responsibilities
-
‘స్టార్’ హోటల్‌కు తెలంగాణ భవన్ బాధ్యతలు!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నిర్మించనున్న తెలంగాణ భవన్ నిర్మాణ బాధ్యతలను పేరు గాంచిన స్టార్ హోటల్‌కు అప్పగించే ఆలోచనలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నట్లు సమాచారం. నిర్మాణంతో పాటు నిర్వహణను సైతం స్టార్ హోటల్ యాజమాన్యమే చూసుకునేలా చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. వాస్తవానికి ఇటీవల మీడియాతో జరిపిన చిట్‌చాట్‌లోనే సీఎం ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు.దాదాపు రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్ల బడ్జెట్‌తో నిర్మించే ఈ ఐకానిక్ భవనాన్ని దేశానికి రోల్‌మోడల్‌గా ఉండేలా నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే రెండు కంపెనీలు ఇచి్చన ప్రెజెంటేషన్‌ను రోడ్లు, భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పరిశీలించారు. వీటిలో కొన్ని మార్పులు చేర్పులు చేసి మరో డిజైన్‌తో రావాలని సూచించారు. అయితే ఇప్పటికే డిజైన్లను ప్రెజెంట్ చేసింది ‘స్టార్ హోటల్’కు సంబంధించిన వారా? లేక ఇతర ప్రైవేటు సంస్థలా? అనేది తేలాల్సి ఉంది. రెండుచోట్ల భవనాలు ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ విభజన గత మార్చి నెలలో పూర్తి అయ్యింది. ఏపీ భవన్ మొత్తం 19.781 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా ఏపీకి 11.536 ఎకరాలు, తెలంగాణకు 8.245 ఎకరాలను కేటాయిస్తూ మార్చి 15న కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఏపీ భవన్ మొత్తం విలువ రూ.9,913.505 కోట్లు అని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. తెలంగాణకు 8.245 ఎకరాలు కేటాయించగా.. ఇందులో 3 ఎకరాల విస్తీర్ణంలో శబరి బ్లాక్, 5.245 ఎకరాల విస్తీర్ణంలో పటౌడీ హౌస్ ఉన్నాయి.శబరి బ్లాక్ ఏరియా అంతా హైదరాబాద్ హౌస్ పక్కకు ఉంటుంది. ఈ ఏరియాలోనే గవర్నర్ బ్లాక్, ముఖ్యమంత్రి బ్లాక్, రాష్ట్ర కేబినెట్ మంత్రుల బ్లాక్.. మూడూ కలిపి 5.245 ఎకరాల స్థలంలో ఒక భవనం నిర్మించనున్నారు. ఇక 3 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పటౌడీ హౌస్ స్థలంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉండేందుకు సౌకర్యవంతమైన భవనాన్ని నిర్మించనున్నారు. ప్రతిరోజూ 100 రూమ్‌లు తెలంగాణ వారికే.. దేశానికే రోల్ మోడల్‌గా నిలిచేలా తెలంగాణ భవన్‌ను తీర్చిదిద్దాలని భావిస్తున్న నేపథ్యంలోనే స్టార్ హోటల్‌కు నిర్మాణ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్లు తెలిసింది. తాజ్ గ్రూప్ లేదా ఇతర స్టార్ హోటల్ గ్రూప్‌కు అప్పగించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం. ప్రతిరోజూ ఒక వంద రూమ్‌లు తెలంగాణ నుంచి వచి్చన వారికి కేటాయించేలా చర్యలు తీసుకోనున్నారు. -
రేపు కేంద్రమంత్రులుగా కిషన్‌రెడ్డి, సంజయ్ బాధ్యతలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్రమంత్రుల బాధ్యతల స్వీకారానికి ముహూర్తాలు ఖరారయ్యాయి. ఈనెల 13న ఉదయం 11 గంటల కు జి.కిషన్‌రెడ్డి కేంద్ర బొగ్గు, గనుల శాఖమంత్రి గా శాస్త్రి భవన్‌లోని ఆ శాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. కేంద్ర హోంశాఖ సహా య మంత్రిగా బండి సంజయ్ నార్త్ బ్లాక్‌లోని తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించనున్నారు.తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్రమంత్రులు సీఎంగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం తర్వాత బాధ్యతలు స్వీకరించే అవకాశముంది. కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రిగా రామ్మోహన్ నాయు డు, కేంద్ర సహాయ మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్ గురువారం లేదా శుక్రవారం, శ్రీనివాస వర్మ శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. -
జనగామ బరిలో నేనే ఉంటా
జనగామ: తెలంగాణ ఆర్టీసీ సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినా.. జనగామలో బీఆర్ఎస్ తరపున బరిలో తానే ఉంటానని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. ఆదివారం టీఎస్ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడానికి కుటుంబసభ్యులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి హైదరాబాద్ వెళ్లిన ముత్తిరెడ్డి.. కార్యక్రమం అనంతరం ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. సీఎం కేసీఆర్ నిర్ణయమే శిరోధార్యమని, ఆ మేరకే ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినట్లు చెప్పారు. అంతకుముందు ఆయన హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్య త లు స్వీకరించారు. కుటుంబ సభ్యులతో కలిసి దేవుళ్ల చిత్రపటాల వద్ద పూజలు నిర్వహించిన అనంతరం ఫైల్‌పై తొలి సంతకం చేశారు. సీఎం కేసీఆర్ తనపై నమ్మకం ఉంచి అప్పగించిన ఈ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ సంస్థ పురోగతికి కృషి చేస్తానన్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ ఎండీగా ఉంటూ సంస్థను లాభాల బాట పట్టించేందుకు కృషి చేస్తున్నారని, తాను కూడా సంస్థ ఉద్యోగుల్లో ఒకడిగా వ్యవహరిస్తూ సంస్థ బాగుకు యత్నిస్తానని తెలిపారు. అనంతరం ఎండీ సజ్జనార్ ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శాలువా కప్పి అభినందించారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
ముకేశ్ అంబానీ బాటలోనే..
న్యూఢిల్లీ: బిలియనీర్ ముకేశ్ అంబానీ బాటలోనే ఆయన ఇద్దరు కుమారులు, కుమార్తె జీతాలు తీసుకోకుండా బాధ్యతలు నిర్వహించనున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డు, కమిటీ సమావేశాలలో పాలుపంచుకుంటున్నందుకు ఆకాశ్, ఈషా, అనంత్ ఫీజులు మాత్రమే పొందనున్నారు. అంతేకాకుండా నికర లాభాల నుంచి కమీషన్ అందుకోను న్నారు.ముకేశ్ సంతానాన్ని బోర్డులో నియమించేందుకు వాటాదారుల అనుమతి కోరుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా ఈ అంశాలను వెల్లడించింది. 66ఏళ్ల అంబానీ 2020–21 ఏడాది నుంచి ఎలాంటి జీతాన్ని అందుకోవడంలేదు. అయితే అంబానీ బంధువులు నిఖిల్, హిటల్ వేతనాలతోపాటు.. ఇతర అలవెన్సులు తదితరాలను పొందుతున్నారు. (వాహన స్క్రాపేజీ పాలసీ: కంపెనీలకు నితిన్ గడ్కరీ కీలక సూచనలు) నీతా అంబానీ తరహాలో 2014లో ముకేశ్ భార్య నీతా అంబానీ ఎంపిక తరహాలోనే కవలలు 31ఏళ్ల ఆకాశ్, ఈషా సహా 28ఏళ్ల అనంత్‌ను ఆర్ఐఎల్ బోర్డులో నియమించనున్నారు. 2022–23లో నీతా అంబానీ రూ. 6 లక్షల సిటింగ్ ఫీజు, రూ. 2 కోట్ల కమీషన్ అందుకున్నట్లు ఆర్ఐఎల్ తాజా వార్షిక నివేదికలో పేర్కొంది. గత నెలలో నిర్వహించిన కంపెనీ వార్షిక సమావేశంలో ఆర్ఐఎల్ బోర్డులోకి ముగ్గురునీ ఎంపిక చేశారు. అయితే ముకేశ్ ఆర్ఐఎల్ చైర్మన్, సీఈవోగా మరో ఐదేళ్లు బాధ్యతలు నిర్వహించనున్నారు. తద్వారా తదుపరితరం నాయకులకు మార్గదర్శకత్వం వహించనున్నారు. కాగా.. ముకేశ్ సంతానాన్ని బోర్డులో నియమించేందుకు వీలుగా ఆర్ఐఎల్ పోస్టల్ బ్యాలట్ ద్వారా వాటాదారుల అనుమతి కోరుతోంది. (సీఈవో సంచలన వ్యాఖ్యలు: ఉద్యోగుల నెత్తిన పిడుగు) -
కలెక్టర్ల నేతృత్వంలో వీఆర్ఏల విలీనం.. మార్గదర్శకాలు జారీ
సాక్షి, హైదరాబాద్: గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ)ను వివిధ ప్రభుత్వ శాఖల్లో విలీనం చేసుకునే ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదలయ్యాయి. భూపరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తల్ మంగళవారం ఈ మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు ఇచ్చారు. వీఆర్ఏల విలీన ప్రక్రియను జిల్లా కలెక్టర్లు నిర్వహించాల్సి ఉంటుంది. ఖాళీల గుర్తింపు ప్రకటన నుంచి కేటాయింపు వరకు కలెక్టర్లే బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది. 61 ఏళ్లు నిండితే కారుణ్య ఉద్యోగం 61 ఏళ్లు దాటిన వీఆర్ఏల కుమారుడు లేదా కుమార్తెకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చేందుకు అవసరమైన మార్గదర్శకాలను కూడా ఉత్తర్వుల్లో పొందుపరిచారు. కారుణ్య ఉద్యోగం కోసం ఈ ఏడాది జూలై 31 నాటికి వీఆర్ఏ వయస్సును పరిగణనలోకి తీసుకుంటారు. ఈ నియామకాల కోసం దరఖాస్తు ఫార్మాట్‌ను రూపొందించారు. దీని ప్రకారం దరఖాస్తు చేసుకోవడంతో పాటు సదరు వీఆర్ఏ కూడా అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇతర కుటుంబసభ్యుల నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) సమరి్పంచాల్సి ఉంటుంది. పుట్టిన తేదీ, విద్యార్హత, కుల, నివాస ధ్రువపత్రాలు, ఆధార్ వివరాలను జత పరచాల్సి ఉంటుంది. ఈ కారుణ్య నియామకాల ప్రక్రియను జిల్లా కలెక్టర్లు ఈనెల ఐదో తేదీలోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. వీఆర్ఏల విలీనం మార్గదర్శకాలివే.. తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్విస్ రూల్స్‌లోని రూల్ 10(ఏ) ప్రకారం వీఆర్ఏలను ఇతర ప్రభుత్వ శాఖల్లో విలీనం చేసుకుంటారు. ఇదే నియమం ప్రకారం కారుణ్య నియామకాలు కూడా చేపడతారు. విద్యార్హతల ఆధారంగా ప్రభుత్వ శాఖల్లోని చివరి స్థాయి సర్విసు/రికార్డు అసిస్టెంట్/జూనియర్ అసిస్టెంట్ తత్సమాన హోదాల్లో వీఆర్ఏలను రెగ్యులర్ స్కేల్ ఉద్యోగులుగా తీసుకుంటారు. జిల్లాల వారీగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఆయా హోదాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు, ఆ జిల్లాలో విలీనం చేసుకోవాల్సిన వీఆర్ఏల సంఖ్యను కలెక్టర్లు ప్రకటించాలి.వాటి ఆధారంగా వీఆర్ఏల విలీనం, కారుణ్య నియామకాల కోసం అవసరమైతే రెగ్యులర్ లేదా సూపర్ న్యూమరీ పోస్టులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ జిల్లాలో ఉన్న ఖాళీలకు మించి వీఆర్ఏలను విలీనం చేసుకోవాల్సి వస్తే వారిని ఇతర జిల్లాలకు కూడా పంపవచ్చు. అలా పంపాల్సి వస్తే సదరు వీఆర్ఏల వివరాలను ప్రస్తుత జిల్లా కలెక్టర్ ప్రకటిస్తారు. అలా ప్రకటించిన తర్వాత సదరు వీఆర్ఏలు తమకు కేటాయించిన జిల్లా కలెక్టర్‌కు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఆ జిల్లా కలెక్టర్ వీఆర్ఏను ఏదైనా శాఖలో విలీనం చేసుకుంటూ ఉత్తర్వులు జారీ చేస్తారు. అదే జిల్లాలో సర్దుబాటు చేసినా, ఇతర జిల్లాలకు పంపినా కలెక్టర్ కేటాయింపు ఉత్తర్వులు వెలువడిన వెంటనే తహసీల్దార్లు వీఆర్ఏలను రిలీవ్ చేయాల్సి ఉంటుంది. ఏ శాఖలకు పంపితే ఆయా శాఖల సర్వీసు రూల్స్ వీఆర్ఏలకు వర్తిస్తాయి. ఒక్కసారి కేటాయించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ మార్పు ఉండదు. తమను మార్చాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకునే అవకాశం కూడా ఉండదు. కేటాయింపు ఉత్తర్వులు వెలువడిన వెంటనే వీఆర్ఏలు సంబంధిత అధికారికి రిపోర్టు చేయాలి. ఆ అధికారి బేషరతుగా వారిని విధుల్లోకి తీసుకుని పోస్టింగు ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. తహసీల్దార్లను వెంటనే రిలీవ్ చేయండి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మల్టిజోన్లలోని ఇతర జిల్లాలకు బదిలీ అయిన తహసీల్దార్లను వెంటనే రిలీవ్ చేయాలని సీసీఎల్ఏ నవీన్ మిత్తల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇతర జిల్లాల నుంచి వచ్చే తహసీల్దార్లను విధుల్లోకి తీసుకోవాలని, ఈసీఐ నిబంధనలకు అనుగుణంగా డిక్లరేషన్లు కూడా పొందుపర్చాలని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 410 మందికి పైగా తహసీల్దార్లు గత నెల 31న బదిలీ అయిన విషయం తెలిసిందే. ఇలావుండగా తహసీల్దార్ నుంచి డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు పొందిన మరో 9 మందికి మంగళవారం పోస్టింగులిస్తూ రెవెన్యూ ముఖ్య కార్యదర్శి హోదాలో నవీన్ మిత్తల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
నెలకు లక్షన్నర జీతం: యాపిల్ ఫోనూ వద్దు, కారూ వద్దు, ఎందుకు? వైరల్ ట్వీట్
మన గతంలో చాలామంది సక్సెస్ఫుల్ వ్యాపారవేత్తల స్టోరీల గురించి తెలుసుకున్నాం. వీరిలో చాలామంది ఆదాయంలో ఖర్చుకంటే పొదుపునకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. విలాసాలకు పోకుండా, సాధారణ జీవితాన్ని గడుపుతూనే ఎన్నో ఉన్నత శిఖరాల నధి రోహించిన వారి జర్నీల గురించి విన్నాం. ఈ లిస్ట్‌లో తాజాగా వీసీ మీడియా కోఫౌండర్, కంటెంట్ స్పెషలిస్ట్ సుశ్రుత్ మిశ్రా చేరారు. డబ్బును ఎప్పుడు, ఎక్కడ,ఎలా పెట్టుబడి పెట్టాలో అర్థం చేసుకోవడమే తెలివైన వ్యాపారవేత్త లక్షణం.ఎంత డబ్బు సంపాదించాం అన్నది ముఖ్యంకాదు. ఎంత పొదుపు చేయగలిగాం, పెట్టుబడి ద్వారా ఎంత రిటర్న్స్ సాధించాం అనేది ముఖ్యం. ఈ క్రమంలో సుశ్రుత్ మిశ్రా ట్వీట్ వైరల్‌గా మారింది. 1.7 మిలియన్ల వ్యూస్‌ను, 12.8 వేల లైక్స్‌ను సొంతం చేసుకుంది. (ఒకప్పుడు రెస్టారెంట్లో పని:.. ఇప్పుడు లక్షల కోట్ల టెక్ కంపెనీ సీఈవో) నెలకు 1.5 లక్షలకు పైగా సంపాదించే 23 ఏళ్ల సుశ్రుత్ మిశ్రా తనకు యాపిల్ ఐఫోన్ గానీ, కారుకానీ, కనీసం బైక్ కూడా లేదని ట్వీట్ చేశాడు. ఈ విలాసాలకంటే రిటైర్ అయిన తల్లిదండ్రులు ఆనందంగా గడిపేలా చూడటం, బిల్లులు చెల్లింపులు, భవిష్యత్తు ఎదుగుదల ప్రణాళికలే ఇందుకు కారణమని మిశ్రా చెప్పుకొచ్చాడు. కొడుకుగా అమ్మనాన్నల బాధ్యత అని తెలిపారు. దీన్ని అందరికీ తెలిసేలా గ్లామరైజ్ చేయాలనుకున్నా అంటూ ట్వీట్ చేశాడు. సుశ్రుత్ మిశ్రా లైఫ్ స్టైల్ చాలామందకి ప్రేరణగా నిలిచింది. ఇది ఇండియా స్టోరీ. 2011లో రూ. 35 వేల జీతం ఉన్నపుడు తాను కూడా ఇలాగే చేశానని ఒకరు వ్యాఖ్యానించారు. అయితే దీనిపై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. (లేఆఫ్స్ సెగ: అయ్యయ్యో మార్క్ ఏందయ్యా ఇది!) తనకూ పైబాధ్యతలన్నీ ఉన్నాయి..కుటుంబ ఖర్చులు, చెల్లెలి చదువు భవిష్యత్తు పెట్టుబడులు. అమ్మ మందులు, సొంత ఇంటి కోసం పొదుపు, కొన్ని ఇతర ఖర్చులు ఇవన్నీ నా కోరికల కంటే మించినవి..కానీ బైక్, ఐఫోన్‌ను సొంతం చేసుకోవడం మీకెందుకు అడ్డంకిగా ఉన్నాయి? అని మరొక వినియోగదారు కమెంట్ చేశారు. కాగా కంటెంట్, మార్కెటింగ్ ఏజెన్సీ వ్యాపారాన్ని సుశ్రుత్ మిశ్రా, రోషన్ శర్మ కలిసి స్థాపించారు. (అదరగొట్టిన పోరీలు..ఇన్‌స్టాను షేక్ చేస్తున్న వీడియో చూస్తే ఫిదా!) I'm a 23yo with ₹1.5 lakh+ monthly income. Yet: - I don't own any 'Apple' - I don't live on my own - I don't have a bike/car Why? Responsibilities of an Indian son who: - Retired his parents - Pays all the bills - Plans for his family's future I want to glamourize this. — Sushrut Mishra (@SushrutKM) June 9, 2023 -
తెలంగాణ కాంగ్రెస్.. అన్నీ ఆ ఆరుగురే! త్వరలో జాబితా విడుదల?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్‌లో సంస్థాగత పని విభజన ప్రక్రియ ఊపందుకుంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు ఇటీవల పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులుగా నియమితులైన వారికి లోక్‌సభ నియోజకవర్గాల వారీగా బాధ్యతలు అప్పగించేందుకు ముమ్మర కసరత్తు జరుగుతోంది. ఒక పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్‌కు పూర్తి స్థాయి బాధ్యతలు పార్టీ అప్పజెప్పనుంది. వారికి తోడుగా ఇద్దరు ఉపాధ్యక్షులను కూడా నియమించనుంది. ఈ క్రమంలోనే ఏ వర్కింగ్ ప్రెసిడెంట్, ఉపాధ్యక్షులకు ఏ పార్లమెంటు నియోజకవర్గం అప్పగించాలన్న దానిపై టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఇక టీపీసీసీ ప్రధాన కార్యదర్శులకు అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించనున్నారు. రాష్ట్రంలోని ప్రతి రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక ప్రధాన కార్యదర్శిని సమన్వయకర్తగా నియమించాలని, ఒక పార్లమెంటు పరిధిలోనికి వచ్చే ముగ్గురు అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలతో పాటు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్, ఇద్దరు ఉపాధ్యక్షులు కలిపి మొత్తం ఆరుగురు నాయకులను ఒక లోక్‌సభ నియోజకవర్గంలో రంగంలోకి దింపనుంది. ఎక్కడా సమన్వయ లోపం లేకుండా.. గాంధీభవన్ నుంచి రాష్ట్రంలోని ప్రతి పోలింగ్ బూత్ వరకు ఎక్కడా సమన్వయ లోపం లేకుండా చూసేందుకు ఈ పని విభజన చేపడుతున్నామని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, స్థానిక నాయకులకు తోడుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు క్షేత్రస్థాయిలో పని చేస్తారని చెబుతున్నాయి. ఒకవేళ వీరిలో ఎన్నికల్లో పోటీ చేసే నేతలున్నట్టైతే వారి స్థానాలకు వెళ్లిపోతారని, మిగిలిన వారంతా ఆ పార్లమెంటు స్థానం పరిధిలోనే ఎన్నికలు పూర్తయ్యేంతవరకు పనిచేస్తారని తెలిపాయి. కిందిస్థాయి నుంచి పైవరకు అన్ని వ్యవహారాలను చక్కదిద్దే బాధ్యతతో పాటు సమన్వయం, పర్యవేక్షణ, పార్టీ కార్యక్రమాల అమలు లాంటి అంశాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం ఈ ఇన్చార్జులకు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థికి అనుగుణంగా ఎన్నికల సమయంలో పనిచేయించడంతో పాటు ఎన్నికలకు ముందు ఆ నియోజకవర్గంలో పార్టీ కేడర్‌ను ఉత్సాహపరిచే బాధ్యతను ఈ ఇన్చార్జులు తీసుకుంటారని, అంతర్గత సమస్యల నుంచి ఎన్నికల సంఘం సూచనల వరకు అన్ని అంశాల్లోనూ ఈ ఆరుగురు నేతలు కీలకంగా వ్యవహరిస్తారని తెలుస్తోంది. ఎన్నికలు ముగిసే వరకు అక్కడే.. స్థానిక నేతలు, పార్టీ తరఫున అసెంబ్లీ.. లోక్‌సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో కలిసి 2023 అసెంబ్లీ, 2024 పార్లమెంటు ఎన్నికలు ముగిసేంతవరకు ఈ ఆరుగురు నేతలు వారికి కేటాయించిన లోక్‌సభ నియోజకవర్గంలోనే పని చేయనున్నారు. ఈ మేరకు పార్లమెంటరీ నియోజకవర్గాల వారీ జాబితాను కూడా త్వరలోనే అధికారికంగా విడుదల చేయనున్నట్టు సమాచారం. -
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చెల్లుబోయిన వేణు
సాక్షి, అమరావతి: బీసీ సంక్షేమం, సినిమాటోగ్రఫీ, ఐ అండ్ పీఆర్ శాఖ మంత్రిగా రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. సచివాలయం రెండో బ్లాక్‌లోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజల అనంతరం చెల్లుబోయిన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ ముదనూరి ప్రసాదరాజు, ఐ అండ్ పీఆర్ శాఖాధికారులు మంత్రికి అభినందనలు తెలిపారు. నేపథ్యం పేరు: చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణ నియోజకవర్గం: రామచంద్రాపురం స్వస్థలం: అడవిపాలెం తల్లిదండ్రులు: సుభద్రమ్మ, వెంకన్న (లేట్) పుట్టినతేదీ: డిసెంబర్ 23, 1962 విద్యార్హతలు: బీఏ సతీమణి: వరలక్ష్మి సంతానం: కుమారులు నరేన్, ఉమాశంకర్ జిల్లా: కోనసీమ రాజకీయ నేపథ్యం: 2001లో రాజోలు జెడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందారు. 2006లో తూర్పు గోదావరి జిల్లా జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2008–12లో తూర్పుగోదావరి డీసీసీ అధ్యక్షుడిగా, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడిగా పనిచేశారు. 2013లో వైఎస్సార్సీపీ కాకినాడ రూరల్ కో ఆర్డినేటర్‌గా నియమితులయ్యారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. 2019లో రామచంద్రపురం నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా గెలుపొందారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రివర్గంలో 2020 జూలై 24న మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో రెండోసారి అవకాశం దక్కించుకున్నారు. చదవండి: (Kakani Govardhan Reddy: అన్నదాత.. వ్యవసాయశాఖ మంత్రయ్యాడు) -
ఖాకీ వనంలో ‘గోపాలుడు’
గుమ్మఘట్ట(అనంతపురం జిల్లా): క్షణం తీరిక లేని వృత్తిలో కొనసాగుతూనే పశు పోషణపై ఆసక్తి కనబరుస్తున్నారు గుమ్మఘట్ట ఎస్ఐ తిప్పయ్య నాయక్. ఇది గొప్ప అనుభూతినిస్తుందని అంటున్నారు. విధుల నిర్వహణలో ఆవుల పోషణ అడ్డంకి కాకూడదని భావించిన ఆయన.. తన స్వగ్రామంలో ప్రత్యేకంగా షెడ్ ఏర్పాటు చేసి, వాటి రక్షణ బాధ్యతలు స్వీకరించారు. తనకు ఏమాత్రం తీరిక దొరికినా.. వెంటనే స్వగ్రామానికి వెళ్లి ఆవుల మధ్య గడపడాన్ని ఆలవాటుగా చేసుకున్నారు. ఇది ఒత్తిళ్లతో కూడిన జీవితానికి ఎంతో ఉపశమనంగా ఉంటుందని పేర్కొంటున్నారు. చదవండి: AP: కొలువులు పట్టాలి పూర్వీకుల ఆస్తిగా... పామిడి మండలం పాళ్యం తండాకు చెందిన లక్ష్మానాయక్, లక్ష్మీదేవి దంపతులకు రెండో సంతానంగా తిప్పయ్య నాయక్ జన్మించారు. ఉమ్మడి కుటుంబం విడిపోతున్నప్పుడు ఆస్తుల భాగ పరిష్కారంలో భాగంగా రెండు ఆవులు తిప్పయ్య నాయక్‌కు వచ్చాయి. తాను పోలీసు శాఖలో సబ్ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నా.. పూర్వీకుల ఆస్తిని ఎంతో అపురూపంగా చూసుకుంటూ వచ్చారు. 30కి చేరిన ఆవుల సంఖ్య.. స్వగ్రామంలో తొలుత రెండు ఆవులతో మొదలైన సంరక్షణ బాధ్యతలు.. ప్రస్తుతం 30కి చేరుకుంది. వీటి కోసం ప్రత్యేకంగా ఓ షెడ్ వేశారు. వాటి పోషణకు తన జీతం నుంచి కొంత మొత్తం వెచ్చిస్తున్నారు. దీనికి తోడు భార్య వసంత లక్ష్మి, కుమారులు ఈశ్వర నాయక్, వరప్రసాద్ నాయక్ తరచూ స్వగ్రామానికి వెళ్లి పాడి పోషణను పర్యవేక్షిస్తున్నారు. పాల విక్రయానికి దూరం మందలో పాలిచ్చే ఆవులు పదికి పైగా ఉన్నా... వీటి పాలను ఇతరులకు విక్రయించడం లేదు. మొత్తం పాలను దూడలకే వదిలేస్తున్నారు. అయితే తల్లిని కోల్పోయిన నవజాత శిశువులకు, తల్లిపాలు లేక ఇబ్బంది పడుతున్న చంటి పిల్లలకు మాత్రం ఉచితంగా అందజేస్తున్నారు. నిత్యమూ ఒత్తిళ్లతో కూడిన పోలీసు శాఖలో పనిచేస్తున్న తాను.. ఎలాంటి ఒత్తిడి లేని జీవితాన్ని గడుపుతున్నానంటే దానికి గోసంరక్షణే కారణమని ఎస్ఐ తిప్పయ్య నాయక్ చెబుతున్నారు. పాడి పోషణ ద్వారా మరో రెండు కుటుంబాలకు ఉపాధి కల్పించడం ఎంతో ఆనందంగా ఉందని అంటున్నారు. -
Chittoor: అధికారి ఒకరే.. పోస్టులు ఐదు
చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలో ముఖ్యమైన 5 పోస్టులకు ఒకరే అధికారిగా ఉండడం విశేషం. ఈ ఏడాది జూన్ 30న రెగులర్ డీఈవోగా పనిచేసిన నరసింహారెడ్డి ఉద్యోగ విరమణ పొందారు. ఆ తర్వాత ఏడీ–1 గా ఉన్న శ్రీరాం పురుషోత్తంకు డీఈవోగా అదనపు బాధ్యతలు ఇచ్చారు. అనంతరం చిత్తూరు డీవైఈవోగా మరో బాధ్యతలు చేపట్టారు. తాజాగా కార్వేటినగరం డైట్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్‌గానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటివరకు డైట్ కళాశాల ప్రిన్సిపల్‌గా ఉండే శేఖర్ పుత్తూరు డీవైఈవోగా అదనపు బాధ్యతలు నిర్వహించేవారు. ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న పురుషోత్తం కూడా పుత్తూరు డీవైఈవోగా కూడా వ్యవహరించాల్సి ఉంది. దీంతో మొత్తం ఒక అధికారి 5 పోస్టుల్లో పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చదవండి: శింగనమల ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం -
8 ఏళ్లకే కుటుంబ భారం మోస్తున్న పిల్లాడు
-
బడికి వెళ్లకుంటే.. ఇంటికి వలంటీర్ వస్తారు!
అనంతపురం విద్య: విద్యార్థి క్షేమ సమాచారాలు తెలుసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. విద్యార్థులను పర్యవేక్షించేందుకు ప్రధానోపాధ్యాయులతో పాటు కొత్తగా వలంటీర్లకు బాధ్యతలు అప్పగించింది. ఇందుకోసం రోజూ విద్యార్థి హాజరును నమోదు చేసేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా ‘స్టూడెంట్ అటెండెన్స్ యాప్’ను ప్రవేశపెట్టింది. ఈ యాప్‌లో విద్యార్థి హాజరును రోజూ నమోదు చేస్తారు. ఉదయం 11 గంటలకు జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థుల హాజరు వివరాలు డీఈఓ కార్యాలయానికి చేరతాయి. వరుసగా మూడు రోజులు వెళ్లకుంటే... జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు 5,129 ఉండగా.. 6,06,780 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. విద్యార్థులంతా క్రమం తప్పకుండా స్కూల్‌కు హాజరయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. విద్యార్థులు పాఠశాలకు హాజరై.. అభ్యసన ప్రక్రియలో పాల్గొంటున్నారా?... లేదా అని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఏ విద్యార్థి అయినా వరుసగా మూడు రోజులు పాఠశాలకు వెళ్లకపోతే... విద్యార్థి ఉంటున్న ప్రాంతంలోని వలంటీరుకు సమాచారం వెళ్తుంది. దీంతో వలంటీర్ విద్యార్థి ఇంటికి వెళ్లి ఆరా తీస్తారు. అనారోగ్యంతో బాధపడుతుంటే వెంటనే సమీపంలోని ఆస్పత్రికి సమాచారం పంపుతారు. ఇతరత్రా కారణాలతో పాఠశాలకు గైర్హాజరైతే తల్లిదండ్రులకు సమాచారం చేరవేస్తారు. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లోనే హాజరు నమోదుపై దృష్టి సారించేవారు. ఇక నుంచి ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు కూడా విద్యార్థుల హాజరును ‘స్టూడెంట్ అటెండెన్స్ యాప్’లో తప్పనిసరిగా నమోదు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఏడాదిలో 70 శాతం హాజరు లేకపోతే ‘అమ్మఒడి ’ పథకం కూడా వర్తించదని తేల్చిచెప్పింది. దీంతో ఇటు ప్రభుత్వ, అటు ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థుల హాజరును తప్పకుండా యాప్‌లో నమోదు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇవీ చదవండి: Tank Bund: ఆదివారం.. ఆనంద విహారం మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్ట్ -
డేటా అనలిస్టులకు ఎంఎన్సీల బంపర్ ఆఫర్స్
డేటా సైన్స్.. బిగ్ డేటా.. డేటా అనలిటిక్స్.. ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైన విభాగాలు! కారణం.. డేటాకు ఎనలేని ప్రాధాన్యం పెరగడమే!! నేటి ఈ కామర్స్ ప్రపంచంలో డేటా భారీగా తయారవుతోంది. ఈ డేటా తిరిగి మళ్లీ బిజినెస్ నిర్ణయాలకు దోహదపడుతోంది. విస్తృతమైన డేటాను విశ్లేషించి.. ఉపయుక్తమైన ప్యాట్రన్స్ గుర్తించి.. దాని ఆధారంగా కంపెనీలు కీలకమైన వ్యాపార నిర్ణయాలు తీసుకుంటున్నాయి. దాంతో డేటా విశ్లేషణ నైపుణ్యం ఉన్న నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. ఫలితంగా ఐటీ, కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్ అభ్యర్థులకు డేటా అనలిటిక్స్ అద్భుతమైన కెరీర్ అవకాశంగా మారుతోంది. ఈ నేపథ్యంలో.. డేటా అనలిస్టుల విధులు, అవసరమైన అర్హతలు, నైపుణ్యాలు, అందుబాటులో ఉన్న ఉద్యోగావకాశాలపై ప్రత్యేక కథనం... అపరిమితమైన, విస్తృతంగా ఉండే సమాచారాన్ని బిగ్ డేటా అంటారు. ఇది చాలా సంక్షిష్టంగా ఉంటుంది. రోజురోజుకూ భారీగా పోగవుతున్న ఇలాంటి టెరాబైట్ల డేటా నుంచి బిజినెస్ నిర్ణయాలకు అవసరమైన ఉపయుక్త సమాచారాన్ని, ప్యాట్రన్స్(నమూనాలు)ను గుర్తించి,సంగ్రహించే టెక్నిక్ లేదా టెక్నాలజీనే డేటా అనలిటిక్స్ అంటున్నారు. డేటా అనలిటిక్స్ నిపుణులు.. క్లిష్టమైన భారీ స్థాయిలో ఉండే డేటాను విశ్లేషించి.. అందులోంచి