కార్లను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. వీవీఐపీలు, వీఐపీల కోసం నగరంలోని ప్రముఖ హోటళ్లలో దాదాపు 800 గదులని సిద్దం చేశారు. జీఐఎస్ కి వచ్చే దేశ విదేశీ ప్రతినిధులు సంఖ్య పెరుగుతుండగా వాహనాలు, వసతులకు డిమాండ్ ఏర్పడింది. సాక్షి, విశాఖపట్నం: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పారిశ్రామిక వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ఏపీలో సుధీర్ఘమైన తీరప్రాంతం, విస్తృతమైన వనరులు దేశంలో ఎక్కడా లేని విధంగా 70శాతం మానవ వనరులు, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ పాలసీలు కారణంగా పెట్టుబడులు పెట్టేందుకు దేశీయ దిగ్గజ కంపెనీలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. ఇప్పటికే ఉన్న ప్రాజెక్టుల విస్తరణ, నూతన పరిశ్రమల ఏర్పాటుకు సంసిద్ధం అవుతున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యమంత్రి సమక్షంలో విశాఖ వేదికగా జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు కీలక ఎంవోయూలకు వేదికగా నిలవబోతోంది. ఈ సమ్మిట్‌కి 35 మంది టాప్ ఇండస్ట్రీయలిస్టులు... 25 దేశాలకు చెందిన వ్యాపార ప్రతినిధులు, హైకమిషనర్లు తరలిరానున్నారు. రెండు రోజుల సమ్మిట్ కోసంఇప్పటికే 12,000కుపైగా రిజిస్ట్రేషన్స్ జరిగాయంటే స్పందన ఏ స్ధాయిలో ఉందో అర్ధంచేసుకోవచ్చు. దీంతో అతిథుల కోసం ఏర్పాటు చేసిన వసతి, రవాణా సౌకర్యాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సమ్మిట్‌లో పాల్గొవడానికి అంబానీ, అదానీ, మిట్టల్, బజాజ్, ఆదిత్య బిర్లా, జీఎంఆర్ తదితర పారిశ్రామిక దిగ్గజాలు 16 ప్రత్యేక విమానాల్లో విశాఖ వస్తున్నారు. అలాగే కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి తదితరులు వస్తున్నారు. కేంద్ర మంత్రులని ఎయిర్ పోర్టు నుంచి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరుగుతున్న ఆంధ్రా యూనివర్శిటీ గ్రౌండ్స్ తీసుకుని రావడం కోసం రెండు హెలికాప్టర్లు సిద్ధం చేశారు. అలాగే ముఖేష్ అంబానీ, నవీన్ జిందాల్, మిట్టల్,అదానీ వంటి పారిశ్రామిక వేత్తలను దృష్టిలో ఉంచుకొని ఖరీదైన లగ్జరీ కార్లను రప్పిస్తోంది. ప్రముఖ పారిశ్రామికవేత్తల కోసం దాదాపు 30కి పైగా బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ వంటి ఖరీదైన వాహనాలను అధికారులు సిద్దం చేశారు. అలాగే 25 దేశాలకి చెందిన సుమారు 50 మంది విదేశీ ప్రతినిధులు, హై కమిషనర్ల కోసం కూడా లగ్జరీ కార్లు రెంట్‌కు తీసుకుంటున్నారు. మొత్తంగా దాదాపు 800 మందికి పైగా విఐపీలు వస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం దాదాపు 800 వాహనాలని విశాఖ జిల్లా యంత్రాంగం అందుబాటులో ఉంచుతోంది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కి వచ్చే వీవీఐపీలకి ప్రొటోకాల్ ప్రకారం భధ్రత కల్పించడంతో పాటు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేశామని విశాఖ కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున తెలిపారు. విశాఖలో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రెండు రోజుల పాటే జరగనున్నప్పటికీ నగరంలోని అన్ని ప్రముఖ హోటళ్లలో గదులు 6వ తేదీ వరకు ఫుల్ అయ్యాయి. జీఐఎస్ సదస్సుకి వచ్చే వీవీఐపీలు, వీఐపీల కోసం దాదాపు 800 పైగా గదులని అధికారులు సిద్దం చేశారు. కేంద్ర మంత్రులు పారిశ్రామిక దిగ్గజాలు, విదేశీ ప్రతినిధులు, డిప్యూటీ హైకమిషనర్లకి రాడిసన్ , నోవాటెల్, పార్క్ లాంటి స్టార్ హోటళ్లలో గదులు సిద్దం చేశారు. ఈ సమ్మిట్‌కి దాదాపు 15 వేల మంది ప్రతినిధులు వస్తుండగా దీనికి బందోబస్తు కోసం దాదాపు ఆరేడు వేల మంది పోలీసులు వస్తుండటంతో వైజాగ్ లో హోటళ్లు మొత్తం ఫుల్ అయిపోయాయి. స్టార్ రేటింగ్స్ ఉన్న హోటళ్లలో సుమారు 1500 రూములు బుక్కయ్యాయి. ఇక వచ్చే అతిథలకి లోటుపాట్లు రాకుండా జిల్లా యంత్రాంగం 12 బృందాలని నియమించింది. విశాఖ ఎయిర్ పోర్టులో దిగిన దగ్గర నుంచి వారిని హోటల్స్‌కి చేర్చడం, అక్కడ నుంచి సమ్మిట్ జరిగే ప్రాంతానికి చేరవేయడం...తిరిగి ఎయిర్ పోర్టుకి తీసుకెళ్లే వరకు పలు విభాగాల ఉద్యోగులకి బాధ్యతలు అప్పగించారు. విశాఖ ఎయిర్ పోర్టులో, హోటళ్ల వద్ద, సమ్మిట్ వద్ద కూడా హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశారు. మరోవైపు సమ్మిట్ కోసం వచ్చే ప్రతినిధుల సంఖ్య అంచనాలకు మించి పోతోందని రిజిస్ట్రేషన్లను బట్టి అర్థం అవుతోంది. దీంతో వచ్చే అతిథులకు రవాణా, వసతి సౌకార్యాల్లో ఎటువంటి లోపం రాకూడదని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులకి ఆదేశాలిచ్చింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: సీఎం జగన్ ఇంటర్వ్యూ: వనరులు పుష్కలం.. అవకాశాలు అపారం -
‘మాకొక వందే భారత్ కావలెను’
ఢిల్లీ: వందేభారత్ రైళ్లకు అక్కడ ఫుల్ గిరాకీ ఉంటోంది. ప్రయాణికులతో అనుకునేరు. మా రూట్లలో ఆ రైలు నడపండి మహాప్రభో అంటూ కేంద్రానికి విజ్ఞప్తులు చేస్తున్నారు పలువురు ఎంపీలు. వాళ్లలో కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు సైతం ఉండడం గమనార్హం. గరిష్టంగా 160 కిలోమీటర్ల వేగంతో.. భారత్‌లో సెమీ హైస్పీడ్ రైల్‌గా వందే భారత్ పేరొందింది. టికెట్ ధర ఎక్కువే అయినా.. ఫ్లైట్‌లో ఉండేలా అత్యాధునిక వసతులు, త్వరగతిన గమ్యస్థానానికి చేర్చుతుండడంతో వందే భారత్ రైళ్లను తమ నియోజకవర్గాల్లోని ప్రజలు కోరుకుంటున్నారని చెబుతూ ఎంపీలు.. కేంద్ర రైల్వేశాఖకు విజ్ఞప్తి చేస్తున్నారు. పార్లమెంట్ నుంచి దాదాపు 60 మంది ఎంపీలు.. వందే భారత్ రైళ్లను తమ రూట్లలో నడపాలంటూ కేంద్ర రైల్వే శాఖకు విజ్ఞప్తి చేశారు. వందే భారత్ 2.0 సూపర్ సక్సెస్ అయ్యింటూ లేఖలో పేర్కొన్నారు వాళ్లు. వీళ్లలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఉన్నారు. అలాగే పలువురు బీజేపీ ఎంపీలతో పాటు విపక్షాల నుంచి 14 మంది ఎంపీలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ కూడా రైల్వేస్‌కు విజ్ఞప్తి చేసినవాళ్లలో ఉన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పది వందే భారత్ రైళ్లు వివిధ రూట్లలో ప్రయాణిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల నడుమ సికింద్రాబాద్-విశాఖపట్నం నడుమ వందే భారత్ రైలు నడుస్తోంది. -
Pre-Budget 2023: శుక్రవారం ప్రధాని ప్రీ బడ్జెట్ భేటీ!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం ఆర్థివేత్తలు, వివిధ రంగాల నిపుణులతో ప్రీ బడ్జెట్ సమావేశం నిర్వహించనున్నారు. నీతి ఆయోగ్‌లో జరగనున్న ఈ భేటీలో దేశ ఆర్థిక వ్యవస్థ, వృద్ధి పురోగతికి తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలపై ప్రధాని చర్చించనున్నారని సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. పలువురు కేంద్ర మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నట్లు సమాచారం. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన 2023–24 వార్షిక బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెడతారని భావిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) భారత్ ఎకానమీ వృద్ధి రేటు 6.5–7.0 శ్రేణిలో నమోదవుతుందని అంచనా. -
NITI Aayog governing council: జీఎస్టీ వసూళ్లు పెరగాలి
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో భారత్ స్వయంసమృద్ధంగా మారడంతో పాటు ప్రపంచ సారథిగా ఎదగాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఇందుకు సాగు, పశుపోషణ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలను ఆధునీకరించాల్సిన అవసరముందన్నారు. దిగుమతులను బాగా తగ్గించుకుని ఎగుమతులను ఇతోధికంగా పెంచుకోవాలని ఆకాంక్షించారు. ఇందుకోసం ట్రేడ్ (వాణిజ్యం), టూరిజం (పర్యాటకం), టెక్నాలజీ అనే మూడు ‘టి’లపై మరింతగా దృష్టి సారించాల్సిందిగా రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. నీతి ఆయోగ్ పాలక మండలి ఏడో సమావేశం ఆదివారం ఢిల్లీలో మోదీ సారథ్యంలో జరిగింది. 23 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు తదితరులు భేటీలో పాల్గొన్నారు. గత రెండేళ్లలో ఇది నీతి ఆయోగ్ తొలి భౌతిక సమావేశం. కరోనా కారణంగా 2021లో భేటీ వర్చువల్‌గా జరిగింది. 4 కీలకాంశాలను పాలక మండలి లోతుగా చర్చించింది. పంట వైవిధ్యం, తృణధాన్యాలు, నూనె గింజలు తదితర వ్యవసాయ దిగుబడుల్లో స్వయంసమృద్ధి, పాఠశాల, ఉన్నత విద్యలో జాతీయ విద్యా విధానం అమలు, పట్టణ పాలన విషయంలో చేపట్టాల్సిన చర్యలపై సభ్యులంతా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. నీతి ఆయోగ్ భేటీని బాయ్‌కాట్ చేస్తున్నట్టు ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు కరోనా నుంచి కోలుకుంటున్న బిహార్ సీఎం నితీశ్‌కుమార్ సమావేశానికి రాలేదు. రాష్ట్రానికో జీ20 టీమ్ నీతీ ఆయోగ్ పాలక మండలి ఏడో భేటీని జాతీయ ప్రాథమ్యాలను గుర్తించేందుకు కేంద్ర రాష్టాల మధ్య నెలల తరబడి జరిగిన లోతైన మేధోమథనం, సంప్రదింపులకు ఫలితంగా మోదీ అభివర్ణించారు. పలు అంశాల్లో కేంద్ర రాష్ట్రాల నడుమ సహాయ సహకారాలు మరింతగా పెరగాల్సిన అవసరముందన్నారు. భేటీలో చర్చించిన అంశాలు వచ్చే పాతికేళ్లలో జాతి ప్రాథమ్యాలను నిర్ణయించడంలో కీలకంగా మారతాయని వెల్లడించారు. జీఎస్టీ వసూళ్లు మెరుగ్గా ఉన్నా అవి భారీగా పెరగాల్సి ఉందదన్నారు. అందుకు అపారమైన అవకాశాలు కూడా ఉన్నాయని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఈ దిశగా ఉమ్మడి కార్యాచరణకు శ్రీకారం చుట్టాలని రాష్ట్రాలకు సూచించారు. అప్పుడే ఆర్థికంగా దేశం మరింత బలపడి 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపుదాలుస్తుందన్నారు. వీలైన ప్రతిచోటా స్థానిక వస్తువులనే వాడేలా ప్రజలను ప్రోత్సహించాలని రాష్ట్రాలకు సూచించారు. వోకల్ ఫర్ లోకల్ అన్నది ఏ ఒక్క పార్టీ అజెండానో కాదని, అందరి ఉమ్మడి లక్ష్యమని గుర్తుంచుకోవాలన్నారు. ‘‘శరవేగంగా సాగుతున్న పట్టణీకరణను సమస్యగా కాకుండా దేశానికి గొప్ప బలంగా మలచుకోవాల్సి ఉంది. సేవల్లో పారదర్శకత, పౌరులందరి జీవన ప్రమాణాల పెంపుపై దృష్టి సారించాలి’’అన్నారు. కరోనాపై పోరాటంలో ప్రతి రాష్ట్రమూ చురుకైన పాత్ర పోషించిందని కొనియాడారు. తద్వారా ఇవాళ వర్ధమాన దేశాలు స్ఫూర్తి కోసం భారత్‌వైపు చూసే పరిస్థితి ఉందని హర్షం వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు తొలిసారిగా ఒక్కచోటికి వచ్చి జాతీయ ప్రాధాన్యమున్న అంశాలపై మూడు రోజుల పాటు చర్చించడం గొప్ప విషయమన్నారు. సంపన్న, వర్ధమాన దేశాలతో కూడిన జీ20కి 2023లో భారత్ సారథ్యం వహించనుండటాన్ని మోదీ ప్రస్తావించారు. దీన్నుంచి గరిష్టంగా లబ్ధి పొందే మార్గాలను సూచించేందుకు ప్రతి రాష్ట్రమూ ఓ జీ20 టీమ్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రాలేమన్నాయంటే... వ్యవసాయ రంగానికి ఆంధ్రప్రదేశ్ అత్యధిక ప్రాధాన్యమిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. రాష్ట్రాలపై విధానాలను కేంద్రం బలవంతంగా రుద్దొద్దని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. జాతీయ విద్యా విధానం అమలుకు ఒత్తిడి తేవొద్దన్నారు. రాష్ట్రాల డిమాండ్లకు కేంద్రం మరింత ప్రాధాన్యమివ్వాలని సూచించారు. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారాన్ని మరో ఐదేళ్లు పొడిగించాలని బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్న ఛత్తీస్‌గఢ్, కేరళ, రాజస్తాన్ సీఎంలు కోరారు. జార్ఖండ్‌లో కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని సీఎం హేమంత్ సోరెన్ కోరారు. వ్యవసాయ, విద్యా రంగాల్లో మహారాష్ట్రకు కేంద్రం మరింత దన్నుగా నిలవాలని సీఎం ఏక్నాథ్ షిండే విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగంలో రాష్ట్రాల జాబితాలోని అంశాలపై కేంద్రం చట్టాలు చేయడాన్ని మానుకోవాలని కేరళ సీఎం పినరాయి విజయన్ డిమాండ్ చేశారు. రాజ్యాంగం తాలూకు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా పోవొద్దన్నారు. విపత్తుల నిర్వహణకు ఒడిశాకు మరిన్ని నిధులు కేటాయించాలని సీఎం నవీన్ పట్నాయక్ కోరారు. కనీస మద్దతు ధరకు కేంద్రం చట్టపరమైన హామీ ఇవ్వాలని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ డిమాండ్ చేశారు. రాష్ట్రాలు లేవనెత్తిన అంశాలు, వాటి ఆందోళనలు, అవి ఎదుర్కొంటున్న సవాళ్లు తదితరాలను నీతీ ఆయోగ్ లోతుగా అధ్యయనం చేస్తుందని మోదీ ప్రకటించారు. చిన్న అణు విద్యుత్కేంద్రాలు మేలు ఇంధన అవసరాలను తీర్చుకునేందుకు పాతబడుతున్న థర్మల్ విద్యుత్కేంద్రాల స్థానంలో చిన్న మాడ్యులర్ రియాక్టర్ల (ఎస్ఎంఆర్)ను ఏర్పాటు చేసుకోవడంపై కేంద్రం దృష్టి సారించాలని నీతీ ఆయోగ్ సభ్యుడు, శాస్త్రవేత్త వీకే సారస్వత్ సూచించారు. అణు విద్యుత్కేంద్రాల స్థాపన ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఎస్ఎంఆర్లు 300 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన అధునాతన అణు రియాక్టర్లు. ప్రస్తుతం దేశంలో 6,780 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన 22 అణు రియాక్టర్లు పని చేస్తున్నాయి. జాతీయ విద్యా విధానం కింద టీచర్ల సామర్థ్యాన్ని, నైపుణ్యాలను, అభ్యసన ఫలితాలను మెరుగు పరిచేందుకు చేపట్టిన చర్యలను కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరించారు. కరోనా అనంతర పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రగతికి కేంద్రం, రాష్ట్రాలు కలసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం మరింతగా ఉందని నీతీ ఆయోగ్ వైస్ చైర్మన్సుమన్ బెరీ అన్నారు. కేంద్ర విధానాలను రుద్దొద్దు: రాష్ట్రాలు వ్యవసాయ రంగానికి ఆంధ్రప్రదేశ్ అత్యధిక ప్రాధాన్యమిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. రాష్ట్రాలపై విధానాలను కేంద్రం బలవంతంగా రుద్దొద్దని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. జాతీయ విద్యా విధానం అమలుకు ఒత్తిడి తేవొద్దన్నారు. రాష్ట్రాల డిమాండ్లకు కేంద్రం మరింత ప్రాధాన్యమివ్వాలని సూచించారు. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారాన్ని మరో ఐదేళ్లు పొడిగించాలని బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్న ఛత్తీస్‌గఢ్, కేరళ, రాజస్తాన్ సీఎంలు కోరారు. జార్ఖండ్‌లో కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని సీఎం హేమంత్ సోరెన్ కోరారు. వ్యవసాయ, విద్యా రంగాల్లో మహారాష్ట్రకు కేంద్రం మరింత దన్నుగా నిలవాలని సీఎం ఏక్నాథ్ షిండే విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగంలో రాష్ట్రాల జాబితాలోని అంశాలపై కేంద్రం చట్టాలు చేయడాన్ని మానుకోవాలని కేరళ సీఎం పినరాయి విజయన్ డిమాండ్ చేశారు. విపత్తుల నిర్వహణకు ఒడిశాకు మరిన్ని నిధులు కేటాయించాలని సీఎం నవీన్ పట్నాయక్ కోరారు. కనీస మద్దతు ధరకు కేంద్రం చట్టపరమైన హామీ ఇవ్వాలని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ డిమాండ్ చేశారు. రాష్ట్రాలు లేవనెత్తిన అంశాలు, వాటి ఆందోళనలు, అవి ఎదుర్కొంటున్న సవాళ్లు తదితరాలను నీతీ ఆయోగ్ లోతుగా అధ్యయనం చేస్తుందని ప్రధాని మోదీ ప్రకటించారు. -
రాజ్యసభ సభ్యులుగా 27 మంది ప్రమాణం
న్యూఢిల్లీ: రాజ్యసభకు ఇటీవల ఎన్నికైన 57 మందిలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయెల్ సహా 27 మంది సభ్యులు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చాంబర్లో జరిగిన కార్యక్రమంలో చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు రాజ్యాంగానికి విధేయులుగా ఉంటామంటూ వారితో ప్రమాణం చేయించారు. 10 రాష్ట్రాలకు చెందిన 27 మంది సభ్యులు తెలుగు తదితర 9 భాషల్లో ప్రమాణం చేశారు. కొత్తగా ఎన్నికైన 57 మందిలో నలుగురు ఇప్పటికే ప్రమాణం చేశారు. మిగతా వారు వర్షాకాల సమావేశాల మొదటి రోజు ప్రమాణం చేయనున్నారు. ఇంకా ప్రమాణం చేయని కొత్త సభ్యులు కూడా 18వ తేదీన జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవచ్చని చైర్మన్ వెంకయ్యనాయుడు అనంతరం స్పష్టతనిచ్చారు. రాజ్యసభ ఎన్నికల్లో విజేతల పేర్లను నోటిఫికేషన్లో ప్రకటించిన నాటి నుంచి వారిని సభ్యులుగానే పరిగణిస్తామన్నారు. సభా కార్యక్రమాలు, కమిటీల సమావేశాల్లో పాల్గొనేందుకు మాత్రం ప్రమాణం చేయడం తప్పనిసరి అని పేర్కొన్నారు. తాజాగా ప్రమాణం చేసిన వారిలో కాంగ్రెస్‌కు చెందిన జైరాం రమేశ్, వివేక్ కె.తన్ఖా, ముకుల్ వాస్నిక్‌తోపాటు బీజేపీ నుంచి సురేంద్ర సింగ్ నాగర్, కె.లక్ష్మణ్, లక్ష్మీకాంత్ వాజ్‌పేయి తదితర 18 మంది ఉన్నారు. ప్రమాణ స్వీకారం చేస్తున్న గోయల్ -
కార్య‘కర్తవ్య బోధన’
సాక్షి నెట్వర్క్: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన బీజేపీ సీనియర్లు విస్తతంగా పర్యటిస్తున్నారు. కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల అధ్యక్షులు, ఎంపీలు, ఇతర కీలక నేతలు పట్టణాలు, గ్రామాల్లో తిరుగుతూ కార్యకర్తల ఇళ్లలో భోజనం చేస్తూ.. బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. పార్టీ పదాధికారులు, వివిధ మోర్చాలు, శక్తి కేంద్రాల సమావేశాల్లో పాల్గొని దిశా నిర్దేశం చేస్తున్నారు. ఓ వైపు కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ.. మరోవైపు పార్టీ బలోపేతం కోసం సూచనలు, సలహాలు ఇస్తూ కలియదిరుగుతున్నారు. స్థానికంగా ప్రజలు, విద్యార్థులు, రైతులతో మాట్లాడి వారి సమస్యలపై పోరాటం చేస్తామని హామీ ఇస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో విఫలమైందని.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని చెప్తున్నారు. ఉమ్మడి కరీంనగర్లో.. కేంద్ర మంత్రి వీరేందర్‌కుమార్ కటక్ శుక్రవారం సిరిసిల్లలో జరిగిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన సమావేశంలో పాల్గొని సూచనలు, సలహాలు ఇచ్చా రు. రామడుగు మండలం వెదిరలోని దళితకాలనీలో గుడువందల నర్సయ్య ఇంట్లో అల్పాహారం తీసు కున్నారు. బీజేపీ రాజస్థాన్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే సతీష్ పునియా కరీంనగర్లో పార్టీ అనుబంధ మోర్చా లు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. బూత్ స్థాయి నుండి చేపట్టాల్సిన కార్యక్రమా లపై సూచనలు చేశారు. కొత్తపల్లిలో దళిత మోర్చా మండల అధ్యక్షుడు నలువాల మహేశ్ ఇంట్లో భోజనం చేశారు. కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే జమ్మికుంటలో ఆవాస విద్యా లయాన్ని సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. పశ్చిమబెంగాల్ ఎంపీ జయంత్ కుమార్ రాయ్ మానకొండూరులో పర్యటించారు. ధర్మపురిలో కేంద్ర మంత్రి శ్రీపాదనాయక్, మంథనిలో చత్తీస్‌గఢ్ ఎమ్మెల్యే అజయ్ చంద్రకర్, రామగుండం లో బిహార్ ఎంపీ గోపాల్జీ ఠాగూ ర్, జగిత్యాలలో మనోజ్ తివారీ, కోరుట్లలో అనిర్బన్ గంగూలీ పర్యటించి.. నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్‌లో.. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని మంచిర్యాలలో కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణదేవి విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్, ఆదిలాబాద్‌లో త్రిపుర మాజీ సీఎం విప్లవ్‌కుమార్ స్థానిక నాయకులతో కలిసి మార్నింగ్ వాక్ చేశారు. కాగజ్‌నగర్‌లో మణిపూర్ రాష్ట్ర బీజేపీ చీఫ్ శారద దేవి, చెన్నూరులో ఎంపీ అజయ్ టాంటా, బెల్లంపల్లిలో జమ్మూకాశ్మీర్ మాజీ ఉప ముఖ్యమంత్రి కవీందర్గుప్తా, నిర్మల్‌లో ఎమ్మెల్సీ నావల్ కిశోర్‌యాదవ్, ఖానాపూర్‌లో ఎంపీ హీనాకుమార్, ఆసిఫాబాద్‌లో డయ్యూడామన్ బీజేపీ అధ్యక్షుడు దీపేశ్ సోండే, ముథోల్‌లో కేంద్ర మాజీ మంత్రి రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఉమ్మడి నిజామాబాద్‌లో.. కేసీఆర్ కుటుంబం రాష్ట్ర నిధులను ఏటీఎంలా వాడుకుంటోందని బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై నిజామాబాద్‌లో ఆరోపించారు. ఎల్లారెడ్డిలో గుజరాత్ ఎంపీ పార్తీబెన్, జుక్కల్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు విశాల్ జోలె, బాన్సువాడ నియోజకవర్గం బీర్కూర్‌లో బీజేపీ సిక్కిం అధ్యక్షుడు దాల్ బహదూర్ చౌహాన్, మోపాల్ మండలం నర్సింగ్‌పల్లిలో కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే పార్టీ నేతలు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. బీజేపీ ఐటీ సెల్ జాతీయ కన్వీనర్ అమిత్ మాలవీయ కామారెడ్డిలో పర్యటించి.. కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఉమ్మడి ఖమ్మంలో.. ఇల్లెందు, టేకులపల్లిలో బీజేపీ నేత లత ఉసెండి, బూర్గంపాడులో బీజేపీ కేరళ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్, దమ్మపేటలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర అధ్యక్షుడు విష్ణుదేవ్ సాయి, సత్తుపల్లి, పెనుబల్లి మండలాల్లో బీజేపీ పశ్చిమ బెంగాల్ ఎమ్మెల్యే ముకుత్ అధికారి, ఖమ్మం రూరల్ మండలంలో ఎంపీ లక్ష్మీకాంత్ బాజ్‌పాయ్, ఖమ్మం, రఘునాథపాలెం మండలాల్లో బీజేపీ జాతీ య అధికార ప్రతినిధి గోపాలకృష్ణ అగర్వాల్, వైరాలో గుజరాత్ ఎంపీ రమేలా బెన్, మధిరలో మధ్యప్రదేశ్ ఎంపీ సంధ్యారాయ్ పర్యటించారు. ఎక్కడికక్కడ స మావేశాలు నిర్వహించి, బీజేపీ కార్యకర్తలకు పార్టీ ఉ ద్దేశాలు, ఏం చేయాలనే అంశంపై దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి రంగారెడ్డిలో మహేశ్వరం నియోజకవర్గంలో కేంద్ర మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి పర్యటించి స్థానిక నేతలతో మాట్లాడారు. ఫరూఖ్‌నగర్ మండలంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్, ఆమనగల్లో ఒడిశా బీజేపీ అధ్యక్షుడు సమీర్ మహంతి, కొడంగల్‌లో కర్నాటక మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సంగప్ప, పరిగిలో మాజీ ఎంపీ అనుపమా హజ్రా పర్యటించారు. కార్యకర్తలతో సమావేశమై నియోజకవర్గాల్లో పరిస్థితిని సమీక్షించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో.. కేంద్ర మంత్రి సంజయ్‌కుమార్ బాల్యాన్ మెదక్‌లో మత్స్యకారులతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల కోసం అమలు చేస్తున్న పథకాల్లో 60 శాతం కేంద్రం నిధులేనన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో ఎంపీ శివప్రతాప్ శుక్లా.. సిద్దిపేటలో ఎంపీ అపరాజితా సారంగి, గజ్వేల్‌లో జార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు దీపక్ ప్రకాశ్, దుబ్బాకలో మాజీ గవర్నర్ రాజశేఖరన్, సంగారెడ్డిలో రాజస్థాన్ అసెంబ్లీ బీజేపీపక్ష నేత గులాబ్‌చంద్ కటారియా, జహీరాబాద్‌లో కర్నాటక ఎంపీ ఉమేశ్ జాదవ్ పర్యటించి పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఉమ్మడి నల్లగొండలో.. సూర్యాపేటలో కేంద్ర మంత్రి వీకే సింగ్ పర్యటించారు. వీర జవాన్లు గోపయ్యచారి, సంతోష్‌బాబు చిత్రపటాల వద్ద నివాళులు అర్పించి పార్టీ శ్రేణులతో భేటీ అయ్యారు. నల్లగొండలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ సుధాన్షు త్రివేది, నాగార్జునసాగర్‌లో కేంద్ర మాజీ మంత్రి