five
-
Eid ul-Adha 2024: పరిపూర్ణ ఆరాధన హజ్జ్
ఇస్లామ్ ధర్మం ఐదు మౌలిక సూత్రాలపై ఆధారపడి ఉంది. ఇందులో ఏ ఒక్కదాన్ని విస్మరించినా విశ్వాసం పరిపూర్ణం కాదు. మొట్టమొదటిది సృష్టికర్త ఒక్కడే అన్న విశ్వాసం. రెండవది నమాజ్, మూడవది రోజా, నాల్గవది జకాత్, ఐదవది హజ్జ్. దైవ విశ్వాస ప్రకటనకు ఇవి ఆచరణాత్మక సాక్ష్యాలు. ఒక మనిషి విశ్వాసి/ ముస్లిమ్ అనడానికి రుజువులు. అన్ని ఆరాధనలకూ ‘హజ్జ్’ ఆత్మ వంటిది. ఆర్ధిక స్థోమత కలిగిన ప్రతి ముస్లింపై హజ్ విధిగా నిర్ణయించడం జరిగింది. అందుకని ఆర్థిక స్థోమత కలిగినవారు జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా కాబా సందర్శన యాత్ర చేయడం తప్పనిసరి. ఈ‘హజ్’ జిల్ హజ్ మాసం పదవ తేదీన అరేబియా దేశంలోని మక్కా నగరంలో జరుగుతుంది. ఆ రోజే ప్రపంచంలోని ముస్లింలంతా పండుగ జరుపుకుంటారు. అదే ‘ఈదుల్ అజ్ హా’. దీన్ని బక్రీద్ పండుగ అని, ఈదె ఖుర్బాన్ అని కూడా అంటారు. ‘హజ్జ్ ’ఒక విశ్వజనీన, విశ్వవ్యాపిత ఆరాధన. ఇందులో శ్రీమంతులు, నిరుపేదలు, తెల్లవారు, నల్లవారు, అరబ్బులు, అరబ్బేతరులు అన్న భేద భావం మచ్చుకు కూడా కనిపించదు. ‘మానవులంతా ఒక్కటే’ అన్న విశ్వమానవతా భావంతో అందరూ ముక్తకంఠంతో అల్లాహ్‌ను కీర్తిస్తూ, ఆయన ఘనతను, ఔన్నత్యాన్ని కొనియాడుతూ భక్తిపారవశ్యంతో తాదాత్మ్యం చెందడమే హజ్ యాత్రలోని పరమార్థం. మక్కా నగర ఆవిర్భావంమక్కానగర ఆవిర్భావం దాదాపు ఐదువేల సంవత్సరాలకు పూర్వం జరిగింది. కొండలూ కోనల నడుమ, ఎలాంటి వనరులూ లేకుండా నిర్మానుష్యంగా పడి ఉన్న ఎడారి ్రపాంతంలో మహనీయ హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం తన ధర్మపత్ని హజ్రత్ హాజిరా అలైహిస్సలాంను, తనయుడు ఇస్మాయీల్ అలైహిస్సలాంను వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడు, శ్రీమతి హాజిరా, ’అదేమిటీ.. నన్నూ, నాబిడ్డను ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నారేమిటీ.?’అని ప్రశ్నించగా..,’ఇది దైవాజ్ఞ.’ అని మాత్రమే చెప్పి, అల్లాహ్‌పై అచంచల విశ్వాసంతో కనీసం వెనుదిరిగైనా చూడకుండా వెళ్ళిపోతారు హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం.కనీసం నాలుక తడుపుకోడానికి సైతం చుక్క నీరులేని ఆఎడారి ప్రదేశంలో చిన్నారి ఇబ్రాహీం దాహానికి తాళలేక గుక్కపట్టి ఏడుస్తున్న క్రమంలో ఆయన కాలి మడమలు రాసుకుపోయిన చోట అల్లాహ్ ఆజ్ఞతో అద్భుతమైన నీటి ఊట ఉబికింది. ‘జమ్ జమ్ ’అనే పేరుగల ఆ పవిత్ర జలంతో తల్లీ తనయులు తమ దాహం తీర్చుకున్నారు. ఆ నీరే ‘ఆబెజమ్ జమ్’ పేరుతో ప్రసిద్ధి గాంచింది. ఆనాడు కేవలం రెండు ్రపాణాలకోసం వెలసిన ఆ జలం ఈనాడు హజ్ యాత్ర నిమిత్తం మక్కావెళ్ళే లక్షలాదిమంది ప్రజలతోపాటు, స్థానికులకూ నిరంతరం సమృద్ధి్ధగా సరఫరా అవుతూ, యాత్రికులందరూ తమ తమ స్వస్థలాలకు తీసుకు వెళుతున్నా ఏమాత్రం కొరత రాకుండా తన మట్టాన్ని యథాతథంగా ఉంచుకోవడం అల్లాహ్ ప్రత్యక్ష మహిమకు నిదర్శనం. ఆ నాటి ఆ నిర్జీవ ఎడారి ్రపాంతమే ఈనాడు అత్యద్భుత సుందర మక్కానగరంగా రూపుదిద్దుకొని విశ్వవ్యాప్త ముస్లిం ప్రజానీకానికి పవిత్ర పుణ్యక్షేత్రంగా భాసిల్లుతోంది. తరువాత కొంతకాలానికి అల్లాహ్ ఆదేశం మేరకు హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం మక్కాకు తిరిగొచ్చి కుటుంబాన్ని కలుసుకొని, తనయుడు ఇస్మాయీల్ సహాయంతో ‘కాబా’ ను నిర్మించారు. చతుస్రాకారంలో ఉన్న ఆ రాతికట్టడాన్ని హజ్రత్ ఇబ్రాహీం, హజ్రత్ ఇస్మాయీల్ అలైహిముస్సలాంలు అల్లాహ్‌కు సమర్పించుకున్నారు. దీంతో కాబా దైవగృహంగా పేరు΄÷ందింది.అలౌకికానందంమక్కా చేరగానే ప్రతి హాజీ (యాత్రికుడు) కాబావైపు పరుగులు తీస్తాడు. పవిత్ర కాబాను చూడగానే భక్తులు ΄÷ందే ఆనంద పారవశ్యాలు వర్ణనాతీతం. ఒకానొక అలౌకిక ఆనందంతో, భక్తిపారవశ్యంతో కాబా చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణ చేస్తారు. దీన్ని’తవాఫ్’ అంటారు. ప్రతి తవాఫ్ లోనూ హాజీలు కాబాగోడలో అమరి ఉన్న ’హజ్రె అస్వద్ ’ (నల్లనిశిల) ను ముద్దాడడానికి ప్రయత్నిస్తారు. దైవ గృహమైన కాబాకు సమీపంలో క్రీ. శ. 570 లో ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జన్మించారు. కనుక భక్తులు ఆ జ్ఞాపకాలనూ నెమరు వేసుకుంటారు. ’జమ్ జమ్ ’బావిలోని పవిత్ర జలాన్ని తనివి తీరా సేవిస్తారు. తరువాత సఫా, మర్వా కొండల మధ్య ’సయీ’చేస్తారు. దీని తరువాత కొన్నిరోజులు ఎవరి నివాసాల్లో వారు దైవచింతన, నమాజులతో కాలం గడిపి, ’జిల్ హజ్ ’మాసం ఎనిమిదవ తేదీన ’మినా’ గ్రామం వెళ్ళి ఒక రోజంతా అక్కడ ఉంటారు. తొమ్మిదవ తేదీన ప్రపంచం నలుమూలలనుండీ వచ్చిన హాజీలంతా ‘అరఫాత్ ’మైదానంలో గుమిగూడి దైవకారుణ్యాన్ని అభిలషిస్తూ ్రపార్ధనలు చేస్తారు. ఈ సందర్భంలోనే ఆనాడు ముహమ్మద్ ప్రవక్త (స) అశేష భక్తజనాన్ని ఉద్దేశించి తమ అంతిమ సందేశం వినిపించారు. అందుకని భక్తులు ఆ మహనీయుడు నిలిచిన ప్రదేశాన్ని కూడా దర్శించి పులకించి పోతారు. సూర్యాస్తమయానికి తిరుగు ప్రయాణం ్రపారంభించి’ముజ్దలఫా’ దగ్గర రాత్రి మజిలీ చేస్తారు. అక్కడే మగ్రిబ్, ఇషా నమాజులు కలిపి సామూహికంగా చేస్తారు. మదీనాసాధారణంగా మక్కాను దర్శించుకున్న యాత్రికులు మదీనాను కూడా సందర్శిస్తారు. మదీనా మక్కాకు రెండువందల మైళ్ళ దూరంలో ఉంది. ముహమ్మద్ ప్రవక్త (స) మక్కా నుండి మదీనాకు వలసవెళ్ళి అంతిమ దినాలు అక్కడే గడిపారు. మస్జిదెనబవి సందర్శనకు, హజ్జ్ కు ఎలాంటి సంబంధం లేకపోయినా అది ఇస్లామీయ జగత్తుకు జీవనాడి లాంటిది. ప్రవక్త మసీదు సందర్శన సున్నత్. కనుక దూరతీరాలనుండి వచ్చిన భక్తులు మస్జిదె నబవిని కూడా సందర్శించి, నమాజులు చేసి తమ యాత్ర సఫలమైందని భావిస్తారు. ఈ విధంగా ఒకహాజీ అన్ని నియమాలను పాటిస్తూ, అల్లాహ్ ఏకత్వానికి ప్రతీకగా నిలిచిన పవిత్రకాబా గహాన్ని సందర్శిస్తాడు. యాత్రాక్రమంలో అతనికి అడుగడుగునా హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం, హజ్రత్ ఇస్మాయీల్ అలైహిస్సలాం గార్ల సహనశీలత, త్యాగనిరతి, పాపభీతి, వాగ్దానపాలన, దైవాదేశపాలన లాంటి అనేక సుగుణాలను ఒంటబట్టించుకుంటాడు. అంతేకాదు, ఇంకా మరెన్నో సుగుణాలను మానవుల్లో జనింపజేసి మానవ సమానత్వానికి, విశ్వమానవ సౌభ్రాతృత్వానికి పూలబాటలుపరిచి, వారి ఇహపర సాఫల్యానికి హామీగా నిలుస్తుంది హజ్జ్ . ఇదే కాబా గృహ సందర్శనాయాత్ర అసలు పరమార్థం. అల్లాహ్ మనందరికీ ఈ విషయాలను అర్థం చేసుకొని, ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం. తఖ్వా ప్రధానందేవుని ఏకత్వానికి ప్రతీకగా నిలిచిన హజ్జ్‌ను సకల ఉపాసనా రీతులు ఇముడ్చుకున్న పరిపూర్ణ దైవారాధన అని కూడా చెప్పుకోవచ్చు. హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం తన కుమారుడు ఇస్మాయీల్ (అ)తో కలిసి నిర్మించిన కాబా గృహ సందర్శనలో ఉపాసనా, ఆరాధనా రీతులన్నీ పరిపూర్ణతను సంతరించు కున్నాయి. యాత్ర, నిరాడంబర సాధు వస్త్రధారణ, దైవ్రపార్థన, వ్రతనిష్ఠ, ఖుర్బానీ ఇవన్నీ సమన్వయం చెంది, ఒకేచోట కేంద్రీకృతమై, ఏకైక ప్రభువు సన్నిధిలో, హజ్ ఆరాధనలో ప్రదర్శితమవుతాయి. అందుకని కాబా గృహ సందర్శనార్ధం చేసే హజ్జ్ వల్ల ఉపాసనా రీతులన్నిటినీ ఆచరించి దైవానుగ్రహం ΄÷ందినట్లే అవుతుంది. ఈ కారణంగానే ముస్లిం స్త్రీ పురుషులందరూ జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా హజ్ చేయాలని అభిలషిస్తారు. ఆ మహాభాగ్యంకోసం ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. – యండి. ఉస్మాన్ ఖాన్ -
5 ట్రిలియన్లు ఎన్నడు?
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆ మధ్య ఒక ఇంగ్లిష్ పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వర్తమానంలోనూ, భవిష్యత్తులోనూ భారతదేశ ప్రగతి ఎంతో ఉజ్వలమని వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ ను కట్టడి చెయ్యడంలో మన పాత్ర అద్భుతం అని సమాధానం చెప్పారు. 2024 కల్లా భారతదేశం 5 ట్రిలియన్ల ఆర్ధిక వ్యవస్థగా బలోపేతమవుతుందని, చాలా బలమైన విశ్వాసాన్ని ప్రకటించారు. కేంద్రం-రాష్ట్రాల మధ్య ఫెడరల్ వ్యవస్థ ఆదర్శవంతంగా సాగుతోందని కితాబు ఇచ్చారు. వ్యవసాయంలోనూ, కార్మిక రంగంలోనూ తీసుకువచ్చిన సంస్కరణలు గతంలో ఎన్నడూ లేనంత ప్రభావాన్ని చూపిస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కరోనా వంటి కష్టకాలంలో, విపత్తుల్లో పేదవాడికి ప్రభుత్వం అందించిన చేయూత అద్భుతమైనదని,ఆత్మతృప్తిని వ్యక్తం చేశారు.ఉత్పత్తి, తయారీ రంగంలో ప్రపంచం మొత్తానికి సరఫరా చేయగలిగిన మార్కెట్ కేంద్రంగా సమీప భవిష్యత్తులో భారత్ నిలుస్తుందనే విశ్వాసాన్ని ప్రకటించారు.సంస్కరణల పరంపర నిరాఘాటంగా కొనసాగుతూనే ఉంటుందని సమాధానం చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా, దానికి తగ్గట్టుగా రాష్ట్రాలు స్పందించక పోతే, ఆశించిన అభివృద్ధి జరగదని తెలిపారు.పెట్టుబడులను ఆకర్షించడంలో రాష్ట్రాలు తమ వంతు పాత్ర పోషించడం కీలకమని సూచించారు. చేయాలనుకున్న మేలు,చిట్ట చివరి మైలు వరకూ చేరుకునే డెలివరీ వ్యవస్థ మనల్ని కాపాడిందని,ఈ యంత్రాంగాన్ని అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళల్లోనే నిర్మించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికే చెల్లిందని తమ పాలన పట్ల అత్యంత ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించారు.లక్షలాది మంది ప్రజలకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకే నగదును బదిలీ చేయగలిగామనే ఆత్మతృప్తి తనకు ఎంతో ఉత్సహాన్ని,శక్తిని ఇచ్చిందని వ్యాఖ్యానించారు. ఇది తమ ప్రభుత్వం మాత్రమే చేసిన చారిత్రక చర్య అని తెలిపారు.ఇలా,ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన భావాలను, అనుభవాలను,ఆలోచనలను, ఆశయాలను,సంకల్పాలను ఆ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో ఆ యాంకర్ ఇంకా సంధించాల్సిన చాలా ప్రశ్నలు సంధించలేదని చెప్పాలి. ప్రధాని చెప్పిన జవాబుల్లోనూ ఇంకా విస్తృతి వుంటే బాగుండేది. ప్రధానమంత్రి చెప్పిన మాటలు, చేసిన వ్యాఖ్యలను సమీక్ష చేసుకుంటే,కొన్ని వాస్తవానికి దగ్గరగానూ,కొన్ని దూరంగానూ ఉన్నాయి.సుమారు 139కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ వల్ల, కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలోనూ, మరణాల సంఖ్యను అదుపులో ఉంచడంలోనూ, పరీక్షలు జరపడంలోనూ మంచి ఫలితాలే వచ్చాయి. ముందుజాగ్రత్త చర్యలు, హెచ్చరికలు చేపట్టకుండా, ఉన్నపళంగా లాక్ డౌన్ విధించడం వల్ల ఎన్నో అనర్ధాలు సంభవించాయి. ముఖ్యంగా వలసకార్మికులు పడిన కష్టాలు,పోగొట్టుకున్న ప్రాణాలు, కోల్పోయిన ఉపాధి వర్ణనాతీతం. లాక్ డౌన్ వల్ల ఆరోగ్యపరంగా కొంత రక్షణ పొందాం. సమాంతరంగా ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమై పోయింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఇంత ఘోరమైన ఆర్ధిక పరిస్థితులు ఎప్పుడూ ఎదుర్కోలేదు.గతంలో ఆర్ధిక మాంద్యం వచ్చిన దశ కంటే, నేటి దశ చాలా ఘోరమైనదిగా విశ్లేషకులు భావించారు. అన్ లాక్ ప్రారంభమైనప్పటి నుంచీ కొంత ప్రగతి నమోదవుతూ వచ్చింది.ఆ సమయంలో నిర్మాణం,ఉత్పత్తి రంగాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఆర్ధిక లావాదేవీలు చాలా మందకొడిగా సాగాయి. డిమాండ్-సప్లై మధ్య ఉన్న బంధం ఆరోగ్యకరంగా సాగలేదు. కరోనా ప్రభావంతో మిగిలిన దేశాల్లో వచ్చిన ఆర్ధిక కష్టాల ప్రభావం మన దేశంపైనా పడింది. దెబ్బతిన్న దేశాల్లో అమెరికా,చైనా వంటి పెద్ద దేశాలు సైతం ఉన్నాయి. అమెరికా బాగా దెబ్బతింది. చైనాకు -భారత్ కు మధ్య ఉన్న వాణిజ్య, వ్యాపార బంధాలు చాలా వరకూ తెగిపోయాయి. ఈ ప్రభావం మన ఉత్పత్తి రంగం, తద్వారా మన ఆర్ధిక రంగంపై పడింది.ఫార్మా మొదలు అనేక తయారీల్లో మనం చైనాపైనే ఆధారపడ్డాం.అదే విధంగా "మేక్ ఇన్ ఇండియా" ను ఆచరణలో ఆశించిన స్థాయిలో సాధించలేదు. కాబట్టి, ఈ పరిణామాల వల్ల మూల్యం చెల్లించుకోవాల్సివచ్చింది. అంతటి గడ్డు పరిస్థితుల్లోనూ మన దేశాన్ని కాపాడింది వ్యవసాయ రంగం. అది ఎంతో కొంత పచ్చగా ఉండడం వల్ల, కొంత ఆర్ధిక రక్షణ జరిగింది. యత్ర నార్యంతు పూజ్యతే... అన్నట్లుగా, ఎక్కడైతే వ్యవసాయ రంగం బాగుంటుందో, ఆ క్షేత్రం సుభిక్షంగా ఉంటుంది. వ్యవసాయ రంగంపై పాలకులకు ఇంకా శ్రద్ధాభక్తులు పెరగాలి. వ్యవసాయం కోసం ఉపయోగించుకోకుండా ఉన్న భూమి ఇంకా చాలా ఉంది. దాన్ని గుర్తించి,వ్యవసాయాన్ని విస్తరించాలి.కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ పంజాబ్ రైతులు మళ్ళీ ఆందోళనకు దిగారు. సార్వత్రిక ఎన్నికల వేళయ్యింది. చర్చలు జరిపి శుభం కార్డు వెయ్యాలి.ఆహార రక్షణపై (ఫుడ్ సెక్యూరిటీ) పైనా దృష్టి పెట్టాలి.స్వామినాథన్ వంటి నిపుణులు చేసిన సూచనలు ఆచరణలో అంతంతమాత్రంగానే ఉన్నాయి. రాష్ట్రాలకు రావాల్సిన జి ఎస్ టి బకాయిలపై కేంద్రం చెప్పేవి మాటల గారడీ మాత్రమేనని కొందరు పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. రుణాల వసతి కల్పించినా, వాడుకునే పరిస్థితి రాష్ట్రాలకు ఏమాత్రం ఉందన్నది సందేహమే. థామస్ రాబర్ట్ మాల్థస్ అనే ఆర్ధిక పండితుడు ఎప్పుడో 200ఏళ్ళ క్రితం చెప్పిన మాటలను దేశాధినేతలు పెడచెవిన పెట్టినట్లు కనిపిస్తోంది.జనాభా పెరుగుదల సంఖ్య ఆధారంగా, ప్రతి 25సంవత్సరాలకు ఒకసారి ప్రపంచంలో అనేక మార్పులు వస్తాయని,వాటికి అనుగుణంగా మనం సిద్ధమై ఉండాలని ఆయన హెచ్చరించారు. ప్రకృతి వైపరీత్యాలు, ఆర్ధిక మాంద్యాలు, కరోనా వైరస్ వంటి ముప్పులు, అనారోగ్యాలు ఎన్నో వస్తూ వుంటాయని,వీటిని గుర్తెరిగి, మనం నడచుకోవాలని ఆయన సూచించాడు.ముందు జాగ్రత్త చర్యలు పాటించక పోవడం వల్ల, ఆర్ధికంగా,మౌలికంగా సంసిద్ధమై ఉండక పోవడం వల్ల, ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు కుదేలైపోతున్నాం. మాల్థస్ మహనీయుడి మాటలు ఇప్పటికీ ప్రత్యక్షర, ప్రత్యక్ష సత్యాలుగా నిలుస్తున్నాయి. భారతదేశాన్ని పునర్నిర్మించాలనే సత్ సంకల్పం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఉండడం ఎంతో అభినందనీయం,పూజనీయం. ఈ 2024కల్లా 5ట్రిలియన్ల ఆర్ధిక వ్యవస్థను నిర్మించాలన్నది ప్రధాని పెట్టుకున్న మహదాశయం. ప్రపంచ ఆర్ధిక పరిణామాలను గమనిస్తే,2024కల్లా 3 ట్రిలియన్ల ఆర్ధిక వ్యవస్థకు భారత్ చేరుకుంటే? అది గొప్ప ప్రగతి సందర్భమని ఆర్ధిక శాస్త్రవేత్తలు గతంలో అభిప్రాయపడ్డారు. నేడు దానిని సాధించాం. ప్రధాని సంకల్పిస్తున్నట్లుగా 5ట్రిలియన్ల వ్యవస్థ నిర్మాణం కావడానికి ఇంకా సమయం పడుతుంది.ప్రస్తుతం 3.7 ట్రిలియన్స్ స్థితిలో వున్నాం. 5 ట్రిలియన్స్ కు చేరుకోవాలంటే? మరో నాలుగైదేళ్లు పడుతుందని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు. రచయిత : మా శర్మ -
మధ్యంతర బడ్జెట్ ఈ ఐదింటిపై ఆశలొద్దు !
కేంద్ర బడ్జెట్ పేరు వినగానే మధ్య తరగతి ప్రజల్లో ఒకింత ఉత్సుకత మొదలవడం సహజం. పన్ను శ్లాబులు తగ్గిస్తారనో, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించే చర్యలేవో తీసుకుంటారనో ఆశ పడుతుంటారు. మహిళలు, యువత కోసం ప్రత్యేక పథకాలను ప్రభుత్వం ప్రకటిస్తుందేమోనని ఎదురుచూస్తుంటారు. మధ్యంతర బడ్జెట్ అయినా సామాన్య ప్రజానీకం మొదలు కార్పొరేట్ వర్గాల దాకా అందరి అంచనాలు భారీగానే ఉన్నాయి. మూడు, నాలుగు నెలల్లో ఎన్నికలు ఉండటంతో ఎన్నికల తాయిలాలు బడ్జెట్లో కనిపించవచ్చని అందరి అంచనా. అయితే ఆర్థిక నిపుణుల అంచనాల ప్రకారం ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టే 2024–25 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ఒక ఐదు అంశాలపై ఆశలు పెట్టుకోకపోవడమే ఉత్తమం అని వారు సెలవిస్తున్నారు. ఆ ఐదేంటో ఓసారి చూసేద్దాం. – సాక్షి, నేషనల్ డెస్క్ 1. ప్రభుత్వ విధానపర నిర్ణయాలు త్వరలో లోక్‌సభ ఎన్నికలున్నాయి. విపక్షాల ‘ఇండియా’ కూటమి గెలిస్తే ఈ మధ్యంతర బడ్జెట్లో పెట్టుకున్న లక్ష్యాలను కొత్త ప్రభుత్వం నెలవేరుస్తుందన్న గ్యారెంటీ లేదు. అందుకే దీర్ఘకాలిక ఆర్థిక సంస్కరణల జోలికి వెళ్లకుండా ఇప్పటి పద్దుల సంగతే చూడాలని ప్రభుత్వం భావిస్తోందట. అందుకే ప్రభుత్వం ఎలాంటి నూతన ప్రతిష్టాత్మక పథకాలను ప్రారంభించదల్చుకోలేదని కొందరు ఆర్థిక వేత్తలు అంచనావేస్తున్నారు. ఈసారి బడ్జెట్లో కొత్త పథకాలు ఏమీ ఉండబోవని ఇప్పటికే విత్త మంత్రి నిర్మల సెలవివ్వడం గమనార్హం. ప్రస్తుత ఖర్చుల మీద మాత్రమే దృష్టిపెడతామని ఆమె ప్రకటించారు. 2. పన్ను మినహాయింపులు పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భాల్లో మాత్రమే పన్ను శ్లాబుల్లో మార్పుల వంటి కీలక నిర్ణయాలను ప్రభుత్వాలు ప్రకటించడం చూశాం. ఇది మధ్యంతర బడ్జెట్ కాబట్టి పన్ను శ్రేణుల్లో సవరణలు ఆశించలేమని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. అంటే పన్ను శ్లాబుల్లో మార్పులు రావాలంటే కొత్త ప్రభుత్వం కొలువుతీరాక వచ్చే పూర్తి బడ్జెట్ దాకా వేచి ఉండక తప్పదు. 3. నూతన సంక్షేమ పథకాలు కొత్త సంక్షేమ పథకానికి రూపకల్పన చేయాలంటే చాలా సమయం పడుతుంది. మూడోసారి హ్యాట్రిక్ కొట్టి కేంద్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవడంపై దృష్టిపెట్టిన బీజేపీ.. కొత్త పథకాలను పట్టించుకోదనే వాదన ఉంది. నూతన సంక్షేమ పథక రచనకు విస్తృతస్తాయి సంప్రదింపులు జరగాలి. ఎన్డీఏ కూటమికి అంత వ్యవధిలేదని మూడోసారి గెలిచాక వాటి సంగతి చూసుకుందామనే ధోరణి బీజేపీలో కనిపిస్తోందని ఒక రాజకీయ విశ్లేషకుడు అంచనావేశారు. కొత్త సంక్షేమ పథకం ప్రకటించి అమలుచేయాలంటే అందుకు తగ్గ ఆర్థికవనరులనూ సమకూర్చుకోవాల్సిందే. అంటే పూర్తి బడ్జెట్ స్థాయిలో కేటాయింపులు జరగాలి. మధ్యంతర బడ్జెట్లో అది సాధ్యమేనా అనే ప్రశ్న ఇక్కడ తలెత్తుతుంది. అందుకే కొత్త సంక్షేమ పథకాల పాట బీజేపీ పాడదని మాట వినిపిస్తోంది. 4. ద్రవ్యలోటు కట్టడి చర్యలు ద్రవ్యలోటును తగ్గించుకునేందుకు ఖర్చులను తగ్గించుకోవడం వంటి చర్యలకు ఉపక్రమించాలి. ఆ పని చేయాలంటే సంబంధిత అన్ని శాఖలతో విస్తృతస్థాయి సంప్రతింపులు అవసరం. అత్యంత కఠిన ఆర్థిక క్రమశిక్షణ పేరుతో ద్రవ్యలోటు కట్టడి చర్యలకు దిగితే దాని పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. సార్వత్రిక ఎన్నికలపై పూర్తిగా దృష్టిపెట్టే సర్కార్ మళ్లీ ద్రవ్యలోటు అంశాన్ని సీరియస్‌గా తీసుకుంటుందా లేదా అనేది తెలియాల్సిఉంది. ద్రవ్యలోటు భారాన్ని దింపేందుకు మధ్యంతర బడ్జెట్ సరైన వేదిక కాదనే భావన ఉండొచ్చు. 5. నూతన ఆర్థిక విధానాలు చాలా నెలలుగా అమలవుతోన్న ఆర్థిక విధానాల్లో సమూల మార్పులు తెస్తూ ప్రకటించే నూతన ఆర్థిక విధానాలు వ్యవస్థను ఒక్కసారిగా కుదుపునకు గురిచేస్తుంది. ఇలాంటి ప్రయోగాలు సాధారణంగా పూర్తిస్తాయి బడ్జెట్లోనే చేస్తారు. మధ్యంతర బడ్జెట్‌కు ఈ ఫార్ములా నప్పదు అనే అభిప్రాయం ఒకటి ఉంది. దీర్ఘకాలిక ప్రణాళికలు, సంబంధిత రంగాల సంస్థలతో చర్చోపచర్చల తర్వాతే మామూలుగా ఇలాంటి నూతన ఆర్థిక విధానాలను ప్రకటిస్తారు. నూతన ఆర్థిక విధానాలు ప్రకటిస్తే స్టాక్ మార్కెట్లు స్పందించడం సర్వసాధారణం. సానుకూలమో, ప్రతికూలమో, లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోవడమో.. ఇంకేదైనా జరగొచ్చు. ఇలాంటి సాహసోపేత నిర్ణయాల అమలుకు మధ్యంతర బడ్జెట్‌ను ప్రభుత్వం వాడుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే. అయినా కొన్ని అంచనాలు.. 1.పెట్రోల్, డీజిల్ ధరలను కిందకు దించుతారని ఆశలూ ఎక్కువయ్యాయి. అధిక పెట్రో ధరల కారణంగా ప్రభుత్వ చమురు రిటైల్ కంపెనీలు ఇటీవలికాలంలో అధిక లాభాలను కళ్లజూశాయి. ఈ లాభాలను పౌరులకు కాస్తంత మళ్లించే యోచన ఉందట. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ. 5–10వరకు తగ్గించవచ్చని అనుకుంటున్నారు. పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం తగ్గించడం, విద్యుత్ వాహనాలకు రాయితీ పొడిగింపు వంటి ప్రకటనలు బడ్జెట్ రోజు వెలువడొచ్చని భావిస్తున్నారు. 2. పట్టణవాసులు భారీ లబ్ది చేకూరేలా నివాస గృహాలపై తక్కువ వడ్డీకే రుణాలు అందించవచ్చని భావిస్తున్నారు. సబ్సిడీతో పీఎం ఆవాస్ యోజన తరహా కొత్త పథకం తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ తరహా పథకం అమలుచేస్తే బాగుంటుందని మంత్రి గతంలో వ్యాఖ్యానించడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. 3.దేశవ్యాప్తంగా అమలవుతున్న కేంద్ర పథకం పీఎం– కిసాన్ కింద ఇచ్చే నగదు మొత్తాన్ని మరింత పెంచుతారని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. పలు రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇంతకంటే ఎక్కువ మొత్తం ఇస్తున్నాయి. అందుకే పీఎం–కిసాన్ నగదు సాయాన్ని అధికం చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని వార్తలొచ్చాయి. ఈ ఆలోచన బడ్జెట్లో ఆచరణాత్మకం అవుతుందో లేదో చూడాలి. పీఎం కిసాన్ మొత్తాన్ని దాదాపు రూ.9,000కు పెంచే వీలుందని సమాచారం. 4. గత బడ్జెట్లో మధ్యతరగతి కుటుంబాలకు పన్ను రిబేట్‌ను ఏకంగా రూ.7,00,000 పెంచడం వంటి చాలా కీలక నిర్ణయాలు వెలువడ్డాయి. దీంతో ఈసారి అలాంటి కలలనే మధ్యతరగతి కుటుంబాలు కంటున్నాయి. ఆదాయంపై స్టాండర్డ్ డిడక్షన్ (ప్రామాణిక తగ్గింపు) ప్రస్తుతం రూ. 50 వేలుగా ఉంది. కొత్త, పాత పన్ను విధానాల్లో ఈ డిడక్షన్‌ను రూ.1,00,000కు పెంచాలని మధ్యాదాయ వర్గాలు అభిలషిస్తున్నాయి.. 5. బ్యాంకు ఖాతాదారులకు పన్ను మినహాయింపులు పెరగొచ్చని మరో అంచనా. వీరి సేవింగ్స్ ఖాతా వడ్డీపైనా స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని రూ.50,000కు పెంచుతారని ఆశిస్తున్నారు. 6. ఆదాయపు పన్ను చట్టంలో ముఖ్యమైనదైన సెక్షన్–80సీ కింద ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇస్తున్నారు. పొదుపు పథకాల్లో పెట్టుబడులు, జీవిత బీమా చందా చెల్లింపులు, ట్యూషన్ ఫీజులు, గృహ రుణాల చెల్లింపులు, ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్లు అన్నీ దీని కిందికే వస్తాయి. కాబట్టి ఈ మొత్తాన్ని రూ. 3,00,000కు పెంచాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి. -
అధికారం కోసం కాంగ్రెస్ వంద అబద్ధాలు
సిద్దిపేటజోన్: పక్కనున్న కర్ణాటకలో ఐదు గ్యారంటీలను ప్రకటించిన రాహుల్, ప్రియాంకాగాంధీ పత్తా లేకుండాపోయారని, అక్కడ పరిస్థితి గందరగోళంగా మారిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లాకేంద్రంలో జరిగిన పలు సంఘాల ఆత్మీయ సమ్మేళనంలో పలు పార్టీల ప్రతినిధులు, నాయకులు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. హరీశ్‌రావు మాట్లాడుతూ వంద అబద్ధాలు ఆడైనా సరే అధికారంలోకి రావా లని కాంగ్రెస్ తాపత్రయపడుతోందని అన్నారు. మనకు బూతు మాటలు మాట్లాడే నేతలు కాదని, భవిష్యత్తు అందించే నాయకులు కావాలన్నారు. బట్టేబాజ్ మాటలు చెప్పే కాంగ్రెస్ పార్టీ నిజస్వరూ పాన్ని ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో మోకాలిచిప్పకు ఉచితంగా ఆపరేషన్లు అని పెట్టారని, కానీ తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇప్పటికే ఉచితంగా మోకాలి చిప్ప ఆపరేషన్లు చేస్తోందని, కాంగ్రెస్ వాళ్లకు అది కూడా తెలవదని ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో 112 నియోజక వర్గాల్లో అగ్రవర్ణ కులాల పిల్లలకు కూడా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. తొమ్మిదేళ్లు వర్గీకరణ అంశంపై జాప్యం చేసి ఇప్పుడు ఎన్నికల ముందు కేంద్రం కమిటీ అని కొత్త నాటకానికి తెర తీసిందని హరీశ్ విమర్శించారు. టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కమిటీ నాయ కులు మంత్రి హరీశ్‌ను కలిసి బీఆర్ఎస్కు మద్దతు ప్రకటించారు. వర్గీకరణకు బీఆర్ఎస్ కట్టుబడి ఉందని, తెలంగాణ ఏర్పడిన తొలి నాళ్లలోనే అసెంబ్లీలో తీర్మానం చేసి బిల్లును కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపిందన్నారు. మనకు కావాల్సింది కమిటీ కాదనీ, బిల్లు రావాలని, వెంటనే పార్లమెంటులో బిల్లు పెట్టాలని స్పష్టం చేశారు.బీఆర్ఎస్లో చేరిన బాబుమోహన్ తనయుడు సంగారెడ్డి జిల్లా బీజేపీ అందోల్ నియోజకవర్గ అభ్యర్థి బాబుమోహన్ కుమారుడు ఉదయ్‌భాస్కర్ ఆదివారం సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. -