ఉపయోగకరమైన సమాచారాన్ని వెలికి తీసి.. ఆయా కంపెనీలు సరైన వ్యాపార నిర్ణయం తీసుకునేలా సహకరిస్తారు. డేటా అనలిస్ట్‌లు డేటా సేకరణ, సంగ్రహణ, విశ్లేషణను విజయవంతంగా, ఖచ్చితత్వంతో పూర్తిచేసే నైపుణ్యాలు కలిగి ఉంటారు. సేకరణ.. విశ్లేషణ ► గూగుల్, ఫేస్బుక్, అమెజాన్ వంటి టాప్ కంపెనీలెన్నో డేటాను భద్రపరిచేందుకు డేటా సెంటర్స్ నిర్వహిస్తున్నాయి. కస్టమర్స్ ఎలాంటి వస్తువులు కొంటున్నారు.. వేటికోసం ఆన్లైన్లో వెతుకుతున్నారు.. వారి ఆసక్తులు, అభిరుచులు.. ఇలాంటి సమాచారాన్ని సంస్థలు సేకరించి భద్రపరుస్తుంటాయి. అవసరమైనప్పుడు మళ్లీ ఈ డేటాను బయటకు తీసి.. సాంకేతిక పద్ధతుల ద్వారా విశ్లేషించి.. వినియోగదారుల అవసరాలు, అంచనాలకు తగ్గ వస్తు,సేవలను అందించేందుకు ప్రయత్నిస్తాయి. తద్వారా వ్యాపార విస్తరణలో ముందుంటాయి. ► డేటా అనలిటిక్స్ నిపుణులు.. భద్రపరిచిన డేటా నుంచి ఉపయుక్తమైన ప్యాట్రన్లను గుర్తించి విశ్లేషిస్తారు. తద్వారా కంపెనీలు మరింత సమర్థమైన వ్యాపార నిర్ణయాలు తీసుకునేందుకు దోహదపడతారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఉపయుక్తమైన డేటాను గుర్తించడం, సేకరించడం, విశ్లేషించడం, విజువలైజ్ చేయడం, కమ్యూనికేట్ చేయడంతోపాటు మార్కెట్‌ని అధ్యయనం చేయడం బిగ్ డేటా అనలిస్ట్ ప్రధాన బాధ్యతలుగా చెప్పొచ్చు. విభిన్న నైపుణ్యాలు బిగ్ డేటా నిపుణుడు ఏకకాలంలో వివిధ పాత్రలను పోషించాల్సి ఉంటుంది. నిత్యం అధ్యయనం చేయడం.. వివిధ రంగాల్లో, వివిధ రూపాల్లో ఉన్న డేటాను సేకరించడం(డేటా మైనింగ్).. డేటాను స్టోర్ చేయడం.. అవసరమైనప్పుడు సదరు డేటాను విశ్లేషించే నైపుణ్యం ఎంతో అవసరం. వినియోగదారులను ఆకట్టుకునేలా ఓ వ్యాపారాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో డేటా ఆధారితంగా ఆలోచించి, తార్కికంగా ప్రజెంట్ చేయగలగాలి. అందుకోసం డేటా అనలిస్టులకు సమస్యా పరిష్కార నైపుణ్యాలు ఉండాలి. వీటితోపాటు ప్రోగ్రామింగ్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ అండ్ డేటా ఇంటర్‌ప్రెటేషన్ స్కిల్స్, చక్కటి కమ్యూనికేషన్ నైపుణ్యాలు, విభిన్న టెక్నాలజీలపై పట్టు అవసరం. ప్రోగ్రామింగ్‌పై పట్టు డేటా అనలిస్టులుగా పనిచేయాలంటే.. మొదట కొన్ని సాఫ్ట్వేర్ స్కిల్స్‌పై పట్టు పెంచుకోవాలి. ముఖ్యంగా ఎంచకున్న విభాగంలో ఏ పని చేస్తున్నారో అందుకు అవసరమైన టూల్స్‌పై శిక్షణ పొందాలి. సంబంధిత టూల్స్‌ను ముందుగానే నేర్చుకోవడం ద్వారా.. ‘ఆన్ ది జాబ్ ప్రాజెక్ట్’ను ఆత్మవిశ్వాసంతో పూర్తి చేయగలరు. డేటా అనలిస్ట్‌లకు ప్రధానంగా పైథాన్, సీ++, ఎస్‌క్యూల్, పెర్ల్, ఆర్, జావాస్క్రిప్ట్, హెచ్‌టీఎంఎల్ వంటి ప్రోగ్రామింగ్ స్కిల్స్ తెలిసుండాలి. అనలిస్ట్ కావడం ఎలా ► ఐటీ, కంప్యూటర్ సైన్స్, మ్యాథ«మెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్‌లో డిగ్రీ/పీజీ చేసినవారికి డేటా అనలిస్టు కెరీర్ అనుకూలంగా ఉంటుంది. ఆసక్తిని బట్టి సంబంధిత సర్టిఫికేషన్ కోర్సులు పూర్తి చేసినవారు ఎలాంటి నేపథ్యం నుంచి వచ్చినా ఈ విభాగంలో రాణించవచ్చు. ముఖ్యంగా డేటాపై ఇష్టం ఉండాలి. ఈ రంగం వేగంగా అభివృద్ధి చెందడంతోపాటు ఎప్పటికప్పుడు మార్పులకు లోనవుతోంది. కాబట్టి మార్పులకు అనుగుణంగా సరికొత్త టూల్స్‌ను నేర్చుకుంటూ,అప్డేట్గా ఉండాలి. ► ప్రస్తుతం చాలామంది సాఫ్ట్వేర్ నిపుణులు తమ కెరీర్‌ను మార్చుకునేందుకు అవసరాన్ని బట్టి ఆయా సర్టిఫికేషన్ కోర్సులు పూర్తి చేసి.. డేటా అనలిస్టులుగా రాణిస్తున్నారు. ఇందులో హడూప్ అండ్ స్పార్క్ బిగ్ డేటా ఫ్రేమ్ వర్క్స్‌ను కవర్ చేయడంతోపాటు రియల్ టైమ్ డేటా అండ్ ప్యారలల్ ప్రాసెసింగ్, ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అండ్ స్పార్క్ అప్లికేషన్స్ ఉంటాయి. వీటిల్లో పట్టు సాధించాలంటే.. మొదట అభ్యర్థులకు కోర్ జావా, పైథాన్, ఎస్‌క్యూఎల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌పై అవగాహన ఉండాలి. సర్టిఫైడ్ డేటా ఇంజనీర్ ప్రపంచ వ్యాప్తంగా డేటా అనలిస్టులకు డిమాండ్ పెరుగుతోంది. దాంతో చాలామంది సర్టిఫికెట్ కోర్సులు చేసి కెరీర్ ప్రారంభిస్తున్నారు. వాస్తవానికి డేటా అనలిటిక్స్‌లో రాణించాలంటే.. డేటాపై ఆసక్తితోపాటు ప్రోగ్రామింగ్ స్కిల్స్ నేర్చుకోవాలనే తపన ఉండాలి. ఐబీఎం లాంటి సంస్థలు సర్టిఫైడ్ బిగ్ డేటా ఇంజనీర్స్ కోసం ప్రత్యేకంగా మాస్టర్స్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నాయి. ఇందులో భాగంగా బిగ్‌డేటా అప్లికేషన్స్‌లో హడూప్తోపాటు మ్యాప్ డిప్, హైవ్, స్క్రూప్, ఫ్రేమ్ వర్క్, ఇంపాలా, పిగ్, హెచ్‌బేస్, స్పార్క్, హెచ్‌డీఎఫ్‌ఎస్, యార్న్, ఫ్లూమ్ వంటి వాటిపై అవగాహన కల్పిస్తారు. ఇలాంటి కోర్సులతోపాటు కొంత రియల్ టైమ్ అనుభవం పొందినవారు డేటా అనలిటిక్స్‌లో మెరుగైన అవకాశాలు అందుకునే వీలుంది. పెరుగుతున్న మార్కెట్ ప్రస్తుతం డేటా అనలిటిక్స్ అనేది చక్కటి కెరీర్‌గా మారింది. డేటా అనలిస్టులకు మంచి డిమాండ్ ఉంది. అలైడ్ మార్కెట్ రీసెర్చ్ ప్రకారం–డేటా అనలిటిక్స్ మార్కెట్.. 2021 చివరి నాటికి 84.6 బిలియన్ డాలర్లను చేరుతుందని అంచనా. ఇంటర్నేషనల్ డేటా కార్ప్ అండ్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ ప్రకారం–ప్రపంచవ్యాప్తంగా ఈ రంగం 2022 నాటికి 274.3 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఒక్క అమెరికాలోనే లక్షన్నర మంది డేటా అనలిస్టుల అవసరం ఉందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. మన దేశంలోనూ ప్రస్తుతం ఈ రంగంలో నిపుణుల కొరత ఉంది. కాబట్టి ఆయా నైపుణ్యాలు పెంచుకుంటే అవకాశాలు అందుకోవచ్చు. బిగ్ డేటా అనలిస్ట్ వేతనాలు ఏదైనా కెరీర్ ఎంచుకునే ముందు వేతనంతోపాటు భవిష్యత్ ఎలా ఉంటుందని ఆలోచిస్తారు. భవిష్యత్‌లోనూ డేటా అనలిస్ట్‌లకు చక్కటి అవకాశాలు ఉంటాయని నిపుణుల అంచనా. డేటా అనలిస్టులకు ఎంట్రీ లెవెల్లో సగటు వార్షిక వేతనం రూ.6.5 లక్షలుగా ఉంది. అనుభవం ఉన్నవారికి సుమారు రూ.10 లక్షల వరకు చెల్లిస్తున్నారు. -
ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్‌గా గౌతమ్‌రెడ్డి బాధ్యతలు
సాక్షి, విజయవాడ: ఏపీ స్టేట్ ఫైబర్‌నెట్ మిలిటెడ్ (ఏపీఎస్ఎఫ్ఎల్) చైర్మన్‌గా పి. గౌతమ్‌రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన విధానాలకు అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు. ఫైబర్ గ్రిడ్ ద్వారా ట్రిపుల్ ప్లే సర్వీసులు అందిస్తామని ఆయన వెల్లడించారు.ఈ సర్వీసులు తక్కువ ధరకే అందిస్తామని చెప్పారు. కేబుల్,ఇంటర్నెట్, టెలిఫోన్ సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు. (చదవండి: టీడీపీలో రచ్చకెక్కిన విభేదాలు..) ‘‘గ్రామ, మండలస్థాయిలో అండర్ గ్రౌండ్ కేబుల్ లైన్స్ వేస్తాం. ఫైబర్ గ్రిడ్‌లో 10లక్షల కనెక్షన్స్ ఉన్నాయి. త్వరలో కొత్త సెట్ టాప్బాక్స్లు తీసుకువస్తాం. రూ. 599లకే అన్ లిమిటెడ్ ప్లాన్‌తో నెట్ కేబుల్ ఇస్తాం. రూ.450లకే ఇంటర్నెట్ను అన్‌లిమిటెడ్‌తో ఇస్తాం. విద్యార్థుల లాప్‌ట్యాప్‌లకు ఫైబర్ గ్రిడ్ ద్వారా నెట్ ఇస్తాం. ఫైబర్‌గ్రిడ్‌లో రూ.వేల కోట్లు స్వాహా చేశారు. గత ప్రభుత్వం చేసిన అవినీతిని వెలికి తీస్తాం. సీబీఐ విచారణ కూడా చేస్తుంది.అవినీతికి పాల్పడిన ఒక్కరినీ కూడా వదలమని’’గౌతమ్‌రెడ్డి స్పష్టం చేశారు.(చదవండి: టీడీపీ కుటిల యత్నం!) -
ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఔదార్యం
సాక్షి, తాడిపత్రి రూరల్: ఎమ్మెల్యే పెద్దారెడ్డి తన మనసు కూడా చాలా పెద్దదేనని మరోసారి చాటుకున్నారు. తల్లి మృతి చెంది.. తండ్రి మద్యానికి బానిసై ఆలనాపాలనకు నోచుకోని చిన్నారిని అక్కున చేర్చుకున్నారు. సంరక్షణ బాధ్యతలు తీసుకుని ఆదర్శంగా నిలిచారు. తాడిపత్రి మండలంలోని పెద్దపొలమడకు చెందిన నాగలక్ష్మీ, అర్జున్‌రెడ్డి దంపతులకు అజయ్‌కుమార్‌రెడ్డి సంతానం. 15 రోజుల క్రితం నాగలక్ష్మి అనారోగ్యంతో మరణించింది. అప్పటికే మద్యానికి బానిసైన అర్జున్‌రెడ్డి కుమారుడి బాగోగులు విస్మరించాడు. దీంతో గ్రామస్తుల సహాయంతో ఇన్నాళ్లూ అజయ్ కుమార్‌రెడ్డి గడిపాడు. (టీడీపీ నేతల నిర్వాకం..) ఈ క్రమంలోనే కొందరు గ్రామస్తులు అజయ్ పరిస్థితిని ఎమ్మెల్యే పెద్దారెడ్డి దృష్టికి తీసుకురాగా, వెంటనే స్పందించిన ఆయన మంగళవారం తన కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. అండగా ఉంటానని, బాగా చదువుకోవాలని సూచించారు. అంతేకాక ఇక నుంచి అజయ్‌కుమార్ రెడ్డి సంరక్షణ భాధ్యతను తానే తీసుకుంటున్నట్లు ప్రకటించారు. చిన్నారి చదువులు, జీవనానికి అయ్యే ఖర్చును తానే భరిస్తానన్నారు. ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయంపై పెద్దపొలమడ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. -
ఏ వార్త అయినా ఏకపక్షంగా రాయెద్దు
-
ఏలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు వార్తలు రాయెద్దు
-
పని చేస్తేనే పదవి ఉంటది!