అరుణ్ చతుర్వేది, కోదాడలో ఢిల్లీ అసెంబ్లీ ప్రతిపక్ష నేత శ్రీరామ్వీర్ సింగ్ బిదూరి, తుంగతుర్తిలో హరియాణా ఎంపీ సునీత దుంగల్, భువనగిరిలో జమ్ముకశ్మీర్ మాజీ మంత్రి ప్రియాసేథ్, ఆలేరులో డార్జిలింగ్ ఎంపీ రాజు బిస్తా పార్టీ నేతలు, కార్యకర్తలతో భేటీ అయి పరిస్థితిని సమీక్షించారు. తెలంగాణ మద్యం, డ్రగ్స్, గంజాయి రాష్ట్రంగా మారిందని, టీఆర్ఎస్ రావణ పాలనకు ముగింపు పలికి, రామలక్ష్మణ రాజ్యం తెస్తామని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఐపీఎస్ అధికారి భారతి ఘోష్ మిర్యాలగూడలో పేర్కొన్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి ప్రతిమ భౌమిక్.. దేవరకొండలో కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ మీనా జాస్కర్.. మునుగోడులో కేరళ రాష్ట్ర బీజేపీ మాజీ చీఫ్ పీకే కృష్ణదాస్ పర్యటించారు. ఎంపీ రాజ్‌కుమార్ చాహర్ హుజూర్‌నగర్‌లో రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో.. మహబూబ్‌నగర్‌లో ఉత్తరాఖండ్ మాజీ సీఎం తీరత్‌సింగ్ రావత్ వివిధ మోర్చాల నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఇక జడ్చర్లలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ, దేవరకద్రలో కర్ణాటక మాజీ సీఎం జగదీశ్‌షెట్టర్, నారాయణపేటలో విశ్వజిత్ రాణే, గద్వాలలో జమ్మూకశ్మీర్‌కు చెందిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆశిష్‌సూద్, అలంపూర్‌లో బిహార్ ఎమ్మెల్యే ప్రేమ్‌కుమార్, వనపర్తిలో యూపీ నేత రాజేశ్ అగర్వాల్, నాగర్‌కర్నూల్‌లో గుజరాత్ మాజీ ఉప ముఖ్యమంత్రి నితిన్‌భాయ్ పటేల్, కొల్లాపూర్‌లో తమిళనాడు మాజీ మంత్రి రాధాకృష్ణన్, కల్వకుర్తిలో ఒడిశా బీజేపీ అధ్యక్షుడు సమీర్ హేమంత్, అచ్చంపేటలో జమ్మూకశ్మీర్ మాజీ ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ పర్యటించా రు. మక్తల్‌లో కర్ణాటక మాజీ సదానందగౌడ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఉమ్మడి వరంగల్‌లో.. మహబూబాబాద్ నియోజకవర్గం కేసముద్రంలో జార్ఖండ్ మాజీ సీఎం బాబులాల్ మరాండి బీజేపీ శ్రేణులతో సమావేశమయ్యారు. ములుగులో ఉత్తరాఖండ్ మాజీ సీఎం రమేశ్ పోఖ్రియాల్, నర్సంపేటలో యూపీ మంత్రి అనిల్ రాజ్‌భర్, భూపాలపల్లి నియోజకవర్గం మొగుళ్లపల్లిలో బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు ఆదేశ్ కుమార్ గుప్తా, హనుమకొండలో ఎంపీ ఓం ప్రకాష్ మాధుర్, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం ధర్మసాగర్లో బీజేపీ జాతీయ కార్యదర్శి ఆశా లక్రా, పాలకుర్తిలో మహారాష్ట్ర నేత లదారామ్, భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో పశ్చిమ బెంగాల్ ఎంపీ దేవశ్రీ చౌదరి, జనగామలో బీజేపీ జాతీయ పార్లమెంటరీ వ్యవహారాల కార్యదర్శి సుబ్రమణ్యం తదితరులు పర్యటించారు. డోర్నకల్ కూరగాయల మార్కెట్లో వ్యాపారులతో త్రిపుర ఎంపీ రాబాటి మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. -
బలం బలగం అంచనాకు కమల దళపతులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పార్టీ బలోపేతంపై బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి సారించింది. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇందుకోసం పార్టీకి చెందిన అతిరథ మహారథులను రంగంలోకి దింపుతోంది. జాతీయ కార్యవర్గ భేటీని హైదరాబాద్ వేదికగా నిర్వహిస్తున్న కమలం పార్టీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేయడంతో పాటు, పార్టీ బలోపేతానికి అవసరమైన కార్యాచరణకు తగిన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఏకంగా కేంద్ర మంత్రులు, ఎంపీలు, మాజీ ముఖ్యమంత్రులు, ఇతర కీలక నేతలను నియోజకవర్గాలకు పంపుతోంది. ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, కిరణ్ రిజిజు, పురుషోత్తమ్ రూపాలా, అనురాగ్ ఠాకూర్ తదితర కేంద్ర మంత్రులు, రమణ్‌సింగ్, దేవేంద్ర ఫడ్నవిస్ తదితర మాజీ సీఎంలు, ప్రకాశ్ జవదేకర్, రవి శంకర్‌ప్రసాద్, రాజీవ్‌ప్రతాప్ రూఢీ, సినీనటి ఖుష్బూ వంటి నేతలు మూడురోజుల పాటు నిర్దేశిత ప్రాంతాల్లో మకాం వేయనున్నారు. వీరంతా తెలంగాణకు సంబంధం లేని ఇతర రాష్ట్రాల నేతలు (ప్రవాసీలు) కావడం ఆసక్తి కలిగిస్తోంది. ప్రజలతోనూ ముఖాముఖి పార్టీవర్గాల సమాచారం ప్రకారం.. నేతలంతా అధినాయకత్వం ముందుగానే నిర్దేశించిన మేరకు.. కార్యకర్తల ఇళ్లలోనే భోజనాలు చేస్తూ పార్టీ పరిస్థితిని అంచనా వేస్తారు. అధికార టీఆర్ఎస్ ప్రభావం, అక్కడున్న సమస్యలు తదితర అంశాలపై ఆ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని అన్ని స్థాయిల పార్టీ నాయకులు, కార్యకర్తలు, మోర్చాలతో సమావేశమౌతారు. స్థానికంగా ప్రజలను కలుసుకుని ప్రధాని మోదీ 8 ఏళ్ల పాలనలో సాధించిన అభివృద్ధిని, పేదలకు అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు మద్దతు కోరడంతో పాటు, రాష్ట్రానికి కేంద్రం, బీజేపీ జాతీయ నాయకత్వం అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడం గురించి తెలియజేస్తారు. హైదరాబాద్‌లో కార్యవర్గ భేటీ నిర్వహణ ప్రాధాన్యత గురించి ప్రజలకు వివరించి, 3న పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే మోదీ బహిరంగ సభకు రావాలంటూ ఆహ్వానాలు అందజేస్తారు. అధికార టీఆర్ఎస్ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకుంటారు. ఆయా అంశాలన్నిటిపై జాతీయ నాయకత్వానికి నివేదికలు సమర్పిస్తారు. అదే సమయంలో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలను, చేయాల్సిన మార్పులను కూడా సూచిస్తారు. కాగా ఆయా ప్రాంతాల నుంచే నేతలంతా 2వ తేదీ మధ్యాహ్నం జాతీయ భేటీ వేదికైన నోవాటెల్‌కు చేరుకుంటారు. అన్ని నియోజక వర్గాలకు.. బీజేపీకి చెందిన ముఖ్య నేతలు రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో బస చేయనున్నారు. ఈ జాబితాలో ఏడెనిమిది మంది కేంద్ర మంత్రులు, పలువురు మాజీ కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, ఇతర ముఖ్యనేతలు ఉన్నారు. వచ్చేనెల 1–4 తేదీల మధ్య హైదరాబాద్‌లో ఆ పార్టీ జాతీయ కార్యవర్గభేటీ జరగనున్న నేపథ్యంలో ఈ నెల 28 నుంచే నేతలు రాష్ట్రానికి చేరుకోవడం మొదలుకానుంది. వీరంతా 28 నుంచి జూలై 1 మధ్యలో కేటాయించిన నియోజకవర్గాలకు వెళ్లి మూడురోజుల పాటు కార్యకర్తల ఇళ్లల్లోనే బస చేయనున్నారు. ఈ నేతలకు రాష్ట్ర పార్టీకి చెందిన ఆ నియోజకవర్గానికి చెందని నాయకుడు సమన్వయకర్తగా ఉంటూ స్థానికంగా ఏర్పాట్లు చేయడంతో పాటు సమావేశాలకు తగిన సహకారం అందిస్తారు. -
అంతర్రాష్ట్ర మండలి పునర్నిర్మాణం
న్యూఢిల్లీ: దేశ సమాఖ్య విధానంలో సహకార స్పూర్తిని పెంచేందుకు కృషి చేసే అంతర్రాష్ట్ర మండలిని కేంద్రం పునర్నిర్మించింది. ఈ మండలి అధ్యక్షుడు ప్రధాని మోదీ కాగా, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆరుగురు కేంద్రమంత్రులు సభ్యులుగా ఉంటారు. మరో 10 మంది కేంద్ర మంత్రులు మండలి శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు. దీంతోపాటు, హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో అంతర్రాష్ట్ర మండలి స్టాండింగ్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. శాసనసభలు లేని కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలనాధికారులకు మండలిలో సభ్యులుగా అవకాశం కల్పించింది. కేంద్రం–రాష్ట్రాలు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తలెత్తే వివిధ అంశాలను అంతర్రాష్ట్ర, జోనల్ మండలులు పరిశీలించి, పరిష్కారాలు వెతుకుతాయి. ఇవి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సూచనలు చేస్తుంటాయి. హోం మంత్రి అధ్యక్షుడిగా ఏర్పాటైన మండలి స్టాండింగ్ కమిటీలో సభ్యులుగా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, నరేంద్ర సింగ్ తోమర్, వీరేంద్ర కుమార్, గజేంద్రసింగ్ షెకావత్‌తోపాటు ఆంధ్రప్రదేశ్, అస్సాం, బిహార్, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటారు. -
ఉక్రెయిన్‌లో భారతీయులు.. కేంద్రం కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: ఉక్రెయిన్ పరిణామాలు, ముఖ్యంగా అక్కడ చిక్కుకుపోయిన భారతీయుల తరలింపే ఎజెండాగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సోమవారం హై లెవల్ మీటింగ్ జరిగింది. ఇప్పటికే ఆపరేషన్ గంగ పేరుతో భారతీయులను స్వదేశానికి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా భేటీలో.. కేంద్రమంత్రులు స్వయంగా ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు వెళ్లి తరలింపు ప్రక్రియను పర్యవేక్షించాలని ప్రధాని మోదీ నిర్ణయించినట్లు సమాచారం. కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, జ్యోతిరాదిత్య సింధియా, కిరెన్ రిజ్జు, జనరల్(రిటైర్డ్) వీకే సింగ్ ఇందులో పాల్గొననున్నట్లు అధికార వర్గాల సమాచారం. వీళ్లు హంగేరి, రొమేనియా, పోల్యాండ్, స్లొవేకియా దేశాలకు వెళ్తారు. అక్కడే ఉండి పరిస్థితి సమీక్షిస్తూ.. భారతీయుల తరలింపును వేగవంతం చేస్తారు. భారతీయులను సురక్షితంగా, త్వరగతిన స్వదేశానికి తీసుకురావడమే ప్రధాన ఉద్దేశంగా ఈ మిషన్‌ను చేపట్టింది కేంద్రం. మోదీ అధ్యక్షతన జరుగుతున్న ఈ ఉన్నత స్థాయి సమావేశంలో.. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ సహా పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు. ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్ నుంచి పోల్యాండ్‌కు వలసలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ తరుణంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటుండగా.. భారతీయులపై స్థానిక పోలీసులు దాడి చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఉక్రెయిన్‌లో సుమారు పదిహేను వేల మంది దాకా భారతీయులు ఉన్నట్లు కేంద్రం అంచనా వేస్తోంది. #WATCH | Prime Minister Narendra Modi calls a high-level meeting on the Ukraine crisis. Some Union Ministers may go to neighboring countries of Ukraine to coordinate the evacuations.#RussiaUkraineCrisis pic.twitter.com/yqTFYwspxo — ANI (@ANI) February 28, 2022 -
ఆర్బీకే సేవలకు కేంద్ర మంత్రులు ఫిదా
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేల) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సేవలకు కేంద్ర మంత్రులు ఫిదా అయ్యారు. మహారాష్ట్రలోని నాగపూర్‌లో 4 రోజుల పాటు నిర్వహిస్తున్న 12వ వ్యవసాయ విజన్ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. సదస్సును ప్రారంభించేందుకు విచ్చేసిన కేంద్ర రవాణా, ఓడ రేవుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి, వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రులు నరేంద్రసింగ్ తోమర్, పర్షోత్తమ్ రూపాలా ఆర్బీకే స్టాల్‌ను ఆసక్తిగా తిలకించి, ఆర్బీకేల ద్వారా రైతులకు అందుతున్న సేవల తీరుతెన్నులపై రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనల నుంచి పుట్టినవే ఈ ఆర్బీకేలని, వీటిద్వారా సర్టిఫై చేసిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు వంటి సాగు ఉత్పాదకాలను రైతుల గడప వద్దకు తీసుకెళ్తున్నామని వివరించారు. నాణ్యతా పరీక్షల నిర్వహణ కోసం దేశంలో మరెక్కడా లేనివిధంగా నియోజకవర్గ స్థాయిలో వ్యవసాయ అనుబంధ రంగాలకు ఉపయోగపడేలా ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. మార్కెటింగ్ సౌకర్యాల కల్పనలో భాగంగా గ్రామ స్థాయిలో గోదాములతో పాటు పెద్దఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. చదవండి: (బీచ్‌రోడ్‌లో మతిస్థిమితం లేకుండా సుప్రీంకోర్టు న్యాయవాది) పైసా భారం పడకుండా పంటల బీమా, పెట్టుబడి రాయితీ, సున్నా వడ్డీకే పంట రుణాలు అందిస్తున్నామని చెప్పారు. బ్యాంకింగ్ కరస్పాండెంట్ల ద్వారా ఆర్బీకే స్థాయిలో బ్యాంకింగ్ సేవలందిస్తున్నామని వివరించారు. ఆర్బీకేలను కొనుగోలు కేంద్రాలుగా మార్చి గ్రామ స్థాయిలోనే వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు చేస్తున్నామని వివరించారు. కమిషనర్ చెప్పిన విషయాలను ఆసక్తిగా విన్న కేంద్రమంత్రులు ‘ఆర్బీకేల గురించి ఇప్పటికే మేం విన్నాం. గుడ్.. గుడ్. వెరీమచ్ ఇంప్రెస్డ్’ అంటూ కితాబిచ్చారని వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్‌కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. -