రోజుకు 5,500 రిజిస్ట్రేషన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రోజుకు సగటున 5,500 వరకు రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరుగుతున్నాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా జరిగే వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లతో పాటు ధరణి పోర్టల్ ద్వారా నిర్వహించే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు కలిపి ఈ ఆర్థిక సంవత్సంలో ఇప్పటివరకు (ఏప్రిల్ 1 నుంచి సెపె్టంబర్ 20 వరకు) 9.5లక్షల వరకు లావాదేవీలు జరిగినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో వ్యవసాయేతర లావాదేవీలు 5.26లక్షల పైచిలుకు కాగా, వ్యవసాయ భూముల లావాదేవీలు 4.23లక్షలు కావడం గమనార్హం. ఈ లావాదేవీలపై గత ఐదు నెలల (ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు) కాలంలో రూ.7 వేల కోట్లు ఖజానాకు సమకూరింది. ఇందులో వ్యవసాయేర లావాదేవీల ద్వారా రూ.5000 కోట్ల వరకు రాగా, ధరణి పోర్టల్ ద్వారా రూ.1700 కోట్ల వరకు వచ్చి ఉంటుందని, ఇక సొసైటీలు, మ్యారేజీ రిజిస్ట్రేషన్లు, ఈసీ సర్టిఫికెట్లు తదితర లావాదేవీలు కలిపి ఆ మొత్తం రూ.7వేల కోటుŠల్ దాటి ఉంటుందని అధికారులు చెపుతున్నారు. రంగారెడ్డి జిల్లా నుంచే రూ.1,703 కోట్ల ఆదాయం ఇక, జిల్లాల వారీ రిజిస్ట్రేషన్ల విషయానికి వస్తే రాష్ట్రంలోని 12 రిజిస్ట్రేషన్ జిల్లాల్లో వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లు ఎక్కువగా రంగారెడ్డి జిల్లాలోనే జరుగుతున్నాయి. ఈ జిల్లా రిజిస్ట్రేర్ పరిధిలో ఆగస్టు నాటికి 1.07లక్షల డాక్యుమెంట్ల లావాదేవీలు జరిగాయి. తద్వారా ప్రభుత్వానికి రూ.1,703 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం దాటిన జిల్లాల్లో మేడ్చల్ కూడా ఉంది. ఇక్కడ 70వేలకు పైగా లావాదేవీలు జరగ్గా రూ.1,100 కోట్ల వరకు ఆదాయం వచ్చి ఉంటుందని అంచనా. ఇక, రాష్ట్రంలో అతి తక్కువగా హైదరాబాద్–1 పరిధిలో లావాదేవీలు జరిగాయి. ఇక్కడ గత ఐదు నెలల్లో 9,148 లావాదేవీలు మాత్రమే జరిగాయి. కానీ ఆదాయం మాత్రం రూ. 185 కోట్ల వరకు వచ్చింది. అదే వరంగల్ జిల్లా రిజిస్ట్రేర్ కార్యాలయ పరిధిలో 40వేలకు పైగా లావాదేవీలు జరిగినా వచ్చింది అంతే రూ.188 కోట్లు కావడం గమనార్హం. అంటే హైదరాబాద్–1 పరిధిలో ఒక్కో లావాదేవీ ద్వారా సగటు ఆదాయం రూ. 2.02 లక్షలు వస్తే, వరంగల్ జిల్లాలో మాత్రం రూ.40 వేలు మాత్రమే వచ్చిందని అర్థమవుతోంది. బంజారాహిల్స్ టాప్..ఆదిలాబాద్ లాస్ట్ అన్ని జిల్లాల కంటే ఎక్కువగా సగటు డాక్యుమెంట్ ఆదాయం బంజారాహిల్స్ (హైదరాబాద్–2) జిల్లా పరిధిలో నమోదవుతోంది. ఖరీదైన ప్రాంతంగా పేరొందిన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగే లావాదేవీల ద్వారా ఒక్కో డాక్యుమెంట్‌కు సగటున రూ.2.3లక్షలు ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 31 వరకు ఇక్కడ 16,707 లావాదేవీలు జరిగాయని, తద్వారా రూ. 396.56 కోట్ల ఆదాయం వచ్చిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక, డాక్యుమెంట్ సగటు ఆదాయం అతితక్కువగా ఆదిలాబాద్ జిల్లాలో వస్తోంది. ఇక్కడ సగటున ఒక్కో డాక్యుమెంట్‌కు రూ.23వేలకు కొంచెం అటూ ఇటుగా ఆదాయం వస్తోంది. డాక్యుమెంట్ల వారీగా పరిశీలిస్తే రంగారెడ్డి ప్రథమ స్థానంలో ఉండగా, ఖమ్మం చివరి స్థానంలో ఉంది. ఖమ్మం జిల్లా రిజిస్ట్రేర్ కార్యాలయ పరిధిలో గత ఐదు నెలల కాలంలో కేవలం 20వేల పైచిలుకు మాత్రమే రిజిస్ట్రేషన్లు జరగడం గమనార్హం. -
5 దారుణ అల్లర్లు.. దేశాన్ని వణికించి, రక్తపాతాన్ని సృష్టించి..
దేశ రాజధాని ఢిల్లీ లేదా ఇటువంటి మెట్రో నగరాల్లో ఏదో విషయమై అప్పుడప్పుడు అల్లర్లు చోటుచేసుకుంటాయి. 2020 ఫిబ్రవరిలో ఢిల్లీలోని ఈశాన్య జిల్లా హింసాత్మకంగా మారింది. పలు ఘటనల్లో 34 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటివరకు చోటుచేసుకున్న ఐదు అతిపెద్ద అల్లర్లలో వందలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ సంఘటనలు ఏమిటో తెలుసుకుందాం. 1. సిక్కు అల్లర్లు(1984) దేశంలో చోటుచేసుకున్న అతిపెద్ద అల్లర్లలో 1984లో జరిగిన సిక్కుల అల్లర్లు ప్రధానమైనవి. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హత్య తర్వాత ఇవి చోటుచేసుకున్నాయి. ఇందిరా గాంధీని హత్య చేసింది ఆమె అంగరక్షకులే. వారు సిక్కు మతానికి చెందినవారు. అందుకే ఇందిరాగాంధీ హత్యానంతరం దేశంలోని ప్రజలు సిక్కులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో సిక్కులను ఊచకోతకు గురిచేసిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ అల్లర్లలో ఐదు వేల మంది మరణించారని చెబుతుంటారు. ఒక్క ఢిల్లీలోనే రెండు వేల మందికి పైగా చనిపోయారు. ఇందిరా గాంధీ హత్యకు కారణం 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్ సమయంలో ఆమె తీసుకున్న నిర్ణయం అని చెబుతుంటారు. నాడు స్వర్ణ దేవాలయాన్ని స్వాధీనం చేసుకోవాలని ఆమె భారత సైన్యాన్ని ఆదేశించారు. ఈ సమయంలో ఆలయంలోకి ప్రవేశించిన తిరుగుబాటుదారులు హతమయ్యారు. ఖలిస్తాన్ పేరుతో ప్రత్యేక దేశం కావాలనేది వారి డిమాండ్. ఆలయంలోకి ప్రవేశించిన జర్నైల్ సింగ్, భింద్రన్‌వాలే అతని సహచరులు ఆలయం లోపల ఉన్న సైనికులపై దాడి చేశారు. దీంతో ఇందిర ప్రభుత్వం తుపాకులతో దాడి చేయాలని సైనికులను ఆదేశించింది. ఈ ఘటనలో జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే, అతని సహచరులు మరణించారు. 2. భాగల్పూర్ అల్లర్లు(1989) 1947లో చోటుచేసుకున్న భాగల్పూర్ అల్లర్లు భారతదేశ చరిత్రలో అత్యంత క్రూరమైన అల్లర్ల జాబితాలో ఉంటాయి. ఈ అల్లర్లు 1989 అక్టోబర్‌లో భాగల్పూర్లో జరిగాయి. హిందూ- ముస్లిం వర్గాల మధ్య ఈ అల్లర్లు చోటుచేసుకున్నాయి. దీని కారణంగా 1000 మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. 3. ముంబై అల్లర్లు (1992) ఈ అల్లర్లకు ప్రధాన కారణం బాబ్రీ మసీదు కూల్చివేత. ఈ హింస డిసెంబర్ 1992లో ప్రారంభమై జనవరి 1993 వరకు కొనసాగింది. శ్రీకృష్ణ కమిషన్ నివేదిక ప్రకారం ఈ అల్లర్లలో 900 మంది చనిపోయారు. వీరిలో 575 మంది ముస్లింలు, 275 మంది హిందువులు, 45 మంది గుర్తుతెలియని వారు, మరో ఐదుగురు ఉన్నారు. సుధాకర్ నాయక్ సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అల్లర్లను నియంత్రించడంలో పూర్తిగా విఫలమయ్యిందని నిరూపితమయ్యింది. దీంతో అల్లర్లను అదుపు చేసేందుకు సైన్యాన్ని పిలవవలసి వచ్చింది. 4. గుజరాత్ అల్లర్లు(2002) గుజరాత్‌లోని గోద్రాలో జరిగిన అల్లర్లు దేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన అల్లర్లు. గోద్రా ఘటన 2002లో జరిగింది. 27 ఫిబ్రవరి 2002న రైల్వే స్టేషన్లో ఒక గుంపు సబర్మతి రైలులోని ఎస్-6 కోచ్‌కు నిప్పు పెట్టడంతో 59 మంది కరసేవకులు మరణించారు. ఫలితంగా గుజరాత్ అంతటా మతకల్లోలాలు చోటుచేసుకున్నాయి. ఈ అల్లర్లలో 790 మంది ముస్లింలు, 254 మంది హిందువులు మరణించారు. ఆ సమయంలో ప్రస్తుత దేశ ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నారు. 5. ముజఫర్‌నగర్ (2013) ఈ అల్లర్లు ముజఫర్‌నగర్ జిల్లాలోని కవాల్ గ్రామంలో జరిగాయి. దీని కారణంగా 62 మంది ప్రాణాలు కోల్పోయారు. 2013 ఆగస్టు 27న కవాల్ గ్రామంలో జాట్ సామాజికవర్గ బాలికపై ముస్లిం యువకుడు వేధింపులకు పాల్పడ్డాడు. వేధింపులకు గురైన బాలిక బంధువు.. ఆ ముస్లిం యువకుడిని హత్య చేశాడు. తరువాత దీనికి ప్రతిగా పలువురు ముస్లింలు.. ఆ బాలిక సోదరులను హత్యచేశారు. ఇది కూడా చదవండి: ఏఏ దేశాల్లో వరద ముప్పు అధికం? దీనికి ప్రధాన కారణం ఏమిటి? -
అది ప్రపంచంలోని ఏకైక 5 నదుల సంగమ ప్రాంతం.. మన దేశంలో ఎక్కడున్నదంటే..
నదులు.. ఏ దేశానికైనా జీవనాధారంగా భాసిల్లుతుంటాయి. నదులు మనిషి సమస్త అవసరాలను తీరుస్తుంటాయి. మానవ నాగరికత నదీ తీరాల్లోనే అభివృద్ధి చెందింది. నదులు తమ దారిన తాము వెళ్లిపోతూ, తమకు అడ్డుపడే వాటిని కూడా తమతోపాటు తీసువెళ్లిపోతాయని చెబుతుంటారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రెండు,లేదా మూడు నదులు కలవడాన్ని మనం చూసుంటాం. ఉదాహరణకు యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో గంగ, యమున, సరస్వతి నదులు కలవడంతో అక్కడి త్రివేణీ సంగమం ఏర్పడింది. అయితే ఇప్పుడు మనం ప్రపంచంలోనే ఐదు నదులు కలిసే ప్రాంతం గురించి తెలుసుకుందాం. ఆ ప్రాంతం మన దేశంలోనే ఉంది. ప్రపంచంలో ఎక్కడా కనిపించని కొన్ని అద్భుతాలు భారత్‌లో కనిపిస్తాయి. ఉత్తరప్రదేశ్‌లోని పచ్నద్కు సంబంధించిన అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. మహాభారత కాలంలో పాండవులు తమ ప్రయాణంలో ఈ ప్రాంతంలో బస చేశారని చెబుతారు. పాండవులలో ఒకడైన భీముడు ఈ ప్రాంతంలోనే బకాసురుడిని వధించాడని చెబుతారు. శ్రీరాముని భక్తుడైన తులసీదాసు ఈ ప్రాంతంలోనే పర్యటించాడని చెబుతారు. బుందేల్‌ఖండ్ పరిధిలోని జాలౌన్‌లో ఐదు నదులు సంగమిస్తాయి. ఈ ప్రాంతాన్నే పచ్నద్ అంటారు. ప్రకృతి సౌందర్యానికి, హిందూ ఆధ్యాత్మిక నమ్మకాలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. ఏడాదిలో ఒకసారి ఇక్కడ మేళా జరుగుతుంది. ఆ సమయంలో ఇక్కడికి లెక్కకుమించిన సంఖ్యలో భక్తులు వస్తారు. పచ్నద్ను మహాతీర్థరాజం అని కూడా అంటారు. ప్రపంచంలో ఐదు నదులు సంగమించే ప్రాంతం ఇదొక్కటే కావడం విశేషం. ఇక్కడ యమున, చంబల్, సింధు, పహుజ, కన్వరి నదులు సంగమిస్తాయి. పచ్నద్ సంగమతీరంలో బాబా సాహెబ్ మందిరం ఉంది. ఈయన గోస్వామి తులసీదాసు సమకాలికుడని చెబుతారు. ఈయన ఇక్కడే తపమాచరించి, ఒక గుహలో విలీనమైపోయారని స్థానికులు చెబుతుంటారు. ఈ పంచనదుల సంగమప్రాంతంలో బ్యారేజీ నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ బ్యారేజీ నిర్మాణం పూర్తయితే కాన్ఫూర్, దేహాత్, జాలౌన్, ఔరయ్యా ప్రాంతాల రైతులకు మేలు జరగనుంది. ఇది కూడా చదవండి: అన్ని రైళ్లకూ ‘X’ గుర్తు.. ‘వందే భారత్’కు ఎందుకు మినహాయింపు? -
ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం..
