‘టీడీపీ కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలి’
‘టీడీపీ కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలి’
Published Fri, Aug 19 2016 7:53 PM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే తెలుగుదేశం పార్టీ ఎంపీలు, కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలని ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో శుక్రవారం నిర్వహించిన విద్యార్థి, యువజన, ప్రజా గర్జనకు ఆయన విచ్చేసి మాట్లాడారు. రాష్ట్ర ఎంపీలంతా ప్రధాని ఇంటి వద్ద దీక్షలు చేయాలని, హోదా ఆవశ్యకత , ఏపీ ప్రజల డిమాండ్ మోదీకి తెలిసేలా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదాపై పోరాటానికి విద్యార్థులు ముందుకు రావాలన్నారు. కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా వేసే ముష్టి అవసరం లేదని, పూర్తి రాయితీలతో కూడిన ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, వెంకయ్యనాయుడులు చెప్పింది ఇక చాలని, విభజన హామీలు అమలు కావాల్సిందేనని స్పష్టం చేశారు.
Advertisement
Advertisement