జన్ ఆశీర్వాద యాత్రతో ప్రతిపక్షాల్లో వణుకు
న్యూఢిల్లీ: 39 మంది కేంద్ర మంత్రులు నిర్వహించిన జన్ ఆశీర్వాద యాత్రకు దేశవ్యాప్తంగా లభించిన జనాదరణను చూసి ప్రతిపక్షాలు బెంబేలెత్తిపోయాయని, ఆయా పార్టీల్లో వణుకు పుట్టిందని బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డా అన్నారు. విజయవంతంగా సాగుతున్న ఈ యాత్రకు ఆటంకాలు సృష్టించేందుకు ప్రతిపక్ష నాయకులు కుటిల యత్నాలు చేశారని మండిపడ్డారు. ఈ మేరకు నడ్డా శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి దేశ ప్రజలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని తెలిపారు. ప్రజామోదం నేపథ్యంలో ప్రభుత్వంపై ప్రతిపక్షాల కుట్రలు సాగడం లేదన్నారు. కేంద్ర మంత్రి నారాయణ రాణే పట్ల మహారాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నడ్డా తీవ్రంగా తప్పుపట్టారు. ప్రజా ఆశీర్వాద యాత్రలో ఉన్న కేంద్ర మంత్రిని అరెస్టు చేయడం అంటే మన ప్రజాస్వామ్యం వ్యవస్థపై నేరుగా దాడి చేసినట్లేనని ఉద్ఘాటించారు. ప్రతిపక్షాల ప్రతికూల రాజకీయ అజెండాను ప్రజలు నిర్ద్వంద్వంగా తిరస్కరించారని, అభివృద్ధి రాజకీయాలే వారు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. జన్ ఆశీర్వాద యాత్ర స్వాతంత్య్రోత్సవ దినం సందర్భంగా ఆగస్టు 15న మొదలయ్యింది. ఆగస్టు 28న ముగిసింది. కేంద్ర మంత్రులు 14 రోజుల్లో 24 వేల కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగించారు. 5 వేలకుపైగా సభల్లో మాట్లాడారు. యాత్రతోపాటు ఈ సభలన్నీ పూర్తిస్థాయిలో విజయవంతం అయ్యాయని జె.పి.నడ్డా వెల్లడించారు. ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారని గుర్తుచేశారు. మోదీ నాయకత్వంలో జరుగుతున్న సర్వతోముఖా భివృద్ధిని ప్రజలు ప్రశంసిస్తున్నారని వివరించారు. కేంద్ర ప్రభుత్వం వినూత్న పథకాలు, కార్యక్రమాలతో అన్ని వర్గాల ప్రజలకు చేరువవుతోందని అన్నారు. దేశ భద్రతను పటిష్టం చేసేందుకు కేంద్ర ఎన్నో చర్యలు చేపట్టిందన్నారు. సమాజంలో అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం, బీజేపీ కట్టుబడి ఉన్నాయని వివరించారు. అభివృద్ధి విషయంలో వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. -
ప్రతిపక్షాలు క్షమాపణ చెప్పాలి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిపక్షాలు మొసలి కన్నీరు మాని పార్లమెంటులో వారి ప్రవర్తనపై దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రులు పేర్కొన్నారు. పార్లమెంటు సమావేశాల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని, ప్రభుత్వం ఎంపీలపై దాడి చేసిందని విపక్షాలు నిరసన ర్యాలీలో విమర్శలు గుప్పించగా దీనికి కౌంటర్‌గా 8 మంది కేంద్ర మంత్రులు గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి విపక్షాలు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మార్షల్స్‌పై విపక్ష సభ్యులు దురుసుగా ప్రవర్తించారని ప్రత్యారోపణ చేశారు. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, ప్రహ్లాద్ జోషి, అనురాగ్ ఠాకూర్, నఖ్వీ, భూపేంద్ర యాదవ్, అర్జున్ మేఘ్వాల్, వి.మురళీధరన్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజాహితంపై వారికి చింతలేదు అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ ‘దేశ ప్రజలు తమ సమస్యలు పార్లమెంటు సమావేశాల్లో చర్చకు వస్తాయని ఆశించారు. దేశ ప్రజల హితం కానీ, రాజ్యాంగ విలువలపై గానీ వారికి చింత లేదు. విపక్షాలు మొసలి కన్నీరు కార్చడం ఆపి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి’ అని పేర్కొన్నారు. ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ ‘పార్లమెంటు సమావేశాల ముందు అఖిలపక్ష సమావేశం జరిగినప్పుడే విపక్షాలు సభను నడవనివ్వమన్న సంకేతాలు ఇచ్చాయి. సభను నడవనివ్వబోమని చెప్పేశారు. మేం చాలా సందర్భాల్లో వారితో మాట్లాడాం. కనీసం మొదటి రోజు మంత్రి మండలిలోని నూతన సభ్యుల పరిచయ కార్యక్రమాన్ని అనుమతించాలని కోరాం. అందుకు కూడా ఒప్పుకోలేదు. రెండు సభల్లో బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశాల్లో వారు వారి డిమాండ్లను పెట్టారు. స్వల్పకాలిక చర్చలు జరపాలని కోరారు. ధరల పెరుగుదల, కోవిడ్, వ్యవసాయం తదితర అంశాలపై చర్చకు చైర్మన్ అనుమతించారు. పెగసస్ వంటి అంశాలను పట్టుబట్టుతూ కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు సభాకార్యకలాపాలకు విఘాతం కలిగించారు. ముఖ్యమైన బిల్లులను కూడా చర్చకు అనుమతించలేదు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఇలా ఎన్ని చేశారో రికార్డులు చూడొచ్చు.. ఆనాడు ఏపీ విభజన వంటి ముఖ్యమైన బిల్లులు కూడా గందరగోళంలో ఆమోదింపజేసుకున్నారు’ అని దుయ్యబట్టారు. ‘నాలుగో తేదీన ఆరుగురు సభ్యులను సస్పెండ్ చేయగా.. గ్లాసులు పగలగొట్టుకుని లోపలికి వచ్చేందుకు ప్రయత్నించారు. అధికారులకు గాయాలయ్యేలా చేశారు. రాజ్యసభలో టేబుల్ ఎక్కి ఆందోళన చేశారు. అది బిల్లుపై చర్చ కూడా కాదు. చర్చకు సిద్ధంగా ఉంటే సభను సోమవారం వరకూ నిర్వహిస్తామని చెప్పాం. కానీ వారు సహకరించకపోగా.. ఇన్సూరెన్స్ బిల్లు, ఓబీసీ బిల్లు ఆమోదింపజేసుకుంటే మంగళవారం నాటి పరిణామాల కంటే తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇప్పుడేమో మహిళా ఎంపీలపై పురుష మార్షల్స్ దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తున్నారు. ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని రాహుల్ గాంధీ ప్రకటన చేశారు. దేశ ప్రజలు చూస్తున్నారు. వారికి ఏమాత్రం ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్నా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మేం రాజ్యసభ చైర్మన్‌ను కూడా కోరాం. విపక్ష సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరాం.. ఏపార్టీ అధికారంలో ఉన్నా ఇది పునరావృతం కాకూడదు..’ అని పేర్కొన్నారు. మార్షల్స్‌పై దాడులకు దిగారు: గోయల్ రాజ్యసభలో సభా నాయకుడు పీయూష్ గోయల్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలను మంటగలిపారని మండిపడ్డారు. సభ ఆస్తులను ధ్వంసం చేశారని, మార్షల్స్‌పై దురుసుగా ప్రవర్తించారని, భౌతిక దాడులకు దిగారని, వారి దుష్ప్రవర్తనపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. 12 మంది మహిళా మార్షల్స్, 18 మంది పురుష మార్షల్స్.. మొత్తం 30 మంది మార్షల్స్ మాత్రమే ఉన్నారని వివరించారు. విపక్షాలది కేవలం డ్రామా అని, ఓబీసీ బిల్లు విషయంలో కేవలం రాజకీయ కోణంలో మాత్రమే చర్చను సాగనిచ్చారని వ్యాఖ్యానించారు. అంతకుముందు ఈ మంత్రులంతా రాజ్యసభ చైర్మన్ వెంకయ్యని కలిసి సభలో పార్లమెంటరీ సంప్రదాయాలను ఉల్లంఘిస్తూ దురదృష్టకరమైన రీతిలో ప్రవర్తించిన సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. బయటివారెవరూ లేరు.. ఉభయ పక్షాలు తనతో భేటీ అయిన అనంతరం రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు అధికారులతో సమావేశం నిర్వహించి మంగళవారం నాటి పరిణామాలను మరోసారి ఆరాతీశారు. బయటివారెవరూ సభలోకి రాలేదని, తొలుత 14 మంది మార్షల్స్ ఉన్నారని, క్రమంగా సభలో పరిస్థితిని బట్టి మార్షల్స్ సంఖ్య 42కు చేరిందని వారు చైర్మన్‌కు నివేదించారు. క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందే! పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో చోటు చేసుకున్న సంఘటనలు, సభాకార్యకలాపాలకు కొందరు ఎంపీలు విఘాతం కలిగించిన తీరుపై ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రవర్తను సహించకూడదని, తగిన చర్యలు తీసుకోవాల్సిందేనని అభిప్రాయపడ్డారు. పార్లమెంటులో చోటుచేసుకున్న దురదృష్టకరమైన సంఘటనలను సమీక్షించేందుకు గురువారం వీరిద్దరూ సమావేశమయ్యారని ఉపరాష్ట్రపతి కార్యాలయం తెలిపింది. సభాపతులు పదేపదే చేసిన విజ్ఞప్తులను పట్టించుకోకుండా, నిబంధనలను ఉల్లంఘిస్తూ అత్యున్నత చట్టసభ హుం దాతనాన్ని దిగజార్చేలా వ్యవహరించారని వీరిరువూ అభిప్రాయపడ్డట్లు అధికారులు తెలిపారు. గతంలో జరిగిన సంఘటనల ను, తీసుకున్న చర్యలను క్షుణ్ణంగా పరిశీలించాలని, భవిష్యత్తు కార్యాచరణకు ఇవి ఉపయుక్తంగా ఉంటాయని సభాపతులు అభిప్రాయపడ్డారు. -
బాధ్యతలు స్వీకరించిన కొత్త కేంద్ర మంత్రులు
-
మోదీ కేబినెట్లో భారీ ప్రక్షాళన
న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ తాజా కేబినెట్లో భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. దాదాపు 15 మంది మంత్రులకు కేబినెట్ నుంచి ఉద్వాసన పలికినట్లు సమాచారం. ఈ మేరకు పలువురు మంత్రులు రాజీనామా చేశారు. వీరిలో కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్, కార్మిక శాఖ మంత్రి సంతోష్ గాంగ్వార్, విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్, ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి సదానందగౌడ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దేవశ్రీ చౌదరి, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మంత్రి సంజయ్ ధోత్రే, కేంద్ర అటవీశాఖ మంత్రి బాబుల్ సుప్రియోలు తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. 12 మంది కేంద్ర మంత్రుల రాజీనామాలను రాష్ట్రపతి ఆమోదించారు. వరుసగా.. 1.సదానందగౌడ 2.రవిశంకర్‌ప్రసాద్ 3.థావర్‌చంద్ గెహ్లాట్ 4.రమేశ్ పోఖ్రియాల్ 5.హర్షవర్థన్ 6. ప్రకాశ్ జవదేకర్ 7.సంతోష్‌కుమార్ గాంగ్వార్ 8.బాబుల్ సుప్రియో 9.సంజయ్ దోత్రే 10.రతన్‌లాల్ కతారియా 11.ప్రతాప్‌చంద్ర సారంగి 12.దేవశ్రీ చౌదరి -
ప్రజలకు అందుబాటులో ఉండండి
న్యూఢిల్లీ: కోవిడ్–19 తీవ్రంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రమంత్రులంతా ప్రజలకు అందుబాటులో ఉండాలనీ, వారి అభిప్రాయాలు తెలుసుకుంటూ వారికి సాయం చేయాలని ప్రధాని మోదీ కోరారు. తమతమ ప్రాంతాల్లో స్థానిక సమస్యలను గుర్తించి, పరిష్కరించాల్సిన అవసరం ఉందని వారికి తెలిపారు. దేశంలో కోవిడ్–19 సెకండ్ వేవ్‌తో తలెత్తిన పరిస్థితులపై చర్చించేందుకు శుక్రవారం ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ వర్చువల్‌గా జరిగింది. సెకండ్ వేవ్ తర్వాత జరిగిన మొట్టమొదటి మంత్రివర్గ సమావేశం ఇది. ప్రపంచానికే సవాల్‌గా మారిన ఈ మహమ్మారి శతాబ్దంలోనే అతిపెద్ద సంక్షోభమని ఈ సమావేశం అభిప్రాయపడింది. ‘ఈ అత్యవసర పరిస్థితుల్లో అవసరాలకు అనుగుణంగా ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్య పెంపు, ఆక్సిజన్, ఇతర అత్యవసర ఔషధాల లభ్యత వంటి వాటిపై చర్చించింది. కరోనా సంక్షోభంతో ఎక్కువగా ఇబ్బందులు పడుతున్న పేదలకు ఉచితంగా ఆహారధాన్యాలను పంపిణీ చేయడం, జన్‌ధన్ ఖాతాదారులకు ఆర్థికంగా సాయం చేయడం వంటివాటిపైనా మంత్రులకు వివరాలు అందించారు. దేశవ్యాప్తంగా ప్రజలకు ఇప్పటి వరకు 15 కోట్ల టీకా డోసుల పంపిణీ జరగ్గా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న రెండు టీకాలు కోవాగ్జిన్, కోవిషీల్డ్‌కు తోడుగా మరికొన్ని టీకాలు అనుమతుల మంజూరు వంటి వివిధ దశల్లో ఉన్న విషయం వివరించారు. నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్.. ఈ సందర్భంగా మంత్రులకు కోవిడ్ మేనేజ్మెంట్పై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం కేంద్ర మంత్రులు పియూష్ గోయెల్, మన్సుఖ్ మాండవీయ ప్రస్తుతం ఆక్సిజన్, ఔషధాల అందుబాటుపై సహచర మంత్రులకు వివరించారని ప్రధాని కార్యాలయ వర్గాలు శుక్రవారం తెలిపాయి. -
