
పురుషోత్తం
జిల్లాలో ముఖ్యమైన 5 పోస్టులకు ఒకరే అధికారిగా ఉండడం విశేషం. ఈ ఏడాది జూన్ 30న రెగులర్ డీఈవోగా పనిచేసిన నరసింహారెడ్డి ఉద్యోగ విరమణ పొందారు.
చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలో ముఖ్యమైన 5 పోస్టులకు ఒకరే అధికారిగా ఉండడం విశేషం. ఈ ఏడాది జూన్ 30న రెగులర్ డీఈవోగా పనిచేసిన నరసింహారెడ్డి ఉద్యోగ విరమణ పొందారు. ఆ తర్వాత ఏడీ–1 గా ఉన్న శ్రీరాం పురుషోత్తంకు డీఈవోగా అదనపు బాధ్యతలు ఇచ్చారు. అనంతరం చిత్తూరు డీవైఈవోగా మరో బాధ్యతలు చేపట్టారు.
తాజాగా కార్వేటినగరం డైట్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్‌గానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటివరకు డైట్ కళాశాల ప్రిన్సిపల్‌గా ఉండే శేఖర్ పుత్తూరు డీవైఈవోగా అదనపు బాధ్యతలు నిర్వహించేవారు. ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న పురుషోత్తం కూడా పుత్తూరు డీవైఈవోగా కూడా వ్యవహరించాల్సి ఉంది. దీంతో మొత్తం ఒక అధికారి 5 పోస్టుల్లో పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
చదవండి:
శింగనమల ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం