న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జపాన్ పర్యటన ముగించుకుని దేశ రాజధాని న్యూఢిల్లీకి గురువారం సాయంత్రం చేరుకున్న విషయం తెలిసిందే. నేడు (శుక్రవాం) ఆయన పలువురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నారు. ఏపీలో గోదావరి పుష్కరాలకు కేంద్ర మంత్రులను ఆహ్వానిస్తారని సమాచారం.
ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం తొలుత కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్తో చంద్రబాబు భేటీ అయ్యారు. తర్వాత ఉదయం 11 గంటలకు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తో.. మధ్యాహ్నం 1.30 గంటలకు కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతితో.. అనంతరం అమిత్ షా, రాజ్నాథ్సింగ్తో భేటీ కానున్నారు.
కేంద్రమంత్రులతో చంద్రబాబు భేటీ
Published Fri, Jul 10 2015 10:32 AM | Last Updated on Sat, Jul 28 2018 6:48 PM
Advertisement
Advertisement