
చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాతే ఏపీ కేంద్రమంత్రులు
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్రమంత్రుల బాధ్యతల స్వీకారానికి ముహూర్తాలు ఖరారయ్యాయి. ఈనెల 13న ఉదయం 11 గంటల కు జి.కిషన్‌రెడ్డి కేంద్ర బొగ్గు, గనుల శాఖమంత్రి గా శాస్త్రి భవన్‌లోని ఆ శాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. కేంద్ర హోంశాఖ సహా య మంత్రిగా బండి సంజయ్ నార్త్ బ్లాక్‌లోని తన చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించనున్నారు.
తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్రమంత్రులు సీఎంగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం తర్వాత బాధ్యతలు స్వీకరించే అవకాశముంది. కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రిగా రామ్మోహన్ నాయు డు, కేంద్ర సహాయ మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్ గురువారం లేదా శుక్రవారం, శ్రీనివాస వర్మ శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నారు.