సాక్షి, న్యూఢిల్లీ: ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. ఐదు గ్రహాలు ఒకే కక్ష్యపై కనువిందు చేశాయి. బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, యురేనస్ గ్రహాలు ఒకే రేఖలో 50 డిగ్రీల పరిధిలో కనిపించాయి. ఆకాశంలో కనిపించే ఈ అరుదైన ఘటన సూర్యాస్తమయం తర్వాత కనిపించింది. సూర్యా స్తమయం తర్వాత పశ్చిమం వైపు 50 డిగ్రీల పరిధిలో ఐదు గ్రహాలు కనిపించాయి. భూమిపై నుంచి చూసేటప్పుడు.. ఐదు గ్రహాలు ఒకే రేఖపై ఆర్క్ ఆకారంలో కనిపించాయి. చదవండి: వామ్మో.. కోట్లు పలుకుతున్న లిక్కర్.. ఖాళీ బాటిల్ కూడా ఖరీదే గురూ! -
జీఎస్టీకి ఐదేళ్లు పూర్తి
న్యూఢిల్లీ: వాణిజ్య పన్నుల ఎగవేతలకు నివారించడం, దేశవ్యాప్తంగా ఒకటే పన్ను విధానం ఉండాలన్న లక్ష్యాలతో వచ్చిందే వస్తు సేవల పన్ను (జీఎస్టీ)చట్టం. దేశ చరిత్రలో అతిపెద్ద పన్ను సంస్కరణ అయిన జీఎస్టీ 2017 జూలై 1న అమల్లోకి రాగా, ఈ ఏడాది జూన్ 30తో ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ కాలంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న నూతన పన్ను వ్యవస్థ అనుకున్న లక్ష్యం దిశగా నిదానంగా అడుగులు వేస్తోంది. గతంతో పోలిస్తే పన్ను ఎగవేతలు తగ్గాయి. టెక్నాలజీ సాయంతో ఎగవేతలను గుర్తించడం యంత్రాంగానికి సాధ్యపడుతోంది. ప్రతీ నెలా పన్నుల రూపంలో వచ్చే ఆదాయం సగటున రూ.1.3 లక్షల కోట్లపైనే ఉంటోంది. 17 రకాల పన్నులు, పలు సెస్సుల స్థానంలో వచ్చిందే జీఎస్టీ. ఇందులో 5, 12, 18, 28 రేట్ల శ్లాబులు ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. వీటికి భిన్నంగా బంగారం ఒక్కదానిపై 3 శాతం రేటు అమలవుతోంది. గతంలో అయితే అన్నింటిపైనా వినియోగదారుల చెల్లించే సగటు పన్ను సుమారు 31 శాతంగా ఉండేది. లగర్జీ వస్తువులు, ఆరోగ్యానికి, పర్యావరణానికి హాని కలిగించే వాటిపై జీఎస్టీ కింద అదనంగా సెస్సు అమల్లో ఉంది. ఈ రూపంలో వచ్చిన మొత్తాన్ని ప్రత్యేకంగా పరిహార నిధి పేరుతో కేంద్రం నిర్వహిస్తోంది. జీఎస్టీ కారణంగా పన్ను ఆదాయాన్ని కోల్పోయిన రాష్ట్రాలకు ఈ సెస్సు నిధి నుంచి పరిహారాన్ని కేంద్రం చెల్లిస్తోంది. 2022 ఏప్రిల్ నెలకు వసూలైన రూ.1.68 లక్షల కోట్లు.. జీఎస్టీ చరిత్రలో గరిష్ట నెలవారీ పన్నుల ఆదాయంగా ఉంది. జీఎస్టీ కింద మొదటిసారి రూ.లక్ష కోట్ల పన్ను ఆదాయం 2018 ఏప్రిల్ నెలకు నమోదైంది. కరోనా కారణంగా 2020 ఏప్రిల్, మే నెలలకు పన్ను ఆదాయం గణనీయంగా పడిపోవడం గమనార్హం. శ్లాబుల క్రమబద్ధీకరణ మరోవైపు జీఎస్టీ శ్లాబులను క్రమబద్ధీకరించే ప్రతిపాదన కూడా ఉంది. 5 శాతం రేటును ఎత్తివేసి అందులోని వస్తు, సేవలను 8 శాతం శ్లాబులోకి తీసుకెళ్లాలన్నది ఒకటి. 12, 18 శాతం పన్ను రేట్లలో ఒకదాన్ని ఎత్తివేయడం కూడా పరిశీలనలో ఉంది. అలాగే, పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్, లిక్కర్లను కూడా జీఎస్టీ కిందకు తీసుకురావాలన్న డిమాండ్ సైతం ఉంది. కాకపోతే రాష్ట్రాలకు అధిక ఆదాయం వీటి రూపంలో వస్తున్నందున ఈ ప్రతిపాదనకు అవి సుముఖంగా లేవు. జీఎస్టీ వ్యవస్థ అమలును చూడడం, పన్ను రేట్ల సమీక్ష, ఇతర అంశాలను జీఎస్టీ కౌన్సిల్ చూస్తుంటుంది. ఇప్పటి వరకు జీఎస్టీ కౌన్సిల్ 47 విడతలుగా భేటీ అయింది. ఎన్నో ఉత్పత్తులు ఇప్పటి వరకు రేట్ల సవరణకు గురయ్యాయి. టెక్నాలజీతో లీకులకు చెక్ జీఎస్టీ యంత్రాగానికి కావాల్సిన సాంకేతిక సహకారాన్ని జీఎస్టీ నెట్వర్క్ అందిస్తోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్, తదితర ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో డేటాను విశ్లేషించడం ద్వారా, ఎగవేతలు, లీకేజీలకు అడ్డుకట్ట వేస్తోంది. మరింత సులభంగా ఉండాలి.. ఈ ఐదేళ్లలో జీఎస్టీ చట్టం కొంత పురోగతి సాధించినప్పటికీ.. పన్ను అంశాల పరంగా మరింత సరళంగా మారాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) అన్నది మొత్తం సరఫరా చైన్‌లో ఎటువంటి నష్టాల్లేకుండా, సాఫీగా సాగేందుకు జీఎస్టీ నిర్మాణం మరింత సరళంగా మారాలన్నది పన్ను నిపుణుల నుంచి వినిపిస్తున్న మాట. ‘‘గత ఐదేళ్లలో పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు సకాలంలో వివరణలు, సవరణల చేయడం ద్వారా జీఎస్టీ చట్టం అభివృద్ధి చెందింది. అయినప్పటికీ అవాంఛనీయ షోకాజు నోటీసులను నివారించే దిశగా జీఎస్టీ కౌన్సిల్, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. బలమైన, టెక్నాలజీతో కూడిన ఏకీకృత అసెస్మెంట్ కార్యక్రమం ఉండాలి’’అని బీడీవో ఇండియా పార్టనర్ జీ ప్రభాకరన్ పేర్కొన్నారు. ‘‘వివాదాలను తగ్గించాల్సి ఉంది. ఇందుకు అస్పష్టమైన నిబంధనలను మార్చాలి. బీపీవో/కేపీవో ఇంటర్మీడియరీకి అర్హత సాధిస్తాయా, భవనాలకు సంబంధించి చేసే మూలధన నిధులపై పన్ను జమ, ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ పై జీఎస్టీ లెవీ ఇలా వివిధ రంగాలకు సంబంధించిన అంశాలను పరిష్కరించాలని వ్యాపారులు కోరుకుంటున్నారు’’అని ఏఎంఆర్‌జీ అండ్ అసోసియేట్స్ సీనియర్ పార్ట్నర్ రజత్ మోహన్ తెలిపారు. అలాగే, పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ లను కూడా జీఎస్టీ కిందకు తీసుకొస్తే కంపెనీలకు వ్యయాలు తగ్గుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
ఐదేళ్లలో 5 ట్రిలియన్ డాలర్లకు
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ 2026–2027 నాటికి 5 ట్రిలియన్ డాలర్లకు (రూ.385 లక్షల కోట్లు) వృద్ధి చెందుతుందని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ చెప్పారు. ఆ తర్వాత 2033-34 నాటికి 10 ట్రిలియన్ డాలర్లకు విస్తరిస్తుందన్నారు. యూఎన్డీపీ ఇండియా నిర్వహించిన కార్యక్రమంలో నాగేశ్వరన్ మాట్లాడారు. ఇతర వర్ధమాన దేశాలతో పోలిస్తే భారత్ మెరుగైన స్థితిలో ఉన్నట్టు చెప్పారు. ఈ దృష్యా వృద్ధి అవకాశాలు ఎంతో ఆశావహంగా, ప్రతిష్టాత్మకంగా ఉన్నాయని చెప్పారు. ‘‘ఇప్పుడు భారత్ ఆర్థిక వ్యవస్థ 3.3 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. కనుక లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమేమీ కాదు. డాలర్ మారకంలో జీడీపీ 10 శాతం వృద్ధి సాధించినా 2033–34 నాటికి 10 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవచ్చు’’అని నాగేశ్వరన్ వివరించారు. వాస్తవానికి 2024-25 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి ఆర్థిక వ్యవస్థను తీసుకెళ్లాలన్నది మోదీ సర్కారు లక్ష్యం. -
Chittoor: అధికారి ఒకరే.. పోస్టులు ఐదు
చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలో ముఖ్యమైన 5 పోస్టులకు ఒకరే అధికారిగా ఉండడం విశేషం. ఈ ఏడాది జూన్ 30న రెగులర్ డీఈవోగా పనిచేసిన నరసింహారెడ్డి ఉద్యోగ విరమణ పొందారు. ఆ తర్వాత ఏడీ–1 గా ఉన్న శ్రీరాం పురుషోత్తంకు డీఈవోగా అదనపు బాధ్యతలు ఇచ్చారు. అనంతరం చిత్తూరు డీవైఈవోగా మరో బాధ్యతలు చేపట్టారు. తాజాగా కార్వేటినగరం డైట్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్‌గానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటివరకు డైట్ కళాశాల ప్రిన్సిపల్‌గా ఉండే శేఖర్ పుత్తూరు డీవైఈవోగా అదనపు బాధ్యతలు నిర్వహించేవారు. ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న పురుషోత్తం కూడా పుత్తూరు డీవైఈవోగా కూడా వ్యవహరించాల్సి ఉంది. దీంతో మొత్తం ఒక అధికారి 5 పోస్టుల్లో పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చదవండి: శింగనమల ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం -
జల్సాల కోసం చోరీ
సాక్షి, ఆళ్లగడ్డ: వారంతా యువకులు.. కష్టపడకుండా డబ్బు సంపాదించి జల్సాలు చేయాలనుకున్నారు. పథకం ప్రకారం చోరీ చేసి తప్పించుకున్నామని భావించారు. అయితే 24 గంటలు గడవకుండానే పోలీసులు వారిని పట్టుకుని కటకటాలకు పంపించారు. ఆళ్లగడ్డ నగర పంచాయతీ పరిధిలోని ఏవీ గోడౌన్ సమీపంలో శనివారం ఐదుగురు నిందితులను సీఐ రమణ ఆధ్వర్యంలో పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి మూడు సెల్ ఫోన్లు, రూ 5500 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను టౌన్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ పోతురాజు ఆదివారం సాయంత్రం విలేకరులకు వెల్లడించారు. కోవెలకుంట్ల మండలం కంపమళ్లకు చెందిన సూర విష్ణువర్ధన్‌రెడ్డి, దొర్ని పాడు మండలం డబ్ల్యూ కొత్తపల్లికి చెందిన మహేశ్వర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి గత నెల 29వ తేదీ సాహు సినిమా చూడటానికి ఆళ్లగడ్డకు వచ్చారు. నైట్ షో తర్వాత గ్రామానికి వెళ్లేందుకు ఆటోను బాడుగకు మాట్లాడుకుని అందులో ఎక్కారు. అయితే వీరి వద్ద పెద్దమొత్తంలో డబ్బులున్నట్లు భావించిన ఆటో డ్రైవర్ జెట్టి లక్ష్మణ్ తన మిత్రులు నీలిశెట్టి భూపతి శివ, దొమ్మరి దామోదర్, భూపతి సురేష్‌బాబుకు ఫోన్ చేసి రప్పించాడు. ఆటో చింతకుంట శివారు హెచ్‌పీ పెట్రోల్ బంకు సమీపానికి వెళ్లే సరికి వారంతా బైకులపై వచ్చి చుట్టుముట్టారు. ఆటోలో ఉన్న సూర విష్ణువర్ధన్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డిని కిందకు దింపి దగ్గరున్న సొమ్ములు ఇవ్వాలని బెదిరించారు. డబ్బులు లేవని చెప్పడంతో విపరీతంగా కొట్టి మూడు సెల్ఫోన్లు, రూ.5,500 నగదు లాక్కొని వెళ్లి పోయారు. బాధితులు శుక్రవారం పోలీస్ స్టేషన్ చేరుకుని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన అనంతరం సీఐ రమణ ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. 24 గంటలు గడవకుండానే నిందితులను అరెస్టు చేశారు. నిందితులను కోర్టులో హాజరు పరచగా జడ్జి రిమాండ్‌కు ఆదేశించినట్లు డీఎస్పీ పోతురాజు తెలిపారు. -
సచిన్ ప్రపంచకప్ జట్టులో ఐదుగురు భారత ఆటగాళ్లు
న్యూఢిల్లీ: బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన ప్రపంచ కప్ ఆల్ స్టార్స్ ఎలెవెన్ జట్టును ప్రకటించాడు. ఈ జాబితాలో ఐదుగురు టీమిండియా సభ్యులకు చోటు దక్కింది. అయితే, వికెట్ కీపర్‌గా భారత వెటరన్ మహేంద్ర సింగ్ ధోనికి బదులుగా ఇంగ్లండ్ ఆటగాడు జానీ బెయిర్‌స్టోను సచిన్ ఎంచుకున్నాడు. టీమిండియా సారథి విరాట్ కోహ్లి సహా మెగా టోర్నీ టాప్ స్కోరర్ రోహిత్ శర్మ, పేసర్ బుమ్రా, ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలకు అతడు స్థానం కల్పించాడు. న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ ఈ జట్టుకు సారథిగా ఉన్నాడు. సచిన్ వరల్డ్ కప్ జట్టు సభ్యులు: రోహిత్ శర్మ, బెయిర్‌స్టో (వికెట్ కీపర్), కేన్ విలియమ్సన్ (కెప్టెన్), కోహ్లి, షకీబ్ అల్ హసన్, బెన్ స్టోక్స్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మిచెల్ స్టార్క్, జస్ప్రీత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్. -
వీరేంద్ర హత్య కేసులో ఐదుగురి అరెస్టు
మరోకరి కోసం గాలింపు కాకినాడ రూరల్ : ఇంద్రపాలెం శ్రీనివాసనగర్‌కు చెందిన దొమ్మ వీరేంద్రకు హత్య కేసులో శుక్రవారం పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. డీఎస్పీ వెంకటేశ్వరరావు, రూరల్ సీఐ వి.పవన్‌కిశోర్, ఎస్సై డి.రామారావు వివరాలను వెల్లడించారు. ఇంద్రపాలెం గొల్లపేటకు చెందిన భీమాల రమణ (సున్నంబట్టి రమణ) అదేగ్రామం శ్రీనివాసనగర్‌లో నివాసముంటున్న ముద్దాడ లక్ష్మితో వివాహేతర సంబంధం పెట్టుకొని సహజీవనం చేస్తున్నాడు. అయితే ఇంద్రపాలెం అర్జున్‌నగర్‌కు చెందిన మాంసం వ్యాపారి దొమ్మ వీరేంద్ర కొంత కాలంగా తన కోర్కె తీర్చాలని, లేదంటే యాసిడ్ పోస్తానని లక్ష్మిని బెదిరించసాగాడు. రమణ లేని సమయంలో లక్ష్మి ఇంటికి వెళ్లి ఆమె తమ్ముళ్లను కొట్టి వేధిస్తుండేవాడు. దీంతో వీరేంద్రను హతమార్చాలని భావించి లక్ష్మి రమణకు, అతని స్నేహితులు చీడిగకు చెందిన అనసూరి బాబూప్రసాద్, కాకినాడ పాత బస్‌స్టాండ్ వెంకటేశ్వరకాలనీకి చెందిన దంగేటి జగదీష్‌కు విషయాన్ని చెప్పింది. అదును కోసం ఎదురు చూస్తున్న రమణ తన స్నేహితులతో తీసుకున్న గ్రూప్ఫోటోను ఫేస్బుక్లో అప్లోడ్ చేయగా, అది చూసిన వీరేంద్ర మేనల్లుడు ఆరి సింహాచలం ఛీ అని కామెంట్ పెట్టాడు. దీన్ని సాకుగా తీసుకుని సింహాచలం నుంచి ఫోన్ లాక్కొని రమణ స్నేహితులు వెళ్లిపోయారు. మేనల్లుడు ఫోన్ కోసం వెళ్లిన వీరేంద్రను రమణ, అతని స్నేహితులు అనసూరి బాబూప్రసాద్, దంగేటి జగదీష్, ముద్దాడ లక్ష్మి, ఆమె తమ్ముళ్లు పితాని ఎర్రయ్య, బుల్లియ్య గొడ్డలి, కత్తి, క్రికెట్ స్టంపులతో దాడి చేసి చంపి పారిపోయారని సీఐ పవన్‌కిశోర్ వివరించారు. శుక్రవారం తెల్లవారుజామున బెయిల్ కోసం లాయర్‌ను కలిసేందుకు సొమ్ములు సిద్ధం చేసుకోవడానికి సమావేశమైనట్లు తమకు వచ్చిన సమాచారం దాడి చేసి పట్టుకున్నట్లు తెలిపారు. ముద్దాయిల్లో ఒకడైన ముద్దాడ లక్ష్మి చినతమ్ముడు బుల్లియ్య పరారయ్యాడని సీఐ పవన్‌కిశోర్ తెలిపారు. అనంతరం వారి నుంచి వీరేంద్రను చంపడానికి ఉపయోగించిన గొడ్డలి, కత్తి, క్రికెట్ స్టంపులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరి ఐదుగురిపై కేసులు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నట్లు ఇంద్రపాలెం ఎస్సై డి.రామారావు వివరించారు. ముద్దాయిలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసు సిబ్బందిని డిఎస్పీ వెంకటేశ్వరరావు, సిఐ పవన్కిశోర్లు అభినందించారు. -
ప్రాణాలు తీస్తున్న వడగాల్పులు
మొగల్తూరు: వడగాలులు మృత్యు ఘంటికలు మోగిస్తూనే ఉన్నాయి. వడదెబ్బతో సోమవారం జిల్లాలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. మొగల్తూరు మండలంలోని ముత్యాలపల్లికి చెందిన కొల్లాటి అప్పులు (59) అనే వృద్ధుడు మధ్యాహ్న సమయంలో మొగల్తూరు వచ్చి తిరిగి నడుచుకుంటూ గ్రామానికి వెళుతుండగా స్పృహ తప్పి పడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి కుమారుడు, ముగ్గురు కుమార్తెలు. పేరుపాలెం నార్త్ పంచాయతీ ఏటిమొండికి చెందిన తిరుమాని వెంకట్రాజు (73) అనే వృద్ధుడు పొలానికి వెళ్లి వడగాల్పులకు సొమ్మసిల్లి పడిపోయాడు. స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతునికి భార్య, నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఉంగుటూరులో పారిశుద్ధ్య కార్మికుడు ఉంగుటూరు: ఉంగుటూరులో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడు వెలగాడి శ్రీనివాసరావు (45) వడదెబ్బతో మృతి చెందాడు. ఉదయం బయటకు వెళ్లిన శ్రీనివాసరావు గ్రామంలోని సెంటర్లో కుప్పకూలిపోయాడు. స ర్పంచ్ గంటా శ్రీలక్ష్మి, కార్యదర్శి పి.సురేష్ కుమార్, వా ర్డు సభ్యులు ఇక్కడకు చేరుకుని మట్టి ఖర్చుల నిమిత్తం శ్రీనివాసరావు కుటుంబానికి రూ.3 వేలు అందజేశారు. వడదెబ్బకు శ్రీనివాసరావు మృతిచెందినట్టు పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. మృతునికి భార్య మంగ, నలుగురు కుమార్తెలు ఉన్నారు. కొవ్వూరులో రిక్షా కార్మికుడు కొవ్వూరు రూరల్: వడదెబ్బతో కొవ్వూరు పట్టణంలోని బ్రిడ్జిపేటకు చెందిన రిక్షా కార్మికుడు మొయ్యే పైడియ్య (70) అనే వృద్ధుడు మృతి చెందినట్టు బంధువులు తెలిపారు. ఎండ తీవ్రతతో వారం రోజులుగా అస్వస్థతకు గురైన పైడియ్య సోమవారం మృతి చెందాడన్నారు. కుముదవల్లిలో.. పాలకోడేరు: పాలకోడేరు మండలం కుముదవల్లికి చెం దిన పస్తుల వెంకటేశ్వరరావు (47) వడగాల్పులకు మృ తి చెందాడు. నాలుగు రోజుల నుంచి వీస్తున్న వడగా లులకు తట్టుకోలేక సోమవారం ఇంట్లోనే మృతి చెం దినట్టు కుటుంబసభ్యులు చెప్పారు. వెంకటేశ్వరరావు దర్జీ వృత్తి చేస్తూ కొంతకాలంగా ఖాళీగా ఉంటున్నాడు. భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
గుప్త నిధుల తవ్వకం అనుమానంతో అరెస్ట్
సంబేపల్లె: గుప్త నిధులను తవ్వకం చేస్తున్నారనే అనుమానంతో ఐదుగురు వ్యక్తులతో పాటు కారును సంబేపల్లె ఎస్ఐ సయ్యద్ హాసం బుధవారం రాత్రి అదుపులోకి తీసుకొన్నారు. ఆయన కథనం మేరకు.. మండల పరిధిలోని దుద్యాల చెక్‌పోస్టు వద్ద పోలీసులు గస్తీ వెళుతుండగా రోడ్డుపక్కన నిలిపి ఉన్న కారులోని వ్యక్తులు పోలీసులను చూసి పరుగులు పెట్టారు. పోలీసులు వారిని వెంబడించి పట్టుకొన్నారు. కర్నాటకకు చెందిన మునిరాజు, చంద్రశేఖర్, విశ్వనాథ్, కరీముల్లా, నాగరాజులను పట్టుకొని విచారించగా గుప్తనిధులకోసం ఈ ప్రాంతంలో తిరుగుతున్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసుకొని వారిని కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కారు నుజ్జు నుజ్జైనా కాని చిన్నారి బతికింది..