సాక్షి, హైదరాబాద్: పనిచేస్తేనే పదవి ఉంటుంది.. బాధ్యతల నిర్వహణలో నిర్లక్ష్యం, ఉదాసీనత ప్రదర్శించినా, అధికార దుర్వినియోగానికి పాల్పడినా, దురుసుగా ప్రవర్తించినా సస్పెన్షన్‌కు గురికావడం లేదా పదవిని కోల్పోవాల్సి ఉంటుంది. మేయర్, చైర్పర్సన్, కార్పొరేటర్, కౌన్సిలర్ పదవులను ఇకపై అధికార దర్పం, దర్జా, పలుకుబడి కోసం వాడుకోవడానికి వీల్లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కొత్త మున్సిపల్ చట్టంలో కఠిన నిబంధనలు పొందుపరిచింది. రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. 120 మంది చైర్పర్సన్లు, 9 మంది మేయర్లు, 2,727 మంది కౌన్సిలర్లు, 385 కార్పొరేటర్లను ఎన్నుకోబోతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన వారు తమ అధికార, బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తేనే ఐదేళ్లు పదవిలో కొనసాగుతారు. ఏదైనా కారణాలతో అర్ధంతరంగా పదవి నుంచి తొలగింపునకు గురైతే .. మరో ఆరేళ్లు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధాన్ని ఎదుర్కో వాల్సిందే. కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం మేయర్లు/చైర్మన్లు, కార్పొరేటర్లు/కౌన్సిలర్లు తప్పనిసరిగా నిర్వహించాల్సిన బాధ్యతలు ఇవీ.. చైర్పర్సన్/మేయర్ బాధ్యతలు పట్టణం/నగరం పారిశుధ్యం, నీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ. నివాస, వాణిజ్య సముదాయాల నుంచి చెత్త సేకరణ. శాస్త్రీయ పద్ధతిలో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ. గ్రీన్ సెల్ ఏర్పాటు చేసి బడ్జెట్లో 10 శాతం నిధులను మొక్కల పెంపకం కోసం కేటాయింపు. జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ నిర్ణయించిన మున్సిపాలిటీలో నర్సరీలు ఏర్పాటు చేసి, మొక్కలు పెంచాలి. సొంత వార్డులో నాటిన మొక్కల్లో 85 శాతం బతికి ఉండేలా చర్యలు తీసుకోవాలి. పార్కుల అభివృద్ధి, చెరువుల పరిరక్షణ. ప్రభుత్వ భూములు, ఖాళీ స్థలాల పరిరక్షణ. ఏటా వార్షిక అకౌంట్ల ముగింపు, ఆడిటింగ్‌కు చర్య తీసుకోవాలి. పురపాలక ఆస్తుల అతిక్రమణల తొలగింపునకు చర్యలు తీసుకోవాలి. నీటి సరఫరా (అక్రమ నల్లాలు), వృథా నీటి ప్రవాహాన్ని నియంత్రించాలి. అవసరం ఉంటే తప్ప నీటి సరఫరా కోసం విద్యుత్ బోర్లు వాడరాదు. వర్షపు నీటి సంరక్షణతో పాటు ఈసీబీసీ ప్రమాణాలతో చల్లని పైకప్పు గల ఇంధన పొదుపు భవనాల నిర్మాణాన్ని ప్రోత్సహించాలి. మున్సిపల్ చట్టంలో నిర్దేశించిన అధికారాలు, బాధ్యతలతో పాటు ప్రభుత్వం ఆదేశించే ఇతర అధికారాలు, బాధ్యతలను సైతం నిర్వర్తించాలి. కౌన్సిల్ సమావేశం ముగిసిన 24 గంటల్లోగా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు(మినట్స్)పై సంతకం చేయాలి. నర్సరీ నిర్వహణ, మొక్కల పెరుగుదల బాధ్యత మేయర్/చైర్పర్సన్, కమిషనర్లది. నర్సరీల నిర్వహణ, మొక్కల పెంపకం తీరును పరిశీలించేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్స్‌తో ఆకస్మిక తనిఖీలు నిర్వ హించే అధికారాన్ని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. వార్డు సభ్యుల బాధ్యతలు.. వార్డులో పారిశుధ్యం, నీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ. ఇంటింటి నుంచి చెత్త సేకరణ. శాస్త్రీయ పద్ధతిలో ఘన వ్యర్థాల నిర్వహణ. చెరువుల పరిరక్షణ. నీటి సరఫరా (అక్రమ నల్లాలు), వృథా నీటి ప్రవాహాన్ని(పైపులైన్ల లీకేజీతో) నియంత్రించాలి. అవసరం ఉంటేతప్ప నీటి సరఫరా కోసం విద్యుత్ బోర్లను వాడరాదు. మున్సిపల్ గ్రీన్ యాక్షన్ ప్లాన్ ప్రకారం తమ వార్డులో మొక్కలు నాటడం, వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలి. పట్టణాభివృద్ధిపై శిక్షణ తీసుకోవాలి. నాటిన మొక్కల్లో 85 శాతం బతికి ఉండేలా చూడాలి. నిర్లక్ష్యం, ఉదాసీనత కారణంగా ఈ శాతానికి మొక్కలు తగ్గితే వార్డు సభ్యుడిని అనర్హుడిగా ప్రకటిస్తారు. ఈ విషయంలో ప్రత్యేకాధికారి విఫలమైనా ఉద్యోగం నుంచి తొలగిస్తారు. నిర్లక్ష్యం వహిస్తే తొలగింపే.. మున్సిపల్ చట్టం నిబంధనలు, ఇతర నియమాలు, ప్రభుత్వ ఉత్తర్వులను అమలుపరిచేందుకు నిరాకరించినా/ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినా, అధికార దుర్వినియోగానికి పాల్పడినా బాధ్యతలు, కర్తవ్యం నిర్వహణలో విఫలమైనా మున్సిపల్ చట్టం ప్రకారం పురపాలన సక్రమంగా నిర్వహించేందుకు ప్రభుత్వం/ప్రభుత్వం నియమించిన ఇతర ఏ అధికారి జారీ చేసిన ఉత్తర్వుల అమలుకు నిరాకరించినా విధి నిర్వహణలో దుష్ప్రవర్తన కలిగి ఉన్నా.. మున్సిపల్ నిధులను దుర్వినియోగపరిచినా.. పురపాలికల బాధ్యతల నిర్వహణలో తరచూ విఫలమైనా, తన బాధ్యతలను విస్మరిస్తూ అసమర్థుడిగా తయారైనా.. ప్రభుత్వం నిబంధనల ప్రకారం వారిని పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులిస్తుంది. తొలగించడానికి ముందు సంజాయిషీ ఇచ్చుకోవడానికి అవకాశమిస్తుంది. అనర్హత పడితే మరో 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు కానున్నారు. దాడులు చేస్తే సస్పెన్షన్.. పురపాలికల అధికారులు, ఉద్యోగుల పట్ల స్థానిక కౌన్సిలర్లు, చైర్పర్సన్లు దురుసుగా ప్రవర్తించడం, దూషణలకు దిగడం, కొన్ని సందర్భాల్లో భౌతికదాడులకు పాల్పడడం వంటి ఘటనలు గతంలో చాలా చోట్ల జరిగాయి. ఇకపై ఇలాంటి ఘటనలకు పాల్పడితే పదవి కోల్పోవాల్సిందే. ఉద్దేశపూర్వకంగా అమర్యాదగా ప్రవర్తించినా, తోటి సభ్యుడు/ఉద్యోగిపై చేయి చేసుకున్నా, ఆస్తి ధ్వంసం చేసినా, అసభ్య పదజాలం వాడినా, మున్సిపల్ సమావేశాన్ని ఆటంకపరిచినా, పురపాలిక ఆర్థిక సుస్థిరకు నష్టం కలిగించేలా అధికార దుర్వినియోగానికి పాల్పడినా సదరు చైర్పర్సన్/ వైస్‌చైర్‌పర్సన్/ వార్డు సభ్యుడిని సస్పెండ్ చేస్తూ గెజిట్ నోటీసు జారీ చేస్తుంది. ప్రభుత్వం, జిల్లా కలెక్టర్లు తమంతట కానీ, కౌన్సిలర్, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కమిషనర్, ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గానీ జిల్లా కలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకోనున్నారు. సస్పెన్షన్ విధిస్తే 30 రోజుల్లోగా మున్సిపల్ ట్రిబ్యునల్‌లో అప్పీల్ చేసుకోవచ్చు. -
భయమెరగని బామ్మ
బెదిరిస్తే ఏమవుతుంది..? ఏమీ కాదు అలా బెదిరించిన వారే తోకముడుస్తారు.. అంటూ సమస్యల పరిష్కారానికై ముందుకు సాగుతోంది 92 ఏళ్ల ఈ చెన్నై బామ్మ. పేరు కామాక్షి. చెన్నై బెసెంట్ నగర్లో ఉంటున్న ఈ బామ్మను కలిస్తే చాలు మనం మరిచిపోయిన ఎన్నో బాధ్యతలను గుర్తుచేస్తుంది. సమస్యల పరిష్కారానికి మనమూ కదలాలనిపించేలా చేస్తుంది. ‘నేను ముసల్దానినైపోయాను. అలాగని ఇప్పుడప్పుడే ఈ లోకాన్ని విడిచివెళ్లాలనుకోవడం లేదు. నేను భోజనం చేయడానికి ఇప్పుడు నా పళ్లెంలో చాలా పనులున్నాయి. ముందు వాటి సంగతి చూడాలి’ అంటోంది కామాక్షి పాటి. చుట్టుపక్కల కాలనీవాసులే కాదు కార్పొరేషన్ అధికారులు కూడా ఆమెను చూస్తే జంకుతారు. ఆమె బాధ్యతను తెలుసుకొని ప్రేమగా పలకరిస్తారు, గౌరవిస్తారు. పరిచయం లేని వారికి కూడా మన ఇంట్లోని బామ్మలాగానే కనిపిస్తారు. అది ఎంతవరకు అంటే.. చుట్టుపక్కల ఎవరైనా పౌర ప్రమాణాల ఉల్లంఘనకు పాల్పడనంతవరకే. తెల్లవారు ఝాము నుంచి రాత్రి పది వరకు తెల్లవారుజాము 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కామాక్షి పాటి ఏదైనా సమస్యను పరిష్కరించడానికి వెనకాడరు. ఈ వయస్సులో కూడా ఆమెకు నచ్చని ప్రభుత్వ ప్రతిపాదన ఏదైనా వస్తే దానిని నిరసిస్తూ వీధుల్లోకి వస్తారు లేదా ఆ సమస్యను పరిష్కరించడానికి ఎంత పెద్ద పొజిషన్లో ఉన్న అధికారినైనా నిలదీస్తారు. ఇంతకీ ఈమె ఎవరంటారా .. తంజావూరులో పుట్టిన కామాక్షి పాటి బెంగుళూరులో చదువుకుంది. పెళ్లై ఢిల్లీ వెళ్లింది. ‘ఢిల్లీలో ఆ మూడు దశాబ్దాలు నా జీవితంలో ఉత్తమమైనవి. 