రామగుండంలో కేంద్రమంత్రులకు నిరసన సెగ
సాక్షి, పెద్దపల్లి : రామగుండం ఎరువుల కార్మాగారాన్ని సందర్శించడానికి వచ్చిన కేంద్ర మంత్రులకు షాక్ తగిలింది. స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలంటూ ఆర్ఎఫ్సిఎల్ ప్లాంటు ఎదుట ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఎంపీ వెంకటేష్ నేత ధర్నాకు దిగారు. దీంతో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. అయితే అధికారులతో మాట్లాడి స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించడంతోపాటు పునరావాసం కల్పిస్తామని కేంద్ర మంత్రులు హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. -
పునర్విభజన కమిటీలోకి ఎంపీలు
న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూకశ్మీర్ లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కమిటీ అసోసియేట్ సభ్యులుగా 15 మంది ఎంపీలను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నామినేట్ చేశారు. వీరిలో కేంద్రమంత్రులు కిరేన్ రిజిజు, జితేంద్ర సింగ్ సైతం ఉన్నారు. 26న వెలువడిన లోక్‌సభ బులెటిన్ ప్రకారం అరుణాచల్ ప్రదేశ్‌కు కిరేన్ రిజిజు, తపిర్ గావో ప్రాతినిధ్యం వహిస్తారు. అస్సాంకు పల్లవ్ లోచన్ దాస్, అబ్దుల్ ఖలేక్, రాజ్‌దీప్ రాయ్, దిలీప్ సైకియా, నబ సరానియా, మణిపూర్‌కు లోర్హో ఫోజ్, రంజన్ రాజ్‌కుమార్, నాగాలాండ్‌కు టోఖెహో యెఫ్తోమి ప్రాతినిధ్యం వహిస్తారు. జమ్మూకశ్మీర్‌కు ఫరూక్ అబ్దుల్లా, మొహమ్మద్ అబ్దుల్ లోనె, హస్నైన్ మసూదీ, జుగల్ కిశోర్ శర్మ, జితేంద్ర సింగ్ ప్రాతినిధ్యం వహిస్తారు. సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ రంజన్ దేశాయ్ నేతృత్వంలో కేంద్రం మార్చి 6న పునర్ విభజన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఎన్నికల కమిషనర్ సుశీల్‌చంద్ర, రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు ఎక్స్–అఫీషియో సభ్యులుగా ఉంటారు. పునర్విభజన చట్టం2002, జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అనుసరించి జమ్మూకశ్మీర్‌తోపాటు ఇతర రాష్ట్రాల్లోని లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో వీరు పాలుపంచుకుంటారు. -
ఎంపీల వేతనాల్లో 30% కోత
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పై పోరాటంలో నిధులను సమకూర్చుకునే దిశగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు సహా పార్లమెంటు సభ్యులందరి వేతనంలో సంవత్సరం పాటు 30% కోత విధిస్తూ రూపొందించిన ఆర్డినెన్స్‌కు సోమవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సంఘటిత నిధిలో చేరే ఈ మొత్తాన్ని కరోనాపై పోరాటంలో వినియోగించనున్నారు. ఈ మేరకు ‘శాలరీ, అలవెన్సెస్ అండ్ పెన్షన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ యాక్ట్–1954’కు సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ రూపొందించామని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, రాష్ట్రాల గవర్నర్లు కూడా తమ సామాజిక బాధ్యతలో భాగంగా, తమ వేతనాల్లో కొంత భాగాన్ని కరోనాపై పోరుకు వినియోగించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారన్నారు. సాయం అందించడం మన నుంచే ప్రారంభం కావాలన్న నానుడిని ఈ సందర్భంగా జవదేకర్ ఉటంకించారు. ఎంపీల వేతనానికి, ప్రధాని, ఇతర కేంద్రమంత్రుల వేతనాలకు తేడా ఉంటుంది. ఎంపీలు నెలకు సుమారు రూ. లక్ష వేతనంతో పాటు, రూ. 70 వేలను నియోజకవర్గ అలవెన్స్‌గా పొందుతారు. మంత్రుల వేతనం కూడా దాదాపు అంతే ఉంటుంది కానీ వారికి వేరే అలవెన్సులు కూడా ఉంటాయి. అయితే, ఈ కోత వేతనానికే అని, పెన్షన్, ఇతర అలవెన్సుల్లో ఈ కోత ఉండబోదని ప్రభుత్వ అధికార ప్రతినిధి ఆ తరువాత వివరణ ఇచ్చారు. ఎంపీల్యాడ్(ఎంపీ లోకల్ ఏరియా డెవలప్మెంట్) ఫండ్ పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేసేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకాన్ని రెండు ఆర్థిక సంవత్సరాల(2020–21, 2021–22) పాటు నిలిపివేయనున్నారు. ఈ మొత్తాన్ని కూడా కోవిడ్–19పై పోరుకు వినియోగిస్తారు. లోక్‌సభలో 543, రాజ్యసభలో 245 మంది సభ్యులున్నారు. ఈ మొత్తం 788 మంది ఎంపీలకు ఎంపీల్యాడ్స్ కింద ఒక్కొక్కరికి ఏటా రూ. 5 కోట్ల చొప్పున ఇస్తారు. రెండేళ్లకు గానూ ఈ మొత్తం దాదాపు రూ. 7,880 కోట్లు అవుతుంది. అలాగే, ఎంపీల వేతనాల్లో కోత ద్వారా ఏటా రూ. 29 కోట్లు కరోనాపై పోరాటానికి జమ అవుతాయి. వేతనాల్లో కోత ద్వారా కోల్పోయే మొత్తం ఎంపీలకు పెద్ద సమస్య కాబోదు కానీ, ఎంపీల్యాడ్స్‌ను కోల్పోవడంతో నియోజకవర్గాల్లో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. ఎంపీల వేతనాల్లో కోత నిర్ణయాన్ని కాంగ్రెస్ స్వాగతించింది. అయితే, ఎంపీల్యాడ్స్‌పై నిర్ణయానికి సంబంధించి పునరాలోచించాలని కోరింది. -
ఫార్మాసిటీకి సాయమందించాలి
సాక్షి, హైదరాబాద్: సమీకృత ఫార్మాపార్క్‌కు అన్ని విధాలా సాయమందిచాలని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని కోరారు. జాతీయ ప్రాధాన్యం ఉన్న ప్రాజెక్టుకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఆదివారం కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, ధర్మేంద్రప్రధాన్‌లకు ఆయన లేఖలు రాశారు.‘హైదరాబాద్ ఫార్మాసిటీని జాతీయ ప్రాధాన్యత గల ప్రాజెక్టుగా కేంద్రం గుర్తించింది. దీంతోపాటు నిమ్జ్ హోదాకు కేంద్రం సూత్రప్రాయ అంగీకారం తెలిపింది.ఫార్మాసిటీ మౌలిక వసతులకు రూ.1,318 కోట్లు, సాంకేతిక సదుపాయాల కల్పనకు రూ.2,100 కోట్ల కోసం కేంద్ర ఆర్థిక సాయం అందించాలి’అని కేంద్ర మంత్రి గోయల్‌ను లేఖలో కోరారు. ఫార్మా సిటీకి అవసరమైన సహజ వాయువు సరఫరా కేటాయింపుల కోసం కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ మరో లేఖ రాశారు. -
మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం
-
భిన్నత్వంతో విభేదాలు రాకూడదు
న్యూఢిల్లీ: దేశంలో ఉన్న భిన్నత్వం గురించి గర్వించాలి, భిన్నత్వాన్ని గౌరవించాలి తప్ప సమాజంలో విభేదాలకు అది కారణం కాకూడదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఆరెస్సెస్ మూడు రోజులపాటు నిర్వహిస్తున్న ‘భవ్యిషత్ భారతం–ఆరెస్సెస్ దృక్పథం’ సదస్సును భాగవత్ సోమవారం ప్రారంభించారు. ఆరెస్సెస్‌ను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు నిర్వహిస్తున్న ఈ సదస్సుకు హాజరవ్వాల్సిందిగా దాదాపు అన్ని ప్రతిపక్ష పార్టీల నాయకులకూ ఆహ్వానం పంపామని ఆరెస్సెస్ చెబుతుండగా.. తమనెవరూ పిలవలేదనీ, పిలిచినా వెళ్లే వాళ్లం కాదని కాంగ్రెస్ సహా కొందరు విపక్ష నేతలు పేర్కొన్నారు. పలువురు కేంద్ర మంత్రులు, అధికార బీజేపీ నాయకులతోపాటు అనేక మంది బాలీవుడ్ నటీనటులు, విద్యావేత్తలు సదస్సుకు వచ్చారు. భాగవత్ మాట్లాడుతూ ‘దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడంలో కాంగ్రెస్ గొప్ప పాత్ర పోషించింది. భారత్‌కు ఎంతోమంది గొప్ప నాయకులను ఇచ్చింది’ అని కొనియాడారు. ఆరెస్సెస్ పరిణామ క్రమాన్ని వివరించిన ఆయన.. ఆరెస్సెస్ సేవలను ఇతర ఏ సంస్థతోనూ పోల్చలేమన్నారు. ఆరెస్సెస్ నియంతృత్వ సంస్థ కాదనీ, అత్యంత ప్రజాస్వామిక సంస్థ అని చెప్పుకొచ్చిన భాగవత్.. ఆరెస్సెస్ తన సిద్ధాంతాలను ఎప్పుడూ ఇతరులపై రుద్దదనీ, అలాగే అనుబంధ సంస్థలపై తమ నియంత్రణేమీ లేదని స్పష్టం చేశారు. బీజేపీని ఆరెస్సెస్ నియంత్రిస్తోందన్న విమర్శల నేపథ్యంలో ఆయన ఇలా వ్యాఖ్యానించడం గమనార్హం. ‘భారత్ భిన్నత్వంతో కూడిన దేశం. దాన్ని అందరూ గౌరవించాలి, గర్వించాలి. సమాజంలో విభేదాలకు భిన్నత్వం కారణం కాకూడదు’ అని భాగవత్ విజ్ఞప్తి చేశారు. అధికారంతో సంబంధం లేదు ‘అధికారంలో ఎవరుంటారు?, దేశం ఏ విధానాలను ఆమోదిస్తుంది అనేది సమాజం, ప్రజలు నిర్ణయించాల్సింది. వీటితో మాకు సంబంధం లేదు. సమాజం బాగుండటమే మాకు ముఖ్యం’ అని భాగవత్ స్పష్టం చేశారు. -
‘మేడారం’లో కాషాయ గుడారం..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్న కమలనాథులు మేడారం జాతరపై దృష్టి పెట్టారు. కోట్లలో జనం తరలివచ్చే ఈ గిరిజన కుంభమేళాను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈనెల 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరిగే జాతరకు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను రప్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. అలాగే గిరిజనులతోపాటు గ్రామాల పురోగతికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలు చేస్తున్న కృషిని వివరించే స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే నితిన్ గడ్కరీ, స్మృతి ఇరానీ, జేపీ నడ్డా, ధర్మేంద్ర ప్రధాన్, కిరెణ్ రిజిజు, జుయల్ ఓరం సహా పది మంది కేంద్ర మంత్రులు, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, గిరిజన జనాభా అధికంగా ఉన్న ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌లను ఆహ్వానించారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌తోపాటు మరికొందరు ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానించబోతున్నారు. సాధారణంగా జాతరలు, ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లను రాష్ట్ర ప్రభుత్వమే ఆహ్వానిస్తుంది. కానీ ఇందుకు భిన్నంగా కమలనాథులు పార్టీ తరఫున వారిని రప్పించేందుకు యత్నిస్తున్నారు. పథకాలను వివరించే స్టాళ్లు.. కేంద్ర ప్రభుత్వ పథకాలు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అనుసరిస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను అక్కడికి వచ్చే భక్తజనం దృష్టికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించి కొన్ని స్టాళ్లను ఏర్పాటు చేయించాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని జాతీయ రహదారుల నిడివి రెట్టింపు అయ్యేలా కేంద్ర ప్రభుత్వం కొత్త రోడ్లు మంజూరు చేసింది. ఇది రాష్ట్రాభివృద్ధిలో కీలక భూమిక పోషించనున్నందున కేంద్ర ఉపరితల రవాణా శాఖ చేత ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేయించనున్నారు. అలాగే గ్రామీణాభివృద్ధి, వైద్య ఆరోగ్య శాఖల స్టాళ్లను ఏర్పాటు చేయించాలని భావిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అనుసరిస్తున్న గ్రామీణాభివృద్ధి పథకాలను వివరించనున్నారు. మహారాష్ట్రలో గిరిజన సంక్షేమం, గ్రామీణాభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించే చట్టం ఏర్పాటుకు ఆ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగరరావు ప్రత్యేక చొరవ చూపారని, దాన్ని వివరించే ఏర్పాటు కూడా చేయాలని నిర్ణయించారు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలపైనా అవగాహన కల్పించే స్టాళ్లు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. కార్యకర్తలతో ప్రత్యేక శిబిరం బీజేపీ ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఆర్ఎస్ఎస్కు చేరువగా ఉండే వనవాసీ కల్యాణ్ పరిషత్ కార్యకర్తలు.. భక్తుల సేవలో ఉండేలా నియోగిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ దీనిపై పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించారు. ఢిల్లీ, ముంబైలకు పార్టీ నేతలు ప్రేమేందర్‌రెడ్డి, చందా లింగయ్య ఇతర నేతలతో కలసి వెళ్లి కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి ఫడ్నవీస్, గవర్నర్ విద్యాసాగరరావులతో భేటీ అయ్యారు. -
మంత్రులకు 1000 కార్లు: కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ: ఈ ఏడాది నవంబర్ కల్లా కేంద్ర మంత్రులు, కీలక అధికారులు దేశ రాజధానిలో ఎలక్ట్రిక్ కార్లలో తిరగనున్నారు. దాదాపు 1000 ఎలక్ట్రిక్ కార్లను మంత్రులు, అధికారులకు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రపంచంలో ఇంధన దిగుమతిలో మూడో స్ధానంలో ఉన్న భారత్.. ఆ భారం నుంచి బయటపడాలని నిర్ణయించుకుంది. ఆలోచనను కార్యాచరణలో పెడుతూ.. ప్రభుత్వం నుంచే మార్పుకు నాంది పలికేందుకు సిద్ధమైంది. ఎలక్ట్రిక్ కార్ల కోసం నేషనల్ కేపిటల్ రీజయన్(ఎన్సీఆర్) పరిధిలో 400లకు పైగా చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే యూరప్ ఖండంలోని కొన్ని దేశాలు ఎలక్ట్రిక్ కార్లను వినియోగిస్తూ అత్యధికంగా ఇంధనాన్ని ఆదా చేసుకుంటున్న విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకుని పది వేల ఎలక్ట్రిక్ కార్లకు బిడ్లను ఆహ్వానించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. కార్ల కోసం ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈఎస్ఎల్) శుక్రవారం బిడ్లను ఆహ్వానించనుంది. పెట్రోల్ బంకుల వద్ద ఎల్ఈడీ విద్యుత్తు దీపాల అమ్మకానికి ఈఈఎస్ఎల్, పెట్రోల్ బంకుల యాజమాన్యాల మధ్య ఒప్పందం కుదిరిందని కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ సందర్భంగా వెయ్యి ఎలక్ట్రిక్ కార్లను ప్రభుత్వం కొనుగోలు చేయనుందని ఈఈఎస్ఎల్ ఎండీ సౌరభ్‌కుమార్ వెల్లడించారు. ఒకసారి చార్జ్ చేస్తే 120-150 కిలోమీటర్ల మైలేజ్‌ను ఎలక్ట్రిక్‌కార్లు ఇస్తాయని చెప్పారు. ఈ కార్లకు మెయింటెనెన్స్ కూడా తక్కువగానే ఉంటుందని తెలిపారు. -
ఊడుతున్న ఎర్ర బుగ్గలు
వీఐపీ సంస్కృతికి చరమగీతం పాడాలన్న ఉద్దేశంతో ఎర్ర బుగ్గలను (సైరన్లను) తొలగించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించడంతో క్రమంగా ఆ సైరన్లు ఊడుతున్నాయి. మే 1వ తేదీ నుంచి నోటిఫికేషన్ అమలులోకి రానుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పినా, అంతకంటే ముందుగానే కొంతమంది కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ దిశగా ముందడుగు వేస్తున్నారు. అందరికంటే ముందుగా కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తన కారుకు ఉన్న ఎర్రలైటు సైరన్‌ను తీయించేశారు. కేవలం ఎమర్జెన్సీ సర్వీసులకు మాత్రమే ఎర్రలైటు ఉండాలని.. అలాంటప్పుడు తనకు అవసరం లేదు కాబట్టి తన కారు మీద ఉన్న సైరన్‌ను తీయించేశానని ఆయన చెప్పారు. ఆయన తర్వాత కేంద్ర మంత్రులు మహేష్ శర్మ, విజయ్ గోయల్ కూడా ఎర్రబుగ్గలను తమ తమ కార్ల నుంచి తీయించేశారు. ఆ తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా కేంద్ర మంత్రుల బాటలోనే వెళ్లి.. ఆ సైరన్లను తొలగించారు. రాష్ట్ర ప్రభుత్వాలలో నీలిరంగు సైరన్లను వాడుకోవచ్చన్న నిబంధన కూడా మారబోతోందని, కేవలం ముందుగా నిర్ణయించిన ఎమర్జెన్సీ సర్వీసులకు మాత్రమే ఆ సైరన్లు ఉండొచ్చని జైట్లీ చెప్పారు. -
ఢిల్లీలో కేటీఆర్.. కేంద్రమంత్రులతో భేటీ
న్యూఢిల్లీ: తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారికి సంబంధిత శాఖలకు సంబంధించిన వినతి పత్రాలు అందించారు. ముందుగా కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయిన కేటీఆర్ జీహెచ్ఎంసీ పరిధిలోని జాతీయ రహదారుల విస్తరణకు కేంద్రం ఆర్థిక సహాయం చేయాలని కోరారు. అనంతరం ఆర్థికమంత్రి, ప్రస్తుతం హోంశాఖను కూడా నిర్వహిస్తున్న అరుణ్‌జైట్లీని కలిసి కంటోన్మెంట్ ప్రాంతంలో స్కైవేల ఏర్పాటు అత్యవరం అని, ఆ ప్రతిపాదనలకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మరోపక్క, విదేశాంగ వ్యవహారాల సహాయమంత్రి వీకే సింగ్‌ను కలిసి తెలంగాణ ప్రాంతం నుంచి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే వారి సమస్యలు, ఇతర విషయాలు చర్చించారు. ఈసందర్భంగా కూడా కొన్ని వినతులతో కూడిన పత్రాన్ని అందించారు. ఇలా, ఆయా శాఖల మంత్రులను కేటీఆర్ కలుస్తూ ఢిల్లీలో సందడిగా కనిపించారు. కేంద్ర మంత్రులను కలిసిన వారిలో కేటీఆర్‌తోపాటు టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు జితేందర్ రెడ్డి, వినోద్ కుమార్, బాల్కసుమన్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. -
15 మంది కేంద్ర మంత్రులతో వెంకయ్య సమీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో చేపడుతున్న విభిన్న కేంద్ర ప్రాజెక్టులు, పథకాలపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు శుక్రవారం 15 మంది కేంద్ర మంత్రులతో సమీక్ష జరిపారు. రాజ్‌నాథ్‌సింగ్, మనోహర్ పరికర్, సురేష్ ప్రభు, ప్రకాశ్ జవదేకర్, జేపీ నడ్డా, రవిశంకర్ ప్రసాద్, ఉమాభారతి, స్మృతీ ఇరానీ, నరేందర్‌సింగ్ తోమర్, రాధామోహన్ సింగ్, తావర్‌చంద్ గెహ్లాట్, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్, కల్రాజ్ మిశ్రా, మహేష్‌శర్మ, అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరి తదితర కేంద్ర మంత్రులు ఈ చర్చలో పాల్గొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపునకు అవసరమైన చట్ట సవరణను సత్వరం తీసుకురావాలని హోంమంత్రి రాజ్‌నాథ్, న్యాయ మంత్రి రవిశంకర్‌ను వెంకయ్య కోరారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు తయారుచేస్తున్నామని, తర్వాత కేబినెట్‌కు పంపుతామని వారు తెలిపారు. అలాగే ఐఎన్ఎస్ విరాట్‌ను పర్యాటక స్థలిగా మార్చేందుకు ఏపీకి సాయం చేయాలని, నాగాయలంకలో డీఆర్డీవో మిస్సైల్ టెస్ట్ కేంద్రాన్ని, బొబ్బిలిలో నావల్ ఎయిర్ స్టేషన్‌ను ఏర్పాటుచేయాలని రక్షణమంత్రి పరికర్ను కోరారు. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు ప్రకటన చేయాలని కోరగా.. ఈ అంశంలో పురోగతి ఉందని సురేష్ ప్రభు తెలిపినట్టు సమాచారం. అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇస్తే పవర్ కాంప్లెక్స్ ఏర్పాటుకు సిద్ధమని పీయూష్ గోయల్ తెలిపారు. ఈ చర్చల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు, పలువురు టీడీపీ ఎంపీలూ పాల్గొన్నారు. -
‘టీడీపీ కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలి’
రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే తెలుగుదేశం పార్టీ ఎంపీలు, కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలని ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో శుక్రవారం నిర్వహించిన విద్యార్థి, యువజన, ప్రజా గర్జనకు ఆయన విచ్చేసి మాట్లాడారు. రాష్ట్ర ఎంపీలంతా ప్రధాని ఇంటి వద్ద దీక్షలు చేయాలని, హోదా ఆవశ్యకత , ఏపీ ప్రజల డిమాండ్ మోదీకి తెలిసేలా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదాపై పోరాటానికి విద్యార్థులు ముందుకు రావాలన్నారు. కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా వేసే ముష్టి అవసరం లేదని, పూర్తి రాయితీలతో కూడిన ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, వెంకయ్యనాయుడులు చెప్పింది ఇక చాలని, విభజన హామీలు అమలు కావాల్సిందేనని స్పష్టం చేశారు. -
కేంద్రమంత్రులకు బీజేపీ నేతల సత్కారం
ముత్తుకూరు : కృష్ణపట్నంపోర్టుకు ఆదివారం వచ్చిన కేంద్ర మంత్రులు సురేష్ ప్రభాకర్‌ప్రభు, ఎం. వెంకయ్యనాయుడును స్థానిక బీజేపీ నేతలు పట్టుశాలువాలతో సన్మానించారు. ‘పోర్టు సైడ్ కంటైనర్ ఫెసిలిటీ’ విభాగాన్ని ప్రారంభించేందుకు వచ్చిన కేంద్రమంత్రులను స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు వంశీధర్‌రెడ్డి, షేక్ షఫీవుల్లా, రవీంద్రరెడ్డి, రవీంద్ర, ప్రసాద్, పోలయ్య, రఘు, శరత్ తదితరులు సత్కరించారు. మొరాయించిన రిమోట్ పోర్టు సైడ్ కంటైనర్ ఫెసిలిటీ విభాగం ప్రారంభోత్సవానికి వేసిన శిలాఫలకం ఆవిష్కరణలో జాప్యం చోటుచేసుకుంది. రిమోట్ పనిచేయలేదు. దీంతో కేంద్రమంత్రులు వేదిక చివరకు వచ్చి రిమోట్‌తో శిలాఫలకం ఆవిష్కరించాల్సి వచ్చింది. పోర్టు సౌత్ బెర్తు వద్ద సీవీఆర్ లింక్స్ పేరుతో నిర్మించిన గోల్ఫ్‌కోర్సును కేంద్రమంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా గోల్ఫ్ ఆడారు. -
టీడీపీ కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలి
తిరుపతి కల్చరల్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించలేని, చేతకాని టీడీపీకి చెందిన కేంద్ర మంత్రులు వెంటనే రాజీనామా చేసి, పదవుల నుంచి వైదొలగాలని సీపీఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు డిమాండ్ చేశారు. బుధవారం కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో కృష్ణాపురం కూడలి నుంచి నాలుగు కాళ్ల మండపం వరకు నల్ల జెండాలతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014లో నరేంద్రమోదీ తిరుపతిలో జరిగిన బహిరంగసభలో నామాల వాని సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించి, నేడు రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేశారని దుయ్యబట్టారు. మాటల గారడీతో ప్రజల్ని మభ్యపెట్టే అబద్దాల వెంకయ్యనాయుడికి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సీఎం చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో పూర్తి వైఫల్యం చెందారని విమర్శించారు. బాబుకు చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి టీడీపీ వైదొలగాలని, రాష్ట్ర అభివృద్ధికి పాటు పడాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన ప్రదర్శనలో సీపీఐ నాయకులు చిన్నం పెంచలయ్య, బలరామ్, రామకృష్ణ, ఆనంద్, శ్రీధర్‌రావు, పి.మురళి, శ్రీరాములు, శివ, రత్నమ్మ, మునస్వామి, ఇబ్రహీంబాషా, చిన్నం కాళయ్య, మహిళా సమాఖ్య నాయకురాళ్లు మంజుల, లక్ష్మీదేవి, కవిత, లత, సుభాషిణి, జ్యోతి, వరలక్ష్మి, తనికాచలం, శేఖర్ పాల్గొన్నారు. -
ఢిల్లీకి బయల్దేరిన కేసీఆర్
నీతీ ఆయోగ్ సబ్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు సోమవారం రాత్రి సీఎం కేసీఆర్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రెండు రోజుల పాటు దేశ రాజధానిలో పర్యటించనున్న ఆయన విధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ర్టాల్లో అమలుచేసే పథకాలపై నివేదికను ప్రధాని నరేంద్రమోదీకి అందచేస్తారు. కేంద్ర ఆర్థికమంత్రి ఆరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరి లను మంగళవారం కలవనున్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా రాష్ర్టానికి నిధుల పెంపు, ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంపుపై ప్రధాని, కేంద్ర ఆర్థికమంత్రితో సీఎం చర్చించనున్నట్లు తెలుస్తోంది. పనిలో పనిగా.. డిసెంబర్ 23 నుంచి నిర్వహించ తలపెట్టిన ఆయుత మహా చండీ యాగం లో పాల్గొనాల్సిందిగా.. రాష్ట్ర పతి ప్రణబ్, ప్రధాని నరేంద్ర మోడీలను ఆహ్వానించనున్నారు. సీఎం వెంట ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్ వెళ్లనున్నారు. -