-
ఉత్తమ ఉపాధ్యాయులుగా ఐదుగురు
జిల్లా టీచర్లకు రాష్ట్ర స్థాయి గౌరవం 8న సీఎం చేతుల మీదుగా సత్కారం విద్యారణ్యపురి : మాతృ దేవో¿¶ వ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ అంటారు పెద్దలు. తల్లిదండ్రుల తర్వాత స్థానంలో నిలుస్తూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులను గౌరవించుకోవడం మన సంప్రదాయం. ఈ మేరకు ఏటా సెప్టెంబర్ 5న రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రప్రభుత్వం ఏటా కొందరిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసి సన్మాసిస్తుంది. ఈ మేరకు ఈసారి రాష్ట్రంలో 31మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేయగా ఇందులో జిల్లా నుంచి ఐదుగురికి స్థానం దక్కింది. ఈ జాబితాను ఆదివారం విడుదల చేయగా.. ఈనెల 8న హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో సీఎం కేసీఆర్ ఉత్తమ ఉపాధ్యాయులకు రూ.10వేల నగదు అందజేయడంతో పాటు సన్మానించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా నుంచి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారు, విద్యార్థులను తీర్చిదిద్దడం, పాఠశాలలను అభివృద్ధి చేయడంతో వారి పాత్రపై ప్రత్యేక కథనం. గురునాథరావు.. సైన్స్ కార్యక్రమాలపై ప్రోత్సాహం మహబూబాబాద్ మండలం కంబాలపల్లి జిల్లాపరిషత్ హైస్కూల్లో భౌతిక రసాయశాస్త్ర ఉపాధ్యాయుడు గురునాథరావుకు నేషనల్ ఫౌండేషన్ రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. మహబూబాబాద్‌కు చెందిన గురునాథరావు డోర్నకల్ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా నియామకమై 2002లో స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందారు. విద్యార్థులను సైన్స్ ప్రయోగాల దిశగా ప్రోత్సహించే ఆయన జాతీయ బాలల సైన్స్‌కాంగ్రెస్‌లో జిల్లా, రాష్ట్రస్థాయిలో రిసోర్స్ పర్సన్‌గా, అకడమిక్ కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. 2007లో కురవి మండలం నేరడ పాఠశాలలో విద్యార్థులతో ఆయన జిల్లా సైన్స్ ప్రదర్శనకు 14 ప్రాజెక్టులు తయారుచేయించారు. ఇప్పటివరకు 60 జాతీయ అంతార్జాతీయ సదస్సుల్లో వివిధ అంశాలపై పరిశోధన పత్రాలు సమర్పించారు. గురునాథరావు రాసిన పలు పరిశోధనాపత్రాలనుపలు విద్యాSసంస్థల గ్రంథాలయాల్లో రెఫరెన్స్‌గా వినియోగించుకుంటున్నారు. కలకత్తాలో జరిగిన 100వ భారత సైన్స్ కాంగ్రెస్‌లో పాల్గొని దివంగత రాష్ట్ర పతి అబ్బుల్‌కలాం చేతుల మీదుగా అవార్డు స్వీకిరంచిన ఆయన ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిక్స్ టీచర్స్‌లో జీవిత కాలసభ్యుడిగా ఉన్నారు. ది ఇండియన్ సైన్స్కాంగ్రెస్అసోసియేషన్లో జీవిత కాలసభ్యుడిగాఉన్నారు.గురునాధరావు తన ఉపాధ్యాయుడుగా తన విధులను నిర్వర్తిస్తూనే ఆరేళ్ల క్రితం దిశ సామాజిక సేవాసంస్థలను స్థాపించారు. 2008లో జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు, ఎల్ఐసీ ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు, 2007 –2008లో నేషనల్ గ్రీన్‌కోర్ ఉత్తమ మాస్టర్ ట్రైనర్ అవార్డులను గురునాథరావు అందుకున్నారు. అన్వర్.. హిందీ ప్రత్యేక బోధన హన్మకొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎం.డీ.అన్వర్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. 1993లో వరంగల్‌లోని శివనగర్ ప్రభుత్వ హైస్కూల్లో ఆయన నియామకమయ్యారు. విద్యార్థులకు విద్యాబోధనతోపాటు పేద వర్గాల పిల్లలకు ఉచితంగా నోట్‌బుక్స్‌ను కూడా అందజేస్తున్నారు. జిల్లా రిసోర్స్‌పర్సన్‌గా ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పదో తరగతి పిల్లలకు ప్రత్యేకంగా ఏర్పాటుచేసే క్యాంపుల్లో హిందీ సబ్జెక్టు బోధిస్తున్నారు. సబ్జెక్టు నిపుణులుగా కూడా వ్యవహరిస్తున్న అన్వర్.. హన్మకొండలోని ప్రభుత్వ బీఈడీ కాలేజీలో కూడాడిప్యూటేషన్పై సైకాలజీ అధ్యాపకుడిగా బోధించారు. రిసోర్స్ పర్సన్‌గా జవహార్ నవోదయ విద్యాయానికి వ్యవహరించిన ఆయన బోధన సామగ్రి రూపొందించారు. పలు వర్క్‌షాపుల్లో వివిధ తరగతుల హిందీ సబ్జెక్టుల ప్రశ్నాపత్రాలు కూడా తయారుచేయటంలో కీలకంగా పనిచేసిన ఆయన విద్యాపరంగా అత్యుత్తమ సేవలందించినందుకు 2010లో జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, 2015లో సంవత్సరంలో రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ సన్మానం అందుకున్నారు. చలపతి.. బడిని బతికించారు స్టేషన్ ఘన్పూర్ నియోజకవరగలోని చిన్నపెండ్యాల ఎస్సీ, బీసీ కాలనీ ప్రాథమిక పాఠశాల ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా సీహెచ్.చలపతి విధులు నిర్వర్తిస్తున్నారు. రేగొండ మండ లం తిరుమలగిరికి చెందిన చలపతి 1983లో ఉపాధ్యాయుడిగా ఆయన నియామకమయ్యారు. చిన్నపెండ్యాల పాఠశాలలో తొలుత 36మంది విద్యార్థులు ఉండగా చలపతి బాధ్యతలు స్వీకరించాక ఆయన కృషితో ఇప్పుడు ఆ సంఖ్య 350కి చేరింది. అంతేకాకుండా పాఠశాలను వంద శాతం పరిశుభ్రం, పచ్చదనంగా మార్చగా పర్యావరణ మిత్రలో రాష్ట్రస్థాయి అవార్డును 2014లో అందుకున్నారు. దాతల సహకారంతో పాఠశాలలో వాటర్ ట్యాంక్ నిర్మాణంతో పాటు కాకతీయుల కళాతోరణం ఆర్చీ నిర్మించారు. కాగా, చలపతి 2012లో జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, 2013–2014లో రాష్ట్ర స్థాయిలో రాజీవ్ విద్యామిషన్ అవార్డులు స్వీకరించారు. రమాకుమారి.. ఉపాధ్యాయులకే శిక్షణ వర్ధన్నపేటమ మండలం ఉప్పరపెల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పీజీ హెచ్ఎంగా పనిచేస్తున్న దేవరాజు రమాకుమారి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. హన్మకొండకు చెందిన రమాకుమారి 1984లో ఉపాధ్యాయురాలిగా నియామకమైన ఆమె తన 32ఏళ్ల సర్వీస్‌లో ఎక్కడ పనిచేసినా విద్యార్థుల డ్రాపౌట్స్ లేకుండా కృషి చేశారు. ఇంకా జాతీయ స్థాయిలో విద్యార్థులను వాలీబాల్, హాకీపోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నారు. తల్లిదండ్రులతో సమావేశాలను ఏర్పాటుచేసి పాఠశాలల అభివృద్ధికి పాటుపడుతున్నారు. స్వఛ్చభారత్ కార్యక్రమాలు అమలుచేయటం, పాఠశాలలకు దాతల చేయూతతో ఆటవస్తువులు, వాటర్ ఫ్యూరిఫయర్లు ఏర్పాటుచేయించారు. రాష్ట్రస్థాయిలో ఎస్ఈఆర్టీ, ఆర్వీఎం, ఆర్‌ఎంఎస్‌ఏ, మన టీవి టెలీ న్యూస్ ప్రోగ్రామ్స్‌ల్లో పాల్గొని ఎస్సెస్సీ స్టడీమెటీరియల్‌ను రూపొందించి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. 2012లో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డుతో పలు సంస్థల నుంచి ఇప్పటివరకు రమాకుమారి అవార్డులు స్వీకరించారు. నరేందర్.. ఉపాధ్యాయుడు, కవి జఫర్‌గఢ్ మండలం తీగారం యూపీఎస్‌లో ఎస్జీటీగా పనిచేస్తున్న రాచమల్ల నరేందర్‌కు నేషనల్ ఫౌండేషన్ టీచర్స్ వెల్ఫేర్ విభాగంలో రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. ఏ తరగతి గదిలో అభివృద్ధి చెందాల్సిన సామర్థ్యాలు అదే తరగతిలో విద్యార్థులకు వచ్చేలా బోధిస్తున్నారు. ఇంకా సహా పాఠ్య కార్యక్రమాల కూడా సమర్దవంతంగా నిర్వర్తిస్తూ విద్యార్థుల సమగ్ర మూర్తిమత్వానికి దోహదపడుతున్నారు. 1997సంవత్సరంలో జఫర్‌గఢ్ మండలం సూరారం పాఠశాలలో ఎస్జీటీగా నియమితులైన నరేందర్ అదే మండలంలో పదిహేడేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. గుణాత్మక విద్యలో భాగంగా తరచూ ప్రాజెక్టుమేళా, కృత్యమేళా నిర్వహించే ఆయన సైన్స్ఫేర్లు, ఇన్స్ఫైర ్లలొ పాల్గొనేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. ఈ విద్యాసంవత్సరంలో బడిబాటలో భాగంగా విద్యార్థులను చేర్పించేందుకు విశేష కృషి చేశారు. ఉపాధ్యాయుడిగా తన విధులు నిర్వర్తించే నరేందర్.. కవిగా కూడా తన ప్రతిభ చాటుతున్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాకవి కాళోజీ నారాయణ శతజయంతి ఉత్సవాల సందర్బంగా నిర్వహించిన కవి సమ్మేళనంలో పాల్గొని ఉత్తమ కవిగా సన్మానం అందుకున్న నరేందర్.. హైదరాబాద్‌లోని చెలిమి సాంస్కృతిక సమితి నుంచి గురజాడ అప్పారావు పురస్కారం అందుకోగా, 2010లో జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు స్వీకరించారు. -
పాకిస్తాన్లో ఉగ్రదాడి, ఐదుగురు మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని పెషావర్‌లో ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ఆఫ్గనిస్తాన్, పాక్ సరిహద్దు ప్రాంతమైన క్రిస్టియన్ కాలనీ సమీపంలో శుక్రవారం ఉదయం కాల్పులకు తెగబడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనలో ఓ పౌరుడు మృతి చెందగా మరికొందరు గాయపడినట్లు సమాచారం. దాడికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఆ ప్రాంతంలో మరికొందరు ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఉగ్రదాడి జరిగిన ప్రాంతంలో భద్రతా బలగాలు ముమ్మర గాలింపు చేపడుతున్నాయి. దాడికి పాల్పడిన ఉగ్రవాదులు సూసైడ్ జాకెట్స్ ధరించారని మీడియా సంస్థ డాన్ వెల్లడించింది. -
ఎవరా...ఐదుగురు
జిల్లాకు చుట్టిన ఎంసెట్–2 ఉచ్చు ఖమ్మంలో మెరిట్ ర్యాంకర్ల వివరాలు సేకరించిన సీఐడీ విద్యార్థుల తల్లిదండ్రుల విచారణ..నేడో, రేపో అరెస్ట్‌లకు సిద్ధం ఖమ్మం : సంచలనం సృష్టించిన ఎంసెట్–2 లీకేజీ వ్యవహారం జిల్లాను తాకింది. రాష్ట్రవ్యాప్తంగా 72 మంది విద్యార్థులకు పరీక్షకు ముందుగానే ప్రశ్నపత్రాలు అందాయన్న అభియోగంలో జిల్లాకు చెందిన ఐదుగురు ఉన్నారని ‘సీఐడీ’ తేల్చినట్లు సమాచారం. నగరంలోని మోతీనగర్‌లో నివాసముంటున్న మార్కెట్ వ్యాపారి కుమారుడితోపాటు, నగరానికి సమీపంలో ఉన్న గ్రామానికి(ఖమ్మంరూరల్ మండలం) చెందిన విద్యార్థి, కొణిజర్ల మండలానికి చెందిన మరో విద్యార్థికి సంబంధించిన వివరాలతోపాటు ఇంటర్మీడియట్ ప్రథమసంవత్సరం, ద్వితీయ సంవత్సరంలో సాధించిన మార్కులు, ఏపీ ఎంసెట్‌లో విద్యార్థి ర్యాంకు మొదలైన విషయాలను సేకరించినట్లు తెలిసింది. ఖమ్మం నగరానికి చెందిన మరో ఇద్దరికి సంబంధించిన వివరాలను కూడా సీఐడీ అధికారులు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. తల్లిదండ్రుల మొబైల్ డేటా ఆధారంగా ఎంసెట్–2కు ముందు 20 రోజుల నుంచి పరీక్ష జరిగిన నాటి వరకు ఇన్కమింగ్, ఔట్‌గోయింగ్ కాల్స్, టెలిఫోన్ సంభాషణను సీఐడీ అధికారులు తీసుకున్నట్లు సమాచారం. అదేవిధంగా వారి బ్యాంక్ అకౌంట్ నుంచి ఎప్పుడు.. ఎన్ని డబ్బులు డ్రా చేశారు. ఆన్లైన్ అకౌంట్ నుంచి ఏఏ అకౌంట్లకు డబ్బులు పంపించారనే విషయం అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. వీటి ఆధారంగా జిల్లాకు చెందిన ఐదుగురు విద్యార్థులకు ఎంసెట్–2 ప్రశ్నపత్రాలు ముందుగానే వచ్చాయని నిర్ధారించినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే మెరిట్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను హైదరాబాద్‌కు పిలిపించుకొని విచారించినట్లు సమాచారం. ఎక్కడ చదువుకున్నారు..? ఎంసెట్ కోచింగ్ ఎక్కడ తీసుకున్నారు..? పరీక్ష కేంద్రాలు ఎక్కడ.. పరీక్ష ఎలా రాశారని.. కోచింగ్ సెంటర్లలో నిర్వహించిన పరీక్షల్లో ఎన్ని మార్కులు వచ్చాయి.. అనే విషయాలను విద్యార్థులను అడిగినట్లు తెలిసింది. తల్లిదండ్రుల విచారణలో వారి వృత్తి, ఆర్థిక పరిస్థితులు, పిల్లలను డాక్టర్లుగా చూడాలనే కోరిక మొదలైన అంశాలపై ప్రశ్నలు వేసి సమాధానాలు తెలుసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని మరికొన్ని కోణాల్లో పరిశీలించి పూర్తిస్థాయిలో సమాచారం సేకరించి అరెస్ట్ చేసేందుకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఏ నిమిషంలోనైనా అరెస్ట్‌లు.. ఎంసెట్–2 లీకేజీకి లక్షల రూపాయల ముడుపులు చెల్లించి.. పరీక్షకు ముందే ప్రశ్నపత్రాలను సేకరించడం, బెంగుళూరు, ముంబై వంటి నగరాలకు వెళ్లి ప్రిపేర్ అయ్యి నేరుగా కేంద్రాలకు వచ్చి పరీక్ష రాసి.. 1000 లోపు ర్యాంకు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులను ఏ నిమిషంలోనైనా అరెస్ట్‌చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. దీంతో సీఐడీ అధికారులకు ఏ విధమైన సమాచారం అందింది.. ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు. వారి అరెస్ట్‌తో జిల్లాకు చెందిన మరికొందరి పేర్లు బయట పడతాయా..? ఎప్పుడు ఎవరికి ఏ ఉచ్చు బిగుస్తుందోననే ఉత్కంఠ నెలకొంది. -
కోడి పందాలు కాస్తున్న ఐదుగురి అరెస్ట్
హయత్‌నగర్: పందాల రాయుళ్లపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. హయత్‌నగర్ పరిధిలోని కోహెడ సర్వీసు రోడ్డు సమీపంలో కోడి పందేలు కాస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.29 వేల నగదు, రెండు కోళ్లు, రెండు కత్తులు, 6 సెల్ఫోన్లు, ఓ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఐదేళ్ళ బాలికే ఆధారం!
