
ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జపాన్ పర్యటన ముగించుకుని గురువారం సాయంత్రం దేశ రాజధాని న్యూఢిల్లీకి చేరుకున్నారు. శుక్రవారం ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్తో సెక్షన్ 8, ఫోన్ ట్యాపింగ్, విభజన చట్టం వివాదాలపై చంద్రబాబు వారితో చర్చించనున్నారు. అనంతరం ఉమాభారతి, పీయూష్ గోయల్, ప్రకాశ్ జవదేకర్లను కలువనున్నారు. గోదావరి పుష్కరాలకు కేంద్రమంత్రులను చంద్రబాబు ఆహ్వానించనున్నారు.