'ధైర్యం ఉంటే కేంద్ర మంత్రులతో రాజీనామా చేయించాలి'
తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి లేదని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబుకు ధైర్యం ఉంటే టీడీపీకి చెందిన కేంద్రమంత్రులు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరిలతో రాజీనామా చేయించాలని సవాల్ విసిరారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ అబద్ధాలనే ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ది రావాలనే ఆగస్టు 10న ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధర్నా చేస్తున్నట్టు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి చెప్పారు. -
'కేంద్ర మంత్రుల ఇళ్లను ముట్టడిస్తాం'
కర్నూలు: రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించడంతో పాటు నిధులు మంజూరు చేయాలని ఏపీ విద్యార్థుల జేఏసీ డిమాండ్ చేసింది. ఇందుకు కేంద్ర మంత్రులు కృషి చేయాలని, లేకుంటే వారి ఇళ్లను ముట్టడిస్తామని చెప్పారు. గురువారం రాయలసీమ యూనివర్సిటీలో విద్యార్థుల జేఏసీ నాయకులు ఏపీ ప్రత్యేక హోదాపై సమావేశమై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ డిమాండ్లను తీర్చకుంటే కేంద్ర మంత్రులను రాష్ట్రంలో తిరగనీయకుండా చేస్తామని విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు. -
కేంద్రమంత్రులతో చంద్రబాబు భేటీ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జపాన్ పర్యటన ముగించుకుని దేశ రాజధాని న్యూఢిల్లీకి గురువారం సాయంత్రం చేరుకున్న విషయం తెలిసిందే. నేడు (శుక్రవాం) ఆయన పలువురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నారు. ఏపీలో గోదావరి పుష్కరాలకు కేంద్ర మంత్రులను ఆహ్వానిస్తారని సమాచారం. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం తొలుత కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. తర్వాత ఉదయం 11 గంటలకు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తో.. మధ్యాహ్నం 1.30 గంటలకు కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతితో.. అనంతరం అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ కానున్నారు. -
ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జపాన్ పర్యటన ముగించుకుని గురువారం సాయంత్రం దేశ రాజధాని న్యూఢిల్లీకి చేరుకున్నారు. శుక్రవారం ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్‌తో సెక్షన్ 8, ఫోన్ ట్యాపింగ్, విభజన చట్టం వివాదాలపై చంద్రబాబు వారితో చర్చించనున్నారు. అనంతరం ఉమాభారతి, పీయూష్ గోయల్, ప్రకాశ్ జవదేకర్లను కలువనున్నారు. గోదావరి పుష్కరాలకు కేంద్రమంత్రులను చంద్రబాబు ఆహ్వానించనున్నారు. -
'లలిత్‌మోదీ కేసులో ప్రధాని మౌనమేల?'
-
లలిత్‌మోదీ కేసులో ప్రధాని మౌనమేల? : జైరాం రమేశ్
సాక్షి, హైదరాబాద్: ఎన్ఫోర్సుమెంట్ డెరైక్టరేట్(ఈడీ) కేసుల్లో ఉన్న లలిత్‌మోదీని కేంద్రమంత్రులు వెనుకేసుకొస్తే ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని కేంద్ర మాజీమంత్రి, రాజ్యసభసభ్యుడు జైరాం రమేశ్ ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఈడీ కేసులను ఎదుర్కొంటున్న లలిత్‌మోదీకి కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ సీఎం వసుంధర రాజే మద్దతును ఇస్తున్నారని అన్నారు. లలిత్‌మోదీతో వారికి ఆర్థిక, రాజకీయ, వ్యాపార లావాదేవీలు ఉన్నాయని జైరాం రమేశ్ ఆరోపించారు. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్‌కు నరేంద్రమోదీ, అమిత్‌షా అధ్యక్షులుగా పనిచేసినప్పటి నుంచి లలిత్‌మోదీతో సంబంధాలున్నాయన్నారు. లలిత్‌మోదీ విషయంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నా నరేంద్ర మోదీ అందుకే మౌనంగా ఉన్నాడని అన్నారు. ఐదారు రోజులుగా కళ్లు, చెవులు మూసుకుని లలితాసనంలోనే ప్రధాని మోదీ ఉన్నారని జైరాం ఎద్దేవా చేశారు. అవినీతిని సహించేది లేదని, సుపరిపాలన అందిస్తామని చెబుతున్న ప్రధాని మోదీ ఇంత బహిరంగంగా దొరికిన కేంద్రమంత్రిని, ముఖ్యమంత్రిపై చర్యలెందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల సీఎం కేసీఆర్, చంద్రబాబు ఈ విషయంపై ఎందుకు మాట్లాడటంలేదన్నారు. లలిత్‌మోదీ విషయంలో సీనియర్ నాయుడు, జూనియర్ నాయుడు ఎందుకు మౌనంగా ఉన్నారని జైరాం ప్రశ్నించారు. సీనియర్ నాయుడు ఎవరో, జూనియర్ నాయుడు ఎవరో మీరు తేల్చుకోవాలన్నారు. ఓటుకు కోట్లు కేసు విషయలో ఎక్కువగా మాట్లాడబోనన్నారు. నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న సుష్మాస్వరాజ్, వసుంధర రాజే రాజీనామా చేయాలని జైరాం డిమాండ్ చేశారు. -
విభజన హామీలు అమలు చేయండి
కేంద్రానికి ఏపీ సీఎం చంద్రబాబు వినతి కేంద్ర మంత్రులతో భేటీ.. తుపాను ప్రాంతాలకు సహాయానికి నిధులు విడుదల చేయాలి.. విభజన ఇబ్బందుల పరిష్కారానికి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ: విభజన చట్టంలో పేర్కొన్న హామీలన్నింటినీ త్వరగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కేంద్రాన్ని కోరారు. హుదుహుద్ తుపాను బాధితులకు ప్రధానమంత్రి ప్రకటించిన రూ.1,000 కోట్లలో రూ. 400 కోట్లు మాత్రమే వచ్చాయని, మిగిలిన మొత్తాన్ని త్వరగా విడుదల చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కి విజ్ఞప్తి చేశారు. ఒక్క రోజు పర్యటన కోసం శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వచ్చిన చంద్రబాబునాయుడు పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. నార్త్‌బ్లాక్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. తర్వాత రైల్వే మంత్రిని కలిసి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులు, ఇతర అంశాలపై వినతిపత్రం ఇచ్చా రు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో సమావేశమయ్యారు. విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన పన్ను ప్రోత్సాహకాలు, ప్రత్యేక హోదా తదితర అంశాలపై 30 నిమిషాలకు పైగా చర్చించారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్గడ్కరీతో సమావేశమయ్యారు. కాగా.. జాతీయ స్థాయిలో నదుల అనుసంధానానికి కొంత సమ యం తీసుకుంటుందని, అందుకని మొదట ఆంధ్రప్రదేశ్‌లోని నదులను అనుసంధానం చేస్తే ఉపయో గం ఉంటుందని, దీనికి సహకరించాలని కేంద్రాన్ని కోరినట్లు సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. శుక్రవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. విభజన చట్టంతో వచ్చిన ఇబ్బందుల పరిష్కారానికి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని కేంద్ర హోం శాఖను కోరినట్లు తెలిపారు. ఎన్టీఆర్‌ను తెలుగువారు ఆరాధిస్తున్నారు శంషాబాద్ ఎయిర్‌పోర్టు దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని చంద్రబాబు సమర్థించారు. ‘‘డొమెస్టిక్ ఎయిర్‌పోర్టుకు గతంలో ఎన్టీఆర్ పేరు ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మార్చారు. అది నీతిమాలిన చర్య. అందుకే ఈ రోజు కేంద్ర ప్ర భుత్వం దాన్ని పునరుద్ధరించింది. మళ్లీ ఎన్టీ రామారావు గారి పేరు పెడతామని ఎన్నికల మేనిఫెస్టోలోనూ చెప్పాం. అది చేశాం. కేంద్రంలో మా మంత్రి ఉన్నప్పుడు కూడా చేయకపోతే ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారో కూడా గమనించాలి’’ అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రావాళ్ల పేర్లు ఎలా పెడతారని, రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోలేదని టీఆర్ఎస్ అంటోందని విలేకరులు అనగా.. ‘‘ఎవరు చేశారు ఈ డెవలప్మెంట్? నేను చేశాను. ఎన్టీఆర్ చేశారు. గతంలో కాంగ్రెస్ వాళ్లు పేరు మార్చినప్పుడు ఎందుకు అడగలేదు? ఎన్టీ రామారావు అంటే తెలుగు జాతి గౌరవించే వ్యక్తి. అది తెలంగాణ అయినా, ఆంధ్రా అయినా.. ప్రజలకు మేలు చేసిన వ్యక్తిగా, తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తిగా ఆరాధిస్తున్నారు. పీవీ నర్సింహారావుగారి ఘాట్‌ను ఢిల్లీలో ఏర్పాటు చేయాలని మేం కోరాం. ఒక ప్రాంతమని కాదు. తెలుగు జాతికి న్యాయం జరగాలి’’ అన్నారు. -
ఉల్లాసంగా.. ఉత్సాహంగా
‘స్వచ్ఛ్ భారత్ అభియాన్’లో నిన్న స్మృతి ఇరానీ, నేడు రవిశంకర్ ప్రసాద్ సాక్షి, న్యూఢిల్లీ: ‘స్వచ్ఛ్ భారత్ అభియాన్’ కింద చేపట్టిన పారిశుధ్య కార్యక్రమాల్లో కేంద్ర మంత్రులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ.. ఆర్కేపురంలోని కేంద్రీయ విద్యాలయ మైదానంలో గురువారం చెత్త ఎత్తివేయగా, మరో కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ శుక్రవారం శాస్త్రిభవన్‌లో చీపురుపట్టారు. కేంద్ర టెలికం, న్యాయశాఖ మంత్రి శుక్రవారం శాస్త్రిభవన్ కాంపౌండ్‌లో పారిశుధ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. గదులు, బాత్ రూంలలోకి వెళ్లి పారిశుధ్య పరిస్థితిని పరిశీలించారు. మహాత్మాగాంధీ 150వ జయంతి నాటికి అంటే 2019 అక్టోబర్ రెండో నాటికి దేశాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారని, ఇందులోభాగంగా తమకు ఆదర్శమైన దీన్ దయాళ్ ఉపాధ్యాయ 98వజయంతిని పురస్కరించుకుని పారిశుధ్య కార్యక్రమాన్ని ప్రారంభించామని రవి శంకర్ ప్రసాద్ చెప్పారు. ఈ కార్య్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన్పటికీ స్వచ్ఛ్ భారత్‌ను ప్రజా ఉద్యమంగా మార్చడంలో ఇదొక భాగమని, ఇదే అందుకు ఆరంభమని ఆయన అభిప్రాయపడ్డారు. వచ్చే నెల రెండో తేదీన తాను పాట్నా రైల్వే స్టేషన్లో స్వచ్ఛ్ భారత్ అభియాన్‌ను చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. రెండున విధులకు ప్రభుత్వోద్యోగులు ప్రతి ఏడాదీ గాంధీ జయంతి రోజున హాయిగా కుటుంబసభ్యులతో కాలక్షేపం చేస్తున్న ప్రభుత్వోద్యోగులకు ఈసారి ఆ అవకాశమే లేకుండాపోయిం ది. ఇందుకు కారణం అదే రోజున స్వచ్ఛ్ భారత్ అభియాన్’ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిర్ణయించడమే. దీంతో వా రంతా కంగుతిన్నారు. గాంధీ జయంతి, దసరా, బక్రీద్లతో పాటు శని, ఆదివారాలను కలుపుకుని వరుసగా ఐదు రోజులు సెలవు దినాలు రావడంతో విహారయాత్రకు వెళ్లేందుకు వీరంతా రూపొందిం చుకున్న ప్రణాళికలు ఈ కార్యక్రమం కారణంగా తలకిందులయ్యాయి. ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాలతో పాటు కేంద్ర ప్రభత్వ కార్యాలయాలు గాంధీ జయంతి రోజున పనిచేయనున్నాయి. ఉద్యోగులు వచ్చే నెల రెండో తేదీన తమ తమ కార్యాలయాలకు హాజరై ‘స్వచ్ఛ్ భారత్ శపథం’ చేయాల్సి ఉంటుంది. ప్రతి మంత్రిత్వశాఖ పారి శుధ్య కార్యక్రమాన్ని చేపట్టాలని, ఉన్నతాధికారుల నేతృత్వంలో అన్ని ప్రభుత్వ కార్యాయాలలో గురువారం నుంచి వా రం రోజులపాటు పారిశుధ్య కార్యక్రమం చేపట్టాలంటూ కేబినెట్ కార్యదర్శి అజితసేథ్... కేంద్ర ప్ర భుత్వ కార్యదర్శులందరికీ ఆదేశాలు జారీ చేశారు. యాత్రను రద్దు చేసుకున్నా అక్టోబర్ రెండు నుంచి వరుసగా ఐదు రోజుల సెల వు దినాలను పురస్కరించుకుని కుటుంబసమేతం గా ఉత్తరాఖండ్‌లోని అల్మోడా పరిసర ప్రాంతాలను సందర్శించాలనుకున్నామని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని విమలా భల్లా చెప్పారు. అయితే రెండున సెల వు లేకపోవడంతోయాత్రను రద్దుచే సుకున్నామని అన్నారు. నవరాత్రుల ఆఖరి రోజుకూడా రెండో తేదీయే కావడంతో నవమి పూజకు ఏర్పాట్లు చేసుకున్నవారు కూడా పునరాలోచనలో పడిపోయారు. -
సిట్టింగ్.. షిఫ్టింగ్ !