'కుంచమంత కూతురుంటే మంచం మీదే కూడు' అన్న సామెత ఆ బాలిక విషయంలో సరిగ్గా సరిపోతుంది. అంధుడైన తన తండ్రి.. కొబ్బరి తోటల్లో పనికి వెళ్ళేందుకు ప్రతిరోజూ దారి చూపించే ఆ చిన్నారి.. ఎందరికో స్ఫూర్తిదాయకమౌతోంది. ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన మూడు నిమిషాల నిడివి ఉన్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఫిలిప్పీన్స్ కు చెందిన ఐదేళ్ళ బాలిక జెన్నీ, కాలికి చెప్పుల్లేకుండా తన అంధ తండ్రి పెపె నెల్సన్ కు పనిలో సహాయపడటం ఇప్పుడు ఫేస్ బుక్ లో లక్షలమందిని ఆకట్టుకుంటోంది. ఆ చిన్న ప్రాణానికి తండ్రిపై ఉన్న ప్రేమను, బాధ్యతను తెలియజేస్తోంది. కొబ్బరి తోటల్లో తండ్రి పనికి సాయ పడటమే కాదు... ఆప్యాయంగా ఆహారం తినిపించడం, నీళ్ళు అందించడం ప్రతి మనసునూ కదిలింపజేస్తోంది. కూతురి సహకారంతో నెల్సన్ ప్రతిరోజూ సుమారు 60 కొబ్బరి చెట్లు ఎక్కగల్గుతున్నాడు. అందుకుగాను అతడికి అందే 6 డాలర్ల వేతనం.. ఇప్పుడా కుటుంబానికి తిండికి లోటు లేకుండా చేస్తోంది. ప్రతి గుండెనూ కదిలిస్తున్న ఆ వీడియోను ఫేస్ బుక్ లోని తన పేజీలో రూబీ కెప్యూన్స్ పబ్బిలాన్.. జూన్ 10వ తేదీన పోస్ట్ చేసింది. అప్పట్నుంచీ లక్షలమంది తిలకించడమే కాదు.. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ మీడియాల్లో కథనంగా మారింది. మనసును కదిలించే వీడియోను తిలకించిన ఎంతోమంది వినియోగదారులు సహాయక సంస్థల ద్వారా వారికి తగిన సహకారం అందించే ప్రయత్నాలు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఏబీఎస్ సీబీఎన్ ఫౌండేషన్ ఆ తండ్రీ కూతుళ్ళను కలిసింది. రెటినల్ డిటాచ్ మెంట్, రెటినిటిస్ పిగ్మెంటోసా తో బాధపడుతున్న నెల్సన్ కు తగిన ట్రైనింగ్ ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. త్వరలో నెల్సన్, జెన్నీలు మంచి వాతావరణంలో స్థిరపడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
ఒక్క నిమిషం కూడా ఆలస్యం కాలేదు!
కొందరు పిల్లలు స్కూలుకు వెళ్లేందుకు మారాం చేస్తారు. మరికొందరు ఆటలు పోతాయన్న బాధతో, చదువంటే భయంతో ఏడుస్తారు. కొందరు మాత్రం స్కూలంటే ఎంతో ఉత్సాహంగా ఉరకలేస్తారు. ఇప్పుడు దుబాయ్‌లోని ఢిల్లీ ప్రైవేట్ స్కూల్లో చదువుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న విద్యార్థి.. ఆ మూడో కోవకు చెందినవాడే. ఐదేళ్ళపాటు ఒక్కరోజు కూడా స్కూలుకు ఆలస్యంగా వెళ్లకపోగా.. ఏరోజూ స్కూలు మానకుండా నూరు శాతం హాజరుతో ఏకంగా ఐదు మెడల్స్ సంపాదించి అందర్నీ అబ్బురపరిచాడు. చిన్నవయసు నుంచే పాఠశాలపై మక్కువ ఉండటంతో పాటు.. వందశాతం హాజరు ఉండాలన్న ఆశయంతో స్కూలుకు వెళ్లిన గల్ఫ్ విద్యార్థి... ఐదేళ్లకు గాను ఐదు మెడల్స్, ఐదు సర్టిఫికెట్లు సంపాదించి ఏ విద్యార్థికీ సాధ్యం కాని ప్రత్యేకతను సాధించాడు. ఇప్పుడు తనకు వచ్చిన సర్టిఫికెట్లు, మెడల్సే తన కచ్చితత్వానికి నిదర్శనమని, ఇది ఏ ఇతర విద్యార్థులనూ కించపరిచే విషయం కాదని అతడు ఆనందంగా చెప్తున్నాడు. ఒక విద్యార్థి ప్రతిరోజూ పది నిమిషాలు స్కూలుకు ఆలస్యమైతే ఏడాదిలో 30 గంటల పాఠాలను కోల్పోతాడన్న విషయాన్ని చిన్నతనంలో ఎక్కడో చదివానని, అప్పట్నుంచీ తాను చదువులో ముందున్నా లేకున్నా స్కూలుకు మాత్రం ఆలస్యంగా వెళ్ళకూడదని నిశ్చయించుకున్నానని చెప్తున్నాడు. అనుకున్నది సాధించాలంటే ఎంతో కష్టపడాల్సి వచ్చిందని, అయితేనేం మెడల్స్ సాధించగలగడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని చెప్తున్నాడు. తన కష్టానికి ఈ మెడల్సే నిదర్శనమంటున్నాడు. ఐదు అంకె తన లక్కీ నెంబర్ అని చెప్తున్న సదరు విద్యార్థి, ఐదో తరగతి నుంచి ప్రారంభించిన తన దీక్షను విజయవంతంగా కొనసాగించి ఐదు మెడల్స్ సాధించగలగడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందంటున్నాడు. తన కష్టాన్ని, కచ్చితత్వాన్ని ఢిల్లీ ప్రైవేట్ స్కూల్ గుర్తించిందని, అదే తన ఆనందానికి ప్రధాన కారణమైందని చెబుతున్నాడు. -
గ్రేటర్లో 5 కొత్త మున్సిపాలిటీలు
పురపాలికలుగా జల్పల్లి, జిల్లేలగూడ, మీర్పేట్, బోడుప్పల్, ఫిర్జాదిగూడ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర శివార్లలో ఐదు కొత్త మున్సిపాలిటీలు ఆవిర్భవించాయి. రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్, ఘట్కేసర్ మండలాల పరిధిలోని 11 గ్రామ పంచాయతీలు విలీన ప్రక్రియ ద్వారా ఐదు కొత్త మున్సిపాలిటీలుగా రూపుదిద్దుకున్నాయి. సరూర్‌నగర్ మండలంలోని జిల్లేలగూడ, మీర్పేట్ గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీ హోదా లభించింది. ఇదే మండల పరిధిలోని మూడు గ్రామ పంచాయతీల విలీనంతో జల్పల్లి మున్సిపాలిటీ ఏర్పాటైంది. ఘట్కేసర్ మండల పరిధిలో నాలుగు గ్రామ పంచాయతీల విలీనంతో బోడుప్పల్, పీర్జాదిగూడ మున్సిపాలిటీలు ఏర్పాటయ్యాయి. ఈ 11 గ్రామ పంచాయతీల హోదాను రద్దు (డీనోటిఫై) చేసినట్లు ప్రకటిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేయగా వాటి విలీనంతో ఐదు కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేసినట్లు ప్రకటిస్తూ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఆ వెంటనే మరో ఉత్తర్వు జారీ చేసింది. కొత్తపేట్, పహాడీ షరీఫ్ గ్రామ పంచాయతీలతోపాటు బాలాపూర్ గ్రామ పంచాయతీలోని సర్వే నం. 142, 253ల విలీనంతో జల్పల్లి మున్సిపాలిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బోడుప్పల్, చెంగిచెర్ల గ్రామ పంచాయతీల విలీనంతో బోడుప్పల్ మున్సిపాలిటీ ఏర్పాటైంది. మీర్పేట్, జిల్లేలగూడ గ్రామ పంచాయతీల స్థాయిని పెంచి మున్సిపాలిటీ హోదా కల్పించింది. మేడిపల్లి, పర్వతపూర్ గ్రామ పంచాయతీల విలీనంతో ఫిర్జాదిగూడ మున్సిపాలిటీగా అవతరించింది. మున్సిపల్ ఎన్నికల నిబంధనల మేరకు కొత్త మున్సిపాలిటీలు ఏర్పడిన నాటి నుంచి రెండేళ్లలోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో జీహెచ్ఎంసీతో కలిపి మొత్తం 68 నగర, పురపాలక సంస్థలు, నగర పంచాయతీలు ఉండగా తాజాగా ఐదు కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుతో ఈ సంఖ్య 73కు పెరిగింది. -
బస్సు బోల్తా: ఐదుగురికి గాయాలు
దువ్వూరు: వైఎస్సార్ జిల్లా దువ్వూరు మండలం ఏకోపల్లె సమీపంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి స్వల్పగాయాలయ్యాయి. కర్నూలు డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు తిరుపతి నుంచి కర్నూలు వైపు వెళ్తుండగా.. ఉదయం ఐదుగంటల సమయంలో ఏకోపల్లె సమీపంలో అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులోని ఐదుగురు ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.