1948లో అక్కడికి వెళ్లాను. నవజాత దేశంలో అల్లకల్లోల రాజకీయాల సమయం. పరిస్థితులు ఉద్రిక్తంగా ఉండేవి. కానీ, ప్రజలు చాలా స్నేహపూర్వకంగా ఉండేవారు’ అని నాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్టు వివరిస్తుంది. ‘1981లో తిరిగి చెన్నైకి వచ్చాను. ఇక్కడ మారిన వాతావరణం, సంస్కృతి చూసి షాక్ అయ్యాను. సర్దుబాటు చేసుకోవడానికి కొన్నాళ్లు పట్టింది’ అని చెబుతారు. అనుకోకుండా కార్యకర్తగా.. చెన్నై బెసెంట్నగర్లోని కామాక్షి ఉంటున్న ఇంటి ముందు రహదారి ఓ సమస్యగా మారింది. ప్రజలు దీనిని బహిరంగ మరుగుదొడ్డిగా ఉపయోగించేవారు. చనిపోయిన జంతుకళేబరాలను పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఖననం చేసేవారు. ఇళ్లలోని వ్యర్థాలను పోసి వెళుతుండేవారు. విసిగిపోయిన కామాక్షి పదే పదే అధికారులకు విజ్ఞప్తులు చేసేది. అధికారులు ఆ విజ్ఞప్తులను తీసుకునేవారు. కానీ, ఏదో సాకు చెప్పి అప్పటికి తప్పించుకునేవారు. ‘రహదారికి ఇరువైపులా చెట్లు ఉండాలి’ అని వారికి గుర్తు చేసేది. మూడేళ్లు నిరంతర విజ్ఞప్తులు, నిరసనల తర్వాత కార్పొరేషన్ అధికారులు రహదారిని అందంగా తీర్చిదిద్దడంతోపాటు రోడ్‌సైడ్ పార్క్‌ను నిర్మించడంతో ఆమె తన మొదటి విజయాన్ని సాధించింది. కామాక్షి పాటి: అలుపెరుగని అవిశ్రాంత కార్యకర్త ఆమె 80వ పుట్టినరోజు సందర్భంగా అప్పటి చెన్నై కమిషనర్ ఈ పార్కు ఆధునీకరణ బాధ్యతను ఆమెకు అప్పగించారు.అప్పటికి ఆమె కార్పొరేషన్ అధికారులు, స్థానిక చట్టసభ సభ్యులతో పరిచయాలను ఏర్పరుచుకుంది. కామాక్షి పర్యవేక్షణ ఎంత బాగుంటుందో 12 ఏళ్లుగా ఆమె నిర్వహిస్తున్న పార్క్ చెబుతుంది. ‘నేనెప్పుడూ అలవాటు ప్రాముఖ్యతను చెబుతాను. ఒక స్థలాన్ని పునరుద్ధరించినా, ఒకసారి శుభ్రపరిచినా అంతటితో ఏమీ ముగిసిపోదు. దానిని నిరంతరాయంగా కొనసాగించాలి. ఒక బాధ్యతగా తీసుకోవాలి’ అని ఆమె సలహా ఇస్తారు. రోడ్డు, పార్క్ పని పూర్తయింది. ఇక పౌర సమస్యలను పరిష్కరించడానికి ముందుకు వచ్చారు కామాక్షి. బెసెంట్ నగర్‌లోని చుట్టుపక్కల వాసులు తమ మనోవేదనలను, పరిపాలనకు సంబంధించి సమస్యలు పరిష్కరించేలా చూడమని కామాక్షికి దగ్గరకు వచ్చేవారు. దీంతో ఆమె తరచూ సమావేశాలను ఏర్పాటు చేస్తుంది. ఆమె సాధించిన విజయాలలో బెసెంట్ నగర్ బీచ్‌లోని కార్ల్ జెష్మిత్ మెమోరియల్ పునరుద్ధరణ అతి ముఖ్యమైనది. శిథిలావస్థలో ఉన్న ఈ మెమోరియల్‌లో మద్యం సేవించడం, గోడలపై పిచ్చి రాతలు రాయడం, స్మారక చిహ్నంపై మూత్రవిసర్జన చేయడం వంటివి గమనించిన పాటి అది పూర్తిగా బాగయ్యేంతవరకు అధికారులను వదిలిపెట్టలేదు. బెదిరింపులు బేఖాతరు కామాక్షి పాటి విజయం.. రహదారులు, ష్మిత్ మెమోరియల్ పునరుద్ధరుణతో ఆగలేదు. ఫుట్‌పాత్‌లను ఆక్రమించే షాపులను అడ్డుకోవడం, కాలిబాటలను విస్తరించే విధానాల కోసం బెసెంట్ అవెన్యూలో నియమ నిబంధనలను ఏర్పాటు చేసింది. రాత్రి 10 దాటిన తర్వాత నిర్మాణ కార్యక్రమాలు ఆపాలని, పిల్లలు, వృద్ధుల నిద్రకు అవరోధం కలిగించకుండా చూడాలని కోరుతుంది. బాధ్యతాయుతమైన పౌరురాలిగా ఉండటం ఇష్టమైన కామాక్షికి అవినీతి వైఖరులకు పాల్పడే వారితో ఎప్పుడూ గొడవగానే ఉంటుంది. నా విధానాలకు వ్యతిరేకంగా ఫిర్యాదులు ఇచ్చేవారున్నారు. కానీ, వారెవరూ ఇటువంటి బాధ్యత తీసుకోరు. వీధుల్లో చెత్త వేయద్దని నిలదీస్తే యువకులు స్పందించే తీరు బాధిస్తుంటుందని కామాక్షి తెలుపుతుంది. నిరసన తెలపడం కష్టమైన పనికాదు. ప్రతి ఒక్కరూ తమ సమస్యలను పరిష్కరించే బాధ్యత తీసుకోవాలి’ అని కోరుతుంది కామాక్షి. కాటికి కాళ్లు చాపుకున్న ముసలివాళ్లు ఏం చేస్తారులే అనుకోవద్దు. తలుచుకుంటే కొండను కూడా పిండిచేయగలమని నిరూపించగలరు. ముళ్ల మార్గాలనూ నందనవనంగా మార్చగలరు. – ఆరెన్నార్ -
19 ఏళ్ల పోరాట బాట
ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు స్వీకరిస్తున్న తరుణంలో.. ఇంతవరకూ పార్టీని అన్నీ తానై నడిపించిన సోనియా గాంధీ క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతారా? లేదా ? అన్న పార్టీ శ్రేణుల సందేహాలకు తెరపడింది. తాను రిటైర్ అవుతున్నానని సోనియానే స్వయంగా ప్రకటించారు. అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నా రాజకీయాల్లో ఆమె కొనసాగుతారని కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి. దాదాపు 20 ఏళ్లు(19 ఏళ్ల 9 నెలలు) కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ అనుభవం పార్టీకి అండగా ఉంటుందని పార్టీ శ్రేణులు విశ్వసిస్తున్నాయి. అనారోగ్య కారణాలతో కొన్నాళ్లుగా సోనియా గాంధీ రాజకీయాలకు దూరంగానే ఉంటున్నా..ఆమె లేని కాంగ్రెస్‌ను ఊహించడం పార్టీ శ్రేణులకు కష్టమైన విషయం. అంతగా ఆమె కాంగ్రెస్‌లో జవసత్వాలు నింపి.. ఆ పార్టీకి పదేళ్లు అధికార పగ్గాలు కట్టబెట్టారు. సోనియా నాయకత్వంలో ఐదేళ్లకే కాంగ్రెస్ ఢిల్లీ పీఠాన్ని అధిరోహించింది. అయితే ఆ విజయం అంత సులభంగా దక్కలేదు. నిజానికి కాంగ్రెస్ అధ్యక్షురాలిగా 20 ఏళ్లలో సోనియా ఎన్నో ఆటు పోట్లను చవిచూశారు. 1998లో ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో లోక్‌సభలో ఆ పార్టీ బలం 141.. అదే సమయంలో సోనియా విదేశీయతను సాకుగా చూపుతూ శరద్ పవార్, పీఏ సంగ్మా తదితరులు తిరుగుబాటు చేశారు. 1999 ఎన్నికల్లో సోనియా విదేశీ మూలాలే ప్రచారాస్త్రంగా బీజేపీ బాగా లాభపడింది. సోనియా నాయకత్వంలో 1999 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓటమిపాలైంది. కాంగ్రెస్‌కు కేవలం 114 సీట్లు మాత్రమే వచ్చాయి. సోనియా సమర్ధతపై పలు విమర్శలు వెల్లువెత్తాయి. అయినా కాంగ్రెస్ పార్టీలో ఆమె స్థానం బలహీనం కాలేదు. 1999–2004 మధ్యలో లోక్‌సభ ప్రతిపక్ష నేతగా వ్యవహరించి రాజకీయంగా ఎన్నో అనుభవాల్ని నేర్చుకున్నారు. 1999లో చేజారిన ప్రధాని పదవి నిజానికి అధ్యక్షురాలైన ఏడాదికే సోనియాకు ప్రధాని పదవి అందినట్టే అంది చేజారిపోయింది. 1999 ఏప్రిల్ 17న వాజ్‌పేయి సర్కారు కూలిపోయాక సీపీఎం నేత హరికిషన్‌సింగ్ సుర్జీత్ చొరవతో కాంగ్రెస్ నాయకత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు కొనసాగాయి. సోనియా గాంధీ రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మద్దతు ఉందని చెప్పారు. అయితే ఎస్పీ అధినేత ములాయంసింగ్ యాదవ్ తన మనసు మార్చుకోవడంతో సోనియా అంచనాలు తప్పాయి. దీంతో తమకు బలం లేదని ఆమె రాష్ట్రపతికి చెప్పాల్సి వచ్చింది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ కూటమి విజయంతో సోనియానే ప్రధాని అని భావించారు. విదేశీ వనిత అంటూ విమర్శలు వెల్లువెత్తడంతో ఆమె మనసు మార్చుకున్నారు. అదే సమయంలో తనకు అనుకూలంగా ఉండేలా మన్మోహన్ సింగ్‌ను ప్రధాని పదవికి ఎంపికచేసి తన పట్టు చేజారకుండా చూసుకున్నారు. పదేళ్ల యూపీఏ సర్కారు సమయంలో జాతీయ సలహా మండలి(ఎన్ఏసీ) అధ్యక్షురాలిగా సోనియా పనితీరు ప్రశంసలు అందుకుంది. ఉపాధి హామీ వంటి కీలక చట్టాల రూపకల్పనలో ముఖ్య పాత్ర పోషించారు. అదే సమయంలో మన్మోహన్ సింగ్‌ను అడ్డుపెట్టుకుని కీలుబొమ్మ ప్రభుత్వాన్ని నడిపించారన్న అపవాదును మూటగట్టుకున్నారు. సోనియా రిటైర్మెంట్! రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే ముందురోజు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా కీలకవ్యాఖ్యలు చేశారు. రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్‌లో మీ పాత్ర ఎలా ఉండబోతోంది? అని శుక్రవారం పార్లమెంట్ ప్రాంగణంలో మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె స్పందిస్తూ.. ‘నా పాత్ర రిటైర్ కావడమే’ అని అన్నారు. గత కొన్నేళ్లుగా పార్టీకి సంబంధించిన ముఖ్య నిర్ణయాలు తీసుకోవడంలో రాహుల్ కీలక పాత్ర పోషించారన్నారు. సోనియా అధ్యక్షురాలిగా మాత్రమే తప్పుకుంటున్నారనీ, రాజకీయాల నుంచి కాదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా చెప్పారు. సోనియా ఆశీస్సులు కాంగ్రెస్‌కు ఎల్లప్పుడూ ఉంటాయనీ, ఆమె మార్గదర్శకత్వంలో పార్టీ ముందుకు సాగుతుందని ట్వీటర్లో వెల్లడించారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో శనివారం జరిగే కార్యక్రమంలో కాంగ్రెస్ చీఫ్‌గా ఎన్నికైనట్లు రాహుల్ సర్టిఫికెట్ అందుకోనున్నారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
వీరీ వీరీ గుమ్మడి పండు.. వీరి జాడేది?