జిల్లాలోని సిట్టింగ్ ఎంపీలకు స్థానచలనం కేంద్ర మంత్రులిరువురూ మహబూబ్‌నగర్‌కు అభ్యర్థుల ఎంపికపై అధిష్టానం కసరత్తు తాజా పరిణామాలతో ఆశావహుల్లో కొత్త ఆశలు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాలో కాంగ్రెస్ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. లోక్‌సభ సీట్ల అభ్యర్థుల వ్యవహారం ఆ పార్టీలో సరికొత్త మలుపులకు దారితీస్తోంది. చేవెళ్ల, మల్కాజ్గిరి పార్లమెంట రీ స్థానాలకు ప్రాతినిధ్యం విహ స్తున్న కేంద్ర మంత్రులు సూదిని జైపాల్‌రెడ్డి, సర్వే సత్యనారాయణ ఇరువురికీ ఈసారి స్థానమార్పిడి తప్పదనే ప్రచారం జరుగుతోంది. చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ జైపాల్‌రెడ్డి ఈ ఎన్నికల్లో సొంత జిల్లా (మహబూబ్‌నగర్) నుంచి పోటీ చేస్తానని సంకేతాలివ్వడంతో అధిష్టానం.. కొత్త అభ్యర్థిపై కసరత్తు చేస్తోంది. ఇదే క్రమంలో 2009 ఎన్నికల్లో మల్కాజ్గిరి జనరల్ సీటు నుంచి బరిలోకి దిగి ఘన విజయం సాధించిన సర్వేను కూడా ఈ సారి నాగర్‌కర్నూలు నుంచి పోటీ చేయమని అధిష్టానం ఒత్తిడి చేస్తోంది. ఈ పరిణామాలను పరిశీలిస్తే సిట్టింగ్ ఎంపీలు.. అందులోనూ కేంద్ర మంతుల్రిరువురూ కాకతాళీయంగా మహబూబ్‌నగర్ జిల్లాకు షిఫ్ట్ కావడం అనివార్యంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో చేవెళ్ల ఎంపీ టికెట్ అనూహ్యంగా దక్కించుకున్న జైపాల్‌రెడ్డి 18,362 సమీప ప్రత్యర్థి ఏపీ జితేందర్‌రెడ్డిపై విజయం సాధించారు. ఆ తర్వాత యూపీఏ-2 సర్కారులో కొలువుదీరారు. అయితే, గత ఎన్నికల వేళ కేవలం ఒకసారి మాత్రమే ఇక్కడి నుంచి బరిలో దిగుతానని, వచ్చే ఎన్నికలో పోటీచేయనని అప్పట్లో జైపాల్ సెలవిచ్చారు. ఈ క్రమంలోనే ఈ సీటుపై పలువురు ఆశావహులు గంపెడాశలు పెట్టుకున్నారు. జైపాల్‌రెడ్డి సైతం చెప్పినట్లుగానే ఈసారి పాలమూరుకు మారేందుకు సన్నాహాలు చేసుకుంటుండడంతో టికెట్ రేసులో ఉన్న నేతలు తాజాగా దూకుడును మరింత పెంచారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి, రాగం సుజాతయాదవ్, మర్రి శశిధర్‌రెడ్డి పేర్లు ప్రముఖంగా ఇక్కడి నుంచి వినిపిస్తున్నాయి. మరోవైపు మల్కాజ్గిరి నియోజకవర్గంలో వ్యతిరేకతను ఎదుర్కొంటున్న సర్వేను నాగర్‌కర్నూలుకు మార్చాలని ఏఐసీసీ భావిస్తోంది. స్థానిక ఎమ్మెల్యేలతో పొసగకపోవడం, ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నట్లు అంతరంగిక సర్వేల్లో తేలడంతో సర్వే స్థానే కొత్తవారిని రంగంలోకి దించాలని యోచిస్తోంది. ఈ క్రమంలో ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన నాగర్‌కర్నూలుకు షిఫ్ట్ చేయాలని అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని చేవెళ్ల, మల్కాజ్గిరి ఎంపీలిద్దరు వేరే నియోజకవర్గాలకు మారడం తథ్యంగా కనిపిస్తోంది. ఇదిలావుండగా, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ సెగ్మెంట్ ఉన్న భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి అభ్యర్థిత్వంపైనా అనుమానాలు తలెత్తుతుండడం గమనార్హం. ఈ స్థానాన్ని టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఆశిస్తున్నట్లు ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి స్పష్టం చేయడం, తాను కాకపోతే కోడలు వైశాలి పేరును పరిశీలించాలని సిఫార్సు చేయడం చూస్తే కోమటిరెడ్డికి చెక్ పెడుతున్నట్లు అర్థమవుతోంది. ఇదే జరిగితే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు స్థానంలో కొత్త అభ్యర్థులు తెరమీదకు వచ్చే అవకాశముంది. -
సమైక్యమే లక్ష్యం
కడప రూరల్, న్యూస్‌లైన్ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక పిలుపు మేరకు ఎన్జీఓలు చేపట్టిన సమ్మె మంగళవారం నాటికి ఆరు రోజులు పూర్తి చేసుకుంది. జిల్లావ్యాప్తంగా సమైక్యమే లక్ష్యంగా ఎన్జీఓలు ముందుకు సాగుతున్నారు. వివిధ రూపాల్లో ఆందోళనలు చేపడుతున్నారు. ఉద్యోగుల విధుల బహిష్కరణతో యథావిధిగా కార్యాలయాలు మూతపడ్డాయి. ఉద్యమంలో భాగంగా థియేటర్లు, పెట్రోల్ బంక్‌ల బంద్ సంపూర్ణంగా జరిగింది. బుధవారం రహదారుల దిగ్బంధనానికి ఎన్జీఓలు పిలుపునిచ్చారు. కడపలో ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు ఆధ్వర్యంలో థియేటర్లు, పెట్రోల్ బంక్‌ల బంద్‌ను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ రాజ్యాంగానికి విరుద్ధంగా విభజన జరుగుతోందని దుయ్యబట్టారు. పార్లమెంట్లో సీమాంధ్ర ఎంపీలు, కేంద్ర మంత్రులు ఏకమై విభజన బిల్లును అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎన్జీఓ నేతలు నిత్యపూజయ్య, చిన్నయ్య, డీఎంహెచ్ఓ జేఏసీ నాయకులు నాగలక్ష్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మైదుకూరులో విద్యార్థులు, ఉపాధ్యాయులు కదం తొక్కారు. ఆరు పాఠశాలలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు నగరంలో భారీ ర్యాలీ, మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాలుగురోడ్ల కూడలిలో ఉపాధ్యాయుడు అంకన్న విభజనకు నిరసనగా, సమైక్యాంధ్రకు మద్దతుగా గుండు గీయించుకొని నిరసన వ్యక్తంచేశారు. మైదుకూరు పట్టణం సమైక్యాంధ్ర నినాదాలతో దద్దరిల్లింది. రాజంపేటలో సమైక్య పరిరక్షణ వేదిక, ఎన్జీఓ ఛెర్మైన్ వెంకటరమణ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు లక్ష్మినారాయణ, శరత్‌కుమార్ ఆధ్వర్యంలో ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై విద్యార్థులు ధర్నా చేపట్టారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. -
గాడిదలు.. మూర్ఖులు..
అనంతపురం రూరల్, న్యూస్‌లైన్ : సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు విరుచుకుపడ్డారు. వారు గాడిదలు.. మూర్ఖులు అంటూ ధ్వజమెత్తారు. శుక్రవారం నగరంలోని ఎన్జీఓ కార్యాలయంలో ఆ సంఘం జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్య ఉద్యమంలో ఐదేళ్ల పిల్లవాడి నుంచి వయో వృద్ధుల వరకు పెద్దఎత్తున పాల్గొంటే... సీమాంధ్ర ప్రజాప్రతినిధులు మాత్రం ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఇప్పటికైనా సోనియాగాంధీ భజన మానుకోవాలని హితవు పలికారు. సీమాంధ్రలో అన్ని రాజకీయ పార్టీలు ఒకే వేదికపైకి రావాలని, రాజకీయ విభేదాలను పక్కనబెట్టి ఉద్యమం చేయాలని కోరారు. 1956 కంటే ముందున్న తెలంగాణ కావాలంటే ఖమ్మం, నల్గొండ జిల్లాలు ముక్కలు కావాల్సిందేనన్నారు. సమైక్యాంధ్ర విషయంలో ఏ ఒక్క అంశంలోనూ రాజీపడే ప్రసక్తేలేదన్నారు. యూటీ వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదన్నారు. రాజ్యాంగం, చట్టాలను ఉల్లంఘించడం యూపీఏ ప్రభుత్వానికి వెన్నతో పెట్టిన విద్య అని, అలా ఉల్లంఘించి రాష్ట్ర విభజనకు పూనుకున్నా రాష్ట్రపతి ఆమోదం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ లభించదని చెప్పారు. తెలంగాణ బి ల్లును పార్లమెంట్లో పెడితే.. మరుక్షణమే గుర్ఖాలాండ్ తదితర నాలుగు రాష్ట్రాల ఉద్యమాలు పుట్టుకొస్తాయన్నారు. ఉద్యోగులకు ఉద్యమం, ఉద్యోగం రెండు కళ్లు లాంటివన్నారు. ఉద్యమ కాలానికి సం బంధించి ప్రభుత్వం అడ్వాన్స్ ఇచ్చినా.... కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రం ఇప్పటి వరకు వేతనాలు అందలేదన్నారు. ఈ విషయమై సీఎంతో మాట్లాడగా... సంబంధిత ఫైలుపై సంతకం చేశారన్నారు. ఉద్యోగులకు పీఆర్‌తో పాటు ఐఆర్ ఇవ్వాలన్నారు. హెల్త్‌కార్డుల్లో మార్పులు చేయాలన్నారు. వీటిపైనా సీఎంతో మాట్లాడతామన్నారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయించడానికి ప్ర యత్నిస్తామన్నారు. అవసరమైతే ఉద్యోగులకు అందే పీఆర్, ఐఆర్ ఒకట్రెండు శాతమైనా తగ్గించుకుని...కాంట్రాక్టు ఉద్యోగులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం సమైక్యాంధ్ర ఉ ద్యమంపై ఉపాధ్యాయ జేఏసీ నాయకుడు ఎంవీ రమణారెడ్డి ఆధ్వర్యంలో రూపొందించిన ‘సమైక్యాం ధ్ర- ఇదీ మన చరిత్ర’ అనే పుస్తకాన్ని అశోక్‌బాబు ఆవిష్కరించారు. సమావేశంలో ఎన్జీఓ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, జిల్లా అధ్యక్షుడు దేవరాజు, సంయుక్త అధ్యక్షుడు అతావుల్లా, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనరసయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు ఈశ్వరయ్య, రెవెన్యూ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు బి.వెంకటేశ్వర్లు, ధర్మవరం సమైక్య జేఏసీ కన్వీనర్ రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. -
ఈరోజు ప్రదానితోభేటీ కానున్న సీమాంధ్ర కేంద్రమంత్రులు
-
సమైక్యమన్న నోట..ప్యాకేజీల పాట
-
విభజన అనివార్యమని దమ్ముంటే ప్రజల్లోకి వెళ్లి చెప్పాలి
-
లోక్ సభలో సీమాంధ్రకేంద్ర మంత్రుల చిరునవ్వులు
-
పూటకో మాట...రోజుకో ఆట...