► జిల్లా సమస్యలు గాలికొదిలేసిన మంత్రులు ► ‘వంశధార’ భగ్గుమంటున్నా కనిపించని కలమట ► అధికార పార్టీ ఎమ్మెల్యేలకు నంద్యాలే ముద్దు! ► అక్కడే ఎన్నికల ప్రచారంలో బిజీ పొలం మడుల్లో నిర్వాసితులు రక్తాశ్రువులు చిందిస్తున్నారు. అమాత్యులకు వారి కన్నీరు కనిపించడం లేదు. సాయం అందడం లేదంటూ వందలాది మంది నిస్సహాయంగా రోదిస్తున్నారు. అధికార పార్టీ నేతలకు వారి రోదన వినిపించడం లేదు. గడప దాటడానికి పోలీసుల అనుమతి కావాలని ఆంక్షలు పెట్టి హక్కులు కాలరాస్తుంటే.. ‘మీ అభివృద్ధి కోసమే పార్టీ మారా’ అని చెప్పిన నాయకుడు ఏ దిక్కున ఉన్నాడో కానరావడం లేదు. వంశధార నిర్వాసితుల బాధలు పట్టని టీడీపీ నేతలు నంద్యాల ఎన్నికల ప్రచారంలో మునిగి తేలుతున్నారు. పోలీసులు లాఠీలతో తలలు పగలగొడితే నేతలు తమ నిర్లక్ష్యంతో నిర్వాసితుల గుండెలు బద్దలుగొడుతున్నారు. సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం: వారం రోజులుగా వంశధార భగ్గుమంటుంటే జిల్లా మంత్రులు అచ్చెన్నాయుడు, కళావెంకటరావే కాదు స్థానిక ఎమ్మెల్యే కలమట వెంకటరమణ సహా అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ‘నంద్యాల ఎన్నికలే’ ప్రధానమయ్యాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చివరి నిర్వాసితుడు వరకూ పరిహారం చెల్లించాకే వంశధార ప్రాజెక్టు పనులు పునఃప్రారంభిస్తామని గత జనవరి నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు సహా జిల్లాకు చెందిన అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు చెబుతూ వచ్చారు. జనవరి 22వ తేదీన జరిగిన విధ్వంసం ఒక దురదృష్టకర సంఘటన అని, నిర్వాసితులకు క్షమాపణ చెబుతున్నానని ముఖ్యమంత్రి ప్రకటించిన సంగతీ అందరికీ తెలుసు. ఇదంతా చూసి... తమ సమస్యలు పరిష్కారమవుతా యని నిర్వాసితులు ఆశపడ్డారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ వారి మాటలు నీటిమూటలేనన్న విషయం గ్రహించారు. యూత్ ప్యాకేజీ ఇస్తామంటూ ఊరించినా ఆ జాబితాలో అర్హుల కంటే అధికార పార్టీ నాయకులు, వారి అనుచరుల పేర్లే ఎక్కువగా ఉండడంతో అసలు విషయాన్ని తెలుసుకున్నారు. దీంతో ఈనెల 2వ తేదీన హిరమండలం వద్ద స్పిల్ వే, హెడ్ రెగ్యులేటరీ పనులను నిర్వాసితులు అడ్డుకున్నారు. తాము ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదని, తమ సమస్యలు పరిష్కరించిన తర్వాతే పనులు చేసుకోవాలని కాంట్రాక్టర్లకు తెగేసి చెప్పారు. దీంతో పనులు నిలిచిపోయాయి. కనిపించని కలమట... నిర్వాసితులే తనకు ముఖ్యమని ఇన్నాళ్లూ ఊకదంపుడు ప్రసంగాలిచ్చిన ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ఇప్పుడు కనిపించకుండా పోయారు. నిర్వాసితుల సమస్యలు నెలకొన్న హిరమండలం, కొత్తూరు మండలాలు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పాతపట్నం నియోజకవర్గం పరిధిలోనే ఉన్నాయి. ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిరోజుల్లో నిర్వాసితుల సమస్యను తనకు అనుకూలంగా మలచుకోవడంలో ఆయన విజయవంతమయ్యారు. నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే ప్రాజెక్టు వద్ద ఆమరణ దీక్షకైనా సిద్ధమని, అప్పటికీ ఫలితం లేకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కూడా ఆయన ప్రకటించారు. తీరా టీడీపీలోకి ఫిరాయించిన తర్వాత ఆయన వైఖరిలో మార్పు వచ్చిందని నిర్వాసితులు వాపోతున్నారు. తమ భయాన్ని ఆయన ‘క్యాష్’ చేసుకున్నారనే విమర్శలు వారి నుంచి వినిపిస్తున్నాయి. వంశధార నిర్వాసితుల ఆందోళన మళ్లీ ప్రారంభమయ్యేసరికి ఎమ్మెల్యే కలమట నంద్యాల ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ఆయనకు పార్టీ అధినేత నంద్యాల 20వ వార్డు బాధ్యతలు అప్పగించడంతో దాన్ని సాకుగా చూపించి నిర్వాసితులకు ముఖం చాటేశారనే ఆరోపణలు ఉన్నాయి. తూతూమంత్రంగా సమీక్ష... నంద్యాల బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబే ఈనెల 6వ తేదీన స్పందించి కలమటను వంశధార ప్రాజెక్టు వద్దకు వెళ్లాలని ఆదేశించారనే ప్రచారం జరిగిం ది. తీరా నిర్వాసితుల దగ్గరకు వెళ్లాల్సిన కలమట.. 7వ తేదీ సాయంత్రం జిల్లా కలెక్టరేట్లో కలెక్టరు, ఎస్పీల సమక్షంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. దీనికి నిర్వాసితుల్లో తమ అనుచరులనే ఈ సమావేశానికి రప్పించి తూతూమంత్రంగా ముగించారు. ఆ తర్వాత నిర్వాసిత గ్రామాలకు వెళ్లకుండా సొంతూరు కొత్తూరు దగ్గరి మాతలలో ఒక్కరోజు గడిపి మళ్లీ నంద్యాల తిరిగి వెళ్లిపోయారు. ఈ తర్వాత కాలంలో పోలీసు బలగాలను భారీ సంఖ్యలో మోహరించి నిర్వాసితుల పొలాలను ధ్వంసం చేస్తున్నా ఆయన నుంచి ఒక్క ప్రకటన కూడా రాలేదు. మూడు రోజులు వేచిచూసినా కలమట నుంచే కాదు జిల్లాకు చెందిన మంత్రులు, అధికార పార్టీకి మరే నాయకుల నుంచి భరోసా లేకపోయింది. దీంతో చివరకు ఈనెల 16వ తేదీన నిర్వాసితులే పొలాలను ధ్వంసం చేస్తున్న పొక్లెయిన్లను అడ్డుకున్నారు. కొంతమంది ఆవేశంతో పొక్లెయిన్ అద్దాలను పగులగొట్టారు. నిలువరించడానికి వచ్చిన పోలీసులపై బురద, రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. చేతికి దొరికిన నిర్వాసితులను మహిళలను సైతం చితక్కొట్టి వ్యానుల్లోకి ఎక్కించారు. తర్వాత మహిళలను వదిలేసినా మిగతా 28 మందిపై కేసులు బనాయించారు. నిందితులైన నిర్వాసితులు ప్రస్తుతం రిమాండులో ఉన్నారు. నిర్వాసితులపై కేసులు... పొక్లెయిన్లను అడ్డగించిన నిర్వాసితులపై హిరమండలం పోలీసుస్టేషన్లో కేసులు నమోదయ్యాయి. హత్యాయత్నం, నేరపూరిత కుట్ర, ప్రమాదకరమైన ఆయుధాలతో దాడి చేసి గాయపర్చడం, చట్టాన్ని ఉల్లంఘిస్తూ అడ్డగించడం, ప్రభుత్వాస్తుల ధ్వంసం వంటి నేరాలు మోపారు. ఈ కేసుల్లో ఇప్పటికే అరెస్టయిన 28 మందే గాకుండా మరికొంత మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ నిందితుల్లో ఎక్కువ మంది గార్లపాడు, పాడలి, దుగ్గుపురం, తులగాం నిర్వాసిత గ్రామాలకు చెందిన వారు. ఈ దాడి ఘటన తర్వాత అదనంగా బలగాలను రప్పించి నిర్వాసిత గ్రామాలకు సమీపంలో పోలీసులు మోహరించారు. నిత్యావసర సరుకుల కోసమో, మరేదైనా అవసరానికో ఊళ్ల నుంచి వచ్చిన నిర్వాసితులను ఆరా తీస్తున్నారు. వారి ఫోన్లతో నిర్వాసిత నాయకులకు, కేసుల్లో నిందితులుగా ఉన్న వారికి ఫోన్ చేయిస్తున్నారు. సిగ్నల్స్ ఆధారంగా వారికి వల వేయాలనే ప్రయత్నంలో పోలీసులు నిమగ్నమయ్యారు. నిర్వాసితులను పరామర్శించడానికి జిల్లా కేంద్రం నుంచి వెళ్లాలనుకున్న విపక్ష నాయకులను, న్యాయవాదులను ఎక్కడికక్కడకే పోలీసులు నిలువరిస్తున్నారు. అధికార పార్టీ నాయకుల తీరిదీ.. జిల్లా మంత్రిగా ఇటీవల వరకూ జలవనరుల శాఖ, వంశధార అధికారులు, రెవెన్యూ అధికారులతో వరుస సమీక్షలతో హడావుడి చేసిన కింజరాపు అచ్చెన్నాయుడు నెల రోజులుగా కర్నూలు జిల్లాలో నంద్యాలకే పరిమితమైపోయారు. గత నెల 30వ తేదీన టెక్కలిలో పోలీసు సర్కిల్ కార్యాలయం ప్రారంభానికి, మళ్లీ ఈనెల 9వ తేదీన పాతపట్నంలో జరిగిన గిరిజన ఉత్సవానికి చుట్టపు చూపుగా వచ్చి వెళ్లిపోయారు. కర్నూలు జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్నంత మాత్రాన నంద్యాల ఎన్నికలపై దృష్టి పెట్టి సొంత జిల్లా ప్రజల సమస్యలను గాలికొదిలేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాకు మరో మంత్రి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు తొలినుంచీ వంశధార నిర్వాసితుల సమస్యలు పట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఆయన కూడా నెలలో రెండు రోజులు రాజాంలో క్యాంపు కార్యాలయానికి లేదా ఎచ్చెర్లలో మరేదైనా కార్యక్రమానికి తప్పితే మరో సమస్యలను పట్టించుకున్న దాఖలాల్లేవు. ఈనెల 1వ తేదీకే శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఇక్కడే తరగతులు నిర్వహిస్తామని ఏడాది క్రితం నుంచి ఊదరగొట్టినా చివర్లో చేతులెత్తేశారనే విమర్శలు వినపిస్తున్నాయి. ఇప్పుడు ట్రిపుల్ ఐటీ కన్నా కాకినాడ నగరపాలక సంస్ ఎన్నికలపైనే ఆయన దృష్టి పెట్టారు మరి! జిల్లాలో మరో ముఖ్య నాయకుడు, ప్రభుత్వ విప్ కూన రవికుమార్ కూడా నంద్యాల ఎన్నికల ప్రచారంలోనే తలమునకలై ఉన్నారు. ఆయన హామీ ఇచ్చిన ఆమదాలవలస షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభం ఎంతవరకూ వచ్చిందో రైతులకే ఎరుక! ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందా ళం అశోక్ కూడా కొద్దిరోజులుగా విజయవాడ, నంద్యాల మధ్య చక్కర్లు కొడుతున్నారే తప్ప కిడ్నీవ్యాధిగ్రస్తుల సమస్యలను పట్టించుకోవట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏవో కొన్ని కారణాల రీత్యా పలాస ఎమ్మెల్యే జీఎస్ఎస్ శివాజీ, నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ప్రస్తుతానికి జిల్లాలోనే ఉండిపోయారు. -
శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం
ఫ్యాక్షన్, మట్కా, పేకాట, బెట్టింగ్ అణిచివేతకు కృషి నూతన ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ అనంతపురం సెంట్రల్ : జిల్లాలో ప్రణాళికా బద్ధంగా పనిచేసి శాంతిభద్రతలను పరిరక్షిస్తానని నూతన ఎస్పీ గోరంట్ల వెంకటగిరి అశోక్‌కుమార్ తెలిపారు. సోమవారం జిల్లా ఎస్పీగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఉదయం 10 గంటల సమయంలో పోలీసు కార్యాలయంలోని ఆయన చాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. తర్వాత ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అశోక్‌కుమార్ మాట్లాడారు. దేశంలోనే అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతమిదేనని చెప్పారు. ఈ ఏడాది పంటలు బాగా పండి రైతులు, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ జిల్లాకు ఎస్పీగా రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ జిల్లాలో మొదటి నుంచి ఫ్యాక్షన్ , భూ తగాదాలు ఎక్కువేనన్నారు. అలాంటి గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచుతామని తెలిపారు. జిల్లాలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మట్కా , పేకాట, క్రికెట్ బెట్టింగ్ లాంటి అసాంఘిక కార్యకలాపాలను ఉక్కుపాదంతో అణిచివేస్తామన్నారు. రోడ్డు ప్రమాదాల్లో జిల్లా 7వ స్థానంలో ఉందని, ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడతామని చెప్పారు. మైనర్ బాలికల మిస్సింగ్ కేసులు అధికంగా ఉన్నాయని నివేదికలను బట్టి తెలుస్తోందని, కారణాలను అన్వేషించి చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ప్రజలతో పోలీసులు సఖ్యతగా మెలిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో పోలీసు సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని, వాటిని కొనసాగిస్తూనే మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు. టెక్నాలజీ సహాయంతో ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మాల్యాద్రి, డీఎస్పీలు, సీఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
డీడీఏగా శ్రీనివాసులు బాధ్యతల స్వీకరణ
అనంతపురం అగ్రికల్చర్ : వ్యవసాయశాఖ జేడీ కార్యాలయంలో డీడీఏగా శ్రీనివాసులు సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. ఇటీవల జరిగిన బదిలీల్లో ఆయన కర్నూలు జిల్లా నుంచి ఇక్కడికి వచ్చారు. అగ్రానమీ డీడీఏగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసులకు ఆశాఖ అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జేడీఏ పీవీ శ్రీరామమూర్తిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. -
బాధ్యత మరిచిన పార్టీలు
పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నాక కేంద్ర ప్రభుత్వం అందుకు ఎన్నెన్నో కారణాలు చెప్పింది. నల్లడబ్బు అంతుచూడటం మొదలుకొని నగదు రహిత ఆర్ధిక వ్యవస్థ వరకూ ఆ జాబితాలో ఎన్నెన్నో ఉన్నాయి. మిగిలినవాటి సంగతలా ఉంచి అయిదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో పార్టీలు మితిమీరి చేసే వ్యయం, అందుకోసం భారీ మొత్తంలో ఆ పార్టీలు సేకరిస్తున్న విరాళాలు నల్లడబ్బు మహమ్మారిని నానాటికీ పెంచుతున్నాయని తెలియనిదేమీ కాదు. పెద్ద నోట్ల రద్దు సమయంలో నల్లడబ్బు గురించి అంతగా హోరెత్తించినందుకైనా ఇతర పార్టీలకు ఆదర్శ ప్రాయంగా ఉండాలని బీజేపీ అనుకోలేదు... తామే ఆ విషయంలో మెరుగ్గా ఉన్నామని చాటుకునేందుకు మరో ప్రధాన పక్షం కాంగ్రెస్ ప్రయత్నించలేదు. ఎన్నికల సంఘానికి అక్టోబర్ 30లోగా తమ తమ జమాఖర్చుల నివేదికలను సమర్పించాల్సి ఉన్నా ఈ రెండు ప్రధానపక్షాలతో పాటు మరికొన్ని పార్టీలు కూడా ఇంతవరకూ ఆ పని చేయలేదంటే నల్లడబ్బు నిర్మూలన విషయంలో వాటి చిత్తశుద్ధి ఏపాటో అర్ధమవుతుంది. దేశంలోని స్వచ్ఛంద సంస్థలు విదేశాల నుంచి విరాళాలు తీసుకుంటూ ఆ లెక్కల్ని సమర్పించడంలేదని కేంద్ర ప్రభుత్వం వాటిపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది. గ్రీన్‌పీస్‌తో సహా దాదాపు 10,000 సంస్థల లైసెన్స్‌లు రద్దు చేసింది. వాటి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసింది. కానీ తమ పార్టీ జమాఖర్చుల్ని గడువులోగా ఎన్నికల సంఘానికి సమర్పించాలన్న స్పృహ ఎన్డీఏ సర్కారుకు నేతృత్వం వహిస్తున్న బీజేపీకి కొరవడింది. నల్లడబ్బు కారణంగా దేశం ఎలా నాశనమైపోతున్నదో చెప్పడానికి మన నేతల్లో చాలామంది ఉబలాటపడతారు. తమకు అధికారం అప్పగిస్తే దాని సంగతి తేలుస్తామని ఎన్నికల ప్రచారంలో చెబుతుంటారు. అయితే నాయకులకు దగ్గర్లో మైకు లేనప్పుడో, అనుకోకుండా వారు నోరు జారినప్పుడో మాత్రమే నికార్సయిన నిజం వెల్లడవుతుంది. నాలుగేళ్ల క్రితం బీజేపీ సీనియర్ నేత స్వర్గీయ గోపీనాథ్ ముండే ఒక సెమినార్లో ఎన్నికల ఖర్చు నానాటికీ ఎలా పెరుగుతూ పోతోందో సోదాహరణంగా వివరించారు. 1980 అసెంబ్లీ ఎన్నికల్లో తాను కేవలం రూ. 29,000 మాత్రమే ఖర్చు చేశానని... 2009 లోక్‌సభ ఎన్నికలకు రూ.8 కోట్లు వ్యయం చేయాల్సివచ్చిందని చెప్పారు. సరిగ్గా ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సైతం నోరు జారారు. ఎన్నికల వ్యయం తడిసి మోపెడవుతున్నదని ఒక చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో చెబుతూ 2014 ఎన్నికల్లో తనకు రూ.11.5 కోట్లు ఖర్చయిందని చెప్పారు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 77 ప్రకారం ఎన్నికల్లో నిజంగా ఖర్చుచేసిన మొత్తాన్నే ఏ అభ్యర్థి అయినా వెల్లడించాల్సి ఉంటుంది. అలా వెల్లడించలేదని రుజువైతే చట్టసభ సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉంది. ముండే అయినా, కోడెల అయినా ఎన్నికలైన తర్వాత ఈసీకి సమర్పించిన వ్యయ నివేదికల్లో నిజాలే వెల్లడించి, పర్యవసానాలకు సిద్ధపడి ఉంటే వారి నిజాయితీని అందరూ కొనియాడేవారు. కానీ ఆ వ్యయ నివేదికల్లో మాత్రం నిబంధనల పరిమితుల్లోనే ఖర్చు చేశామని తెలిపి, అనంతర కాలంలో వేరే లెక్కలు చెప్పడంపైనే అందరికీ అభ్యంతరం. ముండే, కోడెల ఇద్దరూ తమ ప్రకటనలు సృష్టించిన వివాదాలకు జడిసి మేం చెప్పింది అది కాదని ఆ తర్వాత సర్దుకున్నారు. అది వేరే విషయం. సాధారణంగా ఎన్నికల సమయంలో పార్టీలు, అభ్యర్థులు చేసే వ్యయమంతా నగదుగానే తప్ప చెక్కుల రూపంలో ఉండదు. చాలా రాష్ట్రాలు నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించడానికి కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకుని అక్కడ కార్డు చెల్లింపులను, చెక్కు లావా దేవీలను ప్రోత్సహిస్తున్నాయి. ఆ ప్రభుత్వాలకు నాయకత్వం వహిస్తున్న పార్టీలు ఇదే నిబంధనను తమ ఖర్చులకు, తమ అభ్యర్థులు చేసే ఎన్నికల వ్యయానికి వర్తింపజేస్తాయా? అలా చేస్తే నల్లడబ్బు చాలా భాగం తగ్గిపోతుంది. పార్టీలు, నాయకులు చెప్పే లెక్కలకూ, చేసే ఖర్చులకూ పొంతన ఉండదన్నది ఇవాళ బహిరంగ రహస్యం. నిబంధనలను పాటించి ఆడిట్ చేయించిన జమా ఖర్చుల నివేదికల్ని గడువులోగా సమర్పించాలన్న కనీస స్పృహ వాటికి లేకపోవడమే విషాదం. ఇలా నిబంధనల పాటింపుతో సంబంధం లేకుండా రాజకీయ పార్టీలకు అనేక రాయితీలు, మినహాయింపులు లభిస్తున్నాయి. రూ.20,000కు మించిన విరాళాలకు మాత్రమే పార్టీలు లెక్కలు చెప్పాల్సి ఉంటుందన్నది అలాంటిదే. ఈ నిబంధన సాకుతో చాలా రాజకీయ పార్టీలు తమకొచ్చే నిధులకు లెక్క చెప్పడంలేదు. పెద్ద నోట్ల రద్దు అనంతరం ఒకపక్క సాధారణ పౌరుల ఖాతాల్లో అధిక మొత్తంలో డబ్బు జమ అయితే దర్యాప్తు చేస్తామన్న కేంద్రం... ఐటీ చట్టం నిబంధన ప్రకారం రాజకీయ పార్టీలకు మాత్రం దీన్నుంచి మినహాయింపు ఉంటుం దని చెప్పడం అందరికీ గుర్తుంది. ఈ ప్రకటన కల్లోలం రేపాక కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్‌జైట్లీ సర్దుకున్నారు. ఐటీ చట్టానికి తాజా సవరణ తర్వాత ఆ మినహాయింపు పోయిందన్నారు. నిబంధనలను బేఖాతరు చేస్తున్న పార్టీలకు మినహాయింపు ఎందుకివ్వాలన్నదే సామాన్యుల ప్రశ్న. దానికి జవాబిచ్చేవారు లేరు. విరాళాలకు సంబంధించి ఉన్న పరిమితిని అడ్డం పెట్టుకుని రాజకీయ పార్టీలు అనేక రకాల విన్యాసాలు చేస్తున్నాయి. ఉదాహరణకు 2015-16లో బీఎస్పీకొచ్చిన మొత్తం ఆదాయమంతా రూ. 20,000 చొప్పున విడివిడిగా విరాళాల రూపంలో వచ్చిందే. వాస్తవానికి బీజేపీ, కాంగ్రెస్‌తోసహా ప్రధాన పార్టీలన్నీ నిబంధనలను అడ్డం పెట్టుకుని తమకొచ్చే నిధుల్లో 70 శాతం మొత్తానికి లెక్కలు చెప్పడంలేదు. ఆ విరాళాలు ఎవరిచ్చారో వెల్లడించడంలేదు. అసెంబ్లీ ఎన్నికలకు రూ. 28లక్షలు, లోక్‌సభ ఎన్నికలకు రూ. 70 లక్షలు మించి వ్యయం చేయడానికి వీల్లేదని నిబంధనలు చెబుతున్నా... పార్టీల ఆదాయానికీ, వ్యయానికీ మాత్రం ఎలాంటి పరిమితులూ విధించడం లేవు. ఇలాంటి లొసుగుల వల్లే నల్లడబ్బువేళ్లూనుకుంటోంది. విస్తరిస్తోంది. ప్రధాన పార్టీలైనా పారదర్శకతతో, జవాబు దారీ తనంతో నిబంధనలు పాటించడం నేర్చుకుంటే అందరికీ ఆదర్శప్రాయమవుతాయి. -
ప్రతి విద్యార్థికి రాయడం.. చదవడం రావాలి
కడప : గ్రామీణ ప్రాంత పాఠశాలలోని ప్రతి విద్యార్థికి రాయడంతోపాటు చదవటం రావాలని అందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ఆర్జేడీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. రాయలసీమ ఆర్జేడీగా విధులను నిర్వహిస్తూ గత నెల 31న ప్రేమానందం పదవీ విరమణ చేసిన విషయం విదితమే. ఆయన స్థానంలో కృష్ణా జిల్లా డీఈఓగా పనిచేస్తున్న సుబ్బారెడ్డి శనివారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ నాలుగు జిల్లాలలో విద్యాభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానన్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వం నిర్వహించనున్న సమగ్ర నిరంతర విద్యా విధానానికి పిల్లలను సంసిద్ధులను చేయాలన్నారు.